inputs
stringlengths
4
2.8k
targets
stringlengths
1
9.91k
language
stringclasses
1 value
language_code
stringclasses
1 value
annotation_type
stringclasses
2 values
user_id
stringclasses
21 values
జనాభా సమస్య (కుటుంబ నియంత్రణ) మీద వ్యాసం రాయండి.
జనాభా ఎక్కువగుట వలన సమస్య ఏర్పడటాన్ని జనాభా సమస్య అంటారు. “అమెరికాలో డాలర్లు పండును ఇండియాలో సంతానం పండును” అని తెలుగులో బాలగంగాధరతిలక్ అనే కవి వ్యంగ్యంగా భారతీయులకి సంతానంపై గల మక్కువ తెలిపాడు. జనాభా సమస్య ఏర్పడటానికి ఈ క్రింది కారణాలు ముఖ్యం 1) సంతానం ఎక్కువగా ఉండటం గొప్పదనంగా భావించడం. 2) ఆడపిల్లలు లేదా మగపిల్లలు కావాలనే కోరికలు. 3) చిన్నప్పుడే వివాహాలు చెయ్యటం. 4) నిరక్షరాస్యత. 5) మత విశ్వాసాలు. ఇన్ని కారణాల వల్ల రాను రాను జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. జనాభా సమస్యను పరిష్కరించటానికి ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళికా విధానం రూపొందించింది. జనాభా సమస్య నిర్మూలనకు తీసుకోవలసిన చర్యలు : ‘కుటుంబ నియంత్రణ’ ను అన్ని మతాల ప్రజలు పాటించేలా చర్యలు తీసుకోవాలి. జనాభా సమస్య వల్ల ఏర్పడే నష్టాలను ప్రజలకు తేటతెల్లం చెయ్యాలి. స్త్రీల కంటే పురుషులు కుటుంబ నియంత్రణ చికిత్స చేసుకోవటం తేలిక. అని చెప్పాలి. కుటుంబ నియంత్రణకి ప్రోత్సాహం కలిగించే సదుపాయాలు, సౌకర్యాలు కల్పించాలి. ఆడయినా, మగయినా ఒకటేనన్న భావాన్ని కలిగించాలి. కుటుంబ నియంత్రణ పాటించడం పాపమనే భావనని తొలగించాలి. అప్పుడు మాత్రమే జనాభా పెరుగుదలను అరికట్టడం సాధ్యమవుతుంది. జనాభా సమస్య వల్ల నష్టాలు ఇవి – జనాభా పెరుగుదల వల్ల ఆహార సమస్య, నిరుద్యోగ సమస్య, కాలుష్య సమస్యల వంటివి ఎక్కువవుతాయి. విద్యాలయాలలో సీట్లు లభించక విద్యావకాశాలు తగ్గిపోతాయి. దేశ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమవుతుంది. “అందరికీ ఆరోగ్యం ” అనేది సాధ్యం కానేరదు. సంతానం ఎక్కువగా వుంటే తల్లిదండ్రులపై భారం ఎక్కువై పిల్లల్ని సక్రమంగా పెంచి పోషించలేరు. జనాభా ఇదే విధంగా పెరుగుతూవుంటే బట్టకీ, ఇంటికీ కూడా కరవు తప్పదు. అందువల్ల ప్రభుత్వం జనాభా సమస్య నిర్మూలనకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ‘చిన్న కుటుంబమే చింతలు లేని కుటుంబం’ అని బోధించడమే కాదు. నాయకులు, అధికారులు తాము కూడా పాటించాలి. కుటుంబ నియంత్రణ పాటించని వారిని శిక్షించే చట్టం రూపొందించాలి. అప్పుడే దేశం ప్రగతి మార్గంలో పయనిస్తుంది.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ప్రశ్న : జలచక్రం అంటే ఏమిటి? వివరించండి.
భూమి ఉపరితలం మరియు గాలి మధ్య జరిగే నీటి ప్రసరణను “జలచక్రం” (హైడ్రోలాజికల్ వలయం) అని అంటారు, జలచక్రాన్ని సులభంగా ఈ కింది విధంగా క్రోడీకరించవచ్చు. 1. బాష్పీభవనం : ద్రవం, వాయువుగా మారటం. కారణం : సూర్యుడు నీటి వనరులను వేడి చేయటం. ఫలితం : ద్రవ నీరు, నీటి ఆవిరి ( వాయువు)గా మారుతుంది. 2. సాంద్రీకరణం : వాయువు ద్రవంగా మారటం. కారణం : ఆవిరి గాలిలో పైకి వెళ్ళి చల్లబడటం. ఫలితం : నీటి ఆవిరి (వాయువు) మేఘాలలో ద్రవ నీటిగా మారుతుంది. 3. అవపాతం : నీరు లేదా గడ్డ కట్టిన నీరు భూమిపై పడటం. కారణం : మేఘ బిందువులు చాలా బరువుగా ఉంటాయి. అవి భూమిపై పడతాయి. ఫలితం : వర్షం, మంచు, స్ట్రీట్ లేదా వడగళ్ళ రూపంలో అవపాతం చెందిన నీరు భూమికి చేరటం. 4. సేకరణ మరియు ప్రవాహం : నీరు భూగర్భంలోనికి ఇంకడం, ప్రవహించడం. కారణం : భూమి యొక్క ఉపరితలంపై నీరు సమీకరించబడటం, కొన్నిసార్లు ముందుకు ప్రవహించటం. ఫలితం : నీరు సరస్సులు, చెరువులలో చేరుతుంది. నదులు ప్రవాహాలుగా ప్రవహించి, సముద్రాలు, మహా సముద్రాలకు చేరుతుంది.
Telugu
tel
original-annotations
dbc5c037b2ecc422f10c97f2be156debb4eafe9f62b6dd7d6d7c7f1f7c43f28b
రంతిదేవుని ద్వారా వ్యాసుడు పలికించిన ధర్మం ఏమిటి?
మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాసానికి ఉపకరించే అంశాలు కోకొల్లలు. వేదముల నుండి పురాణాల వరకు అన్నింటిలోనూ ఈ ప్రస్తావన ఉంది. మహాభారతం లో దధీచి, శిబి, రంతిదేవుని పాత్రల ద్వారా ఈ విషయాన్ని వ్యాసుల వారు వివ రించారు. మానవతావాది, త్యాగశీలి, దయాశీలి రంతిదేవుని మాటల్లో “నత్వహం కామయే రాజ్యం”….. అన్న శ్లోకం ద్వారా “నాకు రాజ్యము వద్దు, నాకు స్వర్గమూ వద్దు, నాకు మోక్షము వద్దు దుఃఖంతో బాధపడుతున్న జీవుల ఆర్తి తొలగి పోవటమేకావాలి” అని చెప్పబడింది. భాగవతంలో కూడా “న కామయే హం గతి మీశ్వరాత్…..” అన్న శ్లోకంలో కూడా దుఃఖపీడితుల హృదయాల్లో తానుడంటూ వాళ్ళ బాధలను తాను అనుభవించైనా వారి దుఃఖాలను పోగొట్టాలి అని రంతిదేవుడు చెప్పిన మాటలు నిజంగా మానవతకు సంబంధించినది.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
2x + 3y = 11.రేఖీయ సమీకరణాల జతకు సాధనలు అనంతము అవునట్లు మరొక రేఖీయ సమీకరణాన్ని రాయండి.
6x + 9y = 33
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
i) అనురూప కోణాలు సమానం కావాలి. ii) అనురూప భుజాల నిష్పత్తి సమానం కావాలి.’ రెండు త్రిభుజాలు సరూపాలు కావడానికి పై రెండు నియమాలలో ఏదోకటి సరిపోతుంది అని సురేష్ అంటు న్నారు. సురేష్ సమాధానంతో నీవు ఏకీభవిస్తావా ? లేదా ?
సురేష్ సమాధానంతో ఏకీభవిస్తాను.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
నీవు ఎండలో నిలబడి పరిసరాలను పరిశీలిస్తున్న సందర్భంలో క్రింది వానిలో సరియైనది. A) నల్లగుడ్డు, కనుపాపను సంకోచింపచేయును. B) నల్లగుడ్డు, కనుపాపను వ్యాకోచింపచేయును. C) కనుపాపలో ఎలాంటి మార్పూ లేదు. D) నల్లగుడ్డులో ఎలాంటి మార్పూ లేదు. యొక్క సామర్థ్యం
A) నల్లగుడ్డు, కనుపాపను సంకోచింపచేయును.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
Question: 2017 నాటికి లద్ద గ్రామంలో వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి ఎంత? Answer the question with Yes or No. If it is not possible then answer None. Hint: లద్ద విజయనగరం జిల్లా, కొమరాడ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన కొమరాడ నుండి 17 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన పార్వతీపురం నుండి 25 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 45 ఇళ్లతో, 216 జనాభాతో 20 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 110, ఆడవారి సంఖ్య 106. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 0 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 215. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 581779[1].పిన్ కోడ్: 535521. విద్యా సౌకర్యాలు గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి ఉంది.బాలబడి, ప్రాథమికోన్నత పాఠశాల, మాధ్యమిక పాఠశాల‌లు కొమరాడలో ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల కొమరాడలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల పార్వతీపురంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల నెల్లిమర్లలోను, పాలీటెక్నిక్‌ పార్వతీపురంలోను, మేనేజిమెంటు కళాశాల బొబ్బిలిలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల పార్వతీపురంలోను, అనియత విద్యా కేంద్రం కొమరాడలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయనగరం లోనూ ఉన్నాయి. వైద్య సౌకర్యం ప్రభుత్వ వైద్య సౌకర్యం ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ప్రైవేటు వైద్య సౌకర్యం తాగు నీరు బావుల నీరు గ్రామంలో అందుబాటులో ఉంది. తాగునీటి కోసం చేతిపంపులు, బోరుబావులు, కాలువలు, చెరువులు వంటి సౌకర్యాలేమీ లేవు. పారిశుధ్యం గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు. సమాచార, రవాణా సౌకర్యాలు సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. మొబైల్ ఫోన్ ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
None
Telugu
tel
re-annotations
91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0
కింది వాక్యాలలో సమానార్థక పదాలను (పర్యాయ పదాలు) గుర్తించి రాయండి. 1. కరముతో అన్నం తింటాము. హస్తములో జాతక రేఖలుంటాయి. 2. ధనమే అన్నింటికీ మూలం. సంపద లేక పేదలు ఆకలితో పస్తులుంటున్నారు. 3. ఆడపిల్ల చదువు అవనికే వెలుగు. భూకంపం వల్ల పుడమి కుంగుతుంది. 4. కంసాలి పసిడితో ఆభరణాలు చేస్తాడు. ఆడవారికి పుత్తడిపై మమకారం ఎక్కువ.
1. కరముతో అన్నం తింటాము. హస్తములో జాతక రేఖలుంటాయి. చేయి = కరము, హస్తము 2. ధనమే అన్నింటికీ మూలం. సంపద లేక పేదలు ఆకలితో పస్తులుంటున్నారు. సిరి = ధనము, సంపద 3. ఆడపిల్ల చదువు అవనికే వెలుగు. భూకంపం వల్ల పుడమి కుంగుతుంది. భూమి = అవని, పుడమి 4. కంసాలి పసిడితో ఆభరణాలు చేస్తాడు. ఆడవారికి పుత్తడిపై మమకారం ఎక్కువ. కనకం = పసిడి, పుత్తడి
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ప్రశ్న గ్లోబు యొక్క ఆవిర్భావ చరిత్రను వివరించండి, గ్లోబు యొక్క ఉపయోగాలు తెల్పండి.
పురాతన ఖగోళ గోబును 1492లో మార్టిన్ బెహెమ్ రూపొందించాడు. మరొక ఆధునిక ఖగోళ గోబును కానిస్టాంట్ నోపిల్ అబ్జర్వేటరీ నందు 1570 సంవత్సరంలో “టకి-ఆల్-దిన్” రూపొందించాడు. ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును జహంగీర్ సామ్రాజ్యంలో మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. గ్లోబల్ అనే పదం ‘గ్లోబస్’ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. గోళం అని దాని అర్థం. ఉపయోగాలు: భూమి ఆకారాన్ని చక్కగా చూపుతుంది. ఖండాలు, మహాసముద్రాలను చూపుతుంది. భూభ్రమణాన్ని చూపిస్తుంది. ప్రపంచంలోని దేశాలను చూపిస్తుంది.
Telugu
tel
original-annotations
dbc5c037b2ecc422f10c97f2be156debb4eafe9f62b6dd7d6d7c7f1f7c43f28b
ఇచ్చిన పద్యానికి భావం రాయండి: కం. మఱవ వలెఁ గీడు, నెన్నఁడు మఱవంగా రాదు మేలు, మర్యాదలతో దిరుగవలె సర్వ జనముల దరి, బ్రేమ మెలంగవలయు ధరణి కుమారీ !
ఓ కుమారీ ! ఒకరు చేసిన కీడు మరచిపోవాలి. కాని ఇతరులు మనకి చేసిన మేలును ఎన్నడూ మరచిపోకూడదు. అందరి పట్ల అనురాగంతో, ప్రేమతో ప్రవర్తించాలి.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
సహకార సంఘాలను నిర్వచించి, దాని ముఖ్య లక్షణాలను వివరించండి.
ప్రజాస్వామ్య పద్ధతిలో లాభాపేక్షలేని పరస్పర సహాయము, సేవాశయాల కొరకు పరిమిత వనరులు గల వ్యక్తులు వ్యాపారము మరియు ఆర్థిక ప్రయోజనాలు పెంపొందించుటకే సమానత్వ ప్రాతిపదికపైన ఏర్పడిన స్వచ్ఛంద సంఘము సహకార సంఘము. సమిష్టి కృషికి, సాంఘిక శ్రేయస్సు దృష్టికి, సమాజ సేవకు పాటుపడుటయే ఈ సంస్థ లక్ష్యము. దీని ప్రధాన ధ్యేయము లాభార్జన కాదు. సభ్యులకు సేవ చేయుటయే. ఒకరికోసము అందరూ, అందరి కోసము ఒక్కరు అనేది ఆశయము. పరస్పర సహాయము ద్వారా స్వయం సహాయము దీని మార్గదర్శకమైన సూత్రము. 1912 సహకార సంఘాల చట్టము ప్రకారము ‘సహకార సూత్రాలకు అనుగుణముగా సభ్యుల ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించే ధ్యేయముతో స్థాపించబడిన సంస్థను సహకార సంస్థ’ అంటారు. లక్షణాలు: 1. స్వచ్ఛంద సంఘము: ఒక ప్రాంతానికి లేదా ఒక వర్గానికి చెందిన ప్రజలు తమంతట తాముగా స్వప్రయోజనాల కోసము ఏర్పాటు చేసుకున్న సంఘమే సహకార సంస్థ. ఈ సంస్థలో చేరడానికిగాని, వదిలివెళ్ళడానికి సభ్యులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. 2. బహిరంగ సభ్యత్వము: సహకార సంఘములో చేరడానికి కులము, మతము, జాతి, రాజకీయ సిద్ధాంతాలు, విశ్వాసాలు మొదలైన వాటితో సంబంధము లేదు. సభ్యత్వము అందరికీ లభిస్తుంది. 3. సభ్యుల సంఖ్య: సహకార సంస్థలను స్థాపించడానికి 10 మంది సభ్యులు కావలెను. రాష్ట్ర సహకార సంఘాలలో వ్యక్తులు 50 మంది కావలెను. గరిష్ట సభ్యులకు పరిమితి లేదు.. 4. ప్రభుత్వ నియంత్రణ: సహకార సంఘాల నమోదు తప్పనిసరి. వాటిపై ప్రభుత్వ అజమాయిషీ, నియంత్రణ ఉంటాయి. ఇవి ప్రభుత్వ నిబంధనలను పాటించాలి. ప్రతి సంవత్సరము వార్షిక నివేదికలను, లెక్కలను తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించవలెను. సహకార శాఖ ఆడిటర్ వీటిని తనిఖీ చేస్తాడు. 5. మూలధనము: సంఘాల మూలధనమును సభ్యులే సమకూరుస్తారు. మూలధనము పరిమితముగా ఉండటమువలన ప్రభుత్వము నుంచి ఋణాలు, రాష్ట్ర, కేంద్ర సహకార సంస్థల నుంచి గ్రాంటు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి సహయాన్ని పొందుతాయి. 6. ప్రజాస్వామ్యబద్ధమైన నిర్వహణ: ఈ సంస్థ నిర్వహణ ప్రజాస్వామిక సూత్రాలమీద జరుగుతుంది. ప్రతి సభ్యునికి సంఘ నిర్వహణలో పాల్గొనే అవకాశము ఉంటుంది. సంఘములోని సభ్యులందరికి ఓటు హక్కు సమానము. ఒక మనిషికి ఒక ఓటు ఉంటుంది. 7. సేవాశయము: సహకార సంస్థల ప్రధాన ధ్యేయము సభ్యులకు సేవచేయుటయే. లాభార్జన కాదు. 8. పెట్టుబడిపై రాబడి సభ్యులకు తమ పెట్టుబడులపై డివిడెండు లభిస్తుంది. 9. మిగులు పంపిణీ: సహకార సంస్థలు వ్యాపారము చేయగా వచ్చిన మిగులు నుంచి కొంత మొత్తాన్ని విరాళాలకు (విద్య, వైద్యం మొదలైనవి) మరికొంత మొత్తాన్ని రిజర్వు నిధులకు కేటాయించి, మిగిలిన దానిని సభ్యులకు పరిమితమైన లాభాంశాలుగా పంచుతారు. 10. సహకార సంస్థల నమోదు: సహకార సంస్థను సహకార సంఘాల చట్టము 1912 క్రింద నమోదు చేయించవలెను. అప్పుడు దానికి కంపెనీ హోదా వస్తుంది. దాని వలన సంస్థకు న్యాయాత్మకమైన వ్యక్తిత్వము, నిర్దిష్టమైన న్యాయసత్వము కలుగుతుంది.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
కోకిల స్వభావాన్ని వర్ణించండి.
