SNo
int64 0
21.6k
| date
stringdate 2017-01-01 01:34:20
2017-12-31 23:58:37
| heading
stringlengths 3
91
⌀ | text
stringlengths 13
38.7k
| label
stringclasses 5
values |
---|---|---|---|---|
14,678 | 26-12-2017 01:46:18 | జెరూసలేంలో మందకొడిగా వేడుకలు | జెరూసలేం, డిసెంబరు 25: ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలేంను గుర్తిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవలి ప్రకటన ఆ ప్రాంతంలో క్రిస్మస్ వేడుకలపై ప్రభావం చూపాయి. స్థానికులు వేడుకల్లో పాల్గొనడం, నిర్వహించడంపై ఆసక్తి కనబర్చలేదు. సాధారణంగా ఏటా స్థానిక మాంజెర్ స్క్వేర్ వద్ద క్రిస్మ్‌సకు ఒకరోజు ముందునుంచే సందడి నెలకొంటుంది. ‘ఈ సారి విదేశీ యాత్రికులెవరూ వేడుకలపై ఆసక్తి చూపలేదు. డిసెంబరు 24 రాత్రి వేళలో వేల సంఖ్యలో పర్యాటకులు, స్థానికులతో ఈ ప్రాంతం ఇసకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోతుంది. కానీ, ఈ సారి అలాంటి వేడుకలు లేవు.’ అని స్థానిక వ్యాపారులు మిషీల్ కుమ్సియే, ఖాదర్ తెలిపారు. | nation |
20,496 | 23-01-2017 18:03:34 | టీమిండియాలో ఉన్న లోపాలను ఎత్తిచూపిన గవాస్కర్ | న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో నెగ్గిన కోహ్లీ సేనకు గవాస్కర్ శుభాకాంక్షలు తెలిపారు. కెప్టెన్‌గా పూర్తి బాధ్యతలు చేపట్టినప్పటికీ కోహ్లీ బ్యాటింగ్‌లో అదే దూకుడును కొనసాగించడం గొప్ప విషయమంటూ కొనాయాడారు. జట్టుకు ఆరో స్థానంలో ఆడేందుకు ఆణిముత్యం లాంటి కేదార్ జాదవ్ దొరికాడని అన్నారు. అయితే జట్టులో ఉన్న కొన్ని ప్రధాన లోపాలను కూడా ఆయన ఎత్తి చూపారు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల్లో ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ ఒక్కసారి కూడా రాణించలేదని ఆ విషయంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అయితే రోహిత్ శర్మ పూర్తిగా కోలుకుంటే ఆ లోటు తీరుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. మరోపక్క శిఖర్ ధావన్‌పై కూడా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో పాటు ముఖ్యంగా కోహ్లీ, ధోనీలు అన్ని మ్యాచ్‌లలో రాణించకపోవడాన్ని ప్రస్తావించారు. ఇరువురిలో ఎవరో ఒకరు తప్పనిసరిగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు సునీల్ గవాస్కర్. | sports |
18,964 | 27-09-2017 03:29:52 | భారత్ టమాటో అక్కర్లేదు: పాక్ | లాహోర్: టమాటో కొరత తీవ్రస్థాయిలో ఉన్నా.. తమ ప్రజలు ఇబ్బందులు పడ్డా.. భారత్ నుంచి మాత్రం దిగుమతి చేసుకోబోమని చెబుతోంది పాకిస్తాన్ ప్రభుత్వం. పరిస్థితి ఎంత దిగజారినా.. భారత్ నుంచి టమాటోను తెప్పించుకునే ప్రసక్తే లేదని ఆహార శాఖ మంత్రి సికిందర్ హయత్ బోసన్ స్పష్టం చేశారు. ఫలితంగా స్థానికంగా టమాటో ధర చుక్కలనంటుతోంది. నిన్నమొన్నటిదాకా రూ.100 నుంచి 150 రూపాయలున్న కిలో టమాటో ధర నేడు 3 వందల రూపాయలకు ఎగబాకింది. భారత సరిహద్దుల నుంచి టమాటో దిగుమతి నిలిచిపోవడంతో..లాహోర్, పంజాబ్‌లతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో టమాటో కొరత తీవ్రమైంది. | nation |
11,632 | 29-08-2017 03:15:29 | శిక్ష చాలదు: బాధితులు | రోహ్‌తక్, ఆగస్టు 28: గుర్మీత్‌కు పడిన శిక్షపై బాధితుల తరఫు న్యాయవాది ఉత్సవ్ సింగ్ భైస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నేరానికి తగ్గట్లుగా సుదీర్ఘ జైలుశిక్ష విధించాలని కోరారు. గుర్మీత్‌పై ఇలాంటి మరో డజను లైంగిక వేధింపుల కేసులు ఉన్నాయని, మిగతా కేసులూ సీబీఐతో దర్యాప్తు చేయించాలని హైకోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు. | nation |
14,314 | 23-11-2017 01:14:06 | పండగ వెలుగులు | తెలుపు, ఎరుపు చారలుగా కనిపిస్తున్నవన్నీ రోడ్డు మీద నెమ్మదిగా కదులుతున్న వాహనాలు!! అమెరికాలోని లాస్ ఏంజిలెస్‌లో మంగళవారం రాత్రి కనిపించిందీ కిక్కిరిసిన ట్రాఫిక్! ఈ రద్దీకి రీజనుంది. ఏటా నవంబరు ఆఖరు గురువారాన్ని అమెరికాలో ‘థ్యాంక్స్ గివింగ్ డే’ గా జరుపుకొంటారు. బ్రిటన్ నుంచి ఉత్తర అమెరికాకు వలస వచ్చిన బృందం (పిల్‌గ్రిమ్ ఫాదర్స్) కొత్త పంట వచ్చినందుకు కృతజ్ఞతగా 1621లో తొలిసారి థ్యాంక్స్ గివింగ్ డేను జరుపుకొన్నారు. అప్పటి నుంచి అమెరికాలో ఈ పండుగ ఆనవాయితీగా వస్తోంది. అమెరికా తొలి అధ్యక్షుడు లింకన్ హయాంలోఈ పండుగను అఽధికారికంగా గుర్తించారు. థ్యాంక్స్ గివింగ్ డేను కెనడా, ఫిలిప్పైన్స్, లైబేరియా, సెయింట్ లూసియాలోనూ జరుపుకొంటారు. థ్యాంక్స్ గివింగ్ డే కోసం లాస్ ఏంజిలెస్‌లో ఈ స్థాయిలో కార్ల రద్దీ ఎన్నడూ లేదని ఓ ట్రావెల్ ఏజెన్సీ ప్రకటించింది. అమెరికా వ్యాప్తంగా 5.1 కోట్ల మంది రోడ్డు, రైళ్లు, విమానాల్లో ప్రయాణిస్తారని ఓ అంచనా. | nation |
19,220 | 24-07-2017 01:17:14 | నేటి పెట్రో ధరలు (లీ.) | పెట్రోల్ డీజిల్‌పాత ధర రూ.68.41 పాత ధర 59.83కొత్త ధర రూ.68.55 కొత్త ధర 59.83పెరుగుదల 14 పైసలు మార్పులేదు | nation |
13,432 | 11-01-2017 02:51:36 | ‘మహా’ మునిసిపోల్స్‌లో బీజేపీ హవా! | ముంబై, జనవరి 10: మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బీజేపీ విజయదుందుభి మోగించింది. నవంబరు 28 నుంచి 4దశల్లో 191 మునిసిపాలిటీల్లో ఎన్నికలు జరుగగా.. 71 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 34, శివసేన 26, ఎన్‌సీపీ 22 స్థానాలు సాధించాయి. 22 స్థానాల్లో ఇతర పార్టీలు, 16 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలించారు. 19 నగర పంచాయతీలను కూడా బీజేపీ కైవసం చేసుకుంది. మొత్తంగా 4,704 కౌన్సిలర్ల స్థానాలకు ఎన్నికలు జరగగా.. అందులో బీజేపీకి 1,190, కాంగ్రె్‌సకు 952, ఎన్‌సీపీకి 812, శివసేనకు 612, బీఎస్ పీకి 17, సీపీఎంకు 12, ఎంఎన్‌ఎస్ కు 7 సీట్లు దక్కాయి. పెద్ద నోట్ల రద్దు ప్రతికూలతను ఎదుర్కొని బీజేపీ విజయకేతనం ఎగురవేయడం విశేషం. | nation |
13,849 | 09-12-2017 01:10:21 | పాత్రికేయుడి హత్యకు సుపారీ! | ఆర్థిక లావాదేవీల్లో అభిప్రాయ భేదాలు ‘హాయ్ బెంగళూరు’ ఎడిటర్ అరెస్ట్ గౌరీలంకేశ్ కేసు విచారిస్తుండగా నాటకీయంగా వెలుగులోకి వచ్చిన వైనంబెంగళూరు, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): వారిద్దరిదీ గురుశిష్యుల బంధం. పాత్రికేయ వృత్తిలో శిష్యుడికి ఒకప్పుడు ఓనమాలు నేర్పిన గురువే ఇప్పుడు అతడిని హతమార్చడానికి సుపారీ ఇచ్చాడు. సదరు గురువు గారిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత అసలు విషయం తెలుసుకున్న శిష్యుడు తీవ్ర షాక్‌కు గురయ్యాడు. ఈ ఘటన కర్ణాటకలో శుక్రవారం పెను సంచలనం సృష్టించింది. సీసీబీ పోలీసుల కథనం మేరకు... ‘హాయ్ బెంగళూరు’ వారపత్రికకు రవిబెళగెరె రెండు దశాబ్దాలుగా సంపాదకుడిగా ఉన్నారు. పత్రిక ఆర్థిక లావాదేవీల విషయంలో తనను మోసం చేశాడనే అనుమానంతో తన ఒకప్పటి సహచర పాత్రికేయుడు సునీల్ హెగ్గరవళ్ళిని అంతమొందించేందుకు సుపారీ కిల్లర్‌గా పేరుమోసిన శశిధర్‌ను రవి సంప్రదించాడు. సునీల్‌ను హత్య చేయడానికి శశిధర్ పలుమార్లు రెక్కీ నిర్వహించాడు. అయితే అక్రమాయుధాల కేసులో పోలీసులు శశిధర్‌ను అరెస్టు చేయడంతో ఈ విషయం కూడా వెలుగు చూసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు రవిబెళగెరె నివాసం, కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి డబుల్ బ్యారెల్ గన్, ఒక పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, గౌరీలంకేశ్ హత్య కేసును విచారిస్తున్న పోలీసులకు ఈ సమాచారం నాటకీయంగా లభించినట్లు తెలుస్తోంది. కాగా, హోం మంత్రి రామలింగారెడ్డి బెంగళూరులో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ గౌరీలంకేశ్ హత్య కేసుకు, రవిబెళగెరె అరెస్టుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. | nation |
2,075 | 19-11-2017 23:52:18 | ప్రైవేటులో నియామకాలు అంతంతే.. |
వ్యయ నియంత్రణ, మార్జిన్ల పెంపుపై కంపెనీల దృష్టివచ్చే రెండు త్రైమాసికాలు ప్రైవేటు కంపెనీలకు సవాళ్లేఅసోచామ్ వెల్లడిన్యూఢిల్లీ : ప్రైవేటు రంగంలో కొత్త నియామకాలకు సంబంధించిన అంచనాలు నిరాశాజనకంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు (మార్చి 2018) ఈ రంగంలో నియామకాలు అంతంత మాత్రంగానే ఉండనున్నట్టు పరిశ్రమల చాంబర్ అసోచామ్ వెల్లడించింది. దేశీయ కంపెనీలు వేతనాలకు సంబంధించిన వ్యయాలను నియంత్రించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నాయని, ఈ ప్రభావం నియామకాలపై పడుతోందని పేర్కొంది. తమ సభ్యులు అందించిన సమాచారం ఆధారంగా ఉద్యోగుల నియామకాలపై అంచనాలు వెలువరిస్తున్నట్టు అసోచామ్ తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనూ నియామకాలు తగ్గడానికే ఆస్కారం ఉందని తెలిపింది. ప్రభుత్వం ఈ బ్యాంకులకు కొత్తగా మూలధనం సమకూర్చనుంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఉద్యోగుల వ్యయాన్ని తగ్గించుకోవడానికే బ్యాంకులు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. కీలకం కానివ్యాపారాల నుంచి బయటపడటం, అప్పులను తగ్గించుకోవడం, తమ స్థానాన్ని మరింత పటిష్ఠ పరచుకోవడానికే కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయని అసోచామ్ పేర్కొంది. రానున్న త్రైమాసికాల్లో కార్పొరేట్లు మార్జిన్లను పెంచుకోవడానికి, రుణ వ్యయాలను తగ్గించుకోవడానికి, రాబడుల్లో వృద్ధిపై దృష్టి పెట్టనున్నట్టు తెలిపింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మాత్రం పరిస్థితుల్లో మార్పులు ఉండవచ్చన్న ఆశాభావాన్ని అసోచామ్ వ్యక్తం చేస్తోంది. టెలికాం, ఫైనాన్షియల్స్ (ప్రైవేట్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రియల్టీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నట్టు అసోచామ్ సెక్రటరీ జనరల్ డిఎస్ రావత్ తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన రేటింగ్‌ను మూడీస్ అప్‌గ్రేడ్ చేయడం వల్ల సెంటిమెంట్ మెరుగు పడిందని, అయినప్పటికీ వచ్చే రెండు మూడు త్రైమాసికాలు ప్రైవేటు రంగం సవాళ్లతో సహవాసం చేయాల్సిందేనని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి కంపెనీ రుణ భారం తగ్గేందుకు, వినియోగదారుల డిమాండ్ పెరిగేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు. అనుకోని సంఘటనలు చోటుచేసుకున్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంకన్నా వచ్చే ఆర్థిక సంవత్సరం మెరుగ్గానే ఉంటుందన్న విశ్వాసం ఉందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో వృద్ధిని స్టాక్ మార్కెట్ బూమ్ ప్రతిబింబిస్తోందని అసోచామ్ పేర్కొంది. వచ్చే కొన్ని నెలల్లో జిఎ్‌సటికి సంబంధించిన అంశాలు సద్దుమణుగుతాయని తెలిపింది. ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలోనే ఉండటం, విదేశీ మారకంలో స్థిరత్వం, విదేశీ మారక నిల్వల్లో పెరుగుదల, ఎగుమతుల్లో వృద్ధి వంటివి దేశ స్థూల ఆర్థిక వ్యవస్థకున్న పటిష్ఠతను తెలియజేస్తున్నాయని అసోచామ్ వెల్లడించింది. అయితే ముడిచమురు ధరలపై కన్నేసి ఉంచాలని, ప్రస్తుత స్థాయికన్నా ఇంకా ఎక్కువగా చమురు ధర పెరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. | business |
4,540 | 08-05-2017 00:16:46 | విశ్వదాత కాశీనాథుని పురస్కారాలు |
కీర్తిశేషులు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు పేరిట ఇస్తున్న ‘విశ్వదాత పురస్కారా’లకు కవి పాపినేని శివశంకర్, పాత్రికేయులు యల్లాప్రగడ మల్లిఖార్జునరావు ఎంపికైనారు. మే 8న సా.6గం.లకు కృష్ణాజిల్లా, పామర్రు మండలం, ఎలకుర్రులో జరిగే సభలో మండలి బుద్ధప్రసాద్, బచ్చుల అర్జునుడు పురస్కారాలు అందిస్తారు.- అమరావతి సాహితీ మిత్రులు | editorial |
924 | 08-10-2017 01:05:37 | శిల్పా మెడికేర్ జడ్చర్ల ప్లాంట్‌కు ఎఫ్‌డిఎ ఓకే | న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం జడ్చర్లలోని ప్లాంట్‌కు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ మండలి (యుఎస్‌ఎఫ్‌డిఎ) ఎస్టాబ్లిష్‌మెంట్ ఇన్‌స్పెక్షన్ నివేదిక (ఇఐఆర్)ను జారీ చేసిందని శిల్పా మెడికేర్ వెల్లడించింది. జడ్చర్లలోని జెనరిక్ ఫార్మాసూటికల్ ప్లాంట్‌ను జూలై 24-28 మధ్య కాలంలో ఎఫ్‌డిఎ తనిఖీలు చేపట్టి కొన్ని అభ్యంతరాలను లేవనెత్తుతూ ఫారమ్ 483 జారీ చేసిందని తెలిపింది. అయితే నిర్ధేశిత సమయంలో అభ్యంతరాలకు సమాధానమివ్వటంతో ఇఐఆర్‌ను మంజూ రు చేసిందని శిల్పా మెడికేర్ పేర్కొంది. | business |
4,384 | 19-02-2017 04:28:15 | మాతృభాషలోనే ప్రాథమిక విద్య | ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ!నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో సమున్నత స్థాయికి చేర్చేందుకు తాము అవిరళ కృషి చేస్తున్నారు. అందులో భాగంగా తెలుగు భాషాసంస్కృతులకు మహోన్నత వైభవాన్ని చేకూర్చేందుకు సంకల్పించి, అందుకోసం స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థను ఏర్పాటుచేస్తామని, ఆ వ్యవస్థ రూపకల్పనకై శాసనసభ ఉపసభాపతి, సాంస్కృతికశాఖ మంత్రి, ప్రభుత్వ సలహాదారు, అధికారులతో ఒక కమిటీని నియమిస్తున్నట్లు, 2016 ఆగస్టు 29న తెలుగుభాషాదినోత్సవ సభలో తాము ప్రకటించారు. నెలరోజుల్లో ఆ కమిటీ నివేదికను తెప్పించుకొని తెలుగు ప్రాధికార సంస్థను ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. ఆ కమిటీవారు ఇటీవలనే తమకు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తున్నది. అయితే ఆ నివేదిక వచ్చేలోపుగానే తమ ప్రభుత్వం విద్యారంగంలో తెలుగు మీడియంకు స్వస్తి పలికి, ఇంగ్లీషు మీడియంను వెంటనే ప్రాథమిక స్థాయినుంచే ప్రవేశ పెడుతూ జీవో నెం. 14/2.1.2017ను పురపాలక మంత్రిత్వశాఖ నుంచి జారీచేసింది. ఆ వెంటనే మెమో నెం. 7176/డి1/2016: తేదీ. 5.01.2017 ద్వారా ఈ మార్చితో ప్రారంభ మవనున్న విద్యాసంవత్సరం నుంచి దానిని అమలుచేస్తున్నట్లు ప్రకటించింది. దాని కనుగుణంగా శరవేగంతో పనులు ప్రారంభించింది. ఈచర్య తొలుత మీరు ప్రకటించిన లక్ష్యాలకు, హామీలకు విరుద్ధంగా ఉన్నది. కమిటీ రిపోర్టు రాకుండానే, తెలుగును కూకటివేళ్ళతో పెకలించే ఈ చర్య -తమరి ఆశయాలను ఖండిస్తున్నట్లుగా ఉంది. ఇక్కడ తమకు ముఖ్యంగా మనవి చెయ్యవలసినదేమిటంటే- ప్రాథమిక స్థాయిలో మాతృభాషామాధ్యమం అనివార్యమైన అవసరమని భారత రాజ్యాంగం(అధికరణం 35– ఎ) చెప్పింది. కొఠారి కమిషన్ చెప్పింది. ఐక్యరాజ్యసమితిలో భాగమైన ‘యునెస్కో’నేకాదు అభివృద్ధి చెందిన దేశాల చరిత్ర, వర్తమానం అదే చెప్తున్నాయి. 2010లో భారత ప్రభుత్వం తెచ్చిన విద్యాహక్కు చట్టం, విభాగం29(2)లో ఎలిమెంటరీ స్థాయిలో మాతృభాషామాధ్యమాన్ని అమలు చెయ్యాలని నిర్దేశించింది. తాము నియమించిన కమిటీ కూడా తమ రిపోర్టులో బహుశా ఇదే సిఫారసు చేసి ఉంటుందని మేము దృఢంగా నమ్ముతున్నాము. విద్యారంగంలో పేద, ధనిక వర్గాల మధ్యగాని, మరోవిధంగా గాని విచక్షణ చూపడం తగనిపని. అందరికీ ఒకే రకమైన విద్య అందుబాటులో ఉండాలి. అందువల్ల ఆర్ధికంగా బలహీనులైన వారికి ప్రభుత్వ పాఠశాలలనీ, డబ్బున్నవారికి ప్రయివేటు స్కూళ్ళనే పరిస్థితి ఎంతమాత్రం తగదు. కనుక- మొత్తం రాష్ట్రంలో ప్రయివేటు, ప్రభుత్వ స్కూళ్ళంన్నింటికీ వర్తించే విధంగా ఒకే విధానం ఉండాలి. కనుక -ప్రాధమిక విద్యలో కనీసం 5వ తరగతి వరకు అన్ని పాఠశాలల్లో మాతృభాషామాధ్యమాన్ని తప్పనిసరి చెయ్యాలని, 6వ తరగతి నుండి విద్యార్ధి ఎంపిక ప్రకారం ఏ మాధ్యమంలోనైనా చదువుకోడానికి వీలుగా రెండు మాధ్యమాల్లోనూ 10వ తరగతి వరకూ సమాంతరంగా తరగతులుండాలని మనవి చేస్తున్నాము. ఇదే శాస్త్రీయ విద్యావిధానం అవుతుంది తప్ప, పసిబిడ్డలను పాఠశాలకు పంపడంతోనే- తనకు తెలియని భాషలో తెలియని జ్ఞానాన్ని నేర్చుకోవాలనడం- అవివేకం, అశాస్త్రీయం. పరాయిభాషలో ప్రాథమిక విద్యనుంచీ చదువు చెప్పడం ఎంత అసమంజసమో, అభివృద్ధి చెందిన దేశాలను చూచి మనం గ్రహించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. భాషను వినియోగించేకొద్దీ అభివృద్ధి చెందుతుంది. తెలుగును కూడ వృద్ధిచేసుకొంటేనే అన్నిరంగాల్లోనూ దాన్ని ఒక అత్యాధునిక భాషగా పెంపొందించుకోగలం. అదే సమయంలో ఇంగ్లీషును వద్దు అనడం విజ్ఞత కాదు. ఇంగ్లీషేకాదు, మరే ఇతర భాషను నేర్చుకోవాలన్నా మాతృభాషలో పునాది పటిష్ఠంగా ఉండాలి. విషయ గ్రహణశక్తిని, విషయ వివరణ శక్తిని మాతృభాషలో పొందుతూ, ప్రక్కన ఒక భాషగా ఇంగ్లీషును 1వ తరగతినుండే అర్హతగల టీచర్ల చేత నేర్పాలి. అప్పుడు మెరికల్లాంటి విద్యార్థులు తయారౌతారు. అటు తెలుగు సరిగా రాక, ఇటు ఇంగ్లీషు సరిగా రాని నేటి తరాలకు బదులు, మాతృభాష తెలుగులోనూ, ఇటు ఇంగ్లీషులోనూ సమర్థులైన పౌరులు తయారౌతారు. వారు మన దేశంలోనూ, బయటి దేశాల్లోనూ మన తెలుగుజాతి శక్తిని మరింతగా చాటుతారు. ఇంతటి విప్లవాత్మకమైన చర్యను మీ ప్రభుత్వం చేపట్టాలని కోరుతున్నాం. మేము చేస్తున్న విన్నపంలో ఎటువంటి అశాస్త్రీయత, అసంబద్ధత లేదని మనవిచేస్తూ -తాము ఈ కింది కోరికలను మన్నిస్తూ తగు అధికారిక ఉత్తర్వులివ్వాలని కోరుతున్నాం. 1. ప్రాథమిక విద్యను మాతృభాషలో/రాష్ట్ర అధికార భాషలో రాష్ట్రమంతటా అన్ని ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్ళలో (మిషనరీ స్కూళ్ళతో సహా) తప్పనిసరి చెయ్యాలి. ఇదే సమయంలో ఇంగ్లీషును ఒక భాషగా పటిష్ఠంగా బోధించాలి. ఎటువంటి తేడా లేకుండా అందరికీ ఒకేరకమైన విద్యను అందించడానికి ఇది తొలిచర్య అవుతుందని మనవి చేస్తున్నాను. 2. జి.ఒ.నెం.14ను వెంటనే రద్దుచెయ్యాలి. 3. ఉన్నతపాఠశాలల్లో ఆంగ్లంలోనూ, తెలుగులోనూ సమాంతర తరగతులుండాలి. 4. తెలుగు మంత్రిత్వశాఖ ఏర్పడివున్నందున, తాము ప్రకటించిన విధంగా వెంటనే ప్రాధికారసంస్థను ఏర్పాటుచేస్తూ, అన్నిరంగాల్లో తమ ప్రభుత్వ భాషావిధానాన్ని వెంటనే రూపొందించాలి. తెలుగుభాషకు, తెలుగు ప్రజలకు అన్ని విధాలా మేలు కలిగించాలనే తమ సంకల్పానికి జేజేలు. తమ సంకల్ప సాధనకు పైన పేర్కొన్న చర్యలు రాచబాటను ఏర్పర్చుతాయి.ధన్యవాదాలతో..డాక్టర్ సామల రమేష్‌బాబుతెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షుడుమాతృభాషా మాధ్యమ వేదిక సారథ్యసంఘ సభ్యుడు | editorial |
1,602 | 21-10-2017 02:53:38 | పన్నేతర ఆదాయంలో 22 శాతం వృద్ధి | రూ.26,101 కోట్లకు రాష్ట్రం సొంత ఆదాయంఅమరావతి (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆదాయం ఆశించిన లక్ష్యాల కంటే తగ్గినప్పటికీ రాష్ట్రంలో పన్నేతర ఆదాయం భారీగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో సాధించిన ఆదాయం కంటే ఈ ఏడాది 22 శాతం మేర వృద్ధి చెందింది. ఈ సమయంలో రాష్ట్ర సొంత ఆదాయం 11 శాతం మేర పెరిగి రూ.26,101 కోట్లకు చేరుకుంది. పన్ను ఆదాయం రూ.23,912 కోట్లకు చేరుకుంది. బడ్జెట్‌లో ఆశించిన స్థాయి కంటే రాష్ట్ర ఆదాయం తగ్గినప్పటికీ.. జిఎ్‌సడిపి రెండంకెల వృద్ధికి చేరడానికి పన్నేతర ఆదాయం పెరగడమే కారణమని అధికారులు భావిస్తున్నారు. పన్ను పరిధిలోకి రాని ఆదాయం భారీగా పెరగడం వృద్ధి రేటు పెరుగుదలకు ప్రధాన కారణంగా వివరిస్తున్నారు. పన్ను పరిధిలోకి రాని మత్స్య రంగం ఉత్పత్తుల వల్ల పన్ను రూపేణా రాష్ట్ర ఆదాయానికి నష్టం జరిగినప్పటికీ జిఎ్‌సడిపి పెరుగుదలకు ఇది ఉపకరిస్తుందని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 3 నెలల్లో మత్స్య రంగం రూ.12597 కోట్ల విలువైన ఉత్పత్తులను సాధించింది. మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల్లో దీని విలువ 42 శాతం. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి రెండు త్రైమాసికాల్లో కలిపి పన్ను ఆదాయం 9 శాతం మేర పెరిగి రూ.23,912 కోట్లకు చేరుకుంది. ఇందులో ఎక్సైజ్ ఆదాయం 47 శాతం మేర పెరిగి 3026 కోట్లకు చేరుకుంది. స్టాంప్స్, రిజిస్ర్టేషన్ల ఆదాయం 2 శాతం తగ్గి రూ. 2023 కోట్లకు పరిమితమైంది. లాండ్ రెవెన్యూ ఏకంగా 66 శాతం మేర పడిపోయింది. గత ఏడాది రూ.76 కోట్లు రాగా ఈ ఏడాది రూ.26 కోట్లు మాత్రమే వచ్చింది. వ్యవసాయేతర భూములు మినహా ఇతర స్థిరాస్తులపై వచ్చే ఆదాయం 45 శాతం మేర తగ్గింది. | business |
6,785 | 13-01-2017 13:46:26 | ఆ వ్యవహారంలో నన్ను ఇన్‌వాల్వ్ చెయ్యొద్దు: డైరెక్టర్ క్రిష్ | ప్రస్తుతం ఎవరినోట విన్నా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘ఖైదీ నెంబర్ 150’ గురించిన మాటలే వినబడుతున్నాయి. ఇలాంటి టైమ్‌లో కూడా సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తన ట్వీట్లతో చర్చనీయాంశం అవుతున్నాడు. ‘శాతకర్ణి’ని పొగుడుతూ.. ‘ఖైదీ..’ని తిడుతూ వర్మ పెడుతున్న ట్వీట్లు హాట్‌టాపిక్‌గా మారాయి. ‘శాతకర్ణి’ సినిమాను క్రిష్ అద్భుతంగా తీశాడని, అమీర్ ఖాన్, షారూక్ ఖాన్.. క్రిష్ డైరెక్షన్‌లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ట్వీట్ చేస్తూనే.. ‘ఖైదీ నెంబర్ 150’పై వర్మ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో క్రిష్ ఈ వ్యవహారంపై స్పందించాడు. ‘వర్మ ట్వీట్లు పెట్టడానికి కారణం మీపై ప్రేమా, ‘ఖైదీనెంబర్ 150’ మీదా కోపమా’ అని ప్రశ్న క్రిష్‌కు ఎదురైంది. దీనికి క్రిష్ స్పందిస్తూ.. ఆ వ్యవహారంతో తనకు సంబంధం లేదని, తనను అనవసరంగా అందులోకి లాగొద్దని చెప్పాడు. అలాగే తన దర్శకత్వ పనితనాన్ని ప్రశంసిస్తూ వర్మ చేసిన ఓ ట్వీట్‌కు ధన్యవాదాలు చెబుదామనుకున్నానని, కానీ, ఇది సరైన సమయం కాదని ఆగిపోయానని తెలిపాడు క్రిష్. | entertainment |
12,692 | 08-11-2017 03:02:30 | ట్రంప్‌కు వేలు చూపెట్టి జాబ్ పోగొట్టుకుంది | వర్జీనియా, నవంబరు 7: సైకిల్‌పై వెళ్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఓ మహిళ మధ్య వేలు చూపెట్టింది. అంతే.. ఉద్యోగం పోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. జూలి బ్రిస్క్‌మ్యాన్ అనే మహిళ గత నెలలో వర్జీనియాలో సైకిల్‌పై వెళ్తూ ఉండగా పక్క నుంచి అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్ వెళ్లింది. అప్పుడే ట్రంప్‌కు వేలు చూపిస్తూ తన నిరసనను వ్యక్తం చేసింది. దీన్ని ట్రంప్ కాన్వాయ్‌లోని ఓ ఫొటోగ్రాఫర్ ఫొటో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. జూలి పనిచేస్తున్న అకీమా అనే సంస్థ ఈ ఫొటోను చూసి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఉద్యోగంలోంచి తీసేసింది. ఇప్పుడు జూలి ధైర్యసాహసాలను పొగుడుతూ నెటిజన్లు సోషల్‌మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. | nation |
5,819 | 03-12-2017 18:32:14 | టాలీవుడ్‌కి షాకివ్వబోతున్న సన్నీలియోన్ | పలు ఆంగ్ల మరియు హిందీ చిత్రాల్లో నటిస్తూ తన క్రేజ్‌ను దశదిశలా తెలియజేస్తున్న మోస్ట్ పాపులర్ హాలీవుడ్ లేడీ సన్నీలియోన్ మొట్టమొదటిసారిగా తెలుగులో హీరోయిన్‌గా ఒక సినిమా సైన్ చేసింది. కమర్షియల్ చిత్రాలకు పెట్టింది పేరైన వి.సి.వడివుడయన్ దర్శకత్వంలో స్టీవ్స్ కార్నర్ పతాకంపై పోన్స్ స్టిఫెన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సౌత్ ఇండియన్ కల్చర్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందున్న ఈ చారిత్రాత్మక యుద్ధ నేపధ్య చిత్రంలో సన్నీలియోన్ కథానాయికగా నటించనుంది. నవదీప్, నాజర్‌లు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించనున్నారు. ఇందుకోసం సన్నీలియోన్ కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ మరియు కొన్ని యుద్ధ కళలను నేర్చుకొనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ప్రముఖ ట్రైనర్ ఈ కళలను ముంబైలో సన్నీలియోన్‌కు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం సన్నీలియోన్ ఏకంగా 150 రోజుల కాల్షీట్స్‌ను దర్శకనిర్మాతలకు ఇవ్వడం బట్టి సినిమాపై ఆమెకున్న నమ్మకం తెలుస్తోంది. "బాహుబలి, 2.0" చిత్రాలకు గ్రాఫిక్స్ వర్క్ చేసిన సంస్థలు ఈ చిత్రానికి కూడా పనిచేయనున్నారు. సినిమాలో దాదాపు 70 నిమిషాల గ్రాఫిక్స్ ఉంటాయని చెబుతున్నారు. తెలుగుతోపాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో టైటిల్‌ను త్వరలోనే వెల్లడించనున్నారు. ఈ సినిమా గురించి సన్నీలియోన్ మాట్లాడుతూ.. "ఇప్పటివరకూ నాకున్న ఇమేజ్‌ను పూర్తిస్థాయిలో మార్చే సినిమా అవుతుందన్న నమ్మకం ఉంది. యాక్షన్ సీక్వెన్స్‌లలో యాక్ట్ చేయాలన్నది నా కల. అది ఈ సినిమాతో నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంది. ఇలాంటి ఒక అద్భుతమైన కథ కోసం ఎన్నాళ్ల నుండో ఎదురుచూస్తున్నాను. దర్శకుడు వి.సి.వడివుడయన్ కథ చెప్పిన మరుక్షణం నుండే ఈ సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాను. ఎప్పటి నుంచో ఒక స్ట్రయిట్ తెలుగు సినిమా చేయాలనుకొంటున్నాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడులో నాకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. వారి కోసమే ఈ సినిమా.." అని అన్నారు. 2018 ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవనున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ మరియు సెట్ వర్క్ ప్రస్తుతం వాయివేగంతో జరుగుతున్నాయి. | entertainment |
2,093 | 20-06-2017 00:25:58 | ప్రైమరీ మార్కెట్.. | సిడిఎస్‌ఎల్ ఇష్యూకు తొలి రోజే రెట్టింపు స్పందనపబ్లిక్ ఇష్యూకు వస్తున్న ఎయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఆఫర్ ధరను 355-358 రూపాయలుగా నిర్ణయించింది. గరిష్ఠ స్థాయి వద్ద ఇష్యూ సైజు 1,912 కోట్ల రూపాయలుంటుంది. ఇష్యూ ఈ నెల 28న ప్రారంభమై 30న ముగుస్తుంది. సిడిఎస్‌ఎల్ పబ్లిక్ ఇష్యూ ప్రారంభమైన తొలి రోజు సోమవారం నాడే రెండు రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయింది. ఇష్యూ సైజు 524 కోట్ల రూపాయలు. ఆఫర్ చేస్తున్న షేర్లు 2.48 కోట్లు కాగా 5.19 కోట్ల షేర్లకు తొలిరోజే బిడ్స్ వచ్చాయి. శుక్రవారం నాడు సిడిఎస్‌ఎల్ యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు ద్వారా 154 కోట్ల రూపాయలను సమీకరించింది. ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో ఉంది. ఇష్యూ అనుమతి కోసం సెబికి దరఖాస్తు చేసింది. టాటా పవర్, ఆదిత్య బిర్లా గ్రూప్, మాడిసన్ ఇండియా కాపిటల్, మల్టీపుల్స్ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్‌మెంట్ వంటి ప్రస్తుత షేర్ హోల్డర్లు ఇష్యూలో భాగంగా తమ వాటాల్లో కొంత భాగాన్ని విక్రయించే అవకాశం ఉంది. | business |
