SNo
int64
0
21.6k
date
stringdate
2017-01-01 01:34:20
2017-12-31 23:58:37
heading
stringlengths
3
91
text
stringlengths
13
38.7k
label
stringclasses
5 values
20,807
01-01-2017 04:08:13
స్పోర్ట్స్ కేలెండర్ 2017
  బ్యాడ్మింటన్‌   హాకీ   ఫుట్‌బాల్‌   ఆర్చరీ   టేబుల్‌ టెన్నిస్‌     చెస్‌   రెజ్లింగ్‌   అథ్లెటిక్స్‌ నవంబర్‌ 5: న్యూయార్క్‌ సిటీ మారథాన్‌   వెయిట్‌ లిఫ్టింగ్‌   ఫార్ములా వన్‌   షూటింగ్‌
sports
1,577
12-10-2017 02:03:20
గోద్రెజ్‌ నుంచి ‘ఎలర్జీ ప్రొటెక్ట్‌’ వాషింగ్‌ మెషీన్‌
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గృహోపకరణాల రంగంలోని గోద్రెజ్‌ అప్లయెన్సెస్‌ గోద్రెజ్‌ అయాన్‌ శ్రేణిలో ‘ఎలర్జీ ప్రొటెక్ట్‌ ’ ఫీచర్‌ గల కొత్త వాషింగ్‌ మెషీన్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మనం నివశిస్తున్న కాలుష్యపూరిత వాతావరణంలో దుస్తులు దుమ్ముధూళి మాత్రమే కాకుండా వాటితో పాటు వచ్చే బాక్టీరియాను కూడా ఆకర్షిస్తున్నాయని, ఆ బాక్టీరియా పలు రకాల ఇన్ఫెక్షన్లు, ఎలర్జీలకు కారణం అవుతున్నదని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కమల్‌ నంది అన్నారు. ఇలాంటి బాక్టీరియాను తొలగించడం ద్వారా ఎలర్జీల నుంచి పిల్లలు, పెద్దలకు రక్షణ కల్పించడం ఈ ఫీచర్‌ లక్షణమని ఆయన తెలిపారు. ఏడు రకాల ఎలర్జీల నుంచి ఈ వాషింగ్‌ మెషీన్లు రక్షణ కల్పిస్తాయంటూ ఈ టెక్నాలజీని ఎలర్జీ యుకె సంస్థ సర్టిఫై చేసిందని ఆయన చెప్పారు. ఇవి పూర్తిగా ఫ్రంట్‌ లోడింగ్‌ ఆటోమేటిక్‌ వాషింగ్‌ మెషీన్లని, కస్టమర్లు వాషింగ్‌ అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకునేందుకు వాటిలో 15 రకాల వాషింగ్‌ ప్రోగ్రామ్‌లుంటాయని వాషింగ్‌ మెషీన్ల విభాగం హెడ్‌ రాకేశ్‌ సియాల్‌ తెలిపారు. ఎలర్జీ ప్రొటెక్ట్‌ను తొలిసారిగా ఈ వాషింగ్‌ మెషీన్లలో పొందుపరిచామని, అలాగే దుస్తులపై వాషింగ్‌ పౌడర్‌ నురగ మరకలు పూర్తిగా తొలగించడానికి మూడు రకాల స్టెయిన్‌ తొలగింపు సదుపాయం ఉంటుందని ఆయన చెప్పారు. 6 కిలోల సామర్థ్యం గల వాషింగ్‌ మెషీన్‌ ధర 27 వేల రూపాయలు కాగా 7 కిలోల సామర్థ్యం గల మెషీన్‌ ధర 34,500 రూపాయలని ఆయన ప్రకటించారు. అమ్మకాలపై జిఎస్‌టి ప్రభావంగత ఏడాది నవంబరులో ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు, ఈ ఏడాది జూలైలో ప్రవేశపెట్టిన జిఎ్‌సటి ప్రభావం వల్ల ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో అమ్మకాలు భారీగా తగ్గాయని కమల్‌ నంది తెలిపారు. గత ఏడాది పరిశ్రమ మొత్తం 15 శాతం వృద్ధిని సాధించగా ఈ ఏడాది ప్రథమార్ధంలో 7 నుంచి 8 శాతం వృద్ధిని మాత్రమే సాధించిందని ఆయన చెప్పారు.  అయితే రుతుపవనాలు సానుకూలంగా ఉండడంతో పాటు పైన పేర్కొన్న రెండు సంస్కరణల ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ద్వితీయార్ధంలో అమ్మకాలు పుంజుకుంటాయని భావిస్తున్నామని, ఏడాది మొత్తానికి వృద్ధిరేటు 10 నుంచి 12 శాతానికి చేరవచ్చునని ఆయన అంచనా వేశారు. గృహోపకరణాలను ప్రభుత్వం 28 శాతం జిఎ్‌సటి శ్లాబ్‌లో పెట్టిందని, ఎసి, ఫ్రిజ్‌ వంటివి ఇప్పుడు నిత్యావసరాలుగా మారిపోయినందు వల్ల వాటిని తక్కువ శ్లాబ్‌లో పెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలోని పన్నులతో పోల్చితే జిఎ్‌సటిలో వాటిపై సగటున 3.5 శాతం పన్ను భారం పడిందని ఆయన చెప్పారు. గృహోపకరణాలపై పన్ను రేటు తగ్గించాలంటూ తమ సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిందని, సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు.
business
2,782
16-05-2017 00:39:22
మార్కెట్లోకి డాక్టర్‌ రెడ్డీస్‌ హెపటైటిస్‌ సి ఔషధం
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ హెపటైటిస్‌ సి చికిత్సలో వినియోగించే జెనరిక్‌ ఔషధం సోఫోసుబువిర్‌ 40 ఎంజి, వెల్పాటస్విర్‌ 100 ఎంజి.. ఫిక్స్‌డ్‌ డోసేజ్‌ కాంబినేషన్‌ ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. రెసోఫ్‌ టోటల్‌ పేరుతో దేశీ మార్కెట్లో ఈ ఔషధాన్ని విక్రయించనున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ తెలిపింది. గిలీడ్‌ జెనరిక్‌ వెర్షన్‌ అయిన ఎప్‌క్లూజాకు ఈ ఔషధం సమానమైనదని పేర్కొంది. రెసోఫ్‌ టోటల్‌ 28 టాబ్లెట్లతో కూడిన బాటిల్‌తో లభ్యమవుతుందని తెలిపింది.
business
5,790
18-01-2017 09:53:57
దక్షిణాదిన నేను చేసిన పొరపాటు ఒక్కటే..!
 ‘పింక్‌’ సక్సెస్‌ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చినట్టుంది?  బాలీవుడ్‌లో త్వరగానే సెటిల్‌ అయినట్టున్నారు?  ఉత్తరాదిన మంచి గుర్తింపు వచ్చినా స్పీడు పెంచకపోవడానికి కారణం?  దక్షిణాదిన సినిమా చేయబోతున్నారట?  సినిమాల్లోకి ఇష్టపడి రాలేదట? నిజమేనా?  పెళ్ళి?  మీ ‘వెడ్డింగ్‌ ప్లానర్‌’ వ్యాపారం ఎలా ఉంది?
entertainment
13,771
03-08-2017 16:20:01
కేంద్రంతో రాష్ట్రం ఢీ
బెంగళూరు : ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. కర్ణాటక మంత్రి డీ కే శివకుమార్ ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ దాడుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. తమ రాష్ట్రంలో సీఆర్‌పీఎఫ్‌ దళాలను ఎందుకు వినియోగిస్తున్నారని ప్రశ్నించింది. ఈ విషయంపై తమకు ముందుగా ఎందుకు సమాచారం ఇవ్వలేదని నిలదీసింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి కేంద్ర ప్రభుత్వానికి ఈ మేరకు రెండు పేజీల లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం సంప్రదాయాలను తుంగలో తొక్కిందని ఈ లేఖలో ఆరోపించారు. ఈ చర్య ద్వారా తప్పుడు అభిప్రాయాలకు తావిచ్చినట్లయిందని పేర్కొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బుదవారం విలేకర్లతో మాట్లాడుతూ శివకుమార్ ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ దాడులను ఖండించారు. బీజేపీ వ్యతిరేక గళాలను అణచివేసేందుకే ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.
nation
980
22-03-2017 23:33:56
‘మేకిన్‌ ఇండియా’పాత ఆలోచనే
అహ్మదాబాద్‌: మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భారతలో తయారీ’ (మేకిన్‌ ఇండియా) కార్యక్రమాన్ని ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ సి రంగరాజన్‌ తేలిగ్గా తీసిపారేశారు. ఇది పాత ఆలోచనేనన్నారు. అయితే ఈ పథకం విజయం సరైన మౌలిక సదుపాయాలు, ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకోవడంపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. అహ్మదాబాద్‌ యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో రంగరాజన్‌ ఈ విషయాలు తెలిపారు.
business
5,171
11-09-2017 17:57:04
నాగార్జున 'అంతం' చిత్రానికి పాతికేళ్లు పూర్తి
నాగార్జున 'శివ'తో తానేమిటో రుజువు చేసుకున్న రామ్ గోపాల్ వర్మ, నాగ్‌తో తెరకెక్కించిన రెండో చిత్రం 'అంతం'. ఈ సినిమా నేటితో పాతికేళ్ళు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలను గుర్తు చేసుకుందాం. రామ్ గోపాల్ వర్మ తొలి చిత్రం 'శివ'తోనే తాండవం చేశాడు. తన తొలి హీరో నాగార్జునతో రాము తరువాత ఎలాంటి చిత్రం రూపొందిస్తాడోననే ఆసక్తి అందరిలోనే ఉండేది. 1989లో 'శివ' రాగా, 'అంతం' 1992 సెప్టెంబర్ 11న జనం ముందు నిలచింది. దాదాపు మూడేళ్ళ తరువాత నాగ్, వర్మ కాంబినేషన్‌లో వచ్చిన 'అంతం' చిత్రం తొలి రోజున థియేటర్లలో సందడే సందడి. అయితే ఈ చిత్ర కథ హిందీ సూపర్ హిట్ మూవీ 'హీరో' లాగే ఉంది. అదే చిత్రం రీమేక్ 'విక్రమ్'తోనే నాగార్జున హీరోగా పరిచయం కావడమూ జరిగింది. ఈ నేపథ్యంలో కథలో కొత్తదనం లేదని జనం తేల్చేశారు. అయితే ఇందులోని పాటలు మాత్రం జనాన్ని పరవశింపచేశాయి. 'అంతం' చిత్రంలో మొత్తం ఆరు పాటలున్నాయి. వాటిలో 'చలెక్కి ఉందనుకో...' పాటను మణిశర్మ కంపోజ్ చేయగా, 'గుండెల్లో దడ దడ...' పాటను కీరవాణి స్వరకల్పన చేశారు. మిగిలిన నాలుగు పాటలకు విఖ్యాత హిందీ సంగీతదర్శకుడు ఆర్.డి.బర్మన్ స్వరాలు అందించారు. అన్ని పాటలను సీతారామశాస్త్రి రాశారు. ఈ చిత్రానికి నేపథ్య సంగీతం మణిశర్మ సమకూర్చడం విశేషం. మణిశర్మకు టైటిల్ కార్డ్ పడ్డ తొలి చిత్రం కూడా ఇదే కావడం మరింత విశేషం. ఈ చిత్రంలో క్లబ్ సాంగ్ ఉన్నప్పటికీ, అందులో ఎక్కడా కురచదుస్తులు ఉపయోగించకుండా పాత పద్ధతుల్లోనే చీరకట్టులో సిల్క్ స్మిత అందాన్ని రాము తెరకెక్కించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఊర్మిళ నాయికగా నటించిన ఈ చిత్రంలో డానీ, సలీమ్ గౌస్, ఆకాశ్ ఖురానా, రాళ్లపల్లి, గోకిన రామారావు, డబ్బింగ్ జానకి తదితరులు నటించారు. ఈ సినిమాను హిందీలో నాగార్జునతోనే 'ద్రోహి'గా రూపొందించారు. ఈ సినిమా శ్రీలంకలోనూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ చిత్రానికి ప్రస్తుతం దర్శకునిగా ఉన్న తేజ సినిమాటోగ్రాఫర్, బోనీకపూర్ సమర్పణలో దృశ్య క్రియేషన్స్ పతాకంపై కె.ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంలోని పాటలు విశేషంగా ఆకట్టుకున్నా సినిమా అంతగా అలరించలేకపోయింది.
entertainment
8,009
18-04-2017 22:30:10
అమెరికా కష్టాలు...
శత్రుఘ్న రాయపాటి, జోసెలిన్, స్టెఫనీ, రెబెకా కీలక పాత్రధారులుగా నటిస్తున్న చిత్రం ‘గ్రీన్‌కార్డ్‌’. ‘లైఫ్‌ ఇన్ అమెరికా’ అన్నది ఉపశీర్షిక. రమ్స్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నాగ శ్రీనివాసరెడ్డి, నరసింహ, శ్రీనివాస్‌ గుప్త, మోహన్.ఆర్‌ నిర్మాతలు. దర్శకుడు రమ్స్‌ మాట్లాడుతూ ‘‘అమెరికాలో గ్యాస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న భారతీయ యువకుడిపై తుపాకీ గురిపెట్టిన ఫలితంగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో సాగే చిత్రమిది. మా వాళ్లు అమెరికాలో ఉన్నారని గొప్పగా చెప్పుకోవడమే కానీ అక్కడ ఉన్నవాళ్లంతా పూలపాన్పు మీద జీవించడంలేదు. ఎన్నో ఇబ్బందులకు గురవుతూ జీవితం కొనసాగిస్తున్నారు. వాటినే సినిమాగా తీశా. 90 శాతం అమెరికాలోనే చిత్రీకరించాం. పాటల్ని కూడా అక్కడే విడుదల చేస్తాం’’ అని అన్నారు.
entertainment
14,127
14-02-2017 01:34:43
కేన్సర్‌ ఔషధ నిరోధకతకు కారణం తెలిసింది!
వాషింగ్టన్‌, ఫిబ్రవరి 13: కేన్సర్‌ ఔషధ నిరోధకతకు గల ప్రధాన కారణాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. కణితిల్లో ఉండే వృత్తాకార డీఎన్‌ఏలే అందులోని కణాలు వాటి రూపాన్ని మార్చుకొవడానికి సహకరిస్తున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. దీంతో 17 రకాల కేన్సర్లకు మరింత సమర్థవంతమైన చికిత్సను కనుక్కొవడానికి అవకాశం కలుగుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భారత శాస్త్రవేత్త వినీత బాఫ్నాతో కూడిన యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా శాండిగో పరిశోధక బృందం కేన్సర్‌ కణితి వృద్ధి, దానిలో వచ్చే మార్పులపై పరిశోధనలు చేశారు.
nation
5,818
17-09-2017 22:53:48
ఎస్వీఆర్‌గా మోహన్‌బాబు!
సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్‌ అశ్విన్‌ రూపొందిస్తోన్న ‘మహానటి’ చిత్రంలో ఎస్వీ రంగారావుగా విలక్షణ నటుడు మోహన్‌బాబు కనిపించనున్నారు. టైటిల్‌ రోల్‌ను కీర్తి సురేశ్‌, జెమిని గణేశన్‌ పాత్రలో దుల్కర్‌ సల్మాన్‌ చేస్తున్న ఈ చిత్రంలో సమంత ఓ కీలక పాత్రను పోషిస్తోన్న విషయం తెలిసిందే. ప్రకాశ్‌రాజ్‌, ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్‌ షాలినీ పాండే కూడా తారాగణంలో ఉన్నారు. తాజాగా ఎస్వీఆర్‌ పాత్రను మోహన్‌బాబు పోషించనున్నట్లు నిర్మాతలు తెలిపారు. అక్టోబర్‌ లేదా నవంబర్‌లో ఆయన సెట్స్‌పై అడుగుపెట్టనున్నారు. ప్రతినాయకుడి పాత్రయినా, పౌరాణిక పాత్రయినా, సాత్విక పాత్రయినా, ఎలాంటి పాత్రయినా అతి సునాయాసంగా చేసే గొప్ప నటుడిగా పేరు పొందిన ఎస్వీఆర్‌గా మోహన్‌బాబు ఎంపికపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తప్ప మరో నటుడ్ని ఎస్వీఆర్‌గా ఊహించలేమనేది నిజం. తెరపై ‘విశ్వనట చక్రవర్తి’ పాత్రలో మోహన్‌బాబు అభినయం ఎలా ఉంటుందో చూడాల్సిందే! ప్రస్తుతం ‘మహానటి’ సినిమా షూటింగ్‌ పాలకొల్లులో జరుగుతోంది. సి. అశ్వినీదత్‌ సమర్పిస్తోన్న ‘మహానటి’ చిత్రాన్ని స్వప్న సినిమా పతాకంపై స్వప్నాదత్‌ నిర్మిస్తున్నారు.
entertainment
4,819
05-04-2017 12:47:22
జూనియర్‌ ఎన్టీయార్‌కు నత్తి?
 రవితేజ, రాజ్‌తరుణ్‌లు తమ రాబోయే సినిమాల్లో అంధులుగా కనిపించనున్నారు. అలాగే సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో రామ్‌చరణ్‌ కూడా శారీరక లోపం ఉన్న వ్యక్తిగా కనిపిస్తాడట. ఆ సినిమాలో చెర్రీ బధిరుడుగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. కాగా, ఇదే బాటలో యంగ్‌ టైగర్‌ ఎన్టీయార్‌ కూడా పయనిస్తున్నట్టు సమాచారం. బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ‘జై లవకుశ’ సినిమాలో ఎన్టీయార్‌ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ పాత్ర నత్తితో ఇబ్బందిపడే రోల్‌ అని సమాచారం. ఇది వీల్‌ చైర్‌కే పరిమితమైన నెగిటివ్‌ రోల్‌ అని తెలుస్తోంది. ఏదేమైనా హీరోలు తమ ఇమేజ్‌ను విడిచిపెట్టి తెరపై విభిన్నంగా కనిపించడానికి సిద్ధపడడం మెచ్చుకోదగినదే.
entertainment
11,795
15-09-2017 02:35:00
హైకోర్టులో కొత్త జడ్జిల ప్రమాణం 21న?
న్యూఢిల్లీ, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి హైకోర్టుకు నియమితులు కానున్న ఆరుగురు కొత్త న్యాయమూర్తులు ఈనెల 21న ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయి. కొత్త జడ్జిల నియామకానికి సంబంధించిన ఫైలు రాష్ట్రపతి కోవింద్‌ కార్యాలయానికి గురువారం చేరింది. ప్రస్తుతం కాన్పూర్‌ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ఢిల్లీకి వచ్చిన వెంటనే ఈ ఫైలుపై సంతకం చేసే అవకాశాలున్నాయని, రెండు, మూడు రోజుల్లోనే కొత్త న్యాయమూర్తుల నియామక ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశాలున్నాయని హోంశాఖ అధికారులు తెలిపారు. 3 నెలల క్రితం సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల జాబితాకు బుధవారం ప్రధాని మోదీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.  న్యాయవాదులు కొంగర విజయలక్ష్మి, సోమయాజులు డీవీఎస్‌, అమర్‌నాథ్‌గౌడ్‌ టి, అభినంద్‌కుమార్‌, పి.కేశవరావు, ఎం.గంగారావులను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు ప్రధాని మోదీ బుధవారం సంతకం చేసిన వెంటనే ఫైలును పీఎంవో న్యాయశాఖకు పంపింది. న్యాయశాఖ నుంచి హోంశాఖకు గురువారం చేరింది. ఈ ఫైలు వచ్చిన వెంటనే హోంశాఖ అధికారులు రాష్ట్రపతి కార్యాలయానికి పంపినట్లు సమాచారం. రాష్ట్రపతి కోవింద్‌ రాజముద్ర పడిన వెంటనే నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని హోంశాఖ అధికారులు తెలిపారు. ఈనెల 21న ఈ ఆరుగురు కొత్త న్యాయమూర్తుల చేత ప్రమాణ స్వీకారం చేయించడానికి అందుబాటులో ఉండాలని కేంద్ర న్యాయశాఖ అధికారులు హైకోర్టు ఏసీజే రమేశ్‌ రంగనాథన్‌ను కోరినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
nation
14,249
28-10-2017 04:57:53
ప్రపంచ శాంతికి భారత్‌ తోడ్పాటు
న్యూఢిల్లీ, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ఐక్యరాజ్య సమితి నిర్ణయించిన బహుపాక్షిక విధానానికి భారతదేశం కట్టుబడి ఉందని, దేశాల మధ్య తలెత్తుతున్న సమస్యలు, శాంతిని నెలకొల్పడం వంటివి నిజమైన ధ్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగమైన ‘ఐక్యరాజ్య సమితి నిరాయుధీకరణ కమిషన్‌’ ఆధ్వర్యంలో నిరాయుధీకరణ యంత్రాంగం అనే అంశంపై జరిగిన సదస్సులో రామ్మోహన్‌నాయుడు ప్రసంగించారు. అంతర్జాతీయ శాంతికి, రక్షణకు భారతదేశం పాటుపడుతోందన్నారు.
nation
7,297
26-10-2017 07:05:27
అమితాబ్ బచ్చన్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు
ముంబై : ముంబై నగరంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు, బిగ్ బి అమితాబ్ బచ్చన్ అత్యంత విలాసవంతంగా నిర్మించిన స్వాంక్ లగ్జరీ బంగళా అక్రమ నిర్మాణమని...దాన్ని ఎందుకు కూల్చకూడదో తెలపాలని కోరుతూ సాక్షాత్తూ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. మాజీ ఎంపీ కూడా అయిన అమితాబ్ బచ్చన్ గోరేగామ్ ఈస్ట్‌లో ఫిలిం సిటీకి సమీపంలో నిర్మించిన బంగళాను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని తాము అనుమతి ఇచ్చిన ప్రకారం కాకుండా అడ్డగోలుగా నిర్మించారని మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు తమ తనిఖీల్లో తేల్చారు. బేస్‌మెంట్ పనులు సరిగా చేయలేదని, లిఫ్టు కూడా ఇంకా ఏర్పాటు చేయలేదని ప్రహరీ గోడ నిర్మాణం కూడా ఆమోదిత ప్లాన్‌కు విరుద్దంగా ఉందని అధికారులు బిగ్ బికి జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు. అమితాబ్‌తోపాటు అక్రమంగా బంగళాలు నిర్మించుకున్న బాలీవుడ్ నిర్మాతలు రాజ్ కుమార్ హీరానీ, పంకజ్ బాలాజీ, సంజయ్ వ్యాస్, హరీష్ ఖండేల్ వాల్, హరీష్ జగిత్యాని, ఒబేరాయ్ రియల్టీలకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
entertainment
20,544
27-10-2017 01:51:10
ఒకే వేదికపై బ్యాడ్మింటన్‌ దిగ్గజాలు!