కోకిల గానం భగవద్గీతలా ఆనందాన్ని, జాతీయగీతమైన జనగణమన లాగ ఉత్సాహాన్ని కలిగిస్తున్నది. ఏ కరెంటు స్తంభం పైననో, ఏ` ఏడంతస్తుల మేడపైననో కనబడకుండా ఉంది. కోకిలను కళాకారులకు ప్రతీకగా తీసుకొని ఆధ్యాత్మికతను, దేశభక్తిని ప్రబోధించే కళాకారులు కనబడకుండా ఉన్నారని కవి భావించాడు. కొందరు కళాకారులు ఏడంతస్తుల మేడలో రాజభోగాలు అనుభవిస్తుంటే మరికొందరు డబ్బులేక పేదరికంలో ఉన్నారని ధ్వనింప జేశాడు. ఈ పట్టపగలు, మండుటెండలో కోకిల పాడుతున్న పాటతో కవి గుండె కరిగింది. ఎంతో హడావిడిగా ఉండే ఈ కోఠీ సెంటర్లో ఎవరో కోటిమందిలో ఒకడు కవి వంటి వాడికి తప్ప పాట వినే అంత ఖాళీ సమయం ఎవరికి ఉంది ? కోకిల ఎవరో వన్స్ మోర్ అని అన్నట్లు పాడిన పాటనే మళ్ళీ మళ్ళీ పాడుతుంది. ఆహా ఓహో అనే పొగడ్తల మాటలే తప్ప డబ్బు ఎవరూ ఇవ్వరే అని చెప్తున్నాడు కవి. కళాకారులకు చప్పట్లు తప్ప నగదు బహుమతులు, ప్రోత్సాహాలు ఉండడం లేదని భావం. కోకిల కుహు కుహు అని పాడినప్పుడల్లా ఒక మినీ కవిత వెలువడ్డట్లు అనిపిస్తుంది. అంటే కోకిల చేసిన ప్రతీ శబ్దంలో ఒక కొత్త అర్థం స్ఫురిస్తుందని భావం. కోకిల గొంతు ఒక మధురమైన కవితల క్యాసెట్ లాగ అనిపిస్తుందని కవి చెప్పాడు. కొత్తగా వృత్తిలోకి వచ్చిన బిచ్చగాడు సమయ సందర్భాలు తెలియకుండా అడుక్కున్నట్లు ఎందుకోసం పాడుతున్నావు. సంవత్సరకాలం పాటు పాటించిన మౌనవ్రతానికి ఈ రోజు ముగింపు పలుకుతున్నావా? అని కవి కోకిలను అడిగాడు. నిజమే నోరు మూసుకొని కూర్చొంటే ఎవరూ గుర్తించరు. కవులు మాత్రమె కోకిల గానంలోని మాధుర్యాన్ని తమ కవితల్లో నింపుకోవాలని చూస్తారని కూడా అన్నాడు. చిలకల్లా, హంసల్లా, నెమలిలాగా అందంగా ఉంటే ఏ దేవుడైన వాహనంగా ఉపయోగించుకుంటాడు కాని నల్లగా ఉన్న వారిని సమాజం గుర్తించదు అని కవి అన్నాడు. కోకిలా ఎవరో వచ్చి సన్మానాలు చేయాలనే కోరిక నీకు లేదనే విషయం కవికి తెలుసు. కోకిలకు సూర్యుడు చూపిన మార్గం మాత్రమే తెలుసు కాని పైరవీలు చేసి సన్మానాలు పొందే దారి తెలియదు అని కవి అన్నాడు. అంటే కొంతమంది కళాకారులు పైరవీల ద్వారా గుర్తింపును పొందుతున్నారని ఆ గుర్తింపు కోసమే ప్రదర్శనలు చేస్తారని చెప్తున్నాడు. కోకిల అలా కాకుండా తనకు దేవుడు ఇచ్చిన కళను నిస్వార్థంగా ప్రదర్శిస్తుందని తెలిపాడు. కోకిల చేదుగా ఉండే మామిడి లేత చిగుళ్లను తిన్నందుకే ఇంతమందికి ఆనందాన్ని కలిగించే విధంగా మధురంగా పాడుతుంది. కాని మానవులు మాత్రం తియ్యని మామిడి పళ్ళను తిని కూడా మనసులకు బాధకలిగించే మాటలనే మాట్లాడుతున్నారు. తినే తిండిలో కాకుండా నేర్చుకునే సంస్కారంలోనే మానవుల మాట తీరు ఉంటుందని కవి చెప్పాడు. కోకిల చార్మినార్ పైనా, నౌబత్ పహాడ్ పైన గల బిర్లామందిర్ పైనా స్వేచ్ఛగా వాలగలదు. మత విద్వేషాల రక్తాలు పారే ప్రదేశంలో కూడా రాగాలతో అనురాగాలను పంచగలదు. కుల మతాల భేదం పాటించని కోకిల సామాజిక సమానతను ఎవరూ అర్థం చేసుకోరు. అందరూ సమానము అని చెప్పే మంచి మాటలు ఎవరికీ నచ్చవు. దాని కారణంగా పెంచి పోషించిన వారి ద్వారానే దూరం కొట్టబడ్డ పేదరాలు కోకిల అని కవి అంటున్నాడు. కోకిలలకు గూడు నిర్మించుకోవడం తెలియదు అది తన గుడ్లను కాకి గూటిలో పెడితే కాకి ఆ గుడ్లను పొదిగి పిల్లను చేస్తుంది. కోకిల పెరిగి శబ్దం చేసినప్పుడు అది తనపిల్ల కాదని కాకి దానిని వెళ్లగొడుతుంది. అదే విధంగా తమ జాతి, తమ కులం, తమ మతం కాదు అని అనేకమంది మంచివారిని దూరం చేసుకుంటున్నారని కవి ఆవేదనను వ్యక్తం చేశాడు. ఓ కోకిలా ఆ పక్కకు చూడు. ఆ పెద్దకోకిలకు నీ మీద ఎంత ద్వేషం ఉందొ నీతో పోటీ పెట్టుకున్నట్లు నువ్వు ఎలా కూస్తే అది కూడా అలాగే కూస్తుంది. తెలివితేటలకు కులభేదాలు లేనట్టే ఈర్ష్యాద్వేషాలకు వయస్సు భేదం లేదు అని కవి చెప్పాడు. ఒక స్థాయిలో ఉన్న కళాకారులు వెనుక వస్తున్న కొత్త తరం కళాకారులను ఎదగనివ్వడం లేదని కవి భావన. దీనిలో కోకిల స్వభావాన్ని కవి కనపర్తి రామచంద్రాచార్యులు వర్ణించారు.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ఓవర్ డ్రాఫ్ట్ను వివరించండి.
ఓవర్ డ్రాఫ్ట్ అనేది బ్యాంకు అందజేసే పరపతి సౌకర్యము. వ్యాపార అవసరాలకు బ్యాంకు మంజూరు చేసిన పరిమితి మేరకు ఖాతాలో ఉన్న నిల్వ కంటే ఎక్కువ మొత్తాన్ని వాడుకోవచ్చు. దీనిని నగదు లేదా చెక్కులను బ్యాంకులో డిపాజిట్ చేయడం ద్వారా తిరిగి చెల్లించవచ్చు. వ్యాపార సంస్థ బ్యాంకు అందచేసిన ఈ ఓవర్ డ్రాఫ్ట్ప వడ్డీని చెల్లించవలసి ఉంటుంది. ఓవర్ డ్రాఫ్ట్ను ప్రతికూల నిల్వ అని కూడా అంటారు.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
స్వల్పకాలిక విత్తానికి ఉన్న వనరులు ఏవి ?
ఒక సంవత్సరము కంటే తక్కువ కాలానికి అనగా స్వల్ప కాలానికి అవసరమయ్యే నిధులను స్వల్పకాలిక విత్తము అంటారు. ఈ విత్తము సంస్థ యొక్క నిర్వహణ మూలధన అవసరాలకు ఉపయోగపడుతుంది. ఇది నగదు నుంచి సరుకు, సరుకు నుంచి ఋణగ్రస్తులు మరియు నగదుగా మారుతుంది. స్వల్పకాలిక విత్తానికి మూలాధారాలు: 1. బ్యాంకు పరపతి: వ్యాపార సంస్థలకు అవసరమయ్యే స్వల్పకాలిక వనరులను బ్యాంకులు ఋణాలు, క్యాష్ క్రెడిట్లు, ఓవర్ డ్రాఫ్ట్ రూపములో ధనసహాయము చేస్తాయి. ఎ) ఋణాలు: ఈ పద్ధతిలో బ్యాంకులు పెద్ద మొత్తములో అడ్వాన్సు చేస్తుంది. ఈ ఋణాలని చరాస్థులు లేదా స్థిరాస్థుల హామీ మీద మంజూరు చేస్తారు. అనుమతించిన ఋణం మొత్తంపై వడ్డీని చెల్లించాలి. బి) క్యాష్ క్రెడిట్: ఇది ఒక పరపతి సదుపాయము సర్దుబాటు. బ్యాంకు వ్యాపార సంస్థలకు ఒక పరిమితికి లోబడి పరపతిని మంజూరు చేస్తుంది. ఈ పరపతిలో ఎంత అవసరమో అంత మొత్తాన్నే వ్యాపార సంస్థ వాడుకుంటుంది. వడ్డీని వాడుకున్న మొత్తానికే ఛార్జి చేస్తారు. సి) ఓవర్ డ్రాఫ్ట్: ఈ విత్త సదుపాయము ప్రకారము బ్యాంకరు వ్యాపార సంస్థ ఖాతాలో నిల్వ కంటే ఎక్కువ మొత్తాన్ని వాడుకునే అవకాశము కల్పిస్తుంది. దీనిని ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యము అంటారు. ఈ పరిమితిని బ్యాంకరు నిర్ణయిస్తాడు. నిల్వ కంటే మించి వాడిన మొత్తము మీదనే వడ్డీని ఛార్జి చేస్తారు. 2. వర్తక ఋణాలు: ఒక సంస్థ తన ఖాతాదారులకు అరువు ఇచ్చినట్లే తరుచుగా తన సప్లయిదారుల నుంచి అరువు సౌకర్యాన్ని పొందుతుంది. దీనిని వర్తకపు ఋణము అంటారు. దీనిని నగదు పూర్వకముగా ఇవ్వడం జరగదు. కాని కొనుగోలు చేసిన సరుకునకు వెంటనే నగదు చెల్లించనవసరము లేదు. ఆర్థికపుష్టి, గుడ్ విల్ ఉన్న సంస్థలకు, | ఖాతాదారులకు వర్తకపు ఋణాన్ని ఇస్తారు. 3. వాయిదా. పరపతి: యంత్రాలు, యంత్రపరికరాలు సప్లయిదారుల నుంచి వ్యాపార సంస్థలు పరపతిని పొందవచ్చు. సాధారణముగా సప్లయిదారులు కొనుగోలు చేసిన ఆస్తుల విలువను 12 నెలలు అంత కంటే ఎక్కువ కాలానికి చెల్లించడానికి అంగీకరిస్తారు. నగదు ధరలో కొంత మొత్తము చెల్లించి, మిగిలినది కొన్ని వాయిదాలలో చెల్లించవలసి ఉంటుంది. 4. వినియోగదారుల నుంచి అడ్వాన్సులు: సాధారణముగా వ్యాపార సంస్థలు ఆర్డర్లతో పాటు కొంత మొత్తాన్ని అడ్వాన్సుగా స్వీకరించవచ్చును. ఖాతాదారుల ఆర్డర్ ప్రకారము వారికి భవిష్యత్తులో సప్లయి చేసే వస్తువుల ధరలో కొంత భాగాన్ని వినియోగదారుల అడ్వాన్సు సూచిస్తుంది. ఇది స్వల్పకాలిక మూలధన వనరు. 5. వాణిజ్య పత్రాలు: ఒక సంస్థ స్వల్పకాలానికి నిధులను అంటే 90 రోజులనుంచి 365 రోజుల లోపు కాలవ్యవధితో సేకరించడానికి జారీ చేసే హామీ లేని ప్రామిసరీ నోటు “వాణిజ్య పత్రము”. దీనిని ఒక సంస్థ వేరొక సంస్థకు, భీమా కంపెనీలకు, బ్యాంకులకు, పెన్షన్నిధి సంస్థలకు జారీ చేస్తుంది. ఈ ఋణంపై హామీ లేనందున మంచి పరపతి రేటింగ్ ఉన్న సంస్థలే వీటిని జారీ చేస్తాయి.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ఇచ్చిన ప్రశ్నకు జవాబు ఇవ్వండి: జపాన్‌పై అణుబాంబు ఎప్పుడు వేయబడింది?
1945
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ABCD చతుర్భుజంలో ‘0’ కేంద్రంగా గల వృత్తంలో చతుర్భుజ భుజాలను P,Q, R, S వద్ద స్పర్శించునట్లు అంతర్లిఖించబడినది. మరియు AP = 5 సెం.మీ., BP = 7 సెం.మీ., CQ = 4 సెం.మీ., DR = 6 సెం.మీ., అయిన చతుర్భుజం ABCD చుట్టుకొలతను కనుగొనుము.
చతుర్భుజం చుట్టుకొలత = AB + BC + CD + AD = 12 + 11 + 10 + 11 = 44 సెం.మీ.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా 5 నినాదాలు తయారుచేయండి.
దురాచారాలను తొలగించు – సమానతను పంచు. అంటరానితనం వద్దు – సంకుచితంగా మసలవద్దు. వరకట్నాన్ని నిర్మూలిద్దాం – ఆడపిల్లల జీవితాల్లో వెలుగులు నింపుదాం. కులంకన్న గుణంమిన్న. అసమానతలకు దూరంగా ఉండు – అందరికి ఆదర్శంగా జీవించు. కులమతాలను దూరం చేయి – సమసమాజాన్ని అందించు.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ఫాబేసికి చెందిన మొక్కల ఆర్థిక ప్రాముఖ్యతను తెలపండి.
కందులు (కజానస్ కజాన్), మినుములు (ఫెసియోలస్ ముంగో), పెసలు (ఫెసియోలస్ ఆరియస్), శనగలు (సైసర్ అరైటినయ్) మొదలైన అపరాల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. డాలికాస్, గ్లైసిన్ల ఫలాలను కూరగాయలుగా వాడతారు. పైసమ్, అరాబిన్ల విత్తనాలు తింటారు. అరాఖిస్ హైపోజియా విత్తనాల నుంచి తీసే వేరుశనగ నూనెను, గ్లైసిన్ మాక్స్ విత్తనాల నుంచి తీసే సోయాబిన్ నూనెను వంటలకు వాడతారు. అరిఖిస్ హైపోజియా నుంచి నూనె తీసిన తరువాత వచ్చే తెలగ పిండిని వంటకాల్లోను, పశువులకు ఆహారంగాను వాడతారు. పొంగామియా పిన్నేటా విత్తనాల నుంచి వచ్చే నూనెను మందుల తయారీలో ఉపయోగిస్తారు. ఆబ్రస్ ప్రికటోరియస్ విత్తనాలను కంసాలీలు తూకానికి వాడతారు. చాలా మొక్కలు పశుగ్రాసంగా ఉపయోగపడతాయి (క్రొటలేరియా, ఫేసియోలస్) నత్రజని స్థాపన ఆ శక్తి అధికంగా ఉండటం వల్ల చాలా పంటలను, పంటల మార్పిడికి ఉపయోగిస్తారు. క్రొటలేరియా నుంచి లభించే నారలను తాళ్ళ తయారీకి ఉపయోగిస్తారు. ట్రైగోనెల్లా విత్తనాలు వంటలలోను, మందుగాను ఉపయోగపడతాయి. లేక మెంతిఆకులను ఆకుకూరగా తింటారు. ట్రైఫ్రోషియా, సెన్బానియా మొక్కలను హరిత ఎరువు గా వాడతారు. ఇండిగోఫెరా నుండి నీలిమందు లభిస్తుంది. టిరోకార్పస్ సాంటలైనస్ కలపను సంగీత వాయిద్యాల తయారీకి వాడతారు. డాల్బెర్జియా లాటిఫోలియా కలపను ఫర్నిచర్ తయారీకి వాడతారు.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి: వివిధ రకాలైన బిల్లులను గురించి వివరించండి.
బిల్లులను దిగువ విధముగా వర్గీకరించవచ్చును. 1) కాల పరిమితి, డిమాండు బిల్లులు : కాల పరిమితి అంటే బిల్లు గడువు తీరిన తరువాత బిల్లుపై సొమ్ము చెల్లించవలసి ఉంటే వాటిని కాల పరిమితి గల బిల్లులు అంటారు. ఈ బిల్లులకు స్వీకర్త అంగీకారం తప్పనిసరి. బిల్లు కాల పరిమితి అదనముగా 3 రోజులు అనుగ్రహ దినాలు కలుపుకొని గడువు తేదీని నిర్ణయిస్తారు. బిల్లు మొత్తాన్ని బిల్లు కర్త కోరిన వెంటనే స్వీకర్త చెల్లించే బిల్లును డిమాండు బిల్లులు అంటారు. ఈ బిల్లులకు స్వీకర్త అంగీకారము అవసరము లేదు మరియు అనుగ్రహ దినాలు వర్తించవు. 2) వర్తకపు, సర్దుబాటు బిల్లులు: వ్యాపార బాకీలను పరిష్కరించడం కోసం బిల్లులను వ్రాస్తే వాటిని వర్తకపు బిల్లులు అంటారు. ఉదాహరణకు x, y కి 10,000 ల సరుకు అమ్మి, ఆ మొత్తానికి బిల్లు వ్రాస్తాడు. y స్వీకృతిని తెలియజేసిన తర్వాత గడువు తేదీన y బిల్లుపై మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది. వ్యాపార బాకీలను పరిష్కరించడం కోసం కాకుండా, ఒకరి అవసరాలను మరొకరు తీర్చడానికి ఒకరిపై మరొకరు ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా వ్రాసుకున్న బిల్లును సర్దుబాటు బిల్లులు అంటారు. డబ్బు పరస్పరము సర్దుబాటు కోసం ఒకరిపై మరొకరు బిల్లులను వ్రాస్తారు. తరువాత బ్యాంకులో డిస్కౌంటు చేసి, ఆర్థిక అవసరాలను తీర్చుకుంటారు. 3) స్వదేశీ, విదేశీ బిల్లులు : బిల్లు కర్త, బిల్లు స్వీకర్త స్వదేశీయులై ఉండి బిల్లు చెల్లింపు స్వదేశములో జరిగే విధముగా బిల్లులను వ్రాసుకుంటే వాటిని స్వదేశీ బిల్లులు అంటారు. స్వీకర్త విదేశములో ఉండి, స్వీకృతి తెలియజేసినా, బిల్లు చెల్లింపు స్వదేశములో జరిగితే దానిని కూడా స్వదేశీ బిల్లుగానే పరిగణిస్తారు. బిల్లుకర్త, బిల్లు స్వీకర్తలలో ఎవరైనా విదేశములో నివసిస్తూ, బిల్లు చెల్లింపు విదేశములో జరిగితే దానిని విదేశీ బిల్లు అంటారు. విదేశీ బిల్లులను మూడు సెట్లుగా తయారుచేసి, విడివిడిగా మూడు పోస్టులలో స్వీకర్తకు పంపుతారు. ఏదైనా ఒక సెట్ త్వరగా చేరాలనే లక్ష్యముతో మూడు సెట్లను పంపినప్పటికి స్వీకర్త ఒక సెట్పైన సంతకము చేస్తాడు.
Telugu
tel
re-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించి, క్రింద ఇచ్చిన ప్రశ్నలు 93-96లకు సమాధానాలు రాయండి. “నగరపాలక ఉన్నత పాఠశాల వ్యాయామం ఉపాధ్యాయుడు 2 బ్యాట్లు మరియు 3 బంతులు ₹ 1650 కి మొదటి రోజు, 6 బ్యా లు మరియు 9 బంతులు ₹4950కి రెండవ రోజు కొన్నారు.” బ్యాట్ విలువ ₹ 750 అయిన బంతి వెల ఎంత ?
