SNo
int64
0
21.6k
date
stringdate
2017-01-01 01:34:20
2017-12-31 23:58:37
heading
stringlengths
3
91
text
stringlengths
13
38.7k
label
stringclasses
5 values
13,429
14-07-2017 16:52:26
ప్రపంచంలో నెం.1 స్థానంలో మోదీ ప్రభుత్వం
న్యూఢిల్లీ : ప్రభుత్వాలను ప్రజలు నమ్ముతున్నారా? ప్రపంచంలో ఏ దేశంలోని ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉంది? తమ ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? అనే అంశాలపై ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) నిర్వహించిన అధ్యయనంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై అత్యధికులకు నమ్మకం ఉన్నట్లు వెల్లడైంది. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉన్నట్లు 73 శాతం మంది చెప్పారు. ప్రజల నమ్మకాన్ని చూరగొన్న ప్రభుత్వాల జాబితాలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో కెనడా ప్రభుత్వం ఉంది. ప్రధాన మంత్రి జస్టిన్ ట్రుడూ ప్రభుత్వంపై 62 శాతం మంది నమ్మకం ప్రకటించారు. ఎర్డోగాన్ నేతృత్వంలోని టర్కీ ప్రభుత్వంపై 58 శాతం మంది నమ్మకం వ్యక్తం చేశారు. రష్యా, జర్మనీ వరుసగా 4, 5 స్థానాల్లో నిలిచాయి. ప్రధాన మంత్రి థెరెసా మే నేతృత్వంలోని బ్రిటన్ ప్రభుత్వంపై 41 శాతం మంది విశ్వాసం కనబరిచారు. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వంపై 30 శాతం మంది మాత్రమే నమ్మకం వ్యక్తం చేయడం ఆశ్చర్యకరం. ఎన్టీఆర్‌ను రాజమౌళి అంతమాటన్నాడా..! రవితేజ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
nation
16,489
15-12-2017 14:52:16
క్రికెటర్ అజింక్యా రహానే తండ్రి అరెస్ట్...
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ అజింక్యా రహానే తండ్రి మధుకర్ బాబూరావు రహానేను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఆయన డ్రైవ్ చేస్తున్న కారు ఓ మహిళను ఢీకొట్టడడంతో కొల్హాపూర్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రహానే తండ్రి, ఆయన కుటుంబ సభ్యులతో కలిసి 4వ నంబరు జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కంగల్ ప్రాతానికి రాగానే ఆయన డ్రైవ్ చేస్తున్న హుందాయ్ కారుపై నియంత్రణ కోల్పోవడంతో ఆశాతాయ్ కాంబ్లీ అనే మహిళను బలంగా ఢీకొట్టింది. బాధితురాలికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. రహానే తండ్రిని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. దీంతో పోలీసులు మధుకర్‌ రహానే‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
nation
10,768
24-11-2017 22:31:50
నో డ్యూయెట్స్‌.. నో రొమాన్స్‌!
‘శివ’ చిత్రంతో తెలుగు చిత్రపరిశ్రమలో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ 28 ఏళ్ల తర్వాత మళ్లీ నాగార్జునతో చేస్తున్న సినిమా మీదే దృష్టి పెట్టారు. నాగార్జున పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమా టెక్నికల్‌గా కూడా హై స్టాండర్డ్స్‌లో ఉండేందుకు ఆయన కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతుంది. తదుపరి షెడ్యూల్‌ ముంబైలో ఉంటుంది. ఈ సినిమాలో డూయెట్లు కానీ, లవ్‌ సీన్లు కానీ ఉండవని అంటున్నారు. అయితే ఓ ఐటెం సాంగ్‌ మాత్రం ఉంటుందని చెబుతున్నారు. సినిమాలో ఓ ప్రముఖ హీరోయిన్‌ నటిస్తుందనీ, అయితే ఆమెకు నాగార్జునతో లవ్‌ ట్రాక్‌ ఉండదని యూనిట్‌ వర్గాలు వెల్లడించాయి. ఆ హీరోయిన్‌ పాత్ర జనవరిలో కానీ, ఫిబ్రవరిలో కానీ జరిగే షెడ్యూల్‌లో ఎంటరవుతుందని అంటున్నారు. ఈ పాత్రకు అనుష్కను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అదే నిజమైతే ‘బాహుబలి’ తర్వాత ఆమె కమిట్‌ అయ్యే సినిమా ఇదే అవుతుంది.
entertainment
1,010
14-04-2017 01:41:25
యుఎస్‌ మార్కెట్‌ నుంచి డాక్టర్‌ రెడ్డీస్‌: మతిమరుపు ఔషధం వెనక్కి
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మతిమరుపు వ్యాధి చికిత్సలో వినియోగించే రివాటిజిమైన్ ట్రార్‌ట్రేట్‌ క్యాపూల్స్‌కు చెందిన 1728 బాటిళ్లను అమెరికా మార్కెట్‌ నుంచి రీకాల్‌ చేసినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబోరేటరీస్‌ తెలిపింది. ఇతర ఔషధాలతో క్రాస్‌ కంటామినేషన్‌ కారణంగా ఈ ఉత్పత్తులను వెనక్కు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఆరోగ్యపరంగా అవాంతరాలు తలెత్తరాదనే ఉద్దేశంతో యుఎస్ఎఫ్‌డీఏ క్లాస్‌ 3కి అనుగుణంగా వీటిని ఉపసంహరించుకున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ తెలిపింది.
business
8,145
09-07-2017 00:19:16
వివాహితపై అత్యాచారం..
మమ్ముట్టి, నయనతార జంటగా నటించిన ‘పుదియ నియమం’ చిత్రం ‘వాసుకి’ టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఎస్‌.కె.సాజన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్‌.ఆర్‌.మోహన్‌ తెలుగులోకి అనువదిస్తున్నారు. శనివారం ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను దామోదర ప్రసాద్‌ ఆవిష్కరించారు. ‘‘మహిళా ప్రాధాన్యం ఉన్న పాత్రలకు ఒకప్పుడు విజయశాంతి ఉన్నట్లు, ఇప్పుడు అనుష్క, నయనతార ఉన్నారు. ‘వాసుకి’ చిత్రంలో మంచి కథ, కథనం, సంగీతం ఉన్నాయి. తప్పకుండా మంచి విజయం అందుకుంటుంది’’ అని దాము అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘అత్యాచారానికి గురైన ఓ వివాహిత.. తన భర్తకు తెలియకుండా నిందితులకు ఎలా బుద్ధి చెప్పింది? అప్పటి వరకు రహస్యంగా ఉందనుకున్న ఆ విషయం.. తన భర్తకు తెలిశాక ఆ జంట మధ్య ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వారి జీవితం ఎలా సుఖవంతం అయింది’ అన్న ఇత్తివృత్తంతో రూపొందిన సినిమా ఇది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 21న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అని చెప్పారు.
entertainment
16,597
09-01-2017 15:13:34
చైనాకు భారత్ చెక్... వియత్నాంకు 'ఆకాష్' క్షిపణులు
న్యూఢిల్లీ: శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న సూక్తితో పాకిస్తాన్‌కు అంతకంతకూ దగ్గరవుతున్న చైనాకు ధీటైన జవాబిచ్చేందుకు భారత్ అడుగులు వేస్తోంది. ఇందుకు అనుగుణంగా చైనాతో విభేదిస్తున్న వియత్నాంకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆకాష్ క్షిపణి వ్యవస్థల అమ్మకంపై భారత్ చర్చలు సాగిస్తోంది. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఆకాష్ క్షిపణి సునాయాసంగా ఛేదిస్తుంది. ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో చైనా దూకుడును నిలువరించాలంటే వియత్నాంకు సాయపడాలన్నదే భారత్ ఆలోచనగా చెబుతున్నారు. 48 దేశాల అణు సరఫరా దేశాల గ్రూపులో (ఎన్ఎస్‌జీ) భారత్ చేరికను చైనా కొద్దికాలంగా అడ్డుకుంటోంది. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ ఐక్యరాజ్యసమితికి భారత్ చేసిన విజ్ఞప్తికి కూడా చైనా అడ్డుతగులుతూ వస్తోంది. ఈ తరుణంలో వియత్నాంతో వ్యూహాత్మక సైనిక ఒప్పందం ద్వారా చైనా ఎత్తుకు పైఎత్తు వేయాలన్నది భారత్ యోచనగా తెలుస్తోంది. 25 కిలోమీటర్ల పరిధిలోని శత్రు విమానాలు, హెలికాప్టర్లు, క్షిపణులు, డ్రోన్‌లను కూల్చే సామర్థ్యం ఆకాష్ క్షిపణులకు ఉందని, వీటిని వియత్నాంకు అందించేందుకు చర్చలు జరుగుతున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇండియా గతంతో బ్రహ్మోస్ సూపర్ క్రూయిస్ మిసైల్స్, యాంటీ సబ్‌మెరైన్ టోర్పెడోలైన 'వారుణాస్త్ర'ను వియత్నాంకు భారత్ ఆఫర్ చేసింది. అలాగే, వియత్నాం కొనుగోలు చేసిన సుఖోయ్-30 ఎంకేఐ ఫైటర్ జెట్సె‌ పైలట్స్‌కు ఈ ఏడాది నుంచి శిక్షణ ఇచ్చేందుకు కూడా భారత్ అంగీకరించింది. కాగా, వియత్నాంతో ద్వైపాక్షిక, రక్షణ సహకారం మరింత పెంచుకునేందుకు తాము సుముఖంగా ఉన్నాయని, భారత్‌కు వియత్నాం సన్నిహిత స్నేహితుడని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. వియత్నాం దళాల సైనిక సామగ్ర అప్‌గ్రేడ్ చేయడం, ఫైటర్లు, సబ్‌మెరైన్ల వినియోగంలో వారికి శిక్షణ ఇవ్వడం విషయంలోనూ భారత్ సహకరిస్తుందన్నారు. ఆకాష్ క్షిపణుల సేకరణకు వియత్నాం ఎంతో ఆసక్తి చూపుతోందని, టెక్నాలజీ బదలాయింపు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సంయుక్త తయారీకి కూడా ఆసక్తి చూపుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి.
nation
19,932
15-04-2017 01:45:37
ప్రీ క్వార్టర్స్‌కు శరత్ కమల్‌
ఆసియా టీటీ చాంపియన్‌షిప్స్‌ఉక్సీ (చైనా): ఆసియా టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత క్రీడాకారుడు శరత్ కమల్‌ ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన రౌండ్‌-32 మ్యాచ్‌లో శరత్ 11-5, 11-7, 14-12తో రొ క్వాంగ్‌ జిన్‌ (కొరియా)పై నెగ్గాడు. ప్రీ క్వార్టర్స్‌లో లమ్‌ సు హంగ్‌ (హాంకాంగ్‌)తో కమల్‌ తలపడనున్నాడు. కాగా, సౌమ్యజిత్ ఘోష్‌, హర్మీత్ దేశాయ్‌, సనిల్‌ షెట్టి రౌండ్‌-32లోనే ఓడి ఇంటి ముఖం పట్టారు. ఘోష్‌ 3-11, 4-11, 5-11తో కొకి నవా (జపాన్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు.
sports
21,176
08-10-2017 02:15:38
సానియా జోడీ ఓటమి
బీజింగ్‌: చైనా ఓపెన్‌లో భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా జోడీ పోరాటం ముగి సింది. శనివారం జరిగిన డబుల్స్‌ సెమీఫైనల్లో మూడో సీడ్‌ సానియా-షూ పెంగ్‌ (చైనా) ద్వయం 6-2, 1-6, 5-10తో టాప్‌సీడ్‌ మార్టినా హింగిస్‌-చాన్‌ యుంగ్‌ జాన్‌ (తైవాన్‌) చేతిలో పరాజయం పాలైంది.
sports
21,184
24-04-2017 18:35:20
పరుగుపందెంలో గోల్డ్ మెడల్ గెలిచిన 101 ఏళ్ల భారతీయ వృద్ధురాలు
అక్లాండ్: న్యూజీలాండ్‌లోని ఆక్లాండ్‌లో వరల్డ్ మాస్టర్స్ గేమ్స్‌ నిర్వహించిన 100 మీటర్ల పరుగుపందెంలో భారత్‌కు చెందిన 101 ఏళ్ల మాన్ కౌర్ బంగారు పతకాన్ని గెలుచుకుంది. 17వ సారి నిర్వహిస్తున్న ఈ పోటీల్లో మాన్ కౌర్ 100 మీటర్ల పరుగుపందాన్ని 1 నిమిషం 14 సెకన్లలో(74 సెకన్లలో) పూర్తిచేసింది. ప్రపంచ పరుగుల రారాజు హుస్సేన్ బోల్ట్ 100 మీటర్ల పరుగుపందాన్ని పూర్తిచేయడానికి 64.42 సెకన్లు పడితే.. 101 ఏళ్ల కౌర్‌ 74 సెకన్లలోనే పూర్తిచేయడం విశేషం. వందేళ్ల వయసులోనూ ఏమాత్రం పట్టుతప్పకుండా 100 మీటర్ల పరుగుపందాన్ని ఎనలేని ఉత్సాహంతో పూర్తిచేసింది కౌర్. పరుగు మొదలుపెట్టినప్పుడు ఏవిధంగా అయితే ఉందో.. లక్ష్యాన్ని చేరుకున్నాక కూడా అదే ఉత్సాహం ఆమెలో కనిపించింది. వరల్డ్ మాస్టర్ గేమ్స్‌లో 25 వేల మంది పాల్గొనగా.. 100 ఏళ్లు దాటిని ఏకైన మహిళ మన్ కౌర్ కావడం విశేషం. రేసులో విజయం సాధించిన అనంతరం కౌర్ మాట్లాడుతూ.. ఈ రేసులో గెలుపొందడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది. పరుగెత్తడానికీ తానెప్పుడూ సిద్ధంగానే ఉన్నాననంది. ఇలాంటి మరిన్ని ఈవెంట్లలో పాల్గొని విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. కొడుకు గురుదేవ్ సింగ్ సహకారంతో అథ్లెట్‌గా మారిన కౌర్.. డైట్ విషయంలో చాలా కఠినంగా ఉంటుందట. గోదుమ గడ్డితో చేసిన జ్యూస్, గ్లాస్ పాలు ప్రతిరోజూ తాగుతుందట. మరోవైపు కౌర్‌పై న్యూజీలాండ్ వాసులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. అందరికీ ఆరద్శంగా నిలిచిందని, చత్తీస్‌ఘడ్ నుంచి వచ్చిన సంచలనం అని పేర్కొంటున్నారు. కాగా, జపాన్‌కు చెందిన 106 ఏళ్ల హిడెకిచి మియాజాకి 100 మీటర్ల పరుగుపందాన్ని 29.83 సెకన్లలో పూర్తిచేసి ‘గోల్డెన్ బోల్ట్’గా పేరుపొందింది. ఫ్రెంచ్‌కి చెందిన 105 ఏళ్ల రాబర్ట్ మర్చండ్ సెక్లింగ్‌లో 22.547 కిలోమీటర్ల దూరాన్ని ఒక గంటలో పూర్తిచేశాడు.
sports
14,243
16-12-2017 02:00:21
ఇక ‘వేడుకో’వద్దు!
‘ఐ బెగ్‌ టు’ పదాన్ని వాడొద్దని సూచన..రాజ్యసభలో తొలిరోజే వెంకయ్య మార్క్‌న్యూఢిల్లీ, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): చమత్కారం.. ఆగ్రహం.. పట్టుదల.. సూచనలు.. కఠినత్వం.. ఇలా సందర్భాన్ని బట్టి అన్ని భావోద్వేగాలను సమపాళ్లలో వాడుతూ పెద్దల సభను హుందాగా నడిపారు వెంకయ్యనాయుడు. రాజ్యసభ చైర్మన్‌గా తొలి రోజే ఆయన తనదైన శైలిలో వ్యవహరించారు. వలసపాలన అవశేషంగా మిగిలిపోయిన ‘ఐ బెగ్‌ టు’ (నేను వేడుకుంటున్నా) అనే పదానికి చరమగీతం పాడారు. ఇకపై ఆ పదాన్ని వాడొద్దని సూచించి సభ్యుల ప్రశంసలు అందుకున్నారు. శుక్రవారం పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో మంత్రులు, సభ్యులు ఏదైనా అంశంపై మాట్లాడాలన్నా, ఏవైనా పత్రాలను సభలో ప్రవేశపెట్టాలనుకున్నా చైర్మన్‌ను ఉద్దేశించి ‘ఐ బెగ్‌ టు..’ అని మొదలుపెడతారు. కొత్తగా నియమితులైన రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ ఓ సందర్భంలో ‘ఐ బెగ్‌ టు’ అనే పదాన్ని వాడారు. స్పందించిన వెంకయ్య.. ఇకపై ఆ పదాన్ని వాడొద్దన్నారు. దాని స్థానంలో ‘ఐ రైజ్‌ టు సే’(నేను ఓ అంశాన్ని చెప్పేందుకు లేచాను) అని వాడాలని సూచించారు. ఐ బెగ్‌ టు అనేది వలస పాలన నాటిదని, స్వతంత్ర భారతంలో ఎవరినీ వేడుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అలాంటి పదాలు వాడొద్దని వెంకయ్య స్పష్టం చేశారు. మరోవైపు ఎవరైనా మాజీ సభ్యులు, సభ్యులు మరణిస్తే చైర్మన్‌ సంతాప సందేశాన్ని చదవుతారు. దీన్ని కూడా ఇతర చైర్మన్లలా కాకుండా వెంకయ్య లేచి నిలబడి చదివారు. తొలిరోజే ఇలా రెండు కొత్త సంప్రదాయాలకు తెరతీశారు. చమత్కారం.. హాస్యం..శరద్‌ యాదవ్‌, అన్వర్‌ అలీలపై అనర్హత వేటు వేయడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ఎంపీలు వెల్‌లోకి వచ్చి నినాదాలు చేస్తుండగా వెంకయ్య ‘ఆల్‌ ఇన్‌ వెల్‌.. నాట్‌ వెల్‌ ’ అని చమత్కరించారు. అలాగే, ఓ ఎంపీ పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తి ఏదో మాట్లాడుతుండగా.. ఆయన లేవనెత్తిన అంశంలో ‘పాయింటూ’ లేదు ‘ఆర్డరూ’ లేదు అని వెంకయ్య అనడంతో సభలో నవ్వులు విరిశాయు. మరో సందర్భంలో వెంకయ్య డీఎంకే ఎంపీ తిరుచ్చి శివను పిలిచారు. అప్పుడాయన సభలో లేకపోవడంతో ‘శివ (దేవుడు) అంతటా ఉంటాడు. కానీ, ఇక్కడ లేరు’ అని చమత్కరించారు. ‘నేమ్‌ అండ్‌ షేమ్‌’ అమలుసభను సజావుగా నడిపించడానికి వెంకయ్య కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆయన ఓ సదస్సులో మాట్లాడుతూ.. సభను పదేపదే అడ్డుకునేవారిని కట్టడి చేయడానికి ‘నేమ్‌ అండ్‌ షేమ్‌’ విధానాన్ని ప్రతిపాదించారు. అంటే సభను అడ్డుకుంటున్న వారిని పేరుపెట్టి పిలవడం. శుక్రవారం ఆ విధానాన్ని అమలు చేసినట్లు కనిపించింది. ఓ ఎంపీ గట్టిగా మాట్లాడుతూ సభను అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. రెండు మూడు సార్లు ఆయన్ను పేరుపెట్టి పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేమ్‌ అండ్‌ షేమ్‌’ అమలుసభను సజావుగా నడిపించడానికి వెంకయ్య కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆయన ఓ సదస్సులో మాట్లాడుతూ.. సభను పదేపదే అడ్డుకునేవారిని కట్టడి చేయడానికి ‘నేమ్‌ అండ్‌ షేమ్‌’ విధానాన్ని ప్రతిపాదించారు. అంటే సభను అడ్డుకుంటున్న వారిని పేరుపెట్టి పిలవడం. శుక్రవారం ఆ విధానాన్ని అమలు చేసినట్లు కనిపించింది. ఓ ఎంపీ గట్టిగా మాట్లాడుతూ సభను అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. రెండు మూడు సార్లు ఆయన్ను పేరుపెట్టి పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు.
nation
21,510
15-01-2017 19:18:22
కోహ్లీకి పోటీగా బ్యాటింగ్ చేస్తున్న కేదార్ జాదవ్..
పూణె: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్‌లో టీమిండియా నిలకడగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. 351 పరుగుల భారీ విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు ఆదిలోనే టాప్ ఆర్డర్‌ను కోల్పోయింది. శిఖర్ ధావన్, లోకేష్ రాహుల్, యువరాజ్, ధోనీలు వరుసగా తక్కువ పరుగులకే ఔటయ్యారు. అయినప్పటికీ కోహ్లీ ఒంటరి పోరాటం చేస్తూ తన వన్డే కెరీర్‌లో 39వ అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. అయితే కోహ్లీతో పాటు క్రీజ్‌లో ఉన్న కేదార్ జాదవ్ కెప్టెన్‌కు పోటీగా బ్యాటింగ్ చేస్తున్నాడు. చాలా క్లాస్‌గా బ్యాటింగ్ చేస్తూ కోహ్లీ ఒంటరి కాదన్న భావన కలిగిస్తున్నాడు. 21 బంతుల్లోనే 39 పరుగులు చేసి చెలరేగుతున్నాడు. ప్రస్తుతం భారత స్కోర్ 19 ఓవర్లకు 125. మ్యాచ్ గెలిచేందుకు ఇంకా 226 పరుగులు చేయాల్సి ఉంది.
sports
11,825
11-11-2017 15:45:28
‘మహా’ ప్రభుత్వానికి చుక్కలుచూపించిన రైతు!
ముంబై: మహారాష్ట్రలో సచివాలయంలో శుక్రవారం సాయంత్రం హైడ్రామా జరిగింది. సచివాలయంలోని మంత్రాలయ బిల్డింగ్ ఏడో అంతస్తు ఎక్కి దూకెస్తానంటూ ఓ యువ రైతు సిబ్బందిని బెదిరించాడు. నిన్న సాయంత్రం నాలుగు గంటల నుంచి దాదాపు రెండు గంటల పాటు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి ముచ్చమటలు పట్టించాడు. మరాఠ్వాడాలోని ఉస్మానాబాద్ జిల్లాకు చెందిన జ్ఞానేశ్వర్ సాల్వే అనే రైతు వ్యవసాయ మంత్రిత్వ శాఖలో ఓ పనికోసం వచ్చినట్టు సచివాలయం సిబ్బందికి చెప్పి లోపలికి ప్రవేశించాడు. తర్వాత సచివాలయం ఏడో అంతస్తులోకి చేరుకొని కిటికిలోంచి బాల్కనీలోకి దూకి అక్కడి నుంచి దూకేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. తమ ప్రాంతాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, తమ ప్రాంతంలో స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశాడు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఫోన్‌లో మాట్లాడించాలని సాల్వే కోరాడు. కాగా జ్ఞానేశ్వర్‌ను రక్షించేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చాలా శ్రమపడ్డారు. జ్ఞానేశ్వర్‌కు ఎటువంటి హానీ జరుగకుండా అగ్నిమాపక సిబ్బంది కింద వలలు పట్టుకొన్నారు. పోలీసుల సూచన మేరకు వాళ్లతో మాట్లాడేందుక సాల్వే అంగీకరించాడు. ఓ చీటీపై జ్ఞానేశ్వర్ తన ఫోన్ నెంబర్ రాసి ఇవ్వగా.. పోలీసులు అతనితో ఫోన్‌లో మాట్లాడి బుజ్జగించారు. ఎట్టకేలకు పోలీసులు, వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారుల ప్రొద్బలంతో సాల్వే దిగొచ్చాడు. జ్ఞానేశ్వర్ నిరసను ప్రభుత్వం సానుకూలంగా తీసుకుంటుందని, అతనిపై ఎటువంటి కేసు నమోదు చేయమని మంత్రి వినోద్ తావ్డే తెలిపారు. మరఠ్వాడలో రైతుల సమస్యను పరిష్కరించేందుకు సీఎం ఫడ్నవీస్ ప్రతేక చొరవ చూపిస్తారని చెప్పారు. తాను యువరైతునని, యువకులపై ప్రభుత్వం ఏలాంటి కేసులు నమోదు చేయలేదని జ్ఞానేశ్వర్ ధీమా వ్యక్తం చేశారు. అయితే అతనిపై పోలీసులు ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేయడం విశేషం.జ్ఞానేశ్వర్ ధీమా వ్యక్తం చేశారు. అయితే అతనిపై పోలీసులు ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేయడం విశేషం.
nation
9,017
08-02-2017 11:48:56
విలన్‌గా రానున్న మరో తెలుగు స్టార్ హీరో
కొన్ని సంవత్సరాల క్రితం వరకూ శ్రీకాంత్ హీరో! ఆ తరువాత నెమ్మదిగా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారాడు. ఇప్పుడు విలన్‌ అవతారం ఎత్తబోతున్నాడు. కాకపోతే టాలీవుడ్‌లో బోలెడంత మంది విలన్లు ఇప్పటికే ఉన్నారు కనుక మాలీవుడ్‌కి వెడుతున్నాడు. మోహన్‌లాల్‌ సినిమాలో విలన్‌గా చేయబోతున్నాడు. ఇంతమంది విలన్లు ఉండగా శ్రీకాంత్‌ని తీసుకోవడంలో ఓ మెలిక ఉంది అంటున్నారు సినీజనాలు. ఈ సినిమాను టాలీవుడ్‌లో డబ్‌ చేసే అవకాశాలు ఉన్నాయట! ఆల్‌రెడీ ఉన్న విలన్లు తెర మీద బోలెడన్ని సార్లు కనిపించి బోర్‌ కొట్టించేశారు. శ్రీకాంత్ అయితే ఫ్రెష్‌గా కనిపిస్తాడని మాలీవుడ్‌ దర్శకనిర్మాతలు భావిస్తున్నారట! టాలీవుడ్‌లో శ్రీకాంత్ విలన్‌గా సక్సెస్‌ సాధిస్తే మరో మంచి విలన్‌ దొరికినట్టే అంటున్నారు సినీజనాలు. కాకపోతే సాఫ్ట్‌గా కనిపించే శ్రీకాంత్ విలనిజం పండించగలడా? అన్నదే కొందరి అనుమానం.
entertainment
18,147
11-07-2017 19:09:10
‘జీఎస్‌టీ వల్ల జర్నీ టైమ్‌ తగ్గుతోంది’
న్యూఢిల్లీ : వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వల్ల రవాణా వాహనాలకు ప్రయాణ సమయం ఆదా అవుతోంది. దేశవ్యాప్తంగా సరిహద్దుల్లో చెక్‌పోస్టులను తొలగించడంతో వాహనాల ప్రయాణ కాలం గతం కన్నా దాదాపు 20 శాతం తగ్గింది. వాహనదారులు చెప్తున్న వివరాల ప్రకారం పన్నులను విధించే అధికారులు రోడ్లపై కనిపించకపోయినా, రవాణా శాఖ అధికారులు ఏదో సాకు చూపుతూ డబ్బులు గుంజుతున్నారు. జీఎస్‌టీ అమల్లోకి రావడానికి ముందు ఢిల్లీ - ముంబై మధ్య ప్రయాణానికి నాలుగు రోజులు పట్టేది. ప్రస్తుతం మూడు రోజుల్లోనే వాహనాలు గమ్యాన్ని చేరుకోగలుగుతున్నాయి. ఢిల్లీ నుంచి చెన్నై వెళ్ళాలంటే గతంలో ఆరున్నర రోజులు పట్టేది, ఇప్పుడు 5 రోజులు సరిపోతోంది. పన్నులను విధించే అధికారులు ఎవరినీ నిర్బంధించరాదనే నిబంధన వల్ల వాహనాలు గమ్య స్థానానికి చేరడంలో జరిగే జాప్యం తగ్గడానికి దోహదపడుతోంది.
nation
4,780
28-06-2017 15:51:31
శ్రీశాంత్ వచ్చేస్తున్నాడు!
