id
int64
1.71k
92.9k
url
stringlengths
5
925
title
stringlengths
0
772
text
stringlengths
221
3.81k
summary
stringlengths
85
1.62k
6,633
https://www.prajasakti.com/WEBSECTION/National/page398/nandigamku-rakeshreddi
వైఎస్సాఆర్ మూర్తికి జన్మదిన సత్కారం
సాంస్కృతిక పోషకుడు సౌజన్య శీలి వైఎస్సాఆర్ మూర్తి జన్మదిన సందర్భంగా ప్రముఖ సాంస్కృతిక సంస్థలు జీవిఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్, కళారాజ్యం, శిఖరం ఆర్ట్స్ థియేటర్స్, వైజ్మెన్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్, కళానిలయం ఆధ్వర్యంలో శ్రీత్యాగరాయ గానసభలో నేడు సత్కారం నిర్వహిస్తున్నాయి. ముఖ్య అతిధిగా తెలంగాణ ప్రముఖ సలహాదారు డా. కెవి రమణ హాజరుకాగా సమాచార హక్కు చట్టం కమిషనర్ పి. విజయబాబు సాహితీవేత్త డా. పోతుకూర్చి సాంబశివరావు తదితరులు పాల్గొంటారు.
సాంస్కృతిక పోషకుడు సౌజన్య శీలి వైఎస్సాఆర్ మూర్తి జన్మదిన సందర్భంగా ప్రముఖ సాంస్కృతిక సంస్థలు శ్రీత్యాగరాయ గానసభలో నేడు సత్కారం నిర్వహిస్తున్నాయి. ముఖ్య అతిధి తెలంగాణ ప్రముఖ సలహాదారు డా. కెవి రమణ మరియు తదితరులు పాల్గొన్నారు.
3,250
https://www.prajasakti.com/WEBSECTION/International/page979/pedd-nots-raddun-nirsistu-sipie-andolan
కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రగతిభవన్లో కలెక్టర్ల సమావేశంలో సీఎం మాట్లాడుతూ కొత్త కలెక్టరేట్ల నిర్మాణం వచ్చే ఏడాదిలోగా పూర్తి కావాలన్నారు. గొర్రెపిల్లల పంపిణీకి సంబంధించి సీఎం కలెక్టర్ల అభిప్రాయాలను తీసుకున్నారు. అవసరమైతే కొత్త సంఘాల ఏర్పాటుపై కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలన్నారు.
ప్రగతిభవన్లో కలెక్టర్ల సమావేశంలో సీఎం మాట్లాడుతూ కొత్త కలెక్టరేట్ల నిర్మాణం వచ్చే ఏడాదిలోగా పూర్తి కావాలని చెప్పి, గొర్రెపిల్లల పంపిణీపై కలెక్టర్ల అభిప్రాయాలను తీసుకున్నారు.
6,336
https://www.prajasakti.com/WEBSECTION/International/page482/aspi-net-amar-singh
బ్యాచ్ లర్ ఆఫ్ సైన్స్ ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు .
రీవాల్యుయేషన్, మార్కులు తిరిగి లెక్కింపులకు ఆస్కారం లేకుండా మెడికల్ పిజి, డిగ్రీ, డిప్లమో కోర్సుల సమాధాన పత్రాల మూల్యాంకనం ఉందని హైకోర్టు తప్పుపట్టింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆన్లైన్లో మాల్యాంకన విధానం లోపాలున్నాయని న్యాయమూర్తి ఎస్. వి. భట్ తీర్పు చెప్పారు. ఈ లోపాల్ని సవరించాలని వర్సిటీని ఆదేశించారు. ఆన్లైన్ మూల్యాంకనంపై హైకోర్టుకు వచ్చిన విద్యార్థుల సమాధాన పత్రాలను మరోసారి మూల్యాంకనం చేసి ఫలితాల్ని వెల్లడించాలని స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, మెడికల్ పిజి, డిగ్రీ, డిప్లమో కోర్సుల సమాధాన పత్రాల ఆన్లైన్లో మాల్యాంకన విధానంలో లోపాలున్నాయని,రీవాల్యుయేషన్ చేయాలని న్యాయమూర్తి ఎస్. వి. భట్ వర్సిటీని ఆదేశించారు.