బ్యాట్ విలువ x = ₹ 750 ని 2x + 3y = 1650లో ప్రతిక్షేపించగా 2(750) + 3y = 1650 ⇒ 1500 + 3y = 1650 ⇒ 3y = 150 = y = 50. ∴ బంతి వెల = ₹ 50
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
x + y – 16 = 0 మరియు x – ky + 2 = 0 యొక్క సాధన (10, 6) అయిన ఓ విలువ ఎంత ?
x + y – 16 = 0 మరియు x – ky + 2 = 0 సాధన (10, 6) ∴ x = 10, y = 6 ను X – ky + 2 = 0 లో ప్రతిక్షేపించగా, . 10 – 6k + 2 = 0 ⇒ 12 = 6k = k = 2
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ఇచ్చిన పద్యానికి ప్రతిపదార్ధం మరియు తాత్పర్యం రాయండి: సీ|| ఎవరు తనాత్మను యేకంబుగా జేసి సర్వభూతాలని సమము జూచి జ్ఞాన వైరాగ్య యజ్ఞము దానతపములన్ చేయుచుండిన ముక్తి చెందగలరు తామరాకులు నీళ్ళ దడువకుండిన యట్లు నుందురు సుజ్ఞానులుర్విలోన నలసియుందురు చూడకళలేని విధముగ గానవత్తురుధవ కాంతిబొందు తే.గీ॥ నొకరి దూషించి భూషింపరొకరి నెపుడు సుఖము దుఃఖమొక పదము జూతురయ్య వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప
ప్రతిపదార్థం : మా + అప్ప వినుడి = మా నాయనలారా! (సంబోధన) వినుడి = వినండి విహితుడు + అప్ప = నాయనా! మీ హితమును కోరేవాడు సిద్దప్ప = ఈ సిద్ధప్ప కనకము + అప్ప = బంగారం వంటిది కవికుప్ప = కవిత్వపు రాశిని (సిద్ధప్ప రాసిన కవిత్వాన్ని) కనుడి కరమొప్ప = జాగ్రత్తగా గమనించండి ఎవరు = ఎవరైతే తన + ఆత్మను = తన ఆత్మను యేకంబుగా జేసి = పరమాత్మతో సమానంగా చేసి సర్వభూతాలని = అన్ని జీవులను సమము జూచి = సమానంగా చూసి జ్ఞాన వైరాగ్య యజ్ఞము = జ్ఞానము, వైరాగ్యము అనే యజ్ఞం దాన, తపములన్ = దానాలు తపస్సులు చేయుచుండిన = చేస్తే ముక్తి చెందగలరు = మోక్షాన్ని పొందుతారు తామరాకులు = తామర ఆకులు నీళ్ళ = నీటిలో తడువకుండిన యట్లు = తడవకుండా ఉన్నట్లు ఉందురు = ఉంటారు సుజ్ఞానులు + ఉర్విలోన = భూమిపై జ్ఞానం ఉన్నవారు అలసి యుందురు = అలసిపోయి ఉంటారు. చూడ = చూస్తే కళలేని విధముగ = మొఖంలో కళ లేకుండా గానవత్తురు = కనిపిస్తారు అధవ = తరువాత కాంతిబొందు = కాంతి వస్తుంది నొకరి దూషించి = ఒకరిని తిట్టి భూషింపరు + ఒకరిని = మరొకరిని మెచ్చుకోరు ఎపుడు = ఎల్లప్పుడు సుఖము = సుఖాన్ని దుఃఖము = దుఃఖాన్ని ఒక పదము = ఒకే విధంగా చూతురయ్య = చూస్తారు తాత్పర్యం : నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్ధప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండి. ఎవరైతే తన ఆత్మను పరమాత్మతో సమానంగా భావించి, అన్ని జీవులను సమానంగా చూసి జ్ఞాన వైరాగ్యాలనే యజ్ఞాన్ని, దానాలను, తపస్సులను చేస్తే మోక్షాన్ని పొందుతారు. తామరాకులు నీటిలో ఉండి కూడా తడవకుండా ఉన్నట్లుగానే భూమిపై జీవిస్తున్న జ్ఞానులు కూడా అలసిపోయినట్లు, కళా విహీనంగా కనిపిస్తారు. కాని తరువాత వారి ముఖంలో కళ వస్తుంది. వారు ఒకరిని తిట్టి, మరొకరిని మెచ్చుకోరు. వారు ఎల్లప్పుడూ సుఖాన్ని దుఃఖాన్ని ఒకే విధంగా చూస్తారు.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ఖనిజాల వినియోగం వలన భవిష్యత్ లో వచ్చే సమస్యలు ఏమిటి?
భూమిలో ఖనిజ వనరులు తగ్గిపోతాయి. కనుగొనబడిన, గుర్తించబడిన చాలా ఖనిజాలు తరిగిపోతాయి. అల్యూమినియం, ఇనుము యొక్క ఖనిజ నిలువలు లేదా ఖనిజ నిక్షేపాలు కనుమరుగైపోతుండడం వలన వాటి ధరలు చాలా పెరిగిపోయే అవకాశం ఉంది. ఈ మూలకాలతో తయారుచేసే పరికరాలు, యంత్రాల యొక్క ధరలు పెరిగి, వాటిని కొనడం మరియు వినియోగించడం కష్టమైపోతుంది.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
పల్లె సౌందర్యాన్ని వర్ణిస్తూ పది పంక్తుల వచన కవిత రాయండి.
పల్లె తాకనంటా కోడికూతతోనే కళ్ళుతెరచి పల్లె ఒళ్ళు విరుచుకుంది చల్లగాలుల్లోనే స్నానమాడి చక్కగా కూర్చుంది చూడచక్కగా తానుంది చిట్టి గువ్వలన్నీ గూటిని వీడి గంతులు వేయగా యేటిలో చేపలే గువ్వల సాటిగా ఎగరగా చూడంగా చిన్నారి పాదాలు సందులలోన పరుగులు తీయంగా ఆ చప్పుడు వింటూ బంతులు – చేమంతులూ మల్లెలు – మందారాలు ముద్దుముద్దుగా విచ్చుకుంటున్నాయా మొద్దు నిదురవీడి – కోడి కూతతోనే పల్లె తనదంటూ వదిలెల్లనంటూ మొండికేసే చంద్రుడే కాదు నాదంటూ నువ్వెళ్ళి పొమ్మంటూ ఎర్రబారే సూరీడే తగవు తీర్చలేక మబ్బు చల్లంగచేరి ఝల్లె కురిసింది నే పల్లెన తాకానంటూ ఆ సూరీడుకు, చంద్రుడుకు ఆకాశాన చుక్కలకు కన్నెగరేసిందీ – కోడి కూతతోనే
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
విత్తు నాటింది మొదలు పంట చేతికందే వరకు రైతు పడే కష్టాలు అనేకం. అటువంటి రైతుపడే కష్టాన్ని గురించి సొంత మాటల్లో రాయండి.
విత్తు నాటింది మొదలు పంట చేతికందే వరకు రైతు పడే కష్టాలు ఇన్నీ అన్నీ అని చెప్పలేము. రైతు కష్టజీవి. విరామమంటే తెలియని శ్రామికుడు కర్షకుడు. నాగలిని నమ్ముకొని బతికేవాడు. పంట పొలాలకే తన జీవితాన్ని ధారపోసి పంటను పండిస్తాడు. చేను దున్ని, నీరు పెట్టి, నారుమళ్ళు పోసి, నారు తీసి, నాటు వేసి, ఎరువులు చల్లి, కోత కోసి, మోపులు కట్టి, కుప్పవేసి, పంట నూర్చి, తూర్పార పట్టి, బస్తాల కెత్తి, ధాన్యం బస్తాల కెత్తి ఇంటికి చేర్చి, అమ్మడం మొదలైన పనులు కర్షకుల శ్రమను తెలుపుతాయి. అందుకే శ్రీ.శ్రీ. “ఆరుగాలం శ్రమించి భూమికి ధారపోసే కర్షక వీరుల శరీరంపై ప్రవహించే ఘర్మ జలానికి ఖరీదు కట్టలేమ”న్నాడు. రైతు నాగలిని నమ్ముకొన్నాడు. పొలాలకే తన జీవితాన్ని ధారపోసి, భూమిలో బంగారు పంటలు పండించాలనీ కోరుకుంటున్నాడు. లోకమంతా సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటాడు. అందుకే పొలాలను నాగళ్ళతో దున్నుతున్నాడు. విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నాడు.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ఉత్పత్తి సంస్థలను నిర్వచించండి.
వస్తూత్పత్తిలో లేదా వస్తుతయారీలో నిమగ్నమైన సంస్థలను ఉత్పత్తి సంస్థలు అంటారు. యంత్రపరికరాలను ఉపయోగించి ముడిసరుకును పూర్తిగా తయారైన వస్తువులుగా మార్చి, వాటికి విలువలను సృష్టించే సంస్థలను ఉత్పత్తి సంస్థలుగా చెప్పవచ్చును.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి: ఒకే భౌతిక రాశికి వేరువేరు ప్రమాణములు ఎందుకు ఉంటాయి?
ఏదైనా ఒక భౌతికరాశి, ఉదాహరణకు ద్రవ్యరాశిని గమనించిన, వస్తువుల ద్రవ్యరాశి చాలా విస్తృత అవధిలో మారుచుండును. ఉదాహరణకు ఎలక్ట్రాను ద్రవ్యరాశి 10-30 కేజి క్రమములో ఉండును. విశ్వము ద్రవ్యరాశి 10-55 కేజి క్రమములో ఉండును. కనుక ఒక వస్తువు ద్రవ్యరాశిని తెలియజేయుటకు తగిన ప్రమాణమును తీసుకొనవలయును. అనగా వస్తువు ద్రవ్యరాశి చాలా తక్కువగా ఉన్నచో, మిల్లిగ్రాములు లేక గ్రాములలో తెలియజేయవచ్చును. ద్రవ్యరాశి ఎక్కువగా ఉన్నచో కి.గ్రా లేక క్వింటాలులలో తెలియజేయ వచ్చును.
Telugu
tel
re-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ఇచ్చిన పద్యానికి ప్రతిపదార్ధాలు మరియు భావం రాయండి క. అని యంతరానము సే సినఁ, దిన్నండదరి పడుచు, శీఘ్రంబున మే లని, నలు దిక్కులు వెదకుచు . మనమున నాశ్చర్య రస నిమగ్నం డగుచున్
ప్రతిపదార్థం : అని = అని చెప్పి అంతర్థానము + చేసినన్ = అదృశ్యము కాగా తిన్నండు = తిన్నడు అదరి పడుచు = ఉలికిపడుచు శీఘ్రంబున = వెంటనే మేల్కని = నిద్రనుండి లేచి నలుదిక్కులు = నాలుగువైపులా వెదకుచు = అన్వేషిస్తూ మనమున = మనస్సులో ఆశ్చర్యరస = అద్భుత భావనలో నిమగ్నుండు అగుచున్ = మునిగిన వాడయి. భావం : ఈ విధంగా మాయా జంగమ రూపుడయిన శివుడు కలలో బోధించి, అదృశ్యమవగా, తిన్నడు ఉలికి పడుతూ వెంటనే నిద్ర నుండి లేచి నాలుగు దిక్కులూ . వెతుకుతూ మనస్సులో ఆశ్చర్యభావనలో మునిగిపోయాడు.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
క్రింది మూలకాలలో అర్ధ లోహము ఏది? A) సిలికాన్ B) సోడియమ్ C) క్లోరిన్ D) అల్యూమినియమ్
A) సిలికాన్
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ప్రశ్న : మనం కేవలం చంద్రుని యొక్క ఒక వైపు మాత్రమే ఎందుకు చూడగలం?
చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి 27 రోజులు పడుతుంది. అలాగే తనచుట్టూ తాను తిరగడానికి సరిగ్గా అదే సమయం పడుతుంది. ఫలితంగా, చంద్రుని యొక్క ఒక వైపు మాత్రమే భూమిపై మనకు కనిపిస్తుంది.
Telugu
tel
original-annotations
dbc5c037b2ecc422f10c97f2be156debb4eafe9f62b6dd7d6d7c7f1f7c43f28b
క్రింది వానిలో భిన్నంగా ఉన్నది ఏది? గుల్మార్గ్, డార్జిలింగ్, కొడైకెనాల్, నైనిటాల్జ.
కొడైకెనాల్.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
పౌరసత్వాన్ని కోల్పోయే ఏవైనా రెండు పరిస్థితులను ఉదహరించండి.
1) పౌరసత్వ త్యాగం: ఒక వ్యక్తి వేరొక రాజ్య పౌరసత్వాన్ని పొందినట్లయితే తన రాజ్యంలో పౌరసత్వాన్ని కోల్పోతాడు. సహజీకృత పౌరసత్వ పద్దతి ద్వారా వేరే దేశ పౌరసత్వం కనుక లభించినట్లయితే అతడు మాతృదేశ పౌరసత్వాన్ని కోల్పోతాడు. భారత రాజ్యాంగం ప్రకారం భారతీయ పౌరులు ఇతర రాజ్యాలలో పౌరసత్వాన్ని పొందినట్లయితే భారతదేశ పౌరులుగా పరిగణించబడరు. 2) వివాహం: విదేశీ పురుషుడిని వివాహం చేసుకొన్న మహిళ తన దేశ పౌరసత్వాన్ని కోల్పోయి, తన భర్తకు చెందిన రాజ్య పౌరసత్వాన్ని పొందుతుంది. అయితే కొన్ని రాజ్యాలు ఈ విషయంలో మినహాయింపును ఇచ్చి, ఏ రాజ్య పౌరసత్వం కావాలనే విషయాన్ని ఆ మహిళకే వదిలివేయడమైంది. ఉదాహరణకు బ్రిటన్ యువతికి అటువంటి ఎంపిక సదుపాయాన్ని ఇవ్వడమైంది.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
పోషకాహార లోపం అనగానేమి?
ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషకాలు లోపించిన ఆహారం తీసుకోవటం వలన కలిగే దుష్ఫలితాలను పోషకాహారలోపం అంటారు.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ఇచ్చిన పదానికి పర్యాయ పదాలని ఇవ్వండి: శరీరము
తనువు, దేహము, మేను, కాయము
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
కింది వాక్యాలు, భావాన్ని అనుసరించి ఏ వాక్యాల్లో గుర్తించండి. అల్లరి చేయవద్దు.
నిషేధార్థక వాక్యం.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
అసూయాపరులంటే ఎవరు ? వారి వల్ల ఎవరికి నష్టమో చెప్పండి.
అసూయాపరులంటే ఈర్ష్యగుణం కలవారు.’ ఎదుటి వారికి ఉన్నది, తనకు లేదని బాధపడేవారు ‘అసూయా పరులు’. అసూయ వల్ల అసూయాపరులకే నష్టము. అసూయాపరుల వల్ల ఒక్కొక్కప్పుడు ఎదుటివారికి కూడా నష్టం ఉంటుంది.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ఎంతో కష్టమైనప్పటికీ, దాస్యవిముక్తి కోసం గరుడుడు అమృతం తెచ్చాడు కదా ! అయితే దాస్యవిముక్తికి లేదా స్వేచ్ఛకు ఉన్న గొప్పతనం ఏమిటో వివరించండి.
బానిసత్వం నుండి విడిపించుకొని స్వేచ్ఛగా జీవించడమే దాస్యవిముక్తి. గరుత్మంతుడు తన తల్లికీ, తనకూ దాస్యం పోడానికి ఎంతో కష్టపడి, దేవేంద్రుని ఎదిరించి, అమృతం తెచ్చియిచ్చాడు. మన భారతమాత దాస్య బంధాన్ని విడిపించి, స్వతంత్రం పొందడానికి, మన దేశ నాయకులు ఎందరో ప్రాణాలు విడిచారు. జైళ్ళలో మగ్గిపోయారు. ఒకరికి సేవచేస్తూ, బానిసత్వంలో పడి ఉండడం, నరకంతో సమానం. స్వేచ్ఛా జీవితం అనుభవిస్తూ, తనకు లభ్యమయిన అన్న పానీయాలను తీసుకొని, కడుపునింపుకోవడం స్వర్గంతో సమానం.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
సహకార సంస్థలకు, భాగస్వామ్యానికి మధ్య గల వ్యత్యాసములేవి ?
సహకార సంస్థలకు, భాగస్వామ్య సంస్థలకు గల తేడాలు: సహకార సంస్థ స్థాషన: సహకార సంస్థల చట్టం 1912 క్రింద ఇవి స్థాపించబడతాయి.. సభ్యత్వము: కనిష్ట సభ్యుల సంఖ్య 10, గరిష్ట సభ్యుల సంఖ్య అపరిమితము. ముఖ్య ఉద్దేశ్యము: సేవాశయము. ఋణ బాధ్యత: పరిమితము. నిర్వహణ: ప్రజాస్వామ్యబద్ధముగా సంస్థ నిర్వహించబడుతుంది. మినహాయింపులు, సౌకర్యములు ; ఆదాయపు పన్ను చెల్లింపులో, స్టాంపు రిజిస్ట్రేషన్ ఫీజులో మినహాయింపు ఉంటుంది. మిగులు లాభాల పంపిణీ: లాభాలలో కొంత శాతము మాత్రమే సభ్యులకు డివిడెండ్లుగా పంచుతారు. మూలధనము: మొత్తము వాటాలలో 10%నకు మించిన వాటాలను ఏ వ్యక్తి కొనరాదు. భాగస్వామ్య సంస్థ భారత భాగస్వామ్య చట్టం 1932 క్రింద ఇవి ఏర్పడతాయి. కనిష్ట సభ్యుల సంఖ్య 2. గరిష్ట సభ్యుల సంఖ్య బ్యాంకింగ్ వ్యాపారము అయితే 10, ఇతర వ్యాపారాలలో 20. ముఖ్య ఉద్దేశ్యము లాభాశయము. ఋణబాధ్యత అపరిమితము, వ్యక్తిగతము, సమిష్టి భాగస్వామ్య ఒప్పందము సంస్థ నిర్వహణలో పాల్గొనవచ్చు. ఎలాంటి సౌకర్యాలు, మినహాయింపులు ఉండవు. మొత్తము లాభాలను ఒప్పందము ప్రకారం భాగస్తులకు పంపిణీ చేస్తారు. ఒప్పందము ప్రకారము మూలధనాన్ని తేవడం జరుగుతుంది.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అధిక లోహ లోపం వల్ల ఆనయానిక ఖాళీలు ఏర్పడిన అయానిక ఘనపదార్థంలో రంగు ఏర్పడుతుంది. సరైన ఉదాహరణ సహాయంతో వివరించండి.