ముంబై: నాటి మేటి బ్యాడ్మింటన్‌ దిగ్గజాలు తమ ఆటతో అభిమానులను అలరించనున్నారు. వచ్చే నెలలో జరుగనున్న లెజెండ్స్‌ విజన్‌ వరల్డ్‌ టూర్‌ టోర్నీలో ఒలింపిక్‌ పతక విజేతలు, ప్రపంచ చాంపియన్లు పలువురు కనులపండువ చేయనున్నారు. బ్యాడ్మింటన్‌ అభిమానులకు ఆరాధ్యులైన లిన్‌ డాన్‌, లీ చోంగ్‌ వీ, పీటర్‌ గేడ్‌, తౌఫిక్‌ హిదాయత్‌, లీ యాంగ్‌ డేలతో పాటు భారత దిగ్గజాలు ప్రకాష్‌ పడుకోన్‌, పుల్లెల గోపీచంద్‌కూడా ఈ టోర్నీలో పాల్గొననున్నారు. రెండేళ్లక్రితం ఆరంభించిన ఈ టోర్నీని నవంబర్‌ 4న స్థానిక నేషనల్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా స్టేడియంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బ్యాడ్మింటన్‌కు ప్రాచుర్యం కల్పించేందుకు ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. ప్రపంచ వేదికపై భారత యువ క్రీడాకారులు రాణిస్తున్న నేపథ్యంలో లెజెండ్స్‌ టోర్నీని ఇక్కడ నిర్వహించనుండడం వారికి ఎంతో ఉత్తేజాన్నిస్తుందని కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అన్నాడు. దిగ్గజాల ఆటను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం భారతీయ యువ క్రీడాకారులకు ఈ టోర్నీద్వారా లభించనుండడం అదృష్టమన్నారు. భారత టాప్‌ ఆటగాళ్లు కిడాంబి శ్రీకాంత్‌, సింధు, సైనా నెహ్వాల్‌ కూడా ఈ టోర్నీలో పాల్గొననున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
sports
12,581
23-10-2017 14:31:28
గుజరాత్‌లో కాంగ్రెస్‌కు మరో పార్టీ అండదండలు
లక్నో : గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో 5 స్థానాల నుంచి పోటీ చేయాలని సమాజ్ వాదీ పార్టీ (ఎస్‌పీ) నిర్ణయించింది. మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చేందుకు ముందుకొచ్చింది. ఎస్‌‌పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సోమవారం మాట్లాడుతూ తమకు సంస్థాగత బలం ఉన్నచోట మాత్రమే పోటీ చేస్తామన్నారు. బీజేపీ వ్యతిరేక ఓట్లలో చీలిక రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా జరిగే పోరాటాన్ని బలహీనపరచడం తమకు ఇష్టం లేదన్నారు. ఎన్నికలు జరిగే 182 స్థానాల్లో తాము 5 స్థానాల నుంచి పోటీ చేస్తామని, మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్‌కు మద్దతిస్తామని స్పష్టం చేశారు.  ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ కూటమి పోటీ చేసి, పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
nation
9,462
12-07-2017 00:01:26
దర్శకుడి స్వార్థం
అశోక్‌, ఈషా జంటగా నటిస్తున్న చిత్రం ‘దర్శకుడు’. హరిప్రసాద్‌ జక్కా దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకంపై బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్‌, థామ్‌సరెడ్డి ఆదూరి, రవిచంద్రలతో కలిసి సుకుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాయికార్తీక్‌ సంగీతంలో ‘సండే టు సాటర్డే’ అంటూ సాగే పాటను ఇటీవల సమంత విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘ప్రేమకు, తపనకు మధ్య నలిగిపోయే ఓ దర్శకుడి కథ ఇది. స్వార్థపరుడైన దర్శకుడు ప్రేమలోపడితే ఏం జరుగుతుందనేది సినిమాలో ఆసక్తికరంగా చూపించాం. రకుల్‌ విడుదల చేసిన పాటకు చక్కని స్పందన బావుంది. తాజాగా విడుదల చేసిన పాట కూడా సంగీత ప్రియులను అలరిస్తుందనే నమ్మకం ఉంది. 15న ప్రముఖ కథానాయకుడి చేతులమీదుగా పాటల్ని విడుదల చేసి, ఆగస్ట్‌ 4న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని తెలిపారు.
entertainment
6,696
15-11-2017 22:40:55
అందుకే ఆ సినిమాలు వదిలేశా!
దర్శకుల లైంగికపరమైన కోరికలు తీర్చడం ఇష్టం లేకే పది సినిమాలు వదిలేశానని ప్రియాంకా చోప్రా చెప్పారు. కెరీర్‌ బిగినింగ్‌లో ఇటువంటి వేధింపులు తనకూ తప్పలేదని ఆమె వివరించారు. ఓ ఆంగ్ల పత్రికకు ప్రియాంక తల్లి మధు చోప్రా ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనికి సంబంధించి చాలా వివరాలు వెల్లడించారు. ‘తన 17 ఏళ్ల వయసులో ప్రియాంక చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచీ మూడేళ్ల క్రితం వరకూ ఆమెని కంటికి రెప్పలాగా కాపాడా. ఓ పెద్దమనిషి ఆమె దగ్గరకు వచ్చి ‘ మీ అమ్మ కాసేపు బయట కూర్చుంటే నీకు కథ వినిపిస్తా’ అన్నాడు. ‘ మా అమ్మ వినలేకపోయే కథతో నేను సినిమా ఎలా చేస్తాను’ అని ప్రియాంక సున్నితంగా చెప్పేసింది. దాని వల్ల ఓ పెద్ద సినిమాలో నటించే అవకాశం కోల్పోయింది. అదొక్కటే కాదు.. అలా వాళ్ల కోరికలు తీర్చడానికి ఇష్టపడకపోవడంతో పది సినిమాలు కోల్పోయాం. అయితే ఇలాంటి లైంగిక వేధింపులు హాలీవుడ్‌లో మాత్రం లేవు’ అని చెప్పింది.
entertainment
18,289
24-03-2017 01:06:35
‘అమ్మ’ను చంపింది నువ్వే
చెన్నై, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): అక్రమాస్తుల కేసులో దోషిగా బెంగళూరు పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ లేఖలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. జైలులో తొలుత అన్నాడీఎంకే కార్యకర్తలు రాసే లేఖలను టైంపాస్‌ కోసం చదివిన ఆమె ఇప్పుడు వాటివంక చూడాలంటేనే భయపడుతున్నారు. ‘అమ్మ’ మరణానికి శశికళే కారణం అంటూ ఆమె పేరిట జైలుకు లేఖలు వెల్లువెత్తుతుండటమే ఇందుకు కారణం. తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. అందుకు శశికళే బాధ్యురాలంటూ లేఖల్లో ప్రజలు ఆమెపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ.. శాపనార్థాలు పెడుతున్నారు. మొదట్లో ఇలాంటి లేఖల్లో కొన్నింటిని చదివిన శశికళ.. ఇప్పుడు లేఖలంటేనే విరక్తి చెందారని తెలిసింది. ఆమెతో కలిసి శిక్ష అనుభవిస్తున్న మరదలు ఇళవరసే ఆయా లేఖలను చదివి, వాటిల్లో శశికళ మనసు నొప్పించని వాటిని మాత్రం అందిస్తున్నట్లు సమాచా రం. కాగా పరప్పన జైలులో శశికళ కూర్చొని వున్న దృశ్యం అంటూ ఇప్పుడు ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది.అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళ తొలగింపు?అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన వీకే శశికళను తొలగించాలని కేంద్ర ఎన్నికల కమిషన నిర్ణయించినట్లు సమాచారం. ఆమె నియామకంపై అన్నాడీఎంకే తిరుగుబాటు వర్గం ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం ఈసీ పరిశీలనలో ఉండగానే ఆర్‌కే నగర్‌ ఉప ఎన్నిక రావడంతో ఆ ఎన్నికలో శశికళ వర్గ అభ్యర్థికి గానీ, ఓపీఎస్‌ వర్గ అభ్యర్థికి గానీ అన్నాడీఎంకే చిహ్నం ఇవ్వకుండా నిలిపేశారు. రెండు వర్గాలకు వేర్వేరు చిహ్నాలు అందజేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు శశికళను అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా తొలగించాలని ఈసీ నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.
nation
21,063
08-12-2017 10:33:19
ఐపీఎల్-11: ముంబయి ఇండియన్స్‌కి షాక్
ముంబయి: 2017 ఐపీఎల్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌కి 2018 ఐపీఎల్ ముందు పెద్ద షాక్ తగిలింది. గత తొమ్మిది సీజన్‌ల నుంచి ముంబయికి ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తొమ్మిది సంవత్సరాలు ముంబయి ఇండియన్స్‌తో కలిసి ప్రయాణించడం చాలా అద్భుతంగా ఉందని జాంటి పేర్కొన్నారు. ఈ తొమ్మిదేళ్లలో సచిన్, రోహిత్, రిక్కి పాంటింగ్, అనిల్ కుంబ్లే, మహేలా జయవర్ధనే వంటి వారితో కలిసి పని చేయడంలో ఎన్నో అనుభూతులు మిగిల్చిందని అన్నారు. ఇన్ని సంవత్సరాలు నాకు మద్దతుగా నిలిచిన ముంబయి ఇండియన్స్ జట్టు సభ్యులు, ఉద్యోగులు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. అయితే జాంటి స్థానంలో ఫీల్డింగ్ కోచ్‌‌గా న్యూజిలాండ్ క్రికెటర్ జేమ్స్ ప్యామెంట్‌ను తీసుకుంటున్నట్లు ముంబయి జట్టు ప్రకటించింది. మరికొన్ని నెలల్లో ఐపీఎల్-2018 జరుగనున్న నేపథ్యంలో జాంటి వంటి దిగ్గజ క్రికెటర్ ఫీల్డింగ్ కోచ్ పదవి నుంచి వైదొలగడం ముంబయిపై గట్టి ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇండియన్ టాప్ క్రికెటర్లపై ఆసక్తికరమైన క్విజ్
sports
14,482
13-05-2017 02:38:38
గిన్నిస్‌కెక్కిన ‘ఆది యోగి’ విగ్రహం
చెన్నై, మే 12 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఈషా ఫౌండేషన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఆది యోగి’ (శివుడి) విగ్రహం గిన్నిస్‌ రికార్డులో స్థానం సంపాదించింది. గుండెల నుంచి పై భాగం మాత్రమే ఉండేలా నెలకొల్పిన విగ్రహాల్లో ప్రపంచంలోనే ఇది అతిపెద్దదని గిన్నిస్‌ వెల్లడించింది. ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌ సారథ్యంలోని ఈషా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో దీనిని ప్రతిష్టించారు. గత ఫిబ్రవరి 24న ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ విగ్రహం 112.4 అడుగుల ఎత్తు, 96.58 అడుగుల వెడల్పు, 147 అడుగుల పొడవు కలిగి ఉంది. మార్చి 11న దీనిని గిన్నిస్‌బుక్‌ రికార్డు అధికారులు పరిశీలించారు.
nation
15,759
18-10-2017 01:49:27
ఏక్‌దిన్‌కా సీఎం వద్దని!
శశికళ వ్యవహారంపై విద్యాసాగర్‌రావు పుస్తకం ఆమెపై కోర్టులో కేసులున్నాయి శిక్ష పడితే ఎలాగని ఆలోచించా అందుకే ఆచితూచి అడుగేశా జయమృతి నుంచి శశి జైలుదాకా పరిణామాలపై విద్యాసాగర్‌రావు ‘దోజ్‌ ఈవెంట్‌ఫుల్‌ డేస్‌’లో వెల్లడిచెన్నై, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకేలో సంక్షోభం నెలకొన్నప్పుడు ఆ పార్టీ శాసనసభాపక్ష నాయకురాలిగా ఎంపికైన శశికళకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టే విషయంలో ఆచితూచి వ్యవహరించానని మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్రానికి ఏడాదిపాటు ఇన్‌చార్జ్‌ గవర్నర్‌గా పనిచేసిన విద్యాసాగర్‌రావు, తన అనుభవాలను ‘దోజ్‌ ఈవెంట్‌ఫుల్‌ డేస్‌’ పేరుతో ముద్రించిన పుస్తకంలో పొందుపరిచారు. 12 అధ్యాయాలు కలిగిన ఆ పుస్తకంలో మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి, జల్లికట్టు ఉద్యమం, సీఎం పదవికి ఒ.పన్నీర్‌సెల్వం రాజీనామా, ఎడప్పాడికి సీఎం పదవి అప్పగించడం, డీఎంకే ఆందోళనలు వంటి ఘటనల ప్రస్తానవ ఉంది.  జయ మృతి తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన సంక్షోభ పరిస్థితులలో న్యాయనిపుణులతో సలహాసంప్రదింపులు జరిపి, ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకున్నానని విద్యాసాగర్‌రావు తెలిపారు. తొలి మూడు అధ్యాయాలలో జయ గుణగణాలను, అపోలో ఆసుపత్రిలో మృతి చెందటం వంటి వివరాలను పొందుపరిచారు. జయకు అందిస్తున్న చికిత్సలను ప్రజలకు తెలియపరిచేలా తాను ఆదేశాలివ్వటం, ఆమె మృతి చెందినప్పుడు తమిళ ప్రజలు పాటించిన సంయమనాన్ని ప్రస్తావించారు. నాలుగో అధ్యాయంలో నగరాన్ని అతలాకుతలం చేసిన వర్దా తుఫాను గురించి, నివారణ చర్యల గురించి వివరించారు. ఐదో అధ్యాయంలో జల్లికట్టు కోసం మెరీనాతీరంలో జరిగిన మహోద్యమాన్ని విపులంగా రాశారు. ఇక అరో అధ్యాయంలో ముఖ్యమంత్రిగా పన్నీర్‌సెల్వం రాజీనామా చేసిన తరువాత ఏర్పడిన సంక్లిష్ట పరిస్థితులను తేటతెల్లంగా వివరించారు.  గత ఏడాది డిసెంబర్‌ 31న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకోవడం, ఫిబ్రవరి 5న ఆమె సీఎం పదవి కోసం ప్రయత్నాలు ప్రారంభించడంపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘‘ఆ సమయంలో నేను ఆచితూచి వ్యవహరించాను. అన్నాడీఎంకే శాసన సభాపక్షనాయకురాలిగా ఎన్నికైన శశికళను సీఎంగా పదవీ ప్రమాణం చేయించడానికి తొందరపడలేదు. శశికళను సీఎంగా ప్రమాణం చేయడానికి ఆహ్వానించకపోవడంతో ఆమె నాకు వ్యతిరేకంగా ప్రకటన చేశారు. అయినా నేను ఓర్పు వహించాను. శశికళ చేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయిస్తే ఎదురయ్యే సమస్యలను గురించి న్యాయనిపుణులతో రోజుల తరబడి సంప్రదింపులు జరిపాను. అక్రమార్జన కేసులో ఆమెకు శిక్షను ఖరారు చేసే అవకాశం ఉందని తెలియడంతో సుప్రీంకోర్టు తీర్పు వెలువడేంతవరకు వేచి ఉండాలని నిర్ణయించుకున్నాను. నా ఆలోచన రాష్ట్రానికి మంచే చేసింది. శశికళ చేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించి ఉంటే 2,3 రోజులకే ఆమె పదవికి రాజీనామా చేయాల్సి వచ్చేది. అది రాష్ట్ర చరిత్రలో ఒక మచ్చలా మిగిలిపోయి ఉండేది’’ అని విద్యాసాగర్‌రావు వివరించారు.  లేఖ ప్రస్తావన లేదుఅన్నాడీఎంకే అసమ్మతి వర్గం నేత దినకరన్‌ తరఫు శాసనసభ్యులు ముఖ్యమంత్రి ఎడప్పాడికి మద్దతు ఉపసంహరించుకుంటూ తనకు లేఖలు సమర్పించిన ఉదంతాన్ని విద్యాసాగర్‌రావు తన పుస్తకంలో ప్రస్తావించలేదు. సోమవారం సాయంత్రం చెన్నైలో ఈ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.
nation
1,387
25-07-2017 01:27:35
అంబుజా సిమెంట్స్‌ లాభంలో 12 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: జూన్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో అంబుజా సిమెంట్స్‌ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 11.85 శాతం మేర పెరిగి 718.24 కోట్ల రూపాయలకు చేరుకుంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 642.11 కోట్ల రూపాయలుగా ఉంది. సిమెంట్‌ అమ్మకాలు జోరుగా పెరగడం వల్లనే లాభాలు వృద్ధి చెందినట్టు కంపెనీ పేర్కొంది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు 15.24 శాతం పెరిగి 6,117.36 కోట్ల రూపాయల నుంచి 7,050.11 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. మొత్తం వ్యయాలు 5,430 కోట్ల రూపాయల నుంచి 6,259.83 కోట్ల రూపాయలకు చేరాయి. ఈ కంపెనీ జనవరి-డిసెంబర్‌ను ఆర్థిక సంవత్సరంగా పాటిస్తోంది.
business
20,619
04-02-2017 00:57:12
అంధుల క్రికెట్‌లో భారత్ గెలుపు
ముంబై: మహ్మద్‌ ఫర్హాన్‌ (59), జాఫర్‌ ఇక్బా ల్‌ (54) రాణించడంతో.. అంధుల టీ20 ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికాపై భారత 9 వికెట్లతో గెలిచింది. తొలుత సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 157 రన్స్‌ చేసింది. అనంతరం భారత్ 13.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
sports
5,991
27-11-2017 23:36:15
ఆ ఫ్యామిలీలో మరో మెగాస్టార్‌
‘‘చిరంజీవిలో ఉన్న గ్రేస్‌ తేజ్‌లో ఉంది. యాక్టింగ్‌, ఫైట్స్‌, డాన్స్‌, డైలాగ్‌ డిక్షన్‌ అన్నింటిలో పర్ఫెక్ట్‌గా ఉన్నాడు. అతన్ని మెగా ఫ్యామిలీలో మరో మెగాస్టార్‌ అనుకోవచ్చు’’ అని కె. రాఘవేంద్రరావు అన్నారు. సాయిధరమ్‌తేజ్‌, మెహరీన్‌ జంటగా నటించిన ‘జవాన్‌’ చిత్రం డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకొస్తుంది. బీవీఎస్‌ రవి దర్శకత్వంలో కృష్ణ నిర్మించారు. దిల్‌ రాజు సమర్పకుడు. సోమవారం ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో ప్రీ రిలీజ్‌ వేడుక జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాఘవేంద్రరావు చిత్ర యూనిట్‌కి జ్ఞాపికలను అందచేశారు. ఆయన మాట్లాడుతూ ‘‘ఇంటికొక యోగ్యుడు ఉంటే ఇంటితోపాటు సమాజం, దేశం కూడా బాగుపడుతుందనే సందేశామిచ్చే సినిమా అని ట్రైలర్‌ చూశాక తెలిసింది’’ అని అన్నారు. సాయిధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ ‘‘దిల్‌ రాజు నన్ను ఇంటి సభ్యుడిలా చూస్తారు. ఆయనతో ఈ అనుబంధం ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటున్నా’’ అని తెలిపారు. ‘‘వరుస విజయాలు అందుకున్న ఏడాది ఇది. నాకు, మా సంస్థకు గ్రేట్‌ ఎచీవ్‌మెంట్‌ ఇయర్‌ ఇది. అనుకోకుండా ఈ సినిమాలో భాగమయ్యా. తేజ్‌, రవి మీద నమ్మకంతో ఈ సినిమా చేశా. మంచి సందేశాత్మక చిత్రాన్ని చేశానని సాయి గర్వంగా చెప్పుకోవచ్చు’’ అని దిల్‌ రాజు చెప్పారు.
entertainment
723
23-07-2017 00:04:49
జిఎస్‌టి కౌన్సిల్‌..