16,437 | 20-08-2017 09:19:35 | నిర్లక్ష్యమే కొంప ముంచిందా? |
న్యూఢిల్లీ : ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి కారణం రైల్వే అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ప్రాథమిక సమాచారం. ఈ రైలు ప్రయాణిస్తున్న మార్గంలో నిర్వహణ పనులు జరుగుతున్నట్లు ఆ రైలు డ్రైవరుకు సమాచారం అందలేదని తెలుస్తోంది. ప్రముఖ ఆంగ్ల పత్రికకు రైల్వే శాఖలోని అత్యున్న అధికారి తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో మెయింటెనెన్స్ వర్క్ జరుగుతోంది, అయితే రైళ్ళ వేగంపై పరిమితులు విధించేందుకు సిబ్బంది ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కనీసం హెచ్చరిక సంకేతాలు కూడా ఇవ్వలేదు. ప్రమాదం జరిగిన సమయంలో రైలు గంటకు 106 కి.మీ. వేగంతో ప్రయాణించింది. ట్రాక్ మెయింటెనెన్స్ వర్క్ జరిగేటపుడు గంటకు 10 నుంచి 15 కి.మీ. వేగంతో ప్రయాణించవలసి ఉంటుంది. అదేవిధంగా ఆ మార్గంలో ప్రయాణించే రైళ్ళ డ్రైవర్లకు సరైన రీతిలో హెచ్చరికలు, సంకేతాలు అందించవలసి ఉంటుంది. ఈ ఆరోపణలను మరో రైల్వే అధికారి తోసిపుచ్చారు. ట్రాక్ చెడిపోయి ఉంటే గంటకు 106 కి.మీ. వేగంతో వెళ్తున్న ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్‌లోని 5 బోగీలు సురక్షితంగా ముందుకు వెళ్ళి ఉండేవన్నారు. ఒడిసాలోని పూరీ నుంచి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ వెళ్లే కళింగ ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ శనివారం సాయంత్రం ముజఫర్‌నగర్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని కటౌలీలో పట్టాలు తప్పిన సంగతి తెలిసిందే. | nation |
15,972 | 10-06-2017 17:57:24 | మోదీ పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి దిగజారింది: పవార్ | న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ మూడేళ్ల పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్ విమర్శించారు. వ్యవసాయ ఉత్పత్తి పడిపోయిందని, పెట్టుబడులు తగ్గిపోయాయని, ఉపాధి కల్పన అతి తక్కువగా ఉందని అన్నారు. శనివారం ఎన్‌సీపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పవార్ మాట్లాడుతూ, దేశంలో రాజకీయ పరిస్థితి ఏమాత్రం సజావుగా లేదని, ప్రజలు తీవ్ర అంసతృప్తితో ఉన్నారని చెప్పారు. రైతుల ఆందోళనపై కూడా పవార్ ఇటీవల దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభత్వంపై నిప్పులు చెరిగారు. ఫడ్నవీస్ ప్రభుత్వం మొద్దునిద్ర పోవడం వల్లే రైతులు ఆందోళనకు దిగారని అన్నారు. రైతుల సాకుతో రాష్ట్రంలో అరాచకం సృష్టించాలని కొందరు కోరుకుంటున్నారని ఫడ్నవిస్ చేసిన వ్యాఖ్యలను 'పిల్లతనం చేష్టలు'గా పవార్ కొట్టిపారేశారు. రైతులు ఇచ్చిన సమ్మెలో ఏ రాజకీయ పార్టీ పాల్గోలేదని, రైతు ప్రతినిధుల సారథ్యంలోనే సమ్మె జరిగిందనే విషయాన్ని ఫడ్నవిస్ గ్రహించాలని హితవు పలికారు. రైతు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని, అందుకే రైతులు ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందని పవార్ పేర్కొన్నారు. | nation |
16,056 | 11-12-2017 15:06:49 | తాలిబాన్ వ్యవస్థాపకుడితో చిదంబరం! |
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. తన అడ్డు తొలగించేందుకు మణిశంకర్ అయ్యర్ పాకిస్థాన్ వెళ్ళారని ఆరోపించారు. మరోవైపు మణిశంకర్ అయ్యర్, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రహస్యంగా పాకిస్థాన్ హై కమిషనర్‌తో భేటీ అయ్యారని వార్తలు వచ్చాయి, ఆ వార్తలను మొదట ఖండించిన కాంగ్రెస్, ఆ తర్వాత ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో తాజాగా తాలిబాన్ నేతతో కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం ఉన్న ఫొటో బయటపడింది. దీంతో తాలిబాన్‌తో కాంగ్రెస్‌కు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. దేశ భద్రతను పట్టించుకోకుండా 2013లో అప్పటి కేంద్ర మంత్రి పి. చిదంబరం తాలిబాన్ నేతతో సమావేశమయ్యారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ ఫొటోను బీజేపీ విదేశీ వ్యవహారాల ఇన్‌ఛార్జి విజయ్ చౌతాయ్‌వాలే ట్వీట్ చేశారు. తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ సలామ్ జయీఫ్‌తో కలిసి పి. చిదంబరం ఈ ఫొటోలో కనిపిస్తున్నారు. 2001 వరకు తాలిబాన్ ప్రభుత్వానికి అధినేత అయిన ముల్లా ఒమర్‌కు అబ్దుల్ సలామ్ జయీఫ్ అత్యంత సన్నిహితుడు. జయీఫ్ 2005 వరకు గ్వాంటనామో బేలో జైలు జీవితం గడిపాడు. చిదంబరం 2013లో యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. చిదంబరం, జయీఫ్ ఉన్న ఫొటో గోవా థింక్ ఫెస్టివల్‌లో తీసినదని తెలుస్తోంది. ఈ ఫెస్టివల్‌లో ఉపన్యాసం ఇచ్చేందుకు జయీఫ్‌తోపాటు చిదంబరంను ఆహ్వానించారని తెలుస్తోంది. ‘‘2013లో పి. చిదంబరం తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ సలామ్ జయీఫ్‌తో కలిసి కనిపించారు. తాలిబాన్ ప్రభుత్వ అధినేత ముల్లా ఒమర్‌కు జయీఫ్ అత్యంత సన్నిహితుడు. ఆయన 2005 వరకు గ్వాంటనామో బేలో నిర్బంధంలో ఉన్నాడు. మరో రుజువు దొరికింది’’ అని విజయ్ చౌతాయ్‌వాలే ట్వీట్ చేశారు. | nation |
9,574 | 28-06-2017 21:56:25 | 'రక్తసంబంధం'తో రచయితగా ముళ్లపూడి | తన రచనతో జనాలను రంజింప చేసిన ముళ్ళపూడి వెంకటరమణ చిత్రసీమలోనూ పదవిన్యాసాలతో పరవశింపచేశారు. జూన్ 28న ముళ్ళపూడి జయంతి చిత్రసీమలో అడుగు పెట్టకముందే రచయితగా మంచి పేరు సంపాదించారు ముళ్లపూడి వెంకటరమణ... సందర్భం ఏదైనా సరే అందులో సహజత్వం ఉట్టిపడుతూనే పదవిన్యాసాలు చేయించడం ముళ్ళపూడి వారి బాణీ... తొలి చిత్రం 'రక్తసంబంధం'లోనే సెంటిమెంట్ సీన్స్‌కు ముళ్ళపూడి చేసిన రచన జనం మదిని కట్టిపడేసింది. తెలుగు చిత్రసీమలో అంతకు ముందే కొన్ని సోషల్ మూవీస్‌లో మైథలాజికల్ ఫాంటసీని చొప్పించినా, ముళ్ళపూడి వెంకటరమణ రచనతో ఆ పంథా మరింత వెలుగొందింది... 'బుద్ధిమంతుడు, ముత్యాలముగ్గు' వంటి చిత్రాల్లో ముళ్ళపూడి కొన్ని పాత్రల ఊహల్లో పురాణపాత్రలను నడిపించి అలరించిన తీరు అనితరసాధ్యం అనిపించకమానదు..సినిమా రంగంలోకి రాకముందే రమణ రాతకు బాపు గీతకు స్నేహం... ఇక చిత్రసీమ 'సాక్షి'గా వారి జోడీ తెలుగువారిని పులకింప చేసింది. చివరి చిత్రం 'శ్రీరామరాజ్యం'లోనూ బాపు తీతకు రమణరాత జోడయి తెలుగు జనాన్ని అలరించింది. నేడు బాపు-రమణ ఇద్దరూ లేరు. అయినా వారి జ్ఞాపకాలు పదిలంగానే ఉన్నాయి. వారు తెరకెక్కించిన చిత్రాలతో తెలుగువారి హృదయాల్లో సదా నివసిస్తూనే ఉంటారు.. | entertainment |
1,120 | 01-02-2017 04:01:56 | ఆర్‌బిఐ మిగులు నిధులు పిఎస్‌బిలకే | ఆర్‌బిఐ వద్ద ఉండే మిగులు నిధులతో పాటు డీమానిటైజేషన్ వల్ల సమకూరిన సొమ్మును ప్రభుత్వరంగ బ్యాంకులకు అదనపు మూలధనం సమకూర్చడానికే ఉపయోగించాలి. ఈ మిగులు నిధులు సూత్రప్రాయంగా అదనపు ఆదాయంగా పరిగణనలోకి రావు. వాటిని స్వభావరీత్యా బ్యాలె న్స్ షీట్‌గానే పరిగణించాలి. ప్రపంచంలోనే అత్యధికంగా మూలధనం ఉన్న బ్యాంకుల్లో ఆర్‌బిఐ ఒకటి. ఆ నిధులు ఆర్‌బిఐ వద్దనే ఉండాలనడానికి ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదు. కాని ఆ నిధులను ఉత్పాదక కార్యకలాపాలకే వినియోగించడం హేతుబద్ధంగా ఉంటుంది. ఆ నిధులను పిఎ్‌సబిలకు అదనపు మూలధనం అందించేందు కు లేదా పిఎస్‌యు ఆస్తుల పునర్నిర్మాణ సంస్థకు అవసరమైన నిధులు సమకూర్చేందుకు ఉపయోగిస్తే మరింత మంచిది. | business |
7,073 | 30-07-2017 06:50:36 | విశాల్ హెచ్చరికతో వెనక్కి తగ్గిన ‘ఫెఫ్సీ’..! | షూటింగ్‌లను అడ్డుకోమని హామీసామరస్య పరిష్కారానికి విజ్ఞప్తిఆంధ్రజ్యోతి, చెన్నై: తమిళ చలనచిత్ర నిర్మాతల మండలితో ఏర్పడిన విభేదాలపై దక్షిణ భారత సినీ కార్మికుల సమ్మేళనం (ఫెఫ్సీ) వెనక్కి తగ్గింది. ఫెఫ్సీలో సభ్యులుగా ఉన్న కొంతమంది తప్పిదం వల్లే ఈ సమస్య ఏర్పడిందని, ఇందుకు తీవ్రవిచారం చేస్తున్నామని పేర్కొంటూ... సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ముందుకు రావాలని ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్‌కే సెల్వమణి శనివారం నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ను కోరారు. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ మదురైలో జరుగుతున్న ‘బిల్లా పాండి’ చిత్రం షూటింగ్‌ను కొన్నిరోజుల క్రితం ఫెఫ్సీ కార్మికులు అడ్డుకున్నారు. దీంతో సదరు చిత్ర నిర్మాతకు నష్టం ఏర్పడింది. ఈ విషయంపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేయడం, ఫెఫ్సీతో జరిపిన చర్చలు విఫలం కావడంతో.. ఫెఫ్సీ సభ్యులతోనే సినిమా షూటింగ్‌లు జరుపాలన్న నిబంధనేమి లేదని, బయటి కార్మికులతో షూటింగ్‌లు చేస్తామని విశాల్ ప్రకటించారు. సినిమా షూటింగ్‌లు అడ్డుకుంటే సహించమని హెచ్చరించారు. దీంతో ఫెఫ్సీ వెనక్కి తగ్గింది. ఈ మేరకు ఫెఫ్సీ అధ్యక్షుడు సెల్వమణి నిర్మాతల మండలి ఒక లేఖ రాస్తూ... ‘కొంతమంది నిర్మాతలు, ఫెఫ్సీ సభ్యుల మధ్య వ్యక్తిగత సమస్యల కారణంగానే ఈ సమస్య ఉత్పన్నమైంది. ఇటువంటి సంఘటనల్ని ఫెఫ్సీ కూడా ప్రోత్సహించదు. ‘బిల్లా పాండి’ షూటింగ్‌ని అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకుంటాం. నిర్మాతలకి వ్యతిరేకంగా ఫెఫ్సీ సభ్యులెవ్వరూ బహిరంగ వ్యాఖ్యలు చేయరు. ఒకవేళ నిర్మాతల పట్ల అనుచితంగా ప్రవర్తించుంటే క్షమాపణలు చెప్పేందుకు కూడా సిద్దం’ అని పేర్కొన్నారు. ఈ లేఖపై విశాల్, నిర్మాతల మండలి సభ్యుల నుంచి సానుకూల స్పందన లభించింది. ఫెఫ్సీతో చర్చలు జరుపుతామని మరోసారి విశాల్ స్పష్టం చేశారు. | entertainment |
16,362 | 26-02-2017 18:20:37 | కేజ్రీవాల్‌కు నితీశ్ షాక్! | న్యూఢిల్లీ: ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌కు బీహార్ సిఎం నితీశ్ కుమార్ షాకిచ్చారు. ఏప్రిల్‌లో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల్లో మొత్తం 272 స్థానాలకు జెడియూ పార్టీ పోటీ చేయనుంది. ఆయన స్వయంగా రెండు ర్యాలీల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే 109 స్థానాల్లో అభ్యర్ధులను ప్రకటించి దూకుడుగా వెళ్తోన్న ఆమ్ ఆద్మీ పార్టీకి నితీశ్ పార్టీ తాజా ప్రకటనతో బ్రేక్ వేసినట్లైంది. ఓ వైపు బిజెపి నుంచి ఆప్‌కు ప్రధాన పోటీ ఉండనుంది. ఈలోగా నితీశ్ కూడా బరిలోకి దిగుతుండటంతో ఎంసీడీ ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి. | nation |
7,222 | 11-08-2017 10:43:54 | 18 ఏళ్ల తర్వాత మహేశ్ సినిమాలో కృష్ణ..! | వరుస సినిమాలతో దూకుడు పెంచాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. ‘స్పైడర్’ షూటింగ్‌లో పాల్గొంటూనే ‘భరత్ అను నేను’ సినిమా కొబ్బరి కాయ కొట్టేశాడు. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా గురించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ వార్తను విన్న మహేశ్ అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారట..! ఇంతకీ ఏమిటా వార్త..? కొరటాల శివ డైరెక్షన్‌లో ప్రస్తుతం మహేశ్ ‘భరత్ అను నేను’ సినిమా చేస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సూపర్ స్టార్ కృష్ణను సంప్రదించాడట కొరటాల శివ. దానికి ఆయన కూడా ఓకే చెప్పేశారట. దాదాపు 18 సంవత్సరాల తర్వాత కృష్ణ కొడుకు సినిమాలో నటించనుండడంతో ఈ సినిమా మహేశ్ కుటుంబానికి, వాళ్ల అభిమానులకు చాలా ప్రత్యేకమైనది అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ఈ సినిమాలో చాలా మంది సీనియర్ నటులు నటిస్తున్నాడట..! కైరా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మహేశ్ ముఖ్యమంత్రిగా నటిస్తున్నవిషయం తెలిసిందే..! కృష్ణ హీరోగా నటించిన కొన్ని సినిమాల్లో మహేశ్ బాల నటుడిగా నటించగా, మహేశ్ హీరోగా నటించిన కొన్ని సినిమాలలో కృష్ణ అతిథి పాత్రల్లో కనిపించి మెప్పించారు. అయితే ఈసారి మాత్రం అలా వచ్చి ఇలా వెళ్లినట్టు కాకుండా సినిమాలో కీలకమైన ఓ పాత్రను ఆయన పోషించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని మహేశ్ కానీ, చిత్ర బృందం కానీ అధికారికంగా ప్రకటించలేదు. ఇదిలా ఉండగా మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ నటించిన ‘స్పైడర్’ సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తండ్రికి ఇష్టం లేకున్నా ఆ హీరో రాజకీయాల్లోకి వచ్చాడట | entertainment |
8,251 | 22-08-2017 22:23:02 | తెరపై చరిత్రకు.. సైరా! |
చిరంజీవి, అమితాబ్ తొలి కాంబినేషన్‌అభిమానులు, సగటు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిరంజీవి తాజా చిత్రానికి ‘సైరా’ అనే టైటిల్ ఖరారు చేశారు. ‘నరసింహారెడ్డి’ అనేది ఉప శీర్షిక. దేశంలో తెల్లదొరలపై పోరాడిన తొలి స్వాతంత్య్ర సమరయోధునిగా చరిత్రకెక్కిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తీస్తున్న సినిమా కాబట్టి అదే పేరు పెడతారని ఇప్పటివరకూ అందరూ ఊహించారు. దాంతో పాటే ‘మహావీర’ అనే టైటిల్ కూడా వినిపించింది. కానీ అనూహ్యంగా ‘సైరా’ అనే టైటిల్ పెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచారు. చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం అభిమానుల సమక్షంలో కోలాహలంగా జరిగిన కార్యక్రమంలో ‘బాహుబలి’ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ‘సైరా’ ఫస్ట్‌లుక్ మోషన్ ప్టోసర్‌ను ఆవిష్కరించారు. ఎదురుగా కోటపై ఎగురుతున్న ఆంగ్లేయుల జెండా కాలిపోతుంటే, బయట గుట్టలుగా బ్రిటీష్ సైనికుల శవాలు పడుంటే.. ఓ చేత్తో విల్లు, మరో చేత్తో కరవాలం పట్టుకొని, భుజాన అమ్ములపొది తగిలించుకుని వెనక్కి తిరిగిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి దర్శనమిచ్చారు. ఇందులో ఆయన ముఖాన్ని వెల్లడిచేయక పోవడం గమనార్హం. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. టైటిల్ లోగోను అల్లు అరవింద్, తారాగణం, సాంకేతిక నిపుణుల పోస్టర్‌ను పరుచూరి బ్రదర్స్, వరుణ్‌తేజ్ ఆవిష్కరించారు. రాజమౌళి మాట్లాడుతూ ‘‘మెగాస్టార్ ముఖం చూపించకుండా వెనుక నుంచి డిజైన్ చేసిన లుక్ అదిరిపోయింది. తారాగణం సూపర్బ్‌గా ఉంది. ‘బాహుబలి’ సక్సెస్ అయ్యిందంటే టెక్నీషియన్లే కారణం. ఈ సినిమాకు స్టార్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. దర్శకుడు సురేందర్‌రెడ్డికి 24 శాఖలపై మంచి పట్టుంది. ఇవన్నీ చూస్తుంటే ఇది చిరంజీవి 151వ సినిమాలా కాకుండా ఆయన మొదటి సినిమాలా అనిపిస్తోంది.’’ అన్నారు. తన కెరీర్‌లో మొదటి బ్లాక్‌బస్టర్ అందించిన రాజమౌళి చేతుల మీదుగా మోషన్ పోస్టర్ ఆవిష్కరించడం సంతోషంగా ఉందని రామ్‌చరణ్ అన్నారు. ‘‘మోషన్ పోస్టర్‌ను ఎలా ప్రెజెంట్ చేయాలా అని వారం రోజులుగా టెన్షన్ పడుతున్నాం. ఆంజనేయస్వామి శక్తివల్లే అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి వంటి స్టార్లు మా సినిమాలో భాగమయ్యారు’’ అని ఆయన చెప్పారు. అరవింద్ మాట్లాడుతూ ‘‘చిరంజీవిగారు సినీ పరిశ్రమకు వచ్చి 40 ఏళ్లు. అందులో ఆయనతో నాది 37 ఏళ్ల జర్నీ. ‘సైరా.. నరసింహారెడ్డి’ని మాకు అత్యంత ఆప్తుడైన సూరి (సురేందర్‌రెడ్డి) డైరెక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. చరిత్ర ఎప్పుడు, ఎవర్ని ఎందుకు ఎంచుకుంటుందో తెలీదు. ఈసారి సూరి వంతైంది. భారతీయ సినిమా చరిత్రలో ఇది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అవుతుంది’’ అన్నారు. ‘సైరా.. నరసింహారెడ్డి’ పేరు చెబితేనే తనకు వణుకు పుడుతోందని సురేందర్‌రెడ్డి చెప్పారు. ‘‘నాపై చాలా పెద్ద బాధ్యత పెట్టారు. నా ఫోకస్ మొత్తం ఈ సినిమాపైనే. దాన్ని బ్లాక్‌బస్టర్ చేయడమే నా ముందున్న లక్ష్యం’’ అని ఆయన తెలిపారు. ఇది నా ఆశలకు ప్రతిరూపం: చిరంజీవిఈ కార్యక్రమానికి స్వయంగా హాజరుకాని చిరంజీవి ప్రత్యేక వీడియో ద్వారా తన భావాలను పంచుకున్నారు. ‘‘నా తల్లిదండ్రులు చేసిన పుణ్యమో, లేక నేను చేసుకున్న పుణ్యమో.. ఇంతమంది అభిమానుల్ని సంపాదించుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. వాళ్ల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నా. వాళ్లు గర్వపడే సినిమాలు, పది కాలాల పాటు చెప్పుకొనే పాత్రలు చేయగలను. భగత్‌సింగ్ పాత్రలో నటించాలని చాలా సార్లు అనుకున్నా. ఇన్నాళ్లకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రూపంలో నా ఆశలకు, అభిమానుల ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచే పాత్ర దొరికింది. మన స్వాతంత్య్ర పోరాటానికి ఆద్యులు, పోరాట యోధులందరికీ ఆరాధ్యులు, మన తెలుగుబిడ్డ అయిన ఉయ్యాలవాడ పాత్ర దొరకడం గొప్ప అవకాశం. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా అద్భుత దృశ్యకావ్యం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగువాళ్లు గర్వించేలా ఓ చరిత్ర సృష్టించిన దర్శక బాహుబలి రాజమౌళి ఆశీస్సులు అందుకోవడం నిర్మాత చరణ్‌కు, ఈ సినిమాకు శుభ సూచకం’’ అని ఆయన చెప్పారు. | entertainment |
4,050 | 13-12-2017 00:53:37 | తెలంగాణ సాహితీ కళా వైభవం |
తెలంగాణ ఒక తరగని సాహిత్య గని. తెలంగాణా సాహిత్యం ఇతర భాషా కవులు, కళాకారులను ఎంతగానో కదిలించింది. ఈ నేల కీర్తిని, చరి త్రను పొగడనివారెవ్వరు? తెలంగాణ, తెలంగాణ సాయుధపోరాటం ప్రపంచ చరిత్రలోనే ఎన్నదగినది. మట్టి చరిత్రే మనిషి చరిత్ర, మట్టి మినహా మనిషికి చరిత్రే లేదు. ముందుగా ఈ మట్టికి మొక్కుదాం. ఈ తెలంగాణ నేల పోరాట పటిమ ప్రపంచ మేధావుల, పోరాట యోధుల మెప్పు పొందింది. లెనిన్ లాంటి విప్లవ మహా యోధులచే కొనియాడబడింది. నెరుడాలాంటి కవులచే కీర్తించబడింది. ఆంధ్ర ప్రాంతపు ఆరుద్ర లాంటి ప్రసిద్ధ కవిచేత ‘త్వమే వాహం’ కావ్యం రాయించుకొంది. అభ్యుదయవాది సోమసుందర్ చేత ‘వజ్రాయుధం’ కావ్యం రాయించుకొంది. శేషేంద్ర శర్మ లాంటి కవుల చేత 1947, 1948లలో ‘విశాలాంధ్ర’ పత్రికలో తెలంగాణపై కవిత్వం రాయించుకొంది. కుందుర్తి ‘తెలంగాణ’ కావ్యం రాసారు. సుద్దాల హనుమంతు, యాదగిరి లాంటి ఎందరో విప్లవ యోధులు స్వయంగా పోరాటంలో పాల్గొని అమూల్యమైన పాటలు రాశారు. సాహిత్యాన్ని సృష్టించారు. ‘మా భూమి’ లాంటి నాటకాలు పుట్టాయి. బౌద్ధం, జైనం పరిఢవిల్లిన ఈ నేల చరిత్ర లోకానికి తెలి యాల్సినంతగా తెలియ లేదు. క్రీస్తు పూర్వం మగధులు, నందులు, మౌర్యులు ఈ నేలను పరిపాలించిన ఆధారాలు ఉన్నాయి. పూర్వ శాతవాహనులైన సమగోప, నారన, గోబధలు పరిపాలించిన ఆధారాలు నాణాలతో సహా దొరికిన ప్రాంతమిది. ఇందుకు కరీంనగర్ జిల్లా లోని పెద్దబొంకూర్ తవ్వకాలే సాక్ష్యం. శాతవాహనుల తొలి రాజధాని అయిన కోటిలింగాల నేటి కరీంనగర్ జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉంది. శాతవాహనుల తరువాత ఇక్ష్వాకులు, త్రైకూటకులు, బాదామి చాళుఖ్యులు, వేములవాడ చాళుఖ్యులు, కళ్యాణి చాళుఖ్యులు, ముదిగొండ చాళుఖ్యులు, కుందూరు చోడులు, విష్ణుకుండినులు, వాకాటకులు, కాకతీయులు, పద్మ నాయకులు, విజయనగర రాజులు, బహమనీలు, కుతుబ్ షాహీలు, మొగలులు, నిజాం ప్రభువులు ఈ నేలను పరిపాలించారు. త్రిలింగ దేశమైన ఈ తెలంగాణం – కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామం అనే మూడు లింగాల మధ్యనున్న ప్రదేశం. ఆ త్రిలింగ దేశాన్ని తొలి శాతవాహనులు నేటి కరీంనగర్ జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉన్న ‘కోటిలింగాల’ను రాజధానిగా చేసుకొని పాలించారు. అంతకు పూర్వం శాతవాహనులైన సమగోప, నారన, గోబధలు పాలించారు. క్రీస్తు పూర్వం ఇక్కడే బౌద్ధం, జైన మతాలూ వర్ధిల్లాయి. వేములవాడ గుళ్ళు గోపురాలు, దూళికట్ట బౌద్ధ చైత్యాలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు. బౌద్ధ గురువు బావరి నేటి కరీంనగర్, నిజామాబాద్ సరిహద్దు గ్రామం బాదనకుర్తి వాసి అని, జైన మత గురువు ఋషబునికి, బాహుబలికి బోధన్ తో సంబంధాలున్నాయనీ ఆధారాలున్నాయి. శాతవాహన రాజ్యం అస్మక జనపదం అని, అస్మకులు, మూలకులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారని చరిత్ర చెబుతోంది. భారత ప్రభుత్వం అధికారికంగా తీసుకున్న క్యాలెండర్ శక సంవత్సరం శాతవాహన, శాలివాహన కాలం ఆధారంగా రూపుదిద్దబడినది. హాలుడి గాథా సప్త శతి, గుణాఢ్యుడి బృహత్కథ, సోమ దేవసూరి కథా సరిత్సాగారం, పంపకవి సోదరుడు జినవల్లభుడి కురిక్యాల శాసనాలు, కోనసముద్రం ఇనుము ఉక్కు పరిశ్రమలు, అజంతా, ఎల్లోరా, శిల్ప చిత్ర కళలు తెలంగాణ చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాధారాలు. సాహిత్య, కళా, సాంస్కృతిక రంగాలలో రాణిస్తూ జాలువారే జాను తెనుగు ద్విపద కావ్యాల పాల్కురికి సోమన్నలు, సహజ కవితాధార మహాభాగవతం సృష్టికర్త బమ్మెర పోతన్నలు వెలసిన నేల ఇది. అచ్చ తెలుగు తొలి కావ్యం ‘యయాతి చరిత్ర’ రాసిన పొన్నెగంటి తెలుగన్న తెలంగాణ ప్రాంతపు నేటి పటాన్ చెరువు వాసి. నల్లగొండ ప్రాంతం సర్వజ్ఞ భూపాల సారస్వతపు నేల, ఓరుగల్లు కాకతీయుల కాలం నాటి జాయపసేనాని ‘పద రత్నావళులు’, మడికి సింగన, కందనామాత్యుడు, పోతన మహాకవి శిష్యుడు వెలగందుల నారయ, చరికొండ ధర్మన్నలు, కొరవి గోపరాజులు, దోమకొండ కవులు, పద్మపురాణాలు, గద్వాల సంస్థాన కవులు, గోన బుద్ధారెడ్డి తొలి రామాయణం, అప్ప కవీయం లాంటి లాక్షణిక గ్రంథాలు వెలసిన నేల ఇది. ఆధునిక తెలంగాణ సాహితీ సాంస్కృతిక, సామాజిక రంగాలలో దాశరథి సోదరులు, కాళోజి, వట్టికోట, సినారె తదితర ఎందరో గొప్ప కవులు పుట్టిన నేల ఇది. సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ కవుల సంచిక, షబ్నవీస్ తొలి తెలుగు నీలగిరి పత్రిక, చర్విరాల భాగయ్య యక్షగానాలు వెలసిన నేల ఇది. భాగ్యరెడ్డి వర్మ, అరిగె రామస్వామి లాంటి సంఘ సంస్కర్తలు, పి.టి.రెడ్డి, కాపు రాజయ్య లాంటి చిత్రకారులు, శిల్పకారులు పుట్టిన నేల ఇది. ‘ఊరుమ్మడి బతుకులు’, ‘మా భూమి’, ‘రంగుల కల’ లాంటి ఉత్తమ సినిమాలు నిర్మించిన ప్రాంతమిది. జ్ఞానపీఠాలకు నిలయమై, దేశానికి ప్రధానిని అందించి, ఉద్యమాలకు ఊపిరై అందర్నీ అక్కున చేర్చుకొని ఆదరించే కన్నతల్లి ఈ తెలంగాణం.సబ్బని లక్ష్మీనారాయణ | editorial |
9,946 | 30-07-2017 18:49:27 | సుకుమార్ ని సేఫ్‌గా బయటపడేసిన బన్నీ! | దర్శకుడు సుకుమార్ ఓ అపాయంలో ఉండగా బన్నీ సాహసం చేసిమరీ సుకుమార్ ని రక్షించి సేఫ్ గాబయటపడేసాడట. ఈ విషయాన్ని సుకుమార్ స్వయంగా వెల్లడించాడు. సుకుమార్ నిర్మించిన 'దర్శకుడు' ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ విషయాన్ని బయటపెట్టాడు సుకుమార్. అయితే బన్నీ చేసిన ఆ సాహసం ఏంటో వివరాల్లోకి వెళితే..'ఆర్య' సినిమా షూటింగ్‌లో భాగంగా ఓ నదిలో 'ఏదో ప్రియరాగం వింటున్నా..' పాట చిత్రీకరణ సమయంలో అంతా పడవలో ప్రయాణిస్తున్నారట. అయితే ఆ పడవలో సుకుమార్ ఓ వైపు చివరన కూర్చోగా.. హీరోయిన్ కదపడంతో అదుపుతప్పి నీటిలో పడ్డాడట సుక్కు. ఆ సమయంలో అతన్ని రక్షించడానికి యూనిట్ సభ్యులెవరూ సాహసం చేయకున్నా.. బన్నీ మాత్రం వెంటనే సాహసంగా నీళ్ళలోకి దూకి సుకుమార్ ని రక్షించడానికి ప్రయత్నించాడట. ఆ సమయంలో నాకు ఈతరాదు. బన్నీ రక్షించడంలో ఏమైనా తేడా వస్తే ఇద్దరి ప్రాణాలకు ప్రమాదమే ఉండేదని ఈ సందర్బంగా సుకుమార్ తెలియజేశాడు. ఇందుకోసం బన్నీకి నేను కృతజ్ఞతలు తెలుపమని, ఎందుకంటే బన్నీ తనవల్లే హీరో అయ్యాడంటూ జోక్స్‌తో అందరినీ నవ్వించాడు సుక్కు. | entertainment |
11,701 | 03-08-2017 00:23:30 | సూర్యుడి మధ్య భాగానికి స్పీడెక్కువ! | ఉపరితలం కంటే నాలుగు రెట్లు వేగంగా భ్రమణంలాస్‌ఏంజెలిస్, ఆగస్టు 2: సూర్యుడి ఉపరితలం కంటేనూ మధ్యభాగం నాలు గు రెట్లు వేగంగా భ్రమణం చెందుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇప్పటి వరకు సూర్యుడి ఉపరితలం, మధ్యభాగం రెండూ ఒకే వేగంతో భ్రమించేవని నమ్ముతూ వచ్చామని, అయితే, తాజా విషయం అంతా ఆశ్చర్యంగా ఉందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు తెలిపారు. దీంతో సూర్యుడు ఎలా ఏర్పడ్డాడో తెలుసుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. సూర్యుడు ఏర్పడిన తర్వాత ఉపరితల వేగం తగ్గి ఉండవచ్చని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఆ కారణంగానే సూర్యుడిపై మచ్చల(సన్‌స్పాట్)పైనా ప్రభావం పడి ఉండొచ్చ న్నారు. సన్‌స్పాట్ చాలా పెద్దదిగా ఉంటుందని, ఒక్కో టి భూమికంటే ఎక్కువ వ్యాసం కలిగి ఉంటుందన్నారు. | nation |