తన అగ్రెసివ్ ఆటతీరుతో క్రికె‌ట్‌లో మంచిపేరే సంపాదించుకున్నా.. పలు ఆరోపణలతో ఇండియన్ టీంకు దూరమయ్యాడు శ్రీశాంత్. ఐపీఎల్‌లో హర్భజన్ సింగ్‌తో వివాదమూ శ్రీశాంత్ కెరీర్‌లో మరచిపోలేని విషయమే. అయితే.. క్రికెట్‌కు దూరంగా ఉంటున్నా మరో దారిలో జనాలకు చేరువ అవుతున్నాడు క్రికెటర్. ఆ దారే సినిమా. శ్రీశాంత్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘టీమ్ 5’. సురేశ్ గోవింద్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని రాజ్ జఖారియన్ నిర్మిస్తున్నారు. గోపీసుందర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ జూలై 14న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు యూనిట్ ప్రకటించింది. ఐదుగురు రేసర్ల జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. శ్రీశాంత్‌కు జోడీగా నిక్కీ గల్రానీ నటిస్తోంది.
entertainment
5,522
21-12-2017 18:03:23
చిరంజీవిగారిని చూసి నా కళ్లలో నీళ్లు వచ్చాయి: నాగార్జున
‘హలో’ విడుదలకి ఒక్కరోజు మాత్రమే సమయం ఉండటంతో చిత్ర నిర్మాత నాగార్జున స్వయంగా ప్రమోషన్ కోసం రంగంలోకి దిగారు. ఈ రోజు (డిసెంబర్ 21) ఈ సినిమా గురించి మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా ఎలా వచ్చిందీ అనే విషయం ఇప్పటి వరకు చాలా సార్లు చెప్పాను. అఖిల్‌ని ఎలా చూడాలనుకున్నానో.. ఈ సినిమాలో అలా చూశాను. అలాగే కల్యాణి కూడా. ఈ సినిమా మొత్తం అదృష్టంపైనే నడుస్తుంది. అంటే లిటిల్ బిట్ ఆఫ్ మ్యాజిక్ ఉంది ఇందులో. విక్రమ్ ప్రతి సినిమాలో అది ఉంటుంది. ఈ సినిమాకి.. నాతో ‘హలో గురూ ప్రేమ కోసమేరో..’ అని పాడించిన ప్రియదర్శన్‌గారి అమ్మాయి కల్యాణి. ఆయన కూతురని ఈ సినిమాలో తీసుకోలేదు. అలాగే విక్రమ్‌కి గురువు ప్రియదర్శన్. అయినా కూడా స్ర్కీన్ టెస్ట్‌లన్నీ చేసే తీసుకున్నాం. విక్రమ్ ఏదీ అంత సామాన్యంగా వదలడు. కొత్త అమ్మాయి అయినా ఈ సినిమాలో అద్భుతంగా చేసింది. ఈ సందర్భంగా ప్రియన్‌కి ధన్యవాదాలు. ఇక నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ చాలా చక్కగా జరిగింది. నాకే చూడడానికి చాలా బాగుంది అనిపించింది. అఖిల్ డ్యాన్స్‌లు చూస్తుంటే ముచ్చటేసింది. ఇక చిరంజీవిగారిని అఖిల్‌ని ఆశీర్వదించడానికి రమ్మని అగడగానే.. ఆయన వస్తాను అన్నారు. కానీ సినిమా చూశాక.. మీకు నచ్చితేనే రండి.. అని చెప్పి సినిమా చూపించాను. సినిమా నచ్చితేనే వచ్చి.. ఆశీర్వదించడండి. నచ్చకపోతే వద్దు అని చెప్పాను. సినిమా చూశాక నాకు కళ్లలో నీళ్లు వచ్చాయి. సినిమాలో విషయంని బట్టి వచ్చిన నీళ్లు కాదు. సినిమా చూశాక..  అఖిల్‌ని హగ్ చేసుకుని చిరంజీవిగారు రెండు నిమిషాలు మాట్లాడలేకపోయారు. ఆయన కళ్లలో నీళ్లు చూశాను. అది చూసి నాకు కళ్లలో నీళ్లు వచ్చేశాయి. అప్పటి వరకు ఎంతో టెన్షన్‌తో ఉన్న నాకు అది చూశాక.. పెద్ద బరువు దిగిపోయినట్లయింది.  ఆ తర్వాత వేడుకకి వచ్చి.. అఖిల్‌ని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయనకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే రామ్ చరణ్‌కి కూడా. అఖిల్, చరణ్ వాళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఇక మెగా అభిమానులు ఈ ఫంక్షన్‌కి వచ్చి అఖిల్‌ని ఆశీర్వదించడం అనేది చాలా సంతోషం కలిగించింది. మెగా, అక్కినేని అభిమానులు ఈ వేడుకకి వచ్చి మంచి ఆరోగ్యకరమైన వాతావరణంని నెలకొల్పారు. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను..’’ అన్నారు.
entertainment
13,951
25-02-2017 15:13:58
మాజీ సీఎంపై మండిపడిన వెంకయ్యనాయుడు
న్యూఢిల్లీ: నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా పచ్చి అవకాశవాది అని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. బీజేపీ, పిడీపీ కూటమిని ఫరూఖ్ విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడంపై శనివారంనాడు మీడియా సమావేశంలో ఆయన మండిపడ్డారు. అధికారం కోల్పోవడం వల్లే ఫరూఖ్ స్వరం మారిందని తప్పుపట్టారు. 'మతతత్వ శక్తులతో చేతులు కలిపేది లేదని దివంగత ముఖ్యమంత్రి ముఫ్తి మహమ్మద్ సయీద్ ప్రజలకు వాగ్దానం చేశారు. జమ్మూకశ్మీర్‌లో బీజేపీతో పీడీపీ పొత్తు పెట్టుకోవడాన్ని ప్రజలు సహించరు' అని అబ్దుల్లా శ్రీనగర్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను వెంకయ్యనాయుడు తిప్పికొడుతూ 'ఆయన మాటలు తప్పు. కేవలం అధికారంలో లేకపోవడం వల్లే ఆయన తన స్వరం మార్చారు. మతతత్వ శక్తులతో ముఫ్తీ మహమ్మద్ సయీద్ పార్టీ చేతులు కలపడంపై ప్రజలు సంతోషంగా లేరని ఫరూఖ్ చెబుతున్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో ఆయన బీజేపీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి అయ్యారు. మీరూ, మీ కుమారుడు ముఖమంత్రులు అయినప్పుడు బీజేపీ సెక్యులర్‌ పార్టీగా కనపడింది. ఇప్పుడు ముఫ్తి, ఆయన కుమార్తె ముఖ్యమంత్రులైతే బీజేపీ మతతత్వ పార్టీగా కనబడుతున్నట్టుంది' అని ఫరూఖ్‌పై వెంకయ్య విసుర్లు విసిరారు. ఇది ఆయన అవకాశవాదాన్ని, రెండు నాల్కల ధోరణిని తేటతెల్లం చేస్తోందని అన్నారు.
nation
17,773
18-10-2017 05:09:23
పెంటకుప్పపై ఆడశిశువు!
మండపేటలో ఓ తల్లి దారుణంమండపేట, అక్టోబరు 17 : ఒక తల్లి వద్దనుకొని పెంటకుప్పల్లోకి విసిరేసింది. మరో తల్లి ముందుకొచ్చి, పొత్తిళ్లలోకి తీసుకొంది. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం అర్తమూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం, సోమవారం రాత్రి అర్తమూరు గ్రామ సమీపంలో ఎవరో నవజాత ఆడశిశువుని వదిలేసిపోయారు. పెంటకుప్పలో పడిఉన్న ఆ పసికందు ఏడుపు విని నీలా సత్యనారాయణ అనే గ్రామస్థుగు అటువెళ్లాడు. పసికందు పరిస్థితికి చలించిపోయాడు. ఇంటికి తీసుకెళ్లి తన భార్య వెంకటలక్ష్మికి అప్పగించాడు. మంగళవారం తమ ఇంటికి వచ్చిన ఆడ శిశువుకి మహాలక్ష్మి అని పేరు పెట్టాలని దంపతులు ఆలోచిస్తున్నారు.
nation
11,553
25-12-2017 10:53:47
వాజ్‌పేయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కోవింద్, మోదీ
న్యూఢిల్లీ : భారత రత్న, మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అటల్ బిహారీ వాజ్‌పేయి 1924 డిసెంబరు 25న జన్మించారు. ఆయన సోమవారం 93వ ఏట అడుగు పెడుతున్నారు. ఆయన భారతదేశాన్ని న్యూ మిల్లీనియంలోకి సమర్థవంతంగా నడిపించారని అందరి ప్రశంసలు అందుకున్నారు. ఓ పదవీ కాలం పూర్తిగా ప్రధాన మంత్రిగా కొనసాగిన మొదటి కాంగ్రెసేతర నేతగా ఆయన రికార్డు సృష్టించారు. ఆయన మంచి వక్త. బీజేపీలో దిగ్గజ నేత. ఆయన ప్రత్యర్థులు కూడా ఆయనను వ్యక్తిగతంగా అభిమానిస్తారు. దేశాన్ని అభివృద్ధి చేయాలన్న తపన ఆయనలో కనిపిస్తుంది. వాజ్‌పేయి పార్లమెంటులో తన వాగ్ధాటితో అందరినీ ఆకట్టుకునేవారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఓ ట్వీట్‌లో వాజ్‌పేయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అత్యంత లోకప్రియ నేత, గౌరవనీయ మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయికి జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూ రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓ ట్వీట్‌లో ‘‘మా ప్రియమైన అటల్‌జీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన అసాధారణ, దార్శనిక నాయకత్వం భారతదేశం మరింత అభివృద్ధి చెందేలా చేసింది. ప్రపంచ వేదికపై మన గౌరవాన్ని పెంచింది. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
nation
3,275
12-11-2017 23:50:23
జీరో డిగ్రీ వద్ద అతనూ, మనమూ
కొండ లోయల మబ్బు నీడల్లో నడిచే దూడ మెడగంట చేసే చప్పుడు ఎంతది గనుక! అంతటిదే కవి గొంతు... కనులు మూసుకున్న జెన్‌ మౌని హుంకరించి చెబుతాడా ఏదయినా మన వెర్రిగానీ! దుఃఖం రుచి తెలిసిన కవీ అంతే. మోహన్‌ రుషీ ఇంతే. స్వాప్నికులకో, విదూషకులకో, కత్తిదూసే సామాజిక విశ్లేషకులకో వాల్‌ పోస్టర్‌లాగ ఏదేనా చెప్పడం మోహన్‌ రుషి పనయితే కాదు... మిలిటరీ పెరేడ్‌లో కృష్ణశాస్త్రిని చదివి వినిపిస్తున్నట్టు. నిజానికి దుర్మార్గ బాణహతులున్న చోట నోటి ముత్యాలో, విసిరే పూలగుత్తులో పనిచేయవని మన రుషికీ తెలుసు. తీరా యుద్ధానికి దిగాకా పూల బాణాలా ఎదురయేవి? తెలుసు... మన తెలుగు కవులందరికీ తెలుసు. అలాగని, తెలిసి తెలిసి లక్కపిడతల్లాటి హితవచనాలో, మొహం మీద కొట్టినట్టు కొన్ని మాటలేవో రాసి పడేసే పనయితే దానికి రుషి వంటి కవి దేనికి? ప్రతిదీ విడమరచి చెప్పుకొంటూపోతే అది తప్పకుండా వ్యాసమో, ‘పదకుండవ పత్ర’మో కావొచ్చుగానీ కవిత మాత్రం చచ్చిననూ కాదు. సరిగ్గా ఇక్కడే రుషి వంటి కవి ఆదేశాన్నయినా, అభ్యర్థననయినా ఆవేశపు చాటున అరిటాకు మాటున పచ్చిగెలలా కవితారూపంలో సలక్షణంగా చెప్పవలసిందే. కానిపక్షంలో చూస్తున్నాంగా... దారంతా విరుద్ధ దృశ్యంలో రాల్చిన వ్యర్థ పదాలు, వట్టి గావు కేకలూనూ... నయం... మోహన్‌ రుషి ఇలాటి పదాలు, కేకలూ పెట్టి కవిత్వమని మనల్ని భ్రమపెట్టే పనిలోకి దిగేడు కాదు. నా/ మనవంటి పాఠకులు, ముఖ్యంగా కవిత్వాన్ని మాత్రమే హత్తుకునేవారు ‘పారాహుషార్‌’ చెబుతూ నడుస్తున్నంత కాలం కవులకు సాయపడినవాళ్లం అవుతాం. రుషి పనితనం ఇదిగో మన చేతిలోని ‘జీరో డిగ్రీ’.రుషి ఒక మరణాన్నో, ఒక సంఘటననో, ఇంకెవరి అనుభవాన్నో సెంటిమెంటు చేర్చికూర్చి మనల్ని ఆ ఉచ్చులోకి లాగే పనిపెట్టుకోలేదు. తాను పలవరించని, స్వప్నించనిదేదీ కవితా వస్తువుగా దాదాపు తాకలేదు. ఔను, నిజమే... కొన్ని రాజకీయ, ప్రాంతీయపరమైనవి మినహాయిస్తే, తక్షణికమైనా, శాశ్వతమైనా ఒక జీవనదృశ్యం పూర్తి కవన రూపంలో ఇమడ్చడానికి రుషి కఠిన ప్రయత్నం చేయలేదు ఇక్కడ. ఒక జెన్‌ సూచన, ఒక హైకూ పదం, ఒక సూఫీ సూక్ష్మం సరళంగా ప్రత్యక్షం కావటంలోనే వాటి సత్తా వున్నట్టు అలా వచ్చి ఇలా ఆవిరికాని అంతర్ధ్వని, దాని సూక్ష్మం రుషి పట్టుకున్న దాఖలా అనేక కవితల్లో కనిపిస్తుంది. అనుభవాల తీరపు దుఃఖం, నిర్వేదం కళకు సంబంధించిన శైలిలో ఎంత పలకాలో అంతే పలికించటంలో కనబడని సంమయనం రుషి కవితల కవతల కనిపిస్తుంది. తాను పరితపించే వేదనను అవతలివాడి సహనం జోలికి పోకుండా తగినట్టుగా నిలువరించటం కవితల్లో పదాల బాధ్యత కదా. ఆ వొడుపు తెలిసినవాడే మోహన్‌ రుషి. వేట సఫలం చేసే బాణాలే అతని పదాలు. ‘‘బైటేం పన్లేదు, పోవాల్లోపలికే, లోపలికే ఇక’’ అన్నప్పుడు రుషి కవితలు కొన్ని బైరాగి తత్త్వాల్లాగే, పదాల్లాగే పాటలా పట్టుకుంటాయి మనల్ని. కవి చాలాసార్లు ‘‘ఏక్‌ అకేలా ఇస్‌ షెహరుమే - రాత్‌ మే దొపెహరు మే...’’లా అనిపించడమే కాదు, కనిపిస్తాడు. నిజానికి ఒకటి మరొకటిని గుర్తు చేసి వేదనాష్టకాన్ని తవ్వి తోడినట్టుంటుంది. వంటరి ఊటబావి ఊరిన ఏదో వేదన జలం. అదీ అందీ అందనంత లోతుల్లో. కొన్ని కవితలయితే వంటరితనాన్ని పలికే గజల్‌లా అనిపించాయి. చింత, చింతనా అంతలోనే ఆశను దట్టించే వ్యూహాల్లా ధ్వనిస్తాయి. ఆర్థిక, రాజకీయ, సామాజిక, నైతిక విలువలు అంతటా చీకట్లో కూలుతున్న భవనంలా వున్నవేళ... ‘‘ఏమీ లేదు నీకూ, నాకూ మధ్య. ఎడతెగని దూరం తప్ప... కనుచూపుమేర ఆవరించిన శూన్యం తప్ప’’ అని నగర జీవితం నుంచీ తనను తాను పోగొట్టుకునే కృషి అనాయాసంగా కనిపిస్తుంది. విషాదపు మబ్బులు కప్పిన మనుగడ, దాదాపు సినిక్‌లా అనిపించే వంటరి కేక నిశ్శబ్దంగా ప్రతిధ్వనించటం ఈ కవితల్లో చాలాసార్లు కనిపిస్తుంది. సకల సిద్ధాంతాలకు, స్వీయ ప్రతిపాదనలనే సలహా, ఆదేశాలకు బహుదూరంగా నడిచిపోతుండే తత్త్వం రుషిది. ఐతే ఫలానా ‘ఇజం’లో ఇంప్రిజన్‌ కాకుండానే అన వలసిన నాలుగు మాటలూ అనటం, అదీ కవిత్వ భాషలో చెప్పకుండా పోడు రుషి. ఒక దుస్థితిని, ఒక మోదాన్ని యథాతథంగా వున్న స్థితిలో చూపెట్టడంలో కథలు, నవలలు, వాటి పాత్రలూ సాధించినట్టు కవితా ముఖం పలకలేదు. పలికితే అది కవిత్వం కాకుండాపోయే ప్రమాదం వుంది. పఠాభి వేళాకోళం చేసినా, శ్రీశ్రీ ఆకలేసి కేకలేసినా, కృష్ణశాస్త్రి దిగులు పడినా, ఇస్మాయిల్‌ కరుణ ముఖ్యమన్నా-- అన్నీ కవితామయమైనవేనని రుషికి తెలుసుననీ ఇందులోని కవితలు చెబుతాయి. ఉడుకుతున్న చేతగానితనపు మధ్య తరగతి ఉక్కపోత, ఆధునిక నగర జీవన నిర్మోహత్వం, అన్నీ వరసన స్పృశించి, చూసి, తలమునకలయి రాసిన విస్తృతి కవితల్లో కనిపిస్తాయి. బాధగానీ, ఈసడింపుగానీ తన తెలంగాణా పదాల్లో రాసినప్పుడూ అవి పరిచయం కాని వారికి సైతం శ్వాస తీసుకున్నంత సహజంగా గుండెల్లోకి చేరుతుంది. పడే వేదనకి, వినే హృదయానికి భాషలు ఎప్పుడూ నిజంగా అడ్డం కావు. విస్తృత విశ్వ యాత్రీకులు, నిశ్చల తత్త్వవేత్తలూ ఏ భాషలో ఎలా చెప్పానని చూడలేదు-- ఎవరికయినా మనోయానం ముఖ్యం. ఏదో ఒక వాదానికి కట్టుబడనట్టే రుషి ఏదో ఒక ప్రవచనమూ చేయడు. అంతరంగయానం, స్వీయసమీక్ష సమాజమే చేసుకోవాలన్నట్టు ఎదురీత ధ్వనినే ఎంచుకున్నాడు. వినే చెవులుంటే చాలుననే నమ్మిక అది. అలాగే సురేంద్రరాజు తన ‘ముందుమాట’లో అన్నట్టు రుషిలో ‘‘అర్బేనిటీ అంతస్సూత్రంగా వుంది. అదే అతని భావుకతని డిఫైన్‌ చేస్తున్నది’’. సిద్ధాంతాల వాస్తవాధీన రేఖలు దాటితే, కవిత్వపరం చేయబోతే అప్పుడది సామర్థ్యాన్ని, ప్రయోజనాన్ని, రెండిటినీ ప్రశ్నిస్తుందని మరిచే కవులే విఫల ప్రయత్నం చేయటం చూడటం లేదా మనం?! అక్కడే రుషి లక్ష్యం కోసం వ్యూహాన్నీ, మార్గాన్నీ అత్యవసరంగా భావించలేదు. సమాజ ధోరణి ప్రస్తావించిన ప్రతి కవితలో ఇది ఎర్రటి అండర్‌లైన్‌లా పలకరిస్తుంది. ఉసిగొల్పాలన్న ఊహే పెద్ద సాధనం. అకవితలు, డికన్‌స్ట్రక్షన్‌ సంగతులు మాటాడేవారికి, రాసేవారికి ఈ వైనం తెలుసు. రుషికీ తెలుసు. అందుకే... ‘‘పొద్దు పొద్దున్నే వాడి కళ్ల వాకిళ్లు చీపురుకట్టతో ఎంత ఊడ్చినా వాడి అహం నిద్ర విచ్చుకోదు’’ అన్నప్పుడు గంధక ధూపం వొదిలే మాటల అవసరం పడదు-- వేదన సారం తెలిసిన కవికి. ‘దూప’ అనే కవిత చూడండి. తన చెవిలో తనే మాట్లాడుతున్నట్టుంది. ఐనా గడ్డకడుతున్న ఒక సమాజపు వెర్రికేక అది. వినబడక మానదు. అలాగే ఎన్నో, ఎన్నెన్నో స్వగతాలు పరగతం, సమాజగతం కావటం నేర్పుగా స్పందించటంలో వుంది... ‘‘ఎన్నో వున్నా ఏడ్వడం అలవాటయిన నేను, ఏమున్నా లేకపోయినా నవ్వటం తప్ప తెలీని నువ్వు. అదే అదే పదేపదే. అయినప్పటికీ పాతదైపోదే?! గుండెల్లోని తియతియ్యని అనుభూతికి అంతమనేదే లేదే?!’’  ‘‘చూసినవా, ఎన్నడన్న, నిజంగ ఒక విషాద క్షణం రంగూ, రుచీ, వాసనా?అది ఒక ఉల్కాపాతం కావచ్చు, లేదా ఎల్లెల్కల నువు తలవాల్చే మెత్త కిందే ఉండి ఉండొచ్చు...’’ ‘నేర్చుకున్నప్పటికీ’, ‘8పిఎం’, ‘పెళ్లాంపిల్లల్ని ప్రేమించేవాళ్లు’ మొదలయిన కవితల్లో పెద్ద పెద్ద విషాదాంతపు నవల్ని సంగ్రహంగా, అతిసులువుగా చెప్పినట్టు చెప్పాడు రుషి. ‘‘నువు బతికున్నావని చెప్పే బండ గుర్తు నీ నిర్లక్ష్యం’’ అనే స్వస్వరూపం మనం వుంటూనే అసలు లేనేలేనట్టు బతికే జీవన వ్యాఖ్యలా అనిపించేలా చేయడం మన కవి చాకచక్యం. నిర్భీతి. ‘మార్చురీ రూం లాంటి హోం’, ‘గాయం కాలాన్ని మాపుతుంది’, ‘రేపటెల్లుండ్లలోకి నిన్ను తరలిస్తూ’ వంటి మాటలు డాస్టోవ్‌స్కీ, చెహోవ్‌ పాత్రలు మాట్టాడినంత నైరూప్యం కనిపించే నైరాస్యం స్వీయ విశ్లేషణలా చెవికి చేరుతుంది. రుషి ఆధునికానంతరపు నవల రాయగలడన్న ఆశ వస్తుంది ‘సాయంత్రం’, ‘కిసీ సె అబ్‌ క్యా కెహ్నా’ వంటి కవితలు చదువుతోంటే. ‘బతికిన మనుషులు’ చదువుతోంటే ‘దిమాగ్‌ ఖరాబ్‌’కు ఊతం కావచ్చనిపించింది. ‘‘ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని/ అప్పట్నించి వాళ్లు/ కలిసి మెలిసి జీవించలేదు’’- అన్న ముగింపు నూతన జీవనారంభం అన్నంత చిరునవ్వు ఇచ్చి విషాదాన్ని ధ్వనించకపోదు. ఇక, రాజకీయ నాయకుల స్టేట్‌మెంట్లకు రుషి స్పందించటం అనవసర కాలక్షేపం అనిపిస్తుంది. అట్లాంటివి ఈ సంకలనానికి అవసరమా నేస్తమా?! ఐనను అభినందించి తీరవలె-- హత్తుకొనవలె.  శివాజీ99591 78453
editorial
13,296
02-08-2017 13:16:17
తమిళ రాజకీయాల్లో అనూహ్య సంచలనం ఈ వారంలోనే?