ఈ మధ్యకాలంలో జిఎస్‌టి, జిఎస్‌టి అమలుకు సంబంధించి ఎలాంటి వార్త వెలువడినా అందులో తరచుగా వినిపించే పేరు జిఎస్‌టి కౌన్సిల్‌. అసలు జిఎస్‌టి కౌన్సిల్‌ అంటే ఏమిటి? జిఎస్‌టి అమలుకు సంబంధించి జిఎస్‌టి కౌన్సిల్‌ నిర్వహించే పాత్ర ఏమిటో తెలుసుకుందాం. జిఎస్‌టి లాంటి అతి పెద్ద పన్ను వ్యవస్థ అమలులోకి రావటానికి అనేక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి తగ్గట్టుగా పలు విధి విధానాలను రూపొందించాల్సి ఉంటుంది. అలాగని తీసుకున్న నిర్ణయాలు కేవలం ఏదో ఒక్క ప్రాంతానికో, రాష్ట్రానికో ప్రయోజనం చేకూర్చేటట్లు ఉండకూడదు. అలాగే కేంద్ర ప్రభుత్వాన్నో లేదా ఏదేనీ ఒక రాష్ట్రాన్నో దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక నిర్ణయాలు తీసుకోకూడదు కాబట్టి మన సమాఖ్య విధానాన్ని దృష్టిలో పెట్టుకుని జిఎస్‌టి కౌన్సిల్‌కు రూపకల్పన చేశారు. ఈ కౌన్సిల్‌లో కేంద్రంతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలకు చోటు కల్పించటం ద్వారా ఏ ఒక్కరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జిఎ్‌సటిలో ఏదేనీ వస్తువుకు లేదా సేవకు మినహాయింపు ఇవ్వాలన్నా లేదా ఏదేనీ వస్తువు లేదా సేవను జిఎ్‌సటి పరిధిలోకి తీసుకురావాలన్నా జిఎ్‌సటి కౌన్సిల్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే టాక్స్‌ రేటు, సెస్‌లు ఇతర నిబంధనలు అన్నీ జిఎ్‌సటి కౌన్సిల్‌ తీసుకునే నిర్ణయాన్ని బట్టే ఉంటాయి. మరి ఇంత ముఖ్యపాత్ర పోషించే జిఎ్‌సటి కౌన్సిల్‌లో సభ్యులు ఎవరు ఉంటారు. కేంద్ర ఆర్థిక మంత్రి చైర్మన్‌గా ఉండే జిఎస్‌టి కౌన్సిల్‌లో ఆర్థిక లేదా రెవెన్యూ శాఖకు సంబంధించిన కేంద్ర సహాయ మంత్రి, రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక మంత్రి లేదా ఆ రాష్ట్రం ప్రతిపాదించిన వ్యక్తి కౌన్సిల్‌లో సభ్యులుగా ఉంటారు. దీనికి సంబంధించిన కనీసం కోరం మొత్తం సభ్యుల సంఖ్యలో సగం కాగా కౌన్సిల్‌ తీసుకునే ఏ నిర్ణయమైనా అమల్లోకి రావాలంటే కనీసం నాలుగింట మూడొంతుల మెజారిటీ ఉండాలి. అలాగే కేంద్ర ప్రభుత్వానికి 1/3 వంతు, రాష్ట్ర ప్రభుత్వాలకు 2/3 వంతు చొప్పున వెయిటేజీ ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కౌన్సిల్‌ తీసుకునే ముఖ్య నిర్ణయాలు.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏయే టాక్స్‌లు, సెస్‌లు.. జిఎ్‌సటిలో విలీనం కావాలిఏయే సర్వీసులకు, వస్తువులకు ఎంతెంత జిఎ్‌సటి రేట్లు ఉండాలిజిఎస్‌టి పరిధిలోకి తీసుకురావాల్సిన, వెలుపల ఉంచాల్సిన వస్తువులు, సేవలురిజిస్ట్రేషన్‌కు ఇచ్చే మినహాయింపులకు సంబంధించిన టర్నోవర్‌ పరిమితి నిర్ణయించటంపెట్రోలియం ఉత్పత్తులను జిఎ్‌సటి పరిధిలోకి ఎప్పుడు తీసుకురావాలిటైమ్‌ ఆఫ్‌ సప్లయ్‌, ప్లేస్‌ ఆఫ్‌ సప్లయ్‌కి సంబంధించిన నిర్ణయాలుఇంకా జిఎ్‌సటి పరిపాలన, నిర్వహణకు సంబంధించి అన్ని రకాల నిర్ణయాలు తీసుకోవటంతో పాటు పలు రకాల సమీక్షలు నిర్వహించటం జిఎస్‌టి కౌన్సిల్‌ తీసుకుంటుంది. ఒక విధంగా చెప్పాలంటే జిఎస్‌టి అమలుకు సంబంధించి జిఎ్‌సటి కౌన్సిల్‌ గుండెకాయ వంటిది. జిఎస్‌టి కౌన్సిల్‌ తీసుకునే నిర్ణయం అంతిమం.
business
12,615
31-05-2017 18:47:32
ముగిసిన మోదీ స్పెయిన్ పర్యటన.. రష్యాకు ప్రయాణం
మాడ్రిడ్: భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పెయిన్ పర్యటన ముగిసింది. మాడ్రిడ్ ఎయిర్ పోర్టులో ఆ దేశ పాలకులు, అధికారులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. నాలుగు దేశాల పర్యటనలో భాగంగా రెండు రోజుల యూరప్ టూర్ ముగియడంతో మోదీ రష్యా ప్రయాణమయ్యారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగే ప్రపంచ సదస్సులో ఆయన పాల్గొంటారు.
nation
4,434
11-10-2017 00:52:22
ఆంధ్రకు సౌదీ సౌభాగ్యం
విశాఖలో ఆయిల్‌ రిఫైనరీలను నెలకొల్పడానికి సౌదీ అరంకో సంస్థ ఆసక్తి చూపుతున్నది. అరంకో పెట్టుబడులకోసం ఒడిశా పోటీపడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ అధికార యంత్రాంగం మరింత ప్రత్యేక శ్రద్ధ చూపవలసిన అవసరం లేదా? ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వస్తూత్పత్తి రంగంపై ఆధారపడి వుండగా అరబ్‌ దేశాల ఆర్థికంలో చమురు ముఖ్యభూమిక వహిస్తోంది. చమురు ఉత్పత్తి, ఎగుమతిలో గల్ఫ్ దేశాలు ప్రత్యేకించి సౌదీ అరేబియా, యూఏఈలోని అబుధాబి కీలకపాత్ర వహిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు రంగంలో సంభవించే ప్రతి పరిణామంలో ఈ రెండు దేశాల ప్రమేయం తప్పక ఉంటుంది. అంతర్జాతీయ విపణిలో మారుతోన్న పరిస్థితులకు అనుగుణంగా సౌదీ, అబుధాబీలు కూడా తమ వాణిజ్య వ్యూహాలను మార్చుకొంటున్నాయి. ప్రపంచ ఆర్థిక శక్తులుగా ఆవిర్భవిస్తోన్న సహచర ఆసియా దేశాలపై ఆసక్తి చూపుతున్న ఈ చమురు దిగ్గజాలు ముఖ్యంగా భారత్, అందునా తూర్పు తీరస్థ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. బంగాళాఖాతం తీరాన వుండడం వల్లే ఆంధ్రరాష్ట్రం ఈ ప్రాధాన్యం సంతరించుకున్నది. తమకు అనువైన, చేరువలో వున్న అరేబియా సముద్రతీరప్రాంతాల్లో కాకుండా బంగాళాఖాతం తీరంలో తమ వాణిజ్య కార్యకలాపాలను ముమ్మరం చేసుకోవాలని ఈ గల్ఫ్‌ దేశాలు ఆరాటపడుతున్నాయి. తీరాంధ్రంలో పెట్రోలియం ఉత్పత్తుల వ్యూహాత్మక నిల్వల సామర్థ్యంతో ఆగ్నేయఆసియా దేశాల మార్కెట్లను కైవసం చేసుకోవాలని సౌదీ అరేబియా సంకల్పించుకొంది. ఈ సంకల్ప సాధనకు అవసరమైన ప్రణాళికలను ఇప్పటికే రూపొందించుకొంది. తూర్పు తీరస్థ రాష్ట్రాల్లో చమురు రంగ అభివృద్ధికై మోదీ స్వయంగా సౌదీ, ఆబుధాబిలను ఆహ్వనించడం జరిగింది. మోదీ అభీష్టం మేరకు ఈ గల్ఫ్‌ దేశాల పెట్టుబడులను ప్రోత్సహించడానికి కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచ చమురువ్యవస్థను శాసించే (సౌదీ అరేబియాకు చెందిన) సౌదీ అరంకో సంస్ధ కూడా భారతదేశంలో పెట్టుబడులు పెట్టే విషయమై అమిత శ్రద్ధాసక్తులు చూపుతోంది. భారత్‌లో తమ వాణిజ్య విస్తరణ అవకాశాలను అనేక కోణాల నుంచి పరిశీలిస్తుంది. సంప్రదాయకంగా తమకు అనువైన అరేబియా సముద్ర తీర దేశాల్లో కాకుండా బంగాళా ఖాతం తీరానున్న భారత రాష్ట్రాలలో ప్రస్తుతమున్న భారతీయ రిఫైనరీలకు తోడుగా అదనపు రిఫైనరీలను నెలకొల్పాలని అరంకో యోచిస్తున్నది. భారతీయ కంపెనీల భాగస్వామ్యంతో వాటిని ఏర్పాటుచేయడం ద్వారా భారత్‌లో తమ వ్యాపార ప్రయోజనాలను సుదీర్ఘకాలం పదిలం చేసుకోవాలని అరంకో ఆలోచిస్తున్నది. వ్యాపార ప్రయోజనాలకు అగ్రప్రాధాన్యమివ్వడంతో పాటు వ్యూహాత్మక చమురు నిల్వలకేంద్రాలను నెలకొల్పుకోవడం ద్వారా ఆగ్నేయఆసియా దేశాల చమురు మార్కెట్లపై పట్టు సాధించాలని సౌదీ అరంకో ఆశిస్తోంది. సరిగ్గా ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో సౌదీ అరంకో అధిపతి అమీన్ నాసర్‌తో సమావేశమయ్యారు. సాధారణంగా సౌదీ అరంకో ఉన్నతాధికారులు వ్యాపార ప్రతిపాదనలతో ఎవరితో చర్చలు జరపరు. అయితే ఈ ఏడాది అనూహ్యంగా చంద్రబాబు నాయుడుతో మాత్రం సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టడానికి తాము సిద్ధంగా వున్నామని సౌదీ ప్రతినిధులు ప్రతిపాదించారు. అవసరమైన స్థలం, నీటి వనరులు, ఇంకా ఇతర హంగులు అన్నీ సమకూర్చుతానని సౌదీ అరంకో అధికారులకు చంద్రబాబు హామీనిచ్చారు. విశాఖపట్టణంతో పాటుగా కాకినాడలో కూడా పెట్రో రసాయనాల పరిశ్రమలను, సంబంధిత విశ్వవిద్యాలయాన్నీ నెలకొల్పడానికి సహకరించవల్సిందిగా కూడా అరంకో అధికారులను చంద్రబాబు కోరారు. బంగాళాఖాతం తీరంలోని ఒడిశాలో బలపడాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ ఆ రాష్టంలో కొన్ని కేంద్ర ప్రాజెక్టులను నిర్మించడం ద్వారా ఉత్కళ ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఆ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పెట్రోలియం మంత్రి ప్రధాన్ ఇప్పటికే ఉర్జ గంగా అనే గ్యాస్ సరఫరా ప్రాజెక్టు ద్వారా ప్రజలకు దగ్గరకావాలని ప్రయత్నిస్తుండగా గల్ఫ్ దేశాలు నెలకొల్పే రిఫైనరీలు కూడా ఒడిశాలో ఏర్పాటయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇటీవల మనదేశంలో జరిగిన కీలక అంతర్జాతీయ పెట్రోలియం సదస్సులో పాల్గొనడానికి సౌదీ అరంకోతో పాటు, ప్రధాన చమురు ఉత్పాదక దేశాల అత్యున్నత స్థాయి అధికార బృందాలు న్యూఢిల్లీకి వచ్చిన సందర్భంగా ప్రధాని మోదీతో సుదీర్ఘ చర్చలు జరిపారు. న్యూఢిల్లీలో వారి వద్ద తమ రాష్ట్ర ప్రతిపాదనల ప్రస్తావన తీసుకొచ్చి, మరింత పురోగతి సాధించే దిశగా ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగం తగు శ్రద్ధ చూపలేదని సమాచారం. న్యూఢిల్లీలో సౌదీ అరంకో సంస్థ అధిపతిని కనీసం మర్యాదపూర్వకంగా కలిసి తమ రాష్ట్ర ప్రతిపాదనల భవిష్యత్తు గురించి తెలుసుకోవడంలో కూడా ఆంధ్రప్రదేశ్ అధికారవర్గాలు శ్రద్ధ తీసుకోలేదని తెలుస్తోంది. తీరాంధ్రలో చమురు రంగ పురోభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవల్సిన అవసరం ఎంతైనా వున్నది. సౌదీ అరంకో అధికారులతో చర్చించి, ఈ విషయమై పురోగతి సాధిస్తే నవ్యాంధ్రప్రదేశ్‌లో మరో నవీన ఆర్ధికాభివృద్ధి బాట మొదలవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.మొహమ్మద్ ఇర్ఫాన్ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధిప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వస్తూత్పత్తి రంగంపై ఆధారపడి వుండగా అరబ్‌ దేశాల ఆర్థికంలో చమురు ముఖ్యభూమిక వహిస్తోంది. చమురు ఉత్పత్తి, ఎగుమతిలో గల్ఫ్ దేశాలు ప్రత్యేకించి సౌదీ అరేబియా, యూఏఈలోని అబుధాబి కీలకపాత్ర వహిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు రంగంలో సంభవించే ప్రతి పరిణామంలో ఈ రెండు దేశాల ప్రమేయం తప్పక ఉంటుంది. అంతర్జాతీయ విపణిలో మారుతోన్న పరిస్థితులకు అనుగుణంగా సౌదీ, అబుధాబీలు కూడా తమ వాణిజ్య వ్యూహాలను మార్చుకొంటున్నాయి. ప్రపంచ ఆర్థిక శక్తులుగా ఆవిర్భవిస్తోన్న సహచర ఆసియా దేశాలపై ఆసక్తి చూపుతున్న ఈ చమురు దిగ్గజాలు ముఖ్యంగా భారత్, అందునా తూర్పు తీరస్థ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. బంగాళాఖాతం తీరాన వుండడం వల్లే ఆంధ్రరాష్ట్రం ఈ ప్రాధాన్యం సంతరించుకున్నది. తమకు అనువైన, చేరువలో వున్న అరేబియా సముద్రతీరప్రాంతాల్లో కాకుండా బంగాళాఖాతం తీరంలో తమ వాణిజ్య కార్యకలాపాలను ముమ్మరం చేసుకోవాలని ఈ గల్ఫ్‌ దేశాలు ఆరాటపడుతున్నాయి. తీరాంధ్రంలో పెట్రోలియం ఉత్పత్తుల వ్యూహాత్మక నిల్వల సామర్థ్యంతో ఆగ్నేయఆసియా దేశాల మార్కెట్లను కైవసం చేసుకోవాలని సౌదీ అరేబియా సంకల్పించుకొంది. ఈ సంకల్ప సాధనకు అవసరమైన ప్రణాళికలను ఇప్పటికే రూపొందించుకొంది. తూర్పు తీరస్థ రాష్ట్రాల్లో చమురు రంగ అభివృద్ధికై మోదీ స్వయంగా సౌదీ, ఆబుధాబిలను ఆహ్వనించడం జరిగింది. మోదీ అభీష్టం మేరకు ఈ గల్ఫ్‌ దేశాల పెట్టుబడులను ప్రోత్సహించడానికి కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచ చమురువ్యవస్థను శాసించే (సౌదీ అరేబియాకు చెందిన) సౌదీ అరంకో సంస్ధ కూడా భారతదేశంలో పెట్టుబడులు పెట్టే విషయమై అమిత శ్రద్ధాసక్తులు చూపుతోంది. భారత్‌లో తమ వాణిజ్య విస్తరణ అవకాశాలను అనేక కోణాల నుంచి పరిశీలిస్తుంది. సంప్రదాయకంగా తమకు అనువైన అరేబియా సముద్ర తీర దేశాల్లో కాకుండా బంగాళా ఖాతం తీరానున్న భారత రాష్ట్రాలలో ప్రస్తుతమున్న భారతీయ రిఫైనరీలకు తోడుగా అదనపు రిఫైనరీలను నెలకొల్పాలని అరంకో యోచిస్తున్నది. భారతీయ కంపెనీల భాగస్వామ్యంతో వాటిని ఏర్పాటుచేయడం ద్వారా భారత్‌లో తమ వ్యాపార ప్రయోజనాలను సుదీర్ఘకాలం పదిలం చేసుకోవాలని అరంకో ఆలోచిస్తున్నది. వ్యాపార ప్రయోజనాలకు అగ్రప్రాధాన్యమివ్వడంతో పాటు వ్యూహాత్మక చమురు నిల్వలకేంద్రాలను నెలకొల్పుకోవడం ద్వారా ఆగ్నేయఆసియా దేశాల చమురు మార్కెట్లపై పట్టు సాధించాలని సౌదీ అరంకో ఆశిస్తోంది. సరిగ్గా ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో సౌదీ అరంకో అధిపతి అమీన్ నాసర్‌తో సమావేశమయ్యారు. సాధారణంగా సౌదీ అరంకో ఉన్నతాధికారులు వ్యాపార ప్రతిపాదనలతో ఎవరితో చర్చలు జరపరు. అయితే ఈ ఏడాది అనూహ్యంగా చంద్రబాబు నాయుడుతో మాత్రం సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టడానికి తాము సిద్ధంగా వున్నామని సౌదీ ప్రతినిధులు ప్రతిపాదించారు. అవసరమైన స్థలం, నీటి వనరులు, ఇంకా ఇతర హంగులు అన్నీ సమకూర్చుతానని సౌదీ అరంకో అధికారులకు చంద్రబాబు హామీనిచ్చారు. విశాఖపట్టణంతో పాటుగా కాకినాడలో కూడా పెట్రో రసాయనాల పరిశ్రమలను, సంబంధిత విశ్వవిద్యాలయాన్నీ నెలకొల్పడానికి సహకరించవల్సిందిగా కూడా అరంకో అధికారులను చంద్రబాబు కోరారు. బంగాళాఖాతం తీరంలోని ఒడిశాలో బలపడాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ ఆ రాష్టంలో కొన్ని కేంద్ర ప్రాజెక్టులను నిర్మించడం ద్వారా ఉత్కళ ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఆ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పెట్రోలియం మంత్రి ప్రధాన్ ఇప్పటికే ఉర్జ గంగా అనే గ్యాస్ సరఫరా ప్రాజెక్టు ద్వారా ప్రజలకు దగ్గరకావాలని ప్రయత్నిస్తుండగా గల్ఫ్ దేశాలు నెలకొల్పే రిఫైనరీలు కూడా ఒడిశాలో ఏర్పాటయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇటీవల మనదేశంలో జరిగిన కీలక అంతర్జాతీయ పెట్రోలియం సదస్సులో పాల్గొనడానికి సౌదీ అరంకోతో పాటు, ప్రధాన చమురు ఉత్పాదక దేశాల అత్యున్నత స్థాయి అధికార బృందాలు న్యూఢిల్లీకి వచ్చిన సందర్భంగా ప్రధాని మోదీతో సుదీర్ఘ చర్చలు జరిపారు. న్యూఢిల్లీలో వారి వద్ద తమ రాష్ట్ర ప్రతిపాదనల ప్రస్తావన తీసుకొచ్చి, మరింత పురోగతి సాధించే దిశగా ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగం తగు శ్రద్ధ చూపలేదని సమాచారం. న్యూఢిల్లీలో సౌదీ అరంకో సంస్థ అధిపతిని కనీసం మర్యాదపూర్వకంగా కలిసి తమ రాష్ట్ర ప్రతిపాదనల భవిష్యత్తు గురించి తెలుసుకోవడంలో కూడా ఆంధ్రప్రదేశ్ అధికారవర్గాలు శ్రద్ధ తీసుకోలేదని తెలుస్తోంది. తీరాంధ్రలో చమురు రంగ పురోభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవల్సిన అవసరం ఎంతైనా వున్నది. సౌదీ అరంకో అధికారులతో చర్చించి, ఈ విషయమై పురోగతి సాధిస్తే నవ్యాంధ్రప్రదేశ్‌లో మరో నవీన ఆర్ధికాభివృద్ధి బాట మొదలవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.మొహమ్మద్ ఇర్ఫాన్ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి
editorial
19,200
28-04-2017 03:16:19
రాష్ర్టాల అభివృద్ధికి చేయూత
పనితీరు బాగుంటే మరింత అండ 2022 నాటికి ‘అందరికీ ఇళ్లు’: వెంకయ్య న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సాయం చేస్తోందని, పనితీరు బాగున్న రాష్ర్టాలకు మరింతగా అండగా ఉంటామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. గురువారం ఆయన స్మార్ట్‌ సిటీలు, పట్టణీకరణ అనే అంశంపై నీతి ఆయోగ్‌, ఆసే్ట్రలియాకు చెందిన న్యూ సౌత వేల్స్‌ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. 2022నాటికి దేశంలో పేదవారందరికీ ఇల్లు నిర్మించాలన్నదే మోదీ ప్రభుత్వ లక్ష్యమని, ఇది నినాదం మాత్రమే కాదని, వాస్తవరూపం దాల్చుతోందన్నారు. రెండేళ్లలో పట్టణ పేదలకు 18 లక్షల ఇళ్లు మంజూరుచేశామని, రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ర్టాలకు కేంద్రం సాయం చేస్తుందని, అభివృద్ధి కోసం రాష్ర్టాలు ఎంత వేగవంతంగా స్పందిస్తాయో అంతకన్నా వేగంగా వాటికి సాయం చేసేందుకు తాము ముందుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి అజెండా దిశను మార్చేందుకు ఎన్నికుట్రలు చేసినా పట్టించుకోబోమన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నామని, స్థానిక పరిపాలనా సంస్థలు పట్టణ ప్రణాళికలు రూపొందిస్తున్నాయని, స్మార్ట్‌ సిటీల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన, సుపరిపాలన సాధ్యమవుతోందన్నారు. స్మార్ట్‌ సిటీల ఎంపిక భేష్‌: పనగారియా ఎలాంటి వివాదాలు లేకుండా స్మార్ట్‌ సిటీల అభివృద్ధి కోసం 100 పట్టణాలను ఎంపిక చేయడం చాలా మంచి పరిణామమని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ అరవింద్‌ పనగారియా ప్రశంసించారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ.. మురికివాడలు లేని పట్టణాన్ని తయారుచేయడమే స్మార్ట్‌ సిటీల ప్రధానోద్దేశమని తెలిపారు. మంచినీరు, నాణ్యత గల విద్యుత, అందుబాటు ధరలకు ఇళ్లు వంటివి ఈ పథకం ద్వారా కల్పిస్తున్నామని చెప్పారు.న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సాయం చేస్తోందని, పనితీరు బాగున్న రాష్ర్టాలకు మరింతగా అండగా ఉంటామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. గురువారం ఆయన స్మార్ట్‌ సిటీలు, పట్టణీకరణ అనే అంశంపై నీతి ఆయోగ్‌, ఆసే్ట్రలియాకు చెందిన న్యూ సౌత వేల్స్‌ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. 2022నాటికి దేశంలో పేదవారందరికీ ఇల్లు నిర్మించాలన్నదే మోదీ ప్రభుత్వ లక్ష్యమని, ఇది నినాదం మాత్రమే కాదని, వాస్తవరూపం దాల్చుతోందన్నారు. రెండేళ్లలో పట్టణ పేదలకు 18 లక్షల ఇళ్లు మంజూరుచేశామని, రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ర్టాలకు కేంద్రం సాయం చేస్తుందని, అభివృద్ధి కోసం రాష్ర్టాలు ఎంత వేగవంతంగా స్పందిస్తాయో అంతకన్నా వేగంగా వాటికి సాయం చేసేందుకు తాము ముందుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి అజెండా దిశను మార్చేందుకు ఎన్నికుట్రలు చేసినా పట్టించుకోబోమన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నామని, స్థానిక పరిపాలనా సంస్థలు పట్టణ ప్రణాళికలు రూపొందిస్తున్నాయని, స్మార్ట్‌ సిటీల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన, సుపరిపాలన సాధ్యమవుతోందన్నారు.