3,907 | 17-05-2017 01:35:38 | స్కూల్ ఫీజులు పెద్ద సమస్యే! | ప్రైవేట్ స్కూళ్ళలో అధిక ఫీజులు, తదితర సమస్యల పరిష్కారానికి పోరాటాలే శరణ్యం. శాశ్వత పరిష్కారం కోసం ప్రైవేట్ స్కూళ్ళ నియంత్రణ చట్టం తేవాలని ప్రభుత్వంతో పోరాడుతూనే, తక్షణ ఉపశమన చర్యల కోసం ప్రైవేటు యాజమాన్యాలతోనే పోరాడాలి. ఉద్యమాల్లో అనుభవం కలిగిన ప్రజాసంఘాల తోడ్పాటుతో తల్లిదండ్రులు ఐక్యమై ఉద్యమాల బాటపట్టాలి. ప్రైవేట్ విద్యా వ్యాపారాన్ని నియంత్రించాలి. ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజుల సమస్య తల్లితండ్రులతో పాటు ప్రభుత్వానికీ పెద్ద సవాల్ గా తయారైంది. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో ప్రైవేట్ స్కూళ్ళలో విద్యార్థులు అత్యధికం. దేశం మొత్తమ్మీద సగటున 40 శాతం బడి పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో ఉంటే తెలంగాణలో 54 శాతం (33 లక్షల) మంది ఉన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సగటున ఏటా 1.20 లక్షల మంది ప్రైవేట్ స్కూళ్ళలో చేరుతూ ఉండగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ మూడేళ్ళలో కూడా సగటున 65వేల మంది చేరుతున్నట్లు విద్యా గణాంకాల ద్వారా తెలుస్తోంది. సర్కార్ బడుల్లో చదువు సరిగా లేదనే అసంతృప్తితో తల్లిదండ్రులు తమ బిడ్డలకు నాణ్యమైన విద్య కోసమని ప్రైవేట్ స్కూళ్ళను ఆశ్రయిస్తున్నారు. అది విద్యా వ్యాపారులకు మంచి వాటంగా మారింది. ప్రభుత్వ నియంత్రణ కూడా లేకపోవడంతో ఇష్టానురాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల, పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వం నియమించిన కమిటీతో సమస్య పరిష్కారం అవుతుందా అనేది తాజా చర్చనీయాంశం. ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ ఉప కులపతి ఆచార్య టి. తిరుపతిరావు చైర్మన్‌గా, పాఠశాల విద్యా శాఖ సంచాలకులు జి.కిషన్ కన్వీనర్‌గా ఉన్న ఈ కమిటీలో నలుగురు విషయ నిపుణులు కాగా తల్లిదండ్రుల ప్రతినిధులు ఇద్దరు, ప్రైవేట్ మేనేజ్‌మెంటు ప్రతినిధులు ఐదుగురు వున్నారు. 2017 మార్చి 30 నుంచి ఏప్రిల్ 10 వరకు నాలుగు విడతల సమావేశాలు జరిగాయి. గత అనుభవాల నేపథ్యంలో ఫీజుల నియంత్రణ కోసం విద్యా శాఖ చేసిన ప్రతిపాదనలు పరిశీలించి తమ సూచనలు, సవరణలు చేయడమే ఈ కమిటీ సభ్యుల బాధ్యత. విద్యాశాఖ ప్రతిపాదనలలో చాలావరకు ఫీజులు నిర్ణయించడానికి అవసరమైన వివిధ అంశాలు సహేతుకంగానే వున్నాయి. పేరెంట్స్ ప్రతినిధులు వాటిని సమర్థించడంతోపాటు మరింత బలపర్చే ప్రతిపాదనలు జోడించారు. యాజమాన్యాల ప్రతినిధులు పలు అంశాలను వ్యతిరేకించారు. ప్రభుత్వ గుర్తింపు గల ఏ ప్రైవేట్ స్కూల్ అయినా ఎలాంటి డొనేషన్స్ తీసుకోకూడదు. ఏ స్కూల్ కయినా ఇదే నిబంధన వర్తిస్తుంది. అడ్మిషన్ సమయంలో అప్లికేషన్‌కి రూ.100, రిజిస్ట్రేషన్‌కు రూ.500, కాషన్ డిపాజిట్ (రిఫన్డబుల్)గా రూ.5000 మించకుండా వన్‌టైమ్ ఫీజులు తీసుకోవచ్చు. సిబ్బందికి చెల్లించే జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, నిర్వహణా ఖర్చులు, వసతులు, అభివృద్ధికయ్యే ఖర్చుల ఆధారంగా ట్యూషన్ ఫీజు నిర్ణయించాలి. ఎడిషనల్ యాక్టివిటీస్‌కు అయ్యే ఖర్చులను ట్యూషన్ ఫీజుకి కలపకూడదు. బుక్స్, యూనిఫామ్స్, స్టేషనరీ వగైరా కోసం మార్కెట్‌లోని మూడు షాపులను నోటిఫైచేయాలి. జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా, డిఈఓ, ఆడిట్ ఆఫీసర్‌తో డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీ ఉండాలి. రూ.500 మించని ఫీజును ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. ఒకసారి నిర్ణయించిన ఫీజు మూడు విద్యా సంవత్సరాలకు వర్తించాలి. ఐఐటి, ఒలింపియాడ్ , కాన్సెప్ట్, టెక్నో వగైరా ఫ్యాన్సీ పేర్లతో స్కూల్స్ ప్రచారం చేసుకోకూడదు. తెలంగాణ తల్లిదండ్రుల సంఘం సూచనలు కొన్ని: (1) అకడమిక్ ఇయర్ ప్రతి ఏటా జూన్ 12 నుంచి ఏప్రిల్ 23 వరకు వుండే విధానాన్నే కొనసాగించాలి. మార్చి 21 నుంచి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించి ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులివ్వడం వల్ల అదనపు ప్రయోజనం లేకపోగా నష్టం జరుగుతుంది. దేశమంతటికీ వర్తించే సీబీఎస్–ఈ అకడమిక్ ఇయర్‌ని యథాతథంగా రాష్ట్రానికి అమలుచేయడం సరైంది కాదు. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులకు స్వతంత్ర అకడమిక్ షెడ్యూలు వుండాలి. (2) పైవేట్ స్కూళ్ళ స్థాపన, నిర్వహణ, నియంత్రణ తో పాటు ఫీజుల నిర్ణయానికి సంబంధించన ప్రాతిపదికలతో కూడిన సమగ్రమైన రూల్స్ గల జీఓ.1/ 1994ను సమర్థంగా అమలుపరచాలి. (3) ప్రైవేట్ స్కూళ్ళలో ప్రభుత్వ నిబంధలు అమలుజరుగుతున్న తీరును పరిశీలించడానికి, అక్రమ చర్యలు వెలికితీయడానికి సోషల్ ఆడిట్ కమిటీని నియమించాలి. ఈ కమిటీలో అధికారులు, బాలల హక్కుల సంఘాలు, తల్లిదండ్రుల సంఘాలు, న్యాయవాదులు, సామాజిక సంస్థల ప్రతినిధులు వుండాలి. (4) ఫీజుల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులను అమలుచేయని ప్రైవేట్ స్కూళ్ళ గుర్తింపును రద్దుచేయాలి. ఆ విధంగా ప్రభుత్వ గుర్తింపు రద్దుకు గురయ్యే ప్రైవేట్ స్కూళ్ళను ఆరునెలల ముందుగానే బహిరంగంగా ప్రకటించి సదరు స్కూళ్ళలోని విద్యార్థులను గుర్తింపుగల స్కూళ్ళలో చేర్చుకొనే అవకాశం కల్పించాలి (5) ఫీజులు చెల్లించలేదనీ, ఇతర కారణాలతో విద్యార్థులను శిక్షలకు గురిచేస్తూ, తల్లిదండ్రులను వేధింపులకు గురిచేస్తున్న ప్రైవేట్ స్కూళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలి. (6) ప్రైవేట్ స్కూళ్ళు ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహించే బ్రాంచీలు, సెక్షన్స్‌ను నిషేధించాలి. (7) ప్రైవేట్ స్కూళ్లలో సమస్యలను ప్రభుత్వ దృష్టికి తేవడానికి ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్‌ను అమలు చేయాలి. దాని యాక్షన్ టేకెన్ రిపోర్టున నెలకు ఒకసారి బహిరంగంగా ప్రకటించాలి. ప్రైవేట్ స్కూళ్ళలో అధిక ఫీజులు, తదితర సమస్యల పరిష్కారానికి పోరాటాలే శరణ్యం. శాశ్వత పరిష్కారం కోసం ప్రైవేట్ స్కూళ్ళ నియంత్రణ చట్టం తేవాలని ప్రభుత్వంతో పోరాడుతూనే, తక్షణ ఉపశమన చర్యల కోసం ప్రైవేటు యాజమాన్యాలతోనే పోరాడాలి. ఉద్యమాల్లో అనుభవం కలిగిన ప్రజాసంఘాల తోడ్పాటుతో తల్లిదండ్రులు ఐక్యమై ఉద్యమాల బాటపట్టాలి. ప్రైవేట్ విద్యా వ్యాపారాన్ని నియంత్రించాలి. నాగటి నారాయణప్రైవేట్ స్కూళ్ళలో ఫీజుల సమస్య తల్లితండ్రులతో పాటు ప్రభుత్వానికీ పెద్ద సవాల్ గా తయారైంది. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో ప్రైవేట్ స్కూళ్ళలో విద్యార్థులు అత్యధికం. దేశం మొత్తమ్మీద సగటున 40 శాతం బడి పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో ఉంటే తెలంగాణలో 54 శాతం (33 లక్షల) మంది ఉన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సగటున ఏటా 1.20 లక్షల మంది ప్రైవేట్ స్కూళ్ళలో చేరుతూ ఉండగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ మూడేళ్ళలో కూడా సగటున 65వేల మంది చేరుతున్నట్లు విద్యా గణాంకాల ద్వారా తెలుస్తోంది. సర్కార్ బడుల్లో చదువు సరిగా లేదనే అసంతృప్తితో తల్లిదండ్రులు తమ బిడ్డలకు నాణ్యమైన విద్య కోసమని ప్రైవేట్ స్కూళ్ళను ఆశ్రయిస్తున్నారు. అది విద్యా వ్యాపారులకు మంచి వాటంగా మారింది. ప్రభుత్వ నియంత్రణ కూడా లేకపోవడంతో ఇష్టానురాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల, పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వం నియమించిన కమిటీతో సమస్య పరిష్కారం అవుతుందా అనేది తాజా చర్చనీయాంశం. ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ ఉప కులపతి ఆచార్య టి. తిరుపతిరావు చైర్మన్‌గా, పాఠశాల విద్యా శాఖ సంచాలకులు జి.కిషన్ కన్వీనర్‌గా ఉన్న ఈ కమిటీలో నలుగురు విషయ నిపుణులు కాగా తల్లిదండ్రుల ప్రతినిధులు ఇద్దరు, ప్రైవేట్ మేనేజ్‌మెంటు ప్రతినిధులు ఐదుగురు వున్నారు. 2017 మార్చి 30 నుంచి ఏప్రిల్ 10 వరకు నాలుగు విడతల సమావేశాలు జరిగాయి. గత అనుభవాల నేపథ్యంలో ఫీజుల నియంత్రణ కోసం విద్యా శాఖ చేసిన ప్రతిపాదనలు పరిశీలించి తమ సూచనలు, సవరణలు చేయడమే ఈ కమిటీ సభ్యుల బాధ్యత. విద్యాశాఖ ప్రతిపాదనలలో చాలావరకు ఫీజులు నిర్ణయించడానికి అవసరమైన వివిధ అంశాలు సహేతుకంగానే వున్నాయి. పేరెంట్స్ ప్రతినిధులు వాటిని సమర్థించడంతోపాటు మరింత బలపర్చే ప్రతిపాదనలు జోడించారు. యాజమాన్యాల ప్రతినిధులు పలు అంశాలను వ్యతిరేకించారు. ప్రభుత్వ గుర్తింపు గల ఏ ప్రైవేట్ స్కూల్ అయినా ఎలాంటి డొనేషన్స్ తీసుకోకూడదు. ఏ స్కూల్ కయినా ఇదే నిబంధన వర్తిస్తుంది. అడ్మిషన్ సమయంలో అప్లికేషన్‌కి రూ.100, రిజిస్ట్రేషన్‌కు రూ.500, కాషన్ డిపాజిట్ (రిఫన్డబుల్)గా రూ.5000 మించకుండా వన్‌టైమ్ ఫీజులు తీసుకోవచ్చు. సిబ్బందికి చెల్లించే జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, నిర్వహణా ఖర్చులు, వసతులు, అభివృద్ధికయ్యే ఖర్చుల ఆధారంగా ట్యూషన్ ఫీజు నిర్ణయించాలి. ఎడిషనల్ యాక్టివిటీస్‌కు అయ్యే ఖర్చులను ట్యూషన్ ఫీజుకి కలపకూడదు. బుక్స్, యూనిఫామ్స్, స్టేషనరీ వగైరా కోసం మార్కెట్‌లోని మూడు షాపులను నోటిఫైచేయాలి. జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా, డిఈఓ, ఆడిట్ ఆఫీసర్‌తో డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీ ఉండాలి. రూ.500 మించని ఫీజును ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. ఒకసారి నిర్ణయించిన ఫీజు మూడు విద్యా సంవత్సరాలకు వర్తించాలి. ఐఐటి, ఒలింపియాడ్ , కాన్సెప్ట్, టెక్నో వగైరా ఫ్యాన్సీ పేర్లతో స్కూల్స్ ప్రచారం చేసుకోకూడదు. తెలంగాణ తల్లిదండ్రుల సంఘం సూచనలు కొన్ని: (1) అకడమిక్ ఇయర్ ప్రతి ఏటా జూన్ 12 నుంచి ఏప్రిల్ 23 వరకు వుండే విధానాన్నే కొనసాగించాలి. మార్చి 21 నుంచి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించి ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులివ్వడం వల్ల అదనపు ప్రయోజనం లేకపోగా నష్టం జరుగుతుంది. దేశమంతటికీ వర్తించే సీబీఎస్–ఈ అకడమిక్ ఇయర్‌ని యథాతథంగా రాష్ట్రానికి అమలుచేయడం సరైంది కాదు. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులకు స్వతంత్ర అకడమిక్ షెడ్యూలు వుండాలి. (2) పైవేట్ స్కూళ్ళ స్థాపన, నిర్వహణ, నియంత్రణ తో పాటు ఫీజుల నిర్ణయానికి సంబంధించన ప్రాతిపదికలతో కూడిన సమగ్రమైన రూల్స్ గల జీఓ.1/ 1994ను సమర్థంగా అమలుపరచాలి. (3) ప్రైవేట్ స్కూళ్ళలో ప్రభుత్వ నిబంధలు అమలుజరుగుతున్న తీరును పరిశీలించడానికి, అక్రమ చర్యలు వెలికితీయడానికి సోషల్ ఆడిట్ కమిటీని నియమించాలి. ఈ కమిటీలో అధికారులు, బాలల హక్కుల సంఘాలు, తల్లిదండ్రుల సంఘాలు, న్యాయవాదులు, సామాజిక సంస్థల ప్రతినిధులు వుండాలి. (4) ఫీజుల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులను అమలుచేయని ప్రైవేట్ స్కూళ్ళ గుర్తింపును రద్దుచేయాలి. ఆ విధంగా ప్రభుత్వ గుర్తింపు రద్దుకు గురయ్యే ప్రైవేట్ స్కూళ్ళను ఆరునెలల ముందుగానే బహిరంగంగా ప్రకటించి సదరు స్కూళ్ళలోని విద్యార్థులను గుర్తింపుగల స్కూళ్ళలో చేర్చుకొనే అవకాశం కల్పించాలి (5) ఫీజులు చెల్లించలేదనీ, ఇతర కారణాలతో విద్యార్థులను శిక్షలకు గురిచేస్తూ, తల్లిదండ్రులను వేధింపులకు గురిచేస్తున్న ప్రైవేట్ స్కూళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలి. (6) ప్రైవేట్ స్కూళ్ళు ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహించే బ్రాంచీలు, సెక్షన్స్‌ను నిషేధించాలి. (7) ప్రైవేట్ స్కూళ్లలో సమస్యలను ప్రభుత్వ దృష్టికి తేవడానికి ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్‌ను అమలు చేయాలి. దాని యాక్షన్ టేకెన్ రిపోర్టున నెలకు ఒకసారి బహిరంగంగా ప్రకటించాలి. ప్రైవేట్ స్కూళ్ళలో అధిక ఫీజులు, తదితర సమస్యల పరిష్కారానికి పోరాటాలే శరణ్యం. శాశ్వత పరిష్కారం కోసం ప్రైవేట్ స్కూళ్ళ నియంత్రణ చట్టం తేవాలని ప్రభుత్వంతో పోరాడుతూనే, తక్షణ ఉపశమన చర్యల కోసం ప్రైవేటు యాజమాన్యాలతోనే పోరాడాలి. ఉద్యమాల్లో అనుభవం కలిగిన ప్రజాసంఘాల తోడ్పాటుతో తల్లిదండ్రులు ఐక్యమై ఉద్యమాల బాటపట్టాలి. ప్రైవేట్ విద్యా వ్యాపారాన్ని నియంత్రించాలి. నాగటి నారాయణ | editorial |
18,676 | 02-07-2017 11:36:44 | విమానాశ్రయం అమిత్‌షా అడ్డానా? | న్యూఢిల్లీ: గోవా విమానాశ్రయంలో బీజేపీ జరిపిన సమావేశంపై కాంగ్రెస్ కన్నెర్ర చేసింది. బీజేపీ అధికారదుర్వినియోగంపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది. గోవా పర్యటలో భాగంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా...డబోలిమ్ విమానాశ్రయం క్లాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్, బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొన్నారు. విమానాశ్రయం కాంప్లెక్స్‌లో పార్టీ సమావేశం ఏర్పాటు చేయడం పూర్తిగా అధికార దుర్వినియోగమేనని కాంగ్రెస్ విమర్శించింది. అధికారం మత్తులో పడిపోయిన బీజేపీ సుపరిపాలన మాటే మరిచిపోయిందని ఎద్దేవా చేసింది. విమానాశ్రయాలను పార్టీ కార్యక్రమాల కోసం సొంత అడ్డాగా మార్చుకోవడం సరికాదని, ఈ ఘటనపై తక్షణ దర్యాప్తు జరపాలని ఏఐసీసీ కార్యదర్శి గిరీష్ ఛోడంకర్ డిమాండ్ చేశారు. విమానాశ్రయంలో చట్టవిరుద్ధంగా సమావేశం జరిపిన అమిత్‌షా, మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు సభకు అనుమతించిన విమానాశ్రయ అధికారులపై ఫెనాల్టీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారంనాడు అమిత్‌షాకు బీజేపీ ఘనస్వాగతం పలికిన సందర్భంగా గోవా విమానాశ్రయం హై సెక్యూరిటీ పరిధిలో రాజకీయ సమావేశం ఏర్పాటు చేసింది. అమిత్‌షా రావడానికి ముందు విమానాశ్రయం టెర్మినల్ ఎంట్రన్స్ వద్ద కార్పెట్ హంగులతో పోడియం, ప్రముఖుల కోసం డజనుకు పైగా కుర్చీలు, సౌండ్ సిస్టమ్ వంటివి ఏర్పాటు చేశారు. | nation |
5,973 | 19-11-2017 12:12:57 | అల్లు అర్జున్ భారీ యాక్షన్ సీన్స్.. | అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో వస్తున్న తాజా సినిమా 'నా పేరు సూర్య'. నా అల్లుడు ఇండియా అనేది టాగ్ లైన్. చిత్రంలోఅల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా అలరించనున్నాడు. ఇందులో బన్నీ సరసన అనూ ఇమ్మాన్యుయేల్ ఆడిపాడుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇటీవలే ఊటీలో షెడ్యూల్ పూర్తిచేసి తాజాగా హైదరాబాద్‌లో షూటింగ్ షెడ్యూల్ చేసింది. చిత్రంలోని కొన్ని యాక్షన్స్ సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తున్నారు. ఫైట్ మాస్టర్ రవి వర్మ కంపోజ్ చేసిన ఈ యాక్షన్ సీన్స్ సినిమాలో హైలైట్ అవుతాయని చెబుతోంది చిత్రయూనిట్. బన్నీ డాన్స్, ఫైట్స్‌కి అభిమానులు కేరింతలు పెట్టడం ఖాయం అని అంటున్నారు. అతి త్వరలో మిగితా పార్ట్ ఫినిష్ చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ 27 న సినిమాను ప్రేక్షకుల ముందుంచాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు యూనిట్ సభ్యులు. సినిమాపై ఇప్పటికే మెగా అభిమానుల్లో ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. | entertainment |
18,108 | 01-08-2017 02:50:29 | ఏపీకి సింగరేణి గనులు ఇవ్వం: కేంద్రం | న్యూఢిల్లీ, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ భూభాగంలో సింగరేణి సంస్థకు ఉన్న గనులను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వబోమని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశారు. రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు ఏంఏ ఖాన్ అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సోమవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో సింగరేణి కంపెనీ ఆధీనంలో ఉన్న బొగ్గు గనులను ఏపీ మినరల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్‌కు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందాయని, భాగస్వాములతో చర్చించిన తర్వాత ప్రతిపాదనలను అంగీకరించలేదని వెల్లడించారు. | nation |
4,067 | 27-04-2017 02:17:29 | వరంగల్ మాట్లాడుతున్నది... | 2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించడానికి ముందు వరంగల్ కేంద్రంగానే అద్భుతమైన మేధోమధనం సాగింది. కేసీఆర్ అనే ఫిరంగిలో మందుగుండును వరంగల్ కూర్చింది. తెలంగాణ ఉద్యమానికి మేధో ఇంధనాన్ని వరంగల్ సమకూర్చింది. తెలంగాణ ప్రగతి నివేదన సభ వరంగల్‌లో నేడు జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ ఇది. ఈ సందర్భంలో వరంగల్ గురించి మాట్లాడవలసి ఉన్నది. వరంగల్‌తో మాట్లాడవలసి ఉన్నది. వరంగల్ నిప్పురవ్వ తెలంగాణ అంతటా దావానలమైన తీరు గురించి చెప్పకపోతే, తెలంగాణ ఉద్యమంలో వరంగల్ కాంట్రిబ్యూషన్‌ను వివరించకపోతే చరిత్ర పరిపూర్ణం కాదు. చాలా మందికి చరిత్ర తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చేయరు. చరిత్ర గురించి తెలుసుకోవలసిన అవసరం కూడా ఈ తరానికి లేకపోవచ్చు. కానీ చరిత్ర లేకుండా వర్తమానమూ లేదు, భవిష్యత్తూ లేదు. చరిత్ర పునాదులపైనే భవిష్యత్తు నిర్మితమవుతుంది. చరిత్రను ఎవరైనా వక్రీకరించవచ్చును. లేదా తమకు అనుకూలంగా మలచుకోవచ్చును. అయితే వాస్తవాలను మార్చలేరు. మరుగుపర్చలేరు. చరిత్రను ఎవరూ పూర్వపక్షం చేయలేరు. ఆంధ్రా పాలకుల కబంధ హస్తాల నుంచి తెలంగాణ జాతి విముక్తి కోరుకుంటున్నదని, తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను, సమానత్వాన్ని, వెనుకబాటుతనం నిర్మూలనను, అభివృద్ధిని కాంక్షిస్తున్నారని వరంగల్ ఎలుగెత్తి చాటిన సంగతి చాలా మందికి తెలియదు. 1969 వైఫల్యాల తర్వాత 1996లో వరంగల్‌లోనే తెలంగాణ సభ జరిగింది. కాళోజి నారాయణరావు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ వంటి తెలంగాణ వాదులు, మేధావులు, కార్యకర్తలు వేలాది మంది హాజరయ్యారు. ఏడాది తర్వాత 1997లో వరంగల్ డిక్లరేషన్ సభ. ఈ సభలు ఒక చరిత్ర. విస్మరించలేని వాస్తవం. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగితేనే తెలంగాణ సమస్త సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, సబ్బండ వర్ణాలకు న్యాయం జరుగుతుందని వరంగల్ ప్రకటించింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను మొట్ట మొదట శక్తిమంతంగా తెలియజేసిన ప్రాంతం వరంగల్. 1997 డిసెంబర్ 28, 29 లలో అఖిలభారత ప్రజా ప్రతిఘటన (ఏఐపీఆర్ఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన సభ తెలంగాణ ఉద్యమానికి నారు పోసింది. ‘‘ప్రత్యేక తెలంగాణ - ప్రజాస్వామిక ఆకాంక్షలు’’ పేరుతో ఈ సభ నాటి పీపుల్స్ వార్ పార్టీ కనుసన్నల్లో, ఇంకా చెప్పాలంటే ఆ పార్టీ మార్గ దర్శకత్వంలోనే జరిగింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి వరంగల్ దిక్సూచి అయ్యింది. మలిదశ ఉద్యమాన్ని వాగ్దానం చేసిన నగరం వరంగల్. 1996లో వరంగల్‌లో పడిన నిప్పురవ్వే దావానలమైంది. పల్లె పల్లె పట్టణాలు చుట్టుముట్టింది. ప్రత్యేక తెలంగాణ గాలి వరంగల్ నుంచే వీచింది. ఈ గాలులన్నీ తెలంగాణ అంతటా విస్తరించాయి. ప్రొఫెసర్ జయశంకర్ సార్, బి. జనార్ధనరావు వంటి మేధావులు తెలంగాణ ఉద్యమానికి ‘‘భావజాలం’’ అనే భాస్వరాన్ని మండించారు. వరంగల్ తెలంగాణ గుండె చప్పుడు విన్నది. వరంగల్ తెలంగాణ ప్రజల నాడి అయింది. తెలంగాణకు గుండె అయింది. తెలంగాణకు తోడయ్యింది. తెలంగాణకు నీడ అయ్యింది. తెలంగాణకు నారు పోసింది. నీరు పోసింది. వరంగల్ అంటే ఒక ఉత్తేజం. వరంగల్ అంటే పోటెత్తిన ఉత్సాహం. వరంగల్ అంటే మేడారం జాతర. వరంగల్ అంటే మొగిలిచెర్ల. వరంగల్ అంటే రాయినిగూడెం. వరంగల్ అంటే ఒక తెలంగాణ. వరంగల్ ఉద్యమాలకు అమ్మచెట్టు. తెలంగాణకు నామవాచకం. తెలంగాణకు పర్యాయపదం. వరంగల్ అంటే జనం. వరంగల్ అంటే చైతన్యం. వరంగల్ అంటే అడవి. వరంగల్ అంటే పాట. వరంగల్ అంటే ఒక గాయం. వరంగల్ అంటే మానుకోట. వరంగల్ అంటే ప్రతిఘటన. వరంగల్ అంటే కాళోజి నారాయణరావు. వరంగల్ అంటే జయశంకర్ సార్. టీఆర్‌ఎస్ పార్టీ సవాళ్ళు ఎదుర్కొన్న ప్రతి కీలక సమయంలోనూ వరంగల్ ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడింది. టీఆర్ఎస్‌ను నిలబెట్టింది. వరంగల్ ఎప్పుడూ పోరాట సంకేతమే. ఉత్తర తెలంగాణలో నాటి పీపుల్స్ వార్, నేటి మావోయిస్టు పార్టీకి హెడ్ క్వార్టర్‌గా ఉండిన వరంగల్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కూడా చిరునామా అయ్యింది. 2003లో ‘‘వరంగల్ జైత్రయాత్ర’’ పేరిట జరిగిన బహిరంగ సభ టీఆర్‌ఎస్ ప్రస్థానంలో తిరుగులేని సభ. ఆ సభకు వచ్చిన జన సంఖ్యపై ఇప్పటికీ అనేక లెక్కలున్నాయి. 1989లో పీపుల్స్‌వార్ అనుబంధ సంఘమైన రైతుకూలి సంఘం జరిపిన సభతో మాత్రమే ఈ సభని పోల్చాలి. నక్సలైట్లకు అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఇచ్చిన తాత్కాలిక వెసులుబాటు సమయంలో వరంగల్‌లో జరిగిన బహిరంగసభ మొత్తం దేశాన్ని ఆకర్షించింది. ఆ స్థాయిలోనే టీఆర్‌ఎస్ సభకు కూడా లక్షలాది మంది హాజరు కావడం విశేషం. ఆనాటి టీఆర్ఎస్ సభకు పలు రకాలుగా రాజకీయ ప్రాధాన్యం ఉన్నది. 2004లో చంద్రబాబును ఓడించేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్, వామపక్షాలు జట్టు కట్టడం వెనుక వరంగల్ సభ, ఆ సభకు తెలంగాణ నలుమూలల నుంచి తరలి వచ్చిన అశేష జనం ఉన్నారు. టీడీపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు సంబంధించి టీఆర్ఎస్‌తో పొత్తుపై సొనియా గాంధీ నిర్ణయానికి ఈ బహిరంగ సభ కీలకంగా పని చేసింది. కేసీఆర్ సిద్ధిపేట నుంచి సైకిల్‌పై వరంగల్ సభకు బయలుదేరడం అప్పట్లో పెద్ద వార్త. సంచలనం. ఆ సభలో దేవెగౌడ, అజిత్ సింగ్ వంటి జాతీయ ప్రముఖులు హాజరై కేసీఆర్‌కు మద్దతు ప్రకటించిన సన్నివేశం గొప్పది. 2009 డిసెంబర్‌లో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించినట్టే ప్రకటించి కేంద్రం వెనుకడుగు వేసిన తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చరిత్రాత్మకం. 2010 డిసెంబర్‌లో ఇదే ప్రకాష్‌రెడ్డి పేటలో టీఆర్ఎస్ పార్టీ ‘‘ఓరుగల్లు గర్జన’’ పేరుతో భారీ బహిరంగ సభ జరిపింది. 2010 మే లో మానుకోట రైల్వే స్టేషన్లో జరిగిన భీభత్సం, రాళ్ళదాడి, కాల్పులు... తదితర ఉద్రిక్త ఘటనలు ‘‘మిలిటెంట్ పోరాటానికి’’ సాక్ష్యం. ఓదార్పు యాత్ర పేరుతో వరంగల్ జిల్లాలో మహబూబాబాద్ స్టేషన్ నుంచి సాగవలసిన వై.ఎస్. జగన్ తెలంగాణ పర్యటనను తెలంగాణ వాదులు అడ్డుకున్న తీరు, ప్రతిఘటించిన వైనం ఎవరూ మరచిపోలేరు. ఇప్పటి మంత్రులు హరీశ్‌రావు, ఈటెల రాజేందర్, జేఏసీ చైర్మన్ కోదండరాం తదితరులంతా మానుకోటలో మకాం వేసి, పకడ్బందీగా ‘గెరిల్లా వ్యూహ రచన’ చేసి అమలు చేశారు. సమైక్యాంధ్ర వాదిగానే కాకుండా పార్లమెంటులో సమైక్య ప్లకార్డులను ప్రదర్శించడంతో జగన్ తెలంగాణ వాదుల తీవ్ర ఆగ్రహాన్ని చూడవలసి వచ్చింది. ఆ రోజు జగన్‌ను వంగపల్లి స్టేషన్ దగ్గరే రైలు నుంచి దింపి అరెస్టుచేసి హైదరాబాద్‌కు తరలించకపోతే జరిగే పరిణామాలను ఊహించడం కష్టం. ఇక రాయినిగూడెం గురించి కూడా మాట్లాడాలి. వరంగల్ జిల్లా సరిహద్దుల్లో ఉన్న రాయినిగూడెం గ్రామానికి వచ్చిన ఉమ్మడి ఏపీ సీఎం ఎన్. కిరణ్ కుమార్ రెడ్డిని మహిళలు పరిగెత్తించిన తీరు తెలంగాణ ఆకాంక్షను మరోసారి బలంగా వ్యక్తం చేసింది. కిరణ్ కుమార్ రెడ్డి సభకు చెప్పులు లేకుండా రావాలని పోలీసులు విధించిన ఆంక్షలు, పోలీసుల ఓవర్ యాక్షన్ చివరకు సీఎం కిరణ్ అర్ధాంతరంగా హెలికాప్టర్‌లో హైదారాబాద్‌కు పయనం కావలసి వచ్చింది. వరంగల్ జిల్లాలో ప్రతి పల్లె ప్రత్యేక తెలంగాణ కోరుకున్నది. జిల్లా అంతటా ఉద్రిక్తతలు చాలా కాలం కొనసాగాయి. 2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించడానికి ముందు వరంగల్ కేంద్రంగానే అద్భుతమైన మేధోమధనం సాగింది. కేసీఆర్ అనే ఫిరంగిలో మందుగుండును వరంగల్ కూర్చింది. తెలంగాణ ఉద్యమానికి మేధో ఇంధనాన్ని వరంగల్ సమకూర్చింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ తెలంగాణ ప్రజలపై ‘మెహర్బానీ’తో, దయాగుణంతో ఇచ్చిందనీ, కేసీఆర్ తన వ్యూహ చాతుర్యంతో, పోరాటాలతో తీసుకువచ్చారనీ జరిగే ప్రచారంతో, చేసే వాదనలతో ఏకీభవించని వాళ్ళు కూడా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఎవరు ఎన్ని కారణాలు చెప్పినా, ఎవరు ఎన్ని విశ్లేషణలు చేసినా మొత్తం నాలుగు ఘటనలే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అత్యంత ముఖ్యమైన పిల్లర్లుగా చెప్పుకోవచ్చును. 1) 1997లో వరంగల్ డిక్లరేషన్ సభ. 2) కేసీఆర్ ఆమరణ దీక్ష. ౩) శ్రీకాంతాచారి ఆత్మాహుతి. 4) వై.ఎస్. జగన్ ఓదార్పు యాత్రకు వ్యతిరేకంగా జరిగిన మానుకోట ప్రతిఘటన. ఇవి కాకుండా చాలా ఘటనలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదాయి. ఉద్యమాన్ని బలోపేతం చేశాయి. ఉద్యమాన్ని శిఖర స్థాయికి తీసుకు వెళ్ళాయి. ఇప్పుడిక వరంగల్ ప్రకాష్ రెడ్డి పేటలో జరగనున్న ‘ప్రగతి నివేదన సభ’ నిస్సందేహంగా భిన్నమైనది. అధికారంలో ఉన్న పార్టీ సభ. ప్రత్యేక తెలంగాణ పోరాట యోధునిగా, మాటల మాంత్రికునిగా గతంలో వేలాది బహిరంగ సభలలో కేసీఆర్ తన సహజ శైలిలో, వాక్పటిమతో చిచ్చర పిడుగులా చెలరేగిపోయేవారు. తెలంగాణ వ్యతిరేకులు, ఉమ్మడి ఏపీ పాలకులను ఉతికి ఆరేసేవారు. ప్రస్తుత సందర్భం వేరు. ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన పాత్రలో టీఆర్ఎస్ ఉన్నది. ప్రభుత్వం గత మూడేళ్లలో ప్రవేశపెట్టిన పథకాలు, అమలు చేస్తున్న కార్యక్రమాలు, తెలంగాణ పసి రాష్ట్రం వివిధ ప్రమాణాలలో సాధించిన జాతీయ గుర్తింపు, పలు రాష్ట్రాల పొగడ్తలు, ఇతర అంశాలపై ‘ప్రోగ్రెస్ రిపోర్టు’ ప్రజల ముందుంచబోతున్నారు. ప్రజల ఆడిటింగ్ కోసమని కూడా భావించవచ్చును. ప్రభుత్వ వ్యతిరేకత బహిరంగం కావడం లేదు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేకపోవచ్చును. అడిగినా, అడగకుండానే అనేక వరాలు ‘ప్రగతి భవన్’ నుంచి వచ్చి పడుతున్నవి. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ఉధృతంగా సాగుతున్నట్టు అధికారపక్షం చెబుతున్నది. మొత్తంమీద ప్రజలలో ‘ఫీల్ గుడ్’ ఫ్యాక్టర్ ఉన్నది. అయితే ఇదే సానుకూల వాతావరణం ఇలాగే కొనసాగుతుందా అన్నది చెప్పలేం. తెలంగాణ ఇంటి పార్టీగా టీఆర్ఎస్‌ను మలచడంలో కేసీఆర్ కృషి అపారం. తెలంగాణ ఇచ్చామని గట్టిగా క్లయిం చేసుకోవడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైనది. తెలంగాణలోనూ మోదీ మంత్రం పనిచేస్తుందని బీజేపీ నాయకులు ఆశావాదంతో ఉన్నట్లున్నారు. ఏదో జరగబోయే ‘అద్భుతం’ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నట్లున్నది.ఎస్.కె. జకీర్సీనియర్ జర్నలిస్ట్(నేడు వరంగల్‌లో ‘ప్రగతి నివేదన సభ’)తెలంగాణ ప్రగతి నివేదన సభ వరంగల్‌లో నేడు జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ ఇది. ఈ సందర్భంలో వరంగల్ గురించి మాట్లాడవలసి ఉన్నది. వరంగల్‌తో మాట్లాడవలసి ఉన్నది. వరంగల్ నిప్పురవ్వ తెలంగాణ అంతటా దావానలమైన తీరు గురించి చెప్పకపోతే, తెలంగాణ ఉద్యమంలో వరంగల్ కాంట్రిబ్యూషన్‌ను వివరించకపోతే చరిత్ర పరిపూర్ణం కాదు. చాలా మందికి చరిత్ర తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చేయరు. చరిత్ర గురించి తెలుసుకోవలసిన అవసరం కూడా ఈ తరానికి లేకపోవచ్చు. కానీ చరిత్ర లేకుండా వర్తమానమూ లేదు, భవిష్యత్తూ లేదు. చరిత్ర పునాదులపైనే భవిష్యత్తు నిర్మితమవుతుంది. చరిత్రను ఎవరైనా వక్రీకరించవచ్చును. లేదా తమకు అనుకూలంగా మలచుకోవచ్చును. అయితే వాస్తవాలను మార్చలేరు. మరుగుపర్చలేరు. చరిత్రను ఎవరూ పూర్వపక్షం చేయలేరు. ఆంధ్రా పాలకుల కబంధ హస్తాల నుంచి తెలంగాణ జాతి విముక్తి కోరుకుంటున్నదని, తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను, సమానత్వాన్ని, వెనుకబాటుతనం నిర్మూలనను, అభివృద్ధిని కాంక్షిస్తున్నారని వరంగల్ ఎలుగెత్తి చాటిన సంగతి చాలా మందికి తెలియదు. 