అధిక లోహ లోపంను మనము స్ఫటికం ఉదాహరణంగా తీసుకొని వివరించవచ్చు. → NaCl స్ఫటికాలను బాష్ప వాతావరణంలో వేడిచేయగా Na పరమాణువులు స్ఫటిక ఉపరితలంపై Cl– అయాన్లు స్ఫటిక ఉపరితలంపై చొచ్చుకుపోతాయి. ఇవి సంయోగం చెంది NaCl ఏర్పడును. Na పరమాణువులు ఎలక్ట్రాన్లు కోల్పోయి Na+ అయాన్లుగా మారుతాయి. ఈ ఎలక్ట్రాన్లు దృగ్గోచర కాంతిని శోషించుకొని పసుపురంగు వర్ణానికి సంబంధించిన వికిరణాలను విడుదల చేస్తాయి. ఈ ఎలక్ట్రాన్లను F- కేంద్రకాలు అంటారు.
Telugu
tel
original-annotations
b2e4cf812341179f50c97c21201ba8ee469a1675a425172165468ba87ec48b1b
కోడి రామమూర్తిని కలియుగ భీముడని ఎందుకంటారు?
స్పెయిన్లో జరిగిన ఎడ్లపోటీలో ఎద్దును గాలిలోకి లేపి గిరగిరా త్రిప్పి విసిరేశాడు కోడి రామ్మూర్తి. కాలికి ఇనుప గొలుసులతో కారును కడితే, కారును అంగుళం కదలనీయకుండా ఆపిన మహాబలవంతుడు. ఊపిరి .బిగపట్టి ఒళ్లంతా గొలుసులు కట్టించుకొని ఊపిరి వదిలితే అవన్నీ పటపటా తెగిపోయేవి. రొమ్ముపై బండరాళ్లు పెట్టించుకొని వాటిని పగలకొట్టించుకొనేవాడు. అందుచేతనే కోడి రామ్మూర్తిని కలియుగ భీముడనేవారు.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
శాటిలైట్ క్రోమోసోమ్ అంటే ఏమిటి?
కొన్ని క్రోమోసోమ్లు అభిరంజకాన్ని గ్రహించని ద్వితీయ కుంచనాలను సుస్థిర స్థానాలలో చూపిస్తాయి. దీనివల్ల క్రోమోసోమ్లో ఒక చిన్న ఖండికలాంటి భాగం కనిపిస్తుంది. దీన్ని శాటిలైట్ అంటారు. శాటిలైట్ ఉన్న క్రోమోసోమ్ను శాటిలైట్ క్రోమోసోమ్ అంటారు.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
క్రింది వాటిలో పరాన్న జీవి మొక్క A) కస్కుట B) మందార C) కాకర D) మల్లె
A) కస్కుట
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
మొక్కలు వేళ్లనుంచి తీసుకున్న నీరు ఏమవుతుందో విజ్ఞానశాస్త్ర పాఠాలలో తెలుసుకుని ఉంటారు. అది మరొకసారి గుర్తుకు తెచ్చుకోండి.
చెట్ల వేర్లు నీటిని సమతుల్యం చేసే లక్షణాన్ని కలిగి ఉంటాయి. అవి అవసరమైనపుడు మాత్రమే నీటిని తీసుకుంటాయి. అవసరం లేనపుడు వాటిని తీసుకోవు.
Telugu
tel
original-annotations
dbc5c037b2ecc422f10c97f2be156debb4eafe9f62b6dd7d6d7c7f1f7c43f28b
...ప్రపంచంలో ఇచ్చేవారు, తీసుకునేవారి మధ్య స్పష్టమైన తేడా ఉంటుంది. కానీ మొబైల్ చెల్లింపుల వేదిక మీద.. ఇది అన్నివేళలా స్పష్టంగా ఉండదు. ఉదాహరణకు.. ఒక టేబుల్‌ను ఆన్‌లైన్‌లో అమ్మటానికి ప్రయత్నించినపుడు.. ఎవరో ఒక వ్యక్తి తాను దానిని కొంటానంటూ ఫోన్ చేసి.. ఆన్‌లైన్ చెల్లింపులు చేస్తానని చెప్తుంటారు'' అని రాయ్ వివిరంచారు. ''ఆ వ్యక్తి తాను డబ్బులు చెల్లించానంటూ.. దానిని నిర్ధారించటానికి 'మీకు ఒక టెక్ట్స్ మెసేజ్‌లో కోడ్ వచ్చింది.. ఆ కోడ్ చెప్పండి' అని అడుగుతారు. మిగిలిన వ్యాసాన్ని వ్రాయండి:
తున్న ఎత్తుగడలు, పద్ధతులను తప్పించుకోవటం ఎలా అనేది ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండటం అసాధ్యం. కాబట్టి మనల్ని రక్షించే భారం నియంత్రణ సంస్థల మీదే ఉంటుంది'' అని ఆయన పేర్కొన్నారు. వివిధ సైబర్ సెక్యూరిటీ సంస్థల మధ్య సమాచారం తగినంత వేగంగా లేకపోవటం మరొక సమస్య. భారతదేశపు డిజిటిల్ మౌలికసదుపాయాల భద్రతకు సంబంధించిన మొదటి సంస్థ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్).. పొంచివున్న ప్రమాదాల గురించి ప్రభుత్వానికి తెలియజేటంలో చాలా నత్తనడకన నడుస్తోంది. కానీ.. దీని గురించి భారతదేశానికి ఇప్పటికే అవగాహన ఉంది. జాతీయ సైబర్ భద్రత విధానం 2020ని రూపొందిస్తోంది. విధానం స్పష్టంగా ఉండాల్సిన ఆరు కీలక రంగాలను కూడా గుర్తించింది. వీటిలో ఆర్థిక భద్రత ఒకటి. అయితే.. దేశంలోని ప్రతి ప్రధాన రంగానికీ ఒక సెర్ట్ ఉండటం ఉత్తమమంటారు రాయ్. వాటి మధ్య పరస్పర సమాచార సంబంధాలు ఉండటంతో పాటు, ప్రభుత్వం వాటికి సమన్వయకర్తగా వ్యవహరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పుడు మాత్రమే.. నగదు రహిత ఆర్థికవ్యవస్థకు మారుతున్నపుడు వచ్చే ప్రమాదాలకు భారతదేశం సమర్థవంతంగా ప్రతిస్పందించగలదు.
Telugu
tel
re-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
అత్యంత బలమైన మృదులాస్థి ఏది ? మానవుని శరీరంలో ఏ భాగాలలో ఇది కనిపిస్తుంది?
తంతుయుత మృదులాస్థి అతి బలమైన మృదులాస్థి. కారణము వీటిలో కట్టలుగా కొల్లాజన్ తంతువులు ఉంటాయి. ఇది మానవునిలో అంతర్కశేరుక చక్రికలలోను, శ్రోణిమేఖల జఘన సంధాయకంలోను ఉంటుంది.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ప్రతీకాత్మక చిత్రం వరంగల్‌ నగరం నడిబొడ్డున ఆసుపత్రి నిర్వహిస్తున్న ఈ మెడికల్‌ రిప్రజెంటేటివ్‌, అనుమతి, అర్హత లేకుండా అబార్షన్లు చేస్తున్నారని తెలియడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు బుధవారం అర్ధరాత్రి దాడి చేసి పట్టుకున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా చెన్నారావుపేటకు చెందిన అండ్రు ఇంద్రారెడ్డి నెల రోజుల కిందట హన్మకొండలోని ఏకశిలా పార్కు ఎదురుగా సిటీ హాస్పిటల్‌ పేరుతో ఆసుపత్రి ప్రారంభించారు. రెండోసారి ఆడపిల్లలు వద్దనుకునే మహిళలను ఆర్‌ఎంపీలు, పీఎంపీల ద్వారా గుర్తించి వారికి అబార్షన్లు చేస్తున్నారు. నర్సింగ్‌లో శిక్షణ పొందినవారితో కలిసి , యూట్యూబ్‌ చూస్తూ ఈ అబార్షన్లు ప్రక్రియను కొనసాగిస్తున్నారు. దీనిపై సమాచారం అందడంతో బుధవారం అర్ధరాత్రి రెవెన్యూ అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆసుపత్రిపై దాడి చేశారు. ఆ సమయంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన మహిళలకు ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. అధికారులను చూసి వైద్య సిబ్బంది గోడదూకి పారిపోయారు. థియేటర్‌లో ఉన్న మహిళను బాత్రూంలో దాచారు. పోలీసుల సాయంతో ఆమెను బయటకు తీసుకొచ్చి అధికారులు ప్రశ్నించారు. రక్తస్రావం అవుతుండటంతో హన్మకొండ జీఎంహెచ్‌కు తరలించారు. ఇంద్రారెడ్డి మూడేళ్ల కిందట వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేటలోనూ ఇలాగే ఓ ఆసుపత్రి ఏర్పాటు చేయగా అధికారులు దాన్ని సీజ్‌ చేశారు. డీఎంహెచ్‌వో ఫిర్యాదు మేరకు నకిలీ వైద్యుడిపై పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేసి, ఆసుపత్రిని సీజ్‌ చేశారు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు ఈనాడు కథనం పేర్కొంది. రూ.20 లక్షలు స్టవ్‌ మీద కాల్చేసిన తహసీల్దార్‌ అవినీతికి పాల్పడి, ఆ వ్యవహారంలో ఎక్కడ దొరికి పోతానో అన్న భయంతో ఓ అధికారి పెద్ద ఎత్తున కరెన్సీ నోట్లను తగలబెట్టినట్లు ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనం ఇచ్చింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలో బుధవారం నాడు జరిగింది. ఓ వ్యక్తికి కాంట్రాక్టు అప్పగించడానికి అతని నుంచి తహసీల్దార్‌ కల్పేశ్‌ కుమార్‌ జైన్‌ తరఫున రూ.లక్ష లంచం తీసుకునేందుకు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ పర్వత్‌ సింగ్‌ సిద్ధమయ్యారు. లంచం పుచ్చుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు ప్రత్యక్షమై అతన్ని పట్టుకున్నారు. అయితే ఈ తతంగంలో తన ప్రమేయం ఏమీ లేదని, తహశీల్దార్‌ కల్పేశ్‌ కుమార్‌ జైన్‌ తరఫున తాను డబ్బు తీసుకుంటున్నానని రెవిన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఏసీబీ అధికారులకు తెలిపారు.
వరంగల్: యూట్యూబ్ వీడియోలు చూస్తూ అబార్షన్లు చేస్తున్న నకిలీ డాక్టర్ - ప్రెస్ రివ్యూ
Telugu
tel
re-annotations
91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0
దిన పత్రికలు చదవమని విద్యార్థులను ప్రోత్సహిస్తూ కరపత్రం తయారు చేయండి.
పత్రికా పఠనం విద్యార్థులారా ! భావిభారత నిర్దేశకులారా ! పత్రికలు చదవండి. నిరంతరం ప్రపంచంలో జరుగుతున్న మార్పులను తెలుసుకోండి. పత్రిక పేరు ఏదైనా కావచ్చు. ప్రపంచ పరిజ్ఞానం ప్రధానం, టీ.వీ.ల మోజులో చదువుకు దూరం కాకండి. పాఠ్య పుస్తకాలలో పరిజ్ఞానానికి, దిన పత్రికలలోని విశ్లేషణాత్మక పరిజ్ఞానం తోడైతే వ్యాఖ్యానించగల నేర్పు కలుగుతుంది. రోజూ క్రమం తప్పక పత్రికలు చదవండి. నిత్య నూతన విజ్ఞాన కాంతులతో విరాజిల్లండి. ఇట్లు, పాఠక బృందం.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ఉపాంత ప్రయోజనం గురించి సంక్లిప్తంగా వివరించండి
ఒక వినియోగదారుడు అదనంగా ఒక వస్తువు యూనిట్ని వినియోగించినప్పుడు మొత్తం ప్రయోజనంలో వచ్చే మార్పును ఉపాంత ప్రయోజనం అంటారు. దీనిని ఈ క్రింది విధంగా కొలవవచ్చు. MU = ΔTU/ΔQ ΔTU = మొత్తం ప్రయోజనంలో మార్పు ΔQ = వస్తు పరిమాణంలో మార్పు.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ఇచ్చిన సమాచారం ఏ అంశం గురించి: ‘ఎల్ల భాషలకు జనని సంస్కృతంబు’ – అని మన పూర్వీకుల అభిప్రాయం. సంస్కృత భాషనుండే ఈ ప్రపంచ భాషలు పుట్టాయని వారి నమ్మకం. సాధారణంగా మనం వాడుకునే తెలుగు మాటలు చాలావరకు సంస్కృత భాషలో నుండి స్వల్ప మార్పులతో గ్రహించినవి. అలాగే కొన్ని పదాలు ప్రాకృత భాషల నుండి వచ్చాయని వ్యాకరణ వేత్తలు తెలియచేశారు. సంస్కృతంతో సమానమయిన పదాలను తత్సమాలని, సంస్కృత ప్రాకృతాల నుండి పుట్టినవి తద్భవాలని అన్నారు. ఇలాంటి తత్సమ తద్భవ శబ్దాలను మనం వికృతులు గాను, సంస్కృత, ప్రాకృత శబ్దాలను ప్రాకృతులు లేదా ప్రకృతులు గాను చెప్పుకుంటున్నాము. అనగా ప్రకృతి నుండి వికారం పొందినది వికృతి అంటారు. ఇలా వికారం పొందినప్పుడు ఆ ప్రకృతి శబ్దం వర్ణాగమం, వర్ణలోపం, వర్ణ వ్యత్యయం, వర్ణాధిక్యం, రూప సామ్యం, వేరొక రూపం పొందడం వంటి గుణగణాలతో ఉంటుంది. తెలుగు భాషలో చాలా ప్రకృతి వికృతులుగా ఉన్నాయి. తెలుగు నిఘంటువులు వీటిని ఆకారాది క్రమంలో చూపిస్తాయి.
ప్రకృతి – వికృతి
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
కింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి. వేసవికాలం వచ్చింది. మామిడిపండ్లు రాలేదు.
వేసవికాలం వచ్చింది కానీ మామిడిపండ్లు రాలేదు.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ప్రశ్న : తుగ్లక్ ల కాలంలో రాగి, ఇత్తడి నాణేలను ప్రవేశపెట్టడంపై మీ అభిప్రాయం ఏమిటి?
తుగ్లక్ యొక్క అతిసాహసిక పరిపాలనా చర్యలలో రాగి నాణెములు ప్రవేశపెట్టడం అత్యంత ప్రధానమైన చర్య. సైనిక ఖర్చు పెరుగుట, రాజధాని మార్పిడి ఖర్చు, కరువుకాటకాల కారణంగా ఈ సంస్కరణను అమలు జరిపెను. అయితే ఆనాటి పరిస్థితులకు అనగా వెండి కొరతగా ఉండటం వలన ఈ చర్య సమంజసమైనదే. చైనా కుబ్లయి ఖాన్, మంగోలు పాలకుడు గైఖాతులు అప్పటికే ఈ నామమాత్రపు కరెన్సీని అమలు చేయటంలో విజయం సాధించారు. తుగ్లక్ విఫలమవ్వటానికి కారణం, తన మంత్రులను సంప్రదించక అధికార దాహంతో ఈ సంస్కరణను అమలు చేయాలని తాపత్రయపడుట, ప్రజలు స్వార్థపరులగుట, ప్రభుత్వము నాణెముల ముద్రణను గుత్తాధికారముగ అమలు జరపకపోవుట.
Telugu
tel
original-annotations
dbc5c037b2ecc422f10c97f2be156debb4eafe9f62b6dd7d6d7c7f1f7c43f28b
ఇచ్చిన గద్యానికి కొనసాగింపు రాయండి: మధ్యతరగతి కుటుంబాలు నివసించే ప్రదేశం అది. దాదాపు 22 కుటుంబాలున్న ఆ లోగిలిలో అందరికి సమస్యలు. ఎవరి సమస్యలు వారివి. ఉద్యోగ విరమణ చేసిన తాతగారు గంపెడు సంసారంతో బాధపడుతుంటాడు. కొత్తగా అద్దెకు దిగిన యువకుడు నిరుద్యోగి, అవివాహితుడు. ఏవో బొమ్మలు గీస్తూ తన మనోభావాలను వాటి ద్వారా బహిర్గతం చేస్తుంటాడు.
ఇందిర, ఆనందలక్ష్మి అక్కాచెల్లెళ్ళు. క్రింది వాటిలో ఉంటారు. జబ్బుతో మంచానపడిన తల్లి, అకారణంగా జైలుకెళ్ళిన తండ్రి, నిరుద్యోగి అయిన అన్నయ్య పైగా అమాయకంతో తల్లిదండ్రుల గూర్చి బాధపడుతుంటాడు. కృష్ణవేణి అనే అమ్మాయి ఉద్యోగం చేస్తూ తల్లినీ, అన్నయ్యను అభిమానంగా చూసుకుంటుంది. ఆత్మన్యూనతా భావంతో అన్నయ్య ఎప్పుడూ కృష్ణవేణితో గొడవపడుతుంటాడు. తనకు ఒక ఉద్యోగం వస్తే చెల్లెల్ని ఉద్యోగం మానిపించేయాలనుకుంటూ ఉంటాడు. కృష్ణమూర్తి అనే ఆయన బ్యాంకు ఉద్యోగి. తనవరకు తాను అన్నట్లు చిన్న ప్రపంచంలో గిరిగీసుకుని బ్రతికేస్తూ ఉంటాడు. కొత్తగా వచ్చిన యువకునితో పరిచయం చేసుకుంటూ మీకు బ్యాంకు ఎకౌంటు ఉందా ? ఉంటే ఏ బ్యాంకు అని ఆరాలు తీస్తాడు. దానికి సమాధానంగా నా ఎకౌంటు నా జేబులోనే ఉంది అయినా ఖాళీగానే ఉందని అంటాడు. బహుశా బ్యాంకు ఎకౌంటు లేనివాళ్ళు నచ్చరేమో అని తనలో తాను అనుకుంటాడా యువకుడు.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ప్రశ్న : వాతావరణ మార్పులు ప్రస్తుతం మానవుల జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి? మీ ఉపాధ్యాయులు, స్నేహితులతో చర్చించి సమాధానం వ్రాయండి.
వాతావరణ మార్పులు ప్రస్తుతం మానవుల జీవితాలను క్రింది విధంగా ప్రభావితం చేస్తున్నాయి వాతావరణంలో మార్పులు మానవ జీవితంలో అభివృద్ధి సూచికగా చెప్పవచ్చును. వాతావరణంలో మార్పులు వలన మొక్కలు, చెట్లు, గడ్డి భూములు పెరిగి తద్వారా వ్యవసాయం, పచ్చదనం విస్తరించింది. గడ్డితినే జంతువులయిన ఎద్దులు, గొర్రెలు, మేకలు, జింకలు మొదలైన వాటి సంఖ్య క్రమంగా పెరిగింది, జంతువులను మచ్చిక చేసుకోవటం, పశుపోషణ పెరిగింది. వ్యవసాయంలో (పంటల దిగుబడిలో) గుర్తించదగిన అభివృద్ధి సాధించటం జరిగింది. అయితే వాతావరణంలో నేడు అనేక కాలుష్య పదార్థాలు చేరి, వాతావరణ సమతౌల్యతను దెబ్బతీస్తూ, అతివృష్టి, – అనావృష్టి మొదలైన ప్రకృతి భీభత్సాలకు ఏర్పడుతున్నాయి.