చెన్నై : తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ కొత్త అవతారంలో కనిపించబోతోంది. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. తమలో తాము కలహించుకుంటున్న అన్నా డీఎంకే పార్టీ వర్గాలు ఒక విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఎన్డీయేలో భాగస్వాములు కావాలని పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఈ వారంలోనే ఏర్పాటవుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో దక్షిణాదిలో పాగా వేయాలన్న బీజేపీ ఆ లక్ష్యం దిశగా గొప్ప ముందడుగు వేసినట్లేనని చెప్పవచ్చు. అన్నా డీఎంకేకు కేంద్ర మంత్రివర్గంలో మూడు మంత్రి పదవులు లభించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ముఖ్యమంత్రి మార్పు ఉండకపోవచ్చని చెప్తున్నారు. పళనిస్వామిని ముఖ్యమంత్రిగా కొనసాగిస్తూ, పన్నీర్ సెల్వంను రాజ్యసభ సభ్యునిగా ఎన్నుకునేందుకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. తమిళనాట బీజేపీ చొచ్చుకుపోతుండటం గొప్ప రాజకీయ పరిణామమని విశ్లేషకులు చె్ప్తున్నారు. కలహించుకుంటున్న ఇరు వర్గాలను చేరదీసి ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుకు బాటలు పరచడంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా విజయం సాధిస్తున్నారంటున్నారు.
nation
5,773
12-07-2017 17:48:41
సండే టు సాటర్ డే లవ్ సాంగ్ విడుదల
కుమారి 21 ఎఫ్ తో నిర్మాతగానూ మారిన దర్శకుడు సుకుమార్ ఇప్పుడు దర్శకుడు పేరుతో మిత్రులతో కలిసి ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అశోక్, ఈషా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి హరిప్రసాద్ జక్కా దర్శకత్వం వహిస్తూ ఉండగా సాయి కార్తిక్ సంగీతం సమకూర్చారు. ఇందులోని సండే టు సాటర్ డే లవ్ అనే సాంగ్‌ను ఇటీవల సమంత లాంఛ్ చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, ఇదే నెల 15వ తేదీన ఆడియోనూ, ఆగస్టు 4న సినిమాను విడుదల చేయనున్నట్లు సుకుమార్ తెలిపారు.
entertainment
19,718
17-09-2017 11:44:38
కొరియా ఓపెన్ ఫైనల్ : తొలి సెట్‌లో పీ వీ సింధు గెలుపు
న్యూఢిల్లీ : కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో తొలి  సెట్‌ను పీ వీ సింధు గెలుచుకుంది. ప్రత్యర్థి నొజోమీ ఒకుహరాపై 22-20 తేడాతో విజయం సాధించింది.
sports
14,666
21-08-2017 18:23:46
బీజేపీ క్లీన్ స్వీప్...శ్రేణుల సంబరాలు
ముంబై: భారతీయ జనతా పార్టీ మరోసారి తన సత్తా చాటుకుంటుంది. థానే జిల్లాలోని మీరా-భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంబీఎంసీ)కు జరిగిన ఎన్నికల్లో క్లీన్ స్వీప్ సాధించింది. ఒంటిరిగానే బరిలోకి దిగిన బీజేపీ మొత్తం 95 స్థానాలకు గాను 61 సీట్లు గెలుచుకుని తనకు తిరుగులేదని నిరూపించుకుంది. శివసేనను వెనక్కి నెట్టేసింది. బీజేపీ-శివసేన గత ఎన్నికల్లో (2012) కలిసి పోటీ చేయగా, ఈసారి ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీలోకి దిగాయి. సోమవారంనాడు ఫలితాలు వెలువడటం, బీజేపీ మూడింట రెండువంతులు సీట్లు గెలుచుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. స్వీట్లు పంచుకుంటూ, బాణసంచా కాలుస్తూ కార్యకర్తలు సందడి చేశారు. కాగా, ఈ ఎన్నికల్లో శివసేన 22 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ పార్టీ 10 సీట్లతో సరిపెట్టుకుంది. 2012 ఎన్నికల్లో 26 సీట్లతో రెండో పెద్ద పార్టీగా నిలిచిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) ఈసారి ఖాతా కూడా తెరవలేదు. బీజేపీ నుంచి గెలిచిన వారిలో ఎంబీఎంసీ మేయర్ గీతా జైన్, లేడీస్ బార్ ఓనర్ గణేష్ షెట్టి ఉన్నారు. ప్రస్తుత మున్సిపాలిటీ ఐదేళ్ల కాలపరిమితి ఈనెల 27తో ముగియనుంది.
nation
12,048
24-09-2017 09:32:59
భారతదేశంపై పాకిస్థాన్ దారుణ ఆరోపణలు
న్యూయార్క్ : భారతదేశంపై పాకిస్థాన్ నిరాధారమైన, దారుణమైన ఆరోపణలు చేసింది. కశ్మీరులో భారతదేశం నేరాలకు పాల్పడుతోందని ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ శాశ్వత ప్రతినిథి మలీహా లోఢీ ఆరోపించారు. దక్షిణాసియాలో ఉగ్రవాదానికి తల్లి భారతదేశమేనని ఆరోపించారు. భారతదేశ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రసంగం పాకిస్థాన్ పట్ల భారతదేశ నాయకత్వానికిగల శత్రుత్వాన్ని స్పష్టంగా బయటపెడుతోందని పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 72వ సమావేశాల్లో సుష్మా స్వరాజ్ ప్రసంగంపై స్పందిస్తూ మలీహా ఈ ఆరోపణలు చేశారు. జమ్మూ-కశ్మీరు ప్రధాన సమస్యను భారతదేశం పట్టించుకోవడం లేదన్నారు. క్రూరత్వాన్ని ఉద్యమంలా విస్తరిస్తోందన్నారు. అమాయక కశ్మీరు బాలలను పెల్లెట్ గన్‌లతో అంధులను చేస్తోందన్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్థాన్‌ను ఉతికి ఆరేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఊతమిస్తూ, ఉగ్రవాదులను తయారు చేసే కేంద్రంగా తయారైందని ఆరోపించారు. పాక్ ఉగ్రవాదులను తయారు చేస్తూంటే, భారత్ డాక్టర్లు, సైంటిస్టులను తయారు చేస్తోందన్నారు. పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తోందని చెప్పారు. భారత్ ఐఐటీలు, ఐఐఎంలు ఏర్పాటు చేస్తే, పాకిస్థాన్ లష్కర్ ఎ తొయిబా, జైష్ ఎ మహ్మద్‌లను ఏర్పాటు చేసిందని సుష్మ ఎద్దేవా చేశారు. ప్రపంచానికి సవాలుగా మారిన ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రపంచ దేశాలన్నీ కలిసిరావాలన్నారు. ఉగ్రవాదాన్ని సమాధి చేయాలని పిలుపునిచ్చారు.
nation
21,085
25-07-2017 01:54:22
రాహుల్‌కు జ్వరం తొలి టెస్ట్‌కు దూరం
గాలె : శ్రీలంకతో బుధవారం నుంచి ఇక్కడ జరిగే తొలి టెస్ట్‌ ముందు భారత్‌కు గట్టి ఎదు రు దెబ్బ తగిలింది. వైరల్‌ జ్వరంతో ఓపెనర్‌ కెఎల్‌ రాహుల్‌ టెస్ట్‌కు దూరమయ్యాడు. అయితే అతడు కోలుకుంటున్నాడని ముందు జాగ్రత్తగానే మొదటి టెస్ట్‌కు దూరంగా పెట్టిన ట్టు బీసీసీఐ సోమవారం ఓ ప్రకటనలో తెలి పింది. గాయంతో 3నెలలు విశ్రాంతి తీసుకొన్న రాహుల్‌..శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్స్‌ లెవెన్‌తో జరిగిన రెండు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో చక్క టి అర్ధ సెంచరీతో మొదటి టెస్ట్‌కు ముందు ఆత్మ విశ్వాసం కూడగట్టుకున్నాడు. రాహుల్‌ అందుబాటులోలేని నేపథ్యంలో తొలి టెస్ట్‌లో ధవన్‌, అభినవ్‌ ముకుంద్‌ భారత్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించే అవకాశముంది.
sports
15,528
26-10-2017 13:08:02
నవాజ్ షరీఫ్‌కు అవినీతి కేసులో గట్టి ఎదురు దెబ్బ
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌కు అవినీతి నిరోధక కోర్టు ఝలక్ ఇచ్చింది. ఆయనకు బెయిలు ఇవ్వదగిన అరెస్టు వారంటును జారీ చేసింది. పనామా పేపర్స్ లీక్‌లో వెల్లడైన రెండు అవినీతి కేసుల్లో ఈ చర్య తీసుకుంది. ఫ్లాగ్‌షిప్ ఇన్వెస్ట్‌మెంట్ కేసు, అల్-జజీరా స్టీల్ మిల్స్, హిల్ మెటల్ ఎస్టాబ్లిష్‌మెంట్ కేసుల్లో ఈ వారంటు జారీ అయింది. షరీఫ్ ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. ఆయన సతీమణి కల్సుమ్ క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. ఆమెకు లండన్‌లోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. అవినీతి కేసుల్లో ఆయనపై ఆరోపణలు వచ్చినప్పటి నుంచి ఆయన పాకిస్థాన్‌ వెళ్ళలేదు, కోర్టుకు హాజరు కాలేదు. నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు ఆయనను ప్రధాన మంత్రి పదవికి అనర్హుడిగా ప్రకటించింది. అనంతరం నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో సెప్టెంబరు 8న మూడు కేసులను నమోదు చేసింది.
nation
17,293
01-01-2017 23:53:40
ఈపీఎఫ్‌వో పథకాల్లోకి రైల్వే కూలీలు!
టికెట్లపై 10 పైసలు సెస్‌ విధించనున్న ప్రభుత్వంన్యూఢిల్లీ, జనవరి 1: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎ్‌ఫవో) కల్పిస్తున్న సామాజిక భద్రతా పథకాల్లోకి రైల్వే కూలీలు కూడా రానున్నారు. రైల్వేలో ప్రస్తుతం సుమారు 20వేల మంది కూలీలు ఉన్నారు. అసంఘటిత రంగంలో 40కోట్లకుపైగా ఉన్న కార్మికులను కూడా ఈపీఎ్‌ఫవో పరిధిలోకి తీసుకురావాలనే చర్యల్లో భాగంగా రైల్వే కూలీలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకు అవసరమైన నిధులను ప్రతి రైల్వే టికెట్‌పైన 10 పైసల చొప్పున సెస్‌ విధించడం ద్వారా సేకరించాలని యోచిస్తోంది. రైల్వే ప్రతి రోజూ 10-12 లక్షల టికెట్లను విక్రయిస్తోంది. ఈ లెక్కన లక్షా 20వేల వరకూ ప్రతిరోజూ నిధులు వస్తాయి. వీటితో రైల్వే కూలీలకు పీఎఫ్‌, పెన్షన్‌, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ చేయించొచ్చని భావిస్తోంది. గత నెలలో బెంగళూరులో జరిగిన ఈపీఎ్‌ఫవో ట్రస్టీల సమావేశంలో కేంద్ర కార్మికశాఖ మంత్రి దత్తాత్రేయ ఇందుకు అంగీకరించారు. దీనికి సంబంధించిన ప్రతపాదనను త్వరలోనే ఆర్థిక, రైల్వే శాఖల దృష్టికి తీసుకెళ్లనున్నారు. మొత్తానికీ రైల్వే కూలీలకు సంబంధించిన ఈ విషయాన్ని వచ్చే బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించే అవకాశముందని అధికారులు ఆశిస్తున్నారు.
nation
13,558
24-04-2017 03:24:57
మాల్దీవుల్లో బ్లాగర్‌ దారుణ హత్య
మాలే, ఏప్రిల్‌ 23: మాల్దీవుల్లో యమీన్‌ రషీద్‌ (29) అనే బ్లాగర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. దేశ రాజధాని మాలేలోని ఆదివారం ఆయన నివసిస్తున్న అపార్టుమెంటు మెట్ల వద్ద కత్తి గాయాలతో పడి ఉన్న రషీద్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించారు. దేశంలో రాజకీయ అస్థిరత, నేతలపై సెటైర్లు వేస్తూ వ్యాసాలు రాస్తున్నందునే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది.
nation
7,150
09-04-2017 16:10:23
ఎవ్వరూ ఫాలో కాని కొత్త ఫార్మాట్‌లో....
లాంగ్ గ్యాప్ తరువాత 'ప్రేమమ్' మూవీతో హిట్ అందుకున్న నాగ చైతన్య.. మరోసారి ఆ సక్సెస్‌ను రిపీట్ చేయాలనుకుంటున్నాడట. అంటే మళ్లీ ఆ సినిమా డైరెక్టర్‌తోనే చేతులు కలపబోతున్నాడట. 'రారండోయ్ వేడుక చూద్దాం' అంటున్న నవ యువ మన్మథుడు నాగచైతన్య.. 'ప్రేమమ్' సినిమా విడుదలై ఆరు నెలలు గడుస్తున్నా ఇంకా ఆ సక్సెస్ మూడ్ నుంచి బయటకు రాలేకపోతున్నాడు. లాంగ్ గ్యాప్ తరువాత వచ్చిన విజయాన్ని ఆస్వాదిస్తున్న చైతూ మరోసారి అలాంటి కిక్ కోసం 'ప్రేమమ్' డైరెక్టర్ చందూ మొండేటితోనే చేతులు కలపబోతున్నాడట. తన యాక్టింగ్ స్కిల్స్‌ను ఎలా వాడుకోవాలో చందూకు బాగా తెలుసునని భావిస్తున్న చైతూ.. ఈసారి ఓ వైవిధ్యమైన పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నాడట. ఇటీవలే చైతన్యకు ఓ క్రేజీ కథను వినిపించిన చందూ మొండేటి.. ఫస్ట్ సిట్టింగ్‌లోనే అబ్బాయిని ఇంప్రెస్ చేసేశాడట. వైవిధ్యమైన కథాంశంతో రూపొందనున్న ఈ మూవీ.. ప్రేక్షకులకు సరికొత్త ఫీలింగ్‌ను అందించబోతోందని తెలుస్తోంది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే, నెరేషన్ విషయంలో.. ఇప్పటివరకూ ఎవ్వరూ ఫాలో అవ్వని కొత్త ఫార్మాట్‌ను అనుసరించబోతున్నట్లు తెలుస్తోంది. నూతన నిర్మాణ సంస్థ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. మరి.. సరికొత్తగా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయాలనుకుంటున్న చైతన్య ఎంతవరకూ సక్సెస్ అవుతాడో చూడాలి.
entertainment
19,888
09-07-2017 01:15:54
భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లండ్‌
లండన్‌: దక్షిణాఫ్రికాతో లార్డ్స్‌లో జరుగు తున్న తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 97 పరుగులు ఆధిక్యం చేజిక్కించుకున్న ఇంగ్లం డ్‌ మూడోరోజు ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 119 పరుగులు చేసింది. ఓపెనర్‌ కుక్‌ 59 పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 214/5తో శనివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన దక్షిణాఫ్రికా మరో 147 పరుగులు జోడించి 361 వద్ద ఆలౌటైంది. డికాక్‌ (51), ఫిలాండర్‌ (52) హాఫ్‌ సెంచరీలు చేశారు.
sports
19,755
26-09-2017 02:01:17
సిరీస్‌ నుంచి అగర్‌ అవుట్‌
ఇండోర్‌: భారత్‌తో వన్డే సిరీస్‌ కోల్పోయి డీలాపడిన ఆసీస్‌కు మరో ఎదురు దెబ్బ తగలింది. ఆ జట్టు లెఫ్టామ్‌ స్పిన్నర్‌ ఆస్టన్‌ అగర్‌ చేతివేలు విరగడంతో సిరీస్‌కు దూరమయ్యాడు. ఇండోర్‌లో మూడో వన్డేలో ఫీల్డింగ్‌ సందర్భంగా అగర్‌ కుడి చిటికన వేలుకు గాయమైందని జట్టు డాక్టర్‌ రిచర్డ్‌ సా సోమవారం ఓ ప్రకటనలో తెలిపాడు. ఫలితంగా అతడు స్వదేశం వెళతాడని పేర్కొన్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో అగర్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టాడు. ఇక బెంగళూరులో జరిగే నాలుగో వన్డేలో అగర్‌ స్థానాన్ని లెగ్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపాతో భర్తీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
sports
17,583
24-08-2017 03:53:47
త్వరలో రూ.200 నోట్లు
దాదాను 50 కోట్ల నోట్ల విడుదల2వేల నోట్ల రద్దు భయం వద్దు: జైట్లీ న్యూఢిల్లీ: త్వరలో రూ.200 నోట్లు జారీ చేయబోతున్నట్టు అరుణ్‌ జైట్లీ చెప్పారు. దీంతో చిల్లర నోట్ల సమస్య కొంత వరకు తీరే అవకాశం ఉందన్నారు. రూ.200 నోట్ల ప్రింటింగ్‌ ఎప్పటి నుంచి చేపట్టాలనే విషయంపై ఆర్‌బిఐనే నిర్ణయం తీసుకుంటుందన్నారు. అయితే ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారం ఆర్‌బిఐ దాదాపు 50 కోట్ల నోట్లను విడుదల చేస్తుందని భావిస్తున్నారు. దేశంలో రూ.200 డినామినేషన్‌లో నోట్లు విడుదల చేయడం ఇదే మొదటిసారి. అలాగే రూ.2,000 నోట్లూ రద్దు చేస్తారన్న భయాలను జైట్లీ కొట్టి వేశారు. అసలు అలాంటి ప్రతిపాదనేదీ పరిశీలనలో లేదన్నారు.
nation
14,710
12-09-2017 20:56:56
భారత్‌తో చెలిమి పాక్‌కు ఇష్టం లేదు
జమ్మూ: భారత్‌తో సంబంధాలు మెరుగుకు పాకిస్తాన్ ఎలాంటి ఆసక్తి చూపడం లేదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తప్పుపట్టారు. జమ్మూకశ్మీర్‌లో పొరుగు దేశం నిరంతర కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉందని అన్నారు. భారత్‌తో సంబంధాలు ఇష్టంలేకే ఇలాంటి పనులకు పాక్ పాల్పడుతున్నట్టు కనిపిస్తోందని మంగళవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ రాజ్‌నాథ్ అన్నారు. ఈనెల 9 నుంచి హోం మంత్రి నాలుగు రోజుల పర్యటలో భాగంగా కశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ పదేపదే తూట్లుపొడుస్తున్నా మన సైన్యం, బీఎస్ఎఫ్ బలగాలు సమర్ధవంతంగా తిప్పుకొడుతున్నాయని, ఇవాళ కాకపోతే రేపైనా పాక్ తన ఆగడాలకు స్వస్తి చెప్పాల్సిన పరిస్థితిని కల్పించి, దారికి తీసుకువస్తామని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. లెక్కల ప్రకారం 2014 నుంచి పాకిస్తాన్ ప్రతి ఏడాది 400కు పైగా కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆయన చెప్పారు. సరిహద్దుల్లో నివసిస్తున్న ప్రజలు మన దేశానికి గర్వకారణమని, భారతదేశానికి తరగని సంపద వంటి వాళ్లని రాజ్‌నాథ్ ప్రశంసించారు.
nation
8,684
13-08-2017 18:23:03
ట్రంప్ గారూ మీకో దండం: హీరో నిఖిల్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ వరుస విజయాలతో జోరుమీదున్నాడు. ఇటీవల పెళ్లి వార్తలతో సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా మారిన నిఖిల్ తాజాగా ప్రపంచ పెద్దన్న వైఖరిని ఎద్దేవా చేశాడు. ట్విట్టర్ సాక్షిగా ఉత్తరకొరియాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన వార్నింగ్‌ను నిఖిల్ ప్రస్తావిస్తూ ‘‘పూర్తిస్థాయి అణుయుద్ధం ప్రారంభించడానికి ట్విట్టర్‌ను వేదికగా చేసుకోవచ్చని నేనింతకాలం ఊహించలేకపోయాను. మాస్టారూ ట్రంప్ గారూ.. మీకో దండం.’’ అని ట్వీట్ చేశాడు. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలపై ఒక తెలుగు హీరో స్పందించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ శాంతి గురించి నిఖిల్ తన తపనను చెప్పకనే చెప్పాడని నెటిజన్లు అంటున్నారు. యుద్ధాల గురించి ఫేస్‌బుక్, ట్విట్టర్‌లాంటి సోషల్‌మీడియాలో చర్చించడం ద్వారా వచ్చే ప్రయోజనమేమీ లేదని, ప్రపంచ దేశాలు ఐక్యవేదికపై శాంతి కోసం చర్చలు జరపాలని నిఖిల్ అభిప్రాయం కాబోలు.
entertainment
10,380
22-06-2017 19:27:16
నీరుగారిపోతున్న యశ్ రాజ్ బ్యానర్ స్టార్‌డమ్
బాలీవుడ్‌లో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆ బ్యానర్.. ప్రస్తుతం పరువు దక్కించుకోవటానికి నానా కష్టాలు పడుతోందట. బాలీవుడ్‌లో అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ యశ్ రాజ్ ఫిల్మ్ బ్యానర్‌లో ఒక్క సినిమా అయినా చేయాలని కలలు కంటారు. ఎన్నో క్లాసిక్స్‌ను అందించిన ఈ బ్యానర్‌పై ఇటీవలి కాలంలో పలు చెత్త చిత్రాలు తెరకెక్కడంతో సినీజనాలతో పాటు, ఫ్యాన్స్ కూడా హర్ట్ అవుతున్నారట.ఈ మధ్యకాలంలో యశ్ రాజ్ బ్యానర్‌పై వచ్చిన చిత్రాలు ప్రేక్షకుల మెప్పు పొందకపోగా బ్యాక్ ఫైర్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆదిత్యచోప్రా తెరకెక్కించిన 'బేఫిక్రే' విమర్శలపాలవ్వడమే కాదు, బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. ఇదే తరహాలో 'బ్యాంక్ చోర్' కూడా ఉండటంతో ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. యశ్ రాజ్ సంస్థ స్థాయికి తగ్గట్టుగా ఈ మూవీలేదని అంటున్నారు.రితేష్ దేశ్‌ముఖ్ హీరోగా తెరకెక్కిన 'బ్యాంక్ చోర్' నిండా చీప్ కామెడీనే ఉందట. గతంలో ఎన్నో గొప్ప చిత్రాలు తీసిన ఈ సంస్థ నుంచి ఇలాంటివి రావడం ఏమిటనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే యశ్ రాజ్ బ్యానర్‌పై ఏర్పడిన మచ్చ పోవాలంటే.. 'టైగర్ జిందా హై', 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' వల్ల మాత్రమే సాధ్యమని తెలుస్తోంది. మరి నీరుగారిపోతున్న యశ్ రాజ్ బ్యానర్ వాల్యూను సల్మాన్, ఆమీర్ ఎంతవరకూ కాపాడతారో చూడాలి.
entertainment
17,227
21-03-2017 21:16:01
గుజరాత్‌లో బీజేపీ ముందస్తు ఎన్నికల వ్యూహం..!
అహ్మదాబాద్: మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీలో ఉత్సాహం ఉరకలు వేస్తున్నట్టే కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో మెజారిటీ సీట్లు సాధించి ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం, గోవా, మణిపూర్‌లోనూ రెండో స్థానంలో నిలిచినా వ్యూహాత్మకంగా వ్యవహరించి సర్కర్ ఏర్పాటులో సఫలీకృతం కావడంతో ఆ పార్టీలో ఉత్సాహం ద్విగుణీకృతమైంది. ఇదే ఊపులో గుజరాత్‌లో ముందస్తు ఎన్నికలకు ఆ పార్టీ సిద్ధమవుతోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది డిసెంబర్‌లో గుజరాత్ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే మేలో ముందస్తు ఎన్నికలకు వెళ్తే తమకు తిరుగుండదని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఆలోచన వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉన్నట్టు కూడా చెబుతున్నారు. వర్షాకాలంలో రుతుపవనాల పరిస్థితి ఎప్పుడూ కూడా ప్రభుత్వాలను ఇరకాటంలో పెడుతుంటుంది. వర్షాభావ పరిస్థితులు తలెత్తితే కరువు సమస్యలు వెంటాడుతుంటాయి. అదేవిధంగా వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ)ను ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై 1 నుంచి అమలు చేయాలనే పట్టుదలతో కేంద్రం ఉంది. జీఎస్‌టీ ప్రభావం సహజంగానే రాష్ట్రాలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయనే భయాందోళనలు ఉన్నాయి. రాష్ట్రాలకు ఏర్పడే నష్టాన్ని కొంతకాలం భరిస్తామని కేంద్ర భరోసా ఇచ్చినా ఆ ప్రభావం ఎలా ఉంటుందో వెంటనే చెప్పలేని పరిస్థితి. ఈ రెండు అంశాలనూ దృష్టిలో ఉంచుకుని ముందస్తుగానే గుజరాత్ అసెంబ్లీకి వెళ్తే మంచిదని బీజేపీ వ్యూహకర్తల ఆలోచనగా చెబుతున్నారు. ఈ ఊహాగానాలకు అనుగుణంగానే గుజరాత్‌లో ముందస్తు ప్రచార సందడి మొదలైంది. 'యూపీలో 325, గుజరాత్‌లో 150' అనే ప్రధాన నినాదంతో భారీ హోర్డింగ్‌లు, పోస్టర్లు కూడా వెలుస్తున్నాయి. ప్రదాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పోస్టర్లు రాష్ట్రంలోని ప్రధాన హైవేలపై దర్శనమిస్తున్నాయి.
nation
12,860
07-09-2017 02:47:58
‘నీట్‌’పై తమిళనాట ఆగని ఆందోళనలు
చెన్నై, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): జాతీయ ఉమ్మడి అర్హత పరీక్ష(నీట్‌) మినహాయింపు కోసం తమిళనాట రేగిన సెగ ఇంకా ఆరలేదు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ ఆందోళన బుధవారం ఐదో రోజుకు చేరుకుంది. చెన్నై మెరీనా తీరంలోని జయ సమాధి వద్ద ధర్నా చేపట్టిన 27 మంది విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. జల్లికట్టు ఉద్యమం తరహాలో నీట్‌ రద్దు కోసం కూడా విద్యార్థులు ఉద్యమం చేపడతారన్న అనుమానంతో మెరీనా సందర్శనపై ఆంక్షలు కూడా విధించారు. జయలలిత సమాధి వద్దకు సందర్శకులను నిషేధించారు. దీంతో మెరీనా తీర ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. ఇక తంజావూరు, కోవై, తిరుచ్చి ప్రాంతాల్లో విద్యార్థులు తరగతులను బహిష్కరించి రోడ్డెక్కారు. మరోపక్క, నీట్‌ అమల్లోకి వచ్చిన తర్వాత అడ్మిషన్‌ ప్రక్రియ క్లిష్టంగా మారడంతో వేలూరులోని ప్రసిద్ధ క్రిస్టియన్‌ మెడికల్‌ కళాశాల(సీఎంసీ)లో ఎంబీబీఎస్‌, సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల అడ్మిషన్‌లను నిలిపివేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు కేవలం ఇద్దరే అడ్మిషన్లు పొందగా, ఎంబీబీఎ్‌సలో 99 సీట్లు, సూపర్‌ స్పెషాలిటీస్‌ కోర్సులో 61 సీట్లు మిగిలిపోయాయని, ఈ కారణంగానే అడ్మిషన్లను నిలిపివేసిందని తెలిసింది. అయితే, ఇదంతా అవాస్తవమని ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. నీట్‌ పరీక్షల్లో ఎంపికైన 300 మంది విద్యార్థులకు 3 రోజులపాటు కౌన్సిలింగ్‌ జరిపేందుకు ఆహ్వాన పత్రాలు పంపామని తెలిపింది.
nation
7,149
01-12-2017 15:48:34
శ్రీముఖితో లవ్ సీన్స్ గురించి చెబుతున్న హీరో..