1969 వైఫల్యాల తర్వాత 1996లో వరంగల్‌లోనే తెలంగాణ సభ జరిగింది. కాళోజి నారాయణరావు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ వంటి తెలంగాణ వాదులు, మేధావులు, కార్యకర్తలు వేలాది మంది హాజరయ్యారు. ఏడాది తర్వాత 1997లో వరంగల్ డిక్లరేషన్ సభ. ఈ సభలు ఒక చరిత్ర. విస్మరించలేని వాస్తవం. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగితేనే తెలంగాణ సమస్త సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, సబ్బండ వర్ణాలకు న్యాయం జరుగుతుందని వరంగల్ ప్రకటించింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను మొట్ట మొదట శక్తిమంతంగా తెలియజేసిన ప్రాంతం వరంగల్. 1997 డిసెంబర్ 28, 29 లలో అఖిలభారత ప్రజా ప్రతిఘటన (ఏఐపీఆర్ఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన సభ తెలంగాణ ఉద్యమానికి నారు పోసింది. ‘‘ప్రత్యేక తెలంగాణ - ప్రజాస్వామిక ఆకాంక్షలు’’ పేరుతో ఈ సభ నాటి పీపుల్స్ వార్ పార్టీ కనుసన్నల్లో, ఇంకా చెప్పాలంటే ఆ పార్టీ మార్గ దర్శకత్వంలోనే జరిగింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి వరంగల్ దిక్సూచి అయ్యింది. మలిదశ ఉద్యమాన్ని వాగ్దానం చేసిన నగరం వరంగల్. 1996లో వరంగల్‌లో పడిన నిప్పురవ్వే దావానలమైంది. పల్లె పల్లె పట్టణాలు చుట్టుముట్టింది. ప్రత్యేక తెలంగాణ గాలి వరంగల్ నుంచే వీచింది. ఈ గాలులన్నీ తెలంగాణ అంతటా విస్తరించాయి. ప్రొఫెసర్ జయశంకర్ సార్, బి. జనార్ధనరావు వంటి మేధావులు తెలంగాణ ఉద్యమానికి ‘‘భావజాలం’’ అనే భాస్వరాన్ని మండించారు. వరంగల్ తెలంగాణ గుండె చప్పుడు విన్నది. వరంగల్ తెలంగాణ ప్రజల నాడి అయింది. తెలంగాణకు గుండె అయింది. తెలంగాణకు తోడయ్యింది. తెలంగాణకు నీడ అయ్యింది. తెలంగాణకు నారు పోసింది. నీరు పోసింది. వరంగల్ అంటే ఒక ఉత్తేజం. వరంగల్ అంటే పోటెత్తిన ఉత్సాహం. వరంగల్ అంటే మేడారం జాతర. వరంగల్ అంటే మొగిలిచెర్ల. వరంగల్ అంటే రాయినిగూడెం. వరంగల్ అంటే ఒక తెలంగాణ. వరంగల్ ఉద్యమాలకు అమ్మచెట్టు. తెలంగాణకు నామవాచకం. తెలంగాణకు పర్యాయపదం. వరంగల్ అంటే జనం. వరంగల్ అంటే చైతన్యం. వరంగల్ అంటే అడవి. వరంగల్ అంటే పాట. వరంగల్ అంటే ఒక గాయం. వరంగల్ అంటే మానుకోట. వరంగల్ అంటే ప్రతిఘటన. వరంగల్ అంటే కాళోజి నారాయణరావు. వరంగల్ అంటే జయశంకర్ సార్. టీఆర్‌ఎస్ పార్టీ సవాళ్ళు ఎదుర్కొన్న ప్రతి కీలక సమయంలోనూ వరంగల్ ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడింది. టీఆర్ఎస్‌ను నిలబెట్టింది. వరంగల్ ఎప్పుడూ పోరాట సంకేతమే. ఉత్తర తెలంగాణలో నాటి పీపుల్స్ వార్, నేటి మావోయిస్టు పార్టీకి హెడ్ క్వార్టర్‌గా ఉండిన వరంగల్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కూడా చిరునామా అయ్యింది. 2003లో ‘‘వరంగల్ జైత్రయాత్ర’’ పేరిట జరిగిన బహిరంగ సభ టీఆర్‌ఎస్ ప్రస్థానంలో తిరుగులేని సభ. ఆ సభకు వచ్చిన జన సంఖ్యపై ఇప్పటికీ అనేక లెక్కలున్నాయి. 1989లో పీపుల్స్‌వార్ అనుబంధ సంఘమైన రైతుకూలి సంఘం జరిపిన సభతో మాత్రమే ఈ సభని పోల్చాలి. నక్సలైట్లకు అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఇచ్చిన తాత్కాలిక వెసులుబాటు సమయంలో వరంగల్‌లో జరిగిన బహిరంగసభ మొత్తం దేశాన్ని ఆకర్షించింది. ఆ స్థాయిలోనే టీఆర్‌ఎస్ సభకు కూడా లక్షలాది మంది హాజరు కావడం విశేషం. ఆనాటి టీఆర్ఎస్ సభకు పలు రకాలుగా రాజకీయ ప్రాధాన్యం ఉన్నది. 2004లో చంద్రబాబును ఓడించేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్, వామపక్షాలు జట్టు కట్టడం వెనుక వరంగల్ సభ, ఆ సభకు తెలంగాణ నలుమూలల నుంచి తరలి వచ్చిన అశేష జనం ఉన్నారు. టీడీపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు సంబంధించి టీఆర్ఎస్‌తో పొత్తుపై సొనియా గాంధీ నిర్ణయానికి ఈ బహిరంగ సభ కీలకంగా పని చేసింది. కేసీఆర్ సిద్ధిపేట నుంచి సైకిల్‌పై వరంగల్ సభకు బయలుదేరడం అప్పట్లో పెద్ద వార్త. సంచలనం. ఆ సభలో దేవెగౌడ, అజిత్ సింగ్ వంటి జాతీయ ప్రముఖులు హాజరై కేసీఆర్‌కు మద్దతు ప్రకటించిన సన్నివేశం గొప్పది. 2009 డిసెంబర్‌లో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించినట్టే ప్రకటించి కేంద్రం వెనుకడుగు వేసిన తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చరిత్రాత్మకం. 2010 డిసెంబర్‌లో ఇదే ప్రకాష్‌రెడ్డి పేటలో టీఆర్ఎస్ పార్టీ ‘‘ఓరుగల్లు గర్జన’’ పేరుతో భారీ బహిరంగ సభ జరిపింది. 2010 మే లో మానుకోట రైల్వే స్టేషన్లో జరిగిన భీభత్సం, రాళ్ళదాడి, కాల్పులు... తదితర ఉద్రిక్త ఘటనలు ‘‘మిలిటెంట్ పోరాటానికి’’ సాక్ష్యం. ఓదార్పు యాత్ర పేరుతో వరంగల్ జిల్లాలో మహబూబాబాద్ స్టేషన్ నుంచి సాగవలసిన వై.ఎస్. జగన్ తెలంగాణ పర్యటనను తెలంగాణ వాదులు అడ్డుకున్న తీరు, ప్రతిఘటించిన వైనం ఎవరూ మరచిపోలేరు. ఇప్పటి మంత్రులు హరీశ్‌రావు, ఈటెల రాజేందర్, జేఏసీ చైర్మన్ కోదండరాం తదితరులంతా మానుకోటలో మకాం వేసి, పకడ్బందీగా ‘గెరిల్లా వ్యూహ రచన’ చేసి అమలు చేశారు. సమైక్యాంధ్ర వాదిగానే కాకుండా పార్లమెంటులో సమైక్య ప్లకార్డులను ప్రదర్శించడంతో జగన్ తెలంగాణ వాదుల తీవ్ర ఆగ్రహాన్ని చూడవలసి వచ్చింది. ఆ రోజు జగన్‌ను వంగపల్లి స్టేషన్ దగ్గరే రైలు నుంచి దింపి అరెస్టుచేసి హైదరాబాద్‌కు తరలించకపోతే జరిగే పరిణామాలను ఊహించడం కష్టం. ఇక రాయినిగూడెం గురించి కూడా మాట్లాడాలి. వరంగల్ జిల్లా సరిహద్దుల్లో ఉన్న రాయినిగూడెం గ్రామానికి వచ్చిన ఉమ్మడి ఏపీ సీఎం ఎన్. కిరణ్ కుమార్ రెడ్డిని మహిళలు పరిగెత్తించిన తీరు తెలంగాణ ఆకాంక్షను మరోసారి బలంగా వ్యక్తం చేసింది. కిరణ్ కుమార్ రెడ్డి సభకు చెప్పులు లేకుండా రావాలని పోలీసులు విధించిన ఆంక్షలు, పోలీసుల ఓవర్ యాక్షన్ చివరకు సీఎం కిరణ్ అర్ధాంతరంగా హెలికాప్టర్‌లో హైదారాబాద్‌కు పయనం కావలసి వచ్చింది. వరంగల్ జిల్లాలో ప్రతి పల్లె ప్రత్యేక తెలంగాణ కోరుకున్నది. జిల్లా అంతటా ఉద్రిక్తతలు చాలా కాలం కొనసాగాయి. 2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించడానికి ముందు వరంగల్ కేంద్రంగానే అద్భుతమైన మేధోమధనం సాగింది. కేసీఆర్ అనే ఫిరంగిలో మందుగుండును వరంగల్ కూర్చింది. తెలంగాణ ఉద్యమానికి మేధో ఇంధనాన్ని వరంగల్ సమకూర్చింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ తెలంగాణ ప్రజలపై ‘మెహర్బానీ’తో, దయాగుణంతో ఇచ్చిందనీ, కేసీఆర్ తన వ్యూహ చాతుర్యంతో, పోరాటాలతో తీసుకువచ్చారనీ జరిగే ప్రచారంతో, చేసే వాదనలతో ఏకీభవించని వాళ్ళు కూడా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఎవరు ఎన్ని కారణాలు చెప్పినా, ఎవరు ఎన్ని విశ్లేషణలు చేసినా మొత్తం నాలుగు ఘటనలే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అత్యంత ముఖ్యమైన పిల్లర్లుగా చెప్పుకోవచ్చును. 1) 1997లో వరంగల్ డిక్లరేషన్ సభ. 2) కేసీఆర్ ఆమరణ దీక్ష. ౩) శ్రీకాంతాచారి ఆత్మాహుతి. 4) వై.ఎస్. జగన్ ఓదార్పు యాత్రకు వ్యతిరేకంగా జరిగిన మానుకోట ప్రతిఘటన. ఇవి కాకుండా చాలా ఘటనలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదాయి. ఉద్యమాన్ని బలోపేతం చేశాయి. ఉద్యమాన్ని శిఖర స్థాయికి తీసుకు వెళ్ళాయి. ఇప్పుడిక వరంగల్ ప్రకాష్ రెడ్డి పేటలో జరగనున్న ‘ప్రగతి నివేదన సభ’ నిస్సందేహంగా భిన్నమైనది. అధికారంలో ఉన్న పార్టీ సభ. ప్రత్యేక తెలంగాణ పోరాట యోధునిగా, మాటల మాంత్రికునిగా గతంలో వేలాది బహిరంగ సభలలో కేసీఆర్ తన సహజ శైలిలో, వాక్పటిమతో చిచ్చర పిడుగులా చెలరేగిపోయేవారు. తెలంగాణ వ్యతిరేకులు, ఉమ్మడి ఏపీ పాలకులను ఉతికి ఆరేసేవారు. ప్రస్తుత సందర్భం వేరు. ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన పాత్రలో టీఆర్ఎస్ ఉన్నది. ప్రభుత్వం గత మూడేళ్లలో ప్రవేశపెట్టిన పథకాలు, అమలు చేస్తున్న కార్యక్రమాలు, తెలంగాణ పసి రాష్ట్రం వివిధ ప్రమాణాలలో సాధించిన జాతీయ గుర్తింపు, పలు రాష్ట్రాల పొగడ్తలు, ఇతర అంశాలపై ‘ప్రోగ్రెస్ రిపోర్టు’ ప్రజల ముందుంచబోతున్నారు. ప్రజల ఆడిటింగ్ కోసమని కూడా భావించవచ్చును. ప్రభుత్వ వ్యతిరేకత బహిరంగం కావడం లేదు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేకపోవచ్చును. అడిగినా, అడగకుండానే అనేక వరాలు ‘ప్రగతి భవన్’ నుంచి వచ్చి పడుతున్నవి. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ఉధృతంగా సాగుతున్నట్టు అధికారపక్షం చెబుతున్నది. మొత్తంమీద ప్రజలలో ‘ఫీల్ గుడ్’ ఫ్యాక్టర్ ఉన్నది. అయితే ఇదే సానుకూల వాతావరణం ఇలాగే కొనసాగుతుందా అన్నది చెప్పలేం. తెలంగాణ ఇంటి పార్టీగా టీఆర్ఎస్‌ను మలచడంలో కేసీఆర్ కృషి అపారం. తెలంగాణ ఇచ్చామని గట్టిగా క్లయిం చేసుకోవడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైనది. తెలంగాణలోనూ మోదీ మంత్రం పనిచేస్తుందని బీజేపీ నాయకులు ఆశావాదంతో ఉన్నట్లున్నారు. ఏదో జరగబోయే ‘అద్భుతం’ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నట్లున్నది.ఎస్.కె. జకీర్సీనియర్ జర్నలిస్ట్(నేడు వరంగల్‌లో ‘ప్రగతి నివేదన సభ’) | editorial |
16,321 | 09-12-2017 14:32:49 | పాక్‌కు అమెరికా షాక్! |
వాషింగ్టన్: పొరుగు దేశం పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పట్లో పాకిస్తాన్ వెళ్లొద్దని చైనా ప్రభుత్వం తన దేశ పౌరులకు హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజాగా అదే బాటలో అమెరికా కూడా పయనించింది. పాకిస్తాన్‌లో అమెరికన్లపై దాడులు జరిగే అవకాశం ఉందని, ఇప్పట్లో ఆ దేశానికి వెళ్లడం అంత సురక్షితం కాదని అమెరికా ప్రభుత్వం తమ దేశ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉగ్రవాదుల ప్రభావం అధికంగా ఉందని పేర్కొంది. ఇప్పటికే పాకిస్తాన్‌లోని కరాచీ, ఇస్లామాబాద్, లాహోర్‌లలోని అమెరికా రాయబార కార్యాలయాలు తమ సేవలను తగ్గించేశాయి. పెషావర్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తన సేవలను పూర్తిగా నిలిపివేసింది. అమెరికా దౌత్య అధికారులపై, ఎన్జీవోలపై ఉగ్రవాదులు కక్షలు పెంచుకున్నారని అమెరికా రాయబార కార్యాలయాలు వాషింగ్టన్‌కు నివేదికను సమర్పించాయి. | nation |
277 | 19-07-2017 00:21:46 | ఇన్ఫోసిస్‌కు టాప్ ఎగ్జిక్యూటివ్ గుడ్‌బై | న్యూఢిల్లీ: కంపెనీల కొనుగోళ్ళు, విలీనాల్లో దిట్టగా పేరు గడించిన వైస్ ప్రెసిడెంట్ రితికా సూరి ఇన్ఫోసిస్ నుంచి వైదొలగారు. ఆమె గత వారమే రాజీనామా పత్రాన్ని యాజమాన్యానికి అందచేశారని, ప్రస్తుతం నోటీస్ కాలంలో ఉన్నారని ఆ పరిణామానికి సన్నిహితంగా ఉన్న వర్గాలు తెలిపాయి. అయితే ఆమె రాజీనామాకు కారణాలు తెలియలేదు. 2014 సెప్టెంబర్‌లో విశాల్ సిక్కా సిఇఒగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శాప్ మాజీ ఎగ్జిక్యూటివ్ అయిన రితికను ఇన్ఫోసిస్‌లోకి తీసుకువచ్చారు. స్టార్ట్‌పల కోసం 50 కోట్ల డాలర్ల ఫండ్ ఏర్పాటు చేయడంలోను, ఇజ్రాయెల్‌కు చెందిన ఆటోమేషన్ కంపెనీ పనాయాను కొనుగోలు చేయడంలోను ఆమె కీలక పాత్ర పోషించారు. | business |
3,284 | 09-09-2017 04:41:26 | కాళోజి ప్రశ్న - సీతారాముడి కవిత్వం |
కవిత్వం జీవితం కలగలిసి పోకుండా కవిత్వం రాదు. జీవితపు జీవనరేఖల్లోంచి కవిత్వనేత్రం తెరిచినప్పుడే అది జీవకవిత్వం. ఆ జీవికవిత్వ సజీవరూపం సీతారాం. అతన్ని చూస్తే పరవశించే దృశ్యంగా కనిపిస్తాడు. కానీ జీవితం పెట్టే బాధలకు అలిసిపోయి ఉంటాడు. రెండు చెకిముకిరాళ్ల మధ్య జరిగిన రాపిడి లేకుండా నిప్పు పుట్టదు. ఆ సంఘర్షణే సీతారాం. సీతారాం సాహిత్య చెకిముకిరాయి. కొందరు బైట కన్పిస్తున్నట్లుగా లోపల ఉండరు. కొందరు లోపల ఒకలా బైటకు మరొకలా ఉంటారు. కవిత్వం అంటే పసిపాప నవ్వు కదా? కవిత్వం అంటే ఎగిసిపడే జలపాతం కదా? కవిత్వమంటే కల్లాకపటం లేనిది కదా? కవిత్వమంటే అప్పటికప్పుడు పుట్టుకొచ్చే మహోగ్ర రూపం కదా? కవిత్వమంటే కాళోజీ వేసే ప్రశ్న కదా? కవిత్వమంటే కాలం కదన రంగం కదా! సీతారాం ఈ కాలం కవిత్వపు నాలుక. అతడు చూస్తే నిశ్శబ్దంగా ఉంటాడు. లోపల కల్లోలాలు కదులుతుంటాయి. ఆ చూపులు చూస్తే సున్నితంగా ఉంటాయి. అవి గాయాలున్న దేహాలను నిమురుతుంటాయి. ఆ దృష్టిని చూస్తే నిశ్చలంగా ఉంటుంది. అవకతవకల ఎగుడుదిగుళ్ల భూమిని సదునుచేసి దక్కాల్సిన వాళ్లకు దక్కాల్సినవి ఎందుకు దక్కలేదోనని దృష్టిని సారిస్తుంటాయి. దేన్నయినా సాహిత్యదృష్టితో దర్శించవచ్చుననుకుంటే ఆ సాహిత్య దివ్యదృష్టి మా సీతారాం. ఆ లక్ష్మీపురం మట్టిపొరల్లో ఏముందో? ఆ చెప్పుల్లేని నారాయణ కాలిజోళ్లల్లో కవిత్వ రేఖలెక్కడున్నాయో, గడ్డిమోపు నెత్తిన బెట్టుకుని మోసుకుంటూ, ఆ కుటుంబమంతా ఈదుకుంటూ వచ్చిన ఆ తల్లి మాణిక్యమ్మ మట్టి చేతుల్లో అక్షరాలు ఒదిగి ఎక్కడ ప్రాణం పోసుకున్నాయో ఏమో గానీ తెలుగు సాహిత్యాన్ని పరవశింపజేసిన నటరాజమహానృత్యం సీతారాం. సీతారాం అంటే ‘‘రక్తస్పర్శ’’. అది తెలుగు సాహిత్యానికి వెచ్చగా తగిలిన మహాసాహిత్య స్పర్శ. సీతారాం అంటే ‘‘ఇదిగో ఇక్కడిదాకే’’ అని సాహిత్య తలుపులు తెరిచి తెలుగు సాహిత్యాన్ని మేల్కొపటమే. సీతారాం అంటే S/O మాణిక్యం. అసలు తెలుగు సాహిత్యానికే C/O సీతారాం. అతడు ప్రశ్నించడు. ప్రశ్నించటమెట్లో నేర్పిస్తాడు. అతడు తడబడతాడు. కానీ ప్రశ్నను తడబడనివ్వడు. వాడు కలబడడు. కానీ సంగ్రామాన్ని వేదికగా మారుస్తాడు. అతడు భయపడతున్నట్లు కనిపిస్తాడు. కానీ జంకుగొంకు లేకుండా ధైర్యంగా ఎలా ముందుకు సాగాలోనన్న వీరోచిత పోరాటాలకు వీరరసం పోస్తాడు. అతడు వినయంగా ఉంటాడు. భాంచన్‌దొరా అని తలవొంచుకపోతానంటే తలెత్తి నడువమని అక్షరాల్ని నిలబెడతాడు. అతడు స్పష్టంగా కానరాడు. ఎవరికి ఎక్కడ ఎప్పుడు ఎలా కన్పించాలోనన్న రసాయనిక చర్య బాగా తెలిసినవాడు. అతడు ఒక్కడుగా నడుచుకుంటూ పోతాడు. కానీ అతడు ఒక్కడు కాదు. అతనొక విస్తృత సమాజం. అతడు మౌనంగా ఉన్నట్లు కన్పిస్తాడు. కానీ అతడొక సాహిత్య శిఖరం. మానవత్వం అడుగడుగునా తొణికిసలాడే రూపాల కోసం వెంపర్లాడుతూ వెర్రివాడుగా పరుగెత్తుతాడు. అతడు నిలువెల్లా కవిత్వం. కవిత్వపు చెట్టుకు పూసినపూత సీతారాం. కవిత్వంగా పెరిగి, కన్నీళ్లుగా కరిగి, కష్టాలుగా కలియతిరిగి కవిత్వమే నడకగా, నడతగా, శ్వాసగా చేసుకున్న జీవకవి సీతారాంకు కాళోజి అవార్డునివ్వటంతో తెలుగుసాహిత్యమే పరవశిస్తోంది.జూలూరు గౌరీశంకర్, కవి, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు(నేడు సీతారాంకు కాళోజి పురస్కార ప్రదానం సందర్భంగా) | editorial |
17,886 | 19-03-2017 02:46:48 | సమ్మె చేస్తే నల్లకోటుండదు! | న్యూఢిల్లీ, మార్చి 18: అడ్వకేట్లు సమ్మె చేసినా, విధుల బహిష్కరణకు దిగినా భవిష్యత్తులో కోర్టులో ప్రాక్టీస్ చేసే అవకాశం లేకుండా డిబార్ చేయాలని బార్ కౌన్సిల్ ప్రతిపాదించింది. ఈ మేరకు లా కమిషన్‌కు తన ప్రతిపాదనలు పంపింది. సమ్మె చేసే న్యాయవాదులపై కఠిన చర్యల కోసం అడ్వకేట్ల చట్టానికి మార్పులు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో లా కమిషన్ ఈ కసరత్తు చేస్తోంది. కోర్టు విధులకు భంగం కలిగించే విధంగా సమ్మె చేసినా, విధులు బహిష్కరించినా అడ్వకేట్‌పై వేటు పడుతుంది. దేశంలో 21లక్షల మంది రిజిస్టర్డ్ న్యాయవాదులు ఉన్నారు. వారిలో 40 శాతం మంది(దాదాపు 9 లక్షల మంది) నకిలీలని బార్ కౌన్సిల్ అంచనా వేస్తోంది. న్యాయవాదులు నకిలీలని తేలితే మూడేళ్ల జైలు, లక్ష రూపాయల జరిమానా విధించాలని బార్ కౌన్సిల్ తాజాగా ప్రతిపాదించింది. న్యాయవాది తన వద్దకు వచ్చే క్లయింట్‌కు నష్టం జరిగే విధంగా అనైతికంగా ప్రవర్తిస్తే మూడు లక్షల వరకు జరిమానా, రూ.5 లక్షల వరకు క్లయింట్ పరిహారం చెల్లించాలని బార్ కౌన్సిల్ మరో ప్రతిపాదన చేసింది. క్లయింటే తప్పుడు ఆరోపణ చేస్తే అతనికి రూ.2 లక్షల జరిమానా విధిస్తారు. బార్ కౌన్సిల్ ప్రతిపాదనలను జిల్లా స్థాయి న్యాయవాద సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్య హక్కులను పరిహరించడమేనని అన్నాయి. | nation |
300 | 02-10-2017 00:21:07 | ఐపిఒకు సిద్ధమైన హెచ్‌ఎఎల్ | బెంగళూరు: ప్రభుత్వ రంగంలోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఎఎల్) పబ్లిక్ ఇష్యూకి సిద్ధమైంది. ఇందుకోసం శనివారం సెబికి డ్రాఫ్ట్ రెడ్ హియరింగ్ ప్రాస్పెక్టస్ సమర్పించినట్టు తెలిపింది. కంపెనీ లిస్టింగ్ ప్రక్రియలో ఇదో ప్రధాన మైలురాయి అని హెచ్‌ఎఎల్ సిఎండి సువర్ణ రాజు చెప్పారు. కంపెనీ హెచ్‌ఎఎల్ ఈక్విటీలో 10 శాతం ఐపిఒ ద్వారా విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం 2012లోనే ఆమోదం తెలిపింది. ఇపుడు సెబికి డ్రాఫ్ట్ రెడ్ హియరింగ్ ప్రాస్పెక్టస్ కూడా సమర్పించడంతో హెచ్‌ఎఎల్ త్వరలోనే నిధుల సమీకరణ కోసం ప్రైమరీ మార్కెట్‌కు రాబోతోంది. | business |
19,683 | 14-03-2017 00:17:27 | గురువుగానే బెస్ట్.. | అనిల్ కుంబ్లే మార్గనిర్దేశంలో టీమిండియా.. రాహుల్ ద్రావిడ్ పర్యవేక్షణలో యువ భారత పరుగులు పెడుతున్నాయి..! ఒకప్పుడు ఆటగాళ్లుగా జట్టును నడిపించిన క్రికెట్ దిగ్గజాలు.. ఇప్పుడు గురువులుగా భారత్‌ను విజయపథంలో నడిపిస్తున్నారు..! చక్కటి సమన్వయంతో ఆటగాళ్లను తీర్చిదిద్దుతూ అందరి మన్ననలు పొందుతున్నారు..! అయితే, కుంబ్లేకు టీమ్ డైరెక్టర్‌గా, ద్రావిడ్‌కు ప్రధాన కోచ్‌గా ప్రమోషన్ ఇవ్వాలని సీవోఏ ఆలోచిస్తున్నట్టు వస్తున్న వార్తలు జట్టు పరిస్థితిని తారు మారు చేసేలా కనిపిస్తున్నాయి..! ఇది సాఫీగా సాగుతున్న టీమిండియా ప్రయాణాన్ని దెబ్బ తీసేలా ఉంది..! ఈ నిర్ణయంతో జట్టుకు జరిగే మేలు కన్నా కీడే ఎక్కువగా ఉందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి..!సరిగ్గా ఎనిమిది నెలల క్రితం... టీమిండియా భవిష్యత ఎలా ఉండబోతుందో ఊహించడం కూడా కష్టమైన పరిస్థితి. అప్పటికే కోచ్ లేకుండా రెండేళ్లు నెట్టుకొచ్చిన భారత.. టీమ్ డైరెక్టర్ రవిశాస్ర్తి సేవలను కూడా కోల్పోయింది. ఆ సమయంలో.. సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌లతో కూడిన కమిటీ ఎలాంటి హడావిడీ లేకుండా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లేను భారత కోచ్‌గా ఎంపిక చేసింది. అసలు ఆ ఎంపికే ఆశ్చర్యకరం. ముంబై ఇండియన్స్ జట్టుకు మెంటార్‌గా మినహా అనిల్‌కు అంతగా కోచింగ్ అనుభవం లేదు. అదే విధంగా, అప్పటిదాకా అతను ‘గురువు’ రేసులోకి వచ్చింది లేదు. పైగా, కుంబ్లేను ఎంపిక చేసిన కమిటీ.. మాజీ డైరెక్టర్ రవిశాస్ర్తిని పక్కనబెట్టడం విమర్శలకు తావిచ్చింది. కానీ, కదనరంగలోకి అడుగు పెట్టాక ఇవేవీ కుంబ్లేకు అడ్డుకాలేదు. కుంబ్లే, ద్రావిడ్, ధోనీ, కోహ్లీ 2016 జూలైలో భారత జట్టు తక్షణ రోడ్‌మ్యాప్ గురించి చర్చించారు. జట్టుకు సురక్షిత వర్తమానం, భవిష్యతను నిర్దేశించే స్పష్టమైన ప్రణాళిక రచించారు. అంతా కలిసి.. దాన్ని సమర్థవంతంగా అమలు చేశారు. ఫలితంగా.. టెస్టుల్లో టీమిండియా తిరుగులేని శక్తిగా మారింది. వన్డేల విషయానికి వస్తే.. కెప్టెన్‌గా ధోనీ భవిష్యతపై ఎలాంటి గందరగోళం లేని నిర్ణయం తీసుకున్నారు. ఎవరినీ నొప్పించకుండా.. పరిమిత ఓవర్లకు కొత్త కెప్టెన్‌గా కోహ్లీ వచ్చేశాడు. ఇప్పుడు, సెలెక్టర్లు.. జూన్‌లో ఇంగ్లండ్‌లో జరగబోయే చాంపియన్స్ ట్రోఫీపై దృష్టి పెట్టారు. ఈ మెగా టోర్నీ ముందు మన జట్టు సమతూకంలో కనిపిస్తోంది. ఒకరకంగా 2019 వరల్డ్‌క్‌పలో పాల్గొనే జట్టుపై కూడా అంచనా వచ్చేసింది. కోచ్‌గా కొద్ది కాలంలోనే సాధించిన ఫలితాలివి. జూనియర్ క్రికెట్‌లో కూడా అద్భుతమైన ప్రగతి కనిపిస్తోంది. బంగ్లాదేశ్‌లో గతేడాది జరిగిన వరల్డ్‌క్‌పలో మన అండర్-19 జట్టు రన్నరప్‌గా నిలిచింది. గత డిసెంబర్‌లో ఆసియా కప్ నెగ్గింది. ఈ మధ్యే స్వదేశంలో ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో ఐదు వన్డేల సిరీ్‌స నూ కైవసం చేసుకుంది. రాహుల్ ద్రావిడ్ మార్గనిర్దేశంలో యువ భారత్ అంచెలంచెలుగా ఎదుగుతోంది. ఇప్పుడు కోచ్‌లతో ఆటగాళ్లు నేరుగా మాట్లాడుతున్నారు. అదే విధంగా, రెండు జట్ల కోచ్‌ల మధ్య సమన్వయం భారత క్రికెట్‌కు ఎంతో లాభిస్తోంది. అన్ని విభాగాల సమష్టి కృషితో ప్రస్తుత సీజన్‌లో జట్టు విజయాలబాటలో నడుస్తోంది. గురువుగా.. సుదీర్ఘ కాలం కొనసాగే అర్హతలు తనకు ఉన్నాయని అనిల్ ఇప్పటికే నిరూపించాడు. కనీసం వచ్చే వరల్డ్ కప్ వరకు జట్టును నడిపించే సత్తా, విజన్ అతనిలో ఉంది. దానికి అనుగుణమైన జట్టును కూడా తీర్చిదిద్దాడతను. అతనితో అన్ని విషయాల్లో కలిసిపోయాడు కెప్టెన్ కోహ్లీ. ఇద్దరూ ఒకే మాట, ఒకే బాట అన్నట్టుగా నడుస్తున్నారు. దాంతో, కుంబ్లేను డైరెక్టర్‌గా ప్రమోట్ చేయడం లాభం కంటే ఎక్కువ నష్టం చేస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. అసలు, డైరెక్టర్ పదవికి కుంబ్లే నప్పుతాడా అన్న విషయం కూడా తేలాల్సి ఉంది. ఇక, ఆటగాళ్ల నుంచి ఎనలేని గౌరవం పొందుతున్న కుంబ్లే.. ఎంతో కష్టపడి జట్టులో క్రమశిక్షణ నింపాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో, శిక్షణ కార్యక్రమాల్లో క్రమశిక్షణ తప్పకుండా.. ఆటగాళ్లకు జరిమానా విధిస్తున్నాడు. చిన్న చిన్న కార్యక్రమాలతో వారిలో ఉత్తేజం కలిగిస్తున్నాడు. ఇప్పుడు.. అతను డైరెక్టర్‌గా మారి సూటు బూటు వేసుకుంటే వాటి పరిస్థితి ఏమిటో మరి! | sports |
13,820 | 05-03-2017 00:19:41 | కేన్సర్ అలసటకు వ్యాయామమే మేలు | న్యూయార్క్, మార్చి 4: కేన్సర్ సంబంధిత అలసటను తగ్గించేందుకు మందులు వాడడం కన్నా వ్యాయామం చేయడమే ఉత్తమమని తాజా అధ్యయనంలో వెల్లడైంది. పరుగు, బరువులు ఎత్తడం వంటి వ్యాయామాలతో పాటు శ్వాస సంబంధ వ్యాయామాలు కేన్సర్ బాధితుల అలసటను తగ్గించడంలో తోడ్పడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. కేన్సర్ చికిత్స పొందుతున్న వారు, చికిత్స పూర్తయి కోలుకున్న వారు తీవ్రమైన అలసట, బడలికతో ఉంటారు. కొంత మంది అలసటకు చికిత్సను పూర్తిగా తీసుకోలేక మధ్యలోనే ఆపేయడంతో మరణిస్తున్నారు. ఈ అలసటకు సంబంధించి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్‌కు చెందిన విల్మోట్ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు 11 వేల మందిపై జరిపిన 113 అధ్యయనాలను పరిశీలించారు. బడలికను తగ్గించేందుకు ఔషధాలను వినియోగించడం కన్నా వ్యాయామం చేయడమే మేలని తేలిందన్నారు. వారు సానుకూల ఆలోచనా ధోరణిని పెంపొందించుకుంటే మేలన్నారు. | nation |
5,816 | 12-10-2017 15:55:10 | ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్‌లో హీరోయిన్ ఎవరంటే... |
టాలీవుడ్ తాజా సంచలన చిత్రం ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లబోతోంది. విక్రమ్ వారసుడు ధ్రువ్ ఈ చిత్రంతో హీరోగా ఆరంగేట్రం చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే దర్శకుడు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. పలువురి పేర్లు వినిపించినా... అనూహ్యంగా ప్రముఖ దర్శకుడు బాలా చేతికి వెళ్లింది. ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్‌కు బాలా దర్శకత్వం వహించనున్నట్టు ప్రకటించగానే చాలా మంది విస్తుపోయారు. ఒక కొత్త దర్శకుడు తీసిన సినిమాను రీమేక్ చేసేందుకు దిగ్గజ దర్శకుడైన బాలా అంగీకరించడం ఆశ్చర్యం కలిగించేదే. యదార్థ చిత్రీకరణకు మారుపేరుగా నిలిచే సినిమాలను తీసిన బాలా... ‘అర్జున్ రెడ్డి’ని ఎలా హ్యాండిల్ చేయబోతున్నారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. తెలుగులో కొత్త ట్రెండ్‌ని సృష్టించిన ఈ సినిమా తమిళంలోనూ అంతటి ప్రభావాన్ని చూపుతుందా? బాలా మేజిక్ పనిచేస్తుందా? అన్నది చూడాలి. ఇకపోతే... ఈ సినిమాలో ధ్రువ్ జోడీగా ఎవరు నటించబోతున్నారన్నది ఇంకా ఖరారు కాలేదు. కమల్‌హాసన్ రెండో కూతురు అక్షర హాసన్, యువనటి శ్రియా పేర్లు పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరో నటించడం ఖాయమని కోలీవుడ్ టాక్. | entertainment |
19,851 | 26-03-2017 00:21:05 | సౌతాఫ్రికా 123/4 | కివీస్‌తో మూడో టెస్ట్ హామిల్టన్: హషీమ్ ఆమ్లా (50) అర్ధ సెంచరీతో రాణించడంతో.. న్యూజిలాండ్‌తో ఆఖరి, మూడో టెస్ట్‌లో తొలి రోజైన శనివారం ఆట చివరకు దక్షిణాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. ఓపెనర్లు డీన్ ఎల్గర్ (5), థెనిస్ డి బ్రూన్ (0) విఫలమయ్యారు. జేపీ డుమిని (20) కూడా స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు. ప్రస్తుతం కెప్టెన్ డుప్లెసిస్ (33 బ్యాటింగ్), బవుమా (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. తొలి రోజు వర్షం కారణంగా 41 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. వర్షం దెబ్బకు సుమారు మూడు గంటల మ్యాచ్ తుడిచిపెట్టుకుపోయింది. మాట్ హెన్రీ, గ్రాండ్ హోమ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. | sports |
9,521 | 25-02-2017 23:00:33 | పిల్లల కోసం ఫిల్మ్ క్లబ్! |
నేషనల్ ఫిల్మ్ ఆర్కేవ్స్ ఆఫ్ ఇండియా’ (ఎన్‌ఎఫ్ఎఐ) ఇటీవల ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. కేవలం పిల్లల కోసమే ప్రత్యేకంగా ఫిల్మ్ క్లబ్‌ను ఏర్పాటుచేసింది. ఈ క్లబ్ ద్వారా భారతదేశంతోపాటు ప్రపంచ సినీమాల వారసత్వ సంపద గురించి పిల్లలకు తెలియజేయాలనుకుంటోంది. అంతేకాదు పిల్లల్లో మంచి సినిమాలపై ఆసక్తిని పెంపొందించాలని భావించింది. అరభత ఫిల్మ్స్ సహకారంతో ఈ వినూత్న కార్యక్రమానికి ఎన్‌ఎ్‌ఫఎఐ శ్రీకారం చుట్టింది. ఈ ఫిల్మ్ క్లబ్‌లో 9 నుంచి 16 సంవత్సరాల వయసు పిల్లలు సభ్యులుగా చేరొచ్చు. చిల్డ్రన్స్ ఫిల్మ్ క్లబ్ ప్రతి నెల చివరి వారాంతంలో పిల్లల కోసం మంచి సినిమాను ప్రదర్శిస్తుంది. ఈ క్లబ్ ప్రదర్శించిన తొలి సినిమా ‘సోనార్ కెల్లా’ (గోల్డెన్ ఫోరె్ట్రస్, 1974). ఈ చిత్రం సత్యజితరాయ్‌కు ఎన్నో జాతీయ అవార్డులను తెచ్చిపెట్టింది. చిల్డ్రన్స్ ఫిల్మ్ క్లబ్ ఫిబ్రవరి 25 నుంచి పిల్లల కోసం చిత్రాల స్ర్కీనింగ్‌ను మొదలెట్టింది. ఈ క్లబ్ ఏర్పాటు వల్ల పిల్లల్లో ఆరోగ్యకరమైన సినీమాలను చూసే సంస్కృతి వృద్ధిచెందుతుందని ఎన్‌ఎ్‌ఫఎఐ వర్గాలు అంటున్నాయి. | entertainment |