Telugu
tel
original-annotations
dbc5c037b2ecc422f10c97f2be156debb4eafe9f62b6dd7d6d7c7f1f7c43f28b
కింద ఇచ్చిన వాక్యాన్ని వ్యతిరేకార్థక వాక్యంగా రాయండి వర్తకులు ఓడలలో ప్రయాణమౌతారు.
వర్తకులు ఓడలలో ప్రయాణము కారు.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, జాతి చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టంగా ఎందుకు అనుకుంటున్నారో వ్యాసంగా రాయండి.
తెలంగాణ రాష్ట్రం, ప్రత్యేకమైన సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతి, భౌగోళిక పరిస్థితులు గల సంపన్న రాష్ట్రము. స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకడం, తెలంగాణ ప్రజలకు అలవాటు. అలాంటి రాష్ట్రం చాలాకాలం నుండి పరాయివారి పాలనలో అణగారిపోయింది. నైజాం కాలంలో ప్రజలు ఎన్నో కడకండ్లు అనుభవించారు. సామాజిక జీవనం ఛిన్నాభిన్నమయ్యింది. 1948లో పటేల్ చొరవతో తెలంగాణ ప్రాంతము ఇండియన్ యూనియన్లో ఏకమై స్వాతంత్య్రం పొందింది. 1956లో తిరిగి తెలంగాణ, ఆంధ్రప్రాంతంతో కలిసింది. ఆంధ్రప్రాంత పాలకులు, తెలంగాణ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు. దానితో ప్రజలకు తెలంగాణ వేరు రాష్ట్రం కావాలనే ప్రగాఢమైన కోరిక కల్గింది. అందుకే. కవులు, కళాకారులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు ఏకమై తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించారు. 1969 డా॥ మర్రి చెన్నారెడ్డిగారి నాయకత్వంలో ప్రత్యేక రాష్ట్ర సాధనకు మహోద్యమం నడిచింది. ఎందరో విద్యార్థులు, యువకులు ప్రాణాలు వదిలారు. తరువాత కె.సి.ఆర్ నాయకత్వంలో సుమారు దశాబ్దంపాటు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సాగింది. సకలజనుల సమ్మె జరిగింది. చివరకు 2014 జూన్ 2న, ప్రత్యేక రాష్ట్రం ప్రజల కోరిక మేరకు సిద్ధించింది. చిరకాల వాంఛ నెరవేరినందున, జాతిచరిత్రలో, దీనిని అద్భుత ఘట్టంగా అనుకుంటున్నారు.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
I wonder ఇండిగో సంస్థ తన మొదటి ఇంటర్నేషనల్ ఫ్లైట్ ను ఎంత దూరం నడిపింది? Can you get me some context to answer this (in the same language as my question)?
ఎయిర్ ఇండియా (Air India) (హిందీ: एअर इंिडया), భారతీయ విమానయాన సర్వీసు. ఇది భారత పతాక వాహనం. ప్రపంచమంతటా దీని నెట్ వర్క్ ప్రయాణీకులనూ, సరకులనూ చేరవేస్తూవుంది. భారత ప్రభుత్వరంగ సంస్థ.2007 ఫిబ్రవరీ 22న దీనిని ఇండియన్ ఎయిర్‌లైన్స్తో మిళితం చేశారు.[1] దీని ప్రధాన బేసులు, ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబై మరియు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ. ఈ ఎయిర్‌లైన్స్, ప్రపంచవ్యాప్తంగా 146 అంతర్జాతీయ, జాతీయ నౌకాశ్రయ గమ్యాలు కలిగివున్నది. భారతదేశంలో దీనికి 12 గేట్ వేలు గలవు. ఈ ఎయిర్ లైన్స్ స్టార్ అలియన్స్లో సభ్యత్వం పొందబోతోంది, 27 బోయింగ్ 787 కోనుగోలుకు ఆర్డర్లిచ్చింది. ఇవి 2009 లో సర్వీసులోకి వస్తాయి. చరిత్ర ఎయిర్ ఇండియా ఆరంభంలో టాటా ఎయిర్‌లైన్స్‌ పేరుతో 1932 అక్టోబర్ 15న జె.ఆర్.డి.టాటాచే టాటాసన్స్ లిమిటెడ్ (ప్రస్తుత టాటా గ్రూప్) సంస్థలో ఒక భాగంగా ప్రారంభం అయింది. ఎయిర్ ఇండియా సంస్థాపకుడు జె.ఆర్.డి టాటా స్వయంగా మొదటి సారిగా వి.టి.గా నమోదుచేయబడిన సింగిల్ ఇంజన్ విమానం 'డి హావ్‌లాండ్'లో ప్రయాణం చేయడం ఎయిర్ ఇండియా తొలి ప్రయాణానికి నాంది. ఈ ప్రయాణం కరాచీలోని డ్రిగ్‌రోడ్ ఏరోడ్రోమ్ నుండి అలహాబాదు మీదుగా బాంబే జుహూ ఎయిర్‌ స్ట్రిప్ వరకు సాగింది. రాయల్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన పైలెట్ నెవిల్ విన్సెంట్ సారథ్యంలో ఈ ప్రయాణం సాగింది. తరువాత ఈ ప్రయాణం బళ్ళారి మార్గంలో మద్రాసు వరకు సాగింది. ఈ ప్రయాణంలో ఇంపీరియల్ సంస్థ వారి ఎయిర్ మెయిల్ కూడా మొదటిసారిగా పంప బడింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత భారతదేశంలో క్రమంగా వ్యాపార సర్వీసులు పునరుద్ధరింప బడ్డాయి. 1946 జూలై 26 నుండి టాటా ఎయిర్ లైన్స్, ఇండియన్ ఎయిర్ లైన్స్ పేరుతో ప్రభుత్వ సంస్థగా మారింది. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1948లో భారత ప్రభుత్వం కోరిన కాణంగా ఎయిర్ లైన్స్‌ లోని 49% వాటా ప్రభుత్వం స్వాధీనపరచుకుంది. ఎయిర్ లైన్స్ అంతర్జాతీయ సర్వీసులకు నిర్వహించే స్థాయికి చేరింది. భారత జాతీయపతాకం చిత్రించిన ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమానాలు 148 జూన్ మాసం నుండి తమ సర్వీసులను ప్రారంభించాయి. 1948 జూన్ మాసంలో మలబార్ రాజకుమారి పేరుతో లోక్‌హీడ్ కాంస్టలేషన్ ఎల్-749ఎ (L-749A) ని విటి-సిక్యుపి (VT-CQP) నమోదు చేసి మొదటి భారత విమాన అంతర్జాతీయ సర్వీసు బాంబే నుండి జెనీవా మార్గంలో లండన్ వరకు తొలి ప్రయాణం సాగించింది. తరువాత 1950 నుండి కైరో, నైరోబీ మరియు ఆడెన్ లకు అంతర్జాతీయ0గా నడిపి0ది.
Telugu
tel
re-annotations
91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0
ఇచ్చిన పద్యానికి భావం రాయండి: సీ॥ కాళిదాసాది సత్కవి పుంగవుల గాంచి విద్యావతి యన నేవెలది యొప్పె ? రణశూరులగు కృష్ణరాయాదులను గని వీరమాత యన నేనారి తనరె? నతుల కాశ్యాది పుణ్యక్షేత్రములు గల్గి పుణ్యవతియన నేపొలతి నెగడె ? కొహినూరు మొదలగు మహిత మణులనీని రత్నగర్భయన నేరామ వెలసె ? తే॥గీ|| నట్టి సద్గుణసంఘాత యఘ విదూర సన్నుతవ్రాత విపుల తేజస్సమేత బహుళ విఖ్యాత యాచక పారిజాత భద్రముల మీకొసగుగాత భరతమాత.
సకల సద్గుణ రాశి మన భరతమాత. ఈమె అందరి పాపాలను దూరం చేస్తుంది. అందరూ పొగడ దగినది. గొప్ప తేజస్సు కలది. అనేక విధాలుగా కీర్తి కలది. కోరిన వరాలనిచ్చే పారిజాత వృక్షం వంటిది. కాళిదాసు మొదలైన గొప్ప కవులను కన్న విద్యావతి. కృష్ణదేవరాయలు వంటి వీరులను కన్న వీరమాత. కాశీ వంటి పుణ్యక్షేత్రాలు ఉన్న పుణ్యభూమి. కోహినూరు వజ్రం వంటి మణులను కన్న రత్నగర్భ మన భరతభూమి. అటువంటి భరతమాత మీకు భద్రతను కల్గిస్తోంది.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
రూపకాలంకారం గురించి రాయండి.
ఉపమేయానికీ, ఉపమానానికీ అభేదం చెప్పినట్లయితే, అంటే భేదం లేదని చెప్పినట్లయితే అది రూపకాలంకారం. ‘అతడు చేసిన తప్పుకి పశ్చాత్తాపాగ్నిలో కాలిపోతున్నాడు’. ఈ ఉదాహరణలో, అతడు తప్పుచేసి, చేసిన తప్పును తెలిసికొని, పశ్చాత్తాపం అనే అగ్నిలో కాలిపోతున్నాడు. ఇక్కడ పశ్చాత్తాపాగ్ని అనే సమాసంలో, పశ్చాత్తాపము అనేది ఉపమేయం, అగ్ని అనేది ఉపమానం. రెండింటికీ భేదం లేదని చెప్పడం వల్ల ఇది రూపకాలంకారం. రుద్రమ్మ చండీశ్వరీ దేవి. సంసార సాగరం.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
న్యాయానికి గల మూడు ఆధారాలను పేర్కొనండి.
న్యాయం – నిర్వచనాలు: ప్లేటో: “వ్యక్తి తన పని తాను చేసుకుంటూ, ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే న్యాయం”. అరిస్టాటిల్: “న్యాయం అంటే సమాజంలో ప్రతి వ్యక్తీ తన నైతిక బాధ్యతలను నిర్వర్తించడం తప్ప మరేదీకాదు”. కెఫాలస్: “న్యాయం అంటే ప్రతి ఒక్కరూ సత్యాన్ని పలకడం, ఇతరులకు ఇవ్వాల్సింది ఇవ్వడం”. న్యాయం ఆధారాలు: ఎర్నస్ట్ బార్కర్ న్యాయానికి నాలుగు ఆధారాలున్నాయని పేర్కొన్నాడు. అవి: 1) ప్రకృతి 2) నైతికత 3) మతం 4) ఆర్థిక అంశాలు. వాటిని క్రింది విధంగా వివరించవచ్చు. 1) ప్రకృతి: గ్రీకు యధేచ్ఛావాదులు ప్రకృతిని న్యాయం ఆధారాలలో ఒకటిగా భావించారు. వారి దృష్టిలో ప్రకృతి అనేది నైతిక తాత్వికత, మత విశ్వాసాల సమ్మేళనం. ప్రకృతి, దైవం, హేతువులనేవి అవిభాజ్యాలు. ప్రకృతి నియమాల ప్రకారం జీవనం సాగించే వ్యక్తులు భగవంతుడు, హేతువులపట్ల ఒకే విధమైన భావాలను కలిగి ఉంటారని వారు ఉద్ఘాటించారు. ప్రకృతి మూడు ప్రధాన అంశాలను సూచిస్తుందని వారు పేర్కొన్నారు. అవి: 1) మానవుడికి స్వాతంత్ర్యం ఉండాలి. 2) మానవులందరూ సమానమైన గుర్తింపును కలిగి ఉండాలి. 3) మానవులందరూ తోటి మానవులతో హేతువు ఆధారంగా స్నేహ సంబంధాలను కలిగి ఉండాలి. పైన పేర్కొన్న మూడు అంశాలు కాలక్రమేణా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే మూడు భావనలకు ఆధారాలయ్యాయి. 2) నైతికత: ఆదర్శవాదులైన ప్లేటో, ఎమ్మాన్యుయెల్ కాంట్, థామస్ హిల్లీ గ్రీన్, ఎర్నెస్ట్ బార్కర్లు న్యాయం అనేది నైతిక సూత్రాల అవలంబన ద్వారా అవతరించిందని ఉద్ఘాటించారు. కాలానుగుణంగా సమాజం |ఆమోదం పొందిన విలువలే సంవర్ధక న్యాయభావనకు ఆధారమయ్యాయని వారు పేర్కొన్నారు. తరువాత కాలంలో రాజ్యం సంవర్ధక న్యాయాన్ని అమలులో ఉంచేందుకు చర్యలు తీసుకొన్నదన్నారు. 3) మతం: న్యాయానికి గల మరొక ఆధారమే మతం. మధ్యయుగం నుంచి మతం న్యాయానికి ఆధారంగా కొనసాగుతూ వచ్చింది. న్యాయం, మంచి, చెడులకు సంబంధించిన భావనలను భగవంతుడు ప్రవచించాడని క్రైస్తవమతాధిపతులు పేర్కొన్నారు. మతం ద్వారా న్యాయభావనలకు అంకురార్పణ చేసి, బలవంతుడే రాజ్య పాలకుడిగా ఉంటాడనీ వారు ఉద్ఘాటించారు. థామస్ అక్వినాస్ అనే మతాచార్యుడిగా మారిన తత్వవేత్త మతాన్ని క్రైస్తవచర్చికి ప్రతిరూపంగా విశ్వసించాడు. ఇతని ప్రకారం చట్టం ఆధారంగా కొనసాగే జీవనం ఉత్తమమైందిగా భావించాడు. రాజు ఎల్లప్పుడు ప్రజలను సన్మార్గంలో నడిపించాలన్నారు. రాజు తన అధికారాలను మతాధిపతి ఆధిపత్యానికి బద్ధుడై వినియోగించాలన్నాడు.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
చట్టానికి గల మూడు ఆధారాలను రాయండి.
1) ఆచార, సంప్రదాయాలు, వాడుకలు: ఇవి శాసనానికి తొలి ఆధారాలు. ప్రజల ఆచారాలు, వాడుకలు, సంప్రదాయాలు శాసనాలకు మూలాధారము. సంప్రదాయాలు సంఘంలో ఒక అలవాటుగా, క్రమంగా రూపొందుతాయి. పూర్వం సంప్రదాయాలే సమాజ జీవితాన్ని క్రమబద్ధం చేసేవి. రాజ్యం వీటిని గుర్తించి, వాటిని ఆధారం చేసుకొని కొన్ని శాసనాలను రూపొందిస్తుంది. రాజకీయ ఆచారాలు కూడా రాజ్యంచే గుర్తించబడి అమలు చేయబడితే అవి శాసనాలవుతాయి. బ్రిటన్లో ‘సామాన్య న్యాయం’ సంప్రదాయబద్ధమైన శాసనానికి ఉదాహరణ. అదే విధంగా భారతదేశంలో వివాహ చట్టాలు, ఆస్తి పంపిణీ చట్టాలు మొదలగునవి సంప్రదాయాలు ఆధారంగా చేయబడ్డాయి. 2) మతం : ఆచారానికి మతం సమాజాన్ని విపరీతంగా ప్రభావితం చేసే వ్యవస్థ. సంఘ జీవితం మత నియమాలకు అనుగుణంగా జరుపుకుంటారు. పూర్వం మతాధిపతులు చెప్పే నియమాలు శాసనాల వలె చెలామణి అయ్యేవి. ఆధునిక కాలంలో కూడా శాసనాలు చేయడానికి మతం ఒక ఆధారం. వారసత్వం, వివాహం, కుటుంబ ఆస్తి మొదలైన వాటి శాసనాలు మతం ఆధారంగా చేయబడ్డాయి. హిందువులు, క్రైస్తవులు, ముస్లిములకు గల శాసనాలు వారి మతాలు ఆధారంగా రూపొందాయి. ఇరాన్, పాకిస్థాన్ వంటి మత ప్రమేయ దేశాలలో సంఘ జీవనానికి మత నియమాలే ఆధారం. 3) న్యాయస్థానాల తీర్పులు న్యాయస్థానాలలో న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు శాసన నిర్మాణానికి ఆధారాలు. న్యాయస్థానాలు చట్టాలను వ్యాఖ్యానిస్తాయి. ఈ విధి నిర్వహణలో న్యాయమూర్తులు తీర్పులిచ్చేటప్పుడు క్రొత్త న్యాయ సూత్రాలను సృష్టిస్తారు. ఈ తీర్పులు అదే విధమైన వివాదాలు తలెత్తినప్పుడు న్యాయసూత్రల వలె వర్తింపచేస్తారు. నేడు న్యాయమూర్తుల నిర్ణయాలు శాసనాలలో అంతర్భాగమవుతున్నాయి. ఉదా : భారతదేశంలో సుప్రీంకోర్టు తీర్పులిచ్చిన గోలక్నాథ్ కేసు, కేశవానంద భారతి కేసు, మినర్వామిల్స్ కేసు. 4) శాస్త్రీయ వ్యాఖ్యానాలు: ప్రముఖ న్యాయశాస్త్ర కోవిదులు, రచయితలు, విమర్శకులు చేసే వ్యాఖ్యానాలు శాసన నిర్మాణానికి ఆధారమవుతాయి. ఇవి న్యాయస్థానాలలో న్యాయమూర్తుల వ్యాఖ్యానాలు, వివరణలు, శాసనాలు చేయటానికి ప్రభుత్వానికి ఉపయోగిస్తాయి. న్యాయమూర్తుల నిర్ణయాలు, తీర్పులు, భవిష్యత్లో శాసన నిర్మాణానికి తోడ్పడతాయి. ఇంగ్లండ్లో కోక్, బ్లాక్టన్, అమెరికాలో స్టోరీ, కెంట్, భారతదేశంలో విజ్ఞానేశ్వర, అపరార్క వంటి వారి వ్యాఖ్యానాలు శాసన నిర్మాణానికి ఆధారాలు.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
నిమటోడా, అనెలిడా దేహంలోని పర్యాంతరాంగ స్థలం పుట్టుక గురించి మీరు ఏవిధంగా వివరిస్తారు?
గుండ్రటి పురుగుల స్థాయి నిమటోడాలో అవయవ వ్యవస్థ స్థాయి వ్యవస్థీకరణను ప్రదర్శించును. ఇవి ద్విపార్శ్వ, సౌష్టవ, మిథ్యా శరీరకుహర త్రిస్తరిత జీవులు. దేహం ఖండితరహితం. అనెలిడా జీవులలో శరీర నిర్మాణం అవయవ వ్యవస్థ స్థాయిని కలిగి ఉంటుంది. ఇది త్రిస్తరిత, సమఖండ విన్యాసాన్ని ప్రదర్శించే నిజ శరీరకుహర జీవులు.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
పరిశ్రమ అంటే ఏమిటి?