నందు, శౌర్య‌, శ్రీముఖి, రోషిణి ప్ర‌ధాన‌ పాత్ర‌ల్లో జేపీ క్రియేషన్స్ బ్యానర్‌పై ధ‌న జమ్ము నిర్మించిన చిత్రం ‘బీటెక్ బాబులు’. శ్రీను ఈ మంది దర్శకత్వం వ‌హించారు. అన్ని ప‌నులు పూర్తిచేసుకున్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో డిసెంబ‌ర్ 8న రిలీజ్ కాబోతుంది. ఈ సంద‌ర్భంగా హీరో నందు మాట్లాడుతూ.. ‘పెళ్ళిచూపులు’ త‌ర్వాత చాలా మంచి పాత్ర ఈ సినిమాలో ద‌క్కింది. నా పాత్ర ప్ర‌తి ప్రేమికుడికి క‌నెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. శ్రీముఖికి, నాకు మ‌ధ్య‌ వ‌చ్చే ప్రేమ స‌న్నివేశాలు హృద‌యాన్ని హ‌త్తుకుంటాయి. సీరియ‌స్‌గా ల‌వ్ ట్రాక్ న‌డుస్తూనే.. న‌వ్వులు పువ్వులు పూయించే కామెడీ స‌న్నివేశాలు కూడా హైలైట్‌గా ఉండేలా ద‌ర్శ‌కుడు చ‌క్క‌గా తెరకెక్కించారు. మంచి అవుట్ ఫుట్ వచ్చింది. సినిమాపై యూనిట్ అంతా చాలా న‌మ్మ‌కంగా ఉన్నాం. ప్రేక్ష‌కులు కూడా మా చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా... అని అన్నారు. నటుడు ఆలీ మాట్లాడుతూ... చాలా కాలం తర్వాత ఈ చిత్రంతో మ‌ళ్లీ స్ఫూఫ్ చేశా. స‌రైనోడు స్ఫూఫ్ అద‌రొట్టాన‌ని అంతా అంటున్నారు. ఇప్పటికే స్ఫూఫ్ సోషల్ మీడియాలో బాగా పాపుల‌ర్ అయింది. శ్రీను కొత్త కుర్రాడైనా అనుభ‌వంగ‌ల డైరెక్ట‌ర్‌లా క‌థ‌ను డీల్ చేశాడు. సినిమా విజయం సాధించి అంద‌రికీ మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నా... అని అన్నారు. చిత్ర దర్శకుడు శ్రీను ఈ మంది మాట్లాడుతూ.. మంచి కంటెంట్‌తో తెర‌కెక్కించాం. ఇంజనీరింగ్ చ‌దువుకుంటోన్న న‌లుగురు విద్యార్ధుల జీవితాలు ఎలా ఉంటాయి? రెగ్యుల‌ర్‌గా వాళ్ల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ప్రియురాలి ప్రేమ గొప్ప‌దా? త‌ల్లిదండ్రుల ప్రేమ గొప్ప‌దా? అనే అంశాల‌కు హాస్యం, సెంటిమెంట్ స‌న్నివేశాలు జోడించి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్యే విధంగా తెర‌కెక్కించాం. ముఖ్యంగా యువ‌త‌ను టార్గెట్ చేసే సినిమా అవుతుంది. ఇప్ప‌టికే రిలీజైన ప్ర‌చార చిత్రాల‌కు అంద‌రి నుంచి మంచి స్పంద‌న ల‌భించింది. చిన్న సినిమా అయినా క్వాలిటీ పరంగా నిర్మాత‌లు ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు. డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు వ‌స్తున్నాం. మా సినిమాని అంద‌రూ ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాం.. అని అన్నారు. శకలక శంకర్ మాట్లాడుతూ.. శంకర్ ఫ్రమ్ శ్రీకాకుళం అనే పాత్ర‌లో క‌నిపిస్తాను. క్యారెక్ట‌రైజేష‌న్ కొత్త‌గా ఉంటుంది. ఇందులో ద‌ర్శ‌కుడు నాతో చిన్న చిన్న స్టెప్పులు కూడా వేయించారు. సెంటిమెంట్ స‌న్నివేశాలు హైలైట్‌గా తీర్చిదిద్దారు. సినిమా తప్ప‌కుండా పెద్ద విజ‌యం సాధిస్తుంది.. అని అన్నారు. తాగుబోతు రమేష్ మాట్లాడుతూ.. ఇందులో తాగుబోతుగానే కాకుండా కామెడీ దొంగగా పూర్తి స్థాయిలో కనిపిస్తా. కథ నాతోనే మొద‌ల‌వుతుంది. నాతోనే ముగుస్తుంది. ‘ఆనందో బ్రహ్మ’ తర్వాత రంగా ది దొంగగా అంద‌ర్నీ మెప్పిస్తాను. డిసెంబ‌ర్ 8న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాం.. అని అన్నారు.
entertainment
11,450
09-03-2017 09:29:36
ముస్లిమ్ బాలిక భజన గీతాలు పాడిన వేళ...
బెంగళూరు : హిజాబ్ ధరించిన ఓ ముస్లిమ్ బాలిక కన్నడ టీవీ ఛానల్ రియాల్టీ షోలో హిందూమతానికి చెందిన భజన గీతాలు పాడి అందరినీ ఆకట్టుకున్న ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లా సాగర్ తాలూకాకు చెందిన సయ్యద్ సుహానా హిజాబ్ ధరించి వచ్చి ఓ కన్నడ టీవీ ఛానల్ లో హిందూమత భజన గీతాలు పాడింది. ముస్లిమ్ బాలిక సుహానా భజన గీతాలు పాడి హిందూ ముస్లిమ్ ల ఐక్యతకు మారుపేరుగా నిలిచారని రియాల్టీ షో జడ్జీలు అభినందించారు. కాగా ఇలా భజనగీతాలు పాడటం తప్పని మంగళూరు ముస్లిమ్ లు కొందరు ఫేస్ బుక్ పేజీలో వ్యాఖ్యలు చేశారు. నెటిజన్లు ముస్లిమ్ బాలికకు అండగా నిలవడంతో మంగళూరు ముస్లిమ్ లు పెట్టిన కామెంట్లను తొలగించారు. మొత్తంమీద సుహానా భక్తిగీతాలు పాడి మతసామరస్యాన్ని మరోసారి సమాజానికి చాటిచెప్పింది.
nation
21,558
21-11-2017 01:58:12
రాష్ట్ర బాడీ బిల్డింగ్‌ సంఘం చైర్‌పర్సన్‌గా కవిత
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): తెలంగాణ బాడీ బిల్డింగ్‌ సంఘం చైర్‌పర్సన్‌గా నిజామాబాద్‌ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎన్నికయ్యారు. తెలంగాణ జాగృతి యువజన విభాగం రాష్ట్ర కన్వీనర్‌ కోరబోయిన విజయ్‌ కుమార్‌ ఈ సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. న్యాయవాది ఆర్‌.మహదేవన్‌ న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తారు. తెలంగాణ బాడీ బిల్డింగ్‌ అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఆదివారం సమావేశమైంది. ఎంపీ కవితను చైర్‌పర్సన్‌గా ఎన్నుకుంటున్నామని కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.
sports
1,461
30-08-2017 01:40:28
సిగ్నిటీ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా శ్రీనాధ్‌
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సిగ్నిటీ టెక్నాలజీస్‌.. ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా శ్రీనాధ్‌ బత్ని నియమితులయ్యారు. ఇన్ఫోసిస్‌ డెలివరీ ఎక్సలెన్స్‌ హెడ్‌గా ఉన్న శ్రీనాఽధ్‌.. మే, 2000 నుంచి 2014 జూలై 14 వరకు సంస్థ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. డెలివరీ ఎక్సలెన్స్‌లో శ్రీనాధ్‌కు ఉన్న అనుభవం సంస్థకు ఎంతగానో తోడ్పడటమే కాకుండా భవిష్యత్‌లో సంస్థ వృద్ధిలో కీలకంగా ఉండనున్నారని సిగ్నిటీ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సివి సుబ్రమణ్యం తెలిపారు.
business
11,635
14-02-2017 19:04:56
కేరళలో విస్తరిస్తున్న ఆరెస్సెస్
న్యూఢిల్లీ : కేరళలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) విస్తరిస్తోంది. గుజరాత్‌లో కేవలం 1,000 శాఖలు మాత్రమే పని చేస్తూండగా, కేరళలో 5,000 శాఖలు ఉన్నట్లు ఆరెస్సెస్‌కు చెందిన అఖిల భారతీయ సహ ప్రచార్ ప్రముఖ్ నంద కుమార్ చెప్పారు. తమ సంస్థలో చేరేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, తమ కార్యకర్తలపై దాడులు జరగడానికి ఇదే ప్రధాన కారణమని తెలిపారు. కేరళలో రోజుకు 5000 శాఖలు జరుగుతున్నట్లు తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌లో 8 వేలు, మహారాష్ట్రలో 4 వేలు శాఖలు రోజూ జరుగుతున్నాయన్నారు. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి కావడానికి ముందే అంటే 2010-11 నుంచి ఆరెస్సెస్ శాఖలు పెరగడం ప్రారంభమైందని తెలిపారు. యువతతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి తమ సంస్థ అనుసరించిన విధానాల ఫలితమేనన్నారు.
nation
3,407
08-02-2017 03:28:34
పదవీ విరమణ వయసు పెంచాలి
ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్ళకు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనకాడుతోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మాత్రం పదవీ విరమణ వయసును 60 ఏళ్ళకు ముందే పెంచింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒకే పద్ధతి, ఒకటే విధానం అమలులో ఉంటే బావుంటుంది. తెలంగాణ ఉద్యోగులు పదవీ విరమణ వయోపరిమితి పెంచాలని ఇప్పటికే అనేకమార్లు డిమాండ్‌ చేశారు. ఇందుకు ప్రభుత్వం సత్వరమే స్పందించి పదవీ విరమణ వయసు 60 ఏళ్ళకు పెంచుతూ జీవో ఇవ్వాలి.- కె. రామచంద్రరావు, వరంగల్‌
editorial
6,113
25-01-2017 16:29:29
వామనుడిలా మొదలై.. రానాలా పెరిగిపోయింది: పీవీపీ
భారతీయ చలన చిత్ర పరిశ్రమది వందేళ్లకుపైగా చరిత్ర. అలాంటి చరిత్రలో ఎప్పుడూ రాని చిత్రం.. ఇప్పుడు రాబోతోందట. ఆ చిత్రం ఏంటి? ఆ మాటలు అన్నది ఎవరు? అంటే ‘ఘాజి’ చిత్ర నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) ఆ మాటలు అన్నాడు. ఘాజి ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పీవీపీ మాట్లాడాడు. చిన్న ప్రాజెక్టుగా మొదలైన ప్రాజెక్టు నేడు.. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా భారీ ప్రాజెక్టుగా ఎదిగిందన్నాడు. ‘‘పోయన సంవత్సరం ఇదే సమయానికి మేం నిర్మించిన క్షణం సినిమా విడుదలై ఘన విజయాన్ని సాధించింది. మళ్లీ అదే నెలలో ‘ఘాజి’ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. పౌరాణికాలు, జానపదాలు, సాంఘిక చిత్రాలు అన్ని కలిపి భారత్‌లో ఇప్పటిదాకా కొన్ని వేల సినిమాలు వచ్చాయి. కానీ, ఈ వందేళ్లలో ఘాజి లాంటి చిత్రం మాత్రం రాలేదు. ఇలాంటి సినిమాను భారత స్క్రీన్లపై ఇప్పటిదాకా ఎవరూ చూసి ఉండరు. అంత మంచి సినిమాలో భాగమైనందుకు చాలా గర్వపడుతున్నాను. ఈ సినిమాను ప్రారంభించినప్పుడు చిన్న సినిమానే. కానీ, ఇంతింతై వటుడింతై అన్నట్టుగా భారీ సినిమాగా మారిపోయింది. వామనుడిలా మొదలై.. రానా సైజుకు సినిమా పెరిగింది. మేము ఎంత మంచి సినిమా తీశామో సినిమా విడుదలయ్యే ఫిబ్రవరి 17న తెలుస్తుంది. భారతీయ సినీ జగత్తులో ఇది ఓ ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుంది’’ అని పీవీపీ అన్నాడు. మరి, పీవీపీ అన్నట్టు చరిత్రలో ఆ సినిమా నిలిచిపోతుందో లేదో విడుదలయ్యాక ప్రేక్షకులే తేల్చాలి.
entertainment
12,115
15-03-2017 02:53:56
లాయర్‌ వద్ద ‘పల్సర్‌ సుని’ సిమ్‌
నటి కేసులో కేరళ హైకోర్టు సీరియస్‌ కొచ్చి, మార్చి 14: మలయాళ నటిపై లైంగిక వేధింపుల కేసు మలుపు తిరిగింది. ప్రధాన నిందితుడు పల్సర్‌ సుని తరఫు న్యాయవాదిని ప్రశ్నించేందుకు పోలీసులకు కేరళ హైకోర్టు అనుమతి ఇచ్చింది. గురువారం పోలీసుల విచారణకు హాజరు కావాలని సదరు న్యాయవాదిని ఆదేశించింది. పల్సర్‌ సుని సహా ఆరుగురు కలిసి.. గత నెల కొచ్చిలో మలయాళ నటిని, ఆమె కారులోనే అపహరించి, లైంగిక వేధింపులకు గురి.. ఆ దృశ్యాలను సెల్‌లో బంధించి యూట్యూబ్‌లో పోస్టు చేయడం తెలిసిందే. ఈ కేసులో సుని సహా ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేశారు. ఘటన సమయంలో తాను ఉపయోగించిన సెల్‌, సిమ్‌ కార్డులను తమ లాయర్‌ వద్ద దాచినట్టు పల్సర్‌ సుని పోలీసులకు తెలిపాడు. అతడు చెప్పినట్టే.. లాయర్‌ కార్యాలయంలో సిమ్‌, మెమరీ కార్డులు దొరికాయి. దీనిపై తమ విచారణకు హాజరుకావాలని లాయర్‌కు పోలీసులు నోటీసులు జారీచేయగా, ఆయన హైకోర్టులో సవాల్‌ చేశాడు. కోర్టు పోలీసుల వాదననే సమర్థించింది.
nation
17,520
05-05-2017 16:55:05
వేడుకగా.. పుచ్చకాయల దినోత్సవం
వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఓ స్కూల్ వేడుకగా పుచ్చకాయల దినోత్సవాన్ని నిర్వహించింది. దీంతో చిన్నారులంతా పుచ్చకాయలు తింటూ తెగ సందడి చేశారు. వేసవిలో పండ్లను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఫాస్ట్ ఫుడ్స్‌కు బదులు ఆర్యోగానికి మేలు చేసే ఫ్రూ‌ట్స్ తినాలని ఉపాధ్యాయులు వారికి సూచించారు.
nation
4,776
19-12-2017 20:44:27
'మహానటి'లో తన పాత్ర ఏంటో చెప్పేసిన విజయ్ దేవరకొండ
చేసింది రెండు సినిమాలే అయినప్పటికీ టాలీవుడ్ టాప్ హీరోల స్థాయి క్రెడిట్ కొట్టేశాడు విజయ్ దేవరకొండ. 'అర్జున్ రెడ్డి' సినిమా తర్వాత ఆయనకు వరుస అవకాశాలు తలుపుతట్టాయి. ఈ హీరో తాజాగా సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న 'మహానటి' చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్, సావిత్రి భర్త పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో విజయ్ చేస్తున్న పాత్రపై మాత్రం పలు వార్తలు బయటకు వచ్చాయి. ఈయన ఎన్టీఆర్ పాత్ర చేస్తున్నాడని కొన్ని వార్తలు రాగా.. కాదు కాదు ఎంజీఆర్ పాత్ర పోషిస్తున్నాడని మరికొన్ని వార్తలు వచ్చాయి. కాగా తాజాగా ఈ విషయమై స్పందించాడు విజయ్ దేవరకొండ. తాను 'మహానటి' సినిమాలో చేస్తున్నది నిడివి చాలా తక్కువ ఉన్నటువంటి ఓ జర్నలిస్ట్ పాత్ర అని చెప్పేశాడు. పాత్ర చిన్నదైనప్పటికీ ఓ మహానటి అయిన సావిత్రి జీవిత కథలో అవకాశం రావడం గొప్పగా భావించి ఈ పాత్రకు ఓకే చెప్పా అని తెలిపాడు.
entertainment
13,100
25-04-2017 03:09:30
హెచ్‌ఐవీ బాధితులకు ఉద్యోగ భద్రత
కొండంత అండలా కొత్త చట్టం న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 24: హెచ్‌ఐవీ పాజిటివ్‌, ఎయిడ్స్‌ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉద్యోగ భద్రత లభించనుంది. ఆ వ్యాధిగ్రస్తులకు ఉద్యోగం తిరస్కరించడం.. లేదంటే ఉద్యోగం నుంచి తొలగించడం.. ఇక నుంచి కుదరదు. అలా చేసిన వారికి కనీసం 3 నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్షతో పాటు, లక్ష రూపాయల జరిమానా విధించే విధంగా కొత్త చట్టం రూపుదిద్దుకుంది. ఈ మేరకు ‘హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నివారణ-నియంత్రణ చట్టం-2017’కు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. సంబంధిత బిల్లును రాజ్యసభ గత నెల 21న ఆమోదించగా, లోక్‌సభలో ఈనెల 11న ఆమోదించారు. హెచ్‌ఐవీ పాజిటివ్‌, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తుల సమాచారాన్ని బయట పెట్టినవారు కూడా శిక్షార్హులు కానున్నారు. వారిపై ఉద్యోగాలు, విద్యా సంస్థలు, ఆస్పత్రుల్లో వైద్యం విషయాల్లో ఎలాంటి వివక్ష చూపినా జైలు శిక్ష, జరిమానా విధించేలా చట్టంలో నిర్దేశించారు.
nation
570
22-07-2017 23:59:28
41 శాతం తగ్గిన దివీస్‌ లాభం
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): దివీస్‌ లేబొరేటరీస్‌ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన కంపెనీ నికర లాభం ఏకంగా 41.5 శాతం క్షీణించి 177 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో నికర లాభం 301.81 కోట్ల రూపాయలుగా ఉంది. త్రైమాసిక కాలంలో విశాఖపట్నం ప్లాంట్‌పై అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ మండలి (యుఎస్‌ ఎఫ్‌డిఎ) ఆంక్షలు విధించటం దివీస్‌ లేబొరేటరీస్‌ పనితీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. సమీక్షా కాలంలో కంపెనీ మొత్తం రాబడులు కూడా 1,033.50 కోట్ల రూపాయల నుంచి 850.88 కోట్ల రూపాయలకు తగ్గాయి. వామా ఇండస్ట్రీస్‌ రాబడి రూ.42 కోట్లు ఐటి, ఐటిఈస్‌ సర్వీసుల సంస్థ వామా ఇండస్ట్రీస్‌ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో అద్భుతమైన ఫలితాలను ప్రకటించింది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏకంగా 14 లక్షల రూపాయల నుంచి 1.86 కోట్ల రూపాయలకు దూసుకుపోయింది. మరోవైపు కంపెనీ రాబడులు కూడా 695 శాతం వృద్ధి చెంది 5.98 కోట్ల రూపాయల నుంచి 41.62 కోట్ల రూపాయలకు పెరిగాయి.
business
13,917
17-03-2017 18:48:10
అశ్లీల సైట్లు.. గోప్యంగా చూస్తే తప్పా ?
ముంబై: ఓ వ్యక్తి అశ్లీల వెబ్‌సైట్లను తన గదిలో రహస్యంగా చూస్తే తప్పా?, దాన్ని అడ్డుకోవడానికి మీరెవరని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. శుక్రవారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చైల్డ్ పొర్నోగ్రఫీకి ప్రభుత్వం వ్యతిరేకమని, అలాంటి సైట్లను నిరోధించేందుకు తగిన చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు. అయితే అన్ని శృంగార వెబ్‌సైట్లను అడ్డుకోవడం ఆచరణ సాధ్యమేనా అని రవి శంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. ఇతరులకు ఇబ్బంది లేకుండా ఎవరైనా ఏకాంతంగా వాటిని చూస్తే తప్పా అని ఆయన అన్నారు. దేశంలోని 125 కోట్ల జనాభాలో 108 కోట్ల మందికి సెల్‌ఫోన్స్ ఉన్నాయని, వచ్చే ఐదారేళ్ళలో భారత డిజిటల్ ఎకానమీ ట్రిలియన్ డాలర్లకు చెరుతుందని రవి శంకర్ ప్రసాద్ వివరించారు.
nation
16,903
22-03-2017 20:47:46
రెండాకుల గుర్తు...ఈసీపైనే అందరి చూపు
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీ రెండాకుల గుర్తుపై జరుగుతున్న పోరుపై ఉత్కంఠ కొనసాగుతోంది. గుర్తు ఎవరికి చెందాలన్న దానిపై ఎన్నికల కమిషన్ గురువారం నిర్ణయం ప్రకటించనుంది. పార్టీ గుర్తు తమకే కేటాయించాలంటూ అటు శశికళ వర్గీయులు, ఇటు మాజీ సీఎం పన్నీర్ సెల్వం వర్గీయులు ఈసీ ముందు బుధవారంనాడు తమ వాదన వినిపించారు. ఈ విచారణలో పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకం అంశాన్ని చేర్చలేదు. ఇరువర్గాల్లో ఎవరికి గుర్తు కేటాయించాలన్న అంశంపైనే ప్రధానంగా విచారణ సాగింది. ఆర్కే నగర్ ఉప ఎన్నికకు నామినేషన్ గడువు గురువారం ముగియనుండటంతో దీనికి ముందే ఈసీ నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయి పన్నీర్ సెల్వం తరఫున న్యాయవాదులు సీఎస్ వైద్యనాథన్, గురుకృష్ణ కుమార్ తమ వాదనలు ఈసీకి వినిపించారు. అక్రమాస్తుల కేసులో శశికళ దోషిగా తేలి శిక్ష పడిందని, అందువల్ల ఆమె ఉపఎన్నికలో పోటీ చేయడం కానీ, ఎవరినైనా నామినేట్ చేయడం కానీ కుదరదని వారు వాదించారు. తన మేనల్లుడు టీటీవీ దినకర్‌ను నామినేట్ చేయడానికి శశికళను అనుమతించరాదని ఈసీని కోరారు. శశికళ వర్గం తరఫున నలుగురు టాప్ లాయర్లు...సల్మాన్ ఖుర్షీద్, వీరప్ప మొయిలీ, మోహన్ పరాశరన్, ఆర్యమ సుందరం ఈసీకి తమ వాదన వినిపించారు. పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మెజారిటీ ఎమ్మెల్యేలు శశికళతోనే ఉన్నారని, అందువల్ల పార్టీ గుర్తు తమకే చెందుతుందని వాదించారు.
nation
2,841
31-08-2017 14:31:25
ఎస్‌బీఐ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్...
హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ ఖాతాల నుంచి కస్టమర్లకు తెలియకుండానే భారీమొత్తంలో సొమ్ములు తస్కరణకు గురవుతున్నట్టు వెలుగులోకి వచ్చింది. గత రెండు వారాలుగా జరుగుతున్న భారీ ఆన్‌లైన్ మోసాలపై సైబర్ క్రైం సెల్‌కు ఫిర్యాదులు పోటెత్తున్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు నెట్ బ్యాంకింగ్‌లో భారీగా సొమ్ములు పోగొట్టుకుంటున్నామంటూ... గత వారం రోజులుగా అనేకమంది గగ్గోలుపెడుతున్నారు. ఈ మేరకు టెక్నాలజీ నిపుణుడు శ్రీధర్ నల్లమోతు సైతం ఫేస్‌బుక్ ద్వారా పలుమార్లు వినియోగదారులను అప్రమత్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎస్‌బీఐ కార్డులు వాడే వినియోగ దారులు జాగ్రత్తగా ఉండాలని... టెక్నాలజీని తక్కువగా అంచనా వేయొద్దని ఆయన హెచ్చరిస్తున్నారు.  ఎస్‌బీఐ సైబర్ భద్రత విషయంలో ఎక్కడో తేడా జరుగుతోందనీ.. ప్రమాదకరమైన మాల్‌వేర్ కారణంగానే ఈ మోసాలకు కారణం కావచ్చుని అభిప్రాయం వ్యక్తం చేశారు.  తెలియకుండానే ఆస్ట్రేలియా, అమెరికా డాలర్లలో చెల్లింపులు జరుగుతున్నాయన్నారు. ప్రత్యేకించి ఉబెర్, ఓలా క్యాబ్‌లతో పాటు అమెజాన్ వంటి సైట్లలో ఆన్‌లైన్ చెల్లింపులు చేసేవారు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. కస్టమర్లకు తెలియకుండానే క్రెడిట్ కార్డు గరిష్ట పరిమితి చేరేలా నకిలీ లావాదేవీలు జరగుతున్నాయనీ... నెట్‌బ్యాంకింగ్ ద్వారా భారీ మొత్తంలో సొమ్ములు చేజారుతున్నట్టు తాను గమనించానని వెల్లడించారు. ఎలాంటి లావాదేవీలు జరపకుండానే ఓటీపీలు వస్తున్నాయనీ.. నెట్‌బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు సైతం పనిచేయకుండా పోతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారుల అప్రమత్తంగా ఉండాలనీ... రోజుకు మూడు నాలుగు సార్లు ఖాతాలో సొమ్ము చెక్ చేసుకోవాలని శీధర్ నల్లమోతు సూచించారు.   కాగా ఇంత జరుగుతున్నా ఈ విషయం ఇప్పటి వరకు వెలుగులోకి రాకపోవడం, ఎస్‌బీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడక పోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. తాము మోసపోతున్నట్టు బ్యాంకు మేనేజర్ల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
business
5,914
30-07-2017 23:00:36
రానా, వెంకీ మల్టీస్టారర్ !
పుష్కర్ గాయత్రీ దర్శకత్వంలో ఇటీవల తమిళంలో విడుదలైన సినిమా 'విక్రమ్ వేద'. విడుదైన రోజు నుండి ఈసినిమా భారీ కల్లెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సినిమాలో మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా నటించారు. మాధవన్ ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా నటించగా.. విజయ్ సేతుపతి గ్యాంగ్‌స్టర్‌గా అలరించాడు. అయితే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. 'రానా, వెంకటేష్ లతో ఈ సినిమా తెలుగులో రీమేక్ చేసి టాలీవుడ్‌లో భారీవిజయం సాధించాలనుకుంటున్నాం. కానీ ఇంకా ఫైనలైజ్ చేయలేదు' అని ఈ చిత్రయూనిట్ ఓ వార్తాసంస్థకు తెలియజేసిందని సమాచారం. ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే మాత్రం టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ కావడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.
entertainment
4,748
06-02-2017 12:12:28
పాపం రాజ్‌తరుణ్‌.. రెండు సూపర్‌హిట్లు మిస్‌ చేసుకున్నాడు!
 జడ్జిమెంట్‌ విషయంలో రాజ్‌తరుణ్‌ ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. ఆ కారణంగానే మంచి సినిమాలను మిస్‌ చేసుకుంటున్నాడట. సంక్రాంతికి విడుదలై మంచి హిట్‌గా నిలిచిన ‘శతమానం భవతి’ సినిమా సాయిధరమ్‌ తేజ్‌, శర్వానంద్‌ కంటే ముందు రాజ్‌తరుణ్‌ వద్దకే వెళ్లిందట. అయితే రాజ్‌తరుణ్‌ స్ర్కిప్టుకు మార్పులు చేయాలని చెప్పడంతో ఆ కథను సాయిధరమ్‌ వద్దకు తీసుకెళ్లాడట దిల్‌ రాజు. ఆ కథ తనకు సూట్‌ కాదని చెప్పి, స్వయంగా శర్వానంద్‌కు ఫోన్‌ చేసి ఈ స్ర్కిప్టు గురించి చెప్పాడట సాయిధరమ్‌.  అలా ఆ సినిమా శర్వానంద్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఇక, నాని హీరోగా ఇటీవల విడుదలైన ‘నేను లోకల్‌’ కూడా రాజ్‌తరుణ్‌ చేయాల్సిందే. అదీ అలా మారుతూ వచ్చి ఆఖరికి నానికి దక్కింది. ఈ సినిమా ఈ వీకెండ్‌లో తెలుగు రాష్ట్రాలతోపాటు అమెరికాలో అదిరిపోయే వసూళ్లు సాధించింది. ఈ రెండు సినిమాలు రాజ్‌తరుణ్‌ ఖాతాలో పడి ఉంటే.. అతని కెరీర్‌ ఎక్కడికో వెళ్లిపోయి ఉండేది.
entertainment
10,451
06-07-2017 12:30:28
ప్రభాస్‌ గురించి రణ్‌బీర్‌ ఏమన్నాడంటే..!
బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ తను నటించిన తాజా చిత్రం ‘జగ్గా జాసూస్‌’ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. హీరోయిన్‌ కత్రినతో కలిసి ప్రెస్‌మీట్‌లలో పాల్గొంటున్నాడు. తాజాగా జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో ‘ఇటీవల విడుదలైన సినిమాల్లో ఏ హీరో నటన మీకు బాగా నచ్చింది’ అని ఓ జర్నలిస్ట్‌ రణ్‌బీర్‌ను ప్రశ్నించారు.దీనికి స్పందించిన రణ్‌బీర్‌.. ప్రభాస్‌ నటన తనకు ఎంతగానో నచ్చిందని చెప్పాడు. ‘‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్‌ నటన నిజంగా నాకు నచ్చింది. ఆ సినిమాలో ఆయన ప్రదర్శించిన దర్పం, రాజసం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రభాస్‌ ఓ అద్భుతమైన నటుడు’ అని ఈ సందర్భంగా రణ్‌బీర్‌ చెప్పాడు. కాగా, ఇటీవల జరిగిన సైమా-2017 వేడుకలో తనకు దక్షిణాదిన ప్రభాస్‌తో కలిసి నటించాలని ఉందని చెప్పిన విషయం తెలిసిందే.
entertainment
10,825
26-07-2017 19:55:52
పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో 'సువర్ణ సుందరి'
ప్రస్తుతం హిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో దర్శకనిర్మాతలు అలాంటి సబ్జెక్ట్స్‌తోనే సినిమాలు తీయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. హిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఇటీవల వచ్చిన బాహుబలి, రుద్రమదేవి లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. తాజాగా కోవలో చరిత్ర నేపథ్యంలో.. చరిత్రను ఆవిష్కరిస్తూ తెరకెక్కుతున్న చిత్రం 'సువర్ణ సుందరి'. చరిత్ర ఎప్పుడూ భవిష్యత్‌ని వెంటాడుతుంది అనేది ట్యాగ్‌లైన్‌. ఎస్‌.టీమ్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై సూర్య దర్శకత్వంలో ఎమ్‌.ఎల్‌ లక్ష్మి నిర్మిస్తున్న ఈచిత్ర షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు సూర్య మాట్లాడుతూ - ''1509 సంవత్సరంలో ప్రారంభమై నేటి(2017) వరకూ.. అంటే నాలుగు శతాబ్ధాల్లో జరిగే కథ ఇది. సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ మూవీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. కాలాదుల్ని బట్టి వేర్వేరు లొకేషన్లలో చిత్రీకరణ చేశాం. త్వరలోనే టీజర్ రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఫస్ట్‌ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. చరిత్ర ఎప్పుడూ విజయాల గురించి చెబుతుంది. అయితే చరిత్రలో బయటికి తెలీని చీకటి కోణాలుంటాయి. అలాంటి ఓ చీకటి కోణం ఇప్పటివరకూ రకరకాల జనరేషన్లపై ఎలాంటి ప్రభావం చూపించింది అన్నదే ఈ చిత్రంలోని ప్రధాన కథాంశం. అప్పటి జనరేషన్‌, ఇప్పటి జనరేషన్‌ గ్యాప్‌ని అర్థవంతంగా చూపించేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ఈ చిత్రంలో ఎక్కువ ప్రాధాన్యం వుంటుంది" అన్నారు.పూర్ణ, సాక్షిచౌదరి, రామ్‌, ఇంద్ర, సాయికుమార్‌, నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్‌ ఖాన్‌, అవినాష్‌ తదితరులు చిత్రంలో కీలకపాత్రలు పోషించారు.
entertainment
6,322
12-11-2017 10:36:17
గరుడవేగ సినిమాపై మహేశ్ ట్వీట్ ఎఫెక్ట్?
చిన్న సినిమాలకు మహేశ్ బాబు తన మద్దతు తెలుపుతున్నారు. సినిమాలను చూడటమే కాకుండా తన అభిప్రాయాన్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇది ఆ సినిమాలకు చాలా ప్లస్‌గా మారుతోంది. అర్జున్ రెడ్డి సినిమా చాలా కాంట్రవర్శీ అయింది. ఫుల్‌గా యాంటీ పబ్లిసిటీ వచ్చింది. ఆ సమయంలో మహేశ్ ఆ సినిమాకు మద్దతుగా నిలిచారు. సినిమాలో కంటెంట్ కూడా బాగుండటంతో చిన్న సినిమాగా విడుదలైనా భారీ బడ్జెట్‌ సినిమాలకు సమానంగా ప్రేక్షకుల్ని అలరించింది.  తాజాగా విడుదలైన పీఎస్వీ గరుడవేగ సినిమా హిట్ అనేది ఒక రకంగా చెప్పాలంటే రాజశేఖర్ కుటుంబానికి అంత్యంత అవసరం. ఇప్పటికే తాను అప్పుల్లో ఉన్నానని రాజశేఖర్ బహిరంగంగానే చెబుతున్నారు. సినిమా కూడా సక్సెస్ బాటలోనే నడుస్తోంది. తాజాగా మహేశ్ బాబు గరుడవేగ సినిమాను చూసి చాలా పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు. తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు మహేశ్ అంతటి హీరో సినిమా బాగుందని చెప్పారంటే తప్పకుండా సినిమా చూస్తామంటూ కామెంట్లు పెట్టడం విశేషం. ఈ ట్వీట్ ఎఫెక్ట్ సినిమాపై తప్పకుండా ఎంతో కొంత ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
entertainment
642
04-08-2017 01:47:49
నారాయణ హృదయాలయలో వాటాల విక్రయం
ఆరోగ్య సంరక్షణ విభాగంలోని నారాయణ హృదయాలయలో 1.7 శాతం వాటాలను జెపి మోర్గాన్‌ మారిషస్‌ హోల్డింగ్స్‌, కాప్తాల్‌ మారిషస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు విక్రయించాయి. గత నెల ఆరో తేదీన జరిగిన ఈ ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీలో ఒక్కో షేరును 299.93 రూపాయలకు విక్రయించారు. డీల్‌ విలువ 104.29 కోట్ల రూపాయలు.
business
8,160
24-11-2017 16:31:02
హలో.. 'బిగ్‎బాస్'
మొదటి సినిమా పరాజయంతో రెండో సినిమాతో ఎలాగైనా హీరోగా సత్తా చాటాలని అక్కినేని అఖిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న చిత్రం ‘హలో’. అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ వంటి మెమెరబుల్ మూవీని ఇచ్చిన విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అక్కినేని నాగార్జున నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 22న విడుదలకానుంది. అయితే ఈ సినిమాలోని పాత్రలను పరిచయం చేయడంలో అఖిల్ ఓ వినూత్న పద్దతిలో వెళుతున్నాడు. 'హలో' చెప్పండి అంటూ ఒక్కో పాత్ర లుక్ బయటకు వదలడం ఆసక్తి కలిగిస్తోంది. మొదటగా తన పాత్రను పరిచయం చేసిన అఖిల్ ఇటీవల తన తల్లిదండ్రుల పాత్రలను (జగపతి బాబు, రమ్యకృష్ణ) పరిచయం చేసి వారికి హలో చెప్పించాడు. ఇక తాజాగా కొద్దిసేపటి క్రితం నటుడు అజయ్ పాత్రను పరిచయం చేస్తూ ఓ పోస్టర్ పెట్టాడు. ఇందులో అజయ్ కోపంగా ఓ వ్యక్తిని ఏదో అడుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ పోస్టర్‎ని అఖిల్ తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ.. 'తెరా వెనుక ఓ జెంటిల్‎మెన్.. తెరపై మాత్రం బిగ్‎బాస్. రిషికి హలో చెప్పండి' అని టాగ్ చేశాడు. ఈ పోస్టర్ చూస్తుంటే అజయ్ ఈ సినిమాలో విలన్‎గా కనిపిస్తాడని తెలుస్తోంది.
entertainment
8,998
06-09-2017 11:34:17
మళ్లీ ఆ బ్యూటీ వెండితెరపై కనిపిస్తుందట!
"కుటుంబ పరిస్థితుల వల్లే ఇంత విరామం.. డైరెక్షన్ చేయడానికి తగిన కథలు నా వద్ద లేవు. కాబట్టి కొద్ది నెలల్లో మళ్లీ నటించడానికి సిద్ధమవుతున్నాను. గతంలో నేను నటించిన మేల్‌ఫిసియంట్‌ మూవీ సీక్వెల్‌ కోసం చర్చలు జరుగుతున్నాయి. మరో పక్క ఓ మూవీలో ఈజిప్ట్‌ రాణి క్లియోపాత్రా పాత్రలో నటించే ఆలోచన ఉంది. అయితే ఇంకా ఏదీ నిర్ణయించుకోలేదు" ఇదీ అందాల భామ ఏంజెలీనా జోలి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు. ఫస్ట్‌ దే కిల్డ్‌ మై ఫాదర్‌ అనే మూవీని ఏంజెలీనా తెరకెక్కించింది.  ప్రస్తుతం వెనిస్‌లో జరుగుతున్న చిత్రోత్సవంలో ఆ సినిమా ప్రదర్శితమైంది. ఈ సందర్భంగా జోలీ తన కెరీర్‌కు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు తెలిపింది. కొంతకాలంగా ఏంజెలీనా తన వైవాహిక జీవితంలో ఎదురైన విషమ పరిస్థితుల కారణంగా నటనకు దూరమైంది. తన భర్తతో ఆమె విడాకులు తీసుకుని తన సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఇప్పుడు మళ్లీ ఈ బ్యూటీ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనుంది. అయితే ఇంతకాలం వెండితెరకు దూరమైనా దర్శకురాలిగా మాత్రం బిజీ బిజీగా గడిపింది.
entertainment
8,688
14-06-2017 19:32:30
దర్శకుడిపై ఒత్తిడి పెంచుతున్న ఎన్టీఆర్
స్టార్ హీరోలందరూ తమ సినిమా రిలీజ్ డేట్స్‌ను ముందుగానే ఫిక్స్ చేసుకుంటుండటంతో... ఆ క్రేజీ హీరో కూడా ఈ విషయంపై ఫోకస్ పెట్టాడట. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తేదీన సినిమా విడుదల కావాల్సిందే అంటూ దర్శకుడిపై ఒత్తిడి తీసుకొస్తున్నాడట. స్టార్ హీరోల సినిమాలు ఎప్పుడు సెట్స్ మీదకు వెళతాయో... ఎప్పుడు విడుదలకు సిద్ధమవుతాయో చెప్పడం చాలా కష్టమైపోయింది. ముందుగా ఫిక్స్ చేసుకున్న సమయానికి సినిమాను విడుదల చేయడంతో దర్శకనిర్మాతలు పెద్దగా సక్సెస్ కావడం లేదు. లేటెస్ట్‌గా యంగ్ టైగర్ నయా మూవీ 'జై లవకుశ' విషయంలోనూ ఇదే జరిగిందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతేడాది 'జనతా గ్యారేజ్' ఆడియెన్స్ ముందుకు వచ్చిన సెప్టెంబర్ 1 నాడు 'జై లవకుశ'ను విడుదల చేయాలని అనుకున్నారని... కానీ ఈ సినిమా అక్టోబర్‌కు వాయిదా పడిందని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 1నే విడుదల చేయాలని దర్శకుడు బాబీపై ఎన్టీఆర్ ఒత్తిడి తీసుకొస్తున్నాడట. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం అవసరమైతే మరింత ఎక్స్‌ట్రా టైమ్ కేటాయించేందుకు యంగ్ టైగర్ సిద్ధమైనట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమా నిర్మాత, ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ సైతం... ఈ విషయంలో తమ్ముడి మాటకే జై కొట్టాడని తెలుస్తోంది. సెప్టెంబర్ 1న మిస్సయితే... మళ్లీ సరైన సీజన్ దొరకడం కష్టమని... దసరా స్లాట్‌ను బాలకృష్ణతో పాటు మహేశ్ బాబు ఆల్రెడీ బుక్ చేసుకోవడంతో... సెప్టెంబర్ 1న ఆడియెన్స్ ముందుకు రావడమే బెటర్ అని నందమూరి బ్రదర్స్ ఫిక్స్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి... తన నయా మూవీని తొందరగా పూర్తి చేయడంతో పాటు... సెంటిమెంట్ డేట్ రోజునే ప్రేక్షకుల ముందుకు రావాలని టాలీవుడ్ క్రేజీ హీరో గట్టిగా ఫిక్స్ అయ్యాడని క్లియర్‌గా అర్థమవుతోంది.
entertainment
8,914
12-12-2017 18:54:09
విజయ్ సాయి గురించి ఆసక్తికర విషయం చెప్పిన రవిబాబు
హైదరాబాద్: ఒక మంచి ఆర్టిస్టు, మిత్రుడిని కోల్పోయామని నటుడు, నిర్మాత, డైరక్టర్ రవిబాబు అన్నారు. హాస్య నటుడు విజయ్ సాయి భౌతికకాయానికి మంగళవారం సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం రవిబాబు మీడియాతో మాట్లాడుతూ.. విజయ్ తల్లిదండ్రులు చేతికి అందివచ్చిన బంగారు కొడుకును కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయ్ సినిమా ప్రస్తానం (అమ్మాయిలు అబ్బాయిలు) తనతోనే మొదలయ్యిందని అన్నారు. తన తొలి సినిమాకు పొట్టి వ్యక్తి కావాలని అనుకున్నామని, అందుకు విజయ్ వచ్చారని, అయితే తాను అనుకున్నదానికంటే విజయ్ అంగుళం ఎక్కువ ఉన్నాడని, దాంతో పనికిరావని చెప్పి పంపేశానని చెప్పారు. మరుసటి రోజు మళ్లీ విజయ్ తన కార్యాలయానికి వచ్చాడని, మళ్లీ ఎందుకు వచ్చావని ప్రశ్నించగా ‘‘సార్ నిన్న షూస్ వేసుకు వచ్చాను, ఇవాళ షూస్ లేకుండా వచ్చాను. ఇప్పుడు సరిపోతానేమో చూడండి అన్నాడు’’.. దాంతో మళ్లీ చూడగా తాను అనుకున్నదానికంటే కొంచెం తక్కువే ఉన్నాడని, దాంతో ఆ వేషం విజయ్‌కే ఇవ్వాలని చెప్పడం జరిగిందని, ఇది జరిగి సుమారు 13, 14 ఏళ్లు అయిందని రవిబాబు పేర్కొన్నారు. ఆ తర్వాత అతనితో చాలా సినిమాలు చేశానని సోగ్గాడు, పార్టీ తదితర సినిమాలు చేశానని రవిబాబు చెప్పారు. విజయ్ బయట ఉన్నా తనతో ప్రతి విషయం మాట్లాడేవాడని రవిబాబు తెలిపారు.
entertainment
15,022
22-02-2017 23:37:11
బీర్‌ బాటిళ్లపై వినాయకుని బొమ్మలు
అమెరికాలోని ఆన్‌లైన్‌ వ్యాపార సంస్థ ఒకటి హిందూ దేవుడు గణపతి బొమ్మలతో ఉన్న బీర్లను అమ్మకానికి పెట్టింది. దీనిపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. లాస్ట్‌కా్‌స్ట.కామ్‌ అనే ఈ ఆన్‌లైన్‌ సంస్థ వినాయకుని బొమ్మలు ముద్రించిన బీర్లను విక్రయానికి పెట్టడంతో హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే, మరో సంస్థ ఓం గుర్తును ముద్రించిన షూలను విక్రయానికి ఉంచింది. ఈ రెండు సంస్థలపై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు.
nation
13,634
11-09-2017 03:51:45
భారతీయ అమెరికన్లకు ఆపన్నహస్తం
వాషింగ్టన్‌, సెప్టెంబరు 10: అత్యంత శక్తివంతమైన ఇర్మా హరికేన్‌ పడగెత్తిన ఫ్లోరిడావ్యాప్తంగా దాదాపు 1,20,000 మంది భారతీయ అమెరికన్లు నివసిస్తున్నారు. వీరిలో వేలాది మంది ప్రస్తుతం డేంజర్‌ జోన్లు అయిన మియామీ, ఫోర్ట్‌ లాడర్‌డేల్‌, తంపాలో ఉన్నారు. బలహీనపడిందనుకున్న ఇర్మా మళ్లీ ప్రచండంగా మారడంతో ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు నానా పాట్లు పడ్డారు. అమెరికాలో భారతీయ రాయబార కార్యాలయం 24 గంటలూ పనిచేసే విధంగా హెల్ప్‌లైన్‌ నంబర్‌ను ప్రారంభించింది. సీనియర్‌ అధికారులను హుటాహుటీన అట్లాంటాకు పంపింది. వీరి ఆధ్వర్యంలో భారతీయ అమెరికన్లకు సహాయ పునరావాస కార్య క్రమాలు చేపట్టారు. భారత రాయబారి నవతేజ్‌ సర్న అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.  న్యూయార్క్‌లో భారత కాన్సుల్‌ జనరల్‌ సందీప్‌ చక్రవర్తి అట్లాంటాలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌లో ఉండి తక్షణ సహాయ సహకారాలు అందే విధంగా చూస్తున్నారు. కింగ్‌స్టన్‌లోని భారత్‌ హైకమిషన్‌ కార్యాలయంలో కూడా 24/7 హెల్ప్‌లైన్‌ ప్రారంభించినట్లు విదేశాంగ శాఖ మంత్రి ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ ట్వీట్‌ ద్వారా తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించేందుకు ఈమెయిల్‌ ఐడీలను ఆయన తెలియజేశారు. ఇండియన్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ అట్లాంటా, గుజరాత్‌ సమాజ్‌ అట్లాంటా, హిందూ టెంపుల్‌ ఆఫ్‌ అట్లాంటా మూడు పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశాయి. పలువురు ప్రవాస భారతీయ వ్యాపారులు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు.
nation
19,232
01-04-2017 15:54:47
ఆరెస్సెస్ చీఫ్‌ భగవత్‌కు కాంగ్రెస్ నేత మద్దతు
న్యూఢిల్లీ : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్‌‌ను రాష్ట్రపతిగా ఎన్నుకోవాలన్న ప్రతిపాదనకు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రైల్వే మంత్రి సీకే జాఫర్ షరీఫ్ మద్దతు పలికారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆయన రాసిన లేఖలో రాష్ట్రపతి పదవికి భగవత్‌ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలన్న ప్రతిపాదనను తప్పుబట్టాల్సిందేమీ లేదని పేర్కొన్నారు. భగవత్ భారత దేశ రాజ్యాంగానికి కట్టుబడి ఉండటాన్ని ప్రశంసించారు. ఆయన దేశభక్తి పట్ల ఎటువంటి సందేహాలు అవసరం లేదన్నారు. భారతీయుల పట్ల ఆయన ప్రదర్శించే ప్రేమను శంకించవలసిన అవసరం లేదని తెలిపారు. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యాలకు ఆయన కట్టుబడి ఉంటున్నారన్నారు. బంగ్లాదేశ్ యుద్ధం అనంతరం అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని దేశ ప్రయోజనాల దృష్ట్యా ఆరెస్సెస్ బలపరిచిందని షరీఫ్ గుర్తు చేశారు. దేశభక్తుడు, ప్రజాస్వామ్యానికి కట్టుబడిన వ్యక్తి, ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న నేత పట్ల నమ్మకం లేదని చెప్పేంత సంకుచిత భావం ఎందుకు ఉండాలి? అని ప్రశ్నించారు.
nation
1,248
08-12-2017 01:08:32
విజయవాడ-ముంబై-దుబాయ్‌ విమాన సర్వీసు
ఫిబ్రవరిలో ప్రారంభించనున్న ఎయిర్‌ ఇండియా విజయవాడ (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి తలమానికమైన విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మరికొద్ది రోజుల్లో ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విజయవాడ నుంచి ముంబై, అక్కడి నుంచి దుబాయి, షార్జాలకు విమాన సర్వీసులను నడపాలని నిర్ణయించింది.  అంతర్జాతీయ సర్వీసు నడపటానికి వీలుగా ఇప్పటి కే విజయవాడ విమానాశ్రయంలో అంతర్జాతీయ టెర్మినల్‌ రూపుదిద్దుకుంది. ఈ టెర్మినల్‌ నుంచి ఇమ్మిగ్రేషన్‌ కార్యకలాపాలు జనవరి 15 నుంచి ప్రారంభం కావచ్చని విమానాశ్రయ అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ విమాన సర్వీసు ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. విజయవాడ నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడపటానికి విజయవాడ విమానాశ్రయ డైరెక్టర్‌ గిరి మధుసూదనరావు ఎయిర్‌ ఇండియాతో కొద్ది కాలం నుంచి సంప్రదింపులు సాగించటంతో విమాన సర్వీసును ప్రారంభించేదుకు సుముఖత వ్యక్తంచేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా సింగపూర్‌ ప్రభుత్వంతో మరో విమానయాన సర్వీసు కోసం కృషి చేస్తోంది. మినిమం గ్యారంటీ కల్పిస్తామన్న హామీని కూడా ప్రభుత్వం ఇచ్చింది.
business
14,275
13-01-2017 02:56:31
పెట్రోలు బంకుల్లో కార్డు చార్జీలు బ్యాంకులు, కంపెనీలదే: కేంద్రం
న్యూఢిల్లీ, జనవరి 12: పెట్రోలు బంకుల్లో కార్డుల ద్వారా జరిపే లావాదేవీలపై వేసే చార్జీలను ఇకపై బ్యాంకులు, చమురు కంపెనీలు భరించనున్నాయి. కార్డు లావాదేవీల చార్జీలు రద్దు చేయకుంటే కార్డులను అంగీకరించబోమని బంకుల యజమానులు హెచ్చరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ, ఆర్థిక సేవల విభాగం గురువారం సమీక్షా సమావేశం నిర్వహించాయి. కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ పాల్గొన్నారు. ‘కార్డుల ద్వారా లావాదేవీలు జరిపే వినియోగదారులపై భారం పడటానికి వీల్లేదు. ఈ భారాన్ని బ్యాంకులు, చమురు కంపెనీలే భరిస్తాయి. బంకుల యజమానులు కూడా వాటిని చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ భారాన్ని ఏ నిష్పత్తిలో భరించాలో ఒకటి రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటారు’ అని ఆయన వివరించారు.
nation
19,785
10-02-2017 00:01:55
బాక్సర్‌కు గౌతీ సాయం
న్యూఢిల్లీ: కేన్సర్‌తో పోరాడుతున్న బాక్సర్‌ డింకో సిం గ్‌కు క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఆర్థిక సహా యం చేశాడు. 1998 ఆసియా క్రీడల్లో డింకో స్వర్ణ పతకం సాధించాడు. అర్జున, పద్మశ్రీ అవార్డులు కూడా డింకోను వరించాయి. సాయ్‌ లో కోచ్‌గా పని చేస్తున్న సింగ్‌ లివర్‌ కేన్సర్‌ బారినపడ్డాడు. దీంతో ఆపరేషన్‌ చేసి 70 శాతం లివర్‌ను తొలగించారు. గంభీర్‌ ఆర్థిక సాయంతో ఇంఫాల్‌లో ఉన్న డింకోకు కీమోథెరపీ చేయించనున్నారు. అయితే డింకో దీనావస్థ తనను ఎంతో కదిలించిందని గంభీర్‌ చెప్పాడు. దీంతో తాను చేయగలిగిన సాయం చేసినట్టు తెలిపాడు. డింకోకు తాను కూడా సాయం చేస్తానని ప్రముఖ ప్రొ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ ముం దుకొచ్చాడు.
sports
9,626
29-08-2017 23:18:45
ఫస్ట్‌లుక్‌ ‘మళ్లీ వచ్చిందా..!’
కిరణ్‌, దివ్యరావు జంటగా నటిస్తున్న చిత్రం ‘మళ్లీ వచ్చిందా’. కె.నరేంద్రబాబు దర్శకుడు. వెంకటేశ్‌. సి నిర్మాత. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. దర్శకుడు నరేంద్రబాబు మాట్లాడుతూ ‘‘ఓ దెయ్యం ఫోన్‌ నుంచి ఫోన్‌కి కూడా వెళ్లి మనుషుల్ని భయపెట్టగలదని తెలిపే సినిమా ఇది. ఆద్యంతం ఉత్కంగా సాగుతుంది’’ అని తెలిపారు.
entertainment
19,835
06-01-2017 18:39:10
అక్కడ మాత్రం కెప్టెన్‌గా కోహ్లీ కాదట ధోనీనే..: ప్రకటించిన సెలక్టర్లు
ముంబై: పరిమిత ఓవర్ల కెప్టెన్ బాధ్యతల నుంచి ధోనీ తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌కు కోహ్లీనే సారధిగా ప్రకటించారు సెలక్టర్లు. ధోనీ మాత్రం ఈ రెండు ఫార్మెట్లలో వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్‌గా కొనగనున్నాడు. అయితే ధోనికి మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు సెలక్టర్లు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు ఇరుదేశాల ‘ఏ’ జట్ల మధ్య రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అందులో మొదటి మ్యాచ్‌కు ధోనీనే కెప్టెన్‌గా జట్టును నడిపంచనున్నాడరి సెలక్షన్ కమిటీ తెలిపింది. అయితే రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో రహానే సారధిగా ఉండనున్నాడు. జనవరి 15న ఇంగ్లండ్‌తో జరగబోయే మొదటి వన్డే నుంచి కోహ్లీ కెప్టెన్‌‌గా వ్యవహరిస్తాడు. మొదటి వార్మప్ మ్యాచ్‌కు భారత ‘ఏ’ జట్టుధోనీ(కెప్టెన్), మన్దీప్ సింగ్, అంబటి రాయుడు, యువరాజ్ సింగ్, హర్ధిక్ పాండ్యా, సంజూ శాంమ్సన్, కుల్దీప్ యాదవ్, యుజ్‌వేంద్ర చహల్, నెహ్రా, మోహిత్ శర్మ, సిద్ధార్ద్ కౌల్. రెండో వార్మప్ మ్యాచ్‌కు భారత ‘ఏ’ జట్టురహానే(కెప్టెన్), రిషబ్ పంత్, సురేష్ రైనా, దీపక్ హుడా, ఇషాన్ కిషన్, షెల్డన్ జాక్సన్, విజయ్ శంకర్, షెహ్బజ్ నదీమ్, పర్వేజ్ రశూల్, వినయ్ కుమార్, ప్రదీప్, అశోక్ దిండా. మొదటి వార్మప్ మ్యాచ్‌కు భారత ‘ఏ’ జట్టుధోనీ(కెప్టెన్), మన్దీప్ సింగ్, అంబటి రాయుడు, యువరాజ్ సింగ్, హర్ధిక్ పాండ్యా, సంజూ శాంమ్సన్, కుల్దీప్ యాదవ్, యుజ్‌వేంద్ర చహల్, నెహ్రా, మోహిత్ శర్మ, సిద్ధార్ద్ కౌల్. రెండో వార్మప్ మ్యాచ్‌కు భారత ‘ఏ’ జట్టురహానే(కెప్టెన్), రిషబ్ పంత్, సురేష్ రైనా, దీపక్ హుడా, ఇషాన్ కిషన్, షెల్డన్ జాక్సన్, విజయ్ శంకర్, షెహ్బజ్ నదీమ్, పర్వేజ్ రశూల్, వినయ్ కుమార్, ప్రదీప్, అశోక్ దిండా. ఇంగ్లండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు..వన్డే టీం : విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఎమ్మెస్ ధోనీ(వికెట్ కీపర్), కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, యువరాజ్ సింగ్, అజింక్యా రహానే, హార్ధిక్ పాండ్యా, అశ్విన్, జడేజా, అమిత్ మిశ్రా, జస్ప్రిత్ బూమ్రా, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్.  టీ20 టీం : విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఎమ్మెస్ ధోనీ(వికెట్ కీపర్), మన్దీప్, కెఎల్ రాహుల్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, అశ్విన్, జడేజా, చహల్, మనీష్ పాండే, బూమ్రా, భువనేశ్వర్, ఆశిస్ నెహ్రా ఇంగ్లండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు..వన్డే టీం : విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఎమ్మెస్ ధోనీ(వికెట్ కీపర్), కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, యువరాజ్ సింగ్, అజింక్యా రహానే, హార్ధిక్ పాండ్యా, అశ్విన్, జడేజా, అమిత్ మిశ్రా, జస్ప్రిత్ బూమ్రా, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్.  టీ20 టీం : విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఎమ్మెస్ ధోనీ(వికెట్ కీపర్), మన్దీప్, కెఎల్ రాహుల్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, అశ్విన్, జడేజా, చహల్, మనీష్ పాండే, బూమ్రా, భువనేశ్వర్, ఆశిస్ నెహ్రా
sports
12,898
20-11-2017 17:44:59
రాష్ట్రపతి అరుణాచల్ పర్యటనపై చైనా పుల్లవిరుపు...