10,247 | 04-02-2017 13:38:18 | ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా: రకుల్ | ప్రస్తుతం తెలుగు స్టార్ హీరోల సినిమాల్లో మెరుస్తూ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది ఉత్తరాది భామ రకుల్ ప్రీత్ సింగ్. అయితే మొదట్లో సందీప్ కిషన్ నటించిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ వంటి హిట్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత రెండేళ్లు ఆమెను పట్టించుకోలేదు. ఆ సమయంలో తాను చాలా అవమానాలను ఎదుర్కొన్నానని చెప్పింది రకుల్. | entertainment |
16,155 | 05-05-2017 12:22:46 | కోళ్ళ ఫారాలపై న్యాయ శాఖ కన్ను |
న్యూఢిల్లీ : కోళ్ళ ఫారాల్లో కోళ్ళను పెంచుతున్న తీరు, వాటిని రవాణా చేస్తున్న పద్ధతులపై కేంద్ర న్యాయ శాఖ దృష్టి సారించింది. ప్రస్తుత చట్టాల ప్రకారం అంతర్జాతీయ ధోరణులను పరిగణనలోకి తీసుకుని నివేదిక సమర్పించాలని న్యాయ పరిశీలన సంఘం (లా కమిషన్)ను కోరింది. జంతు హక్కుల ఉద్యమకారిణి, కేంద్ర మంత్రి మేనక గాంధీ విజ్ఞప్తి మేరకు న్యాయ శాఖ ఈ చర్య తీసుకుంది. పౌల్ట్రీ ఫారాల్లో కోళ్ళ పెంపకానికి సంబంధించిన చట్టాలను పునః పరిశీలించాలని మేనక గాంధీ న్యాయ శాఖను కోరారు. న్యాయ శాఖ ఆదేశాల మేరకు లా కమిషన్ స్పందించింది. ఈ అంశంతో సంబంధం ఉన్న పక్షాలన్నీ తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది. వివిధ చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ మూగ జీవులను అనారోగ్యకర పరిస్థితుల్లో పెంచుతున్నారని మేనక తెలిపారని, ఆమె విజ్ఞప్తి మేరకు తమకు న్యాయ శాఖ నోటీసును పంపిందని లా కమిషన్ పేర్కొంది. పౌల్ట్రీ కోళ్ళకు అమ్మకాలు, నిర్వహణ, పెంపకం వంటి సమస్యలపై పౌల్ట్రీ ఫారాల నిర్వాహకులు, రవాణాదారులు, హోటల్ వ్యాపారులు, ఎన్‌జీవోలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది. సలహాలు, అభిప్రాయాలను 30 రోజుల్లోగా లా కమిషన్ కార్యాలయానికి పంపించాలని తెలిపింది. | nation |
1,445 | 10-11-2017 00:33:19 | వివో వి7+లో కొత్త వేరియంట్ | హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): వి7+స్మార్ట్‌ఫోన్‌లో నీలి రంగుతో కూడిన వేరియంట్‌ను వివో కంపెనీ దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర 21,990 రూపాయలు. నవంబరు 15వ తేదీ నుంచి ఇది స్టోర్లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. అమెజాన్.ఇన్‌లో ఈ ఫోన్ కోసం ప్రీ బుకింగ్ కూడా చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్‌లో 16 ఎంపి వెనుక, 24 ఎంపి ముందు కెమెరాలు, ఫేస్ అన్‌లాక్, 5.99 అంగుళాల టచ్ స్ర్కీన్, ఆండ్రాయిడ్ నౌగట్ ఔస్, 4జిబి రామ్, 64 జిబి ఇంటర్నల్ మెమరీ, 3225 ఎంఎహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లున్నాయి. | business |
3,847 | 05-04-2017 03:38:02 | ‘హస్త’ రేఖలే శత్రువులు! | 2019 ఎన్నికలకు అటు ఇటుగా రెండేళ్ల సమయం ఉంది. ఇప్పటి నుంచి అయినా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరో వచ్చి, ఏదో చేస్తారనే భ్రమల్లో ఉండకుండా, కలిసికట్టుగా క్షేత్ర స్థాయికి వెళ్లి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధిగా ప్రభుత్వంతో కొట్లాడితే మంచిది. లేకపోతే రాబోయే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా మిగలదు. హస్తం.. రేఖలమయం. అవి సరళంగా ఉన్నా, వక్రంగా ఉన్నా.. వాటితోనే హస్తానికి అందం చందం. రేఖలు లేని హస్తాన్ని ఊహించుకోలేం. అంతటి ప్రాధాన్యం కలిగిన రేఖలే హస్తానికి శత్రువుగా మారితే? వేటి దారిన అవి ఉండకుండా పరస్పరం పొట్లాడుకుంటే? నిలువ నీడనిచ్చిన హస్తాన్ని గుండుసూదుల్లా గుచ్చుతుంటే? దాని గుండెల్లో గునపాలై దిగుతుంటే? ఏమ నాలి?? తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటే సరిపోతుందేమో!! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పదేళ్ల అధికార అనుభవం ముగింపు దశకు చేరుకున్నాక రాష్ట్ర విభజనకు పూనుకున్న కాంగ్రెస్‌కి ఉభయ రాష్ర్టాల్లో కాలంతో పాటు, అదృష్టమూ కలిసిరాలేదు. 2014 సాధారణ ఎన్నికల్లో ఒక్క సీటూ సాధించలేక విభజిత ఆంధ్రప్రదేశ్ చట్టసభల్లో నామరూపాలు లేకుండా పోయిన పార్టీ, కొత్త రాష్ట్రం తెలంగాణలో కిందా మీదాపడి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. ఏపీని పక్కనపెడితే, తెలంగాణలో అధికారం తమదేనని కలలు కన్న కాంగ్రెస్ ఇక్కడ మెజార్టీ సీట్లు సాధించలేక పోవటానికి రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల కంటే, ఆ పార్టీ నేతల స్వయంకృతాపరాధమే ప్రధాన కారణమనటంలో సందేహం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం, టీఆర్‌ఎస్ ప్రభుత్వం జమిలిగా ఏర్పాటై మూడేళ్లు కావస్తోంది. కనీసం ఇప్పటికైనా రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో మార్పు వచ్చిందా? అంటే, లేదనే సమాధానాలే అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. రాజకీయంగా, ప్రజాప్రతినిధులుగా విశేషమైన అనుభవం కలిగిన నేతలు తెలంగాణ కాంగ్రెస్‌లో మిగిలే ఉన్నారు. చాలామంది ముఖ్య నేతలు వయసు రీత్యా కూడా చిన్నవారేమీ కాదు. కానీ ఎక్కువ మందికి పార్టీ భవిష్యత్తు కంటే, స్వీయ భవిష్యత్తుపైనే బెంగ ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకే అంశానికి సంబంధించి.. ఒక నేత ఒకరకంగా మాట్లాడితే, మరొక నేత ఇంకో రకంగా మాట్లాడతారు. ఒకే నాయకుడు రోజుల వ్యవధిలో పరస్పర భిన్నంగా స్పందించటానికి ఏ మాత్రం సంశయించటం లేదు. బయటికి తెలియని విభేదాలతో పలువురు పార్టీ నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకోవటానికి నిరంతరం కాలు దువ్వుతూనే ఉంటారు. చివరికి వ్యక్తిగత ఆరోపణలకు దిగటానికీ వెనుకాడరు. వీటిన్నింటినీ కాంగ్రెస్‌లో ‘భావ ప్రకటన స్వేచ్ఛ’ పుష్కలంగా ఉందనే ముసుగుతో పార్టీ నేతలు సమర్థించుకుంటున్నారు. అంతేకానీ తమ వైఖరి వల్ల స్వయంగా తామే కాకుండా, కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో పలుచన అవుతున్నాయనే సోయి ఉండటం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణంతో పోల్చుకుంటే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా భిన్నం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు ఏం మాట్లాడినా చెల్లింది. అధికారంలో ఉన్నారు కదా! అప్పుడైనా ఒక్క ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని పల్లెత్తు మాట అనకుంటే చాలు, ఎవరు ఏదైనా మాట్లాడవచ్చు అనే ధోరణి కొనసాగింది. ‘శతకోటి లింగాల్లో బోడి లింగం’ అన్నట్లుగా కాంగ్రెస్ నేతల పరిస్థితి ఉండేది. కానీ తెలంగాణ నూతనంగా ఏర్పాటైన రాష్ట్రమే కాకుండా చిన్నది. దానికంటే మించి ఇక్కడ అధికారంలో ఉన్నది ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నది ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. సమకాలీన రాజకీయాల్లో తెలంగాణ వరకు ఆయనను మించి టక్కుటమారగజకర్ణగోకర్ణ విద్యలు తెలిసిన వారు లేరు. 2014 సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన మరుసటి రోజు నుంచే కేసీఆర్, 2019 ఎన్నికల్లో గెలుపొందటానికి అవసరమైన వ్యూహరచన మొదలుపెట్టారు. దాని అమలుకూ శ్రీకారం చుట్టారు. అధ్యయనం, ప్రణాళిక, ఆచరణ వంటి శాస్ర్తీయ దృక్పథంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతుంటే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు నేల విడిచి సాము చేస్తున్నారు. నరంలేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది. దానిని అదుపులో పెట్టుకోవటంలోనే ఉంటుంది విజ్ఞత. చిన్న రాష్ట్రం కావటంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల ప్రతి మాట, చర్య వార్తలుగా మారిపోతున్నాయి. ప్రజల ముందు పరీక్షకు నిలబడుతున్నాయి.ఉదాహరణకు 2014 సాధారణ ఎన్నికల తర్వాత అన్ని రాజకీయ పార్టీలు కీలకంగా భావించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో సీఎల్పీ నేత కె.జానారెడ్డి ‘ఐదు రూపాయల భోజనం’ తమ కార్యాలయానికి తెప్పించుకొని తినటమేకాక, అది బాగుందని కితాబు కూడా ఇచ్చారు. తిన్న వెంటనే మెచ్చుకోవటానికి అదేమీ పెళ్లి భోజనం కాదు. అధికార టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకం. సమయం, సందర్భం లేకుండా జానారెడ్డి చేసిన ఆ పని అప్పుడు కాంగ్రెస్ పార్టీని బాగానే దెబ్బకొట్టింది. ఇటీవల అదే జానారెడ్డి కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించటానికి బాహుబలి వస్తారనే వ్యాఖ్య చేశారు. అంటే ఇప్పుడు తమ సొంత పార్టీలో ఉన్న నాయకుల వల్ల ఫలితం లేదని, కాంగ్రెస్‌ను గట్టెక్కించటానికి బయటి నుంచి ఎవరో ఒకరు రావాల్సిందేనని జానారెడ్డి చెప్ప కనే చెప్పారు. ‘చింత చచ్చినా పులుపు చావలేదు’ అన్నట్టు అధికారాన్ని కోల్పోయి మూడేళ్లు కావస్తున్నప్పటికీ, చాలా మంది కాంగ్రెస్ నేతల వ్యవహారశైలి మంత్రులను తలపిస్తుంటుంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తామని, తమదే ముఖ్యమంత్రి పీఠం అని పగటి కలలు కంటున్న వారి సంఖ్య ఆ పార్టీలో అర డజనును మించి ఉండటం బహిరంగ రహస్యమే.2014లో చేతికి అందివస్తుందనుకున్న అధికారం ఎలాగూ దక్కలేదు. అలాంటప్పుడు కనీసం 2019 ఎన్నికల కోసమైనా కాంగ్రెస్ నేతలు ఎంత కసిగా పనిచేయాలి? అవసరమైతే నిద్ర, ఆహారాలు మాని పార్టీ కోసం శ్రమించాలి. సీఎం కేసీఆర్ వంటి దిగ్గజాన్ని ఎదుర్కోవటానికి రాజకీయమే శ్వాసగా అనుక్షణం కసరత్తు చేయాలి. అయితే 2004–-14 వరకు పదేళ్లు అధికారాన్ని ఎంజాయ్ చేసిన చాలా మంది తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ప్రస్తుతం రాజకీయాలు, పార్టీ పరమైన వ్యవహారాలు పార్ట్‌టైం ఉద్యోగంగా మారిపోయాయి. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాలను చేతులారా జారవిడుచుకుంటున్నారు. కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలోనూ సీనియర్ నేతలు పలువురు ఒకవైపు సభ నడుస్తుండగా, మరోవైపు విశ్రాంతి తీసుకోవటానికి ప్రాధాన్యం ఇస్తే ఏమనుకోవాలి?ప్రతిపక్షం అనేది ప్రజా సమస్యలు, వారి మనోగతాన్ని ప్రతిబింబించే అద్దంలాంటిది. ఆ అద్దం పగుళ్లు పడితే లేక మసకబారటమో జరిగితే ఎలా? ప్రతిపక్షం తనను తాను స్పష్టంగా చూసుకోగలదా? ఈ పరిస్థితుల్లోనే సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికలపై ధీమాగా ప్రకటనలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పని క్లోజ్ అయిందని, ఆ పార్టీ నేతలు చేతులెత్తేశారని, టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. ఈ మాట కేసీఆర్ చెప్పటం కాదు. రాష్ట్ర కాంగ్రెస్ నేతల వైఖరి చూస్తుంటే, ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కాంగ్రెస్‌కు నష్టం చేయటానికి కొత్తగా శత్రువులు పుట్టుకు రావాల్సిన అవసరంలేదని, ఆ పార్టీ నేతలు వైఖరి చాలుననే అభిప్రాయం క్రమంగా అందరిలోనూ బలపడుతోంది. 2019 ఎన్నికలకు అటు, ఇటుగా రెండేళ్ల సమయం ఉంది. ఇప్పటి నుంచి అయినా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరో వచ్చి, ఏదో చేస్తారనే భ్రమల్లో ఉండకుండా, కలిసికట్టుగా క్షేత్ర స్థాయికి వెళ్లి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధిగా ప్రభుత్వంతో కొట్లాడితే మంచిది. పార్టీ నేతలు తమ ప్రతి మాట వెనుక ఇంకో అర్థాన్ని వెతుక్కునే అవకాశాన్ని ఎవరికీ ఇవ్వకుండా చూసుకుంటే అదే పదివేలు. లేకపోతే రాబోయే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా మిగలదు. తదుపరి చింతించినా ప్రయోజనం ఉండదు.మెండు శ్రీనివాస్ హస్తం.. రేఖలమయం. అవి సరళంగా ఉన్నా, వక్రంగా ఉన్నా.. వాటితోనే హస్తానికి అందం చందం. రేఖలు లేని హస్తాన్ని ఊహించుకోలేం. అంతటి ప్రాధాన్యం కలిగిన రేఖలే హస్తానికి శత్రువుగా మారితే? వేటి దారిన అవి ఉండకుండా పరస్పరం పొట్లాడుకుంటే? నిలువ నీడనిచ్చిన హస్తాన్ని గుండుసూదుల్లా గుచ్చుతుంటే? దాని గుండెల్లో గునపాలై దిగుతుంటే? ఏమ నాలి?? తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటే సరిపోతుందేమో!! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పదేళ్ల అధికార అనుభవం ముగింపు దశకు చేరుకున్నాక రాష్ట్ర విభజనకు పూనుకున్న కాంగ్రెస్‌కి ఉభయ రాష్ర్టాల్లో కాలంతో పాటు, అదృష్టమూ కలిసిరాలేదు. 2014 సాధారణ ఎన్నికల్లో ఒక్క సీటూ సాధించలేక విభజిత ఆంధ్రప్రదేశ్ చట్టసభల్లో నామరూపాలు లేకుండా పోయిన పార్టీ, కొత్త రాష్ట్రం తెలంగాణలో కిందా మీదాపడి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. ఏపీని పక్కనపెడితే, తెలంగాణలో అధికారం తమదేనని కలలు కన్న కాంగ్రెస్ ఇక్కడ మెజార్టీ సీట్లు సాధించలేక పోవటానికి రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల కంటే, ఆ పార్టీ నేతల స్వయంకృతాపరాధమే ప్రధాన కారణమనటంలో సందేహం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం, టీఆర్‌ఎస్ ప్రభుత్వం జమిలిగా ఏర్పాటై మూడేళ్లు కావస్తోంది. కనీసం ఇప్పటికైనా రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో మార్పు వచ్చిందా? అంటే, లేదనే సమాధానాలే అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. రాజకీయంగా, ప్రజాప్రతినిధులుగా విశేషమైన అనుభవం కలిగిన నేతలు తెలంగాణ కాంగ్రెస్‌లో మిగిలే ఉన్నారు. చాలామంది ముఖ్య నేతలు వయసు రీత్యా కూడా చిన్నవారేమీ కాదు. కానీ ఎక్కువ మందికి పార్టీ భవిష్యత్తు కంటే, స్వీయ భవిష్యత్తుపైనే బెంగ ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకే అంశానికి సంబంధించి.. ఒక నేత ఒకరకంగా మాట్లాడితే, మరొక నేత ఇంకో రకంగా మాట్లాడతారు. ఒకే నాయకుడు రోజుల వ్యవధిలో పరస్పర భిన్నంగా స్పందించటానికి ఏ మాత్రం సంశయించటం లేదు. బయటికి తెలియని విభేదాలతో పలువురు పార్టీ నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకోవటానికి నిరంతరం కాలు దువ్వుతూనే ఉంటారు. చివరికి వ్యక్తిగత ఆరోపణలకు దిగటానికీ వెనుకాడరు. వీటిన్నింటినీ కాంగ్రెస్‌లో ‘భావ ప్రకటన స్వేచ్ఛ’ పుష్కలంగా ఉందనే ముసుగుతో పార్టీ నేతలు సమర్థించుకుంటున్నారు. అంతేకానీ తమ వైఖరి వల్ల స్వయంగా తామే కాకుండా, కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో పలుచన అవుతున్నాయనే సోయి ఉండటం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణంతో పోల్చుకుంటే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా భిన్నం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు ఏం మాట్లాడినా చెల్లింది. అధికారంలో ఉన్నారు కదా! అప్పుడైనా ఒక్క ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని పల్లెత్తు మాట అనకుంటే చాలు, ఎవరు ఏదైనా మాట్లాడవచ్చు అనే ధోరణి కొనసాగింది. ‘శతకోటి లింగాల్లో బోడి లింగం’ అన్నట్లుగా కాంగ్రెస్ నేతల పరిస్థితి ఉండేది. కానీ తెలంగాణ నూతనంగా ఏర్పాటైన రాష్ట్రమే కాకుండా చిన్నది. దానికంటే మించి ఇక్కడ అధికారంలో ఉన్నది ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నది ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. సమకాలీన రాజకీయాల్లో తెలంగాణ వరకు ఆయనను మించి టక్కుటమారగజకర్ణగోకర్ణ విద్యలు తెలిసిన వారు లేరు. 2014 సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన మరుసటి రోజు నుంచే కేసీఆర్, 2019 ఎన్నికల్లో గెలుపొందటానికి అవసరమైన వ్యూహరచన మొదలుపెట్టారు. దాని అమలుకూ శ్రీకారం చుట్టారు. అధ్యయనం, ప్రణాళిక, ఆచరణ వంటి శాస్ర్తీయ దృక్పథంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతుంటే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు నేల విడిచి సాము చేస్తున్నారు. నరంలేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది. దానిని అదుపులో పెట్టుకోవటంలోనే ఉంటుంది విజ్ఞత. చిన్న రాష్ట్రం కావటంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల ప్రతి మాట, చర్య వార్తలుగా మారిపోతున్నాయి. ప్రజల ముందు పరీక్షకు నిలబడుతున్నాయి.ఉదాహరణకు 2014 సాధారణ ఎన్నికల తర్వాత అన్ని రాజకీయ పార్టీలు కీలకంగా భావించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో సీఎల్పీ నేత కె.జానారెడ్డి ‘ఐదు రూపాయల భోజనం’ తమ కార్యాలయానికి తెప్పించుకొని తినటమేకాక, అది బాగుందని కితాబు కూడా ఇచ్చారు. తిన్న వెంటనే మెచ్చుకోవటానికి అదేమీ పెళ్లి భోజనం కాదు. అధికార టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకం. సమయం, సందర్భం లేకుండా జానారెడ్డి చేసిన ఆ పని అప్పుడు కాంగ్రెస్ పార్టీని బాగానే దెబ్బకొట్టింది. ఇటీవల అదే జానారెడ్డి కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించటానికి బాహుబలి వస్తారనే వ్యాఖ్య చేశారు. అంటే ఇప్పుడు తమ సొంత పార్టీలో ఉన్న నాయకుల వల్ల ఫలితం లేదని, కాంగ్రెస్‌ను గట్టెక్కించటానికి బయటి నుంచి ఎవరో ఒకరు రావాల్సిందేనని జానారెడ్డి చెప్ప కనే చెప్పారు. ‘చింత చచ్చినా పులుపు చావలేదు’ అన్నట్టు అధికారాన్ని కోల్పోయి మూడేళ్లు కావస్తున్నప్పటికీ, చాలా మంది కాంగ్రెస్ నేతల వ్యవహారశైలి మంత్రులను తలపిస్తుంటుంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తామని, తమదే ముఖ్యమంత్రి పీఠం అని పగటి కలలు కంటున్న వారి సంఖ్య ఆ పార్టీలో అర డజనును మించి ఉండటం బహిరంగ రహస్యమే.2014లో చేతికి అందివస్తుందనుకున్న అధికారం ఎలాగూ దక్కలేదు. అలాంటప్పుడు కనీసం 2019 ఎన్నికల కోసమైనా కాంగ్రెస్ నేతలు ఎంత కసిగా పనిచేయాలి? అవసరమైతే నిద్ర, ఆహారాలు మాని పార్టీ కోసం శ్రమించాలి. సీఎం కేసీఆర్ వంటి దిగ్గజాన్ని ఎదుర్కోవటానికి రాజకీయమే శ్వాసగా అనుక్షణం కసరత్తు చేయాలి. అయితే 2004–-14 వరకు పదేళ్లు అధికారాన్ని ఎంజాయ్ చేసిన చాలా మంది తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ప్రస్తుతం రాజకీయాలు, పార్టీ పరమైన వ్యవహారాలు పార్ట్‌టైం ఉద్యోగంగా మారిపోయాయి. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాలను చేతులారా జారవిడుచుకుంటున్నారు. కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలోనూ సీనియర్ నేతలు పలువురు ఒకవైపు సభ నడుస్తుండగా, మరోవైపు విశ్రాంతి తీసుకోవటానికి ప్రాధాన్యం ఇస్తే ఏమనుకోవాలి?ప్రతిపక్షం అనేది ప్రజా సమస్యలు, వారి మనోగతాన్ని ప్రతిబింబించే అద్దంలాంటిది. ఆ అద్దం పగుళ్లు పడితే లేక మసకబారటమో జరిగితే ఎలా? ప్రతిపక్షం తనను తాను స్పష్టంగా చూసుకోగలదా? ఈ పరిస్థితుల్లోనే సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికలపై ధీమాగా ప్రకటనలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పని క్లోజ్ అయిందని, ఆ పార్టీ నేతలు చేతులెత్తేశారని, టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. ఈ మాట కేసీఆర్ చెప్పటం కాదు. రాష్ట్ర కాంగ్రెస్ నేతల వైఖరి చూస్తుంటే, ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కాంగ్రెస్‌కు నష్టం చేయటానికి కొత్తగా శత్రువులు పుట్టుకు రావాల్సిన అవసరంలేదని, ఆ పార్టీ నేతలు వైఖరి చాలుననే అభిప్రాయం క్రమంగా అందరిలోనూ బలపడుతోంది. 2019 ఎన్నికలకు అటు, ఇటుగా రెండేళ్ల సమయం ఉంది. ఇప్పటి నుంచి అయినా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరో వచ్చి, ఏదో చేస్తారనే భ్రమల్లో ఉండకుండా, కలిసికట్టుగా క్షేత్ర స్థాయికి వెళ్లి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధిగా ప్రభుత్వంతో కొట్లాడితే మంచిది. పార్టీ నేతలు తమ ప్రతి మాట వెనుక ఇంకో అర్థాన్ని వెతుక్కునే అవకాశాన్ని ఎవరికీ ఇవ్వకుండా చూసుకుంటే అదే పదివేలు. లేకపోతే రాబోయే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా మిగలదు. తదుపరి చింతించినా ప్రయోజనం ఉండదు.మెండు శ్రీనివాస్ | editorial |
7,460 | 25-05-2017 12:59:12 | బుల్లితెరపైనా రికార్డులతో కుమ్మేయడానికి.. ఈ నాలుగు కారణాలు చాలట! | నో డౌట్.. తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేశాడు చిరంజీవి. ఎన్టీఆర్ తర్వాత బాక్సాఫీస్ మెగాస్టార్‌గా అవతరించాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన చిరు.. కొన్నేళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. దాదాపు పదేళ్ల తర్వాత ఖైదీ నంబర్ 150తో రీఎంట్రీ ఇచ్చి సినిమాల్లో తన చరిష్మా ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేశాడు. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లను రాబట్టాడు. ఇక, తొలిసారి ఈ సినిమా బుల్లితెరపై ప్రేక్షకులకు విందు పంచబోతోంది. మే 28న టీవీలో సినిమా రాబోతోంది. దీంతో టీఆర్పీ పరంగా కూడా చిరు రికార్డులను కుమ్మేస్తాడా..? అనే చర్చ జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా వేస్తున్న భారీ ప్రీమియర్ అంటూ సదరు చానెల్ ప్రమోట్ చేసుకుంటోంది. అంతేకాదు.. బుల్లితెరపైనా చిరంజీవి రికార్డులు ఖాయమని చెబుతున్నారట. దానికి కారణాలు లేకపోలేదు. బుల్లితెరపై సినిమా భారీ హిట్ అవుతుందనడానికి వారు వివరిస్తున్న కారణాలివే! 1. ఈ వీకెండ్‌లో విడుదలవుతున్న భారీ సినిమా ఏదీ లేదు2. మునుపటితో పోలిస్తే బాహుబలి-2 ప్రభంజనం తగ్గుతోంది3. ఐపీఎల్ సీజన్ కూడా అయిపోయింది4. మండిపోతున్న ఎండల కారణంగా సాయంత్రం పూట కూడా జనాలు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు వెరసి బుల్లితెరపై ఖైదీ నంబర్ 150 సూపర్ డూపర్ హిట్టేనని అంటున్నారు. మరి, చిరు మూవీ బుల్లితెరపై రికార్డు టీఆర్పీని అందుకుంటుందా..? లేదా..? తెలియాలంటే మాత్రం సినిమా టెలీకాస్ట్ అయ్యే మే 28వరకు ఆగాల్సిందే. | entertainment |
79 | 08-02-2017 00:30:12 | 8810 వద్ద అప్రమత్త ట్రెండ్ | నిఫ్టీ సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ 8800 స్థాయిల వద్ద నిలదొక్కుకోవటంలో విఫలమైంది. ఇంట్రాడేలో మైనర్ కరెక్షన్‌ను కనబరిచి చివరకు స్వల్ప నష్టంతో క్లోజైంది. టెక్నికల్‌గా మార్కెట్ ఎలాంటి కొత్త సంకేతాలను వెలువరించటం లేదు. 8800- 8750 మధ్య మైనర్ శ్రేణిలో కదలాడుతోంది. తదుపరి దిశకు ఈ స్థాయిల వద్ద బ్రేకవుట్ సాధించాల్సి ఉంటుంది.నిరోధం : 8810 మద్దతు : 8750 -వి. సుందర్ రాజా | business |
17,205 | 25-10-2017 13:42:39 | టిప్పు సుల్తాన్‌పై రాష్ట్రపతి సంచలన ప్రసంగం | న్యూఢిల్లీ: మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ గొప్ప యుద్ధ వీరుడని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. విధాన సౌధ 60వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం కర్నాటక అసెంబ్లీ, శాసనమండలి సంయుక్త సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘‘బ్రిటిష్ పాలకులపై పోరాడుతూ టిప్పు సుల్తాన్ వీరమరణం పొందారు. యుద్ధంలో మైసూర్ రాకెట్లకు ఆయనే నాంది పలికారు..’’ అని కొనియాడారు. రాష్ట్రంలోని జీవన వైవిధ్యంపై ఆయన మాట్లాడుతూ.. ‘‘పురాతన జైనులకు, బౌద్ధ సంప్రదాయాలకు ఈ నేల ప్రసిద్ధి చెందింది. ఆదిశంకరాచార్యుడు ఇక్కడే శృంగేరి మఠాన్ని నెలకొల్పాడు. గుల్బర్గా ప్రాంతం సూఫీ సంస్కృతికి కేంద్రంగా విలసిల్లింది. కర్నాటకలోనే బసవాచార్య నేతృత్వంలో లింగాయత్ ఉద్యమం పురుడుపోసుకుంది..’’ అని ఆయన పేర్కొన్నారు. ఘనమైన ఆథ్యాత్మిక చరిత్రతో పాటు శాస్త్ర, సాంకేతిక రంగాలకు, వ్యవసాయానికి కర్నాటక ప్రసిద్ధి చెందిందన్నారు. భారత సైన్యానికి సైతం కర్నాటక అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. ‘‘మన సైన్యంలోని ఇద్దరు చీఫ్‌లు ఫీల్డ్ మార్షల్ కేఎమ్ కరియప్ప, జనరల్ కేఎస్ తిమ్మయ్య కర్నాటక బిడ్డలే..’’అని రాష్ట్రపతి కోవింద్ గుర్తుచేశారు. టిప్పు సుల్తాన్ నిరంకుశుడంటూ బీజేపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన ప్రసంగంలో స్పష్టమైన వైఖరిని వెల్లడించడం గమనార్హం. | nation |
14,636 | 21-08-2017 07:29:20 | సీఎం పీఠంపై తలైవర్! |
చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశం దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో... తలైవర్ రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకతను ప్రచారం చేసే దిశగా ఆదివారం తిరుచ్చిలో నిర్వహించిన మహానాడులో రజనీ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గాంధీయ మక్కల్ ఇయక్కం నేత తమిళరువి మణియన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ మహానాడు కారణంగా తిరుచ్చి మొత్తం రజనీమయంగా మారింది. ఎక్కడ చూసినా రజనీ బ్యానర్లు, ప్లకార్డులు, పోస్టర్లు కనిపించాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడానికి ఇదే సరైన తరుణమని తను నమ్ముతున్నట్టు తమిళరువి మణియన్ కొద్దికాలంగా ప్రకటిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. రజనీ అభిమానుల్లో అధికశాతం మంది కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. దీనినే ప్రజల్లోకి కూడా తీసుకెళ్లేందుకు, రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకతపై, ఒకవేళ వస్తే రాష్ట్రంలో చోటుచేసుకోబోయే మార్పుల గురించి వివరించడమే లక్ష్యంగా ఈ మహానాడు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వేలాదిగా రజనీకాంత్ అభిమానులు తలరివచ్చారు. రజనీ ఫోటోలున్న జెండాలు చేతబూని ద్విచక్ర వాహనాలు, కార్లు, వ్యాన్‌లతో ర్యాలీగా తిరుచ్చికి పోటెత్తారు. ఆ సందర్భంగా తమిళరువి మణియన్ వేదికపై ప్రసంగిస్తూ... రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఖాయమని, ఆయన సీఎం పీఠంపై కూర్చోబెడదామని పిలుపునిచ్చారు. దాంతో ఒక్కసారిగా మహానాడు ప్రాంగణం దద్ధరిల్లిపోయింది. తలైవర్ సీఎం.. తలైవర్ సీఎం అంటూ నినాదాలు మిన్నంటాయి. అనంతరం తమిళరువి మణియన్ ప్రసంగిస్తూ... ‘50 ఏళ్లుగా వంతులవారీగా రాష్ట్రాన్ని పాలిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే పాలనతో విసుగు చెందిన ప్రజలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారు. అది రజనీ వల్లే సాధ్యమవుతుంది. ఒకసారి రజనీని ఇంట్లో కలిసినప్పుడు.. దేవుడు శాసిస్తే నేను రాజకీయాల్లోకి రావడం తథ్యమని చెప్పారు. ఆ రోజు దగ్గరపడింది. సెయింట్ జార్జి కోటలో రజనీని సీఎంగా కూర్చోబెట్టడమే గాంధీయ మక్కల్ ఇయక్కం ప్రధానం లక్ష్యం. ఇది నెరవేరాలంటే అభిమానులు సైనికుల్లా పనిచేయాలి. ద్రావిడ పార్టీలు 50ఏళ్లు అధికారంలో కూర్చుని అవినీతి పాలన చేస్తున్నాయి. అందువల్లే ఫోటోసెషన్ కార్యక్రమంలో ‘సిస్టమ్ బాలేద’ని రజనీకాంత్ వ్యాఖ్యానించారు. రజనీ రాజకీయాల్లోకి వస్తే ఎవరితో జత కట్టే అవకాశం లేదు. ఆయన సొంత పార్టీతో వచ్చి పీఠమెక్కుతున్నారు. ప్రస్తుతం ఆయనకు 25 శాతం ఓటు బ్యాంకు ఉందని ఓ సర్వేలో తెలిసింది. రాజకీయాల్లోకి వస్తే అది 40 శాతం పెరుగుతుంది. ఎన్నికలొస్తే డీఎంకే, అన్నాడీఎంకేలకు డిపాజిట్లు కూడా దక్కవు. అవినీతి గురించి స్టాలిన్ మాట్లాడ్డం హాస్యాస్పదంగా ఉంది. దేశంలోనే అతపెద్ద అవినీతి కుంభకోణం 2జీకి కారణం ఎవరో ప్రజలందరికీ తెలుసు. 2007లో డీఎంకే ప్రభుత్వ హయాంలో ఐలాండ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మన్మోహన్‌సింగ్ దక్షిణాది నదులను అనుసంధానం చేసేందుకు కేంద్రంగా సిద్ధంగా ఉందని, దీనికి ముఖ్యమంత్రి హోదాలో కరుణానిధి చర్యలు తీసుకోవాలని వేదికపై ప్రకటించారు. ఆ తరువాత రెండుసార్లు సీఎంగా వ్యవహరించిన కరుణానిధి నిర్లక్ష్యం చూపడం వల్లే డెల్టా రైతులు సాగు నీటి కోసం అలాడుతున్నారు. అధికారంలో లేకపోయినా కేవలం రైతుల సంక్షేమం కోరుతూ నగదు అనుసంధానం కోసం రజనీ ముందుకొచ్చారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రజనీకాంత్ రాష్ట్రాల్లోకి వస్తే ప్రజలకి మంచి జరుగుతుంది’ అని పేర్కొన్నారు. | nation |
3,954 | 09-07-2017 23:00:45 | తాకాలని |
ఈ నగరం తాకని, ఏ వెన్నెల వానో కురిసే రాత్రిలో తడిచే పూలనుసున్నితంగా పరికించినట్టు, నీ చేతివేళ్లనితాకాలని అనుకుంటాను - అవేనిద్దురలో ఒక పక్కకి ఒత్తిగిల్లి, నాకు తెలియని భాషలో కలవరించే నీ చేతివేళ్లు - అద్దంపై పొగమంచుని తుడిచి ముఖాన్ని చూసుకున్నట్టుఅప్పుడొకగగుర్పాటు. ఉదయమంతా పొగచూరి మసిబారి ఇప్పుడిక ముడుతలు పడివెక్కి వెక్కి ఏడ్చి నిదురలోకి జారిన, పసిపాపల వంటి నీచేతివేళ్లు - చీపుర్లు అయిన చేతివేళ్లు. వంట గిన్నెలయ్యిన చేతివేళ్ళు. దుస్తులయ్యిన చేతివేళ్లు.సబ్బూ, రుబ్బురోలు పొత్రమూ, గదులూ మలమూ మూత్రమూ ఏర్పరిచినపసుపుపచ్చమరకలనూశుభ్రం చేసేశ్రమా అయిన చేతివేళ్ళు. నువ్వు కక్కుకున్నప్పుడు మట్టికుండై నిన్ను నింపుకున్నచేతివేళ్లు. అన్నం పెట్టే చేతివేళ్లు. నీకు నీళ్ళు తాపించే చేతివేళ్లుఅప్పుడప్పుడూతలుపుచాటునకండ్లల్లో నీళ్ళు కుక్కుకునే చేతివేళ్లు. అప్పుడప్పుడూ మూగవోయె చేతివేళ్లు. నుదురునిఅరచేతిలోకి వంపుకుని రాత్రంతా కూర్చునే చేతివేళ్లునిన్ను శపించలేని చేతివేళ్లునిన్ను దీవించే చేతివేళ్లు -నిన్ను ప్రేమించీ ప్రేమించీ గరకుగా మారి, ఇప్పుడిక ఒక కలత నిద్రలోపెరడులో ఆరవేసిన దుస్తులు రెపరెపా కొట్టుకుని, ఒక ముళ్ళతీగకు చుట్టుకునిఆగిపోయినట్టున్న, నీ చేతివేళ్లు - తిరిగి గాలికి కదిలితను కొద్దికొద్దిగా చిరుగుతూ, ముల్లుతో ఉండ లేకా, పూర్తిగా వొదిలి వెళ్లిపోలేకామరింతగా చీలిపోయే నీ చేతివేళ్లుచీకట్లో దీపాన్ని వెలిగించే చేతివేళ్లు - అదే దీపాన్ని ఆర్పుతూ మరెవరివో చేతివేళ్లు. ఇక మరి ఎక్కడిదో ఒక గాలి ఇక్కడవీచీ వీచీ, ఇక వీయలేక వెళ్ళిపోతేకాలం స్థంబించిన ఆ క్షణానఈ నగరం తాకిన, ఏ వానా కురియని రాత్రిలో సొమ్మసిల్లిన నీవంటి, అమ్మవంటినీ చేతివేళ్లని తాకాలని అనుకుంటాను. తాకుతాను - ఇంత ఎరుకతోనిన్ను తాకాకతాకడమంటే, తాను ఇతరమవ్వడం అని తెలిసాక, తాకడమే శోక నివారణ అని తెలిసాకఇక మునుపటిలా, నేను, నేనులాఎలా ఉండగలను? శ్రీకాంత్98486 66846 | editorial |
8,574 | 16-05-2017 23:57:34 | సినీ దర్శకుడి ప్రేమకథ |
అశోక్, ఈషా జంటగా నటిస్తున్న చిత్రం ‘దర్శకుడు’. హరిప్రసాద్ జక్క దర్శకుడు. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై సుకుమార్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశలో ఉన్నాయి. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఓ సినీ దర్శకుడి ప్రేమకథ ఇది. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. కథలో మలుపులు ఆసక్తిని రేకెత్తిస్తాయి’’ అని అన్నారు. ‘‘ఇటీవల బ్యాంకాక్‌లో తెరకెక్కించిన పాటతో షూటింగ్ పూర్తయింది. ఈ నెల 22న స్టార్‌హీరో చేతులమీదుగా టీజర్‌ని ఆవిష్కరిస్తాం. ఈ నెలాఖరులో పాటల్ని, వచ్చే నెల 9న సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాణంలో సుకుమార్‌తో భాగస్వాములైన విజయ్‌కుమార్, థామ్‌సరెడ్డి, రవిచంద్ర తెలిపారు. | entertainment |
2,786 | 09-06-2017 00:57:53 | తెలుగు రాష్ర్టాలు భేష్ | సులభతర వ్యాపార విధానాలకు అసోచామ్ ప్రశంసహైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): కంపెనీలు తమ వ్యాపారాన్ని సులభతరంగా నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ఆదర్శనీయంగా ఉన్నాయని, ఇలాంటి విధానాలనే కేంద్రం, ఇతర రాష్రాలు అనుసరించడం వల్ల ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి అవకాశం ఉంటుందని అసోచామ్ ప్రెసిడెంట్ సందీప్ జజోడియా అన్నారు. పారిశ్రామికవేత్తలు, ఎంటర్‌ప్రెన్యూర్లు నిర్ణీత కాలపరిమితిలోపు అనుమతులు పొందే హక్కును ఈ రాష్ర్టాలు కల్పిస్తున్నాయని, అనుమతులు ఇవ్వడంలో అధికారులు జాప్యం చేస్తే జరిమానాలను కూడా విధిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆన్‌లైన్ ద్వారా రిటర్నుల ఫైలింగ్, పన్నుల చెల్లింపులు, రిఫండ్స్‌ను పొందడం వంటివి ఈ రాష్ర్టాలు తీసుకున్న విప్లవాత్మక చర్యలని ఆయన పేర్కొన్నారు. సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించడంలో ఈ రెండు రాష్ర్టాలు కూడా పోటీపడుతున్నాయన్నారు. గురువారంనాడిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో అసోచామ్ నేషనల్ సెక్రటరీ జనరల్ డిఎస్ రావత్, అసోచామ్ తెలంగాణ డెవల్‌పమెంట్ కౌన్సిల్ చైర్మన్ శ్రీకాంత్ బాడిగ తో కలిసి సందీప్ మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా సులభతర వ్యాపార నిర్వహణ సూచీలో భారత్ చాలా వెనుకబడి ఉందని, మెరుగైన ర్యాంకింగ్ సాధించేందుకు మరిన్ని నూతన విధానాలను అనుసరించాలన్నారు. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి నూతన విధానాల వల్ల పాలనాపరమైన ప్రక్రియలు సులభతరమైనట్టు ఆయన చెప్పారు. మరిన్ని సంస్కరణలు చేపడితే కంపెనీల పోటీతత్వం పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. | business |
11,545 | 19-02-2017 03:27:08 | పళనిదే విజయం | చెన్నై, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): సంచలనాలు లేవు! అనూహ్య పరిణామాలూ చోటు చేసుకోలేదు! చివరి క్షణంలో ఏదైనా జరగొచ్చన్న ఓపీఎస్ ఆశలు నెరవేరలేదు! 122మంది ఎమ్మెల్యేల మద్దతుతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. డీఎంకే సభ్యుల సస్పెన్షన్.. డివిజన్ పద్ధతిలోనే ఓటింగ్.. వెరసి పళనిస్వామి ప్రభుత్వం నాటకీయ ఫక్కీలో మెజారిటీ నిరూపించుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి ప్రభుత్వం బలనిరూపణలో గట్టెక్కింది. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో డీఎంకే సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. స్పీకర్ చర్యను నిరసిస్తూ కాంగ్రెస్, ఐఎంయూఎల్ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనకుండా వాకౌట్ చేశారు. దీంతో విపక్షం లేకుండానే పళనిస్వామి ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకుంది. ఉదయం నుంచి జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో సాయంత్రం 3 గంటల అనంతరం ఓటింగ్ జరిగింది. సభలోని వారు బయటకు వెళ్లకుండా, బయటి వారు సభలోకి రాకుండా తలుపులు మొత్తం మూసేయాలని స్పీకర్ ధనపాల్ ఆదేశించారు. రహస్య ఓటింగ్‌కు విపక్షాలు పట్టుబట్టినప్పటికీ స్పీకర్ డివిజన్ ఓటింగ్‌కు అనుమతించారు. మొత్తం ఆరు డివిజన్లు ఉన్న అసెంబ్లీలో ఒక్కో డివిజన వారీగా ఎమ్మెల్యేలను లెక్కించగా, ఎడప్పాడి విశ్వాస పరీక్షకు మద్దతుగా 122 మంది, వ్యతిరేకంగా 11 మంది(సెల్వం వర్గీయులు) ఓటు వేశారు. అయితే 88 మంది ఎమ్మెల్యేలున్న డీఎంకే సభ్యులను అప్పటికే మార్షల్స్ గెంటివేయడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్, ఐయూఎంఎల్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఒకవేళ ప్రతిపక్ష సభ్యులున్నా అధికార పక్ష మెజారిటీ వచ్చిన ఢోకా ఏమీ లేదని స్పీకర్ ధనపాల్ పేర్కొన్నారు. | nation |
21,444 | 29-12-2017 03:43:36 | పైరవీల గేమ్స్ | కార్యదర్శి, అబ్జర్వర్ పదవులకు ముడుపులురాజకీయ నాయకులతో ఒత్తిళ్లురెండు వర్గాలుగా విడిపోయిన పీఈటీలుస్కూల్ గేమ్స్ సమాఖ్యలో వర్గపోరుహైదరాబాద్(ఆంధ్రజ్యోతి క్రీడా ప్రతినిధి): పాఠశాల విద్యార్థులను ఆటలాడించడం వారి విధి. టోర్నీలు నిర్వహించి జిల్లా, రాష్ట్ర స్థాయి జట్లను ఎంపిక చేయడం వారి కర్తవ్యం. ప్రతిభావంతుల వెన్నుతట్టి మరింత ముందుకెళ్లేలా ప్రోత్సహించడం వారి బాధ్యత. కానీ, వాళ్లు చేసేది పదవుల కోసం పైరవీలు. ఇచ్చేది ముడుపులు.. పుచ్చుకునేది లంచాలు. తెలుగు రాష్ట్రాల వ్యాయామ ఉపాధ్యాయుల్లో ఒక వర్గం పదవుల కోసం రాజకీయ నాయకులను మించిన రాజకీయం చేస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. కాసులు కురిపించే స్కూల్ గేమ్స్‌లో జిల్లా కార్యదర్శులు, పరిశీలకుల పదవుల కోసం పెద్ద స్థాయిలో పైరవీలు చేస్తున్నారని పలువురు వ్యాయామ ఉపాధ్యాయులే చెబుతున్నారు. దాంతో, స్కూల్ గేమ్స్ సమాఖ్యలో అవినీతి ఏ స్థాయికి చేరుకుందో చెప్పొచ్చు. ఆర్జన మీదే ధ్యాసంతా..ఒక విద్యార్థిని జాతీయ స్థాయి పోటీల్లో రాణించేలా తీర్చిదిద్దితే పేరు సంపాదించొచ్చు. కానీ, ఆ పేరు ఎవరికి కావాలి. అవకాశం ఉన్నప్పుడు నాలుగు రాళ్లు వెనకేసుకుంటే పోలా అన్నది తెలుగు రాష్ట్రాల్లో కొందరు వ్యాయామో పాధ్యాయుల ఆలోచన. స్కూల్ గేమ్స్ నిర్వహణలో జిల్లాల కార్యదర్శులు (అండర్ 14, 17కు ఒకరు, అండర్-19కు మరొకరు), పర్యవేక్షకులదే కీలక పాత్ర. అందుకే ఈ పదవుల కోసం విపరీతమైన పోటీ ఉంటుంది. ముఖ్యంగా జిల్లా కార్యదర్శుల నియామకం కోసం పెద్ద స్థాయిలో పైరవీలు.. అంతే మొత్తంలో డబ్బులు చేతులు మారుతాయన్న ఆరోపణలు ఉన్నాయి. అ పదవులకు అర్హులు వ్యాయమ ఉపాధ్యాయులే. అనుభవం, అంకిత భావం ఉన్న వారికి అవకాశం ఇవ్వాలి. కానీ, తాము ఆ పదవుల్లో ఉంటే విచ్చలవిడిగా దండుకోవచ్చని కొంత మంది ఒక వర్గంగా ఏర్పడ్డారని సమాచారం. పరిశీలకులుగా ఎవరు రావాలి, సెలెక్షన్ కమిటీలో ఎవరుండాలి, టోర్నీల కేటాయింపు ఎలా జరగాలి.. ఇలా అంతా ఆ వర్గం కనుసన్నుల్లోనే జరుగుతోందట. దాంతో, నిజాయితీగా పని చేసే ఉపాధ్యాయులు.. వారి విద్యార్థులు తీవ్రంగా నష్టంగా పోతున్నారన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. గతంలో జిల్లా కార్యదర్శుల నియామకం కోసం ఎన్నికలు జరిగేవి. ఆ తర్వాత జిల్లా డీఈవోకు కార్యదర్శిని నామినేట్ చేసే బాధ్యత అప్పగించారు. అప్పుడు డీఈవోలకు లంచాలు ఇచ్చి ఆ పోస్టులు తెచ్చుకునే వారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీన్ని అడ్డుకునేందుకు నిబంధనలు మార్చారు. తెలంగాణలో ఈ ఏడాది నుంచి ఇప్పటికే కార్యదర్శులుగా పని చేసిన వాళ్లు ఎవరూ మళ్లీ బాధ్యతలు స్వీకరించకూడదన్న షరతు పెట్టారు. అనుభవం ఉన్న కొత్త వాళ్లను డీఈవోలు నియమించాలని స్పష్టం చేశారు. దాంతో, ఇప్పుడు రాజకీయ నాయకుల పంచన చేరి ఒత్తిళ్లు చేయడం మొదలెట్టారట. తమకంటే అనుభవం ఉన్న వాళ్లను భయపెట్టి పక్కకు తప్పించి పదవి పొందే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని దక్షిణ తెలంగాణకు చెందిన ఓ పీడీ చెప్పా రు. సీనియర్ అయిన తాను జిల్లా కార్యదర్శి కావాల్సి ఉన్నా.. రాజకీయ నాయకులతో తీవ్రంగా ఒత్తిడి తెచ్చి తప్పుకునేలా చేశారని ఆయన వాపోయారు. ‘కార్యదర్శి పదవి కోసం తన్నుకున్న రోజులున్నాయి. ఎన్నికలు ఉన్నప్పుడు ఆ సమయంలో మందు పార్టీలు ఇచ్చేవారు. కిట్‌లు పంపిణీ చేసి ప్రలోభ పెట్టేవారు. లక్షల్లో ఖర్చు చేసేవారు. ఇప్పుడు రాజకీయ నాయకు లతో బెదిరిస్తున్నార’ని తెలిపారు. నిజాయితీకి బహుమతిగా వేధింపులు.. స్కూల్ గేమ్స్‌లో అందరూ అక్రమార్కులే అనలేం. కొందరు నిజాయితీపరులు కూడా ఉన్నారు. విద్యార్థులను చక్కగా ఆడించి.. పక్కాగా టోర్నీలు నిర్వహిస్తున్నవారిని అభినందిం చాల్సిందే. అయితే, వారి నిజాయితీకి బహుమానంగా వేధింపులు ఎదురవుతున్నాయి. నిర్వహణ డబ్బు ముందుగా ఇవ్వకుండా.. బిల్లులు విడుదల చేయకుండా జాప్యం చేస్తూ పెద్దలు, అధికారులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా జిల్లా స్థాయి టోర్నీల్లో ఇలాంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. ఉదాహరణకు జిల్లా స్థాయి టోర్నీ లేదా రాష్ట్ర సెలెక్షన్ ట్రయల్స్ ఒక జిల్లా కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగితే దానికయ్యే మొత్తం ఖర్చును అతనే ముందుగా భరించాల్సి ఉంటుంది. అయిన మొత్తానికి తర్వాత బిల్లు పెడితే.. అది విడుదలవడానికి ఎన్ని రోజులు.. నెలలు పడుతుందో తెలియని పరిస్థితి. జిల్లా స్కూల్ గేమ్స్‌కు అధ్యక్షుడిగా ఉండే డీఈవో సంతకం పెడితేనే నిధులు విడుదలవుతాయి. దాంతో, విద్యాధికారుల చేతులు కూడా తడపాల్సి వస్తోందని పలువురు చెబుతున్నారు. అలాగే.. ఒక క్రీడలో జాతీయ టోర్న మెంట్‌కు ఎంపికైన జట్టును ఆ టోర్నీలో ఆడించి తిరిగి తీసుకొచ్చేంత వరకూ వారి ప్రయాణ, ట్రాక్‌లు, పరికరాలు ఖర్చులు, డీ.ఏ మొత్తం కలిపి కనీసం రెండు లక్షలు అవుతున్నాయి. ఇంత ఖర్చు పెడితే.. అవి తిరిగొచ్చేదెప్పుడో తెలియదు. ఉమ్మడి రాష్ట్రంలో జాతీయ స్థాయి టోర్నమెంట్‌లకు ఎంపికైన విద్యార్థులకు పాఠశాల విద్యా సమాఖ్య.. ట్రాక్ సూట్లు సహా వారికి కావాల్సిన పరికరాలు, టీఏ, డీఏ మొత్తం ముందుగానే విడుదల చేసేది. కానీ, ఇప్పుడు నిబంధనలు మార్చడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తోందని వ్యాయామోధ్యాయులు వాపోతున్నారు. అంతా మీ వాళ్లేనా..స్కూల్ గేమ్స్‌లో నిర్వాహకులు చేసే మాయలు అన్నీ ఇన్నీ కావు. ఒక స్కూల్ పీఈటీ కష్టపడి ఐదారుగురు విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్ది సెలెక్షన్స్‌కు తీసుకువస్తే.. వారంతా విశేష ప్రతిభ చూపినా కూడా ఒకరిద్దరికే అవకాశం ఇస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే అంతా ఒక్క స్కూల్‌కు చెందిన వారినే జట్టులోకి తీసుకుం టే తమ పరిస్థితి ఏమిటని నిర్వాహకులు అంటున్నారని ఓ వ్యాయామోపాధ్యాయుడు వాపోయాడు. దాని వల్ల ప్రతిభ ఉన్న విద్యార్థిని పక్కన బెట్టి తమ వాళ్లను ఎంపిక చేసుకుంటున్నారని చెప్పారు. | sports |
9,783 | 12-04-2017 12:03:52 | దీపికకు పెళ్లై.. పిల్లలు కూడా ఉన్నారట! | మామూలు హీరోయిన్ ఈ మాట చెబితే సీరియస్‌గా తీసుకోరేమో కానీ, దీపికా పదుకొనె నోటి నుంచి వచ్చిన ఈ మాటలు పెద్ద సంచలనాన్నే రేపాయి. చాలా మంది పిల్లల్ని కనాలన్నది దీపికా కోరికట! అది కూడా హాలీవుడ్ నటుడు విన్ డిసెల్ పెళ్ళి చేసుకున్నట్టు, పిల్లల్ని కంటున్నట్టు కలలు వస్తున్నాయట! ఈ మాటలు విని రణవీర్‌తో పాటు ఆమె అభిమానులు కూడా తెగ కంగారు పడుతున్నారట! రణవీర్ పెళ్ళి మాటెత్తితే కెరీర్ అంటూ అతగాడి నోరు నొక్కేసే దీపికా ఇప్పుడు హాలీవుడ్ నటుడిని పెళ్ళి చేసుకుంటున్నట్టు ఎలా కల కంటోంది? అంటున్నారు బాలీవుడ్ జనాలు దీపికా హాలీవుడ్‌కి వెళ్ళిన తరువాత చాలా మారిపోయిందనీ, అందుకే రణవీర్‌ని దూరంగా పెడుతోందనీ అంటున్నారు. ఇటీవలి కాలంలో ఇద్దరూ ఎడమొఖం పెడమొఖంగా ఉంటున్నారు. దీనికి కారణం ఇద్దరూ కలిసి నటిస్తున్న ‘పద్మావతి’ మీద హైప్ పెంచడానికే అంటూ బయటకు చెబుతున్నా, రణవీర్ అంటే మొహం మొత్తడం వల్లనే అతగాడిని దూరంగా నెట్టేస్తోందని అంటున్నారు | entertainment |
18,200 | 13-04-2017 02:49:43 | ముగ్గురు ఉగ్రవాదులకు యావజ్జీవ శిక్ష |
బెంగళూరు, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ టెర్రర్ అమలులో పట్టుబడి జైలులో విచారణ ఖైదీలుగా ఉన్న ముగ్గురు ఉగ్రవాదులకు కర్ణాటక మంగళూరు 3వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి పుష్పాంజలి బుధవారం తీర్పునిచ్చారు. ఎనిమిదేళ్ల కిందట ఆపరేషన్ టెర్రర్ అమలులో ఏడుగురిని అదుపులోకి తీసుకోగా, వారిలో ముగ్గురి నేరం రుజువైంది. దీంతో వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించగా, మిగిలిన నలుగురిపై ఆధారాలు లేకపోవడంతో విడుదల చేశారు. పాండేశ్వరనగర్‌కు చెందిన సయ్యద్ మహమ్మద్ నౌషాద్ (25), హళేయంగడి ఇందిరానగర్ నివాసి అహ్మద్ బావా అబూబక్కర్ (33), పడుబద్రి ఉచ్చిలద పకీర్ అహ్మద్ బావా(46)కు యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేశారు. ఆపరేషన్ టెర్రర్‌లో నాడు మొత్తం 13మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. | nation |
19,558 | 25-04-2017 02:25:08 | పాకిస్థాన్ 322/5 |
వెస్టిండీస్‌తో తొలి టెస్ట్ కింగ్‌స్టన్: వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌లో పర్యాటక పాకిస్థాన్ భారీ ఆధ్యిం దిశగా సాగుతోంది. ఓవ ర్ నైట్ స్కోరు 201/4తో నాలుగో రోజు ఆటను ఆరంభించిన పాకిస్థాన్.. సోమువారం లంచ్ సముయానికి తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసి. కెపె్ మి్బా ఉల్ హక్ (47 బ్యాటింగ్), సర్ఫ్‌రాజ్ అహ్మద్ (53 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. వెసి్టండీస్‌ొలి ఇన్నింగ్స్‌లో 286 రన్స్ చేసిది. కాగా, ముూడో రోజు ఆటలో యుూనిస్‌ఖాన్ (58) పదివేల పరుగుల మెుౖలురాయిుని చేరుకున్న తొలి పాకిస్థానీ క్రికెటర్‌గా చరిత్ర సృషిచాడు. మొుుత్తంగా10వేల పరుగుల క్లబ్‌లో చోటు దక్కించుకున్న 13వ ఆటగాడు. | sports |
12,335 | 21-11-2017 15:42:29 | రాష్ట్రమాతగా పద్మావతి... భారీ స్మారకమందిరానికి ఏర్పాట్లు! | న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ప్రతిష్టాత్మంగా తెరకెక్కించిన ‘పద్మావతి’ చిత్రంపై రగులుకున్న రాజకీయ రగడ ఇప్పట్లో చల్లారేలా లేదు. సందట్లో సడేమియాగా ఈ వివాదం నుంచి లబ్ది పొందేందుకు రాజకీయ పార్టీలు.. ప్రత్యేకించి బీజేపీ ఉవ్విళ్లూరుతున్నట్టు కనిపిస్తోంది. భోపాల్‌లో మహారాణి పద్మావతికి స్మారకమందిరం నిర్మిస్తామని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ ప్రకటించారు. రాణి పద్మావతిని రాష్ట్రమాతగా పేర్కొన్న ఆయన... రాణి పేరుమీదుగా ఓ అవార్డు కూడా ప్రారంభించాలని నిర్ణయించారు. మహిళల అభివృద్ధి కోసం కృషిచేసేవారికి ‘‘రాష్ట్రమాత పద్మావతి పురస్కార్’’తో సత్కరిస్తామని ఆయన ప్రకటించారు. రాజ్‌పుత్ వర్గీయుల మనోభావాలను గాయపర్చే సన్నివేశాలను తొలగించకపోతే.. తమ రాష్ట్రంలో పద్మవతి సినిమాను విడుదల కానివ్వబోమని మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. మరుసటిరోజే ఈ అంశంపై ఈ బీజేపీ నేత మరింత దూకుడు ప్రదర్శించడం విశేషం. ముఖ్యమంత్రికి సూటి ప్రశ్న వేసిన స్టార్ హీరో భర్త రితేష్‌తో జెనీలియా పెళ్లికి ముందే చేసిందట! | nation |
21,292 | 14-02-2017 00:57:52 | సైనా, సింధు దూరం |
ఆసియా మిక్స్‌డ్ టోర్నీ హోచిమిన్ (వియత్నాం): ఆరంభ ఆసియా మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్ నుంచి సైనా నెహ్వాల్, పీవీ సింధు తప్పుకున్నారు. బిజీ అంతర్జాతీయ షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకుని సైనా, సింధు ఈ టోర్నీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. మహిళల సింగిల్స్‌లో తన్వీ లాడ్, రితుపర్ణా దాస్ ప్రాతినిధ్యం వహించనున్నారు. మంగళవారం ప్రారంభం కానున్న ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్, సమీర్ వర్మ, మిక్స్‌డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి-ప్రణయ్ జోడీ, పురుషుల డబుల్స్‌లో సుమిత రెడ్డి-మను అత్రి, మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి ద్వయం తలపడనున్నారు. | sports |
8,039 | 02-08-2017 11:41:50 | ఇంకెంత కాలమో నాకు తెలియదు: రకుల్ | పాత తరం హీరోయిన్లలాగా కొత్త హీరోయిన్లు ఎవరూ సంవత్సరాల తరబడి సినిమాలు చేయడంలేదు. పదుల సంఖ్యలో సినిమాలు చేసి ఐదారు సంవత్సరాలకే తెరమరుగవుతున్నారు. వారికి భిన్నంగా రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికీ చేతినిండా సినిమాలతో మరో రెండు మూడు సంవత్సరాల వరకూ బిజీగానే ఉంది. దీనికి కారణం కూడా చెప్పింది రకూల్. ఇక్కడ ఎక్కువ కాలం కొనసాగాలంటే ప్రేక్షకుల ఆదరణ తప్పనిసరి అన్నది అందరికీ తెలిసిందే! తనకి ఆ ఆదరణ పుష్కలంగా ఉన్నందువల్లే సినిమాలు చేయగలుగుతోందట! అయితే ఈ ఆదరణ ఎంత కాలం ఉంటుందో తనకు తెలియదని అంటోంది రకుల్. | entertainment |
18,473 | 04-10-2017 04:44:15 | గృహ కొనుగోలుదారులకు అండగా సుప్రీం | న్యూఢిల్లీ: బిల్డర్ల నుంచి సమస్యలు ఎదుర్కొంటున్న ఇళ్ల కొనుగోలుదారులకు అనుకూలంగా సుప్రీంకోర్టు స్పందించింది. పైకం చెల్లించిన తర్వాత కూడా అటు ఇల్లు లేదా ఫ్లాట్ చేతికి రాకుండా, కట్టిన డబ్బు రిఫండ్ రాకుండా కష్టాల్లో ఉన్న కొనుగోలుదారులను ఆదుకుంటామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక కేసు విచారణ సందర్భంగా సీజే జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది. నోయిడాలోని జైపీ విష్ టౌన్ ప్రాజెక్టులో ఇళ్లు కొన్న 40 మంది దాఖలు చేసిన వ్యాజ్యంపై ధర్మాసనం విచారణ చేపట్టింది. నిరుడు అమల్లోకి వచ్చిన దివాలా చట్టంలోని కొన్ని నిబంధనలను ఇళ్ల కొనుగోలుదారులు కోర్టులో సవాలు చేశారు. దీనిలో లిటిగేషన్ జోలికి తాము వెళ్లబోమని, గృహ కొనుగోలుదారులకు సాయం చేయడానికే పరిమితమవుతామని ధర్మాసనం పేర్కొంది. ఈ వ్యవహారంలో బిల్డర్ కొనుగోలుదారులకు ఇళ్లు స్వాధీనం చేయాలని, లేకపోతే వారు చెల్లించిన డబ్బు రిఫండ్ చేయాలని తాము కోరుకుంటున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. | nation |
5,481 | 04-05-2017 12:49:20 | బాహుబలి2 సినిమాకు వెళ్లిన సమంత.. 20 నిమిషాల్లోనే బయటికి.. | బాహుబలి2 సినిమాను సినీ ప్రముఖులు ఆకాశానికెత్తేస్తున్నారు. కలెక్షన్ల విషయంలో కూడా ఈ సినిమా సత్తా చాటుతోంది. దీంతో దర్శకనిర్మాతలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే ఈ సినిమాకు విడుదల రోజు 40 మంది చిన్నారులతో కలిసి నూన్ షోకు వెళ్లిన సమంతకు చేదు అనుభవం ఎదురైంది. హైద్రాబాద్‌లోని ఓ థియేటర్‌కు చిన్నారులతో కలిసి బాహుబలి2 సినిమాకు సమంత వెళ్లింది. ఆ తర్వాత ఆమె సినిమాను అభినందిస్తూ ట్వీట్ కూడా చేసింది. కానీ ఆమె సినిమా ఆసాంతం చూడనేలేదట. సమంత వెళ్లిన థియేటర్‌లో ఏసీ పనిచేయలేదట. సినిమా ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే ఏసీ ట్రబుల్ ఇచ్చిందట. ఎంతైనా హీరోయిన్ కదా... ఉక్కపోత తట్టుకోలేక 20 నిమిషాల్లోనే బయటికొచ్చేసినట్లు తెలిసింది. చిన్నారులు మాత్రం ఆ ఉక్కపోతలోనే సినిమాను వీక్షించారని సమాచారం. సినిమా ప్రమోషన్‌లో ఉన్న బాహుబలి2 టీంకు, ఈ విషయం బయటికి పొక్కేసరికి కొంత ఇబ్బందిగా ఉందట. థియేటర్ యాజమాన్యం కలిగిన అసౌకర్యానికి సమంతకు క్షమాపణలు కూడా చెప్పినట్లు తెలిసింది. | entertainment |
18,417 | 20-08-2017 03:49:27 | కేన్సర్‌పై బ్రహ్మాస్త్రం | నెలాఖరుకల్లా ఇమ్యూనో థెరపీకి ఎఫ్‌డీఐ అనుమతి?ఈ ఏడాది చివరకు అమెరికాలో అందుబాటులోకిమానవాళికి అంతుచిక్కని మహమ్మారి కేన్సర్ పని పట్టే సరికొత్త చికిత్స ఇమ్యూనో థెరపీ.. అమెరికాలో అందుబాటులోకి రాబోతోంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివరకు అమెరికాలోని 35 కేన్సర్ సెంటర్లలో ఈ చికిత్సను ప్రవేశపెట్టడానికి ప్రముఖ మందుల కంపెనీ నోవార్టిస్ సన్నాహాలు చేస్తోంది. ఒకసారి వస్తే అదుపుచేయడం చాలా కష్టమైన లింఫోబ్లాస్టిక్ లుకేమియాను సైతం నియంత్రించే శక్తి ఈ ఇమ్యూనో థెరపీకి ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇమ్యూనో థెరపీ ప్రయోగాల్లో భాగంగా లింఫోబ్లాస్టిక్ లుకేమియా కేన్సర్ పేషెంట్లపై చేసిన ప్రయోగాలన్నీ విజయవంతమయ్యాయని, కేన్సర్‌పై ఇది బ్రహ్మాస్త్రంలా పనిచేస్తోందని దీని రూపకర్తలు పేర్కొంటున్నారు. ఈ థెరపీని పరిశీలించడానికి అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఒక ప్యానల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్యానల్ ఈ నెలాఖరుకు తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. కొన్ని రకాల కేన్సర్ కేసుల్లో ఇమ్యూనో థెరపీ ఉపయోగించడానికి ఆ ప్యానెల్ అనుమతిస్తుందని భావిస్తున్నారు. ఇదీ నేపథ్యంపెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ సెల్యులర్ ఇమ్యూనోథెరపీ డైరక్టర్ డాక్టర్ కార్ల్ జూన్ భార్య, కుమారుడు కేన్సర్‌తో మరణించారు. దీనితో ఆయన కేన్సర్ పనిపట్టే ఔషధం కోసం ప్రయోగాలు ప్రారంభించి మూడు దశాబ్దాల పరిశోధన అనంతరం ఇమ్యూనో థెరపీకి రూపమిచ్చారు. అదెలా పనిచేస్తుందంటే.. రక్త కేన్సర్ కణాల్లో సీడీ19 అనే ఒక ప్రొటీన్ ఉంటుంది. ఈ ప్రొటీన్‌ను తొలగించగలిగితే కేన్సర్ కణాలు బతకవు. అయితే ఈ ప్రొటీన్‌పై దాడి చేయాలంటే మామూలు మందులు, కీమోథెరపీలు పనికిరావు. కణస్థాయిలోనే దాడులు జరగాలి. అందుకోసం జూన్.. రోగ నిరోధక శక్తిని ఇచ్చే కణాల జన్యువుల్లో మార్పులు చేశారు. తద్వారా ఆ కణాల్లో తయారయ్యే ఒక ప్రొటీన్- సీడీ19ని అతుక్కొని దానిని నిర్వీర్యం చేస్తుంది. ఈ లోపులో మిగిలిన రోగ నిరోధక కణాలు కేన్సర్ కణంపై దాడి చేసి దానిని చంపేస్తాయి. కేన్సర్ కణాలపై దాడి చేసే కణాలను శరీరం తయారుచేసుకోలేదు కాబట్టి వాటిని ల్యాబ్‌లో తయారుచేసి రక్తంలోకి ప్రవేశపెట్టారు. మొదట ఎలుకలపైనా.. ఆ తర్వాత మనుషులపైన చేసిన పరిశోధనలు విజయవంతమయ్యాయని, ఇప్పటి వరకూ అనేక మంది ఈ చికిత్స ద్వారా పునర్జీవితం పొందారని జూన్ వివరించారు. త్వరలో ఈ థెరపీకి అనుమతి లభిస్తుందనే వార్తలు రావటంతో కొన్ని వందల మంది వలంటీర్లు ఈ చికిత్స చేయించుకోవటానికి ముందుకు వస్తున్నారు. ఈ థెరపీకి ప్రస్తుతం దాదాపు కోటి రూపాయల దాకా ఖర్చు అవుతుందని ఒక అంచనా. రోగనిరోధక శక్తి కణాల తయారీ చవక అయితే ఈ థెరపీకి అయ్యే ఖర్చు తగ్గుతుందని భావిస్తున్నారు. విటమిన్-సీ ఇంజెక్షన్లతో రక్త కేన్సర్‌కు అడ్డుకట్టపారిస్, న్యూయార్క్ ఆగస్టు 19: రక్త కేన్సర్ వ్యాప్తిని నిలువరించడంలో విటమిన్-సీ ఇంజెక్షన్లు ఉపయుక్తంగా పనిచేస్తాయని, రక్త కేన్సర్ మూల కణాలను చంపేస్తుందని అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. ఎక్కువ మోతాదు ఉన్న విటమిన్-సీ ఇంజెక్షన్లతోనే ఇది సాధ్యమని, నారింజ లాంటి పండ్ల వల్ల ఉపయోగం లేదని వివరించారు. కాగా, కేన్సర్ల నివారణకు ప్రామాణిక చికిత్సలు కాకుండా ప్రత్యామ్నాయ చికిత్సలు వద్దని అమెరికాలోని యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్త స్కైలర్ జాన్సన్ హెచ్చరిస్తున్నారు.- స్పెషల్ డెస్క్ | nation |