nation
5,004
30-01-2017 12:52:27
హీరోయిన్ బోల్డ్ సీన్స్ వదిలేసి హీరో సీన్స్‌కు అభ్యంతరం చెప్పిన సెన్సార్!
సూపర్ హాట్ కంటెంట్‌తో కుర్రకారులో ఆసక్తి రేకెత్తిస్తోన్న ఆ మూవీకి సర్టిఫికేట్ ఇవ్వడానికే సెన్సార్ బోర్డ్‌కు ముచ్చెమటలు పట్టేశాయట. ఇంతకూ అంతగా ఆ సినిమాలో ఏముందంటారు? విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగూన్' ట్రైలర్ విడుదలైన దగ్గర నుంచే బీ-టౌన్‌లో ఈ మూవీ హాట్ టాపిక్‌గా మారింది. కంగన సూపర్ బోల్డ్ అవతారంతో పాటూ పలు హాట్ సీన్స్ జనాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కాబట్టి, సహజంగానే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్‌తో తిప్పలు తప్పవు అనడంలో సందేహమేలేదు. 'రంగూన్' మూవీలో బోల్డ్ సీన్స్‌కు కొదవ లేకపోవడంతో... ఆ సన్నివేశాలకు కత్తెర్లు పడటం ఖాయమని భావించారు జనాలు. కానీ, కంగన అందాల ప్రదర్శనకు ఎలాంటి అభ్యంతరం చెప్పని బోర్డ్ సభ్యులు... సినిమాలో హీరోలుగా నటించిన సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్ సన్నివేశాలకు మాత్రం కత్తెర్లు వేయాల్సిందిగా సూచించారట. ఈ మధ్యకాలంలో శృంగార సన్నివేశాలకు పెద్దగా అభ్యంతరాలు చెప్పని సెన్సార్ బోర్డ్... మద్యపానం, ధూమపానానికి సంబంధించిన విషయాల్లో మాత్రం నిక్కచ్చిగానే వ్యవహరిస్తోంది. 'రంగూన్' లో ఇలాంటి సన్నివేశాలను తొలిగించాల్సిందిగా లేదా వాటిపై హెచ్చరిక మార్క్‌ను వేయాల్సిందిగా ఆదేశించారు. పొగతాగడం పూర్వకాలంలో ఫ్యాషన్ అయినప్పటికీ... ఇప్పుడు చెడు వ్యసనాలతో సమానం అని బోర్డ్ అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఇక ఈ మేరకు చిత్రంలో మార్పులు చేర్పులు చేసి సినిమాను విడుదల చేయాలని దర్శకుడు భావిస్తున్నాడు. బోల్డ్ సీన్స్ కంటే పొగతాగే దృశ్యాలపైనే సెన్సార్ చర్య తీసుకుంటోందన్న మాట. మునుముందు ఇలాంటి విచిత్రాలు ఎన్ని చూడాలో..
entertainment
9,756
29-11-2017 22:39:13
గోవాలో సూర్య
అల్లు అర్జున్‌ గోవా వెళుతున్నారు. పది రోజుల పాటు అక్కడే ఉంటారు. అయితే ఇది పర్సనల్‌ ట్రిప్‌ కాదండీ.. షూటింగ్‌ నిమిత్తమే. రచయిత వక్కంతం వంశీని దర్శకునిగా పరిచయం చేస్తూ నాగబాబు సమర్పణలో లగడపాటి శిరీషా శ్రీధర్‌ నిర్మిస్తున్న ‘నా పేరు సూర్య’ చిత్రం డిసెంబర్‌ ఒకటి నుంచి పది రోజుల పాటు గోవాలో జరుగుతుంది. ఇటీవల హైదరాబాద్‌లో యాక్షన్‌ పార్ట్‌, కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. గోవాలో సన్నివేశాలు సహా ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌ చిత్రీకరిస్తారు. ఆ తర్వాత చెన్నై, నార్త్‌ ఇండియాలో జరిగే రెండు షెడ్యూల్స్‌తో చిత్రం టాకీ పార్ట్‌ పూర్తవుతుంది. పాటల్ని విదేశాల్లో చిత్రీకరిస్తారు. ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్న అల్లు అర్జున్‌ పాత్రరీత్యా కొత్తగా కనిపించడం కోసం అమెరికాన్‌ ట్రైనర్స్‌ దగ్గర ప్రత్యక శిక్షణ తీసుకొన్నారు. యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, శరత్‌కుమార్‌ మరో రెండు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్‌ సంగీత దర్శకద్వయం విశాల్‌-శేఖర్‌ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న విడుదలయ్యే ఈ చిత్రానికి బన్నీ వాసు సహ నిర్మాత.
entertainment
276
27-08-2017 23:14:06
గ్రహగతులివే..
తులలోని విశాఖ పాదం 3 నుంచి ధనుస్సులోని పూర్వాషాఢ పాదం 2 మధ్యలో చంద్ర సంచారంసింహంలోని మఖ పాదం 4 నుంచి పుబ్బ పాదం 1 మధ్యలో రవి సంచారంసింహంలోని మఖ పాదం 2,3 మధ్యలో వక్రగతిలో బుధ సంచారంకర్కాటకంలోని పుష్యమి పాదం 2,3 మధ్యలోశుక్ర సంచారంకర్కాటకంలోని మఖ పాదం 1లో నీచస్థితిలో కుజ సంచారంవృశ్చికంలోని జ్యేష్ఠ పాదం 4లో మీన నవాంశలో వక్రగతిలో శని సంచారంకన్యలోని చిత్త పాదం 2లో కన్య వర్గోత్తమలో బృహస్పతి సంచారంకర్కాటకంలో రాహువు, మకరంలో కేతువు మీన, కన్య నవాంశల్లో సంచారం
business
19,183
18-04-2017 00:40:38
లౌడ్‌ స్పీకర్లలో ప్రార్థనలు దాదాగిరీ చేయడమే
మసీదులు, ఆలయాలు, గురుద్వారాల్లో లౌడ్‌ స్పీకర్లనుపయోగించి మత ప్రబోధాలు చేయడం దాదాగిరీ చేయడం వంటిదే. నేను ముస్లింను కాను. కానీ ప్రతిరోజూ ఉదయం అజా(ప్రార్థనకోసం పిలుపు)తో లేవాల్సి వస్తోంది. ఇస్లాం పుట్టినప్పుడు విద్యుత లేదు. మరి ఇప్పుడు పద్ధతి ఎందుకు వచ్చింది. ఏ ప్రార్థనా స్థలాలనుంచైనా లౌడ్‌ స్పీకర్ల ద్వారా ప్రార్థనలు చేసి మతం అంటే నమ్మకం లేనివారిని నిద్రలేపడం ఎంతవరకు సమంజసం. - ప్రముఖ బాలీవుడ్‌ గాయకుడు సోను నిగమ్‌.
nation
12,095
01-12-2017 01:25:38
ఏకే ఆంటోనీకి మెదడులో రక్తస్రావం..
న్యూఢిల్లీ, నవంబరు 30: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ(76) బుధవారం మధ్యాహ్నం అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లో అకస్మాత్తుగా కిందపడిపోవడంతో ఆయన్ను వెంటనే రామ్‌మనోహర్‌ లోహియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. ఆయనకు మెదడులో స్వల్పంగా రక్తస్రావమైనట్లు గుర్తించారు. శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు.
nation
16,249
04-09-2017 01:50:58
జైట్లీ వచ్చాకే బాధ్యతలు
నిర్మలా సీతారామన్‌ రక్షణ శాఖ బాధ్యతలు చేపట్టడానికి రెండు రోజులు ఆగక తప్పదు. ఎందుకంటే.. ముందుగా నిర్ణయించిన ప్రకారం రక్షణ శాఖకు సంబంధించి ద్వైపాక్షిక చర్చలకు అరుణ్‌ జైట్లీ ఆదివారం జపాన్‌ వెళ్లారు. జైట్లీ తిరిగి వచ్చాక రెండు మూడు రోజుల్లో నిర్మలా సీతారామన్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు.
nation
20,830
03-10-2017 02:07:06
సౌతాఫ్రికా ఘన విజయం
తొలి టెస్ట్‌లో బంగ్లా చిత్తు 1-0తో సిరీస్‌లో సఫారీల ఆధిక్యంపోచెఫ్‌స్ట్రోమ్‌ (దక్షిణాఫ్రికా): సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా 333 పరుగులతో భారీ విజయం సాధించింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 424 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో.. చివరి రోజైన సోమవారం బంగ్లాదేశ్‌ 90 పరుగులకే కుప్పకూలింది. దీంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో దక్షిణా ఫ్రికా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. లెఫ్టామ్‌ స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ (4/25), రబాడ (3/33) దెబ్బకు.. ఓవర్‌నైట్‌ స్కోరు 49/3తో ఐదో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన బంగ్లా తొలి సెషన్‌లో గంట వ్యవధిలోనే మరో 41 పరుగులు జోడించి చివరి 7 వికెట్లు కోల్పోయింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 496/3 (డిక్లేర్డ్‌), బంగ్లా 320 రన్స్‌ చేశాయి. రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 247/6 (డిక్లేర్డ్‌) స్కోరు చేసింది. ఇక ఇరు జట్ల మధ్య ఈ నెల 6న ఆఖరి, రెండో టెస్ట్‌ మొదలు కానుంది.
sports
2,949
06-04-2017 00:03:00
మహీంద్రా నుంచి చిన్న ట్రాక్టర్‌ ‘జివో’
ధర రూ.3.09 లక్షలు న్యూఢిల్లీ : మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) ఫోర్‌ వీల్‌ డ్రైవ్‌ కలిగిన చిన్న ట్రాక్టర్‌ ‘జివో’ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర 3.09 లక్షల రూపాయల నుంచి 4.05 లక్షల రూపాయల (ఎక్స్‌షోరూమ్‌, మహారాష్ట్ర) వరకు ఉంది. ఈ ట్రాక్టర్‌ 24 హార్స్‌ పవర్‌ (హెచ్‌పి)ను కలిగి ఉంది. హార్టికల్చర్‌, రో క్రాప్‌ఫార్మింగ్‌ విభాగం జోరుగా వృద్ధి చెందుతోందని, ఈ నేపథ్యంలో ఈ విభాగంలోకి ప్రవేశించినట్టు కంపెనీ తెలిపింది. ఈ విభాగ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జివోను అభివృద్ధి చేసినట్టు కంపెనీ పేర్కొంది. ఈ నెల 25వ తేదీ నుంచి మహారాష్ట్ర, గుజరాతలో ఈ ట్రాక్టర్‌ అమ్మకాలను మహీంద్రా ప్రారంభించనుంది. ఆ తర్వాత కర్ణాటక, మధ్యప్రదేశ్‌ మార్కెట్లలో అందుబాటులోకి తీసుకురానుంది. ఇన్నోవేషన్‌, టెక్నాలజీ ద్వారా సాగు ముఖచిత్రాన్నే మార్చివేయడంపై దృష్టిసారించామని ఎం అండ్‌ ఎం మేనేజింగ్‌ డైరెక్టర్‌ పవన్‌ గోయెంకా తెలిపారు. ఈ దిశగానే జివోను తెచ్చామన్నారు. జివో ప్లాట్‌ఫామ్‌పై 20 హెచ్‌పి టూవీల్‌ డ్రైవ్‌ ట్రాక్టర్‌ను కూడా తీసుకురావాలని మహీంద్రా యోచిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
business
17,564
21-07-2017 03:15:20
మాయావతి రాజీనామా ఆమోదం
లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీకి సై!న్యూఢిల్లీ, జూలై 20 (ఆంధ్రజ్యోతి): బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి (61) రాజ్యసభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను రాజ్యసభ చైర్మన్‌ హమీద్‌ అన్సారీ గురువారం ఆమోదించారు. యూపీలో దళితులపై దాడుల విషయమై తనను రాజ్యసభలో మాట్లాడనివ్వలేదని ఆరోపిస్తూ.. రాజ్యసభకు రాజీనామా చేస్తానని ఆమె మంగళవారం సభలోనే ప్రకటించి.. ఆ సాయంత్రమే రాజీనామా లేఖను సమర్పించారు. అయితే అది మూడు పేజీల లేఖ. తానెందుకు రాజీనామా చేస్తున్నానో అందులో వివరించారు. కానీ ఏకవాక్యంలో బేషరతుగా రాజీనామా చేస్తున్నట్లు మాత్రమే పత్రం ఇవ్వాలి. దీంతో సరైన ఫార్మాట్‌లో లేదని ఆమోదించడానికి చైర్మన్‌ నిరాకరించారు. బుధవారం ఆమె స్వయంగా ఆయన్ను కలిసి రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. సరైన ఫార్మాట్‌లో సమర్పిస్తే పరిశీలిస్తానని చెప్పారు. దాంతో మరోసారి తన చేతితో ఏకవాక్యం రాసి లేఖ సమర్పించారు. దానిని చైర్మన్‌ ఆమోదించారు. మరోవైపు.. ఆమె రాజ్యసభ సభ్యత్వం వచ్చే ఏడాది ఏప్రిల్‌తో ముగియనుంది. ఎంపీలుగా యోగి, కేశవ ప్రసాద్‌ మౌర్య రాజీనామాలతో ఖాళీ అయ్యే స్థానాల్లో ఉప ఎన్నికలో పోటీ చేసి సత్తా చాటాలని ఆమె భావిస్తున్నట్లు తెలిసింది. ఇంకోవైపు.. మాయావతి సరేనంటే బిహార్‌ నుంచి రాజ్యసభకు పంపిస్తామని ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రకటించారు.
nation
13,648
14-12-2017 02:21:59
ఆధార్‌ అనుసంధానం గడువు పెంపు
న్యూఢిల్లీ, డిసెంబరు 13: బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం గడువును పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆధార్‌ అనుసంధా నం గడువు ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో మరో మూడు నెలలు పొడిగింపు ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది. రూ.50 వేలకు పైగా లావాదేవీలు జరిపే కొత్త,పాత బ్యాంకు ఖాతాలన్నింటికీ ఆధార్‌ నంబరును 2018 మార్చి 31లోపు అనుసంధానం చేసుకోవాలని తాజా ఆదేశాల్లో పేర్కొంది. అయితే, కొత్తగా బ్యాంకు ఖాతాలను తెరిచే వారు మాత్రం ఆ తేదీ నుంచి ఆరు నెలల్లోపు లేదా మార్చి 31వ తేదీలోపు ఏది ఎక్కువ టైం అయితే ఆ లోపు ఆధార్‌ను ఆనుసంధానం చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకోసం మనీలాండరింగ్‌ నిరోధక చట్టానికి సవరణ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ చట్టంలో ఆధార్‌, పాన్‌ నంబర్లను డిసెంబరు 31, 2017 లోపు బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేయాలన్న నిబంధనను సవరించారు. దాని స్థానంలో ఆధార్‌ నంబరుతో పాటు, పాన్‌ లేదా ఫామ్‌ 60లో ఒకదాన్ని కేంద్రం ప్రకటించే తేదీలోపు బ్యాంకుల్లో అందజేయాల్సి ఉంటుందంటూ కొత్త నిబంధనను తీసుకొచ్చారు.
nation
11,505
02-10-2017 01:21:33
ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
తమిళనాడుకు బన్వరీలాల్‌, బిహార్‌కు సత్యపాల్‌మాలిక్‌అండమాన్‌కు కొత్త లెఫ్టినెంట్‌ గవర్నర్‌న్యూఢిల్లీ, అక్టోబరు1(ఆంధ్రజ్యోతి): దేశంలోని 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉత్తర్వులు జారీచేశారు. తమిళనాడు గవర్నర్‌గా బన్వరీలాల్‌ పురోహిత్‌ని నియమించారు. రాజకీయ అస్థిరత్వం ఉన్న ఆ రాష్ట్రానికి ఇప్పటి వరకు మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు అదనపు బాధ్యతలు నిర్వహించారు.  పురోహిత్‌ గతంలో మేఘాలయ, అసోం రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు. మరోవైపు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన తర్వాత ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బిహార్‌ గవర్నర్‌ పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానంలో ఖాళీ ఏర్పడింది. దీంతో బిహార్‌ గవర్నర్‌గా సత్యపాల్‌ మాలిక్‌ని నియమించారు. అండమాన్‌ నికోబార్‌ దీవులకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రొ. జగ్దీష్ ముఖీని అసోం గవర్నర్‌గా నియమించారు. అండమాన్‌ నికోబార్‌కు ఆయన స్థానంలో రిటైర్‌ అడ్మిరల్‌ దేవేంద్రకుమార్‌ జోషిని నియమించారు. మేఘాలయ గవర్నర్‌గా గంగా ప్రసాద్‌, అరుణాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా బీడీ మిశ్రాను నియమించారు.
nation
6,173
03-08-2017 00:12:03
సెట్స్‌పై నా పేరు సూర్య
అల్లు అర్జున్‌ కథానాయకుడిగా రూపొందుతోన్న ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘కిక్‌’, ‘టెంపర్‌’, ‘రేసుగుర్రం’ వంటి హిట్‌ సినిమాల కథకుడు వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్‌ నిర్మిస్తున్నారు. నాగబాబు సమర్పిస్తుండగా, బన్నీ వాసు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అను ఇమ్యాన్యుయేల్‌ నాయిక. సీనియర్‌ అర్జున్‌ కీలక పాత్రలో, శరత్‌కుమార్‌ విలన్‌ పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్‌లో పేరు పొందిన సంగీత దర్శక ద్వయం విశాల్‌-శేఖర్‌ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. 2018 ఏప్రిల్‌ 27న చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత లగడపాటి శ్రీధర్‌ తెలిపారు. ‘‘వరుస బ్లాక్‌బస్టర్స్‌ అందుకొని టాప్‌ ఫామ్‌లో ఉన్న అల్లు అర్జున్‌ మా బేనర్‌లో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. బన్ని ఎనర్జీకి తగ్గట్లుగా చేసిన ఈ కథలో కమర్షియల్‌ అంశాలన్నీ ఉంటాయి. భారతదేశం గర్వించదగ్గ నటీనటులు, టెక్నీషియన్ల బృందంతో గ్రాండియర్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం’’ అని ఆయన చెప్పారు. రామ్‌-లక్ష్మణ్‌ ఫైట్‌ మాస్టర్లుగా పనిచేస్తున్న ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, ఛాయాగ్రహణం: రాజీవ్‌ రవి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రాజీవన్‌.
entertainment
14,182
24-10-2017 10:11:31
విమానం కుక్కను ఢీకొన్న వేళ...