వ్యాపారము తాలూకు ఉత్పాదనాంశమే పరిశ్రమ. వస్తువుల ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాల సమూహాన్ని పరిశ్రమగా పేర్కొనవచ్చు. వస్తువుల సేకరణ, ఉత్పత్తి, ప్రాసెసింగ్, నిర్మాణము మొదలైనవాటికి సంబంధించిన కార్యకలాపాలను పరిశ్రమగా నిర్వచించవచ్చును.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
చర్మీయ శ్వాసక్రియ అనగానేమి? అది ఏ జీవులలో జరుగుతుంది?
చర్మం ద్వారా జరిగే వాయు మార్పిడిని చర్మీయ శ్వాసక్రియ అంటారు. ఉదా : కప్ప, వానపాము, జలగ
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ప్రశ్న: సాధారణంగా మైదాన ప్రాంతాలలో ఉండే గ్రామాలు మంచి ఉపాధి, జీవన ప్రమాణం కలిగి ఉంటాయి? ఎందువలన?
మైదాన ప్రాంతాలలో ఉండే గ్రామాలు మంచి ఉపాధి జీవన ప్రమాణం కల్గి ఉండటానికి కారణం : 1. ఈ ప్రాంతాల్లో సారవంతమైన నేలలు ఉండటం వలన ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది. 2. వ్యవసాయదారులు మిగులు సొమ్మును పెట్టుబడిగా మార్చి పరిశ్రమల స్థాపనకు దోహదం చేయటం వలన వృత్తి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి. ఉదా : రైసుమిల్లులు, చక్కెర కర్మాగారాలు మొ||నవి. 3. మెరుగైన రవాణా సౌకర్యాలుండటం వలన (ఎగుమతులు, దిగుమతులు) వ్యాపార, వాణిజ్య రంగాలు అభివృద్ధి .. చెంది ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. 4. అనేక రకాల ఇతర వృత్తులు కూడా అధికంగా వృద్ధి చెంది ఉండటం.
Telugu
tel
re-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ఇచ్చిన భావం వచ్చేలాగా గేయ పంక్తులు రాయండి: ఇంటికి కావలసిన పనులన్ని చేసి, పిల్లలను పోషించి, అత్త మామలను సరిగా పోషించి, భర్త మెప్పును పొంది కూలికి వెళ్లి పనిచేసి ఆకలితో ఇంటికి వచ్చి పొయ్యి వెలిగిస్తావు. ఏ లెక్కప్రకారం చూసినా ఆడవారు చేసే శ్రమనే అధికం. అయినా మగవారికే కూలి ఎక్కువ ఎందుకిస్తారు అని నిసార్ ప్రశ్నించాడు.
ఇల్లంత సరిజేసి పిల్లలా సవరించి అత్తమామల జూసి, మొగని మెప్పుపొంది కూలి నాలి జేసి పొద్దూక ఇల్లొచ్చి ఆకలి మంటతో పొయ్యి రాజేసేవు ఏ లెక్కనా జూసినా నువుజేసే కష్టమే ఎక్కువాయే కూలి డబ్బుల కాడ మగవాల్ల కన్న నీకెందుకు తక్కువాయే – “ఆడ ”
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
చట్టబద్ధమైన న్యాయంలోని పర్యవసానాలు ఏవి ?
చట్టబద్ధమైన న్యాయం రాజ్యాంగ శాసనాల ద్వారా వెల్లడి అవుతుంది. రాజ్యంలోని రాజ్యాంగం, ఇతర శాసన చట్టాల రూపంలో ఇది వ్యక్తమవుతుంది. న్యాయం చట్టబద్ధమైన పరిమితులను నిర్ణయిస్తుంది. చట్టబద్ధమైన న్యాయంలో రెండు అంశాలు ఇమిడి ఉంటాయి. అవి: సమాజంలో చట్టాలన్నీ సమన్యాయ పాలన సూత్రంపై ఆధారపడి రూపొందించబడి, అమలు చేయబడతాయి. చట్టాలన్నీ సహాయ న్యాయ సూత్రాలకు అనుగుణంగా రూపొందించబడతాయి.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
కింది పదాలకు ప్రకృతి, వికృతులను జతపరచి రాయండి. భాష, అమ్మ, నిద్ర, బాస, అంబ, నిదుర
ప్రకృతి – వికృతి భాష – బాస అంబ – అమ్మ నిద్ర – నిదుర
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
“సమాజం” అంటే ఏమిటి ?
సమాజం ప్రాచీనమైనది. రాజ్యం కంటే ముందు ఏర్పడినది. మానవుడు సంఘజీవి. సమాజంలో మాత్రమే వ్యక్తి సంపూర్ణ వికాసాన్ని, సుఖవంతమైన జీవితాన్ని గడపగలడు. “సమిష్టి జీవనాన్ని గడుపుతున్న మానవ సముదాయమే” సమాజము. సమాజంలో సభ్యత్వం లేని మానవుడిని ఊహించలేము. వలలాగా అల్లబడిన వివిధ రకాల మానవ సంబంధాలను ‘సమాజం’ అని చెప్పవచ్చు. అయితే రాజ్యంలాగా సార్వభౌమాధికారము, దండనాధికారం ఉండదు. సాంఘిక ఆచార సంప్రదాయాల ఆధారముగా శిక్షలు ఉంటాయి.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ఈ కింది ప్రశ్నకి పదేసి వాక్యాలలో సమాధానం రాయండి. రాజధానిగా వెలుగొందిన అమరావతి గొప్పతనాన్ని విశ్లేషించండి.
శాతవాహనుల రాజధానిగా క్రీస్తు పూర్వమే అద్భుతంగా అభివృద్ధి చెందిన మహానగరం అమరావతి. అశోకునికి పూర్వమే అమరావతిలో బౌద్ధస్తూపం ఉంది. మెగస్తనీసు తన ‘ఇండికా’ గ్రంథంలో అమరావతి గురించి ప్రస్తావించాడు. ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు, విష్ణుకుండినులు మొదలైన వారి పరిపాలనలో అమరావతి దినదినాభివృద్ధి చెందింది. 1798లో స్థానిక జమీందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడుగారు కూడా అమరావతిని అత్యంత వైభవోపేతంగా తీర్చిదిద్దారు. అంటే సుమారు 1800 సంవత్సరాలు రాజధానిగా విరాజిల్లింది అమరావతి. అమరావతిని రాజధానిగా చేసుకొని చాలామంది పరిపాలన సాగించారు. ఆయా ప్రభువుల పాలనలలో కాలానుగుణంగా అనేక మార్పులు పొందింది. అనేక మంది పరిపాలనా విధానాలు, మతాచారాలు, సంస్కృతి సంప్రదాయాలు అమరావతి మీద ప్రభావం చూపాయి. అందుచేత అమరావతి ఆంధ్రప్రదేశ్ కు సాంస్కృతిక రాజధాని అయ్యింది. హిందూ, ముస్లిం, బౌద్ధ, జైన, క్రైస్తవ మత సంప్రదాయాలతో సర్వమత సమ్మిళిత నగరంగా అమరావతి రాజధానిగా వెలుగొందింది.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ఇచ్చిన వ్యాక్యంలో తప్పు ఉంటె సరిచేసి రాయండి: మూలకేశాలలోని రిక్తికలోకి నీరు విసరణ ప్రక్రియ ద్వారా ప్రవేశిస్తుంది.
మూలకేశాలలోని రిక్తికలోకి నీరు ద్రవాభిసరణ ప్రక్రియ ద్వారా ప్రవేశిస్తుంది.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
Given the below title and summary of an article, generate a short article or the beginning of a long article to go along with them. Title: వీడియో: ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగితే ప్రభుత్వం మారుతుందా?\nSummary: ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగితే ప్రభుత్వం మారిపోతుందని ఓ విశ్వాసం ఉంది. ఇది నిజమేనా? \nArticle (Max 500 characters):
ఇలాంటి విశ్వాసాలకు కొన్ని సందర్భాలు బలం చేకూరుస్తున్నాయి. 2009 లోక్‌సభ ఎన్నికల కంటే, 2014 ఎన్నికల్లో పోలింగ్ 6.7 శాతం పెరిగింది. అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఓడిపోయింది. అంతేకాదు ఆ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగిన ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ 90 శాతం సీట్లను కోల్పోయింది. కానీ, ఈ అంశాన్ని లోతుగా పరిశీలిస్తే.. పోలింగ్ శాతం పెరిగితే ప్రభుత్వాలు మారిపోతాయనే విశ్వాసం నిరాధారమని తెలుస్తోంది. పోలింగ్ శాతానికి, ఫలితాలకు సంబంధం లేదని గణాంకాలు చెబుతున్నాయి.
Telugu
tel
re-annotations
91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0
Title: శ్రామిక్ స్పెషల్ రైల్లో నాలుగు రోజులుగా కుళ్లిన శవం, శుభ్రం చేసేవారు చూసేవరకూ ఎవరికీ తెలియలేదు\nGiven the above title of an imaginary article, imagine the article.\n
ఝాన్సీ రైల్వే యార్డులో ఆ రైలును శుభ్రం చేస్తున్న సమయంలో కడుగుతున్నవారికి బోగీలోని టాయిలెట్‌లో ఒక కుళ్లిన శవం కనిపించింది. పరిశీలించిన తర్వాత ఆ శవం మోహన్‌లాల్‌ది అని తెలిసింది. ఇలాంటి విషాదం ఒక్క మోహన్‌లాల్‌ విషయంలోనే జరగలేదు. శ్రామిక్ రైళ్లలో ప్రయాణించిన ఎంతోమంది కార్మికులు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. వారిలో ఎక్కువ మంది ఎందుకు చనిపోయారు. మోహన్‌లాల్ మరణం లాగే ఈ ప్రశ్న కూడా ఒక రహస్యంలాగే మిగిలిపోయింది. ఝాన్సీలోని రైల్వే పోలీస్ డీఎస్పీ నయీమ్ ఖాన్ మన్సూరీ బీబీసీతో “పోస్టుమార్టం రిపోర్టులో బయట ఎలాంటి గాయాలూ కనిపించలేదని చెప్పారు. శరీరం లోపలి అవయవాలను పరీక్షల కోసం పంపించాం. వాటి రిపోర్టు వచ్చిన తర్వాత ఆయన ఎందుకు చనిపోయారనేది తెలుస్తుంది” అన్నారు. మోహన్‌లాల్ ప్రయాణించిన శ్రామిక స్పెషల్ రైలు, షెడ్యూల్ ప్రకారం రైలు తర్వాత రోజు గోరఖ్‌పూర్ చేరుకోవాల్సి ఉంది. అదే రోజు అది అక్కడినుంచి తిరిగి బయల్దేరాలి. కానీ రెండు రోజుల ప్రయాణం నాలుగు రోజులు పట్టింది. ఇది మాత్రమే కాదు చాల శ్రామిక్ రైళ్లు తమ నిర్ధారిత గమ్యం చేరుకోడానికి చాలా రోజులపాటు ప్రయాణిస్తున్నాయి. చాలాసార్లు అవి దారి కూడా తప్పుతున్నాయి. అయితే రైల్వే మాత్రం అది దారితప్పడం కాదు, ‘డైవర్షన్’ అని చెబుతోంది. రైల్వే ఏం చెప్పింది? మోహన్‌లాల్ శర్మ శవం నాలుగు రోజుల వరకూ రైలు టాయిలెట్లోనే ఉంది. అన్ని రోజులైనా ఎవరికీ ఆ విషయం తెలీలేదు. మోహన్‌లాల్ దగ్గర 23వ తేదీ టికెట్ దొరికింది. కానీ ఆయన ఇదే రైల్లో వెళ్లారా, లేక వేరే ఏదైనా రైల్లో వెళ్లారా అనేది తెలీడం లేదని ఉత్తరమధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అజిత్ కుమార్ సింగ్ చెప్పారు. “మా జిల్లా యంత్రాగం, పోలీసులకు దీని గురించి సమాచారం ఇచ్చాం. ఆ బాడీని హాండోవర్ చేశాం. ఆ తర్వాత పోస్టుమార్టం చేయించడం నుంచి మొత్తం వారే చూసుకున్నారు. ఆయన ఇక్కడివరకూ ఎలా వచ్చారు, ఇదే రైల్లో వెళ్లారా, లేక వేరే రైల్లో వెళ్లారా అనేది ధ్రువీకరించలేకపోయాం. రైల్లో ఆయన మృతదేహం ఉన్న టాయిలెట్ లోపల నుంచి గడియ పెట్టుంది” అని చెప్పారు. “పోస్టుమార్టం రిపోర్టులో మోహన్‌లాల్ దాదాపు నాలుగు రోజుల క్రితం, అంటే మే 24న చనిపోయినట్లు తెలిసింది. శవం దగ్గర నుంచి ఆయన ఆధార్ కార్డ్, కొన్ని సామాన్లు, 27 వేల రూపాయల డబ్బు కూడా దొరికింది” అని డీఎస్పీ నయీం ఖాన్ మన్సూరీ చెప్పారు. మోహన్‌లాల్ శర్మ భార్య పూజ బీబీసీతో “23న మేం రైల్లో కూర్చున్నాం అని ఆయన ఫోన్ చేశారు.
Telugu
tel
re-annotations
91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0
i) A = B అయిన n(A) = n(B) ii) n(A) = n(B) అయిన A = B అయిన A) i మాత్రమే సత్యం B) ii మాత్రమే సత్యం C) i మరియు ii లు సత్యం D) పైవి ఏవీ కావు
A) i మాత్రమే సత్యం
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
చిట్టీ, సూఫీ బోధకుల విజయాలను చర్చించండి.
భారతదేశంలోని చిట్టీ, సూఫీ బోధకుల్లో ఖ్వాజా మొయినుద్దీన్ శిష్యులైన షేక్ హమీదుద్దీన్, షేక్ కుతుబుద్దీన్ భక్తియార్ కాకిలు ప్రధానమైనవారు. వారు సమానత్వాన్ని బోధిస్తూ సామాన్య జీవితాన్ని గడిపారు. శాకాహారులైన వారు స్థానిక హిందువులతో సన్నిహితంగా మెలిగారు. రాజపోషణ, దానాలు తీసుకోవడాన్ని వారు వ్యతిరేకించారు. గాత్ర, వాయిద్య సంగీతాలలో గొప్ప ఆధ్యాత్మికత ఉన్నట్లువారు పేర్కొన్నారు. భక్తియార్ కాకికి ఆధ్యాత్మిక సంగీతం అంటే ఇష్టం. సూఫీ బోధకులు తమ ఆశ్రమాల్లో ఏర్పాటు చేసిన హిందూ, ముస్లిం సంగీత విభావరులు అశేష ప్రజానీకాన్ని ఆకట్టుకొన్నాయి. షేక్ ఫరీద్ లేదా బబాఫరీద్ ఢిల్లీ సుల్తానుల కాలానికి చెందిన మరొక సూఫీ బోధకుడు. అతడు అతి సామాన్య జీవితాన్ని గడిపాడు. భక్తి బోధకుల సంగీతాన్ని ఇష్టపడేవాడు. ఆయన శిష్యుల్లో నిజాముద్దీన్ అలియా ముఖ్యుడు. ఢిల్లీలోని ఘజియాపూర్లో తన కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. హజరత్ నిజాముద్దీన్ వినయశీలి. ఇతడు అత్యంత సామాన్య జీవితాన్ని గడిపాడు. పేదవారిని ప్రేమించాడు. ఢిల్లీ సుల్తానుల బహుమానాలను ఆయన తిరస్కరించాడు. నసీరుద్దీన్ చిరాగ్, షేక్ సలీం చిష్టిలు ఆయన ప్రధాన శిష్యులు. షేక్ సలీమ్ చిష్టీ అక్బర్ సమకాలీకుడు. ఇతని సిద్ధాంతాలు, జీవనవిధానం అక్బర్ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. అక్బర్ స్వయంగా ఫతేపూర్ సిక్రిని సందర్శించి చిష్టీ ఆశీస్సులను పొందాడు. తనకు కుమారుడు జన్మించాక అతనికి సలీమ్ అని అక్బర్ నామకరణం చేశాడు. చిష్తీ సమాధిపై అక్బర్ నిర్మించిన దర్గా ఉరుసు సందర్భంగా అన్ని ప్రాంతాల, అన్ని మతాల ప్రజలను విశేషంగా ఆకర్షిస్తూ ఉంది.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
I wonder షేర్‌మొహమ్మెద్‌పేట గ్రామ వైశాల్యం ఎంత? Can you get me some context to answer this (in the same language as my question)?
షేర్‌మొహమ్మెద్‌పేట కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన జగ్గయ్యపేట నుండి 5 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1822 ఇళ్లతో, 7002 జనాభాతో 506 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3471, ఆడవారి సంఖ్య 3531. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 667 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 419. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588841[1].పిన్ కోడ్: 521175. సమీప గ్రామాలు జగ్గయ్యపేట, కోదాడ, ఖమ్మం, మిర్యాలగూడ, సమీప మండలాలు పెనుగంచిప్రోలు, వత్సవాయి, కోదాడ, మేళ్లచెరువు సమాచార, రవాణా సౌకర్యాలు షేర్‌మొహమ్మెద్‌పేటలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం గుండా పోతోంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. జగ్గయ్యపేట నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. విజయవాడ రైల్వేస్టేషన్ 77 కి.మీ దూరంలో ఉంది. విద్యా సౌకర్యాలు గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , నారాయణ హైస్కూల్, కృష్ణవేణి హైస్కూల్, విఙాన్ హైస్కూల్, జగ్గయ్యపేట, సర్వేపల్లి రాధాకృష్ణ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్, షేర్ మహ్మద్ పేట, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి జగ్గయ్యపేటలో ఉంది. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల జగ్గయ్యపేటలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల విజయవాడలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు జగ్గయ్యపేటలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం జగ్గయ్యపేటలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల...ఉన్నాయి.
Telugu
tel
re-annotations
91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0
A = {1, 2, 3, 4, 5, 6} నుంచి ఎన్నుకొన్న సంఖ్య P(x) = x2 – 4 యొక్క శూన్యము కాకపోవడానికి గల సంభావ్యత ఎంత ?