6,363
https://www.prajasakti.com/WEBSECTION/International/page881/ovaral-chhamp-kalikat-univarshity
"ప్రాణాలు తీసిన ఇంటర్ ఫలితాలు"
ఇంటర్ రెండో సంవత్సరం పరీక్ష తప్పడంతో మనస్తాపం చెందిన జె. ప్రవీణ్కుమార్ (17) ఆత్మహత్య చేసుకున్నాడు. గంట్యాడలోని తన తాతయ్య సుంకరి రామునాయుడు వద్ద ప్రవీణ్కుమార్ ఉంటూ విజయనగరంలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ చదివాడు. గురువారం వెలువడిన పరీక్షా ఫలితాల్లో గణితంలో ఫెయిలవ్వడంతో తాటిపూడి రిజర్వాయర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున తాటిపూడి గ్రామస్తులు రిజర్వాయరు స్పిల్వే గేటు వద్ద మృతదేహాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో గణితంలో విఫలమవడంతో జె. ప్రవీణ్కుమార్ (17) తాటిపూడి జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్పిల్వే గేటు వద్ద మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
9,476
https://www.prajasakti.com/WEBSECTION/International/page3036/chivari-rojuku-cherukunn-jan-raksh-yatra
చివరి రోజుకు చేరుకున్న జన రక్ష యాత్ర
కేరళలో బీజేపీ నిర్వహిస్తున్న జన్ రక్ష యాత్ర చివరిరోజుకు చేరుకుంది. 8 కిలోమీటర్ల పాదయాత్రలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా చేస్తున్న జన్ రక్ష యాత్ర చివరి దశకు చేరుకుంది. చివరి రోజు కావడంతో అమిత్ షా ర్యాలీలో పాల్గొన్నారు.
కేరళలో బీజేపీ నిర్వహిస్తున్న 8 కిలోమీటర్ల జన్ రక్ష యాత్ర చివరి రోజుకు చేరుకోగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొన్నారు.
10,181
https://www.prajasakti.com/WEBSECTION/International/page935/china-upagrah-prayog-vijayavant
ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ
2022 సంవత్సరం నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. పూణేలో జరిగిన భారతీయ ఆగ్రో ఇండస్ట్రీస్ ఫౌండేషన్ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ దేశానికి అన్నదాతలైన రైతులు ఇబ్బందుల నుంచి బయటపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధానితోపాటు పలువురు కేంద్రమంత్రులు, ఆగ్రో ఇండస్ట్రీస్ పౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
పూణేలో జరిగిన భారతీయ ఆగ్రో ఇండస్ట్రీస్ ఫౌండేషన్ గోల్డెన్ జూబ్లీ వేడుకలలో భాగంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ 2022 సంవత్సరం నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యమని, రైతులు ఇబ్బందుల నుంచి బయటపడాలని అన్నారు.
10,538
https://www.prajasakti.com/WEBSECTION/International/page226/balayyaku-chiranjeevi-puttinroju-shubhakankshalu
పండిట్ మోతీరామ్ 44వ సంగీతోత్సవాలు
నవంబర్ 30 నుండి డిశంబర్ 2 వరకు హైదరాబాద్, మాదాపూర్లోని సిసిఆర్టి ( సెంటర్ ఫర్ రీసోర్సెస్ అండ్ ట్రైనింగ్ ) లో పండిట్ మోతీరామ్ 44వ సంగీతోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పండిట్ జస్రాజ్, దుర్గా జస్రాజ్లు మాట్లాడుతూ గత 43 సంవత్సరాలుగా తన గురువులకు ఒక ఘనమైన నివాళిని సంగీతం ద్వారా అర్పించడంలో భాగంగా నిర్వహిస్తున్నామన్నారు. ఎటువంటి స్పాన్సర్షిప్ సహకారం లేకుండా, డబ్బులకు టిక్కెట్లను విక్రయించకుండా, కేవలం సంగీత ప్రియుల కోసం పూర్తి ఉచితంగా నిర్వఘ్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం కూడా పండిట్ జసరాజ్ హిందూస్థానీ మరియు కర్ణాటక సంగీతానికి చెందిన పలువురు యువ సంగీత కళాకారులు ప్రతిభను గుర్తించి వారికి ఈ ఉత్సవాల్లో పాల్గొనే గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు.