ముంబై : ముంబై నుంచి గోవా వెళ్లాల్సిన ఇండిగో విమానం టేకాఫ్ అవుతున్న వేళ ప్రమాదవశాత్తూ ఓ కుక్కను ఢీకొట్టింది. దీంతో గోవా విమానం ఆలస్యంగా గమ్యస్థానం చేరింది. ముంబై విమానాశ్రయంలో 6 ఈ 468 పంబనే గల ఇండిగో విమానం సోమవారం సాయంత్రం ఐదున్నర గంటలకు టేకాఫ్ అవుతున్నపుడు రన్ వే పై కుక్క అడ్డు రావడంతో పైలెట్ బ్రేక్ వేశారు. దీంతో విమానం టైర్లు దెబ్బతిన్నాయి. దీంతో పైలెట్ విమానాన్ని తనిఖీ కోసం పార్కింగ్ చేశారు. నిపుణులు పరిశీలించి విమానం టైరును మార్చాక ఆలస్యంగా 8.08 గంటలకు విమానం గోవాకు బయలుదేరి వెళ్లింది. కుక్క వల్ల విమాన ప్రయాణం ఆలస్యమైంది.
nation
15,595
01-07-2017 03:14:08
ఏ వస్తువు ఏ శ్లాబులో
హైదరాబాద్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా వస్తుసేవల పన్ను (జీఎస్టీ) జూలై 1 నుంచి అమలులోకి వస్తోంది. వస్తువులు, సేవలపై నాలుగు శ్లాబులుగా ఇది ఉంటుంది. మొత్తం 1,211 వస్తువులపై పన్ను రేట్లను నిర్ణయించింది. మరో 500 రకాల సేవలపై జీఎస్టీ రేట్లను కౌన్సిల్‌ ప్రకటించింది. 5 నుంచి 28% వరకు పన్నులుంటాయి. 5% శ్లాబులో 14% సరుకులు, సేవలు.. 12% శ్లాబులో 17% సరుకులు, సేవలు.. 18% శ్లాబులో 43% సరుకులు, సేవలు.. 28% శ్లాబులో 19% సరుకులు ఉన్నాయి. వ్యవసాయ ఉత్పత్తులు, పండ్లు, కూరగాయల వంటి 7% సరుకులను జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయించారు. పన్ను లేని వస్తువులుఆహార ధాన్యాలు, కూరగాయలు, శనగ పిండి, గోధుమలు, మైదా, పెరుగు, లస్సీ, మజ్జిగ, పన్నీర్‌, తేనె, ఉప్పు, చీపుర్లు, కుంకుమ, కాటుక, చిన్నారుల డ్రాయింగ్‌ బుక్స్‌, విద్యా సేవలు, వైద్య సేవలు, స్టాంపులు, దస్తావేజులు, ముద్రించిన పుస్తకాలు, వార్తా పత్రికలు, గాజులు, మెట్రో రైళ్లు, లోకల్‌ రైళ్లు, చేపలు, తాజా మాంసం, చికెన్‌, గుడ్లు, పండ్లు, బ్రెడ్‌. పన్ను పరిధిలోకి వచ్చేవి5%టీ, కాఫీలు, పంచదార, మసాలాలు, పన్నీర్‌ ప్యాకెట్‌, పాలపొడి, పిజ్జా బ్రెడ్‌, రస్కులు, కిస్‌మి్‌సలు, షాబుదానా, మ్యాట్‌లు, రూ.500 లోపు ధర ఉన్న పాదరక్షలు, రూ.50 లక్షల లోపు టర్నోవర్‌ ఉన్న రెస్టారెంట్లు, కిరోసిన్‌, బొగ్గు, రవాణా, రైళ్లు, విమానాలు, ట్యాక్సీ సేవలు(ఓలా, ఉబర్‌ లాంటివి), గాలిమరలు, బయో గ్యాస్‌ ప్లాంట్లు, వంట గ్యాస్‌, వంట నూనెలు, ఔషధాలు, స్టెంట్లు, స్టీలు పాత్రలు, ప్రాణాధార మందులు, సోయాబీన్‌, వేరుశనగ, సన్‌ఫ్లవర్‌ గింజలు, బేకరీ వస్తువులు, గృహోపయోగ వస్తువులు, సాస్‌లు, సూప్‌లు, ఎరువులు, అగ్గిపెట్టెలు, సోలార్‌ వాటర్‌ హీటర్లు, పునరుత్పాదక ఇంధన పరికరాలు, బ్లడ్‌ వాక్సిన్లు, ఇనుప స్టవ్‌లు, ఎల్‌పీజీ. పన్ను పరిధిలోనివి 12%విమాన టికెట్లు (బిజినెస్‌ క్లాస్‌), నాన్‌-ఏసీ హోటళ్లు, వర్క్‌ కాంట్రాక్టులు, నెయ్యి, ప్యాక్‌ చేసిన డ్రై ఫ్రూట్స్‌, పండ్ల రసాలు, జామ్‌, జెల్లీ, పెన్సిళ్లు, షార్పనర్లు, పెన్నులు, సైకిళ్లు, కాంటాక్ట్‌ లెన్స్‌, ఆట వస్తువులు, ఆయుర్వేద మందులు, టూత్‌ పౌడర్‌, అగర్‌బత్తీలు, గొడుగులు, కుట్టు మిషన్లు, సెల్‌ ఫోన్లు, వెన్న, చీజ్‌, చాకులు, కొవ్వొత్తులు, ఎల్‌ఈడీ లైట్లు, భుజియా, క్యాలెండర్లు, నీళ్ల పంపులు, ట్రాక్టర్లు, కుట్టుసూదులు, అల్యూమినియం పాత్రలు, వర్క్‌ కాంట్రాక్టులు, ప్రభుత్వ లాటరీలు. పన్ను పరిధిలోకి వచ్చేవి18%నూనెలు, మినరల్‌ వాటర్‌, ఐస్‌క్రీములు, పాస్తా, కార్న్‌ ఫ్లేక్స్‌, కేకులు, ఇన్‌స్టంట్‌ ఫుడ్‌, నిల్వచేసిన కూరగాయలు, సూప్‌లు, నాప్‌కిన్‌లు, ఎల్పీజీ స్టవ్‌లు, హెల్మెట్లు, ఎలకా్ట్రనిక్‌ బొమ్మలు, స్టీలు వస్తువులు, నోటు పుస్తకాలు, మానిటర్లు, కెమెరాలు, స్పీకర్లు, రుమాళ్లు, ట్రాక్టర్‌ విడి భాగాలు, టిష్యూలు, ప్రింటెడ్‌ సర్క్యూట్లు, బ్రాండెడ్‌ దుస్తులు, లిక్కర్‌ లైసెన్స్‌ ఉన్న ఏసీ హోటళ్లు, టెలికాం సర్వీసులు, ఐటీ సర్వీసులు, ఫైనాన్స్‌ సర్వీసులు, ట్రేడ్‌ మార్క్‌, బీడీ ఆకులు, గుడ్‌విల్‌, సాఫ్ట్‌వేర్‌, బిస్కట్లు, పేస్ట్రీలు, స్టీలు ఉత్పత్తులు, బరువు తూచే యంత్రాలు, ప్రింటర్లు, సీసీటీవీలు, ఆప్టికల్‌ ఫైబర్‌, వెదురు ఫర్నిచర్‌, స్విమ్మింగ్‌ పూల్స్‌, సలాడ్‌ డ్రసింగులు, రూ. 500 దాటిన పాదరక్షలు, ఆల్కహాల్‌ అమ్మే ఏసీ హోటళ్లు, టెలికం సర్వీసులు, ఐటీ సర్వీసులు, బ్రాండెడ్‌ దుస్తులు, ఆర్థిక సేవలు. రూ. 25,00-7500 మధ్య అద్దె ఉండే హోటల్‌ గదులు, ఫైవ్‌స్టార్‌ హోటళ్లలోని రెస్టారెంట్లు. పన్ను పరిధిలోకి వచ్చేవి 28%బీడీలు, శీతల పానీయాలు, చూయింగ్‌ గమ్‌, మొలాసెస్‌, చాక్లెట్లు, చాక్లెట్‌ కోటెడ్‌ వేఫర్స్‌, పాన్‌ మసాలా, ఏరేటెడ్‌ వాటర్‌, పెయింట్లు, డియోడిరేంట్స్‌, పెర్‌ఫ్యూమ్‌లు, షేవింగ్‌ క్రీమ్స్‌, ఆఫ్టర్‌ షేవ్స్‌, షాంపూలు, హెయిర్‌ డై, సన్‌ స్ర్కీన్‌లు, వాల్‌పేపర్లు, వాటర్‌ హీటర్లు, సిరామిక్‌ టైల్స్‌, డిష్‌ వాషర్స్‌, వేయింగ్‌ మిషన్లు, వాషింగ్‌ మిషన్లు, వెండింగ్‌ మిషన్లు, వాక్యూమ్‌ క్లీనర్లు, ఏర్‌ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, ప్రింటర్లు, ఫ్యాక్స్‌ మిషన్లు, ఫర్నిచర్‌, షేవర్స్‌, హెయిర్‌ క్లిప్పర్స్‌, ఆటోమొబైల్స్‌, ఫైవ్‌ స్టార్‌ హోటళ్లు, రేస్‌ క్లబ్‌ బెట్టింగులు, సినిమా టికెట్లు, షుగర్‌ డ్రింకులు, కోకో, పొగాకు, దానికి ప్రత్యామ్నాయాలు, రాళ్లల, ప్లాస్టరింగ్‌ సామగ్రి, సిమెంటు, సబ్బులు, కృత్రిమ వాక్స్‌, ప్లాస్టిక్‌ వస్తువులు, రబ్బరు, చెక్క వస్తువులు, కాగితం, బాయిలర్లు, యంత్రాలు, పడవలు, తేలే నిర్మాణాలు, ఫొటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ పరికరాలు, వైద్య లేదా శస్త్ర చికిత్స పరికరాలు, వాచీలు, గోడ గడియారాలు, సంగీత పరికరాలు, పరుపులు, కుషన్లు, దీపాలు, బొమ్మలు, గేమ్‌లు.
nation
20,726
28-04-2017 02:33:33
బీసీసీఐకి పీసీబీ బెదిరింపు
కరాచీ: ఐసీసీ నూతన ఆదాయ పంపిణీ నమూనాను అడ్డుకోలేకపోయి చతికిల పడ్డ బీసీసీఐపై దొరికిందే అవకాశంగా పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) బెదిరింపులకు దిగింది. ఒప్పందంలో భాగంగా తమతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడనందుకు బీసీసీఐపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పీసీబీ హెచ్చరిస్తోంది. దానివల్ల తాము 200 మిలియన్‌ డాలర్లు నష్టపోయామని ఈ మొత్తం బీసీసీఐ నుంచి రాబట్టుకునేందుకు దావా వేస్తామని పీసీబీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ చైర్మన్‌ నజామ్‌ ట్వీట్‌ చేశాడు. 2014లో చేసుకున్న ఎంవోయూ ప్రకారం 2015-2023 మధ్యలో భారత-పాక్‌ ఆరు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో పోటీపడాలి. కానీ, కేంద్రం అనుమతి లేకపోవడంతో పాక్‌తో సిరీ్‌సలు ఆడేందుకు బోర్డు ముందుకురావడం లేదు.
sports
2,237
30-08-2017 01:39:05
కార్పొరేట్ లాభాలకు జిఎస్‌టి గండి
ముంబై: భారత కార్పొరేట్‌ రంగం ఆదాయాలను జిఎ్‌సటి కుంగదీసిందని, ఫలితంగా లాభాల్లో భారీ క్షీణత నమోదయిందని రేటింగ్‌ సంస్థ ఇక్రా ఒక నివేదికలో తెలిపింది. డీమానిటైజేషన్‌ వల్ల ఏర్పడిన ప్రతికూలతల నుంచి కోలుకుంటున్నదనుకుంటున్న సమయంలో భారత కార్పొరేట్‌ రంగానికి జిఎ్‌సటి పులిమీద పుట్రలా మారిందని పేర్కొంది. జనవరి-మార్చి త్రైమాసికంలో 448 కంపెనీల ఆదాయాల్లో వృద్ధిరేటు గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 8.3 శాతం నుంచి 5.3 శాతానికి మందగించినట్టు ఆ నివేదికలో వివరించారు. ఆదాయాల్లో క్షీణత ప్రభావం కంపెనీల లాభాలపై కూడా పడిందంటూ గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే జనవరి-మార్చి నెలల మధ్య కాలంలో కంపెనీల మార్జిన్లు 1.8 శాతం మేరకు క్షీణించి 15.7 శాతానికి దిగజారినట్టు తెలిపారు.  జిఎస్‌టి ప్రవేశపెట్టడానికి ముందు నెలకొన్న అప్రమత్త వాతావరణంలో అమ్మకాలు గణనీయంగా క్షీణించడం, స్టాక్‌ క్లియర్‌ చేసేందుకు కంపెనీలు సాగించిన డిస్కౌంట్‌ అమ్మకాలు ఆటోమొబైల్‌, కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌, ఎఫ్‌ఎంసిజి వంటి కీలక రంగాల్లోని కంపెనీల లాభదాయకత తగ్గడంలో కీలక పాత్ర పోషించినట్టు వివరించారు. ప్రధానంగా వినిమయ ఆధారిత రంగాలు జూలై ఒకటవ తేదీకి ముందు స్టాక్‌ క్లియరెన్స్‌ చేశాయని పేర్కొన్నారు. డీమానిటైజేషన్‌ నుంచి కంపెనీలు రికవరీ బాట పట్టాయనుకుంటున్న సమయంలో జిఎ్‌సటి ప్రవేశంతో పాటుగా ముడిసరకు... ప్రత్యేకించి మెటల్స్‌, రబ్బరు దరల్లో పెరుగుదల ఆయా కంపెనీలను తీవ్ర వత్తిడికి గురి చేసిందన్నారు. రంగాలవారీగా చూస్తే పోటీ పెరగడం టెలికాం రంగానికి, నియంత్రణాపరమైన అవరోధాలు ఫార్మా రంగానికి, ముడిసరకు ధరలు పెరగడం ఆటోమొబైల్‌ రంగానికి శిరోభారంగా మారాయని పేర్కొన్నారు. పైగా బిఎస్‌ 4 ప్రమాణాల అమలు ఆటోమొబైల్‌ రంగాన్ని మరింతగా కుంగదీసినట్టు తెలిపారు.
business
8,858
18-01-2017 16:42:35
అప్పుడు రుద్రమదేవికి.. ఇప్పుడు ఆమె చరిత్రతో వచ్చిన సినిమాకూ లింగ వివక్షే!
బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణికి తెలుగు రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు లభించింది. చారిత్రక చిత్రం కావడం, అందునా తెలుగు వాడి చరిత్ర కావడం, ప్రపంచ దిగ్గజాలను ఓడించిన తెలుగు చక్రవర్తి కథ కావడంతో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు పన్ను మినహాయింపునిచ్చాయి. అయితే.. ఇదే పన్ను మినహాయింపు వ్యవహారం గుణశేఖర్ డైరెక్షన్‌లో వచ్చిన రుద్రమదేవి చిత్రానికి మాత్రం వర్తించలేదు. తెలంగాణ ప్రభుత్వం పన్ను మినహాయింపును కల్పించినా.. ఏపీ ప్రభుత్వం మాత్రం అటు తిప్పి..ఇటు తిప్పి ఇవ్వలేమని తేల్చి చెప్పింది. దీంతో గుణశేఖర్ ఏపీ సీఎం చంద్రబాబుకు ఇటీవల ఓ లేఖ రాశాడు. రుద్రమదేవి తెలుగు దక్షిణాపథాన్ని అంతటినీ పాలించిందని, వివక్ష చూపవద్దని కోరుతూ.. తాను చెల్లించిన పన్నును తిరిగి ఇచ్చేయాలని ఆ లేఖలో పేర్కొన్నాడు. ఇప్పుడు గుణశేఖర్‌కు మద్దతు వెల్లువెత్తుతోంది. సోషల్ వెబ్‌సైట్లు, ట్విట్టర్ వేదికగా జనాలు గుణశేఖర్‌కు మద్దతుగా ఓ హ్యాష్‌ట్యాగ్‌ను ఓపెన్ చేసేశారు. #SupportRDforTaxExemptionInAP అనే హ్యాష్‌ట్యాగ్‌ను క్రియేట్ చేశారు. పన్ను మినహాయింపునకు ప్రాంతీయ భేదమే కాదు.. లింగ వివక్ష కూడా చూపుతున్నారంటూ మండిపడుతున్నారు. రుద్రమదేవి (సినిమాలో నటించిన అనుష్క) ఫొటోకు మీసకట్టు పెట్టి.. ఇప్పుడు ఆమె అతడే (s'HE') కదా.. ఇప్పుడైనా పన్ను మినహాయింపు ఉంటుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. మహిళలపై అప్పుడే కాదు.. ఇప్పుడు కూడా వివక్ష చూపిస్తోందంటూ కామెంట్ చేస్తున్నారు. 13వ శతాబ్దంలో రుద్రమదేవి లింగ వివక్షను ఎదుర్కొందని, ఇప్పుడు 21వ శతాబ్దంలోనూ ఆమె కథను తెరపై చూపించిన రుద్రమదేవి సినిమా కూడా అదే లింగ వివక్షను ఎదుర్కొంటోందని పరోక్షంగా ఏపీ ప్రభుత్వంపై కామెంట్లు షేర్ చేస్తున్నారు.
entertainment
8,271
13-12-2017 17:48:21
బర్త్‌డే రోజు భయపెట్టే లుక్‌లో రెజీనా..
నవంబర్ నెలలో రెజీనా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. డిసెంబర్‌లో మీ అందరికి షాక్ ఇస్తానంటూ చెప్పిన విషయం తెలిసిందే. చెప్పినట్టుగానే రెజీనా అందరికీ షాక్ ఇవ్వడమే కాదు, భయపెట్టేసింది కూడా. నాని సమర్పణలో ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న ‘అ!’ సినిమాకి సంబంధించిన లుక్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ లుక్‌లో సర్పకన్యగా రెజీనా ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు రెజీనా ఇటువంటి లుక్‌లో కనిపించలేదు. సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుందో తెలియదు కానీ, రెజీనా ఫస్ట్ లుక్ మాత్రం ఈ సినిమాపై విపరీతంగా అంచనాలు పెంచేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన నిత్యామీనన్, ఈషా రెబ్బా వంటి వారి లుక్స్ విడుదలైనా.. రెజీనా లుక్ మాత్రం సంథింగ్ స్పెషల్‌గా ఉంది. మొత్తానికి రెజీనా బర్త్‌డే ట్రీట్ మాత్రం అదిరింది. ఇక ఈ ‘అ!’ చిత్రం ఇప్పటికే 90 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుందని చిత్ర యూనిట్ తెలుపుతుంది. ‘ప్రపంచంలో నేను.. నాలోని ప్రపంచం’ అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాని, రవితేజ వాయిస్ ఓవర్ అందిస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత ప్రశాంతి త్రిపురనేని.
entertainment
6,585
29-12-2017 17:05:07
ఇద్దరు టాప్ నిర్మాతలతో మహేశ్ 25వ మూవీ
హైదరాబాద్: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తన 25వ సినిమాపై ఫోకస్ పెట్టారు. వచ్చే ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం దర్శకుడు లొకేషన్లు వెతికేపనిలో పడ్డారు. కథ ప్రకారం న్యూయార్క్‌లో ఎక్కువ షూటింగ్ జరగనున్నట్టు సమాచారం. అశ్వనీదత్, దిల్‌రాజు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించనున్నారు. వచ్చే దీపావళికి విడుదల చేయాలని భావిస్తున్నారట. కాగా మహేశ్‌బాబు నటిస్తున్న ‘భరత్ అనే నును’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. మహేశ్ సరసన కైరా అద్వాని నటిస్తున్నారు. మహేశ్‌బాబు వచ్చే ఏడాది రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారనమాట.
entertainment
5,762
09-03-2017 17:54:22
బాలయ్య చేసేది ఆటో జానీ కథేనా?