బీజింగ్: చైనా మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అరుణాచల్ ప్రదేశ్‌లో ఆదివారం పర్యటించడంపై అక్కసు వెళ్లగక్కింది. ఇండో-చైనా సంబంధాలు కీలక దశలో ఉన్న తరుణంలో సమస్యను న్యూఢిల్లీ మరింత జఠిలం చేయడం సరికాదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లు కాంగ్ మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. 'అరుణాచల్ ప్రదేశ్‌గా చెప్పుకునే ప్రాంతాన్ని చైనా ఎప్పుడూ గుర్తించలేదు' అని ఓ ప్రశ్నకు సమాధానంగా లు కాంగ్ చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ తమదేనని చైనా చాలాకాలంగా మొండిగా వాదిస్తూనే ఉంది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించడంపై కూడా చైనా అభ్యంతరం తెలిపింది. ఆ సందర్భంలో చైనా అభ్యంతరాన్ని భారత్ తోసిపుచ్చింది. తమదైన అరుణాచల్ ప్రదేశ్‌లో ఎన్నిసార్లైనా పర్యటిస్తామని తేల్చిచెప్పింది. కాగా, ఆదివారంనాడు అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అరుణాచల్ ప్రదేశ్ ప్రాధాన్యాన్ని మరింత నొక్కి చెప్పారు. దేశానికి ఈశాన్య భారతం కిరీటమైతే, అరుణాచల్ ప్రదేశ్ ఆ కిరీటంలో మణిహారమని కొనియాడారు.
nation
12,100
09-07-2017 02:29:19
ముంబైలో బాలికపై గ్యాంగ్‌ రేప్‌
ముంబై, జూలై 8: తండ్రి స్నేహితుడే కదా అని నమ్మి వెళ్లిన పాపానికి ఓ బాలిక జీవితం బలైపోయింది. ఆమెను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లిన ఆ మానవమృగం మరో ముగ్గురితో కలిసి 24 గంటలపాటు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన ముంబై భందూప్‌ ప్రాంతంలో జరిగింది. అక్కడి నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి చేరుకుని జరిగిన దారుణాన్ని తల్లికి చెప్పింది. బాధితురాలి తల్లిదండ్రులు ట్రోంబే పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితులు ఆనంద కాన్పూరే, కేవల్‌ తివార్‌, సాయి బత్తేను అరెస్ట్‌ చేశారు. మరో నిందితుడు భరత్‌ ఓవ్హల్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
nation
6,004
12-10-2017 11:39:07
బాలకృష్ణ సంచలన నిర్ణయం..
ఇటీవల హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ.. అభిమానులపై చేయి చేసుకుంటారన్న ఆరోపణలు బాగా వస్తున్నాయి. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తనకు అభిమానులంటే ప్రాణం అని తెలిపారు. వారికి దగ్గరగా ఉంటానని చెప్పారు. కానీ తాను అభిమానుల మధ్యకు వెళ్లినపుడు కొందరి పనులు తనను ఇబ్బంది పెడతాయనీ.. అవి ఇతరులకు కనిపించవన్నారు. ఆ తర్వాత బాలయ్య కొట్టాడంటూ న్యూస్ వైరల్ చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.  తనకు బౌన్సర్లను ఉపయోగించుకోవడం నచ్చదని.. చాలా కాలం క్రితం ఓ ఈవెంట్‌లో తన బౌన్సర్లు తన అభిమానులపై చేయి చేసుకున్నారని అప్పటి నుంచి బౌన్సర్లు వద్దని నిర్ణయించుకున్నానని తెలిపారు. అయితే తనపై వస్తున్న ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారని టాక్. తన సన్నిహితుల సలహా మేరకు ఇక మీదట తిరిగి బౌన్సర్లను నియమించుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.
entertainment
21,283
16-01-2017 10:05:26
అజర్‌కు ఎదురుదెబ్బ
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడా ప్రతినిధి): హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఎన్నికలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికల్లో ఉత్కంఠ రేపిన భారత మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజరుద్దీన్‌కు గట్టి షాగిలింది. అధ్యక్ష పదవికి అతని నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి కె. రాజీవ్‌ రెడ్డి తిరస్కరించారు. మ్యాచ్‌-ఫిక్సింగ్‌ కుంభకోణంలో అజర్‌పై బీసీసీఐ ఇంకా నిషేధం ఎత్తివేయలేదని, దీనిపై అతను సరైన ఆధారాలు చూపలేదని రిటర్నింగ్‌ అధికారి రాజీవ్‌ రెడ్డి తెలిపారు. నిషేధం విషయంలో కోర్టు ఉత్వర్వులు చూపాడని, కానీ, బోర్డు నుంచి ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని, హెచ్‌సీఏలో ఓటు హక్కు ఉన్నట్టు సరైన ఆధారాలు చూపని కారణంగా అజర్‌ నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్టు శనివారం ఆయన చెప్పారు. దీంతో క్రికెట్‌ పాలకుడిగా కొత్త ఇన్నింగ్స్‌ ఆరంభించాలన్న అజర్‌కు ఎదురుదెబ్బ తగిలినట్టయింది. అదే విధంగా, వివిధ పోస్టులకు ప్రస్తుత కార్యవర్గ సభ్యులు వేసిన నామినేషన్లను ‘కూలింగ్‌ ఆఫ్‌ పిరియడ్‌’ నిబంధన కారణంగా తిరస్కరించారు. అజర్‌ లేకపోవడంతో.. ఇక అధ్యక్ష రేసులో ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ జి. వివేకానంద్‌, విద్యుత జయసింహ బరిలో నిలిచారు. కార్యదర్శి పోస్టుకు మాజీ సభ్యుడు శేష్‌ నారాయణ ఒక్కరే బరిలో మిగలడంతో ఏకగ్రీవంగా ఎన్నికవనున్నారు. మొత్తంగా, ఆరు పోస్టుల (అధ్యక్షుడు, కార్యదర్శి, ఉపాధ్యక్షుడు, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, ఈసీ సభ్యుడు)కు 18 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. ఉపాధ్యక్ష పదవి కోసం కె.అనిల్‌ కుమార్‌, ఇమ్రాన్‌ మహమూద్‌, సంయుక్త కార్యదర్శికి ఇ.వెంకట్‌రామ్‌ రెడ్డి, అజ్మల్‌ అసద్‌, కోశాధికారి కోసం మహేందర్‌, పి.అనురాధ, శ్రీనివాస్‌ పట్టపు, ఈసీ సభ్యుడి కోసం రాకేశ్‌ సింగ్‌, యోగేశ్‌ మోహతా, ధరమ్‌చంద్‌, మహ్మద్‌ ఇమాదుద్దుమ్‌ ఫరూఖి, జి.రామకృష్ణ, సతీ్‌షచంద్ర, వంకా మహేందర్‌, కె.హన్మంత రెడ్డి బరిలో నిలిచారు. వివేక్‌ వర్గం నుంచి అనిల్‌ కుమార్‌, అజ్మల్‌ అసద్‌, వెంకట్‌రామ్‌ రెడ్డి, మహేందర్‌, హనుమంత రెడ్డి పోటీలో ఉన్నారు. మరో వర్గంగా ఉన్న విద్యుత జయసింహ నుంచి వివేక్‌ ప్యానెల్‌కు తీవ్ర పోటీ ఉండకపోవచ్చని పలువురు భావిస్తున్నారు. మంగళవారం జరుగనున్న ఎన్నికల ఫలితాలను.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ ప్రకటించొద్దని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
sports
10,442
11-07-2017 15:59:04
దిల్‌రాజును డాడీ అనేసిన హీరోయిన్!
మలయాళంలో ప్రేమమ్‌తో ఆకట్టుకున్న సాయిపల్లవి.. తెలుగులో తొలిసారిగా వరుణ్‌తేజ్‌తో శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ఫిదా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఆడియో వేడుకను సోమవారం సాయంత్రం నిర్వహించారు. కార్యక్రమంలో నేర్చుకున్న కొద్దిపాటి తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు సాయిపల్లవి. సినిమాలో భావోద్వేగాలు, చాలా జ్ఞాపకాలు ఉన్నాయని ఆమె చెప్పారు. మాట్లాడుతూ అందరికీ కృతజ్ఞతలు తెలిపిన సాయిపల్లవి.. ఆ సినిమా నిర్మాత దిల్ రాజు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.           సినిమా షూటింగ్ సమయంలో దిల్ రాజు గారు ఎంతో ఓపికగా ఉన్నారని, తనతో ఆయనెప్పుడూ ఓ నిర్మాతలా వ్యవహరించలేదని చెప్పారు. ఒక తండ్రిలా తనతో వ్యవహరించారని చెప్పారు. ఆయన ఓ డాడీలా నడుచుకున్నారని, ఫాదర్ ఫిగర్ అంటూ వ్యాఖ్యానించారు. సినిమా ఆడియో ఫంక్షన్లో తెలుగులోనే మాట్లాడతానని షూటింగ్ మొదలైనప్పుడే చెప్పానని, కానీ, ఇప్పుడు మాట్లాడదామన్నా భయమేస్తోందని చెప్పారు. షూటింగ్‌లో పాల్గొన్నన్ని రోజులూ ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ఆమె చెప్పారు.
entertainment
15,044
16-03-2017 23:39:02
ఓపీఎస్‌ ఆరోపణలు పట్టించుకోవద్దు
ఎన్నికల సంఘానికి తంబిదురై వినతి చెన్నై, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకేలో ఎలాంటి చీలికలు లేవని, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వర్గీయులు పార్టీ చిహ్నం కోసం చేసిన ఆరోపణలను పట్టించుకోవద్దని లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ తంబిదురై కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. అన్నాడీఎంకేపై తిరుగుబాటు చేసిన పన్నీర్‌సెల్వం నాయకత్వంలో ప్రతినిధుల బృందం బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నజీమ్‌జైదీని కలిసి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లదని, తమదే నిజమైన అన్నాడీఎంకే పార్టీ అనీ, తమకే రెండాకుల గుర్తు కేటాయించాలని వినతి పత్రాలను సమర్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తంబిదురై నాయకత్వంలో అన్నాడీఎంకే ఎంపీలు, పార్టీ సీనియర్ల బృందం గురువారం ఎన్నికల సంఘం అధికారులను కలిసి తమ వాదనలను వినిపించింది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా అభ్యంతరాలు తెలియజేయవచ్చని, అయితే అందులోని నిజనిజాలను పరిశీలించాల్సి ఉంటుందన్నారు. అన్నాడీఎంకేలో ప్రస్తుతం చీలికలు ఏర్పడలేదని, అలాంటప్పుడు ప్రత్యర్థి వర్గం చేస్తున్న ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. శశికళను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేయడం పార్టీ నియమాలకు వ్యతిరేకం కాదని, పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్‌ మృతి చెందినప్పుడు కూడా తక్షణ చర్యల్లో భాగంగానే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిని, ఆ తర్వాత ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర బడ్జెట్‌ దాఖలు, ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఎంపిక జరుగుతుందన్నారు. ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అయిన తర్వాత ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తంజావూరు, అరవకురిచ్చి, తిరుప్పరంకుండ్రం ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన పార్టీ అభ్యర్థుల జమాఖర్చుల వివరాలపై శశికళ సంతకాలు చేశారని, వాటిని కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆమోదించిందనీ చెప్పారు. ప్రస్తుతం శశికళ ఎంపికను సవాలు చేస్తున్నవారే ఆమెను ఆ పదవికి సిఫారసు చేస్తూ సంతకాలు చేశారన్న విషయాన్ని మరువకూడదని తంబిదురై అన్నారు.
nation
169
14-08-2017 00:24:15
ఆర్థిక స్వాతంత్య్రం లభించాలంటే..
‘ఆర్థిక భద్రత, స్వాత్రంత్యం లేని చోట నిజమైన వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదు’ అని ఫ్రాంక్లిన్‌ రూజ్‌ వెల్ట్‌ ఎప్పుడో చెప్పారు. ప్రస్తుతం మన దేశ ప్రజల ఆర్థిక పరిస్థితి చూస్తే ఇది ఎంత నిజమో అర్థమవుతుంది. ఏళ్ల పోరాటం, ఎంతో మంది మహామహుల ప్రాణత్యాగం ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. రేపు మనమంతా 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపు కోనున్నాం. వలస పాలన నుంచి స్వాతంత్య్రం పొంద డానికి అనేక రకాల వ్యూహాలు అనుసరించారు మన స్వాతంత్య్ర సమరయోధులు. ఇవన్నీ భారత పౌరులకు అవగతమే. ఆర్థికంగా స్వాతంత్య్రం పొందడానికి కూడా వ్యక్తులు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తే తమ లక్ష్యాన్ని చేరుకోవడం ఎంతో సులభం. ఫలితంగా జీవితం సాఫీగా సాగిపోతుంది. అదెలాగంటే.. అస్తమానం డబ్బు గురించి ఆందోళన వద్దు..డబ్బు చేతిలో లేని సమయంలో ఎప్పుడూ దాని గురిం చే ఆలోచిస్తుంటారు చాలామంది. ఇలాంటి ఆలోచనతో కాలం గడిపేస్తే వచ్చే ప్రయోజనం శూన్యం. అందుకే ఈ రకం ఆలోచనలను మనసులోంచి తీసివేయడం ఆర్థిక స్వాతంత్య్రం సాధించడంలో ముఖ్యమైన అంశం. గతంలో చేసిన తప్పుల గురించి చింతిస్తూ.. భవిష్యత్‌లో ఆర్థిక పరిస్థితి ఇంకా ఎంత ఘోరంగా ఉంటుందోనని మదన పడుతుండ టం వల్ల అడుగు ముందుకుపడదు. ఇదేజరిగితే విలువైన కాలం కరిగిపోయి ఆర్థిక స్వాతం త్య్రం పొందడం మరింత కష్టంగా మారిపోతుంది.  ఆర్థిక లక్ష్యాల నిర్దేశం..భవిష్యత్‌కు సంబంధించిన ఆర్థిక లక్ష్యాలను ముందే నిర్దేశించుకోవడం మంచిది. పదవీ విరమణ, ఇంటి కొనుగోలు, పిల్లల పెళ్లిళ్లు వంటి వాటి విషయంలో ఒక స్పష్టతను కలిగి ఉండాలి.  ఆచితూచి షాపింగ్‌..స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని డిస్కౌంట్లు, ఆఫర్ల హోరు మొదలైంది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో విపరీ తంగా ఆఫర్లను ఇస్తున్నారు. తక్కువ ధరకు వస్తున్నాయి కదా అని చాలా మంది అవసరం లేని ఉత్పత్తులను కూడా కొనేస్తుంటారు. ఫలితంగా బడ్జెట్‌ కట్టుతప్పుతుంది. అందుకే అవసరం ఉన్న ఉత్పత్తుల జాబితాను ముందుగా తయారు చేసుకోవాలి. తర్వాత అలాంటి వాటిపై ఎంత మేరకు ఆఫర్లు లభిస్తున్నాయో చూసుకుని కొనుగోళ్లు చేస్తే కొన్ని ఖర్చులనైనా తగ్గించుకోవచ్చు. పొదుపే మంత్రం..రోజుకు రూపాయి పొదుపు చేసినా నెల రోజులు తిరిగే సరికి రూ.30 అవుతుంది. అదే రూ.100 అయితే నెలకు రూ.3,000, ఏడాదికి రూ.36,000 అవుతుంది. ఇలా తెలియకుండానే పెద్దమొత్తంలో సొమ్ము జమ అవుతుంది. ఇలాంటి సొమ్ము అత్యవసర సమయంలో ఆపద్భాం ధవుడిగా ఆదుకుంటుంది. అందుకే పొదుపు మీరు పాటిస్తూనే మీ పిల్లలకూ నేర్పండి. మీ అవసరాలు తీరగా మిగిలిన మొత్తాన్ని స్టాక్‌ మార్కెట్‌ లేదా మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా సంపదను వృద్ధి పరచుకోవచ్చు. ఫలితంగా మీకు ఆర్థిక స్వాతంత్య్రం త్వరగానే వస్తుంది. ఆరోగ్య ఖర్చులపై జాగ్రత్త..నేటి కాలంలో ఏ వ్యాధులు ఎప్పుడు అంటుకుంటాయో చెప్పడం కష్టం. ఆరోగ్యపరంగా ఎన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నా దురదృష్టవశాత్తు ఏదైనా వ్యాధి సోకితే చేతి చమురు వదులుతుంది. చిన్న రోగానికి చికిత్స చేయిం చుకున్నా లక్షల్లో బిల్లులు చెల్లించే పరిస్థితి నెలకొంది. ఇలాంటప్పుడు మొత్తం కుటుంబ ఆర్థిక పరిస్థితే తలకిందులవుతుంది. అందుకే ఆరోగ్య బీమాను నిర్లక్ష్యం చేయవద్దు. బీమా కోసం చెల్లించే మొత్తం తక్కువే అయినా చాలా మంది దీనికి అంతగా ప్రాధాన్యం ఇవ్వరు. అయితే ఇలాంటి బీమానే ఆపత్కాలంలో ఆదుకుం టుందన్న విషయం మరవొద్దు. ఆరోగ్య బీమా రక్షణను కొనసాగించడం వల్ల ఆర్థిక స్వాతంత్య్రం సాధించడం మరింత సులభతరం అవుతుంది.  సమీక్ష..ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధించడం అనేది ఓ సుదూర ప్రయాణంలాంటిది. మీ లక్ష్యాన్ని సాధించేందుకు చేసే పెట్టుబడులు, పొదుపు, ఆస్తుల కొనుగోలు వంటి వాటిని కొంత కాలం తర్వాత సమీక్షించుకోవాలి. అవసరం అయితే మీ ఆలోచనల్లో మార్పులు చేసుకోవాలి. మీ సొమ్మును ఏదో ఒక రంగానికే పరిమితం చేయకుండా విభిన్న రంగాలకు విస్తరించడం వల్ల అనుకోని ఉపద్రవాలు ఎదురైనా మీ లక్ష్యం చెక్కు చెదరకుండా ఉంటుంది. సో.. ఈ స్వాతంత్య్ర దినోత్సవం నుంచైనా మీరు మీ ఆర్థిక స్వాతంత్య్రం గురించి ఆలోచించడం మొదలుపెట్టండి. బెస్ట్‌ ఆఫ్‌ లక్‌..
business
653
29-10-2017 02:33:23
మార్కెట్లోకి జెఎల్‌ఆర్‌ 7 సీట్ల డిస్కవరీ
ముంబై: టాటా మోటార్స్‌.. బ్రిటిష్‌ లగ్జరీ కార్ల దిగ్గజం జెఎల్‌ఆర్‌ మార్కెట్లోకి ఏడు సీట్ల లాండ్‌ రోవర్‌ డిస్కవరీని తీసుకువచ్చింది. ఈ కారు ధర రూ.71.38 లక్షల నుంచి రూ.82 లక్షల మధ్యన ఉన్నాయి. ఏడు సీట్ల ప్రీమియం ఎస్‌యువి 3 లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్స్‌తో తీసుకువచ్చినట్లు జెఎల్‌ఆర్‌ తెలిపింది. ఆటోమెటిక్‌ టైర్‌ లిఫ్టింగ్‌తో ఫుల్‌ సైజ్‌ స్పేర్‌ వీల్‌, ఇంటలిజెంట్‌ సీట్‌ ఫోల్డ్‌ ఫంక్షనాలిటీ ఈ ఎస్‌యువి ప్రత్యేకతలు.
business
1,874
31-03-2017 00:06:41
5 విమాన సంస్థలకు 128 రూట్లు
న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి) : కేంద్రప్రభుత్వం చిన్న నగరాలకు కూడా విమాన ప్రయాణ సదుపాయం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రకటించిన ప్రతిష్ఠాత్మక పథకం ఉడాన్‌ కింద ఐదు విమానయాన సంస్థలకు 128 రూట్లను గురువారం కేటాయించింది. ఈ విమానయాన సంస్థల్లో తెలుగు హీరో రామ్‌చరణ్‌ నిర్వహణలోని టర్బో మెఘా ఎయిర్‌లైన్స్‌ కూడా ఉంది. ఈ సంస్థకు 18 రూట్లు దక్కాయి. ట్రూజెట్‌ కడప నుంచి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, విజయవాడ నగరాలకు విమానాలు నడుపుతుంది. ఎయిర్‌ ఒడిశా గరిష్ఠంగా 50 రూట్లు గెలుచుకుంది. ఈ సంస్థ ఇతర మార్గాలతో పాటు జగదల్‌పూర్‌ నుంచి చెన్నై, విజయవాడ నగరాలకు విమాన సర్వీసులు నడపనుంది. ఇవి కాకుండా ఎయిర్‌ ఇండియా అనుబంధ సంస్థ అలయన్స్‌ ఎయిర్‌ 15 రూట్లు, ఎయిర్‌దక్కన్‌ 34 రూట్లు, స్పైస్‌జెట్‌ 11 రూట్లు సాధించాయి. ఉడాన్‌ పథకం కింద గంట ప్రయాణానికి టికెట్‌ ధరను 2500 రూపాయలకే పరిమితం చేశామని, దీని కోసం ప్రతీ సర్వీసులోను 50 శాతం సీట్లను కేటాయిస్తారని ఉడాన్‌ సర్వీసుల తొలి జాబితాను విడుదల చేసిన సందర్భంగా పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు తెలిపారు. తదుపరి దశలో మరో 50 విమానాశ్రయాలకు ఉడాన్‌ను విస్తరిస్తామని, వాటిలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలుంటాయని ఆయన అన్నారు. ఈ పథకం అమలులోకి రావడంతో మరిన్ని నగరాలు హైదరాబాద్‌తో అనుసంధానం అవుతాయని ఆయన చెప్పారు. కొత్తగూడెం విమానాశ్రయానికి అనుమతులు మంజూరయ్యాయని, రాష్ట్రప్రభుత్వం ఆ విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేస్తే అక్కడకు కూడా విమానాలు నడుపుతామని ఆయన అన్నారు. ఉడాన్‌ తొలి జాబితా ప్రకారం దేశంలోని 70 పట్టణాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. ఈ 70 విమానాశ్రయల్లో 31 అసలు విమాన సర్వీసులే నడవడంలేదు. 12 విమానాశ్రయాలు సామర్థ్యం మేరకు పని చేయలేకపోతున్నాయి. అయితే ఈ విమానాశ్రయాలన్నీ వినియోగానికి సిద్ధంగా ఉన్నవేనని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్‌ చౌబే చెప్పారు. ఎంపికైన సంస్థలు తమకు కేటాయించిన రూట్లలో 19 నుంచి 78 సీట్లు గల విమానాలను నడుపుతాయని ఆయన చెప్పారు. త్వరలోనే ఉడాన్‌ కింద తొలి విమానం గాలిలోకి ఎగురుతుందన్న ఆశాభావం ఆయన ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌తో సహా మొత్తం 20 రాష్ర్టాల్లోని వివిధ గమ్యాలకు ఈ విమానాలు నడుస్తాయని ఆయన అన్నారు. ఉడాన్‌ కింద ఆపరేటర్లందరికీ వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌ అందిస్తారు.  ఇందుకు అవసరం అయిన నిధులను ఢిల్లీ, ముంబై వంటి నగరాలకు నడిచే విమానాలపై 8500 రూపాయల లెవీ విధించడం ద్వారా వసూలు చేస్తారు. అంటే ఒక్కో ప్రయాణికుడిపై 50 రూపాయలు అదనపు భారం పడుతుంది. తొలి విడత బిడ్డింగ్‌లో రూట్లు గెలుచుకున్న ఆపరేటర్లకు ఏడాదికి 205 కోట్ల రూపాయలు విజిఎ్‌ఫగా అందించాల్సి ఉంటుందని అంచనా అని చౌబే చెప్పారు. ఒక్కో సీటుకు వారు కోరిన విజిఎఫ్‌ ఆధారంగా ఈ విమాయాన సంస్థలను ఎంపిక చేసినట్టు పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జయంతసిన్హా తెలిపారు.
business
13,538
26-05-2017 03:58:45
లోయలోకి పడ్డ స్కూల్‌ బస్సు.. అంతా క్షేమం
జమ్ము: జమ్ముకశ్మీర్‌లో 40 మంది విద్యార్థులున్న ఓ స్కూల్‌ బస్సు పెద్దలోయలోకి పల్టీలు కొట్టింది. గరీబ్‌ నవాజ్‌ స్కూల్‌కు చెందిన వారంతా మంజగాట్‌ నుంచి రాజౌరీకి పిక్‌నిక్‌కి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అయితే విద్యార్థులందరూ ఈ ప్రమాదం సురక్షితంగా బయటపడ్డారు. విద్యార్థులు క్షేమంగా తిరిగొచ్చారని పూంఛ్‌ ఎస్పీ మస్రూర్‌ మీర్‌ తెలిపారు.