A = {1, 2, 3, 4, 5, 6}, n(S) = n(A) = 6 P(x) = x^2 – 4 = (x + 2) (x – 2) యొక్క శూన్యాలు 2, -2. P(x) యొక్క ఎన్నుకొన్న శూన్యం A లో ఉండుటకు గల అవకాశాలు = n(E) = 1 ∴ P(E) = 6 P(x) యొక్క ఎన్నుకొన్న శూన్యం A లో ఉండక పోవడానికి గల అవకాశాలు , = P(E¯) = 1 – P(E) = 1 – 16 = 56
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ప్ర‌క్షాళ‌న పేరుతో చేసిన ప్ర‌య‌త్నాలు స‌జావుగా సాగ‌క‌పోతే స‌మ‌స్య‌లు ఎలా తీవ్ర‌మ‌వుతాయ‌న్న‌ది తెలియ‌జేస్తోంది. కొల్లేరు స్వ‌రూపం ఇదే ప‌శ్చిమ గోదావ‌రి, కృష్ణా జిల్లాల ప‌రిధిలో కొల్లేరు స‌ర‌స్సు ఉంది. కేజీ(కృషా,గోదావరి) బేసిన్ ప‌రిధిలోని చిత్త‌డి నేల‌ల్లో సుమారుగా 1.20 ల‌క్ష‌ల ఎక‌రాల విస్తీర్ణంలో ఈ సరస్సు విస్తరించి ఉంది. అరుదైన జాతుల‌ ప‌క్షులు, ప‌లు ర‌కాల చేప‌ల‌కు కొల్లేరు ప్రసిద్ధి. ఎన్నో అరుదైన విదేశీ ప‌క్షుల‌కు కొల్లేరు ఆవాసంగా ఉంటోంది. దీని ప‌రిధిలో 122 లంక గ్రామాల్లో మూడు ల‌క్ష‌ల మంది నివిస్తున్నారు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఆకివీడు, నిడ‌మ‌ర్రు, భీమ‌డోలు, ఉంగ‌టూరు, పెద‌పాడు, ఏలూరు, దెందులూరు మండ‌లాల‌ ప‌రిధిలో 20 బెడ్ గ్రామాలు (స‌ర‌స్సు లోప‌ల‌), 63 బెల్ట్ గ్రామాలు (స‌ర‌స్సు ఆనుకుని) ఉన్నాయి. కృష్ణా జిల్లాలో కైక‌లూరు, మండ‌విల్లి మండ‌లాల ప‌రిధిలోని 26 బెడ్, 13 బెల్ట్ గ్రామాలు కొల్లేరు పరిధిలో విస్త‌రించి ఉన్నాయి. బుడ‌మేరు, త‌మ్మిలేరు, రామిలేరు, గుండేరు లాంటి చిన్నా, పెద్దా ఏరుల నుంచి కొల్లేరుకు నీరు వ‌చ్చి చేరుతుంది. ఏలూరు, కైక‌లూరుకు చెందిన మురుగు నీరు కూడా కొల్లేరులోకి వస్త... Continue the article for another 4000 characters max:
ోంది. ప్రమాదంలో కొల్లేరు సరస్సు పూడిక‌తో నిండుతున్న కొల్లేరు కొన్నాళ్లుగా కొల్లేరు పూడిక‌తో నిండిపోతోంది. ముఖ్యంగా వ‌ర‌ద‌ల స‌మ‌యంలో వ‌చ్చే ఒండ్రు మ‌ట్టి, గుర్ర‌పు డెక్క, కిక్కిస వంటి కార‌ణంగా కొల్లేరు పూడిక‌మ‌యం అవుతోంది. ఫ‌లితంగా 1900 నాటికి స‌ముద్ర మ‌ట్టం కంటే దిగువ‌న ఉన్న కొల్లేరు ఇప్పుడు ఎగువ‌కు వ‌చ్చింద‌ని అధికారిక నివేదిక‌లు తెలుపుతున్నాయి. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే స‌ర‌స్సు పూడిక‌మ‌యం అయిపోయే ప్ర‌మాదం ఉంద‌ని గ‌తంలో ఇంపీరియ‌ల్ గెజిట్‌లో కూడా పేర్కొన్నారు. ప్ర‌ధానంగా పారిశ్రామిక వ్య‌ర్థాలు, ర‌సాయ‌నాలు, ప్లాస్టిక్ వ్య‌ర్థాలు చేరిక‌తో ఇది మ‌రింత వేగ‌వంతం అవుతోంది. వ్య‌వ‌సాయం నుంచి ఆక్వా వైపు కొల్లేరు ప్రాంతమంతా ఒక‌ప్పుడు వ్యవసాయంతో సందడిగా ఉండేది. 1969లో వ‌చ్చిన తుపాన్ త‌ర్వాత ప‌రిస్థితి మారింది. ముంపు, కాలుష్యం పెర‌గ‌డంతో వ్య‌వ‌సాయం ముందుకు సాగ‌లేదు. ఆ స‌మ‌యంలో ప‌లువురు కొల్లేరు వాసులు వ‌ల‌స‌లు పోవాల్సి వ‌చ్చింది. అప్ప‌టి ప్ర‌భుత్వం స్పందించి కొల్లేరులో వ్య‌వ‌సాయం వీలుకాద‌ని నిర్ధరించింది. 1976లో జ‌ల‌గం వెంక‌ట్రావు ప్ర‌భుత్వం జీవో నెం.118 ద్వారా చేప‌ల చెరువుల త‌వ్వ‌కాల‌కు దిగింది. రెండు జిల్లాల్లో క‌లిపి 136 సొసైటీలు ఏర్పాటు చేసి చేప‌ల చెరువుల‌కు శ్రీకారం చుట్టారు. డీఫారం, జిరాయితీ భూముల్లో కూడా చెరువుల త‌వ్వ‌కం జరిగింది. 1990 త‌ర్వాత చేప‌లు, రొయ్య‌ల సాగు జోరందుకుంది. పెద్ద స్థాయిలో ఆక్వా సాగు జ‌ర‌గ‌డంతో అన్ స‌ర్వేడు భూముల్లో కూడా చెరువుల తవ్వ‌కాలు పెరిగాయి. ఆ స‌మ‌యంలోనే భారీగా కొల్లేరు ఆక్ర‌మ‌ణ‌లు పెరిగిన‌ట్టు ప్ర‌భుత్వం గుర్తించింది. ఇత‌ర ప్రాంతాల‌కు చెందిన చేప‌లు, రొయ్య‌ల వ్యాపారులు రంగ ప్ర‌వేశం చేశారు. సొసైటీల‌కు ఆదాయం పెర‌గ‌డంతో కొల్లేరు లంక వాసుల జీవ‌నానికి ఢోకా లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. రొయ్య‌ల సాగుతోనే ఛిన్నాభిన్నం .. కొల్లేరులో స‌హ‌జ సిద్ధంగా సాగిన చేప‌ల పెంప‌కం, ఆక్వా క‌ల్చ‌ర్ అంటూ వ‌చ్చిన రొయ్య‌ల సాగు మూలంగా అనేక స‌మ‌స్య‌లు తెచ్చిపెట్టింద‌ని గుడివాక‌లంకకు చెందిన జ‌య‌మంగ‌ళం సున్నిబాబు బీబీసీకి తెలిపారు. ''మా త‌ల్లిదండ్రులు చేప‌లు పెంచేవారు. వాటిని అమ్ముకుని జీవ‌నం సాగించేవారు. కానీ, ఆక్వా సాగు వ‌చ్చిన త‌ర్వాత చెరువుల‌న్నీ లీజుల‌కు ఇవ్వ‌డం ప్రారంభించారు. ఇప్పుడు ఎక‌రానికి రూ. 1.50 ల‌క్ష‌లు ఇస్తున్నారు. ఆ చెరువుల్లో మా వాళ్లు కూలీల‌య్యారు.
Telugu
tel
re-annotations
91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0
కింద పాసేజ్ దేని గురించి చర్చిస్తుందో చెప్పండి: రెండవ ప్రపంచ యుద్ధం లేదా రెండవ ప్రపంచ సంగ్రామం అనేది 1939 నుండి 1945 వరకు ప్రపంచంలోని అనేక దేశాల నడుమ ఏక కాలంలో ఉమ్మడిగా, విడివిడిగా జరిగిన అనేక యుద్ధాల సమాహారం. దీనికి పూర్వ రంగంలో జరిగిన రెండు ప్రధాన సైనిక సంఘటనలు ఈ మహా యుద్ధానికి దారి తీశాయి. వాటిలో మొదటిది, 1937లో మొదలయిన రెండవ చైనా-జపాన్ యుద్ధం. రెండవది, 1939లో జర్మనీ దేశం పోలాండ్ పై జరిపిన దురాక్రమణ. రెండవ చైనా-జపాన్ యుద్ధం వివిధ ఆసియా దేశాల మధ్య యుద్ధానికి దారి తీస్తే, జర్మనీచే పోలాండ్ దురాక్రమణ ఐరోపా దేశాల మధ్య యుద్ధానికి కారణభూతమయింది. ఇది క్రమంగా ప్రపంచంలోని అనేక దేశాలు మిత్ర రాజ్యాలు, అక్ష రాజ్యాల పేరుతో రెండు ప్రధాన వైరి వర్గాలుగా మారి ఒక మహా సంగ్రామంలో తలపడేటట్లు చేసింది. ఈ యుద్ధంలో పాల్గొన్న సైనికుల సంఖ్య సుమారు పది కోట్లు. ఇందులో పాల్గొన్న దేశాలు ఒక రకమయిన పరిపూర్ణ యుద్ధ పరిస్థితిని ఎదుర్కొన్నాయి (అనగా, సైనిక-పౌర భేదాలు లేకుండా అందుబాటులో ఉన్న వారందరూ ఏదో ఒక రకంగా యుద్ధంలో పాలుపంచుకోవటం). ఆకారణంగా ఆయా దేశాల ఆర్థిక, పారిశ్రామిక, సాంకేతిక వనరులన్నింటినీ యుద్ధ ప్రయోజనాలకోసమే వాడవలసి వచ్చింది.
పాసేజ్ రెండవ ప్రపంచ యుద్ధం గురించి చర్చిస్తుంది.
Telugu
tel
re-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ఇచ్చిన సామాన్య వ్యాఖ్యలని సంక్లిష్ట వాక్యంగా మార్చండి: విమల వంట చేస్తుంది. విమల పాటలు వింటుంది.
విమల వంట చేస్తూ పాటలు వింటుంది.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
కింది పదాల్లో ఉత్వ, త్రిక, రుగాగమ, లులనల సంధులున్నాయి. పదాలు విడదీసి, సంధి జరిగిన తీరును చర్చించండి. అ బంధమూడ్చి ఆ) అవ్వారల ఇ) భక్తురాలు ఈ) బాలెంతరాలు ఉ) గుణవంతురాలు ఊ) దేశాల ఋ) పుస్తకాలు ఋా) సమయాన
ఉత్వ సంధి సూత్రము : ఉత్తునకచ్చు పరమగునపుడు సంధియగు. అ) బంధమూడ్చి = బంధము + ఊడ్చి – (ఉ + ఊ – ఊ) త్రిక సంధి సూత్రము : ఆ, ఈ, ఏ లు త్రికమనబడును – (ఆ + వారల) త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు – (ఆ + వ్వారల) ద్విరుక్తంబగు హల్లు పరమగునపుడు ఆచ్చికమగు దీర్ఘమునకు హ్రస్వంబగు – (అవ్వారల) ఆ) అవ్వారల = ఆ + వారల – త్రిక సంధి రుగాగమ సంధి సూత్రము :కర్మధారయము నందు తత్సమంబులకు ‘ఆలు’ ‘శబ్దం పరమగునపుడు అత్వంబునకు ఉత్వమును, – రుగాగమంబును అగును. ఇ) భక్తురాలు : భక్త + ఆలు – భక్తురు(క్) + ఆలు ఉ) గుణవంతురాలు – గుణవంత + ఆలు – గుణవంతురు(క్) + ఆలు సూత్రము :పేదాది శబ్దములకు ‘ఆలు’ శబ్దం పరమగునపుడు రుగాగమంబగు. ఈ) బాలెంతరాలు : బాలెంత + ఆలు – రుగాగమ సంధి లు ల న ల సంధి సూత్రము : లు ల న లు పరంబగునపుడు ఒకానొకచోట ముగాగమంబునకు లోపంబును, దాని పూర్వస్వరమునకు దీర్ఘమును విభాషనగు. ఊ) దేశాల = దేశము + ల – (‘ము’ లోపం – దాని పూర్వపు ‘శ’ కు దీరం వచ్చింది.) ఋ) పుస్తకాలు : పుస్తకము + లు – (‘ము’ లోపం – దాని పూర్వపు ‘క’ కు దీర్ఘం వచ్చింది.) ఋా) సమయాన = సమయము + న – (‘ము’ లోపం – దాని పూర్వపు ‘య’ కు దీర్ఘం వచ్చింది.)
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
మత్తేభము ఛందస్సు గురించి క్లుప్తంగా వివరించండి.
మత్తేభము : నాలుగు పాదములు గల వృత్తము. ప్రతి పాదంలోను 20 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదము నందు స, భ, ర, న, మ, య, వ అను గణములు వరుసగా ఉండును. పదునాల్గవ అక్షరము యతి స్థానము. ప్రాస నియమము కలదు.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
“కీటకాలు, పక్షులు లేని ప్రపంచాన్ని మనం ఊహించలేము.” వాటిని సంరక్షించుటకు మీరు పాటించే రెండు పద్ధతులను తెలుపండి.
క్రిమి సంహారక మందులను అతిగా వాడకూడదు. కీటకాల మరియు పక్షుల సహజ ఆవాసాలను కాపాడాలి. పార్కులను మరియు పక్షుల సాంక్చ్యురీలను అభివృద్ధి చేయాలి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పర్యావరణ సూత్రాలను పాటించే విధంగా చైతన్య పరచాలి.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ఒక ద్వికుంభాకార కటకం ప్రధానాక్షంనకు సమాంతరంగా వచ్చిన కిరణాలు 10 సెం.మీ.ల వద్ద కేంద్రీకరింపచేసిన దాని నాభ్యంతరము A) 5 సెం.మీ. B) 10 సెం.మీ. C) 20 సెం.మీ. D) 25 సెం.మీ.
B) 10 సెం.మీ.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడే సంతతి, లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడే సంతతితో ఏవిధంగా విభేదిస్తుంది?
అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడే సంతతి ఒకదానితో ఒకటి పోలివుండి జనకానికి సరిఅయిన నకలుగా ఉంటాయి. ఇవి వివిధ వాతావరణ పరిస్థితులలో జీవించే అవకాశం తక్కువగా ఉంటుంది. లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడే సంతతిలో వైవిధ్యాలు ఎక్కువగా ఉంటాయి మరియు జనకులను పోలి ఉండవు. ఇవి వివిధ వాతావరణ పరిస్థితులలో జీవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
మనిషికి ‘ఆత్మాభిమానం’ ఎందుకు ఉండాలి?
మనిషికి ఆత్మాభిమానం చాలా అవసరం. ఆత్మాభిమానం అంటే తనపై తనకు గౌరవం. ఆత్మాభిమానం కలవారు ఎవరి దగ్గరా దేనికీ ఎప్పుడూ చేయి చాపరు. ప్రాధేయపడరు. తమ పనిని తాము చేసుకొంటారు. దేన్నైనా సాధిస్తారు. ఎంత కష్టాన్నైనా భరిస్తారు. కానీ, ఇతరులకు లోకువకారు. గౌరవంగా జీవిస్తారు. ఆత్మాభిమానం కలవారు మోసం చేయరు. అబద్దాలాడరు. ఎవరినీ నొప్పించరు. ఇతరులు బాధపడేలా ప్రవర్తించరు. ఉచితంగా దేనినీ ఆశించరు. ఎవరైనా ఇచ్చినా తీసుకోరు. అటువంటి ఆత్మాభిమానం కలవారి వల్లనే సమాజం అభివృద్ధి చెందుతుంది. సమాజం సుసంపన్నం అవుతుంది.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
అతిథులు అంటే ఎవరు? అతిథి మర్యాద అంటే ఏమిటి?
‘అతిథులు’ అంటే తిథి నియమం లేకుండా ఇంటికి వచ్చేవారు. మన ఇండ్లకు ఎవరైనా క్రొత్తవారు వస్తే, వారిని మర్యాదతో లోపలికి పిలిచి, వారికి కాళ్ళు కడుగుకోడానికి నీళ్ళు ఇచ్చి, వారికి కాఫీ, టిఫిను, వగైరా ఇవ్వడం అతిథి మర్యాద. అవసరమైతే వారికి భోజనం కూడా పెట్టాలి. మా ఇంటికి అతిథులు వస్తే వారిని … ఆదరించి, వారికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి భోజనం పెడతాను. ఉన్నంతలో వారి కోరికలు తీరుస్తాను.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
రామానందుడు, కబీర్లు భక్తి ఉద్యమానికి చేసిన సేవను వివరించండి.
రామానందుడు : భక్తి ఉద్యమ ప్రవక్తలలో మొదటివాడు రామానందుడు. తమ సొంత బ్రాహ్మణ కులానికి చెందినవారి ఆధిపత్యాన్ని తిరస్కరించాడు. గంగాతీర ప్రాంతంలో తన సిద్ధాంత ప్రచారానికి హిందీ భాషను ఉపయోగించారు. రామానుజాచార్యుల విశిష్టాద్వైత మతాన్ని స్వీకరించి మరింత ప్రచారం కల్పించాడు. సాంఘిక దురాచారాలను, కర్మకాండలను తిరస్కరించిన రామానందుడు సంస్కృతం, హిందీ భాషకు ప్రాధాన్యం ఇచ్చాడు. తన రచన ‘ఆనంద భాష్యం’లో శూద్రులు వేదాలను అధ్యయనం చేయడాన్ని గుర్తించలేదు. తక్కువకులం వారిని శిష్యులుగా స్వీకరించాడు. ఇతని శిష్యుల్లో ధర్మాజాట్, సేనానాయి బ్రాహ్మణుడు, రవిదాస్ చర్మకారుడు, కబీర్ మహ్మదీయుడు, మహిళలు కూడా తన శిష్యులయ్యారు. వారిలో పద్మావతి, సురస్త్రీలు. కబీర్ (1440–1510) : కబీర్ మధ్యయుగంలోని ప్రముఖ సంఘ, మతసంస్కర్త. రామానందుడి శిష్యుల్లో కబీర్ విప్లవ భావాలు కలవాడు. తన గురువు సాంఘిక సిద్ధాంతానికి అచరణాత్మక రూపును ప్రసాదించాడు. కబీర్ కులవ్యవస్థను ఖండించాడు. ఇతడు విగ్రహారాధనను, కర్మకాండలను ఖండించాడు. తీర్థయాత్రలను చేయడాన్ని వ్యతిరేకించాడు. మహిళల పరదా పద్ధతిని తిరస్కరించాడు. కబీర్ సాధారణ జీవనాన్ని విశ్వసించాడు. కబీర్ స్వయంగా బట్టలు కుట్టి వాటిని మార్కెట్లో విక్రయించాడు. ఆయనకు ‘లోయ్’ అనే మహిళతో వివాహం అయ్యింది. ఆయన కుమారుడు కమల్. ఆలోచనా పరుడు, భక్తుడు, దేవుడు ఒక్కడే అని కబీర్ విశ్వాసం. రాముడు, రహీం ఒక్కరే అని ప్రచారం చేశాడు. హిందూ-ముస్లింల మధ్య మైత్రి సాధించడానికి కబీర్ తీవ్రంగా కృషి చేశాడు. “హిందూ, ముస్లింలు ఇద్దరూ సర్వోన్నతమైన భగవంతుడి బిడ్డలు అని స్పష్టంగా అనేకసార్లు గట్టిగా చెప్పిన మొట్టమొదటి సాంఘిక, మతసంస్కర్త కబీర్” అని కె.ఎస్. లాల్ అనే పండితుడు పేర్కొన్నాడు. కబీర్ శిష్యులను “కబీర్ పంథీస్” అని అంటారు. కబీర్ రచించిన దోహాలకు ‘బీజక్’ అని పేరు. వీరు ఇరువురు ఒకే మట్టితో చేసిన రెండు కుండల వంటి వారని కబీర్ పేర్కొన్నాడు. ‘పవిత్రమైన హృదయం లేకుండా విగ్రహాన్ని ఆరాధించడం వల్ల, గంగానదిలో స్నానమాచరించడం వల్ల ప్రయోజనం ఏముంది ? మక్కాకు యాత్ర చేయడం వల్ల ప్రయోజనం ఏముంది ? అని కబీర్ ప్రశ్నించాడు.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ఇచ్చిన గద్యానికి కొనసాగింపు రాయండి: ధర్మదేవత నా జీవితం ప్రసాదించినా నా శరీరాన్ని నా బంధువులు దహనం చేశారు. ఏ చెట్టు కొమ్మనో పట్టుకొని వేలాడలేను. నిన్న రాత్రంతా చాలా యాతన పడ్డాను. గబ్బిలం శరీరంలో ప్రవేశించాను. కాని గబ్బిలం బ్రతుకు దుర్భరం అనిపించింది. ఒక కప్పలో ప్రవేశించాను కాని బావిలో కప్ప జీవితం ఉక్కిరిబిక్కిరి అనిపించింది. మీరిచ్చిన ఐదేళ్ళు మీరే తీసుకోండి అని మానవుడు న్యాయదేవతకు విన్నవించుకున్నాడు. కొత్త జీవితం ప్రారంభిస్తావా ? అని అడిగాడు న్యాయమూర్తి తిరిగి భూలోకానికి ప్రయాణమయ్యాడు.