బాలకృష్ణ తాజాచిత్రం ఈరోజే ప్రారంభోత్సవం జరుపుకొంది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో బాలయ్య నటించబోతున్నాడు. ఫిల్మ్‌నగర్‌లో లేటెస్ట్‌గా ఓ హాట్ టాపిక్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం పూరీ జగన్నాథ్ కూడా లైన్లో ఉన్న సంగతి తెలిసిందే. చిరు కోసం పూరీ ఆటో జానీ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడని, ఆ స్క్రిప్ట్ సెకండాఫ్‌లో తేడా రావడంతో ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడు అదే స్క్రిప్ట్‌ను బాలయ్యకు తగినట్టుగా మార్చాడ పూరీ. బాలయ్య స్టైల్, బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టు కొన్ని సీన్లను రీరైట్ చేసి బాలయ్యకు మళ్లీ వినిపించాడట. పూరీ సన్నిహితులు ఈ విషయాన్ని చెబుతున్నారు. పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్యను సరికొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నాడట పూరీ. టైటిల్ మాత్రం ఆటో జానీ ఉండదని, మరో క్యాచీ టైటిల్ కోసం కసరత్తులు చేస్తున్నారని అంటున్నారు. సినిమాలో నటించే హీరోయిన్లను ప్రకటించలేదు. త్వరలోనే సినిమా తారాగణాన్ని ప్రకటిస్తారట. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
entertainment
16,831
04-10-2017 02:23:47
గౌరీ హంతకులను గుర్తించాం: మంత్రి
బెంగళూరు, అక్టోబరు 3: గత నెల 5న తన ఇంటి వద్దే దారుణ హత్యకు గురైన ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేష్‌ కేసులో హంతకులను గుర్తించినట్టు కర్ణాటక హోంమంత్రి రామలింగారెడ్డి ఢిల్లీలో వెల్లడించారు. అయితే, ఈ కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ ముమ్మరంగా సాగుతున్నట్టు తెలిపారు. కాగా, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది.
nation
3,711
20-04-2017 04:55:33
చెల్లప్ప కమిషన్ రద్దు చేయాలి
ఎస్టీ జాబితాలో మరిన్ని అగ్ర కులాలను కలిపి ఎస్టీలకు 9 శాతం రిజర్వేషన్ ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేకం. ఆదివాసీ లక్షణాలు లేని ఇతర కులాలను షెడ్యూల్ తెగలలో కలపడం చట్ట వ్యతిరేకం, అన్యాయం, అక్రమం, అమానుషం. ఇప్పటి వరకూ ఉన్న 6 శాతం రిజర్వేషన్‌ను పాలకులు సంపూర్ణంగా అమలు చేయకపోవడం మూలంగా ఆదివాసీలు అన్ని రంగాల్లో వెనుకబడి పోయారు. 1976లో అక్రమంగా, చట్ట వ్యతిరేకంగా ఎస్టీ జాబితాలో చేరిన లంబాడీలు ఈనాడు ఆదివాసీల విద్యా ఉఫాది అవకాశాలను 90శాతం దోచుకున్నారు. భూములు ఆక్రమించుకున్నారు. నేడు కేవలం పాలకులు ఓటు బ్యాంకు రాజకీయ కోణంలో చెల్లప్ప కమిషన్ ద్వారా బోయ, వాల్మీకి, కయిత లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చి 12శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కుట్ర పన్నుతున్నారు. దీని ఫలితం ఆదివాసీ అడవి బిడ్డలను పూర్తిగా నిర్వీర్యం చేయడమే అవుతుంది. అంతరించి పోతున్న ఆదివాసీల గురించి పట్టించుకోవడం లేదు కానీ ఎస్టీ జాబితాలో మరిన్ని కులాలను కలిపి ఆదివాసులను అంతం చేయాలని పాలకులు ప్రయత్నిస్తున్నారు. షెడ్యూల్ తెగలలో ఒక కులాన్ని కలపాలన్నా, తీసివేయాలన్నా పార్లమెంట్, అసెంబ్లీ ఆమోదం ఉండాలి. రాష్ట్రపతి ఆమోదముద్ర ఉండాలి. తెలంగాణ ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోకుండా చట్టబద్ధత లేని, రాజ్యాంగబద్ధత లేని చెల్లప్ప కమిషన్ ఏర్పాటు చేసింది. షెడ్యూల్ తెగలలో కులాలను కలిపితే నష్టం ఎవరికి అనేది మానవతా దృక్పథంలో, సామాజిక స్పృహతో ఆలోచిస్తేనే అర్థం అవుతుంది. షెడ్యూల్ తెగలలో కులాలను కలపడం అంటే ఒకే బోనులోకి జింకను పులినీ పంపించడమే అవుతుంది. అలాగే షెడ్యూల్ తెగలలో ఇతర కులాలను కలిపితే నిజమైన ఆదివాసులను వారి విద్యా ఉపాధి అవకాశాలను, రిజర్వేషన్‌ను నిలువునా దోపిడీ చేస్తారు. నోరు లేని, రాజకీయ చైతన్యం లేని, అక్షర జ్ఞానం లేని, ఆర్థిక జ్ఞానం లేని ఆదివాసీల రోదన అరణ్య వేదనగా మారింది. చెల్లప్ప కమిషన్ ద్వారా షెడ్యూల్ తెగలలో ఇతర కులాలను కలపడాన్నీ ఆదివాసీలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఆదివాసీల 6శాతం రిజర్వేషన్‌ను ఏజెన్సీలో ఖచ్చితంగా అమలు చేయాలనీ, ఆదివాసీలను నిర్వీర్యం చేసే చెల్లప్ప కమిషన్‌ను రద్దు చేయాలనీ ఆదివాసీలు కోరుతున్నారు.- వూకె రామకృష్ణ దొరఆదివాసీ రచయితల సంఘం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
editorial
322
08-06-2017 00:37:36
మసాలా బాండ్లకు ఆర్‌బిఐ అనుమతి తప్పనిసరి
ఇక నుంచి విదేశీ మార్కెట్లలో మసాలా బాండ్లు జారీ చేయాలనుకునే కంపెనీలేవైనా ఆర్‌బిఐ ఫారెక్స్‌ శాఖ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇసిబి నిబంధనల్లో మార్పుల్లో భాగంగా ఈ చర్య తీసుకుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో 5 కోట్ల డాలర్లకు లోపు నిధులు వసూలు చేయడానికి బాండ్లు జారీ చేస్తే వాటికి మూడు సంవత్సరాలు, అంతకు పైబడిన విలువ గల నిధులు సమీకరిస్తే అలాంటి బాండ్లకు ఐదు సంవత్సరాలు కాలపరిమితిని నిర్దేశించింది.
business
20,905
16-10-2017 02:07:44
లడ్డూపై దాడి..!
టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీ, కూతురు జివాతో కలసి చేసే సందడి ఎప్పుడూ అభిమానులకు సంతోషంగానే ఉంటుంది. జివా చేసే చిలిపి చేష్టలను ధోనీ తరచుగా నెట్‌లో షేర్‌ చేస్తుంటాడు. తాజా ఇద్దరూ కలసి లడ్డూ తింటున్న వీడియోను ధోనీ పోస్టు చేశాడు. ‘ఎటాక్‌ ఆన్‌ బేసన్‌ కా లడ్డూ’ అనే క్యాప్షన్‌ పెట్టాడు. ఇది చూసి మహీ ఫ్యాన్స్‌ తెగ మురిసిపోతున్నారు.
sports
6,472
18-05-2017 11:55:17
రమ్యకృష్ణలా కలిసొస్తుందని రాంగ్‌రూట్‌లో వెడుతున్న శ్రియ...
రోడ్డు మీద కాదు. క్యారక్టర్ల ఎంపికలో శ్రియ రాంగ్‌ రూట్‌లో వెడుతోంది అని బాధపడుతున్నారు ఆమె శ్రేయోభిలాషులు. గతంలో రమ్యకృష్ణ ‘నరసింహ’ సినిమాలో నీలాంబరి క్యారక్టర్ చేసి ఎంతో పాపులర్‌ అయింది. ఆ సినిమా తీసుకొచ్చినంత పేరు ఆమెకు మరే సినిమా తీసుకురాలేదు. తను కూడా అంతటి పేరు తెచ్చుకోవాలనుకుందో ఏమో శ్రియ తాజగా ఓ నెగిటివ్‌ క్యారక్టర్‌ చేయడానికి ఓకే చెప్పేసింది. ఇప్పటి వరకూ గ్లామర్‌ పాత్రలకే పరిమితమైన శ్రియ ఈ క్యారక్టర్‌లో ఎంత వరకూ మెప్పిస్తుందన్న అనుమానాన్న ఆమె సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా చేసి చెడ్డపేరు తెచ్చుకుంటుందేమో అన్నదే వారి భయమట! ఈ విషయాలన్నీ శ్రియకు తెలియదా? అన్న వారూ ఉన్నారు.
entertainment
1,326
20-11-2017 00:04:33
ఆ రూ.13 వేల కోట్లూ మాకే!
ఆర్‌బిఐని కోరిన ఆర్థిక శాఖన్యూఢిల్లీ: భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బిఐ)ను తన వద్దనున్న రూ.13వేల కోట్ల మిగులు నిధులను ప్రభుత్వానికి ఇవ్వమని కోరామే తప్ప ప్రత్యేక డివిడెండ్‌ డిమాండ్‌ చేయలేదని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ వివరణ ఇచ్చా రు. జూన్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్‌బిఐ.. ప్రభుత్వానికి రూ.30,659 కోట్ల డివిడెండ్‌ చెల్లించింది. గత ఏడాది జూన్‌లో చెల్లించిన రూ. 65,876 కోట్లతో పోలిస్తే సగానికంటే తక్కువ.  ఈసారి బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆర్‌బిఐ నుంచి డివెడెండ్‌ రూపంలో రూ.58 వేల కోట్లు రావచ్చని అంచనా వేసింది. కానీ ఆర్‌బిఐ గత ఆర్థిక సంవత్సరానికి ఆర్జించిన రూ.44 వేల కోట్ల లాభం నుంచి ప్రభుత్వానికి రూ.30వేల కోట్లకు పైగా డివిడెండ్‌ పంచింది. అయితే, ఆ మిగిలిన రూ.13 వేల కోట్లను కూడా ప్రభుత్వానికే ఇవ్వాలని ఆర్‌బిఐని కోరడం జరిగిందని గార్గ్‌ వెల్లడించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రెండేళ్లలో రూ. 2.11 లక్షల మూలధన నిధులు కేటాయించనున్నట్లు గతనెలలో ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటించారు. ఈ కేటాయింపుల కోసం అవసరమైన నిధుల సేకరణకు కేంద్రం తీవ్రంగా కసరత్తు చేస్తున్నది. అందులోభాగంగానే ఆర్‌బిఐని ప్రభుత్వం ప్రత్యేక డివిడెండ్‌ కోరిందని ఊహాగానాలు వచ్చాయి.
business
3,798
08-11-2017 00:42:30
నిరుద్యోగుల అసహనం
రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ఉపాధ్యాయ నియామక ప్రక్రియ నిరాశాజనకంగా ఉంది. ఇటీవల వివిధ శాఖల ఉద్యోగాల నోటిఫికేషన్ మొదలు, పరీక్ష నిర్వహణ, ఫలితాల ప్రకటన, నియామక ఉత్తర్వులు అన్నీ అస్తవ్యస్తంగా ఉండడం.. నిరుద్యోగుల్లో ప్రభు త్వం పట్ల అసహనం వ్యక్తం అవుతోంది. ఆర్థిక, హోమ్, న్యాయ, పరిపాలనా రంగాల మధ్య సమన్వయం కొరవడి ఉద్యోగాల భర్తీ అపహాస్యం అవుతుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్థిక శాఖ సూచించిన ఉపాధ్యాయ ఖాళీలు సుమారు 24000 పైమాటే. అనంతరం ఆ ఖాళీలను విద్యా శాఖ 18000లకు కుదించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం 8 వేల ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వడం.. అందునా కొన్ని జిల్లాల్లో తెలుగుమీడియం ఎస్‌జీటీ పోస్టులు 10 లోపు ఉండడం.., ఇత్యాది కారణాల వల్ల నిరుద్యోగుల్లో అసహనం, అభద్రతాభావం, ఆందోళన పెరుగుతున్నాయి. గ్రామంలో ఒకే ప్రాథమిక పాఠశాల ఉండేట్టు చూస్తూ, అంగన్‌వాడీలను దానికి అనుసంధానం చేస్తూ, 4–5 గురు ఉపాధ్యాయులను ఇచ్చి, ప్రతి 3 కిలోమీటర్లకు ఒక ఉన్నత పాఠశాల ఏర్పాటు చేస్తే విద్యావ్యవస్థ గాడిలో పడుతుంది.- ప్రేమ్ సాగర్ కులేరి, తెలంగాణ SC, ST ఉపాధ్యాయ సంఘం
editorial
18,784
02-06-2017 03:20:13
ప్రొటోకాల్‌ను కాదని..జవాన్‌ను హత్తుకున్న రాజ్‌నాథ్‌
న్యూఢిల్లీ, జూన్‌ 1: దాదాపు మూడేళ్ల క్రితం.. 2014లో. జమ్మూకశ్మీర్‌ ఉధంపూర్‌లో ఆర్మీ కాన్వాయ్‌ వెళ్తోంది. ఓ బస్సులో 30 మంది సైనిక సిబ్బంది ఉన్నారు. బస్సు ‘నర్సూ నాలా’ ప్రాంతానికి చేరుకోగానే ఉగ్రవాదులు మెరుపుదాడికి దిగారు. వాహనంపై బుల్లెట్ల వర్షం కురిపించారు. బస్సులో గార్డు విధులు నిర్వహిస్తున్న బీఎ్‌సఎఫ్‌ జవాను గోధ్‌రాజ్‌ మీనా.. ప్రాణాలకు తెగించి ఉగ్రవాదులపై ఎదురుకాల్పులకు దిగాడు. మిలిటెంట్ల కాల్పుల్లో శరీరం ఛిద్రమైనా.. తెగువ ప్రదర్శించి ఇద్దరిని మట్టుపెట్టాడు. 30 మంది ప్రాణాలను కాపాడాడు. కొన ఊపిరితో గోధ్‌రాజ్‌ బయటపడి కోలుకున్నా.. 85 శాతం అంగవికలుడిగా మారాడు. గురువారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ చేతులు మీదుగా గోధ్‌రాజ్‌ పోలీస్‌ మెడల్‌ అవార్డు అందుకున్నాడు. అయితే.. ఈ సందర్భంగా ప్రొటోకాల్‌కు భిన్నంగా వ్యవహరించిన రాజ్‌నాథ్‌ గోధ్‌రాజ్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. దాంతో అధికారులు ఆశ్చర్యపోయినా.. వెంటనే తేరుకుని హర్షద్వానాలతో స్వాగతించారు.
nation
14,973
30-09-2017 03:10:36
ప్రైవేటు అంబులెన్సులో జయను ఎందుకు తరలించారు?
ఆమె భద్రతాసిబ్బంది ఎక్కడికెళ్లారుఅపస్మారక స్థితిలో ఉంటే ఓపీఎస్ కు బాధ్యతలు ఎలా అప్పగించారు?జయ మరణంపై స్టాలిన్‌ ప్రశ్నాస్త్రాలుచెన్నై, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): జయలలిత అపోలో ఆస్పత్రిలో చేరిన సమయంలో నమోదుచేసిన పేషంట్‌ కేర్‌ రిపోర్టు ఇప్పుడు తమిళనాడులో సంచలనం రేపుతోంది. ఓ తమిళ చానల్‌ దీనిని బహిర్గతం చేయడంతో అన్ని రాజకీయ పార్టీల నేతలు అధికార పక్షంపై విరుచుకుపడుతున్నారు. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, శాసనసభలో విపక్ష నేత ఎంకే స్టాలిన్‌ శుక్రవారం 10 ప్రశ్నలు సంధించారు. ముఖ్యమంత్రిగా ఉన్న జయను ఆమె భద్రతావిభాగంలోని అంబులెన్సులో గాక ప్రైవేటు అంబులెన్సులో ఎలా తీసుకెళ్లారని నిలదీశారు. ఆమె అపస్మారక స్థితిలో ఉంటే ఒ.పన్నీర్‌సెల్వానికి ఎలా నిర్వహణ బాధ్యతలు అప్పగించారని ప్రశ్నించారు. ‘జడ్‌ ప్లస్‌ భద్రతా సిబ్బంది జయ ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఎక్కడకు వెళ్లారు? 75 రోజులపాటు వారేం చేశారు? ఆమె ఆరోగ్యంపై కేంద్ర హోంశాఖకు నివేదిక సమర్పించారా లేదా? సమర్పించి ఉంటే జయ ఆరోగ్యం గురించి కేంద్రానికి పూర్తి వివరాలు తెలుసా? శశికళ కూడా అక్టోబరు మొదటివారం నుంచి జయను చూడలేదని దినకరన్‌ అన్నారు.  అలాంటప్పుడు తిరుప్పరంకుండ్రం ఉప ఎన్నికలో బీఫారం పత్రాలపై జయ వేలిముద్ర ఎలా వచ్చింది? ముఖ్యమంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసేవారు ఆమె చుట్టూ, ఆమె మంత్రివర్గంలో, సచివాలయంలో ఎవరైనా ఉన్నారా? ఇదే నిజమైతే ఏయే పథకాలకు ఆ సంతకాన్ని ఫోర్జరీ చేశారు? పదవుల పంపకం కోసమే జయ ఆరోగ్యంపై 75 రోజులపాటు నాటకం ఆడారా’ అంటూ ప్రశ్నలవర్షం కురిపించారు. ఈ ప్రశ్నలు వ్యక్తిగతంగా తాను సంధిస్తున్నవి కావని, రాష్ట్ర ప్రజలతో పాటు అన్నాడీఎంకే కార్యకర్తలు లేవనెత్తుతున్న ప్రశ్నలని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ వంటి స్వతంత్ర దర్యాప్తు సంస్ధతో విచారణ జరిపినప్పుడే నిజానిజాలు బయటపడతాయని స్పష్టం చేశారు.
nation
1,325
23-08-2017 02:04:41
సిఇఒలు అభివృద్ధి సైనికులు కావాలి
దేశ దిగుమతుల భారం తగ్గించాలిపర్యాటకంతో ఉద్యోగాలే ఉద్యోగాలుదీపావళి బహుమతులుగా ‘ఖాదీ’ కూపన్లుప్రధాని మోదీ పిలుపున్యూఢిల్లీ: చిన్న వయసులోనే కంపెనీల ప్రధాన కార్యనిర్వహణాధికారులు(సిఇఒ)గా పని చేసే వ్యక్తు లు దేశ అభివృద్ధికి సైనికులుగా మారాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చారు. దిగుమతుల భారం తగ్గించడంతో పాటు, ఆర్థిక వ్యవస్థలో నగదు లావాదేవీల ప్రమేయం తగ్గించేందుకూ కృషి చేయాలని కోరారు. భీమ్‌ యాప్‌ను ప్రోత్సహించడం ద్వారా 2022 నాటికి మీ దగ్గర చేసే ఉద్యోగులందరికీ నగదు రహితంగా జీతాలు చెల్లించే విధానం అమలు చేయాలని సూచించారు. చాంపియన్స్‌ ఆఫ్‌ చేంజ్‌ పేరుతో నీతి ఆయోగ్‌ దాదాపు 200 మంది యువ సిఇఒలు, స్టార్టప్‌ కంపెనీల ప్రధాన అధికారులతో నిర్వహించిన సమావేశంలో ప్రధాని ఈ పిలుపునిచ్చారు. సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పండ్లు, కూరగాయలతో సహా ఏటా రూ.లక్ష కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులు వృధా కావడాన్ని గుర్తు చేశారు.  మౌలిక సదుపాయాల కల్పన కూడా పెద్ద వ్యాపార అవకాశం అనే విషయాన్ని సిఇఒలు గుర్తించాలని కోరారు. వ్యవసాయ ఆధారత ఎగుమతులతో పాటు దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకూ చర్యలు తీసుకోవాలన్నారు. ‘గాంధీజీ స్వాతంత్య్ర పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మార్చారు. ప్రతి ప్రభుత్వం దేశ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. అయినా అభివృద్ధి ప్రజా ఉద్యమంగా మారలేదు’ అన్నారు. గాంధీజీ స్వాతంత్య్ర పోరాటాన్ని ఎలా ప్రజా ఉద్యమంగా మార్చారో మనమూ భారత అభివృద్ధిని అలానే ప్రజా ఉద్యమంలా మార్చాలని ప్రధాని.. సిఇఒలను కోరారు. అందరం కలిసి కట్టుగా పని చేస్తే ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించవచ్చన్నారు. దేశంలో ఖాదీ వస్త్రాల వాడకాన్ని పెంచేందుకూ సిఇఒలు సహకరించాలని కోరారు. దీపావళి వంటి పండుగల సందర్భంగా ఉద్యోగులకు ఖాదీ కూపన్లను బహుమతిగా ఇవ్వాలని సూచించారు. పర్యాటకంతో ఉద్యోగాలుదేశంలో పర్యాటక రంగ అభివృద్ధి అవకాశాలపైనా యువ సిఇఒలు దృష్టి పెట్టాలని ప్రధాని కోరారు. ఈ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా దేశంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఉందన్నారు. ‘సుసంపన్నమైన మన వారసత్వాన్ని మనం గర్వకారణంగా భావించం. దీని గురించి మనం గర్వంగా చెప్పుకోగలిగితే అంతర్జాతీయ పర్యాటకులు మన ఘనమైన వారసత్వ కట్టడాలు చూసేందుకు ఎగబడతారు’ అన్నారు. భారత్‌కు మాత్రమే పరిమితమైన సమస్యలు, మార్కెట్లకు అనువైన పరిష్కారాలు అభివృద్ధి చేయగలిగితే ఉద్యోగాలు వాటంతట అవే ఏర్పడతాయని ప్రధాని మోదీ అన్నారు. జిఈం పోర్టల్‌ ద్వారా ప్రభుత్వానికి వివిధ వస్తువులు సరఫరా చేయడం ద్వారా 28,000 మంది చిన్న వ్యాపారులు గత 4-6 నెలల్లో రూ.1,000 కోట్ల వ్యాపారం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పనగడియా పనితీరు భేష్‌ఈ నెలాఖరులో పదవి నుంచి తప్పుకుంటున్న నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ అరవింద్‌ పనగడియాపై ఈ సమావేశంలో ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రణాళికా సంఘం స్థానంలో కొత్తగా ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌ను ఎలాంటి ప్రచారం లేకుండానే చక్కగా తీర్చిదిద్దారని కితాబిచ్చారు. ‘నిర్ణీత లక్ష్య సాధన కోసం కలిసి కట్టుగా ఎలా చేయవచ్చో నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ పనగడియా ఆచరించి చూపారు. అందుకు ఆయన్ని అభినందిస్తున్నా. ఈ విషయంలో దేశం ఆయన సేవల్ని పాత్రని ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది’ అన్నా రు. నాలుగున్నర దశాబ్దాలుగా అమెరికాలో పని చేస్తున్న పనగడియా తన విజ్ఞప్తి పైనే భారత్‌ వచ్చి నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ పదవి చేపట్టారని మోదీ చెప్పారు. ముందు ముందు కూడా పనగడియా ప్రభుత్వంతో కలిసి పని చేస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు.