nation
11,878
13-08-2017 15:31:08
చైనాకు యుద్ధంతోనే జవాబు చెప్పాలి: రాందేవ్ బాబా
ముంబై: సిక్కిం సెక్టార్‌లోని డోక్లాంలో చైనా, భారత్ మధ్య తలెత్తిన ప్రతిష్టంభన‌పై యోగా గురు రాందేవ్ బాబా ఘాటుగా స్పందించారు. కుక్క కాటుకు చెప్పుదెబ్బే సరైన సమాధానమని అన్నారు. చైనాకు శాంతిపై నమ్మకం లేదని, యుద్ధ పరిభాషనే అది ఇష్టపడుతోందని అన్నారు. ముంబైలో జరిగిన ప్రపంచ శాంతి, సామరస్య సదస్సులో రాందేవ్ బాబా తన సందేశాన్ని ఇచ్చారు. ఈ సదస్సులో ప్రముఖ టిబెట్ ఆధ్యాత్మిక వేత్త దలైలామా కూడా పాల్గొన్నారు. రాందేవ్ బాబా తన ప్రసంగంలో చైనా వైఖరిని ఎండగట్టారు. శాంతిపై చైనాకు నమ్మకం లేకపోవడం వల్లే ఈ రోజు దలైలామా ఇక్కడ ఉన్నారని, కుక్కకాటుకు చెప్పుదెబ్బ రీతిలో మనం వ్యవహరించాల్సి ఉంటుందని సూచించారు. యోగా పరిభాషలో మనం మాట్లాడుతుంటే చైనాకు తలకెక్కడం లేదన్నారు. యుద్ధమంటూ కలవరిస్తోందంటూ ఎద్దేవా చేశారు. యోగా భాష అర్ధం కాకుంటే చైనాకు అర్ధమైన యుద్ధ పరిభాషలోనే మనం సమాధానం చెప్పాల్సి ఉంటుందని రాందేవ్ బాబా అన్నారు. దలైలామా ఇటీవల డోక్లాం ప్రతిష్ఠంభనకు శాంతే పరిష్కారమని, ప్రజాస్వామ్యం పరిఢవిల్లినప్పుడే శాంతి సాధ్యమని చైనాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పక్కపక్క దేశాలైన చైనా, భారత్ 'హిందీ చీనీ భాయ్ భాయ్' అన్న రీతిలో ఉండాలంటూ హితవు పలికారు.
nation
12,176
12-09-2017 04:00:04
15లోపు పద్మ అవార్డులకు దరఖాస్తు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డులు-2018కి ఈ నెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర హోంశాఖ తెలిపింది. 15వ తేది అర్ధరాత్రి 12 గంటలకు దరఖాస్తుల ప్రక్రియ ముగుస్తుందని సోమవారం స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, మరే ఇతర మాధ్యమాల ద్వారా దరఖాస్తులను స్వీకరించబోమని తెలిపింది. వివరాలు, దరఖాస్తు కోసం www.padmaawards.gov.in ను సందర్శించాలని సూచించింది. కాగా, ఇప్పటిదాకా 15,700 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొంది.
nation
19,111
22-11-2017 23:59:42
2018ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించాలి
ఐక్యరాజ్యసమితికి భారత్‌ లేఖపోషక విలువలు సమృద్ధిగా ఉండే చిరుధాన్యాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం 2018ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితిని భారత్‌ కోరింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్‌సకు భారత వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌ లేఖ రాశారు. చిరుధాన్యాలైన జొన్నలు, సజ్జలు, రాగులకు భారత్‌లో ఎంతో ప్రాముఖ్యం ఉందని, కానీ.. అంతర్జాతీయంగా వీటి కొనుగోలుదారుల్లో, విధాన రూపకర్తల్లో, రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ రంగంలో అవగాహన తక్కువగా ఉందని పేర్కొన్నారు. చిరుధాన్యాల ఉత్పత్తి, కొనుగోలును ప్రోత్సహించడం ద్వారా ప్రపంచంలో ఆకలి సమస్యనూ తీర్చవచ్చునన్నారు. చిరుధాన్యాలు ఆహార పదార్థంగా, జంతువుల మేతగా, జీవ ఇంధనంగా పలు రకాలుగా ఉపయోగపడతాయని రాధామోహన్‌సింగ్‌ తెలిపారు.
nation
10,106
10-11-2017 22:41:08
దయచేసి అలా రాయకండి
‘‘నేను మొండివాడిని. నా గురించి ఎవరైనా ఏమైనా అంటే తట్టుకోగలను. కానీ, మా ఇంట్లో వాళ్లను, నా అభిమాన, బంధుకోటిని ఇబ్బందిపెట్టే హక్కు ఎవరికీ లేదు. నిజానిజాలు తెలుసుకోకుండా నా ఆరోగ్యం విషమించిందని అబద్ధపు ప్రచారం చేయకండి’’ అని ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు అన్నారు. ఆయన ఊపిరితిత్తులు పాడయ్యానని, గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారనీ సోషల్‌ మీడియాలో వార్తలు ప్రచారమయ్యాయి. వాటిని ఖండిస్తూ కోట శ్రీనివాసరావు హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం విలేకరులతో సమావేశమయ్యారు.  ‘‘నాకిప్పుడు 74 ఏళ్లు. కాళ్లు నొప్పో, కంటి నొప్పో రాదా? అయినా నాకు తెలిసిన వాళ్లు హాస్పిటల్లో ఉంటే పరామర్శించడానికి వెళ్లనా? నేనే కాదు.. ఎవరైనా హాస్పిటల్‌కి వెళ్లరా? హాస్పిటల్‌కి వెళ్లినంత మాత్రాన ప్రాణాంతక వ్యాధులు ఉన్నట్టేనా? వార్తలు ప్రచారం చేయడానికి ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. ఇది నా ఒక్కడి విషయంలో జరుగుతున్నది కాదు. ఇటీవల గాయని సుశీలగారి విషయంలోనూ ఇదే జరిగింది. దయచేసి ఇలాంటి అబద్ధపు ప్రచారం చేయవద్దు. ఆర్టిస్టులు సున్నితమనస్కులు. వారినీ, వారి కుటుంబాన్ని ఆందోళనకు గురిచేయవద్దు’’ అని కోట అన్నారు. ప్రస్తుతం ‘బాలకృష్ణుడు’, ‘ఆచారి అమెరికా యాత్ర’, ‘జవాన్‌’లో నటించినట్టు తెలిపారు. త్వరలో ‘సామి స్క్వయర్‌’ సినిమా సెట్స్‌కు వెళ్లనున్నట్టు చెప్పారు.
entertainment
10,217
05-01-2017 18:42:24
బెంగళూరు కీచకంపై స్పందించిన రకుల్
బెంగళూరు: కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో జరిగిన కీచకంపై సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరూ స్పందిస్తున్నారు. మనిషిగా పుట్టినందుకు సిగ్గుగా ఉందని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ స్పందిచగా, తప్పు జరిగిన వెంటనే అరెస్ట్ చేస్తే ఆడపిల్లలపై కన్నెత్తి చూడడానికి కూడా భయపడతారని బాలీవుడ్ మరో హీరో ఆమిర్ ఖాన్ తన స్పందన తెలియజేశాడు. తాజాగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా బెంగళూరు కీచకంపై సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టింది. ‘భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అవుతోందని ఓ చిత్రకారుడు చెప్పదలుచుకుంటే.. ఇంతకంటే బాగా చెప్పలేడేమో’ అనే క్యాప్షన్‌తో ఉన్న ఒక ఫొటోను తన ఫేస్‌బుక్‌లో షేర్ చేసి, ‘ఆడవాళ్లను వస్తువుగా చూడడం ఎప్పుడు మానేస్తారో.. మృగాళ్ల నుంచి మనకు ఎప్పడు విముక్తి కలుగుతుందో’ అని పోస్ట్ చేసింది.
entertainment
19,611
31-10-2017 04:44:54
కోహ్లీనే మళ్లీ నెంబర్‌ 1
కెరీర్‌లో అత్యధిక రేటింగ్‌ పాయింట్లుతొలి భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డుఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌దుబాయ్‌: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ హవా కొనసాగుతోంది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలతో అదరగొట్టిన విరాట్‌ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానానికి ఎగబాకాడు. రెండు నుంచి నెంబర్‌వన్‌ ర్యాంక్‌కు చేరాడు. కెరీర్‌లో అత్యధిక రేటింగ్‌ (889) పాయింట్లు సాధించిన భారత బ్యాట్స్‌మన్‌గా విరాట్‌ రికార్డు నెలకొల్పాడు. 1998లో సచిన్‌ అత్యధికంగా 887 రేటిం గ్‌ పాయింట్లు సాధించాడు. ఈ ఏడాది ఆరంభంలో కోహ్లీ మాస్టర్‌ను సమం చేశాడు. కాగా పది రోజుల వ్యవధిలోనే విరాట్‌కు మళ్లీ టాప్‌ ర్యాంక్‌ దక్కింది. డివిల్లీర్స్‌ (872 పాయింట్లు) టాప్‌ నుంచి రెం డో స్థానానికి పడిపోయాడు. రోహిత్‌ శర్మ కెరీర్‌లో అత్యధిక రేటింగ్‌ (799) పాయింట్లతో ఏడో ర్యాంక్‌ పదిలం చేసుకున్నాడు. బౌలింగ్‌లో జస్‌ప్రీత్‌ బుమ్రా రెండు స్థానాలు ఎగబాకి కెరీర్‌ బెస్ట్‌ మూడో ర్యాంక్‌లో నిలిచాడు. పాక్‌ బౌలర్‌ హసన్‌ అలీ టాప్‌లో ఉన్నాడు. కాగా, టీమ్‌ ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా అగ్రస్థానం పదిలం చేసుకుంది. భారత్‌, ఆస్ర్టేలియా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మిథాలీకి టాప్‌ ర్యాంక్‌: భారత మహిళా వన్డే కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ కూడా నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ సాధించింది. మిథాలీ 753 రేటింగ్‌ పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌కు చేరింది. ఎలీస్‌ ఫెర్రీ (ఆస్ర్టేలియా), అమీ సాటెర్త్‌వైట్‌ (న్యూజిలాండ్‌) ఒక్కో స్థానం ఎగబాకి రెండు, మూడు ర్యాంకుల్లో నిలిచారు. టీమ్‌ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌ను వెనక్కినెట్టి ఆస్ర్టేలియా టాప్‌ కు చేరుకుంది. టీమిండియా నాలుగో స్థానంలో ఉంది.
sports
3,246
21-08-2017 03:54:36
‘మిర్గం’ ఆవిష్కరణ
తెలంగాణ కవుల కవితా సంపుటి ‘మిర్గం’ ఆవి ష్కరణ, వనపట్ల సుబ్బయ్యకు తెలంగాణ సాహి త్య కళావేదిక పురస్కార ప్రదానోత్సవ సభ ఆగస్టు 27 సా.5.30గం.లకు దొడ్డి కొమరయ్య హాల్‌, సుంద రయ్య విజ్ఞానకేంద్రం, హైదరాబాద్‌ నందు జరుగు తుంది. అధ్యక్షులు ఏనుగు నరసింహారెడ్డి, ముఖ్య అతిథి ఘంటాచక్రపాణి, విశిష్ట అతిథి రాజేందర్‌జింబో.- అమ్మంగి వేణుగోపాల్‌
editorial
7,392
27-06-2017 22:32:59
రాజకుమారి ప్రేమకథ
నారా రోహిత్‌ కథానాయకుడిగా మహేశ్‌ సూరపనేని దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కథలో రాజకుమారి’. నమితా ప్రమోద్‌ కథానాయిక. నాగశౌర్య కీలకపాత్ర పోషిస్తున్నారు. సౌందర్య నర్రా, సుధాకర్‌రెడ్డి, కృష్ణ విజయ్‌ నిర్మాతలు. ఇళయరాజా, విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందించిన ఈ చిత్రం పాటల్ని, ట్రైలర్‌ను ఇటీవల ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘పరిణితి చెందిన ఓ జంట మధ్య జరిగే భావోద్వేగమైన ప్రేమకథ ఇది. చిత్రీకరణ, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. నారా రోహిత్‌ క్యారెక్టర్‌ కొత్తగా ఉంటుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు స్పందన బావుంది. జూలై నెలాఖరులో సినిమాను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని అన్నారు.
entertainment
20,075
27-07-2017 02:01:15
అందుకే.. ఆ రనౌట్‌
ముంబై : ఇంగ్లండ్‌తో గత ఆదివారం జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్లో మిథాలీరాజ్‌ రనౌట్‌ అయిన తీరుపై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తా యి. ప్రతి పరుగూ కీలకమైన దశలో, విజయం ఊరిస్తున్న తరుణంలో సాక్షాత్తు కెప్టెన్‌ రనౌట్‌ కావడం జీర్ణించుకోలేని నెటిజన్లు..ఆమెపై విమర్శల జడివా న కురిపించారు. అయితే ఆ రనౌట్‌పై మిథాలీ వివరణ ఇచ్చింది. ప్రపంచకప్‌లో పాల్గొన్న భారత బృందం బుధవారం లండన్‌నుంచి ముంబై చేరుకుంది. భారత జట్టుకు విమానాశ్రయంలో పలువురు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మిథాలీ విలేకరులతో మాట్లాడింది. ఈ సందర్భంగా ఆ రనౌట్‌, దానిపై విమర్శల పరంపర ప్రస్తావనకు వచ్చింది. దీనిపై మిథాలీ మాట్లాడుతూ ’పూనమ్‌ రౌత్‌ నన్ను పరుగుకోసం పిలిచింది. అయితే నా బూట్‌ స్పైక్‌ మైదానంలో కూరుకుపోయి వేగంగా పరుగు తీయలేకపోయాను. సగం దూరం వచ్చేసరికి ఈ సంఘటన జరిగింది. ఫలితంగా డైవింగ్‌ కోసం కూడా ప్రయత్నం చేయలేక నిస్సహా యురాలినయ్యాను’ అని వివరించింది. తన బూట్‌ స్పైక్‌ అలా గ్రౌండ్‌లో కూ రుకుపోయిన వైనాన్ని టీవీ కెమెరాలు పసిగట్టాయని తాను భావించడంలేదని చెప్పింది. వాస్తవం ఇది కాగా..తన రనౌట్‌ను సామాజిక మాధ్యమాల్లో తప్పుపడుతూ విమర్శించడంపై మిథాలీ ఆవేదన చెందింది. ప్రతి మహిళా క్రికెటరూ సెలెబ్రిటీనేఈ ప్రపంచకప్‌ భారత మహిళా క్రికెట్‌కు ఎంతో మేలు చేసిందని మిథాలీ చెప్పింది. ‘ప్రస్తుతం అభిమానులు మహిళల క్రికెట్‌ మ్యాచ్‌లను వీక్షించడమేకాదు వాటికి సంబంధించిన ప్రతి విషయాన్నీ గమనిస్తున్నా రు. అందువల్ల ఇప్పుడు మహిళా జట్టు ప్రతి క్రికెటర్‌ ఓ సెలెబ్రిటినే. జట్టులో తమ పాత్ర ఏమిటో వారందరికీ తెలుసు’ అని పేర్కొంది. ‘గతంలో ఒకరిద్దరిని తప్ప మిగిలిన మహిళా క్రికెటర్లను అభిమానులు గుర్తు పట్టేవారు కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి మారడానికి కారణం అమ్మా యిలు అద్భుతంగా ఆడడమే. ఖ్యాతి అంతా వారిదే. ఇక ప్రపంచకప్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసినందుకు ఐసీసీకి కృతజ్ఞతలు. ప్రత్యక్ష ప్రసారాలతో పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చింది’ అని వివరించింది. ‘ఫైనల్‌కు భారీగా అభిమానులు హాజరవడం ప్రత్యేక అనుభూతి కలిగించింది. మహిళల మ్యాచ్‌కు ఆ స్థాయిలో ప్రేక్షకులు రావడం అదే తొలిసారి. వారిని మేం నిరాశ పరచలేదు. ఫైనల్‌ను ఏకపక్షం కానివ్వలేదు. ఇంగ్లండ్‌తో హోరాహోరీగా పోరాడాం’ అని గుర్తు చేసింది. ‘మహిళా క్రికెట్‌ను పురుషుల క్రికెట్‌తో పోల్చి చూడవద్దని ఈ సందర్భంగా అభిమానులను కోరుతున్నా. ఎందుకంటే మహిళా క్రికెట్‌కు దాని ప్రత్యేకతలు దానికి ఉన్నాయి’ అని వివరించింది.
sports
2,774
16-01-2017 00:13:12
కీలక నిరోధం 8500
నిఫ్టీ గత వారం అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ 8300 వద్ద బ్రేకౌట్‌ సాధించి కీలక స్థాయి 8500 వరకు వెళ్ళి పటిష్ఠంగా క్లోజయింది. టెక్నికల్‌గా అప్‌ట్రెండ్‌లోనే ఉన్నప్పటికీ కీలక స్థాయికి చేరవవుతూ ఉండడం వల్ల స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. వీక్లీ చార్టుల్లో బ్రేకౌట్‌ నమోదయినందువల్ల మైనర్‌ పుల్‌బ్యాక్‌ రియాక్షన్‌కు కూడా అవకాశం ఉంది. గత కొద్ది రోజుల్లో 500 పాయింట్ల మేరకు నిరంతర ర్యాలీ సాధించినందు వల్ల కన్సాలిడేషన్‌ ఏర్పడడం తప్పనిసరి. గత కొద్ది నెలలుగా ప్రధాన మద్దతు స్థాయిగా ఉన్న 8500 ఇప్పుడు ప్రధాన నిరోధంగా మారింది.8500 కన్నా పైన నిలదొక్కుకున్నప్పుడే 8400 దిగువన స్టాప్‌లా్‌సతో స్వల్పకాలిక బై పొజిషన్లను మరిన్ని తీసుకునే విషయం పరిశీలించవచ్చు. 8300 కన్నా దిగువన క్లోజయితే స్వల్పకాలిక కరెక్షన్‌గా భావించి స్వల్పకాలిక బై పొజిషన్లు హోల్డ్‌ చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలి.పాటర్న్‌: మార్కెట్‌ ఓవర్‌బాట్‌ స్థితిని చేరడం కన్సాలిడేషన్‌ ఉండవచ్చుననడానికి సంకేతం. 50, 100, 200 డిఎంఏల వద్ద రికవరీ సాధించడం సానుకూలత సంకేతం. ఈ స్థాయిల్లో మరోసారి పరీక్షకు గురి కావచ్చు. ప్రస్తుతం ఇండెక్స్‌ 8500 వద్ద అడ్డంగా కనిపిస్తున్న రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌కు సమీపంలో ఉంది. 8300 వద్ద అడ్డంగా కనిపిస్తున్న సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌ వద్ద మద్దతు ఉంది. రివర్సల్‌లో పడినా భద్రత కోసం ఈ స్థాయిలో నిలదొక్కుకోవడం తప్పనిసరి.
business
9,387
17-05-2017 11:51:43
సింగపూర్‌లో బాహుబలికి సెన్సార్!
ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా దిగ్విజయంగా దూసుకెళుతోంది బాహుబలి-2. చిన్నా..పెద్ద అన్న తారతమ్యం లేకుండా సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే పెద్దల కంటే చిన్నపిల్లలే సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారనడంలో ఎలాంటి సందేహమైతే లేదు. కానీ, సింగపూర్‌లో మాత్రం చిన్న పిల్లలు సినిమా చూడకుండా సెన్సార్ చేసేశారు. 16 ఏళ్లలోపు పిల్లలు సినిమా చూడకుండా ఎన్‌సీ-16 సెన్సార్ సర్టిఫికెట్‌ను ఇష్యూ చేశారు. 16 ఏళ్ల లోపు పిల్లలు సినిమా చూడకుండా చేయడానికి ఓ కారణం ఉందట. అదే.. సినిమా హింసను ప్రేరేపించే విధంగా ఉందట. అందుకే సినిమాకు ఎన్‌సీ16 సర్టిఫికెట్ ఇచ్చారట. దీనిపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) చీఫ్ పహ్లాజ్ నిహ్లానీ స్పందించారు.           ‘‘భారత్‌లో ఎలాంటి కోతలూ లేకుండా బాహుబలి-2 సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చాం. కానీ, సింగపూర్‌ వారికి మాత్రం ఆ సినిమా హింసాత్మకంగా కనిపించిందట. యుద్ధ సన్నివేశాలు.. మరీ ముఖ్యంగా ఆ యుద్ధాల్లో సైనికుల తలలను నరకడం వారికి హింసను ప్రేరేపించే దానిలా కనిపించిందట. దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ కోసం రాక్షసుల తలలను నరికినట్టు మన పురాణాలు చెబుతాయి. చిన్నప్పటి నుంచి వాటిని చూసే పెరిగారు మన పిల్లలు. అయినా.. వాటి నుంచి హింసను నేర్చుకోలేదు’’ అని అన్నారు.           ఇక, భారత్‌లో సెన్సార్ షిప్ ఎంత ఉదారంగా ఉంటుందో వివరించారు పహ్లాజ్ నిహ్లాని. ఆసియా, యూరప్‌లలోని అనేక దేశాల్లో బాలీవుడ్ సినిమాలకు ‘ఏ’ సర్టిఫికెట్‌నే ఇస్తున్నారని, కానీ, ఇండియాలో మాత్రం ఆ పరిస్థితి లేదని అన్నారు. ఇండియాలో సెన్సార్ షిప్ అనే అంశం సెంటిమెంట్లతో ముడిపడి ఉందన్నారు. తలను నరికే సీన్‌ను సెన్సార్ చేస్తే మత వ్యతిరేకి అని ముద్ర వేసేస్తారని, ముద్దు సన్నివేశ సమయాన్ని తగ్గిస్తే బిడియస్థులు అనేస్తారని చెప్పారు. ఇక, హోమోసెక్సువల్ సన్నివేశాలను కట్ చేస్తే.. హోమోఫోబియాతో భయపడిపోతున్నారంటూ రకరకాల ముద్రలు వేసేస్తారని పహ్లాజ్ నిహ్లాని అన్నారు.