మృత్యుదూతలు తిరిగి మానవుణ్ణి పల్లెటూరికి తీసుకొని వెళ్ళారు. కాని అప్పటికే బంధువులు అతని శరీరాన్ని దహనం చేశారు. ఇంకా ఐదు సంవత్సరాలు ఆత్మకి శరీరం లేకుండా ఎలా జీవించాలో అర్థం కాలేదు. మళ్ళీ ధర్మదేవత దర్శనం అయితే బాగుండుననిపించింది. కాని ఈ లోకంలో ఉన్నతాధికారుల దర్శనం కావాలంటే ఎన్నెన్నో తిప్పలు పడాలి. ఇంక ఆ లోకంలో అధికారుల దర్శనం అంటే మాటలా .? ఇదేమిటీ ఉపద్రవం ? అని బాధపడ్డాడు మానవుడు. అయినా ఎక్కడో ఎవరో చేసిన పొరపాటుకి, తానెందుకు బాధపడాలి ?
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి ఘనపదార్థంపై వాయువు అధిశోషణాన్ని ప్రభావితం చేసే అంశాలను తెలపండి.
ఘనపదార్థంపై వాయువు అధిశోషకాన్ని ప్రభావితం చేసే అంశాలు ఎ) అధిశోషకం ఉపరితల వైశాల్యం బి) వాయు స్వభావం సి) అధిశోషిత పీడనం డి) ఉష్ణోగ్రత
Telugu
tel
original-annotations
b2e4cf812341179f50c97c21201ba8ee469a1675a425172165468ba87ec48b1b
క్రింది ప్రశ్నకి ఒక్కమాటలో జవాబునివ్వండి. నర్మదా నది దక్షిణాన ఉన్న త్రిభుజాకార ప్రాంతాన్ని ఏమంటారు?
దక్కన్ పీఠభూమి
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి సెకండరీ బ్యాటరీకి ఒక ఉదాహరణ ఇవ్వండి. దీని ఘటచర్యను రాయండి.
సెకండరీ బ్యాటరీకి ముఖ్యమైన ఉదాహరణ లెడ్ నిక్షేప బ్యాటరీ. బ్యాటరీ వాడకంలో ఉన్నప్పుడు కింది ఘటచర్యలు చోటు చేసుకుంటాయి. ఆనోడ్ : Pb(ఘ) + SO-24(జల) → PbSO4(ఘ) + 2e– కాథోడ్ : PbO2(ఘ) + SO-24(జల) + 4H+(జల) + 2e– + PbSO4(ఘ) + 2 H2O(ద్ర) కాథోడ్, ఆనోడ్ వద్ద ‘జరిగే మొత్తం చర్య Pb(ఘ) + PbO2(ఘ) + 2H2SO4(జల) → 2PbSO4(ఘ) + 2H2O(ద్ర)
Telugu
tel
original-annotations
b2e4cf812341179f50c97c21201ba8ee469a1675a425172165468ba87ec48b1b
Snippet: అబూబక్ర్ మొదటి ఖలీఫా (మహమ్మద్ తరువాయి) ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ రెండవ ఖలీఫా ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ మూడవ ఖలీఫా అలీ ఇబ్న్ అబీ తాలిబ్ నాలుగవ ఖలిఫా, మహమ్మద్ ప్రవక్త యొక్క అల్లుడు. హుసేన్ ఇబ్న్ అలీ అలీ ఇబ్న్ అబీతాలిబ్ కుమారుడు. ఇబ్న్ అబ్బాస్ - 619, అరేబియా అబ్దుల్లా ఇబ్న్ మసూద్ - 652 జైద్ ఇబ్న్ సాబిత్ - 610 హసన్ బస్రి - (642 - 728 or 737) ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ - (682 - 720) అబూ హనీఫా - (699 - 767 మాలిక్ ఇబ్న్ అనస్ - (715 - 796) జాబిర్ ఇబ్న్ హయ్యాన్ - (721 - 815), రసాయనశాస్త్ర పితామహుడు. ముహమ్మద్ ఇబ్న్ మూసా అల్-ఖ్వారిజిమి (780 - 850) పర్షియన్ ఖగోళశాస్త్రజ్ఞుడు, అల్-జీబ్రా పితామహుడు. అబూ అబ్దుల్లా అష్-షాఫి - (767 - 820) అహ్మద్ ఇబ్న్ హంబల్ - (780 - 855), యాకూబ్ ఇబ్న్ ఇస్ హాఖ్ అల్-ఖింది - (801 - 873), అరబ్, బహుముఖ ప్ర్జజ్ఞాశాలి ముహమ్మద్ అల్-బుఖారి - 810 - 870, పారశీకుడు, హదీసులు (సహీ బుఖారి) ఇబ్న్ హిషామ్ - (మరణం 834) అబూ దావూద్ అస్-సిజిస్తాని, (817 - 888) (బస్రా), సునన్ అబూ దావూద్, పారశీకుడు, హదీసులు. ఇమామ్ ముస్లిమ్ ఇబ్న్ అల్-హజ్జాజ్ - (821 - 875), సహీ ముస్లిం, పారశీకుడు. అల్-తిర్మజి - (824 - 892), జామి అత్-తిర్మజి ఇబ్న్ మాజాహ్ - (824 - 887) పారశీకుడు, సునన్ ఇబ్న్ మాజాహ్ ఇబ్న్ ఖుతైబా - (828-889) అల్-నసాయి - (829 - 915) హదీసుల క్రోడీకరణ, పారశీకుడు ఇబ్న్ జరీర్ అల్-తబరి - (838 - 923), సున్ని, పారశీకుడు (తారీఖ్ అల్-తబరి, తఫ్సీర్ అల్-తబరి) అబు అల్-హసన్ అల్-అష్ హరి - (874 – 936) అరబ్ అత్-తహావి - (853 - 933) ఈజిప్టు, అఖీదా అత్-తహావియ అబు మన్సూర్ అల్-మతురూజి - మరణం 333 AH / 944, పారశీకుడు అల్-ఫరబి - (870 - 950), పర్షియన్ అల్-బర్-బహారీ - (మరణం 940) ఇరాకీ విద్వాంసుడు, ఆంత్రోపాలజి అల్-తబరాని - (875 - 975) అల్-ముజామ్ అల్-కబీర్ ముల్లా నస్రుద్దీన్ - ఇస్లామీయ స్వర్ణయుగం హకీమ్ అల్-నిషబూరి - (933 - 1012/1014) పర్షియన్, ముస్తద్రక్ అల్-హకీమ్ అబు అల్-ఖాసిమ్ అల్-జవాహరి (అబుల్కేసిస్) (936-1013), అందలూసి అరబ్ వైద్యుడు, నవీన శస్త్రచికిత్సా పితామహుడు ఇబ్న్ అల్-హైతామ్ (అల్హాకెన్) (965-1039), అరబ్ మరియు పర్షియాకు చెందిన విశ్వవిజ్ఞాని, కంటి చికిత్సా పితామహుడు, మానసిక చికిత్సావిధాన స్థాపకుడు, మొదటి మానసిక సైధ్ధాంతికుడు మరియు శాస్త్రజ్ఞుడు అల్-షరీఫ్ అల్-రాజి - 970, (నహజ్ అల్-బలాఘ) అల్-మవారిది (972- 1058), అరబ్ అబూ రైహాన్ అల్-బెరూని - (973-1048),... I know that the answer to "రసాయనశాస్త్ర పితామహుడు ఎవరు?" appears somewhere in the text snippet about ముస్లిం పండితులు.
జాబిర్ ఇబ్న్ హయ్యాన్
Telugu
tel
re-annotations
91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0
వ్యాపార విత్తం గురించి సంక్లిప్తంగా వివరించండి
ఆధునిక వ్యాపార సంస్థలకు విత్తము ప్రధానమైనది. వ్యాపారము, విత్తము ఒకదానిపై మరొకటి ఆధారపడి పరస్పరము సహకరించుకుంటూ పని చేస్తాయి. వ్యాపార సంస్థకు అవసరమైన మూలధనాన్ని సేకరించి, భద్రపరిచి, నిర్వహించి, తద్వారా లాభార్జన లక్ష్యాన్ని సాధించుటకు సంబంధించిన కార్యకలాపములను వ్యాపార విత్తం అంటారు. ఒక వ్యాపారాన్ని ప్రారంభించటానికి, విస్తరించడానికి, మార్కెట్లో తన వాటాను పదిలపరుచుకోవడానికి ప్రతి సంస్థకు విత్తం అవసరము.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
1 – 10, 11 – 20 పౌనఃపున్య విభాజన తరగతులలో 1-10 తరగతి ఎగువ హద్దు ఎంత ?
1-10 తరగతి ఎగువ హద్దు = 10.5
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ఇచ్చిన పద్యానికి ప్రతిపదార్ధాలు మరియు తాత్పర్యం రాయండి: క. నిను విశ్వసింపఁ జాలను, వినుపింపుము నీ తెఱంగు, విభుని తెఱంగు న్ననపుడుఁ బావని తెలియఁగ వినయంబున విన్నవించె విస్ఫుట ఫణితిన్.
ప్రతిపదార్థము : నిను = నిన్ను విశ్వసింపన్ + చాలను = నమ్మలేను నీ తెఱంగు = నీ యొక్క వివరములు విభుని దెఱంగు = నా భర్త యొక్క వివరములు వినుపింపుము = నాకు చెప్పు అన్నపుడు = అని సీతాదేవి పలికినప్పుడు పావని = హనుమంతుడు తెలియఁగ = తన గురించి తెలిసే విధంగా వినయంబున = భక్తితో విస్ఫుట = స్పష్టమైన ఫణితిన్ = మాటల తీరుతో విన్నవించె = తెలియజెప్పెను తాత్పర్యము : నిన్ను నమ్మలేను. నీ వివరములు, నా భర్త వివరములు అన్నీ నాకు కూడా వివరించు అని సీతాదేవి పలుకగా, హనుమంతుడు భక్తితో ఆమెకు తను ఎవరో స్పష్టంగా వివరించెను.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
దిగువ భాగాన్ని చూడండి మరియు తరువాత ప్రశ్నకు సమాధానంగా అదే భాషలో సమాధానం ఇవ్వండిః పాసేజ్: 2001 చిత్రం లీగల్లీ బ్లోండ్ విథర్ స్పూన్ కెరీర్లో ఒక మలుపు తిరిగింది; ఆమె ఎల్లే వుడ్స్ గా నటించింది, ఆమె హార్వర్డ్ లా స్కూల్లో తన మాజీ ప్రియుడిని అనుసరించడానికి న్యాయ విద్యార్థిగా మారాలని నిర్ణయించుకుంటుంది. విథర్ స్పూన్ ఈ పాత్ర గురించి ఇలా అన్నారు, "నేను లీగల్లీ బ్లాండ్ చదివినప్పుడు, ఆమె బెవర్లీ హిల్స్ నుండి వచ్చింది, ఆమె ధనవంతురాలు, ఆమె సోరోరిటీలో ఉంది. ఆమెకు ఒక గొప్ప ప్రియుడు వున్నాడు . ఓహ్ అవును, ఆమె డ్రాప్ అవుతుంది. ఎవరు పట్టించుకుంటారు? నేను ఇంకా ఆమెను ద్వేషిస్తున్నాను' కాబట్టి ఆమె ద్వేషించలేని వ్యక్తి అని మేము నిర్ధారించుకోవలసి వచ్చింది". లీగల్లీ బ్లాండ్ బాక్సాఫీస్ హిట్ అయి దేశీయంగా 96 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. విథర్ స్పూన్ యొక్క నటన విమర్శకుల నుండి ప్రశంసలు పొందింది, ప్రెస్ ఆమెను "కొత్త మెగ్ ర్యాన్" అని సూచించడం ప్రారంభించింది. రోజర్ ఎబెర్ట్ ఇలా వ్యాఖ్యానించాడు, "విథర్ స్పూన్ ఈ విషయాన్ని సూర్యరశ్మి మరియు వేగవంతమైన తెలివితేటలతో అప్రయత్నంగా యానిమేట్ చేసింది", మరియు సలోన్.కామ్ "ఆమె [విథర్ స్పూన్] ఎల్లే పాత్రను అందంగా వివరిస్తుంది" అని పేర్కొంది. అదే సమయంలో, సీటెల్ పోస్ట్-ఇంటెలిజెన్సర్ ఇలా ముగించింది, "విథర్ స్పూన్ ఒక ప్రతిభావంతులైన హాస్యనటుడు, ఆమె పూర్తి ఉత్సాహంతో మరియు డ్రైవ్తో కవాతు చేయడం ద్వారా ఒక సన్నివేశాన్ని ఉత్తేజపరుస్తుంది మరియు ఆమె ఈ నిరాడంబరమైన చిన్న హాస్యాన్ని దాదాపు ఒంటరిగా శక్తివంతం చేస్తుంది. " ఆమె నటనకు గాను విథర్ స్పూన్ రెండవ గోల్డెన్ గ్లోబ్ ఉత్తమ నటి నామినేషన్ మరియు ఉత్తమ కామెడీ ప్రదర్శన కోసం ఎంటివి మూవీ అవార్డును గెలుచుకుంది. ప్రశ్న: అత్యుత్తమ కామెడీ ప్రదర్శన అవార్డును ఎవరు ప్రదానం చేశారు?
అత్యుత్తమ కామెడీ ప్రదర్శన అవార్డును ఎం టి వి వారు ప్రదానం చేశారు.
Telugu
tel
re-annotations
957dbaf7ecfa880ad4997d8c891d477e65f8a66ea0255976f18e695d3e427c56
కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి లయోఫిలిక్ కొల్లాయిడ్లు, లయోఫోబిక్ కొల్లాయిడ్ల కంటే స్థిరంగా ఉంటాయి. కారణం తెలపండి.
1. లయోఫిలిక్ సాల్లు ఉత్రమణీయమైనవి. ఇవి స్కందనం జరుగవు. స్థిరంగా ఉంటాయి. 2. లయోఫోబిక్ సాల్లు అనుత్రమణీయమైనవి. వీటికి విద్యుద్విశ్లేష్యాలను కలిపినపుడు అస్థిరంగా మారి స్కంధనం జరుగుతాయి. వీటిని స్థిరంగా మార్చుటకు లయోఫిలిక్ కొల్లాయిడ్లను కలుపవలెను.
Telugu
tel
original-annotations
b2e4cf812341179f50c97c21201ba8ee469a1675a425172165468ba87ec48b1b
విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను వివరిస్తూ మిత్రునకు లేఖ
నెల్లూరు, xxxxx ప్రియ మిత్రమా, నేను. బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగుగా చదువుతున్నావని తలుస్తాను. గడచిన సోమవారం మా నెల్లూరు పట్టణంలో జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించబడింది. జిల్లాలోని నాలుగు మూలల నుండి, వివిధ పాఠశాలల బాలబాలికలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. విద్యార్థులచే తయారుచేయబడ్డ రకరకాల నమూనాలు ఇందులో ప్రదర్శింపబడ్డాయి. మా పాఠశాల విద్యార్థులకు ప్రథమ బహుమతి లభించింది. ఆ ఆనందంతో నీకు ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. ఇట్లు, నీ ప్రియ మిత్రుడు, వి. కోటేశ్వర్. చిరునామా : కోట శ్రీధర్ కుమార్, 7వ తరగతి, టౌన్ హైస్కూలు, గుడివాడ, కృష్ణా జిల్లా.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ఇచ్చిన పదానికి నానార్ధాలు ఇవ్వండి: గడ
స్తంభం, సమూహం, పొడుగటి వెెదురు కొట్టె
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
కణ సిద్ధాంతమును ఎవరు, ఎప్పుడు ప్రతిపాదించారు ? దీనిలోని ముఖ్యమైన అంశాలు ఏవి?
ఎమ్.జె. ప్లీడన్ మరియు థియోడర్ ష్వాన్ 1838-39 సంవత్సరంలో కణ సిద్ధాంతమును ప్రతిపాదించారు. ముఖ్యమైన అంశములు : జీవరాసులన్నీ కణాలు, వాటి ఉత్పన్నాలతో నిర్మించబడి ఉంటాయి. కణాలన్నీ ముందు తరం కణం నుంచే ఏర్పడతాయి. అన్ని కణాలు ఒకే రకమైన రసాయన నిర్మాణం కలిగి, ఒకే రకమైన జీవక్రియలు నెరవేరుస్తాయి. జీవి యొక్క జీవక్రియలు ఆ జీవిలోని కణములు నిర్వర్తించే విధులను బట్టి, ఆ జీవిలో వివిధ కణముల మధ్య ఉండే సంబంధ బాంధవ్యాల మీద ఆధారపడి ఉంటాయి.
Telugu
tel
original-annotations
1c67f174a75af291b9cb7b0e3f088cbe5af3835d0c6332a29523db5c5c6f0e14