business
6,153
30-10-2017 22:23:29
ఓ ఇడియట్‌ ప్రేమకథ
‘‘ఇష్టపడిన అమ్మాయి వెంటపడి, తన ఇష్టాయిష్టాలను తెలుసుకుని, ఆమె ప్రేమకోసం తన ఇష్టాల్ని వదులుకొని, ఆ అందమైన అమ్మాయిని ఇంప్రెస్‌ చెయ్యడమే పనిగా పెట్టుకున్న ఓ యువకుడికి చివరికి ఆమె ప్రేమ దక్కిందా లేదా అన్నది తెరపైనే చూడాలి’’ అని అంటున్నారు దర్శకుడు అజయ్‌ వోధిరాల. నవీన్‌చంద్ర, నివేదా థామస్‌ జంటగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘జూలియట్‌ లవర్‌ ఆఫ్‌ ఇడియట్‌’. కొత్తపల్లి అనురాధ సమర్పణలో అనురాగ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై కొత్తపల్లి ఆర్‌.రఘుబాబు కె.బి.చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రతీస్‌ వేగ సంగీతం అందించిన ఈ చిత్రం పాటల్ని ఆదివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన సుకుమార్‌ ఆడియో సీడీలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘నేను స్ట్రగ్‌లింగ్‌లో ఉన్న సమయంలో ‘మీరు గొప్ప దర్శకుడు అవుతారు. మీ దగ్గర అసిస్టెంట్‌గా జాయిన్‌ అవుతాను’ అని అజయ్‌ చెప్పాడు. అది జరిగింది. ఇప్పుడు అతను మంచి ప్రేమకథతో దర్శకుడిగా మారాడు. ప్రతి విషయంలో క్లారిటీగా ఉంటాడు... క్వాలిటీగా ఆలోచిస్తాడు. వెతికి వెతికి మంచి టీమ్‌ను తీసుకున్నాడు. చిన్న సినిమా అయినా ఇది మంచి సినిమా. ఇలాంటి సినిమాలు ఆడితే పరిశ్రమ బావుంటుంది’’ అని అన్నారు.
entertainment
18,899
24-02-2017 02:11:16
రాహుల్‌ ఆఫీసుకు ముడుపులు!
బెంగళూరు, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక ప్రభుత్వం కాంగ్రెస్‌ అధిష్ఠానానికి పెద్దఎత్తున ముడుపులు పంపిందా...! ఆ రాష్ట్ర మంత్రులు తమకు తోచినంత ముట్టచెప్పారా..!! ఏకంగా రాహుల్‌ గాంధీ కార్యాలయానికే ఇక్కడి నుంచి డబ్బులు వెళ్లాయా..!! అంటే అవుననే అంటోంది ఓ డైరీ. పైగా అది సాదా సీదా డైరీ కాదు. కర్ణాటక ప్రభుత్వంలో అధిష్ఠానం మనిషిగా ముద్రపడిన వ్యక్తి వద్ద ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్న డైరీ అని చెబుతున్నారు. దానిలోని కొన్ని పత్రాలు గురువారం రాత్రి విడుదల చేశారు. అందులోని వివరాల ప్రకారం.. వారం రోజుల కిందట కర్ణాటకలోని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ గోవిందరాజులు ఇంట్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఒక డైరీ, పలు డాక్యుమెంట్లు, పెద్దఎత్తున నగదు స్వాధీనం చేసుకుంది. ఐటీ, ఈడీ అధికారులు సదరు డైరీని పరిశీలించగా.. అందులో కర్ణాటక నుంచి ‘ఏఐసీసీకి చెల్లింపులు..’’ అని రాసి ఉంది. ఈ వివరాలను ఐటీ అధికారులు అధికారికంగా బయటపెట్టలేదు. కానీ, డైరీలో దాదాపు డజను మంత్రి కర్ణాటక మంత్రుల పేరిట అధిష్ఠానానికి ముడుపులు అందినట్లు ఉంది. వీరి నుంచి ముడుపులు అందుకున్నవారి పేర్లలో అహ్మద్‌ పటేల్‌, రాహుల్‌ గాంధీ కార్యాలయం, మోతీలాల్‌ వోరా పేర్లు ఉన్నాయి. వీటితోపాటు సెప్టెంబరు నుంచి జనవరి వరకూ నెలల వారీగా ఇచ్చిన వివరాలూ డైరీలో ఉన్నట్లు తెలిసింది. వాస్తవానికి గోవిందరాజులు అధిష్ఠానం మనిషని.. ఆయన్ను హైకమాండే నేరుగా ఎమ్మెల్సీ చేసిందని ఇక్కడ చెబుతూ ఉంటారు. ఈయన ఇప్పుడే మొదటిసారిగా ఎమ్మెల్సీ అయ్యారు కూడా. ఆయన ఇంట్లో లభించిన డైరీలో ముడుపుల వివరాలు ఉండటంతో.. ఆయన ద్వారానే కర్ణాటక మంత్రులు ముడుపులు సమర్పించుకున్నారనీ అంటున్నారు. తాజాగా బయటపడిన మంత్రులు అందరినీ పరిశీలిస్తే.. వీరందరూ అటు అధిష్ఠానానికి లేకుంటే సీఎం సిద్ధరామయ్యకు ఆప్తులుగా ఉన్నవారే. ఈ డైరీలోని వివరాలతో కర్ణాటక నుంచి ఢిల్లీ దాకా రాజకీయవర్గాల్లో తీవ్ర కలకలం మొదలైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన దాదాపు 10 పత్రాల్లో 65 కోట్ల ముడుపులకు సంబంధించిన లెక్కలున్నాయి. కేవలం రాహుల్‌గాంధీ, అహ్మద్‌ పటేల్‌, ఓరాలకే రూ.50 కోట్ల వరకు ఇచ్చినట్లు ఇందులో వారి సంక్షిప్త నామాల పేరిట రాసి ఉంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధిష్ఠానానికి వెయ్యి కోట్లు పంపారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప కొన్ని రోజులుగా ఆరోపిస్తున్నారు. వాటిని సీఎం, కాంగ్రెస్‌ కొట్టిపారేశాయి. ఈ నేపథ్యంలో సదరు డైరీ పత్రాలు ఢిల్లీలో వెలుగులోకి వచ్చాయి. డైరీలో ఉన్న వివరాలు..!!‘‘ఏఐసీసీకి చెల్లింపులు...’’కేజేజే, ఎంబీపీ రూ.219 కోట్లు. (కేజేజే- కేజే జార్జ్‌.. ఈయన సోనియాగాంధీకి అత్యంత ఆప్తుడని చెబుతూ ఉంటారు. అలాగే ఎంబీపీ- అంటే మహదేవప్రసాద్‌. ఆయన ప్రజాపనుల మంత్రి. ఈయన సీఎం సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడు.)
nation
19,308
02-07-2017 01:42:45
మార్పులు ఖాయం?
మూడో వన్డేలో జట్టులో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉందని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సూచాయగా చెప్పాడు. అయితే తుది జ ట్టుపై ఇంకా నిర్ణయం తీసు కోలేదన్నాడు. ఈ సిరీస్‌లో ప్రతి ఒక్కరికీ అవకాశం దక్కేలా చూస్తామని విరాట్‌ తెలిపాడు.జట్లు (అంచనా)భారత్‌: శిఖర్‌ ధవన్‌, అజింక్యా రహానె, కోహ్లీ (కెప్టెన్‌), యువరాజ్‌/రి షభ్‌ పంత్‌, ధోనీ (వికెట్‌ కీపర్‌), కేదార్‌ జాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, కుల్దీవ్‌ యాదవ్‌, అశ్విన్‌, భువనేశ్వ ర్‌, ఉమేష్‌ యాదవ్‌.వెస్టిండీస్‌: లూయిస్‌, కైల్‌ హోప్‌, షై హోప్‌ (వికెట్‌ కీపర్‌), మహమ్మద్‌, ఛేజ్‌, హోల్డర్‌ (కెప్టెన్‌), రోవ్‌మన్‌ పావెల్‌, అష్లే నర్స్‌, కెస్రిక్‌ విలియమ్స్‌, బిషూ, మిగుయెల్‌ కమిన్స్‌.
sports
9,541
05-09-2017 22:29:51
ట్రాక్‌ మార్చి చేసిన సినిమా ఇది
‘‘కేవలం కామెడీ సినిమాలే చేస్తున్న నాకు ట్రాక్‌ మార్చమని శ్రేయోభిలాషులు చాలా మంది చెప్పారు. వాళ్లు చెప్పిన మేరకే కొత్త తరహా కథను ఎంచుకున్నా’’ అని అల్లరి నరేశ్‌ చెప్పారు. జి.ప్రజిత్‌ దర్శకత్వంలో అల్లరి నరేశ్‌, నిఖిలా విమల్‌ జంటగా నటించిన చిత్రం ‘మేడ మీద అబ్బాయి’. మలయాళంలో విజయవంతమైన ‘ఒరు ఒడక్కన్‌ సెల్ఫీ’కి రీమేక్‌ ఇది. బొప్పన చంద్రశేఖర్‌ నిర్మాత. ఆదివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక జరిగింది. షాన్‌ రెహమాన్‌ సంగీతం అందించిన ఈ చిత్రం పాటల సీడీలను నిఖిల్‌ విడుదల చేశారు. నరేశ్‌ మాట్లాడుతూ ‘‘నీలో మంచి నటుడున్నాడు. కామెడీ సినిమాలే కాకుండా ‘గమ్యం’ తరహా కథలు చెయ్యమని నానీ లాంటి స్నేహితులు చెప్పారు. నాతో ‘కెవ్వు కేక’ సినిమా తీసిన చంద్రశేఖర్‌గారు అలాగే చెప్పారు. ఆయనే అది గుర్తుంచుకుని ఈ కథతో వచ్చారు. ఈ టైటిల్‌ ఐడియా కృష్ణభగవాన్‌గారిది. 2012లో రిజిష్టర్‌ చేయించా. ఇకపై నా నుంచి భిన్నమైన కథలు వస్తాయి. ఈ నెల 8న విడుదల కానున్న ఈ చిత్రం మాతృకను మించిన హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు. తెలుగులో తొలి చిత్రమిదని దర్శకుడు ప్రజిత్‌ తెలిపారు. వినోదంతోపాటు భావోద్వేగానికి ప్రాధాన్యతనిస్తూ నరేశ్‌ చేసిన చిత్రమిదని నాని అన్నారు.
entertainment
13,831
04-01-2017 16:55:59
కావేరీ జల వివాదంపై ఫిబ్రవరి 7 నుంచి విచారణ
న్యూఢిల్లీ : కావేరి జలాల వివాదంపై ఫిబ్రవరి 9 నుంచి విచారణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు బుధవారంనాడు ప్రకటించింది. కావేరీ జలాల విషయమై ఇచ్చిన మధ్యంతర ఉత్వర్వును పొడిగిస్తూ, తదుపరి ఉత్వర్వులు వెలువరించేంతవరకూ తమిళనాడుకు రోజుకూ 2,000 క్యూసెక్కులు చొప్పున నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. జస్టిస్ దీపక్ మిశ్రా సారథ్యంలో జస్టిస్ అమితవ్ రాయ్, జస్టిస్ ఎ.ఎం.ఖాన్‌విల్కర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ తాజా ఆదేశాలు ఇచ్చింది. కావేరీ జలాల వివాదానికి తుది పరిష్కారం లభించేంతవరకూ విచారణ కొనసాగించాలని తమిళనాడు తరఫు న్యాయవాది శేఖర్ నఫ్డే కోరారు. ఇందుకు అంగీకరించిన త్రిసభ్య బెంచ్ ఫిబ్రవరి 7 నుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి మూడు వారాల పాటు విచారణ కొనసాగుతుందని పేర్కొంది. తద్వారా సమస్య పరిష్కారమయ్యేందుకు వీలుంటుందని తెలిపింది.
nation
15,419
12-10-2017 13:57:27
నేడు శశికళ బెంగుళూరు పయనం
టి.నగర్‌(చెన్నై): ఐదు రోజుల పెరోల్‌పై చెన్నై చేరుకున్న అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ పార్టీలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకనే నిరాశతో మళ్లీ జైలుకు బయలుదేరనున్నారు. బుధవారం ఆమె పెరోల్‌గడువు ముగిసింది. గ్లోబల్‌ ఆస్పత్రిలో కిడ్నీ, లివర్‌ మార్పిడి ఆపరేషన్లు చేసుకుని చికిత్స పొందుతున్న భర్త నటరాజన్‌ను పరామర్శించే నిమిత్తం 15 ఐదు రోజుల పాటు పెరోల్‌ కోరినా కర్ణాటక జైలుశాఖ అధికారులు కఠినమైన నిబంధనలతో ఐదు రోజులకే పెరోల్‌ మంజూరు చేశారు. స్థానిక టి.నగర్‌ హబీబుల్లా రోడ్డులోని బంధువు ఇళవరసి కుమార్తె నివాసగృహంలో ఆమె బసచేశారు. ప్రతిరోజూ ఉదయం షోళింగనల్లూరు సమీపంలోని గ్లోబల్‌ ఆస్పత్రికి కారులో వెళ్లి భర్త నటరాజన్‌ పరామర్శిస్తూ గడిపారు. ఆ సమయంలో తన బంధువులను మాత్రమే కలుసుకున్నారు. అంతకు మించి పార్టీ నాయకులను గానీ, అనర్హత వేటు పడిన తన వర్గం శాసనసభ్యులనుగానీ కలుసుకోలేక పోయారు. నగరంలో బసచేసిన ఐదు రోజులూ పార్టీలో నెలకొన్న సంక్షోభాన్ని చక్కదిద్దాల నుకున్నా వీలుపడలేదు. అన్నాడీఎంకే అసమ్మతి వర్గం నాయకుడు దినకరన్‌ ఒకటి రెండుసార్లు పోలీసుల అనుమతితో శశికళను కలుసుకున్నారు. ఇక త్యాగరాయనగర్‌ నివాస గృహంలో తన బంధువులతో శశికళ ఆస్తి వివాదాలపైనే సమగ్రంగా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. శశికళతో ఎనిమిది మంది మంత్రులు, 19 మంది శాసనసభ్యులు రహస్యంగా చర్చలు జరిపారని తెలుస్తోంది. వీరంతా శశికళకు సానుభూతిని మాత్రమే ప్రకటించారని, ముఖ్యమంత్రి ఎడప్పాడిని వ్యతిరేకించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారని చెబుతున్నారు. కొంత మంది శాసనసభ్యులు మాత్రం ముఖ్య మంత్రి ఎడప్పాడితో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించుకోమని సలహా ఇచ్చారని తెలిసింది. దీనితో తీవ్ర నిరాశకు గురైన శశికళ పార్టీని సంక్షోభం నుంచి గట్టెక్కించే బాధ్యత దినకరన్‌దేనని ప్రకటించి చేతులు దులుపు కున్నారు. ఇదిలా ఉండగా పార్టీ సీనియర్లు కొం దరు రహస్యంగా శశికళతో ఫోన్‌లో మాట్లాడి దినకరన్‌ తీరు సంతృప్తికరంగా లేదని ఫిర్యాదు చేశారు. సీనియర్లను పట్టించు కోవడమే లేదని, సర్వాధికారిలా వ్యవహ రిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఎడప్పాడి వర్గం లోని నాయకుల, మంత్రుల పార్టీ పదవులను వరుసగా తొలగించడం వల్ల పార్టీలో ప్రతికూల పరిస్థితులే అధిక మయ్యాయని మొర పెట్టుకున్నారు. దినకరన్‌ను మార్చి మరొకరికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని కూడా వారు సూచించారు. అంతా ఓపికగా విన్న శశికళ దినకరన్‌తో మాట్లాడి పరిస్థితిని చక్కది ద్దుతానని అంతవరకు ఓపిక పట్టమని సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక శశికళ గ్లోబల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటరాజన్‌ను చూసిరావటానికి మాజీ ముఖ్య మంత్రి జయలలిత ఉపయోగించిన లగ్జరీ కారును వాడటం చర్చనీయాంశమైంది. ఆసు పత్రి వద్ద గుమికూడిన పార్టీ కార్యకర్తల పసి బిడ్డలకు జయలలిత, జయకుమార్‌ అని నామకరణాలు చేయడం మినహా శశికళ పార్టీని చక్క దిద్దేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయ లేకపోయారు. కారణం బెయిలు నిబంధనలు కఠినంగా ఉండటమే. దీనికి తోడు శశికళ చెన్నైలో అడుగుపెట్టినప్పటి నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఇంటెలిజెన్స్‌ అధికారులు ఆమె కదలికలపై తీవ్ర నిఘా వేశారు. శశికళను రోజూ కలుసుకునేందుకు వస్తున్నవారి వివరా లను, ఆమెను కలుసుకునేందుకు ప్రయత్నిం చినవారి వివరాలను సేకరించారు. శశికళతో ఫోన్‌లో సంభాషించినవారి వివరాలను కూడా సేకరించినట్టు తెలుస్తోంది. ఇక శశికళ చెన్నై రాకతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు సంభవిస్తాయని, ప్రత్యేకించి ఎడప్పాడి వర్గంలో గుబులు కలిగిస్తుందని అటు దినకరన్‌ వర్గం ఇటు ఎడప్పాడి వర్గం అనుకున్నా, చివరకు ఎలాంటి సందడి లేకనే శశికళ పెరోల్‌ గడువు ముగిసింది. గురువారం సాయంత్రం ఐదు గంటలలోపున ఆమె బెంగుళూరు పరపన అగ్రహారం జైలుకు చేరుకోనున్నారు.