19,192 | 11-04-2017 17:02:14 | అనంతనాగ్ ఉపఎన్నిక వాయిదాపై.. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ ఆగ్రహం | శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ ఉప ఎన్నిక వాయిదాపై ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ గత ఏడాది జూన్‌లో అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన అనంతరం ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన అనంతనాగ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి సీఎం ముఫ్తీ సోదరుడు హుసేన్ ముఫ్తీ అధికార పీపుల్స్ డెమోక్రసీ పార్టీ (పీడీపీ) తరుఫున పోటీ చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా అనంతనాగ్ నియోజకవర్గంలో హింస చెలరేగుతోంది. శనివారం పోలింగ్ బూత్ ఏర్పాటు చేసిన ఓ స్కూల్‌కు కొందరు నిప్పుపెట్టారు. అల్లర్లలో 8 మంది మృతి చెందారు. దీంతో ఈ ఉప ఎన్నికను వాయిదా వేయాలని సీఎం మెహబూబాతో పాటు ఆమె సోదరుడు డిమాండ్ చేశారు. అయితే అక్కడి పరిస్థితుల నేపథ్యంలో ఈ ఉప ఎన్నికను మే 25కు ఈసీ వాయిదా వేసింది. దీనిపై విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మంగళవారం నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ నేతలు అనంతనాగ్ డిప్యూటీ కలెక్టర్‌ను చుట్టుముట్టారు. భారత ప్రజాస్వామ్యం డౌన్ డౌన్ అంటూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. | nation |
13,464 | 10-03-2017 00:48:07 | మా కొలువులు కూల్చుతున్నారు..! | వాషింగ్టన్, మార్చి 9: ‘భారతీయులు హెచ్-1బీ వీసాలతో వచ్చి మన ఉద్యోగాలన్నీ మింగేస్తున్నారు! వీటికి కళ్లెం వేయాల్సిందే!’.... ఇదీ అమెరికా సెనెట్, ప్రతినిధుల సభల్లోని పలువురు సభ్యుల అభిప్రాయం! హెచ్-1బీ వీసాల జారీని సంస్కరించాలంటూ ఉభయ సభల్లో ఆరు బిల్లులు ప్రవేశపెట్టారు. వీరిలో అధికార రిపబ్లికన్లతోపాటు... డెమొక్రాట్లూ ఉండటం గమనార్హం. రిపబ్లికన్ సెనెటర్ చుక్ గ్రాస్‌లీ, అసిస్టెంట్ సెనేట్ మైనారిటీ లీడర్ డిక్ డర్బిన్ మొట్టమొదటిసారిగా ‘హెచ్-1బీ, ఎల్-1 వీసా సంస్కరణల చట్టం’ ప్రవేశపెట్టారు. ఉద్యోగాల్లో అమెరికన్లకే ప్రాధాన్యం ఇవ్వాలని అందులో ప్రతిపాదించారు. లాటరీ పద్ధతి మార్చి వేయాలని, అమెరికా వర్సిటీల్లో చదువుకున్న వారికే ప్రాధాన్యం ఇవ్వాలని అందులో కోరారు. అలాగే... 50 కంటే ఎక్కువ ఉద్యోగులు ఉండి, వారిలో సగం హెచ్-1బీ లేదా ఎల్-1 వీసాదారులున్న కంపెనీలు అదనంగా విదేశీయులను నియమించుకోరాదని కూడా ప్రతిపాదించారు. తాత్కాలిక శిక్షణకు హెచ్-1బీ, ఎల్-1 వీసాదారులను రప్పించే ఔట్‌సోర్సింగ్ కంపెనీలపై గట్టి చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. అంతేకాదు... ఒక అమెరికన్ ఉద్యోగిని పక్కనపెట్టి ఆ స్థానంలో విదేశీయులను ఎట్టి పరిస్థితుల్లో నియమించకూడదని స్పష్టం చేశారు. అమెరికాలో ఇటీవల చోటు చేసుకున్న కొన్ని సంఘటనలను ఉదహరిస్తూ తమ ప్రతిపాదనలను పొందుపరిచారు. ఇక... కాంగ్రె్‌సలో సిలికాన్ వ్యాలీకి (కాలిఫోర్నియా) డెమొక్రాట్ నేత జో లఫ్రోజెన్ కూడా ఓ బిల్లు పెట్టారు. హెచ్-1బీ వీసాలపై వచ్చే వారికి కనీసం వార్షిక వేతనాన్ని రెట్టింపు చేసి, 1.30 లక్షల డాలర్లకు పెంచాలని కోరింది ఆయనే. ‘హై స్కిల్డ్ ఇంటెగ్రిటీ అండ్ ఫెయిర్‌నెస్ యాక్ట్’ పేరిట ఆయన ఈ బిల్లును ప్రతిపాదించారు. ఒక్కో దేశానికి ఇన్ని చొప్పున కోటా పెట్టకుండా... ముందుగా ఎవరు కోరితే వాళ్లకు (ఫస్ట్ కమ్ ఫస్ట్) వీసాలు జారీ చేయాలని కూడా కోరారు. ఇంకా... సెనెటర్లు షెరాడ్ బ్రౌన్, జో డాన్‌లీ, క్రిస్టెన్ గిల్లిబ్రాండ్ కలిసి ‘ఔట్‌సోర్సింగ్‌కు తెర దించాలి’ అని మరో బిల్లు ప్రతిపాదించారు. అమెరికన్లకు ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకే ప్రభుత్వ పనులు అప్పగించాలన్నది ఈ బిల్లు సారాంశం. రిపబ్లికన్ పార్టీకి చెందిన టామ్ కాటన్, డేవిడ్ పర్డ్యూలు మొత్తంగా పదేళ్లపాటు ఏటా అమెరికాలోకి వలసలకు కత్తెర వేయాలంటూ బిల్లు తీసుకొచ్చారు. ఇటీవల భారత సంతతికి చెందిన కాంగ్రెస్ సభ్యుడు ఖన్నా మరో ముగ్గురితో కలిసి హెచ్-1బీ, ఎల్-1 వర్క్ వీసాల్లో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని ప్రత్యేక బిల్లు తీసుకొచ్చారు. వలసల విధానాలను సమూలంగా మార్చాలని ట్రంప్ భావిస్తున్న నేపథ్యంలో ఈ బిల్లులకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇవి వలసదారుల్లో, ముఖ్యంగా భారతీయుల్లో గుబులు రేపుతున్నాయి. మరోవైపు... హెచ్-1బీ, ఉద్యోగాలతో గ్రీన్‌కార్డు పొందడానికి సంబంధించి రిపబ్లికన్ సెనెటర్ టామ్ కాటన్ సంచలన ప్రతిపాదనలు చేశారు. హెచ్1-బీ వీసాలదారుల్లో పీహెచ్‌డీలు, కంప్యూటర్ సైంటిస్టులనే తాము కోరుకుంటున్నామని... ‘మిడిల్ లెవెల్’ ఉద్యోగులు అక్కర్లేదన్నారు. కాటన్ ఇటీవలే ట్రంప్‌ను కలిసి తన అభిప్రాయాలు పంచుకున్నారు. అమెరికాకే నష్టం: కౌశిక్ | nation |
8,643 | 03-05-2017 14:19:40 | చిరంజీవి 151వ సినిమా గురించి ఆసక్తికర వార్త! | బాహుబలితో దర్శకుడు రాజమౌళి హై స్టాండర్డ్స్ సెట్ చేశాడు. ఇకపై సినిమాల్లో గ్రాఫిక్స్ సీన్స్ ఉండాలంటే బాహుబలి స్థాయిలో ఉండాల్సిందే. లేకపోతే అవి జనాలను ఆకట్టుకోలేవు. అందుకే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిరంజీవి 151వ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టడానికి డిసైడ్ అయిపోయాడట నిర్మాత రామ్‌చరణ్. ఈ సినిమా కోసం 125 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి కూడా సిద్ధమైపోతున్నాడట. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్‌గా ఐశ్వర్యారాయ్‌ను తీసుకోవాలని చిత్ర బృందం భావిస్తోందట. అలాగే ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ భారీ సెట్‌ను నిర్మించబోతున్నారట. బ్రిటీష్ పాలకులపై ఎదురుతిరిగిన ఉయ్యలవాడ నర్సింహారెడ్డి కథతో ఈ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయిపోయాయి. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనున్నాడు. | entertainment |
9,035 | 07-01-2017 13:24:01 | రాజమౌళికి సారీ చెబుదామనుకున్నా: అర్చన | తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు పెద్దగా ప్రోత్సాహం లభించదు అనడానికి ఉదాహరణ అర్చన. ట్యాలెంట్ ఉన్నా కూడా పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయింది. దీంతో ప్రస్తుతం బాలీవుడ్‌కు మకాం మార్చింది. ‘నువ్వొస్తానంటే నేనొద్దానంటే’ సినిమా సెట్లో రోజూ ఏడ్చేదాన్నని, ఆ సినిమా చేయడం తన కెరీర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టిందని, రాజమౌళికి ఓ విషయంలో సారీ చెబుదామనుకుంటున్నాని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది అర్చన. ‘మొదటి సినిమా ‘నేను’లో హీరోయిన్ పాత్ర చేసిన తర్వాత ‘నువ్వొస్తానంటే నేనొద్దాంటానా’లో బలవంతంగా సపోర్టింగ్ రోల్ చేయవలసి వచ్చింది. కళ్లజోడు పెట్టి డీ-గ్లామర్‌గా చూపించడంతో ఆ సినిమా సెట్లో రోజూ ఏడ్చేదాన్ని. కేవలం ఆ సినిమాలో చేయడం వల్లే ఓ పెద్ద డైరెక్టర్ సినిమాలో హీరోయిన్ పాత్రను పొగొట్టుకున్నా. ‘నువ్వొస్తానంటే..’ చేయకపోయి ఉండుంటే ఈ రోజు పరిశ్రమలో నా స్థానం వేరేలా ఉండేదేమో. | entertainment |
19,667 | 15-01-2017 20:53:03 | తన అద్భుత పోరాటాన్ని ముగించిన కేదార్ జాదవ్.. | పూణె: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో కేదార్ జాదవ్ తన అద్భుత పోరాటాన్ని ముగించాడు. భారీ లక్ష్యంన్ని ఛేదించే క్రమంలో అద్భుత బ్యాటింగ్ చేశాడు. కెప్టెన్ కోహ్లీతో కలిసి సెంచరీ నమోదు చేశాడు. 76 బంతుల్లోనే 120 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. జాక్ బాల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీకి దగ్గర్లో క్యాచ్ ఔటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 39.5 ఓవర్లకు 291/6. మ్యాచ్ గెలవాలంటే ఇంకా 60 బంతుల్లో 61 పరుగులు చేయాలి. క్రీజ్‌లో హార్ధిక్ పాండ్యాతో పాటు రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేస్తున్నాడు. | sports |
15,303 | 03-06-2017 18:00:05 | ప్రసార భారతికి కొత్త రూపు తెస్తా : శశి శేఖర్ వెంపటి | బెంగళూరు : ప్రజలు నమ్మదగిన ప్రసార మాధ్యమం చాలా అవసరమని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రసార భారతికి కాబోయే సీఈఓ శశి శేఖర్ వెంపటి తెలిపారు. ప్రస్తుతం ప్రసార భారతికి విశ్వసనీయత లోపం ఉందని అంగీకరించారు. అనేక సంవత్సరాల నుంచి వెనుకబడిన ప్రసార భారతికి విశ్వసనీయతను సాధించి, ప్రపంచ ఉత్తమ ప్రసార మాధ్యమంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు. అత్యంత విశ్వసనీయమైన వార్తలను తెలుసుకోగలమనే దృఢ నమ్మకాన్ని ప్రజలకు కల్పించగలిగే మాధ్యమం ఉండాలన్నారు. తప్పుడు వార్తలు, నకిలీ కథనాల గురించి తీవ్రమైన చర్చ జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో నేషనల్ బ్రాడ్‌కాస్టర్ పాత్ర చాలా సంక్లిష్టమైనదని శశి శేఖర్ తెలిపారు. జరిగినదాని గురించి అత్యంత నమ్మకమైన కథనాలను తెలుసుకోగలమనే నమ్మకంగల మాధ్యమం ఒకటి ఉండాలని తెలిపారు. మిగతా నేషనల్ బ్రాడ్‌కాస్టర్ల మాదిరిగానే దూరదర్శన్, ఆకాశవాణి కూడా అంతర్జాతీయ గళంగా పని చేయాలని, తద్వారా అగ్రశ్రేణి బ్రాడ్‌కాస్టర్ల జాబితాలో చేరాలన్నారు. డిజిటల్ యుగంలో దూరదర్శన్, ఆలిండియా రేడియో సోషల్ మీడియాలో వెనుకబడి ఉన్నాయన్నారు. | nation |
20,482 | 19-01-2017 00:47:47 | కటక్‌లోనే కొట్టేద్దాం! |
సిరీస్‌పై భారత గురిసమంపై ఇంగ్లండ్ కన్నుజోరు మీద టీమిండియాఒత్తిడిలో మోర్గాన్‌సేనఇరు జట్ల మధ్య రెండో వన్డే నేడుబారాబతి స్టేడియంలో పటిష్ట భద్రతకటక్: తొలి వన్డేలో అద్భుత విజయం సాధించి జోరు మీదున్న టీమిండియా సిరీస్‌పై కన్నేసింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం ఇక్కడి బారాబతి స్టేడియం వేదికగా జరిగే రెండో మ్యాచ్‌లో భారత విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మొదటి మ్యాచ్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరో వైపు టెస్టు సిరీస్‌లో ఘోర పరాజయం ఎదుర్కొని తొలి వన్డేలో 350 పరుగుల లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయిన ఇంగ్లండ్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. సిరీస్‌ను నిలబెట్టుకోవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక నెగ్గాల్సిన అవసరం ఏర్పడింది మోర్గాన్ సేనకు. దీంతో, చావోరేవో పోరులో సత్తా చాటి సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలని ఆ జట్టు కోరుకుంటోంది. అయితే, బారాబతి స్టేడియంలో మంచి రికార్డు ఉండడం భారతకు కలిసొచ్చే అంశం. ఇప్పటిదాకా ఇక్కడ ఆడిన 17 వన్డేల్లో మన జట్టు 11 మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఇక, కటక్‌లో 477 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత క్రికెట్ మ్యాచ్ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. చివరగా 2015 అక్టోబర్ 5న దక్షిణాఫ్రికాతో టీ-20 మ్యాచ్ భారతకు చేదు జ్ఞాపకాన్ని మిగిలిచ్చింది. ఆ పోరులో భారత ఓటమిని జీర్ణించుకోలేని ఫ్యాన్స్ మైదానంలోకి వాటర్ బాటిళ్లు విసిరి మ్యాచ్‌కు అంతరాయం కలిగించారు. దీంతో, ఈ మ్యాచ్‌కు నిర్వాహకులు భారీ భద్రత కల్పించారు. వాళ్లపైనే ఆందోళన..: పుణెలో ప్రత్యర్థి బౌలర్లను మనోళ్లు ఓ ఆటాడుకున్నా కొన్ని విషయాలపై జట్టు మేనేజ్‌మెంట్ ఆందోళన చెందుతోంది. కీలక సమయంలో ధోనీ, యువరాజ్ వైఫల్యం కోహ్లీసేనపై ఒత్తిడి పెంచింది. అదే విధంగా ఢిల్లీ లెఫ్టాండర్ శిఖర్ ధవన్ కూడా తీవ్రంగా నిరాశపరిచారు. జట్టులో తన స్థానాన్ని ప్రమాదంలో పడేయకూడదంటే ఈ మ్యాచ్‌లో ధవన్ రాణించితీరాల్సిందే. ఇక, మిడిలార్డర్‌ను బలోపేతం చేసేందుకు జట్టులోకొచ్చిన యువీ, కెప్టెన్సీ వదులుకున్న తర్వాత స్వేచ్ఛగా ఆడతాడని భావించిన ధోనీ అంచనాలను అందుకోవాలని చూస్తున్నారు. కాగా, ఫార్మాట్ ఏదైనా కోహ్లీ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తుండగా, కేదార్ జాదవ్ సంచలన ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపారు. వారితో పాటు పుణెలో హార్దిక్ పాండ్యా చివర్లో బాధ్యతాయుతంగా ఆడడం జట్టుకు సానుకూలాంశం. ఈ మ్యాచ్‌లోనూ కోహ్లీ, జాదవ్, పాండ్యా చెలరేగితే ఇంగ్లండ్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. బ్యాటింగ్‌లో ఎవరో ఒకరు బాధ్యత తీసుకున్నప్పటికీ.. గత మ్యాచ్‌లో మన బౌలర్లు ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయారు. అన్ని సార్లూ పెద్ద లక్ష్యాన్ని ఛేదించలేం. అందువల్ల బౌలర్లు ప్రత్యర్థిని వీలైనంత తక్కువ స్కోరుకు కట్టడి చేసేందుకు ప్రయత్నించాలి. 28 భారత్ కెప్టెన్‌గా 1000 పరుగుల మార్కును చేరేందుకు కోహ్లీకి అవసరమైన పరుగులు. ధోనీ, అజరుద్దీన్, గంగూలీ, సచిన్, ద్రావిడ్, కపిల్ దేవ్ సరసన చేరుతాడు. | sports |
16,625 | 07-10-2017 16:14:34 | సౌదీ అరేబియా కింగ్‌కు అనూహ్య కష్టాలు |
మాస్కో : సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దులజీజ్ (81) కాసేపు ఇబ్బంది పడ్డారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం రష్యా వెళ్లిన ఆయన తన ప్రైవేట్ విమానంలోని బంగారు ఎస్కలేటర్ సక్రమంగా పని చేయలేదు. ఆయన ఆ ఎస్కలేటర్‌పై నిల్చున్న కొద్ది క్షణాల్లోనే అది పని చేయడం మానేసింది. దీంతో ఆయన విధి లేక మెట్ల ద్వారా క్రిందికి దిగారు. ఈ ఎస్కలేటర్‌ను ఆయనకోసమే తయారు చేశారు. ఆయనకు రష్యాలో ఘన స్వాగతం లభించింది. ఆ దేశ ఉప ప్రధాని దిమిత్రి రోగోజిన్ మాస్కోలోని వునుకోవో విమానాశ్రయంలో స్వాగతం పలికారు. సౌదీ అరేబియా రాజు విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఆయన విపరీతంగా విదేశీ యాత్రలు చేస్తూ ఉంటారు. ప్రస్తుత పర్యటనలో ఆయనతోపాటు 1500 మందిని, రెండు మెర్సిడెస్ బెంజ్ వాహనాలను, 459 టన్నుల లగేజిని తీసుకెళ్ళారు. | nation |
4,915 | 16-02-2017 22:03:06 | ‘మెట్రో’ సక్సెస్ కావాలి |
ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కిన ‘మెట్రో’ మార్చి 3న విడుదల కానుంది. సురేశ్ కొండేటి సమర్పించారు. రజనీ రామ్ నిర్మాత. ప్రముఖ గాయని గీతామాధురి ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ని హైదరాబాద్‌లో హీరో శర్వానంద్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ‘‘తమిళంలో ప్రేక్షకాదరణ పొందిన చిత్రమిది. తెలుగు ట్రైలర్ చాలా బావుంది. ఇక్కడ కూడా మంచి విజయాన్ని సాధించాలి’’ అని అన్నారు. సురేశ్ కొండేటి మాట్లాడుతూ ‘‘హైదరాబాద్, విశాఖపట్టణం వంటి మెట్రో నగరాల్లో నిరంతం చెయిన స్నాచింగ్ వార్తలను వింటూనే ఉన్నాం. దుండగుల ఆగడాల వల్ల కొన్ని సార్లు అమాయకులు ప్రాణాలను కోల్పోయిన ఘటనలున్నాయి. అలాంటి యథార్థ ఘటనల్ని ఆధారంగా చేసుకుని హృద్యంగా తెరకెక్కించిన చిత్రం ‘మెట్రో’. మార్చి 3న విడుదల చేస్తున్నాం’’ అని అన్నారు. | entertainment |
21,523 | 11-01-2017 01:35:46 | 11 వద్దు 21 ముద్దు... |
బెంగళూరు: దిగువ స్థాయి టోర్నమెంట్లలో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ప్ర యోగాత్మకంగా ప్రవేశబెట్టబోతున్న 5-11 పాయింట్ల ఫార్మాట్‌పై భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ పెదవి విరిచింది. అలా చేస్తే ఆట ఏకపక్షంగా మారే ప్రమాదం ఉందన్నది. ‘పాత ఫార్మాట్‌లో మాదిరిగా ఇందులో సుదీర్ఘ ర్యాలీలు చూడలేం. ఇది స్మాష్ కొట్టు..పాయింటు పట్టు అన్నట్టుగా మారుతుంది. ర్యాలీల గురించి మరిచిపోతాం. అప్పుడు ఆటలో ఎలాంటి మజా ఉండబోద’ని వివరించింది. అంతర్జాతీయ టోర్నీల్లో ప్రస్తుత ఫార్మాట్‌లో 21 పాయింట్లతో మూడేసి గేమ్‌లు నిర్వహిస్తుండగా, ఆటను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు బీడబ్ల్యూఎఫ్ 11 పాయింట్లతో ఒక మ్యాచ్‌లో ఐదేసి గేమ్‌లతో ప్రయోగం చేయాలని చూస్తోంది. దీన్ని పుల్లెల గోపీచంద్ కూడా తప్పుపట్టాడు. | sports |
8,655 | 02-07-2017 00:10:11 | సింగర్ అఖిల్! | ‘సైమా’ వేదికపై గాయకునిగా అవతారమెత్తి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు నవ యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని. ప్రస్తుతం విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో తను హీరోగా నటిస్తోన్న చిత్రంలోని ‘ఏవేవో కలలు కన్నా..’ అనే పాటను ఆలపించిన ఆయన ఆహూతుల ప్రశంసల్ని అందుకున్నారు. ఆ సందర్భంలో తను అక్కడ లేనందుకు నాగార్జున కాస్త బాధపడ్డారు. కానీ తనయుడి ప్రతిభను ఆన్‌లైన్‌లో వీక్షించి మురిసిపోయారు. ‘‘నిన్న రాత్రి సైమా 2017లో లైవ్‌గా అఖిల్ పాట పాడే సమయంలో నేనక్కడ ఉండాలని కోరుకున్నా. దాని కోసం అతను ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేయడం నాకు తెలుసు. అభినందనలు తనయుడా!’’ అని ఆయన ట్వీట్ చేశారు. | entertainment |
3,960 | 12-02-2017 23:33:18 | ఉగాది పద్య గేయ రచనా పోటీ |
- ఆర్. రాము | editorial |
14,557 | 29-03-2017 00:10:02 | నేడు జీఎస్టీపై చర్చ | న్యూఢిల్లీ, మార్చి 28: దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానం కోసం రూపొందించిన జీఎస్టీ బిల్లుపై లోక్‌సభలో బుధవారం చర్చ జరుగనుంది. పరిస్థితులు అనుకూలించి.. అన్ని పార్టీలూ సహకరిస్తే.. ఈ బిల్లుకు ఈ రోజే ఆమోదం లభిస్తుంది. ఈ బిల్లును జులై 1 నుంచి అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. అప్పటికి ఇది అమల్లోకి రావాలంటే పార్లమెంట్‌తో పాటు.. అన్ని రాష్ర్టాలూ తమ అసెంబ్లీల్లో ఈ బిల్లును ఆమోదించాలి. బుధవారం దీనిపై చర్చ జరుగనున్న నేపథ్యంలో బీజేపీ, కాంగెరస్‌లు వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ఇందులో భాగంగా మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. దీనికి ప్రధాని మోదీ హాజరయ్యా రు. జీఎస్టీ బిల్లును ఏకాభిప్రాయంతో ఆమోదించుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ తెలిపారు. ‘‘సర్వాధికారాన్ని పంచుకోవడం’’ అనే సూత్రంతో ఈ బిల్లును రూపొందించామని వివరించారు. కాగా.. ప్రస్తుత జీఎస్టీ బిల్లును యథావిధంగా ఆమోదించడానికి కాంగ్రెస్ అంగీకరించడం లేదు. అలాగే ఈ బిల్లును అడ్డుకున్నామన్న ముద్రపడకుండా.. ఆచితూచి వ్యవహరించి తమ పంతం నెగ్గించుకోవాలని చూస్తోంది. పలు సవరణలకు పట్టుబట్టాలని నిర్ణయించింది. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీలతో రాహుల్‌గాంధీ.. మంగళవారం సమావేశమయ్యారు. ప్రజలకు మరింత మేలు చేకూరేలా జీఎస్టీ బిల్లులో సవరణలకు పట్టుబట్టాలని నిర్ణయించారు. ఇక, జీఎస్టీ అమల్లోకి వస్తే.. అది జమ్మూ కశ్మీర్‌కి వర్తించదు. ఈ రాష్ర్టానికి జీఎస్టీ వర్తించాలంటే.. అక్కడి అసెంబ్లీలో కొత్తగా ఒక చట్టం చేయాల్సి ఉంటుంది. ఈ జీఎస్టీని ఆమోదిస్తూ చట్టాన్ని తీసుకురావాలి. ఎందుకంటే ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూకశ్మీర్‌కి స్వతంత్ర హోదా ఉంది. దీంతో దీనికి సర్వీస్ పన్ను వర్తించదు. అలాగే జీఎస్టీ కూడా వర్తించదు. దీంతో జీఎసప్టీ ఆ రాష్ర్టానికి వర్తించాలంటే.. కొత్త చట్టం అవసరమవుతుంది. | nation |
15,522 | 23-03-2017 13:48:02 | త్వరలో పేపర్‌లెస్ సుప్రీంకోర్టు! | న్యూఢిల్లీ: త్వరలో సుప్రీంకోర్టు వ్యవహారాలు పేపర్లపై నడవబోవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహార్ ప్రకటించారు. పత్రాలతో సంబంధం లేకుండా కేసుల విచారణ ఊహించుకునేందుకు కూడా కష్టమే అయినా... మరో ఆరు, ఏడు నెలల్లో అది సాధ్యమేనని స్పష్టం చేశారు. పిటిషన్ల కోసం కట్టలకొద్దీ డాక్యుమెంట్లు, భారీ సైజు పేపర్ పుస్తకాలు అవసరం ఉండదన్నారు. కోర్టు రూమ్ నెం.1లో లాయర్లతో మాట్లాడిన జస్టిస్ ఖేహార్... ఇకపై ట్రయల్ కోర్టులు, హైకోర్టులనుంచి వచ్చే కేసు రికార్డులను ఎలక్ట్రానిక్ పద్ధతిలో తీసుకుంటామనీ... కాబట్టి మళ్లీ పేపర్లపై వాటి నకళ్లు తేవాల్సిన అవసరం ఉండదన్నారు. లాయర్లు తాము సవాలు చేసే దిగువ కోర్టు తీర్పు నేపథ్యాన్ని మాత్రమే ఫైల్ చేస్తే సరిపోతుందని పేర్కొన్నారు. | nation |
7,947 | 10-05-2017 19:46:37 | 3Dలో రామాయణం: అల్లు అరవింద్ | హైదరాబాద్: మెగాస్టార్‌తో టాలీవుడ్‌కి బ్లాక్ బ్లస్టర్‌లు అందించిన ప్రముఖ నిర్మాత, హీరో చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ వెండితెరపై మరో సంచలనానికి శ్రీకారం చుట్టనున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై రోమాన్స్, డ్యాన్స్, ఫైట్స్ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులను అలరించిన అరవింద్... మరో భారీ బడ్జెట్ చిత్రానికి రూపకల్పన చేస్తున్నారు. అయితే... ఈసారి తన పంధాకు భిన్నంగా పౌరాణిక చిత్రం వైపు మొగ్గుచూపారు. ఎన్నిసార్లు చూసినా తనవితీరని రామకథను 3Dలో నిర్మించాలని ఆయన సంకల్పించుకున్నారు. మధు మంతెన, నమిత్ మల్హోత్రాతో కలిసి సంయుక్తంగా రామాయణం త్రీడీ చిత్రాన్ని నిర్మిస్తామని బుధవారం మీడియాకు అరవింద్ తెలిపారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తామని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే అల్లువారి రామాయణంలో సీతారాముల పాత్రలు ఎవరు పోషిస్తారో అన్న అంశం మెగా ఫ్యాన్స్‌లో వాడివేడి చర్చకు దారితీసింది. ప్రస్తుతానికి ఇది సస్పెన్స్. | entertainment |
218 | 06-09-2017 02:34:07 | 2 లక్షల కంపెనీలకు చెల్లుచీటీ | నల్లధనంపై దూకుడు పెంచిన ప్రభుత్వం.. బ్యాంక్ లావాదేవీలపైనా వేటున్యూఢిల్లీ: నల్ల ధనానికి చెక్ పెట్టే చర్యలను ప్రభుత్వం మరిత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా నిబంధనలు పాటించని 2.09 లక్షలకుపైగా డొల్ల కంపెనీల పేర్లను రిజిస్టర్ల నుంచి తొలగించింది. నమోదైన కంపెనీల జాబితాలో పేర్లు ఉన్న కంపెనీల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం బ్యాంకులను కోరింది. ముఖ్యంగా చాలా కాలంగా పెద్దగా వ్యాపార లావాదేవీలు లేని కంపెనీలు, ఉన్నా రెగ్యులేటరీ సంస్థలకు సరిగా వార్షిక నివేదికలు, ఆర్థిక నివేదికలు అందజేయని కంపెనీల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరింది. ‘నల్లధనంపై పోరులో భాగంగా పేర్లు తొలగించిన కంపెనీల ఖాతాలు వెంటనే స్తంభింపచేయాలని బ్యాంకులను కోరాం’ అని కేంద్ర కంపెనీల వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పిపి చౌదరి ట్వీట్ చేశారు. నల్లధనాన్ని నిర్మూలించాలన్న ప్రధాని మోదీ విధానానికి అనుగుణంగానే ఈ చర్య తీసుకున్నట్టు చెప్పారు. చాలా కాలంగా వ్యాపారంలో చురుగ్గా లేకపోయినా కొన్ని కంపెనీలు చురుగ్గా బ్యాంక్ లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. ఈ లావాదేవీలు అనుమానాస్పదంగా ఉండడంతో ప్రభుత్వం వీటి పేర్లను తొలగించాలని నిర్ణయించింది. కంపెనీల చట్టంలోని సెక్షన్ 248 (5) కింద ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఈ సెక్షన్ కింద చాలా కాలంగా వ్యాపార కార్యకలాపాల్లో లేకపోయినా లేదా నిబంధనలు పాటించని కంపెనీలను డీరిజిస్టర్ చేయవచ్చు. ఈ చర్యతో చట్టపరంగా మళ్లీ గుర్తింపు పొందేవరకు ఈ కంపెనీల డైరెక్టర్లు, వాటి బ్యాంక్ ఖాతాలను నిర్వహించేందుకూ అనుమతించరు. అప్పటి వరకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీల రిజిస్టర్లలోనూ వీటి పేర్లు కొట్టివేసిన కంపెనీల పేర్ల జాబితాలోనే ఉంటాయి. నల్లధన కట్టడి, అక్రమ నగదు లావాదేవీల నిరోధక చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. మరిన్ని కంపెనీలపై ఇలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ తాజా చర్యతో పేర్లు తొలగించిన కంపెనీలపై పడే ప్రభావం ఇలా ఉంటుంది. గుర్తింపు రద్దుజాబితా నుంచి పేర్లు తొలగించడంతో ఈ కంపెనీలన్నిటిని దాదాపుగా రద్దయిన కంపెనీలుగానే పరిగణిస్తారు. నిబంధనలన్నీ పాటిస్తున్నట్టు రెగ్యులేటరీ సంస్థలను సంతృప్తిపరిస్తే తప్పించి మళ్లీ వీటి పేర్లను కంపెనీల రిజిస్టర్‌లో చేర్చరు. బోర్డుపై ప్రభావం ఈ కంపెనీల డైరెక్టర్ల బోర్డు సభ్యులు, అధీకృత సంతకందారులు ఇక ఆయా కంపెనీల మాజీలుగానే పరిగణింపబడతారు. వీరు ఇక ఆ కంపెనీల బ్యాంక్ లావాదేవీలు నిర్వహించేందుకూ వీలుండదు. కంపెనీలే నిర్వహణలో లేనపుడు ఇక ఆ ఖాతాల నిర్వహణ దుర్వినియో గం అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. నిర్వహణ మెరుగుపడే అవకాశంప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు కంపెనీల నిర్వహణ మెరుగుపడే అవకాశం ఉంది. తమ ఆర్థిక లావాదేవీలపై ఏ మాత్రం అనుమానం ఉన్నా వేటుపడే అవకాశం ఉందనే భయంతో కంపెనీలు ఇందుకు చర్యలు తీసుకుంటాయని భావిస్తున్నారు. నల్ల ధనం పెద్ద నోట్ల రద్దు సమయంలో పూర్తిగా లేదా పెద్దగా వ్యాపారం లేని కంపెనీలు కొంత మంది నల్ల ధనాన్ని తమ బ్యాంక్ ఖాతాల ద్వారా వైట్‌గా మార్చేందుకు సహకరించాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇపుడు పేర్లు తొలగించిన కంపెనీల బ్యాంకు ఖాతాలను ప్రభుత్వం ఈ కోణంలోనూ పరిశీలించబోతోంది. | business |