entertainment
2,492
09-10-2017 14:10:21
అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న కోళ్ల పెంపకం దారులు
 త్రిశంకు స్వర్గంలో కోళ్ల పెంపకందారులు పరిశ్రమకు రాయితీ కల్పించని ప్రభుత్వాలు అధిక భారమవుతున్న కోళ్ల పెంపకం వాతావరణం అనుకూలిస్తేనే లాభాలు ప్రభుత్వం ఆదుకోవాలంటున్న పెంపకందారులు వరంగల్‌ అర్బన్‌ అగ్రికల్చర్‌:కోళ్ల పెంపకందారులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. కోళ్ల పెంపకాన్ని పరిశ్రమగా గానీ, వ్యవసాయంగా గానీ ప్రభుత్వం గుర్తించకపోవడంతో పెంపకందారులకు ఎలాంటి రాయితీలు అందడంలేదు. దీంతో కోళ్ల పెంపకం చేపట్టే వ్యక్తులు స్వయంగా పెట్టుబడులు సమకూర్చుకోవాల్సి వస్తోంది. ఒక వేళ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నా అధిక వడ్డీతో అసలు తడిసిమోపడువుతోంది. కేవలం ప్రకృతి మీదే భారం వేసి జీవనం పొందే కోళ్ల పెంపకందారులు వాతావరణం బాగా లేకపోతే తీవ్రంగా నష్టపోతున్నారు. భారంగా కోళ్ల పెంపకంఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా సుమారు 80 మంది కోళ్ల పెంపకందారులుండగా.. సుమారుగా 20 లక్షల కోళ్లను పెంచుతున్నారు. వాటిలో సుమారు 80శాతం కోళ్లు ప్రతీ రోజు గుడ్లు పెడతాయి. కోడి జీవిత కాలం సుమారు 18 నెలలు కాగా, పిల్లదశ నుంచి 6 నెలల తర్వాత సంవత్సర కాలం పాటు గుడ్లు పెడతాయి. ఆ తర్వాత కోడిని రూ.70కి ఒకటి చొప్పున విక్రయిస్తారు. మేలుర కం కోడిపిల్లలను ఒక రోజు వయస్సు గల పిల్లను సుమారు రూ.35లకు కొనుగోలు చేస్తారు. వాటిని పిల్లలకు రూపొందించిన ప్రత్యేక షెడ్‌లో సుమారు 7వారాల కాలం పాటు బ్రూడర్‌ షెడ్‌లో పెంచుతారు. అనంతరం 8 నుంచి 20 వారాల పాటు గ్రోయర్‌ షెడ్‌లో పెంచుతారు. 20వారాల అనంతరం లేయర్‌ షెడ్‌లోకి మారుస్తారు. ఒక రోజు కోడిపిల్ల దశ నుంచి కోడి గుడ్డు పెట్టే దశ వ రకు ఒక్కొక్క దానికి వ్యాక్సినేషన్‌, పోషణ ఖర్చు సుమారుగా రూ.260 అవుతుంది. గిట్టుబాటుకాని గుడ్ల ధరదాణాలో నాణ్యత ఉండి, వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఒక కోడి సంవత్సర కాలంలో సుమారు 320 దాకా గుడ్లు పెడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక గుడ్డుకు హోల్‌సేల్‌గా రూ.3.57 ధర పలికితే పెంపకందారుకు గిట్టుబాటుగా ఉంటుంది. ఖర్చులుపోను పెంపకందారుకు రూ.0.75పైసలు గుడ్డు ఒక్కంటికి మిగులుతాయి. కానీ సుమారు పక్షం రోజులుగా గుడ్డుకు రూ.3.25 మాత్రమే ధర పలుకుతోంది. సాధారణంగా నవంబర్‌, డిసెంబర్‌, జనవరి నెలల్లో చలికాలం అయినందున ప్రజలు గుడ్లను ఎక్కువగా తింటారు. గుడ్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉన్న కాలంలో రేట్లు కూడా పెరుగుతాయి. పెంపకందారులకు లాభాలు వస్తాయి. దేశం మొత్తంలో రోజుకు సుమారు 24కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి అవుతాయని అంచనా. కాగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోనే అందులో 40 శాతం వరకు ఉత్పత్తి అవుతున్నాయి. గుడ్ల ఉత్పత్తి ఎక్కువగా ఉన్న ఈ రాష్ట్రాల్లో ఉత్పత్తిలో సుమారు 30 శాతం మేరకు వినియోగం అవుతున్నాయి. మిగతా గుడ్లను ఇతర ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేయాల్సి వస్తోంది. వినియోగానికి ప్రతిబంధకాలెన్నో..ఉత్పత్తి అయిన గుడ్ల వినియోగానికి ఎన్నో ప్రతి బంధకాలు ఎదురవుతున్నాయి. పండుగల రోజుల్లో ప్రజలు మాంసం వైపు మొగ్గు చూపుతారే తప్ప గుడ్లను ముట్టుకోరు. ఇంకా పలువురు దైవ భక్తులు శనివారం, గురువారం, మంగళవారం గుడ్లను దరి చేరనివ్వరు. ఇంకా దేవీ నవరాత్రులు, శ్రావణమాసంలలో గుడ్లను తినకుండా ఉంటారు. కోళ్లను కంటికి రెప్పలా కాపాడాలి..వాతావరణంలో సంభవించే ఎక్కువ వేడిని గానీ, చలినిగానీ కోళ్లు తట్టుకోలేవు. కోళ్ల మెటబాలిజం దెబ్బతిని చనిపోతాయి. కోళ్లను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి ప్రతీ 10వేల కోళ్లకు ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు పురుష కూలీలు అవసరమవుతారు. చలికాలంలో అతి చలిగా ఉండే రోజుల్లో చిన్న కోడి పిల్లలకు కృత్రిమ వేడిని కల్పించాలి. ఉష్ణోగ్రత సుమారు 31, 32 సెల్సియస్‌ డిగ్రీలు ఉండేలా బొగ్గుల కుంపటి, విద్యుత్‌ హీటర్లు, అధిక వేడిని ఇచ్చే హైవోల్టేజీ విద్యుత్‌ బల్బులను అమర్చాలి. పెద్ద కోళ్లు కూడా వేసవి కాలంలో 42 సెల్సియస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే తట్టుకోలేవు. షెడ్లచుట్టూ నీటితో తడిసిన తట్లతో కప్పాలి. గత వేసవిలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 36 రోజుల పాటు 42 సెల్సియస్‌ డిగ్రీల నుంచి 45 సెల్సియస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో అధిక వేడిమికి సుమారు మూడున్నర లక్షల కోళ్లు చనిపోయి పెంపకందారులకు సుమారుగా రూ.7 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. చిన్న కోడి పిల్లలకు ప్రకృతి వైపరిత్యాల వల్ల కూడా నష్టం వాటిల్లుతుంది. ఉరుములు, మెరుపులు గాలి దుమారం వచ్చినప్పుడు చిన్నకోడి పిల్లలు భయంతో బెదిరి షెడ్డులో ఓ మూలన ఒదుగుతాయి. కుప్పగా ఒక దానిపై ఒకటి ఎక్కడంతో కింద ఉన్న పిల్లలు భారం భరించలేక చనిపోతాయి. రోజురోజుకు కొత్తకొత్త వైరల్‌ వ్యాధులు సోకి చనిపోకుండా ముందు జాగ్రత్త చర్యగా తరచూ వ్యాక్సినేషన్‌ చేయాల్సి ఉంటుంది. ఇన్ని వ్యయ, ప్రయాసాల కోర్చి కోళ్ల పెంపకం చేపడితే పరిస్థితులు అనుకూలించినప్పుడు అప్పుడప్పుడు లాభాలు సమకూరి.. ప్రతికూల పరిస్థితుల్లో కొత్త కొత్త రకాల వైరస్‌ వ్యాధులు సోకి కోళ్లు చనిపోయి పెద్ద మొత్తంలో నష్టాల పాలవుతారు. వ్యవస్థీ కృతమైన ప్రభుత్వ విధానం ఉండాలికోళ్ల పెంపకాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వ్యవస్థీకృతమైన విధానాన్ని అమలు చేయాలి. కోళ్ల పెంపకాన్ని కనీసం పరిశ్రమగా గానీ, వ్యవసాయంగా గానీ ప్రభుత్వం గుర్తించాలి. పరిశ్రమగా గుర్తిస్తే విద్యుత్‌ వినియోగ చార్జీల్లో రాయితీ, వ్యవసాయంగా గుర్తిస్తే బ్యాంకు రుణాల్లో వడ్డీ రాయితీ లభిస్తుంది. - మార్తినేని ధర్మారావు, ఉమ్మడి వరంగల్‌ జిల్లా కోళ్ల పెంపకందారుల అసోసియేషన్‌ అధ్యక్షుడు
business
20,691
29-10-2017 03:00:49
పోల్‌ డ్యాన్స్‌కు మహర్దశ
పోల్‌ డ్యాన్స్‌ అంటే క్లబ్బుల్లో కనిపించే విన్యాసాలుగానే మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడీ పోల్‌ డ్యాన్సింగ్‌ ఒలింపిక్‌ క్రీడగా ఎదిగేందుకు అడుగులు వేస్తోంది. గ్లోబల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ (జీఏఐఎస్‌ఎఫ్‌) గుర్తింపు పొందిన పోల్‌ డ్యాన్సింగ్‌ ఈ నెలలో అబ్జర్వర్‌ క్రీడ హోదా సాధించి ఒలింపిక్‌ క్రీడగా ఎదిగే దిశగా తొలి అడుగు వేసింది. ఈ క్రీడ ఒలింపిక్స్‌లో త్వరలో స్థానం సంపాదిస్తుందని పలు అంతర్జాతీయ క్రీడా సంఘాలు ఆశిస్తున్నాయి. అబ్జర్వర్‌ స్థాయిని పొందడం తమ గుర్తింపునకు తొలి మెట్టు అని ఇంటర్నేషనల్‌ పోల్‌ స్పోర్ట్స్‌ సమాఖ్య (ఐపీఎస్‌ఎఫ్‌) అధ్యక్షురాలు కేటీ కోట్స్‌ హర్షం వ్యక్తం చేసింది. జీఏఐఎస్‌ఎఫ్‌లో శాశ్వత సభ్యత్వం పొందాలంటే తొలుత అబ్జర్వర్‌ స్థాయిని పొందడం తప్పనిసరి. జాతీయ ఒలింపిక్‌ సంఘం గుర్తింపు పొందడమేకాక ప్రపంచ మాదక ద్రవ్య నిరోధక సంస్థ నిబంధనలను సైతం పాటించాల్సి ఉంటుంది. పోల్‌ డ్యాన్స్‌ చూస్తున్నంత సులభమైందేమీ కాదు. దానికి ఎంతో ఏకాగ్రత అవసరం. ఈ క్రీడను మరింత ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2020 టోక్యో ఒలింపిక్స్‌, బ్యూనస్‌ఎయిర్స్‌లో నిర్వహించే యూత్‌ ఒలింపిక్స్‌లో ప్రదర్శన క్రీడగా అవకాశం దక్కించుకున్న పోల్‌ డ్యాన్సింగ్‌ ఒలింపిక్‌ క్రీడగా అవతరించేందుకు ఇంకెంతో దూరం లేదు.
sports
19,634
17-01-2017 00:35:44
అమ్మో.. అసాధ్యం..!
 భారత క్రికెట్‌లో ఇప్పుడు విరాట్‌శకం నడుస్తోంది! ఫార్మాట్‌ ఏదైనా.. ప్రత్యర్థి ఎవరైనా.. పోటీ ఎక్కడైనా.. విరాట్‌ వీరంగానికి హద్దుల్లేకుండా పోతోంది..! అతని విధ్వంసానికి బలికాని బౌలర్లు కనిపించడంలేదు! కోహ్లీ కమాల్‌తో భారత జట్టు ఖాతాలో అపురూప విజయాలు చేరుతున్నాయి..! అతని మాయాజాలానికి ఎన్నో రికార్డులు తుడిచిపెట్టుకుపోతున్నాయి..! అందుకే, అతణ్ణి అభినవ సచిన్‌ అంటున్నారు..! మాస్టర్‌ బ్లాస్టర్‌ను మించినోడంటూ కితాబిస్తున్నారు..! దిగ్గజ క్రికెటర్‌ రికార్డులన్నీ బద్దలుకొడతాడంటున్నారు..! కానీ, అది అసాఽధ్యం అంటున్నాడు విరాట్‌. మాస్టర్‌ ఘనతలను దాటడం అంత తేలిక కాదని చెబుతున్నాడు. టెండూల్కర్‌లా సుదీర్ఘ కాలం ఆడలేనంటూనే.. క్రికెట్‌పై తనదైన ముద్ర వేసే వెళ్తానని చెబుతున్నాడు. అలాగే ఎక్కువ మంది సన్నిహితులు లేకపోవడం కూడా తన విజయ రహస్యాల్లో ఒకటంటున్న కోహ్లీ పలు విషయాలపై తన మనసు విప్పాడు. న్యూఢిల్లీ: ఛేదనలో మొనగాడన్న పేరును నిజం చేస్తూ టీమిండియా కెప్టెన్‌ మరోసారి రెచ్చిపోయాడు. పుణెలో ఆదివారం పరుగుల విధ్వసం సృష్టించి ఛేదనలో 17వ సెంచరీ నమోదు చేశాడు. తద్వారా ఛేజింగ్‌లో అత్యధిక శతకాలు చేసిన తన ఆరాధ్య క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును సమం చేశాడు..! ఇందుకు సచిన్‌కు 232 వన్డేలు అవసరమైతే విరాట్‌ 96 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ మార్కు చేరుకున్నాడు. అంతేనా వన్డేల్లో విజయవంతమైన ఛేదనల్లో అత్యధిక శతకాలు చేసిన క్రికెటర్‌గా మాస్టర్‌ (14 సెంచరీలు)ను విరాట్‌ (15) దాటేశాడు. రెండున్నర దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో మాస్టర్‌ 463 వన్డేలు ఆడితే.. కోహ్లీ తన 177వ మ్యాచ్‌లోనే ఈ రికార్డు బద్దలు కొట్టేశాడు. అందుకే, విరాట్‌ను సచిన్‌తో పోలుస్తున్నారు..! మాస్టర్‌ను మించినోడని కిదాబిస్తున్నారు. కానీ, కోహ్లీ మాత్రం వాటిని సున్నితంగా తిరస్కరిస్తున్నాడు. ‘మాస్టర్‌ బ్లాస్టర్‌’ గణాంకాలను అందుకోవడం చాలా కష్టమని చెబుతున్నాడు. అలాగే.. 2014లో ఇంగ్లండ్‌ పర్యటనలో చాలా ఒత్తిడికి గురయ్యానని చెప్పాడు. ఆ టూర్‌ తర్వాత బ్యాటింగ్‌ టెక్నిక్‌తోపాటు తన మైండ్‌సెట్‌ను కూడా మార్చుకున్నానని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ నాసర్‌ హుస్సేన్‌తో బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇంకా వివిధ అంశాలపై కోహ్లీ చెప్పిన విశేషాలు అతని మాటల్లోనే...  సచిన్‌ సాధించిన ఘనతలను చేరుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. ముందుగా నేను అంత సుదీర్ఘ కాలం (24 ఏళ్లు) ఆడలేనేమో. 200 టెస్టులు, 100 అంతర్జాతీయ శతకాలంటే మాటలా! ఇలాంటి అద్భుత ఘనతలను అధిగమించడం అసాధ్యం. కానీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో నా ప్రత్యేకతను తప్పకుండా చాటుతా. అత్యుత్తమ స్థాయి లో ఆటను వదిలేయాలని నేనెప్పుడూ నమ్ముతా.  అందుకే ఇంగ్లండ్‌లో ఇబ్బంది పడ్డా 2014లో ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లేముందు నాపై నేను ఎంతో ఒత్తిడి పెంచుకున్నా. అక్కడ కచ్చితంగా రాణించాలనుకున్నా. అయినా, ఉపఖండ క్రికెటర్లకు ఫలానా దేశాల్లో రాణించాలన్న ప్రత్యేక బెంచ్‌మార్క్‌లు ఎందుకు పెడతారో అర్థం కాదు. అక్కడ బాగా ఆడకపోతే మంచి ఆటగాడు కాదన్న అభిప్రాయానికి వచ్చేస్తారు. అందుకే నేను కూడా ఇంగ్లండ్‌లో బాగా ఆడాలని అంతా ఆశించారు. కానీ, మంచి ఆరంభం దక్కకపోతే మానోస్థయిర్యం దెబ్బతింటుంది. ఇంగ్లండ్‌లో నా సమస్య ఏంటంటే... నేను ఎక్కువ ఇన్‌స్వింగర్లు ఆశించా. దీంతో అవుట్‌ స్వింగర్లకు సరైన సమాధానం ఇవ్వలేకపోయా. ఆఫ్‌-స్టం్‌పనకు అవతల పడ్డ బంతులను వెంటాడి మూల్యం చెల్లించుకున్నా. తర్వాత ఈ లోపాన్ని అధిగమించేందుకు కృషి చేశా. నా బ్యాటింగ్‌ను రికార్డు చేయిస్తూ డ్రిల్స్‌ చేశా. బ్యాలెన్స్‌ కోసం స్టాన్స్‌నూ కాస్త మార్చుకున్నా. ఫలితం సాధించా.  ఆస్ర్టేలియాలో అలా దంచేశా.. ఇంగ్లండ్‌ పర్యటన తర్వాత టెక్నిక్‌ సరిదిద్దుకోవడం ఆస్ర్టేలియాలో మంచి ఫలితాన్నిచ్చింది. స్టాన్స్‌ మధ్య అంతరం పెంచడం నాకు చాలా ఉపయోగపడింది. ఇదిప్పుడు సులభంగానే ఉంది కానీ, ఆరంభంలో చాలా కష్టంగా అనిపించింది. దీని కోసం రోజుకు మూడు గంటలు బ్యాటింగ్‌ సాధన చేసేవాడిని. ఆరంభంలో చేతులు తిమ్మిరెక్కాయి. అయినా, వెరవకుండా దాదాపు పది రోజులు అలానే ప్రాక్టీస్‌ చేశా. నా టెక్నిక్‌ విషయంలో సచిన్‌ సలహా కూడా ఉపకరించింది.
sports
2,613
27-10-2017 01:59:18
ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇఒ చాప్టర్లు
హైదరాబాద్‌ సదస్సుకు భారీగా ప్రతినిధులుహైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార, పారిశ్రామికవర్గాలను దగ్గరికి చేర్చే అంత్రప్రెన్యూర్స్‌ ఆర్గనైజేషన్‌ (ఇఒ) భారత్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా గోవా, నవి ముంబైతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడ, వైజాగ్‌లో కొత్త చాప్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో జరుగుతున్న ‘2017 ఇఒ హైదరాబాద్‌ యూనివర్సిటీ’ సదస్సు సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఇఒ దక్షిణాసియా రీజినల్‌ డైరెక్టర్‌ చిరంజీవి పటేల్‌ ఈ విషయం చెప్పారు. వచ్చే ఏడాది చివరికల్లా విజయవాడ, వైజాగ్‌లో చాప్టర్ల ఏర్పాటు పూర్తవుతుందన్నారు.  దీంతో ఆ ప్రాంతాల్లోని స్థానిక పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకూ అంతర్జాతీయ నైపుణ్యాలు, అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. బుధవారం ప్రారంభమైన ‘2017 ఇఒ హైదరాబాద్‌ యూనివర్సిటీ’ సదస్సుకు 35 దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు హాజరవుతున్నట్టు ఇఒ గ్లోబల్‌ యూనివర్సిటీ లీడ్‌ మైకేల్‌ రాస్‌ చెప్పారు. అంతర్జాతీయంగా పేరొందిన తమ సంస్థ స్టార్టప్‌ కంపెనీల నిర్వాహకులతోపాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకూ అవసరమైన శిక్షణ సదుపాయాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. ప్రతి చాప్టర్‌లో ఒక్కో పారిశ్రామిక రంగం నుంచి ఇద్దరు లేదా ముగ్గురికి మాత్రమే ఇఒ సభ్యత్వం ఉంటుందని మైకేల్‌ రాస్‌ చెప్పారు.   అది కూడా వార్షిక టర్నోవర్‌ కనీసం 10 లక్షల డాలర్లు మించిన కంపెనీల ప్రమోటర్లు, సిఇఒలు మాత్రమే తమ సంస్థలో సభ్యత్వం పొందేందుకు అర్హులని చెప్పారు. ప్రస్తుతం స్థానికంగా తమ చాప్టర్‌లో 86 మంది పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు సభ్యులుగా ఉన్నట్టు హైదరాబాద్‌ చాప్టర్‌ లోకల్‌ లీడ్‌ జివి కుమార్‌ తెలిపారు. ఇందులో 17 శాతం మంది మహిళలన్నారు.
business
2,253
30-12-2017 23:55:00
తుప్పు వదులుతున్న ఉక్కు
కొన్నేళ్లపాటు మందకొడిగా సాగిన దేశీయ ఉక్కు తయారీ రంగం ఈ ఏడాది పునరుద్ధరణ బాట పట్టింది. భారీ నష్టాల నుంచి సంస్థలు క్రమంగా తేరుకుంటున్నాయి. వచ్చే సంవత్సరంలో ప్రభుత్వ స్టీల్‌ కంపెనీలు మళ్లీ పుంజుకోనున్నాయని, ఈ రంగంలోని ప్రైవేట్‌ సంస్థలకు ధీటుగా పనితీరు కనబర్చనున్నాయని ఉక్కు శాఖ కార్యదర్శి అరుణ శర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ స్టీల్‌ పాలసీ, ప్రభుత్వ ప్రొక్యూర్‌మెంట్‌ విధానాలు ఇందుకు దోహదపడనున్నాయని శర్మ పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లోనూ స్టీల్‌ సెక్టార్‌ క్రమంగా కోలుకుంటుండటం, ధరల్లో పెరుగుదల సంస్థలకు కలిసి రానుందని మార్కెట్‌ వర్గాలంటున్నాయి. వచ్చే ఏడాది మౌలిక వసతుల అభివృద్ధి, నిర్మాణ విభాగాల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ పెట్టుబడులు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని, దాంతో స్టీల్‌, టిఎంటి బార్స్‌కు డిమాండ్‌తోపాటు ధరలు కూడా పుంజుకునే అవకాశం ఉందని మెస్కో స్టీల్‌ సిఎండి రీటా సింగ్‌ అన్నారు. ఈ ఏడాదిలో రెండు కీలక పాలసీల ప్రకటన ఈ ఏడాది మే నెలలో మోదీ సర్కారు నేషనల్‌ స్టీల్‌ పాలసీని విడుదల చేసింది. 2030-31కల్లా వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 30 కోట్ల టన్నులకు పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఈ రంగంలోకి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. మే నెలలోనే కేంద్రం పబ్లిక్‌ ప్రొక్యూర్‌మెంట్‌ పాలసీని కూడా విడుదల చేసింది. మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమానికి దన్నుగా ఉక్కు సేకరణలో దేశీయ సంస్థలకే ప్రాధాన్యం ఇవ్వాలన్నది ఆ పాలసీ ఉద్దేశం. పెరగనున్న ఉత్పత్తి సామర్థ్యం దేశీయ స్టీల్‌ కంపెనీలు 2018లో వ్యాపారాన్ని మరింత విస్తరించడంతో పాటు ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచుకోవాలని భావిస్తునట్లు అరుణ శర్మ తెలిపారు. అలాగే, వచ్చే సంవత్సరం మరిన్ని కొత్త సంస్థలు ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందన్నారు. దాంతో వచ్చే 2-3 ఏళ్లలో స్టీల్‌ సెక్టార్‌ ఉత్పత్తి సామర్థ్యం భారీగా పుంజుకునే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఈ రంగ ప్రొడక్షన్‌ కెపాసిటీ 12.6 కోట్ల టన్నులుగా ఉంది. దివాలా కోడ్‌తో కొట్టాయ్‌.. పలు స్టీల్‌ సంస్థలపై బ్యాంకులు దివాలా కోడ్‌ను ప్రయోగించాయి. అందులో ఎస్సార్‌ స్టీల్‌, ఎలక్ట్రోస్టీల్‌ స్టీల్స్‌, భూషణ్‌ స్టీల్స్‌ ఉన్నాయి. దేశీయ సంస్థలకు ప్రభుత్వం బాసట చైనాతో పాటు జపాన్‌, కొరియా దిగుమతుల నుంచి దేశీయ స్టీల్‌ ఉత్పత్తిదారుల ప్రయోజనాలను రక్షించేందుకు ఈ ఏడాది కేంద్రం పలు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా కనీస దిగుమతి ధర (ఎంఐపి) నిబంధన విధించడంతోపాటు యాంటీ డంపింగ్‌ ఆంక్షలు విధించింది.
business
9,432
19-05-2017 12:53:36
కూతుళ్లకు కమల్ వీలునామా!
విశ్వనటుడు, విలక్షణ నటుడు కమల్ హాసన్ వీలునామా రాసిచ్చారట. ఇప్పుడు తమిళనాట జోరుగా సాగుతున్న ప్రచారమిది. తన కూతుళ్లు శ్రుతి హాసన్, అక్షర హాసన్‌లకు తన ఆస్తులు చెందేలా వీలునామాను రాసిచ్చినట్టు జోరుగా ప్రచారం చేస్తున్నాయి కోలీవుడ్ వర్గాలు. వాస్తవానికి నటుడిగా, నిర్మాతగా తనను తాను ప్రూవ్ చేసుకున్న కమల్ హాసన్.. పెద్దగా ఆస్తులేమీ కూడబెట్టుకోలేదన్న ప్రచారం తమిళనాడులో జరుగుతుంటుంది. దానికి తగ్గట్టుగానే.. కమల్ పెద్దగా డబ్బేమీ సంపాదించలేదని తలైవా రజనీకాంత్ బహిరంగంగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. కలమ్ వీలునామా రాసిచ్చాడన్న దానిపై పెద్ద చర్చే జరుగుతోంది. శ్రుతికి, అక్షరకు సమానంగా ఆస్తులను పంచినట్టు, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే ఇలా ముందే వీలునామా రాశాడంలూ చెవులు కొరుక్కుంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. దీనిపై కమల్ హాసన్ స్పందన ఎలా ఉంటుందో..!!
entertainment
3,789
04-02-2017 04:19:16
ఉపాధ్యాయ ఎంపికలో లొసుగులు
ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియలో అనేక లొసుగులున్నాయని పలువురు భావిస్తున్నారు. అభ్యర్థి బోధనా సామర్థ్యాన్ని గుర్తించే విధంగా ఎంపిక పరీక్ష లేకపోవడం, టెట్‌ పరీక్ష అంతిమ నిర్ణాయక అంశం కాకపోవడం; ఉపాధ్యాయ అభ్యర్థికి అకడమిక్‌ జ్ఞానం ఏ స్థాయిలో ఉందో గుర్తించే విధానం ఏదీ లేకపోవడం తదితర లొసుగులు ఉపాధ్యాయ ఎంపిక ప్రక్రియలో ఉన్నాయి. వీటిని సవరించి ఎంపిక ప్రక్రియను మరింత హేతుబద్ధంగా చేపట్టాలి. టెట్‌ నిర్వహించి అందులో వచ్చిన మెరిట్‌, అకడమిక్‌ (ఎస్సెస్సీ, ఇంటర్‌, డిగ్రీ, పీజీ, బీఈడీ)లో వచ్చిన మెరిట్‌ను కలిపి ఎంపిక చేస్తే అభ్యర్థుల్లో ఆయా కేటగిరీల్లో ఉన్నత ప్రతిభ కలిగినవారు ఉపాధ్యాయులుగా ఎంపికవుతారు. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌ వంటి రాష్ట్రాలు పై పద్ధతిలో ఉపాధ్యాయులను ఎంపిక చేస్తున్నాయి. కేవలం చివరి పరీక్షను (డీఎస్సీ, లేదా టీఎస్‌పీఎస్‌సీ) ఆధారం చేసుకొని ఎంపిక నిర్వహించడంవల్ల అభ్యర్థులు అప్పటి వరకు వివిధస్థాయిల్లో ప్రతిభ కనబరిచినా, ఈ ఒక్క పరీక్ష సరిగా రాయకపోతే అతడు ఉపాధ్యాయ ఉద్యోగానికి అనర్హుడవుతున్నాడు. దేశంలో ఉపాధ్యాయుల ఎంపికలో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను ఎంపిక చేసి అమలు చేయాలి.- జి. రాజు, హైదరాబాద్‌
editorial
19,253
26-03-2017 03:26:55
దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ కన్ను
ఏప్రిల్‌ 15,16న పార్టీ జాతీయ కార్యవర్గం భువనేశ్వర్‌ భేటీలో వ్యూహం ఖరారు వచ్చే సార్వత్రిక ఎన్నికల గెలుపునకు తీర్మానం న్యూఢిల్లీ,మార్చి 25(ఆంధ్రజ్యోతి): వచ్చే సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ ఇప్పటినుంచే సమాయత్తమవుతోంది. ఏప్రిల్‌ 15,16 తేదీల్లో భువనేశ్వర్‌లో జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ నేతలు దక్షిణాది రాష్ట్రాలలో విజయ వ్యూహాలను ఖరారు చేయనున్నారు. గత ఎన్నికల్లో యూపీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్ లతో పాటు ఉత్తరాదిన పలు రాష్ర్టాలలో అత్యధిక ఎంపీ స్థానాలను సాధించిన బీజేపీ... ఈసారి దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని తీర్మానించుకుంది. ఒడిసా ఇటీవల స్థానిక ఎన్నికల్లో కొన్ని స్థానాలను గెలుపొందగా, కాంగ్రెస్‌ మూడో స్థానంతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. దాదాపు 20 ఏళ్లు ఒడిసా సీఎంగా కొనసాగుతున్న నవీన్‌పట్నాయక్‌ నాయకత్వంపై రాష్ట్ర ప్రజలకు మోజు తగ్గినట్లు బీజేపీ నేతలు భావిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒడిసాను కైవసం చేసుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను సీఎం అభ్యర్ధిగా ప్రతిపాదించి, ఇప్పటినుంచే అక్కడ బీజేపీకి అనుకూల వాతావరణాన్ని కలిగించే వ్యూహంలో భాగంగానే భువనేశ్వర్‌లో పార్టీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. కాగా, కర్ణాటకలో వక్కలిగ వర్గానికి చెందిన ఎస్‌ఎం కృష్ణను చేర్చుకొని గెలుపును ఖాయం చేసుకున్న బీజేపీ రాబోయే రోజుల్లో తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కేరళలతో పాటు ఒడిసా, పశ్చిమబెంగాల్‌లపైనే ఎక్కువ దృష్టి సారించనుంది. కోరమండల్‌ బెల్ట్‌లోని రాష్ర్టాల్లో గెలుపుకోసం ఇప్పటినుంచే అహర్నిశలు కృషి చేయాల్సి ఉంటుందని, ఉత్తరాదిలో పాతుకుపోయినట్లుగా కోరమండల్‌ రాష్ర్టాల్లో చొచ్చుకుపోలేమన్న నిజాన్ని దృష్టిలో ఉంచుకొని తదనుగుణంగా వ్యూహరచనకు పదునుపెడుతున్నారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమితషాలు వివిధ రాష్ట్రాల ఎంపీలతో భేటీలు మొదలు పెట్టి 2019 ఎన్నికలకు టార్గెట్లను నిర్దేశిస్తున్నారు. ఇటీవల యూపీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే ప్రతి రాష్ట్రంలో అనుసరించాలనీ, మోదీ అభివృద్ధి ఎజెండాతో పాటు కుల సమీకరణలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని దాదాపు నిర్ణయించిన అధిష్ఠానం ఈ మేరకు భువనేశ్వర్‌ తీర్మానాన్ని కూడా ఆమోదించనున్నట్లు సమాచారం.
nation