nation
4,811
15-02-2017 00:05:59
సినిమా చూసి నాన్న కౌగలించుకున్నారు: సూర్య
‘‘చాలా రోజుల క్రితం ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుకలో నాన్నను నేను, కార్తీ కౌగలించుకున్నాం. మళ్లీ ఇప్పుడు ఈ సినిమా చూసి నాన్న నన్ను కౌగలించుకోవడం ఉద్వేగాన్ని కలిగించింది’’ అన్నారు సూర్య. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘యస్‌ 3.. యముడు 3’. హరి దర్శకత్వం వహించారు. తెలుగులో మల్కాపురం శివకుమార్‌ విడుదల చేసిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో సూర్య మాట్లాడుతూ ‘‘ఇది నాకు చాలా ముఖ్యమైన సినిమా. ‘సింగమ్‌’ బ్రాండ్‌ అభిమానులతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా ఆదరిస్తుండటం వల్లే సినిమా ఈ స్థాయి విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్‌ కలెక్షన్లను మించి ప్రజల ఆదరణ, ఆత్మీయతను మర్చిపోలేను. మొదటిసారి విడుదల తేదీ ప్రకటించిన తర్వాత ఏదో ఒక అవాంతరం రావడం, వాయిదా వేయడం, ఇలా వంద రోజుల్లో నాలుగైదుసార్లు వాయిదాపడి విడుదలైన సినిమాకు ఇంత చక్కని స్పందన రావడంతో ఈ సినిమాతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. ఇందులోని డైలాగ్స్‌కు, ఎమోషనల్‌ సీన్సకు ప్రేక్షకులు బాగా కనెక్టవుతున్నారు. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్లు ఈ సినిమా చూసి మెచ్చుకుంటుంటే నా బాధ్యత మరింత పెరిగిందనిపిస్తోంది. దర్శకుడు హరితో పన్నెండేళ్లుగా ప్రయాణం చేస్తున్నాను. సినిమా తీసేప్పుడు ఆయన అంకితభావం చూసి ఎంతో నేర్చుకున్నా. ఆ సమయంలో పూర్తి శాకాహారిగా మారిపోయి ఓ నిష్ఠతో సినిమా తీస్తారు. ప్రస్తుతం నేను విఘ్నేశ శివన దర్శకత్వంలో ‘తాన సెరెంద కూట్టమ్‌’ సినిమా చేస్తున్నా. తెలుగులో టైటిల్‌ ఇంకా అనుకోలేదు. కీర్తి సురేశ హీరోయినగా చేస్తోంది’’ అని చెప్పారు. దర్శకుడు హరి మాట్లాడుతూ ‘యస్‌ 3’ తెలుగులోనూ పెద్ద హిట్టవడం సంతోషంగా ఉందన్నారు. ఐదేళ్ల తర్వాత ‘సింగమ్‌ 4’ చేస్తాననీ, ప్రస్తుతం విక్రమ్‌తో ‘సామి’కి సీక్వెల్‌ ప్లాన చేస్తున్నాననీ తెలిపారు. అనివార్య కారణాల వల్ల ఆలస్యంగా విడుదలైనప్పటికీ ‘యస్‌ 3’ని ప్రేక్షకులు ఆదరిస్తున్న తీరుకు చాలా ఆనందంగా ఉందని నిర్మాత శివకుమార్‌ చెప్పారు.
entertainment
15,236
10-11-2017 10:22:56
గుజరాత్ తీరంలో పాకిస్తాన్ బోట్లు స్వాధీనం
న్యూఢిల్లీ: గుజరాత్ తీరంలో సంచరిస్తున్న ఐదు పాకిస్తానీ బోట్లను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) స్వాధీనం చేసుకుంది. శుక్రవారం ఉదయం భుజ్ సమీపంలో సరిహద్దు దాటి వచ్చిన ముగ్గురు జాలర్లను కూడా అరెస్టు సైనికులు చేశారు. భారత్-పాకిస్తాన్ సరిహద్దును ఆనుకుని ఉన్న నిలువుదారి హరామీ నాలా గుండా చొరబడిన జాలర్లను బీఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోని తీసుకున్నారు. ఇలా మరికొందరు ప్రవేశించి ఉండవచ్చునని భావిస్తున్న బీఎస్ఎఫ్.. గాలింపు తీవ్రతరం చేసింది. గత నెలలో కూడా గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఓ పాకిస్తాన్ జాలరి సరిహద్దు దాటి రావడంతో అతడిని అరెస్టు చేసి, బోటును స్వాధీనం చేసుకున్నారు.
nation
20,237
12-04-2017 01:35:40
ఆసియా స్కూల్‌ హాకీ విజేత భారత్
భోపాల్‌: భారత జట్టు ఆసియా పాఠశాలల హాకీ చాంపియన్‌గా నిలిచింది. మలేసియాతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారత 5-1 గోల్స్‌ తేడాతో విజయం సాధించింది.
sports
10,296
02-02-2017 12:18:11
చిరు,ఎన్టీఆర్ వల్ల కాజల్‌కు దక్కిందేమిటి..?
ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించాలంటే కేవలం గ్లామర్ మాత్రమే ఉంటే సరిపోదు. అందంతో పాటు అందుకు అదృష్టం కూడా తోడవ్వాలి. కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ రేంజ్‌ను ఎంజాయ్ చేస్తున్న కాజల్‌కు లక్ బాగా ఉందని... ఆమె కెరీర్ గ్రాఫ్‌ను బట్టి అర్థమవుతోంది. లేటెస్ట్‌గా ఆమె తెలుగులో మరోసారి నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించుకోవడంతో... అమ్మడి కెరీర్‌కు ఇప్పుడప్పుడే వచ్చిన ముప్పేమీ లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.  లేటేస్ట్‌గా ఓ మీడియా సంస్థ నిర్వహించిన ఆన్‌లైన్ ఓటింగ్‌లో 2016 మోస్ట్ డిజైరబుల్ విమెన్ ఆఫ్ ది ఇయర్‌గా కాజల్‌కే ఎక్కువ ఓట్లు వచ్చాయట. గతేడాది పవన్ కళ్యాణ్ సరసన 'సర్దార్ గబ్బర్ సింగ్', మహేశ్ సరసన 'బ్రహ్మోత్సవం' వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది కాజల్. అయితే ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా బోల్తా కొట్టడంతో ముద్దుగుమ్మ పనైపోయిందనే ప్రచారం జరిగింది.                   కానీ... ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ మూవీ 'జనతా గ్యారేజ్'లో ఐటం సాంగ్ చేసిన కాజల్... ఎవరూ ఊహించని విధంగా మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. దీనికి తోడు చిరంజీవి రీ ఎంట్రీ మూవీ 'ఖైదీ నంబర్ 150'లో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకోవడం కూడా కాజల్ టాప్ పొజిషన్‌కు చేరుకోవడానికి హెల్ప్ అయ్యింది. మొత్తానికి లాస్ట్ ఇయర్ సత్తా చాటుకున్న ఈ అందాల భామ... ఈ ఏడాది కూడా అదే జోరును కొనసాగిస్తుందా... అన్నది తెలియాలంటే... మరికొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే.
entertainment
13,641
20-12-2017 04:16:32
హిమాచల్‌ సీఎం రేసులో నడ్డా, జైరామ్‌
షిమ్లా, డిసెంబరు 19: హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. కానీ.. సుజన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రేమ్‌ కుమార్‌ ధూమల్‌ మాత్రం ఓడిపోయారు. దీంతో ఇప్పుడిక్కడ సీఎం ఎవరనేది ఆసక్తిగా మారింది. అయితే కేంద్రమంత్రి జగత్‌ ప్రకాష్‌ నడ్డాతోపాటు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జైరామ్‌ ఠాకూర్‌ సీఎం రేసులో ఉన్నారు. సీఎం అభ్యర్థిపై బీజేపీ ఇంకా ఎలాంటి ప్రకటనా చేయనప్పటికీ.. నడ్డావైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాగా.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమిపాలవడంతో వీరభద్ర సింగ్‌ ముఖ్యమంత్రి పదవికి మంగళవారం రాజీనామా చేశారు.
nation
17,288
20-05-2017 03:00:10
సతతహరిత విప్లవం అవసరం
2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి కృషి వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌పై పుస్తకాల ఆవిష్కరణ ప్రధాని నరేంద్ర మోదీన్యూఢిల్లీ: సతతహరిత విప్లవంతో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాల్‌ను అధిగమించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ‘మనం ఇప్పటికీ హరిత విప్లవం-1, 2 గురించే మాట్లాడుతూ ఉన్నాం. వ్యవసాయ రంగంలో సవాళ్లు మాత్రం అలాగే ఉన్నాయి. సతతహరిత విప్లవం మన లక్ష్యం కావాలి. సమృద్ధిగా వ్యవసాయోత్పత్తులు సాధించాల’ని అన్నారు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామి నాథన్‌పై రెండు భాగాలుగా ప్రచురించిన పుస్తకాలను (ది క్వెస్ట్‌ ఫర్‌ ఏ వరల్డ్‌ వితవుట్‌ హంగర్‌) శుక్రవారం తన నివాసంలో మోదీ ఆవిష్కరించారు. 2022 నాటికి.. దేశం 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకునే సమయానికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న కలను నిజం చేసే దిశగా తమ ప్రభుత్వం కృషి సాగిస్తోందని చెప్పారు. దీనిపై స్వామినాథన్‌ తనకు కొన్ని సూచనలు చేశారని, వాటిపై కసరత్తు చేస్తున్నానని తెలిపారు. ‘ఆహార భద్రత’ స్థాయి నుంచి ‘పౌష్టికాహార భద్రత’కు ఆలోచన మారాల్సిన అవసరం ఉందని, దీనికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని అన్నారు. దేశంలో వివిధ ప్రాంతాల మధ్య ఆర్థిక అసమతుల్యతలపై దృష్టి సారించవలసి ఉందని, ఇటువంటి పరిస్థితులు ఉంటే దేశం ముందుకుపోలేదని చెప్పారు. పారిశ్రామిక క్లస్టర్ల మాదిరిగా వ్యవసాయ క్లస్టర్లను ఏర్పాటు చేయడం ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగంలో మరిన్ని పరిశోధనల అవసరాన్ని ఆయన గుర్తు చేస్తూ తక్కువ వ్యయంతో ఎక్కువ దిగుబడి సాధించాలన్నదే లక్ష్యం కావాలని చెప్పారు. వేప పూత యూరియా వల్ల చౌర్యం తగ్గిందని, దిగుబడిపై ఎటువంటి ప్రభావం లేకుండా వినియోగం కూడా తగ్గుముఖం పట్టిందని తెలిపారు. నీటి కొరత పెద్ద సమస్య అని, కనీసం 50 ఏళ్ల ముందుచూపుతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడాకారులు, సినీ నటులు, రాజకీయ వేత్తల నుంచి స్ఫూర్తి పొందుతున్న యువత స్వామినాథన్‌ వంటి శాస్త్రవేత్తల నుంచి స్ఫూర్తి పొందడం లేదని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. స్వామినాథన్‌ మాట్లాడుతూ బెంగాల్‌ కరువు తర్వాత అటువంటి క్షామం పునరావృతం కానప్పటికీ చేయాల్సింది ఎంతో ఉందని అన్నారు.
nation
20,882
13-06-2017 04:30:36
ఇంగ్లండ్‌ జెర్సీలో వార్న్‌..!
పందెంలో ఓడిన షేనలండన్: ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్‌ షేన్ వార్న్‌.. ఇంగ్లండ్‌ టీమ్‌ జెర్సీ వేసుకునేందుకు సిద్ధమయ్యాడు. చాంపియన్స్  ట్రోఫీ సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీతో వేసిన పందెంలో షేన్ ఓడిపోయాడు. దీంతో షరతు ప్రకారం ఇంగ్లండ్‌ జెర్సీ వేసుకోనున్నట్టు వార్న్‌ ట్వీట్‌ చేశాడు. గత శనివారం చిరకాల ప్రత్యర్థులు ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ మ్యాచ్‌లో విజేత ఎవరు? అని గంగూలీ, వార్న్‌ మధ్య చర్చ జరిగింది. ఆసీస్‌తో పోల్చితే ఇంగ్లండ్‌ బలంగా ఉందని.. మోర్గాన్ సేనదే గెలుపు అని గంగూలీ అన్నాడు.          కానీ సౌరవ్‌ అభిప్రాయాన్ని వ్యతిరేకించిన వార్న్‌.. కంగారూలు నెగ్గితే ఆస్ట్రేలియా జెర్సీ వేసుకోవాలని, తనకు డిన్నర్‌ ఆర్డర్‌ చేయాలనే బెట్‌ కట్టాడు. ఇందుకు ఇరువురూ అంగీకరించారు. అయితే ఈ మ్యాచ్ లో స్మిత్ సేనపై ఇంగ్లండ్‌ 40 పరుగుల తేడాతో విజయం సాధించి. దీంతో పందెం ప్రకారం ఇంగ్లండ్‌ జెర్సీ వేసుకోనున్నట్టు వార్న్‌ తెలిపాడు.
sports
13,905
17-12-2017 02:12:54
ఆ శక్తి రాహుల్‌కు ఉంది!
 ధైర్యంగా పార్టీని నడపగలరు దేశం సవాళ్లను ఎదుర్కొంటోంది మతతత్వశక్తులు రెచ్చిపోతున్నాయివాటిని నిలువరించేందుకు త్యాగాలకు కాంగ్రెస్‌ సిద్ధమవ్వాలి ఇందిర కన్నకూతురిలా చూసుకున్నారుఅధ్యక్షురాలిగా ఇదే నా చివరి ప్రసంగం భావోద్వేగానికి గురైన సోనియాఇందిరా గాంధీ మరణించిన తర్వాత ఏడేళ్లకు రాజీవ్‌ గాంధీ హత్యకుగురయ్యారు. దీంతో జీవితంలో అన్నీ కోల్పోయిన వ్యక్తిలా మిగిలాను. ఆ పరిస్థితి నుంచి సాధారణ స్థితికి రావడానికి చాలా కాలం పట్టింది. రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నా. కానీ కాంగ్రెస్‌ పార్టీ సంక్షోభంలో ఉందని, మతతత్వశక్తులుబలపడుతున్నాయని పార్టీ నేతలు, కార్యకర్తలు విన్నవించడంతో వారి కోరిక మేరకు బలవంతంగా రాజకీయాల్లోకి వచ్చా.సోనియా గాంధీఇందిరా గాంధీ మరణించిన తర్వాత ఏడేళ్లకు రాజీవ్‌ గాంధీ హత్యకుగురయ్యారు. దీంతో జీవితంలో అన్నీ కోల్పోయిన వ్యక్తిలా మిగిలాను. ఆ పరిస్థితి నుంచి సాధారణ స్థితికి రావడానికి చాలా కాలం పట్టింది. రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నా. కానీ కాంగ్రెస్‌ పార్టీ సంక్షోభంలో ఉందని, మతతత్వశక్తులుబలపడుతున్నాయని పార్టీ నేతలు, కార్యకర్తలు విన్నవించడంతో వారి కోరిక మేరకు బలవంతంగా రాజకీయాల్లోకి వచ్చా.సోనియా గాంధీఇందిరా గాంధీ మరణించిన తర్వాత ఏడేళ్లకు రాజీవ్‌ గాంధీ హత్యకుగురయ్యారు. దీంతో జీవితంలో అన్నీ కోల్పోయిన వ్యక్తిలా మిగిలాను. ఆ పరిస్థితి నుంచి సాధారణ స్థితికి రావడానికి చాలా కాలం పట్టింది. రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నా. కానీ కాంగ్రెస్‌ పార్టీ సంక్షోభంలో ఉందని, మతతత్వశక్తులుబలపడుతున్నాయని పార్టీ నేతలు, కార్యకర్తలు విన్నవించడంతో వారి కోరిక మేరకు బలవంతంగా రాజకీయాల్లోకి వచ్చా.సోనియా గాంధీన్యూఢిల్లీ, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): ‘కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రిగా ఇది నా చివరి ప్రసంగం’ అంటూ 19 ఏళ్లపాటు కాంగ్రెస్‌ అధినేత్రిగా వ్యవహరించిన సోనియా గాంధీ తన వీడ్కోలు ప్రసంగాన్ని ప్రారంభించారు. శనివారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలను రాహుల్‌కు అప్పగించిన తర్వాత ఆమె ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ‘సుమారు 20ఏళ్ల క్రితం కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించే సమయానికి నేను తీవ్రమైన భయాందోళనతో ఉన్నాను. ఇదే వేదికపై నిలుచుని ప్రసంగిస్తున్నప్పుడు నా చేతులు వణికాయి. రాజకీయ అనుభవం లేకుండా ఎంతో చరిత్రగల పార్టీని ఎలా ముందుకు నడపాలన్న ఆందోళన ఉండేది’ అని సోనియా నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. రాహుల్‌ తనలా కాదని, ఎన్నో ఎదురుదాడులను ఎదుర్కొని బలమైన, శక్తివంతమైన వ్యక్తిగా రూపొందాడని పేర్కొన్నారు. ‘రాహుల్‌ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న విద్వేషపూరిత వ్యక్తిగత దాడులు అతన్ని మరింత బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దాయి’ అని సోనియా పేర్కొన్నారు. రాహుల్‌ ధైర్యంగా చిత్తశుద్ధితో పార్టీని ముందుకు నడపగలరన్న ధీమాను సోనియా వ్యక్తం చేశారు. దేశంలో నానాటికీ రెచ్చిపోతున్న మతతత్వశక్తులను నిలువరించేందుకు ఎలాంటి త్యాగాలకైనా పార్టీ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశం సవాళ్లను ఎదుర్కొంటోందని, అయినా కాంగ్రెస్‌ వెనకడుగు వేయబోదన్నారు. ఇందిర స్మరణలో..దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన గొప్ప కుటుంబంలో ఇందిరాగాంధీ జన్మించారని, ఆమె తనను కన్న కూతురిలా చూసుకున్నారని సోనియా పేర్కొన్నారు. ఆమె నుంచి భారతీయ సంస్కృతిని నేర్చుకున్నానని తెలిపారు. ఆమె హత్యకు గురైనప్పుడు సొంత తల్లిని కోల్పోయినంతగా బాధపడ్డానని చెప్పారు. ఇందిర మరణంతో రాజకీయాలకు దూరంగా ఉందామని, తన భర్త, పిల్లలను కూడా వాటిని దూరంగా ఉంచడానికి ప్రయత్నించానని, కానీ, తాను ఎంత చెప్పినా వినకుండా తన భర్త రాజీవ్‌ గాంధీ ప్రధానిగా బాధ్యతలు తీసుకొని దేశసేవకు సిద్ధమయ్యారని వివరించారు. పార్టీ అధ్యక్షురాలిగా తాను బాధ్యతలు తీసుకునేప్పుడు 3రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్‌ అధికారంలో ఉందని, కార్యకర్తల మద్దతుతో అనతికాలంలోనే 12కుపైగా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చామన్నారు.  2004లో కేంద్రంలో అధికారంలోకి వచ్చామని, అప్పటి నుంచి పదేళ్ల పాటు మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలో ప్రజలకు బాధ్యతాయుతమైన, ప్రగతిశీల పరిపాలనను అందించామని తెలిపారు. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌కు అభినందనలు తెలియజేశారు. పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో తనకు సహకరించిన పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కాగా, రాహుల్‌ గాంధీ ఆశావహ రాజకీయాలకు బాటలు వేస్తారని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజకీయాల్లో భయాందోళనలు నెలకొన్నాయని, ఆ పరిస్థితికి చరమగీతం పాడి ఆశావహ రాజకీయాలకు తెరదీయాల్సిన అవసరం ఉందని అన్నారు. సోనియాను శక్తివంతమైన నాయకురాలిగా అభివర్ణించారు. 2019లో రాయబరేలి నుంచే సోనియా: ప్రియాంక సోనియా గాంధీ 2019 ఎన్నికల్లో కూడా రాయబరేలి లోక్‌సభ స్థానం నుంచే పోటీ చేస్తారని ప్రియాంక గాంధీ తెలిపారు.రాయబరేలీ నుంచి తాను పోటీ చేయనున్నట్లు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. తన తల్లి ఎంతో ధైర్యవంతురాలని, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని 19 ఏళ్లపాటు కాంగ్రెస్‌ అధ్యక్షబాధ్యతలను నిర్వర్తించారని ప్రియాంక పేర్కొన్నారు. ఆశావహ రాజకీయాలకుతెరదీయాలి: మన్మోహన్‌ రాహుల్‌ గాంధీ ఆశావహ రాజకీయాలకు బాటలు వేస్తారని మన్మోహన్‌ సింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో భయాందోళనలు నెలకొన్నాయని, ఆ పరిస్థితికి చరమగీతం పాడాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ చరిత్రలో రాహుల్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ మరింత ఎత్తుకు ఎదుగుతుందని అన్నారు. సోనియా నాయకత్వ పటిమపై మన్మోహన్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ఆశావహ రాజకీయాలకుతెరదీయాలి: మన్మోహన్‌ రాహుల్‌ గాంధీ ఆశావహ రాజకీయాలకు బాటలు వేస్తారని మన్మోహన్‌ సింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో భయాందోళనలు నెలకొన్నాయని, ఆ పరిస్థితికి చరమగీతం పాడాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ చరిత్రలో రాహుల్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ మరింత ఎత్తుకు ఎదుగుతుందని అన్నారు. సోనియా నాయకత్వ పటిమపై మన్మోహన్‌ ప్రశంసల వర్షం కురిపించారు.ఆశావహ రాజకీయాలకుతెరదీయాలి: మన్మోహన్‌ రాహుల్‌ గాంధీ ఆశావహ రాజకీయాలకు బాటలు వేస్తారని మన్మోహన్‌ సింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో భయాందోళనలు నెలకొన్నాయని, ఆ పరిస్థితికి చరమగీతం పాడాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ చరిత్రలో రాహుల్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ మరింత ఎత్తుకు ఎదుగుతుందని అన్నారు. సోనియా నాయకత్వ పటిమపై మన్మోహన్‌ ప్రశంసల వర్షం కురిపించారు.
nation