15,000 | 16-03-2017 18:25:19 | శశికళకు దీటైన వ్యూహం పన్నిన పన్నీర్ సెల్వం |
చెన్నై : ‘అమ్మ’ జయలలిత రాజకీయ వారసత్వం కోసం జరుగుతున్న పోరు మరింత రసవత్తరంగా మారుతోంది. ఆమె ప్రాతినిథ్యం వహించిన ఆర్‌కే నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి శశికళ వర్గం నుంచి దినకరన్ పోటీ చేయబోతుండటంతో తన వర్గం తరపున మధుసూదనన్‌ను బరిలో దించాలని పన్నీర్ సెల్వం నిర్ణయించారు. మధుసూదనన్ అటు ఎంజీఆర్‌కు, ఇటు జయలలితకు విదేయుడిగా మంచి పేరు పొందారు. ప్రస్తుతం ఆయనను అన్నా డీఎంకే నుంచి శశికళ బహిష్కరించారు. ఆయన అన్నా డీఎంకే ప్రిసీడియం చైర్మన్‌గా వ్యవహరించేవారు. మధుసూదనన్‌ను అన్నా డీఎంకే నుంచి బహిష్కరిస్తూ శశికళ తీసుకున్న నిర్ణయం చెల్లదని పన్నీర్ సెల్వం వర్గం వాదిస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆమెను ఎన్నుకునేందుకు జరిగిన ప్రక్రియ పార్టీ రాజ్యాంగానికి విరుద్ధమని ఆరోపిస్తోంది. ఆమె తీసుకున్న నిర్ణయాలకు విలువ లేదని చెప్తోంది. ఇదిలావుండగా, మధుసూదనన్ ఆర్‌కే నగర్ నియోజకవర్గానికి చెందినవారే. ఆయన జయలలిత మొదటిసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో అక్కడి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎంజీఆర్‌కు వీర విదేయుడిగా ఆయనకు పేరుంది. దినకరన్‌కు గట్టి పోటీ ఇవ్వగలరని చెప్తున్నారు. దినకరన్ కన్నా అధిక శాతం ఓట్లతో తాను గెలుస్తానని మధుసూదనన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. | nation |
8,406 | 25-02-2017 07:38:52 | ఏపీకి చెందిన ఈ కుర్రాడు ఆ రాష్ట్రంలో స్టార్ హీరో..! | ఆంధ్రజ్యోతి ప్రతినిధి, బెంగళూరు: ఒడిశా రాష్ట్రంలో సూపర్‌స్టార్‌గా ఉన్న సవ్యసాచి మన తెలుగు కుటుంబానికి చెందిన వాడేనంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదూ. అవు ను ఇది నమ్మలేని నిజం. ఆంధ్రప్రదేశలోని అనకాపల్లి నుంచి వీరి పూర్వికులు ఒడిశాకు వెళ్ళిపోయారు. కాలక్రమంలో సవ్యసాచి అక్కడి సినీ రంగంలో అద్భుతంగా రాణించి సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. ఒరియా బాషలో ఇతను నటించిన మొత్తం 30 సినిమాలు సూపర్‌డూపర్ హిట్ అందుకున్నాయి. ఇతని గురించి తెలుసుకున్న టాలీవుడ్ సినీ ప్రముఖులు నీరాజనం, సీతారాముల కళ్యాణం చూతుము రారండి సినిమాల్లో హీరోగా అవకాశం కల్పించారు. ఈ రెండు సినిమాలు తెలుగు, తమిళు, ఒరియా భాషల్లో త్వరలో విడుదల కానున్నాయి. వచ్చే ఉగాది రోజు మరో తెలుగు చిత్రానికి ముహూర్తం ఖరారైందని సవ్యసాచి వెల్లడించారు. వరల్డ్ టి-20 అంధుల క్రికెట్‌కు ఒడిస్సా రాష్ట్రం నుంచి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన సవ్యసాచి బెంగళూరుకు వచ్చిన సమయంలో మీడియాతో తన గురించి చెప్పుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లికి చెందినవాడినని సవ్యసాచి చెప్పారు. నా చిన్నతనంలోనే అనకాపల్లి నుంచి ఒడిశాకు వచ్చామని ఆయన చెప్పారు. అవకాశం లభించినప్పుడెల్లా తాను అక్కడికి వెళ్తుంటానన్నారు. తెలుగు భాషను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నానన్నారు. నాలుగైదు తరాల క్రితమే తమ కుటుంబం ఒడిస్సాకు వెళ్ళిందన్నారు. తెలుగులో మరిన్ని చిత్రాలు నటించేందుకు సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. అవకాశం లభిస్తే శాండల్‌వుడ్‌లో కూడా నటించేందుకు సిద్దమన్నారు. అన్నట్టు సవ్యసాచికి ఒరియా సినీ పరిశ్రమలో లౌలీస్టార్ అనే బిరుదు ఉంది. | entertainment |
7,126 | 05-09-2017 11:59:53 | డేరా బాబా నాకు మంచి స్నేహితుడు: ప్రముఖ నటి | ముంబై: 20 సంవత్సరాల జైలు శిక్ష పడిన డేరా బాబా రామ్‌రహీం ఇకపై సినిమాలు తీయలేడు. సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(సింటా) బాబా వర్క్‌పర్మిట్‌ను రద్దు చేసింది. ఇంతేకాదు ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ (ఐఎఫ్‌టిడిఎ) రామ్ రహీంతో పాటు అతని కూతురుగా చెప్పుకుంటున్న హనీప్రీత్ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది. అయితే కొంతకాలం క్రితం వరకూ రామ్ రహీంకు బాలీవుడ్‌లో మంచి పేరుంది. రామ్‌రహీంకు చెందిన ఒక సినిమా సక్సెస్ పార్టీలో బాలీవుడ్ నటి రాఖీ సావంత్ వేదికపై హంగామా చేసింది. రామ్‌రహీం దగ్గరకు వెళ్ళి అతనితో పాటు సెల్ఫీ తీసుకుంది. బాబాకు శిక్ష పడిన తరువాత రాఖీసావంత్.. తనకు బాబా రామ్‌రహీం మంచి స్నేహితుడని పేర్కొంది. గణేశ్ మహరాజ్.. రామ్ రహీంకు విముక్తి కల్పిస్తే తనకు మంచి సినిమా ఛాన్స్ దక్కుతుందని చెప్పింది. బాలీవుడ్ సినీ ప్రముఖులు శేఖర్ సుమన్, రుతిక్ రోషన్, శిల్పాశెట్టి, అనిల్ కపూర్, జాన్ అబ్రహం తదితరులతో రామ్ రహీం ఉన్న ఫొటోలు ఇప్పుడు నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అలాగే సల్మాన్‌ఖాన్ సోదరుడు సోహెల్‌ఖాన్ కూడా రామ్‌రహీం పక్కన ఉన్న ఫొటో సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. | entertainment |
16,112 | 17-03-2017 00:29:45 | 3 నుంచి హెచ్1-బీ దరఖాస్తులు | వచ్చే ఏడాది కోసం తీసుకోనున్న అమెరికా వాషింగ్టన్, మార్చి 16: వలసలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. వచ్చే నెల 3 నుంచి ఐటీ సంస్థలు, వృత్తి నిపుణుల నుంచి హెచ్1-బీ వర్క్ వీసాల దరఖాస్తులను ఆ దేశం ఆమోదించనుంది. 2018కి ఈ వీసాలను మంజూరు చేస్తారు. అయితే.. ఎప్పటి వరకు ఈ దరఖాస్తులను స్వీకరిస్తారనే విషయంపై అమెరికా ఇమ్మిగ్రేషన్ సర్వీస్ (యూఎ్‌ససీఐఎస్) అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం 85 వేల హెచ్1-బీ వీసాలను జారీ చేస్తారు. ఇందులో 65 వేల వీసాలను జనరల్ కేటగిరీలో, మిగతా 20 వేలను అమెరికాలో ఎంఎస్ తదితర ఉన్నత విద్య పూర్తి చేసిన వారికి తిరిగి కేటాయిస్తారు. ప్రస్తుత దరఖాస్తులను వచ్చే ఏడాదికి పరిశీలిస్తారు. అమెరికాలో 2018 ఆర్థిక సంవత్సరం ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది. కాగా,అమెరికాలో వివిధ విద్యా సంస్థల్లో డిగ్రీలు, పోస్ట్ గ్రాడు ్యయేట్ చేస్తున్న విదేశీ విద్యార్థులు తమ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చదువు పూర్తయిన తర్వాత అమెరికాలో కెరీర్‌ను ప్రారంభించలేమని పెద్ద సంఖ్యలో విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. ఇతర దేశాల్లో ఉన్న అవకాశాలపై వారు దృష్టి సారిస్తున్నారని ఓ సర్వేలో వెల్లడైంది. ఈ వివరాలను ‘కెమికల్ అండ్ ఇంజనీరింగ్ న్యూస్’ అనే వెబ్‌సైట్ వెల్లడించింది. | nation |
7,201 | 13-05-2017 23:51:16 | గింబల్ టెక్నాలజీతో... |
ఆర్.జె సినిమాస్ పతాకంపై హరీశ, అవంతిక నటీనటులుగా రూపొందిస్తున్న చిత్రం ‘వైశాఖం’. జయ బి. దర్శకత్వం వహించారు. బి.ఏ.రాజు నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమల్లో ఉంది. త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సినిమాటోగ్రాఫర్ వాలిశెట్టి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ ‘‘గింబల్ కన్నా కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కజకిస్థానలో పాటల్ని చిత్రీకరించాం. అది ఖర్చుతో కూడిన విషయం అయినప్పటికీ దర్శకనిర్మాతలు రాజీపడలేదు. పాటలకు, ట్రైలర్‌లకు స్పందన బావుంది’’ అని అన్నారు. జయ మాట్లాడుతూ ‘‘చక్కని కుటుంబ కథా చిత్రమిది. ఈ సినిమాతో గింబల్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసున్నాం. స్టడీ కెమెరాలో షేక్ అయితే పిక్చరైజేషన ఇబ్బందిగా ఉంటుంది. గింబల్‌లో ఆ సమస్య ఉండదు. వసంత సంగీతం, వెంకట సుబ్బారావు ఫోటోగ్రఫీ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. త్వరలో సినిమాను విడుదల చేస్తాం’’ అని అన్నారు. | entertainment |
16,615 | 01-07-2017 15:12:18 | పాక్ జైళ్లలో 546 మంది భారతీయులు | లాహోర్ : పాకిస్తాన్ జైళ్లలో 546 మంది భారతీయ ఖైదీలు ఉన్నారు. ఈ జాబితాను పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారంనాడు ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయానికి అందజేసింది. భారత ఖైదీల్లో 52 మంది పౌరులు కాగా, 494 మంది మత్స్యకారులు ఉన్నట్టు 'డాన్' పత్రిక తెలిపింది. తమ దేశాల్లో ఉన్న ఖైదీల వివరాలతో కూడిన జాబితాను పాకిస్తాన్, భారత్ ఏడాదికి రెండు సార్లు...ప్రతి జనవరి 1, జూలై 1న ఇచ్చిపుచ్చుకుంటాయి. 2008 మే 21న ఇరు దేశాల మధ్య కుదిరిన కాన్సలర్ యాక్సెస్ ఒప్పందం కింద ఈ జాబితాల మార్పిడి ఉంటుంది. పాక్ ప్రభుత్వం గత జనవరి 6న తమ అధీనంలో ఉన్న 219 భారత మత్స్యకారులను విడుదల చేయగా, మరో 78 మందిని ఈనెలలోనే విడుదల చేయనుంది. | nation |
14,929 | 14-03-2017 00:39:02 | ఆశలే కాదు... డిపాజిట్లూ గల్లంతు! | గోవాలో 38 సీట్లలో ఆప్ అట్టర్ ఫ్లాప్ పార్టీ భవిష్యత్తుపై ఆందోళనపనజి, మార్చి 13: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఏర్పాటే ఓ అనూహ్యం! ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అది సాధించిన విజయం ఓ సంచలనం! బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న కేజ్రీవాల్ పార్టీ... ఢిల్లీ నుంచి ఇక ఇతర రాష్ర్టాలకూ విస్తరించాలని యోచించింది. ఇందుకు ఇటీవల జరిగిన ఐదు రాష్ర్టాల ఎన్నికలను అవకాశంగా చేసుకుంది. ఢిల్లీ పక్కనే ఉన్న పంజాబ్‌తోపాటు దక్షిణాది రాష్ట్రమైన గోవాపైన ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఏకంగా అరవింద్ కేజ్రీవాల్ సైతం ఈ రాష్ర్టాల్లో ప్రచారం హోరెత్తించారు. అంతర్గత సర్వేల్లోనూ అధికారం తమదేనని తేలిందని, గోవాలో రాజకీయ విప్లవానికి రంగం సిద్ధమైందని పోస్టర్లు వేసి మరీ ఆప్ ప్రచా రం చేసింది. కేజ్రీవాల్ ప్రకటనలకుతోడు మీడియా కూడా ఈ రెం డు రాష్ర్టాలను ఆప్ కైవసం చేసుకోనుందని ఊదరగొట్టింది. కానీ, గోవా ఎన్నికల్లో ఆప్ బొక్క బోర్లా పడింది! అధికారం కాదుకదా... కనీసం ఇక్కసీటునూ గెల్చుకోలేదు. పైగా, ఆప్ పోటీ చేసిన 39 స్థానాల్లో... 38చోట్ల డిపాజిట్లు కూడా దక్కలేదు. బెనాలిమ్ స్థానంలో మాత్రం ఆప్ అభ్యర్థి రాయల్ ఫెర్నాండెస్ రెండో స్థానంలో నిలిచారు. మరోవైపు, పంజాబ్‌లో అకాలీ-బీజేపీ, కాంగ్రె్‌సలకు తామే ప్రత్యామ్నాయమని ప్రచారం చేసినా కేవలం 20 సీట్లకే ఆప్ పరిమితమైంది. ఈ రాష్ట్రం నుంచి ఆప్ తరఫున నలుగురు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. ఆప్ ప్రదర్శన పేలవంగా ఉంది. తక్కువ సీట్లు వచ్చినా ప్రధాన ప్రతిపక్షంగా అవతరించడమే కొంత ఉపశమనం. | nation |
7,834 | 21-11-2017 11:27:07 | అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రాంలో మొదటి పిక్ ఏదంటే.. | అల్లు అర్జున్ తన ఫ్యాన్స్‌కు మరింత చేరువగా ఉండేందుకు.. ఎప్పటికప్పుడు తన మూవీ పిక్స్.. వీడియోలు అప్‌డేట్ చేసేందుకు తాజాగా ఇన్‌స్టాగ్రాం అకౌంటును ఓపెన్ చేశారు. ఒక్కరోజులోనే ఆయన ఫాలోవర్ల సంఖ్య లక్షా 22వేలకు చేరుకుంది. మంగళవారం తన కుమార్తె పుట్టిన రోజు కూడా కావడంతో బన్నీ తన ముద్దుల కూతురు అర్హ పిక్‌ను తన మొదటి పిక్‌గా ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. "మా లిటిల్ ఏంజిల్ అర్హకు హ్యాపీ బర్త్‌డే. తనకు సంవత్సరం పూర్తయిందంటే నమ్మలేకున్నాం." అంటూ బన్నీ అర్హ పిక్‌ని పోస్ట్ చేశారు. | entertainment |
14,015 | 22-03-2017 04:24:00 | మావాడికి రాజకీయం నేర్పండి | మోదీ చెవిలో ములాయం చెప్పిందిదేన్యూఢిల్లీ, మార్చి 21: ‘‘ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ప్ర ధాని మోదీ చెవిలో ములాయం సింగ్ యాదవ్ గుసగుసలాడారు. వెంటనే అఖిలేశ్‌ను దగ్గరకు పిలిచి మోదీకి ఏదో చెప్పారు. మోదీకి ములా యం ఏం చెప్పారనే దానిపై టెలిగ్రాఫ్ ఓ కథనం ప్ర చురించింది. థోడా అఖిలేశ్‌కో ఖయాల్ రఖియే(అఖిలేశ్ మంచి చెడ్డా చూసుకోండి) అని మోదీతో ములాయం చెప్పినట్లు పేర్కొంది. అంతేకాక రాజకీయంగా ఎదురయ్యే ఒడిదొడుకుల గురించీ అఖిలేశ్‌కు నేర్పాలని కోరినట్లు తెలిపింది. ములాయం ను అసంతృప్తి పరచకుండా మోదీ కూడా అఖిలేశ్ భుజం తట్టినట్లు వివరించింది. ఆ సమయంలో వేదికపైనున్న ఇతర బీజేపీ నేతలు ఈమేరకు తమ తెలిపారని ‘టెలిగ్రాఫ్’ పేర్కొంది. | nation |
11,807 | 07-10-2017 03:59:40 | హిమాలయాలకు రజనీకాంత్? | ‘కాలా’ షూటింగ్ అవగానే పయనంచెన్నై, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ త్వరలో హిమాలయాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ‘కాలా’ సినిమా షూటింగ్ ముగియగానే హిమాలయాలకు పయనం కానున్నట్లు సమాచారం. తన జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకునేముందు కొంతకాలం హిమాలయాల్లో ధ్యానం చేయడం ఆయనకు అలవాటని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆయన రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారని, అందుకే హిమాలయాలకు వెళ్తున్నారని అభిమానుల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. | nation |
835 | 01-02-2017 03:53:15 | ఈ ఏడాది వృద్ధి 6.5 శాతమే | సర్వే కామెంట్స్...ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటుపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. ఈ ఏడాది ఆర్థిక వృద్ధి రేటు 6.5 శాతానికి పరిమితమయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి 6.75-7.5 శాతం మధ్య ఉండొచ్చు. స్వల్పకాలంలో ఆర్థిక రంగంపై ఒత్తిడి ఉన్నప్పటికీ నోట్ల రద్దు వల్ల దీర్ఘకాలంలో లాభాలు ఉంటాయి. ఏప్రిల్ కల్లా నగదు చలామణి సాధారణ స్థితికి చేరుతుంది. రీమానిటైజేషన్ తర్వాత మళ్లీ ఆర్థిక రంగం పుంజుకుంటుంది. వడ్డీరేట్లు తగ్గుముఖం పట్టడం, అవినీతి నిర్మూలన, వ్యవస్థీకృత ఆర్థిక రంగంలో కార్యకలాపాలు ఊపందుకోవడం... ఆర్థికవ్యవస్థకు మేలు చేస్తాయి. రియల్టీ ధరలు తగ్గడం, డిజిటలైజేన్ పెరగడం, పన్నుల ఎగవేతలు తగ్గుముఖం పట్టడం... ఇవన్నీ మంచి పరిణామాలు. మధ్యకాలంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 10 శాతం దిశగా దూసుకుపోతుంది. ప్రపంచంలో శరవేగంగా దూసుకుపోతున్న దేశాల జాబితాలో భారత్ టాప్‌లో ఉంటుంది. డిజిటలైజేషన్ మంత్రదండం కాదు.. రియల్టీ ఢమాల్ | business |
16,911 | 26-03-2017 21:34:06 | అనాథ పిల్లల వద్ద రూ.96 వేల పాత నోట్లు... మార్పిడికి సహకరిస్తానంటున్న ఎంపీ | కోటా: అనాథ పిల్లల వద్ద ఉన్న రూ.96,000 విలువైన రద్దైన పాత రూ.500, రూ.1000 నోట్ల మార్పిడికి సహకరిస్తానని ఓ ఎంపీ హామీ ఇచ్చారు. రాజస్థాన్‌లోని కోటా సమీప గ్రామంలో నాలుగేళ్ళ కిందట ఓ మహిళ హత్యకు గురైంది. ఆమె భర్త అంతకు ముందే చనిపోవడంతో అనాథలైన చిన్నారులను ప్రభుత్వ సంక్షేమ కేంద్రానికి తరలించారు. అయితే నాలుగేళ్ళుగా మూతపడిన వారి ఇంటికి గత నెల తిరిగి వచ్చారు. ఆ ఇంట్లో కొంత బంగారంతో పాటు రూ.96,000 విలువైన రద్దైన పాత రూ.500, రూ.1000 నోట్లను గుర్తించారు. వీటిని ఆర్బీఐ శాఖలో మార్చేందుకు ఆ పిల్లలు ప్రయత్నించగా అధికారులు నిరాకరించారు. దీంతో ఈ విషయంపై ప్రధాని మోదీకి శనివారం వారు లేఖ రాశారు. కోటా ఎంపీ ఓం బిర్లా కూడా దీనిపై స్పందించారు. వారి వద్ద ఉన్న రద్దైన పాత నోట్ల మార్పిడికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. దీని కోసం ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాస్తానని ఆయన తెలిపారు. | nation |
13,567 | 21-08-2017 04:34:06 | ముసలమ్మను కాపాడిన ఫేస్‌బుక్! | న్యూయార్క్, ఆగస్టు 20: ఆ ముసలమ్మ స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొట్టినంత సేపు కొట్టింది! అక్కడున్న వారంతా వెళ్లిపోయాక ఇక చాల్లే అనుకుని పైకొస్తుంటే ఇనుప మెట్లు విరిగిపోయాయి. ఇంకేముందీ అందులో చిక్కుకుపోయింది. సాయం కోసం అరిచినా.. ఆమె అరుపులు వినపడేంత దూరంలో ఎవరూ లేరు. ఫోన్ చేద్దామంటే అదీ లేదు! పైకొచ్చే దారులన్నీ మూసుకుపోయి దాదాపు మూడు గంటల పాటు ఆ స్విమ్మింగ్‌పూల్‌లోనే ఉండిపోయిందామె! చివరకు ఫేస్‌బుక్ ఆమెను ఒడ్డుకు చేర్చింది. పూల్‌కు ఉన్న ఓ పోల్‌ను ఆసరాగా చేసుకుని విశ్రాంతి కుర్చీని దగ్గరగా లాగి అందులోని తన ఐప్యాడ్‌ను తీసుకుని వెంటనే ఫేస్‌బుక్‌లో సాయం కోసం మెసేజ్ పెట్టింది. వెంటనే స్పందించిన సభ్యులు నిముషాల్లో అక్కడకు చేరుకుని ఆమెను పైకి తీసుకొచ్చారు. ఈ ఘటన అమెరికాలోని న్యూ హాంప్‌షైర్‌లో శుక్రవారం జరిగింది. ఆమె పేరు లెస్లీ కాన్. | nation |
2,221 | 23-02-2017 23:32:24 | ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకులో బీమా, ఎంఎఫ్ ఉత్పత్తులు |
కోల్‌కతా : రాబడిని పెంచుకునేందుకుగాను థర్డ్‌పార్టీ ఫైనాన్షియల్ ఉత్పత్తులను విక్రయించనున్నట్టు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ శశి అరోరా తెలిపారు. ‘‘రుణాలను జారీ చేసేందుకు ఆర్‌బిఐ మాకు అనుమతివ్వలేదు. కానీ బ్యాంకుల మాదిరిగా థర్డ్ పార్టీ ఫైనాన్షియల్ ఉత్పత్తులను విక్రయించేందుకు అవకాశం కల్పించారు. కాబట్టి సమీప భవిష్యతలో మా నెట్‌వర్క్ ద్వారా బీమా, మ్యూచువల్ ఫండ్ ఉత్పత్తులను విక్రయించాలనుకుంటున్నాం. ఆ తర్వాత ఎన్‌బిఎ్‌ఫసి లాంటి సంస్థల రుణ ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు. కొన్ని నెలల క్రితమే ఎయిర్‌టెల్ తన పేమెంట్స్ బ్యాంకు కార్యకలాపాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇప్పటికే 2.5 లక్షల బ్యాంకింగ్ పాయింట్లను ఈ సంస్థ ప్రారంభించింది. కస్టమర్ల సంఖ్య 20 లక్షలు దాటింది. | business |
21,391 | 24-05-2017 00:45:27 | భారత్ జయభేరి |
4-1తో ఇండోనేసియాపై విజయంనాకౌట్ అవకాశాలు పదిలంమెరిసిన శ్రీకాంత్, సింధు, అశ్వినిసుదీర్మన్ కప్ టీమ్ చాంపియన్‌షిప్గోల్డ్ కోస్ట్ (ఆస్ర్టేలియా): సుదీర్మన్ కప్ తొలి మ్యాచ్‌లో డెన్మార్క్ చేతిలో ఓడినప్పటికీ భారత్ కోలుకుంది. మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షి్‌పలో భాగంగా మంగళవారమిక్కడ జరిగిన గ్రూప్-డి మ్యాచ్‌లో భారత్ 4-1తో మాజీ చాంపియన్, ఐదోసీడ్ ఇండోనేసియాపై అద్భుత విజయం సాధించింది. కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు సింగిల్స్‌లో విజయాలు అందించగా.. అశ్విని పొన్నప్ప మిక్స్‌డ్‌లో సాత్విక్ సాయిరాజ్‌తో, మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డితో కలిసి విజయాలు సాధించింది. కాగా.. గ్రూప్-డిలో ప్రస్తుతం భారత్, డెన్మార్క్ ఒక్కో విజయంతో సమంగా ఉన్నాయి. దీంతో నాకౌట్ బెర్త్ ఎవరిదో ఖరారు కావాలంటే డెన్మార్క్, ఇండోనేసియా జట్ల మధ్య బుధవారం జరిగే మ్యాచ్ వరకూ వేచిచూడాల్సిందే. ప్రతి గ్రూప్ నుంచి రెండు జట్లు నాకౌట్‌కు అర్హత సాధిస్తాయి. బుధవారం మ్యాచ్‌లో డెన్మార్ నెగ్గితే దానితోపాటు భారత్ కూడా నాకౌట్ చేరుతుంది. ఒకవేళ ఇండోనేసియా విజయం సాధిస్తే అప్పుడు ప్రతీ జట్టు ఒక్కో గెలుపు సాధించినట్టు అవుతుంది కాబట్టి.. ఆడిన మ్యాచ్‌లు, గెలిచిన గేమ్‌లు కీలకమవుతాయి. ఈ మెగా టోర్నీలో భారత్ చివరిసారిగా 2011లో నాకౌట్‌కు చేరింది. చివరి రెండు దఫాల్లో గ్రూప్ దశను దాటలేకపోయింది. అదరగొట్టిన శ్రీకాంత్, సింధుఆరంభ మ్యాచ్‌లో మిక్స్‌డ్ జోడీ సాత్విక్-అశ్విని 22-0, 17-21, 21-19తో తొంతోవి- గ్లోరియాపై ఉత్కంఠ విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ 21-15, 21-16తో క్రిస్టీపై నెగ్గి భారత్‌కు 2-0 ఆధిక్యాన్ని అందించాడు. కానీ.. పురుషుల డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ షెట్టి ద్వయం 9-21, 17-21తో పెర్నాల్డి గిద్యోన్, కెవిన్ సుకముల్యో చేతిలో ఓటమిపాలైంది. అయితే కీలకమైన నాలుగో మ్యాచ్‌లో సింధు 21-9, 21-19తో ఫిత్రియాని ఫిత్రియానిపై వరుస గేముల్లో నెగ్గి భారత్‌కు 3-1తో విజయాన్ని ఖాయం చేసింది. ఇక ఆఖరి మహిళల డబుల్స్‌లో అశ్విని, సిక్కిరెడ్డి ద్వయం 21-12, 21-19తో డెలా డెస్టియారా, రోసిత ఎకా పుత్రి జోడీని ఓడించి భారత్ ఆధిక్యాన్ని 4-1కి పెంచింది. | sports |
1,847 | 12-02-2017 23:02:18 | పెట్టుబడుల వ్యూహాలు మారాల్సిందే.. | ఫిక్స్‌డ్ డిపాజిట్లు.. ప్రస్తుతం బ్యాంకులు ఆర్‌బిఐ నుంచి రెపో రేటు కింద 6.25 శాతం వడ్డీకి స్వల్ప కాలిక రుణాలు తీసుకుంటున్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డి)పై బ్యాంకులు ఖాతాదారులకూ ఇంతకంటే ఎక్కువ చెల్లించడం లేదు. పొదుపు (ఎస్‌బి) ఖాతాదారులకైతే నాలుగు శాతం వడ్డీతో సరిపెడుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో కుప్పతెప్పలుగా డిపాజిట్లు పోగయ్యాయి. ఈ మొత్తం ఎంత లేదన్నా రూ.15 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇందులో 30-40 శాతం డిపాజిట్లు బ్యాంకుల్లోనే ఉంటాయని భావిస్తున్నారు. దీంతో మున్ముందు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకులు చెల్లించే వడ్డీ రేట్లు మరింత తగ్గుతాయని భావించవచ్చు. అదే జరిగితే ఎఫ్‌డిలనే నమ్ముకున్న సీనియర్ సిటిజన్లు, రిటైర్మెంట్ ఉద్యోగుల రాబడికి చిల్లు పడే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం నుంచి బయట పడాలంటే వీరు తమ స్వల్ప కాలిక ఎఫ్‌డిలను వెనక్కి తీసుకుని ఎక్కువ కాలపరిమితి ఉండే బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఎంచుకోవడం మంచిది. అయితే కంపెనీల ఫిక్స్‌డ్ డిపాజిట్లకు వెళ్లే ముందు వాటి పరపతి రేటింగ్‌ను తప్పనిసరిగా చూడాలి. ఇవేవీ చూడకుండా అధిక వడ్డీకి ఆశపడితే ఆసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. వడ్డీ రేట్లు తగ్గిపోతున్న నేపథ్యంలో స్థిర ఆదాయం కోసం చూసే ఇన్వెస్టర్లు రుణ పత్రాలపైనా దృష్టి పెట్టడం మంచిది. ఏ మాత్రం రిస్కు వద్దనుకుంటే ప్రభుత్వ రుణ పత్రాల్లో ఇన్వెస్ట్ చేయాలి. కొద్దిగా రిస్కు తీసుకోగలిగితే మంచి పరపతి రేటింగ్ ఉన్న కంపెనీల రుణ పత్రాలనూ పరిశీలించవచ్చు. ఇటీవల చాలా కంపెనీలు తమ రుణ పత్రాలను స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లోనూ నమోదు చేస్తున్నాయి. దీనివల్ల గడువుకు ముందే ఎపుడైనా వీటిని అమ్ముకుని సొమ్ము చేసుకునే అవకాశమూ ఏర్పడింది. ద్రవ్యోల్బణ ముప్పు పొంచి ఉన్నందున ఆర్‌బిఐ సమీప భవిష్యతలో రెపో రేటు తగ్గించదని దాదాపుగా తేలిపోయింది. దీంతో స్థిర రాబడుల కోసం డెట్ ఫండ్స్‌పైనా దృష్టి పెట్టవచ్చు. ఇప్పటికే ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన మదుపరులు తమ పెట్టుబడుల్లో ఎక్కువ భాగాన్ని మూడు నుంచి నాలుగేళ్ల గడువు ఉండే స్వల్ప, మధ్యకాలిక డెట్ ఫండ్స్‌కు మార్చడం మంచిది. ఇంకా వీలైతే మంచి ట్రాక్ రికార్డు ఉన్న డైనమిక్ బాండ్ ఫండ్స్‌లోనూ కొంత ఇన్వెస్ట్ చేయాలి. పిండి కొద్ది రొట్టె. పెట్టుబడులకు కూడా వర్తిస్తుంది. ఎంత నష్ట భయం తీసుకోగలిగితే పెట్టుబడుల మార్కెట్లో రాబడులు అంత బాగుంటాయి. డెట్ ఫండ్స్‌కూ ఇది వర్తిస్తుంది. ఏ మాత్రం రిస్కు తీసుకోలేని ఇన్వెస్టర్లు నూరు శాతం పెట్టుబడులను ట్రిపుల్ రేటింగ్ ఉన్న రుణ పత్రాల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేసే డెట్ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. కొద్ది స్థాయిలో రిస్కు తీసుకోగలిగితే 10-20 శాతం నిధులను క్రెడిట్ ఆపర్చునిటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగని పెద్దగా రేటింగ్ లేని రుణ పత్రాల్లో దూకుడుగా ఇన్వెస్ట్ చేసే ఆపర్చునిటీ ఫండ్స్ జోలికి పోవద్దు. రిస్కు ఉన్నా ఫరవాలేదు.. మంచి రాబడులు కావాలనుకుంటే మాత్రం డెట్ ఫండ్స్‌లో పెట్టే పెట్టుబడుల్లో 30 శాతం వరకు డైనమిక్ బాండ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. మిగతా మొత్తాన్ని మాత్రం ట్రిపుల్ రేటింగ్ ఉన్న డెట్ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయడం మంచిది. వడ్డీ రేట్లు మరింత తగ్గినా ఈ ఫండ్స్‌పై రాబడులు బ్యాంక్ డిపాజిట్లతో పోలిస్తే కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. వడ్డీ రేట్లలో వచ్చే ఆటుపోట్లతో సంబంధం లేకుండా నిర్ణీత కాలానికి నిలకడతో కూడిన స్థిరమై ఆదాయం కోరుకునే మదుపరులు కార్పొరేట్ బాండ్స్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే అక్రూయల్ ఫండ్ లేదా ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ఫండ్స్ ఎంచుకోవాలి. | business |
13,294 | 15-07-2017 02:20:28 | నా కూతురి పేరైనా చెప్పేవాడిని |
క్షమాపణలు చెప్పేందుకు సిద్ధం: కమల్‌చెన్నై, జూలై 14 (ఆంధ్రజ్యోతి): నటుడు దిలీప్ అరెస్టు వ్యవహారంలో బాధిత నటి పేరును బహిరంగంగా ప్రస్తావించి, విమర్శలపాలైన కమల్‌హాసన్ వెనక్కు తగ్గారు. జాతీయ మహిళా కమిషన్ నోటీసులు పంపడంతో... భావన పేరు ప్రస్తావించినందుకు ట్విట్టర్ ద్వారా ఆయన క్షమాపణలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం రాత్రి మూడు ట్వీట్లు చేశారు. ‘‘నేను మహిళలను గౌరవించి, వారికోసం పోరాడుతుంటే... వారే నన్ను క్షమాపణలు చెప్పాలని అడుగుతున్నారు. కారణం లేకుండా నేను ఎవరికీ లొంగేవ్యక్తిని కాదు. ఇది నేరస్థుడిని వదిలిపెట్టి లాయర్‌ను శిక్షించినట్టుగా ఉంది. ఆమె పేరు చెప్పకూడదా? నా తల్లి, కూతురి పేరయినా చెబుతాను. ఇది మహాభారతం కథ. ఓ భారత స్ర్తీ మేలుకో. ఇప్పటికీ మీరు కావాలనుకుంటే నేను క్షమాపణలు చెప్పేందుకు సిద్ధం. ఎవరూ చట్టానికి అతీతులు కాదు’’ అని ఆ సందేశాల్లో పేర్కొన్నారు. | nation |
10,136 | 23-02-2017 13:12:13 | షాకింగ్: ఆ దర్శకుడికి బాలయ్య అవకాశమిచ్చాడా? | నందమూరి బాలకృష్ణ 101వ సినిమాకు దర్శకుడిగా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కేఎస్ రవికుమార్, కృష్ణవంశీ, ఎస్వీ కృష్ణారెడ్డి.. ఇలా ఎంతో మంది బాలయ్య కోసం క్యూలో ఉన్నారు. అయితే బాలకృష్ణ మాత్రం ఎవరూ ఊహించని ఓ దర్శకుడి చేతిలో తన 101వ సినిమాను పెట్టాడట. ఆ దర్శకుడు ఎవరో కాదు.. వరుస పరాజయాలతో సతమతమవుతున్న పూరీ జగన్నాథ్. | entertainment |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.