హైదరాబాద్, మాదాపూర్లోని సిసిఆర్టి ( సెంటర్ ఫర్ రీసోర్సెస్ అండ్ ట్రైనింగ్ ) లో పండిట్ మోతీరామ్ 44వ సంగీతోత్సవాలను ఉచితంగా,నిర్వఘ్నంగా నిర్వహిస్తున్నామని పండిట్ జస్రాజ్, దుర్గా జస్రాజ్లు విలేకర్లతో చెప్పారు . నవంబర్ 30 నుండి డిశంబర్ 2 వరకు ఈ సంవత్సరం జరగనున్నాయి. ప్రతి సంవత్సరం యువ కళాకారులకు ఈ ఉత్సవాల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు.
10,907
https://www.prajasakti.com/WEBSECTION/National/page510/dinakarnn-kalisin-rajyasabh-ampi-shashikal-pushp
అమెరికా ప ర్య ట న
ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో ఫలితాలేమీ సాధించలేకపోయారని కాంగ్రెస్ పార్టీ నేత మనీష్ తివారీ అన్నారు. మోడీ, ట్రంప్ సంయుక్తంగా జారీ చేసిన ప్రకటనలో కొత్తదనమేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ అమెరికా పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో సమావేశం అయిన విషయం విధితమే. ఈ సమావేశంలో ఉగ్రవాదంపై భారత్ - అమెరికా కలిసి పోరాడుతాయని ప్రకటించారు.
ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో ట్రంప్తో సమావేశం అయిన తర్వాత ఉగ్రవాదంపై భారత్ - అమెరికా కలిసి పోరాడుతాయని తెలిపారు. ఇందుల్లో కొత్తదనమేమీ లేదని కాంగ్రెస్ పార్టీ నేత మనీష్ తివారీ అన్నారు.
11,368
https://www.prajasakti.com/WEBSECTION/National/page254/krida-mingestunn-kovid19
వచ్చే నెలలో రష్యాలో పర్యటించనున్న ప్ర ధాన మంత్రి న రేంద్ర మోడీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వచ్చే నెలలో రష్యాలో పర్యటించనున్నారు. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఇవాళ ఈ విషయాన్ని వెల్లడించారు. బలమైన భారతీయ విదేశీ విధానంలో రష్యాతో సంబంధాలు కీలకమైందని ఆమె అన్నారు. సెయింట్ పీటర్స్ బర్గ్ లో జరగనున్న ఇండో-రష్యా సదస్సులో ప్రధాని మోడీ పాల్గొంటారని సుష్మా వెల్లడించారు.
రష్యాలో వచ్చే నెలలో జరగనున్న ఇండో-రష్యా సదస్సులో పాల్గొనటం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రష్యాకు వెళ్లనున్నట్లు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు.
16,222
https://www.prajasakti.com/WEBSECTION/National/page979/essiesty-atyacharapai-kendra-ik-sirius
ప్రధాని గుజరాత్ పర్యటన
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ పర్యటనలో భాగంగా సోమవారం గాంధీనగర్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ కోసం శంకుస్థాపన చేశారు. అనంతరం గాంధీనగర్లోనే ఇంటర్నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నారు. జనవరి 10 నుంచి 14 వరకు గాంధీనగర్తో పాటు అహ్మదాబాద్లో వైబ్రాంట్ సదస్సు జరుగుతుంది. నోబెల్ శాస్త్రవేత్తల సదస్సును కూడా మోడీ అహ్మదాబాద్లో ప్రారంభించనున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటనలో భాగంగా సోమవారం గాంధీనగర్ రైల్వేస్టేషన్ ను, ఇంటర్నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కార్యక్రమాన్ని మరియు నోబెల్ శాస్త్రవేత్తల సదస్సును కూడా ప్రారంభించనున్నారు.
5,510
https://www.prajasakti.com/WEBSECTION/International/page377/ma-bassulne-bhutaddalo-chustunnar-jesy
అక్బరుద్దీన్ ఒవైసీపై నమోదైన ఎఫ్ ఐఆర్
కిషన్గంజ్ జిల్లాలోని కొచ్చడమన్ పోలీసు స్టేషన్లో సోమవారం తెలంగాణా ఎంఎల్ఎ అక్బరుద్దీన్ ఒవైసీపై నమోదైన కేసులో అరెస్టుకు కిషన్గంజ్ ఎస్పి రాజీవ్ రంజన్ ఆదేశాలను జారీ చేశారు. కొచ్చడమన్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని సొంత హాత్ వద్ద ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఎఐఎంఐఎం పార్టీ ఎంఎల్ఎ అక్బరుద్దీన్ ఒవైసీ పాల్గొని ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారంటూ ఎఫ్ఐఆర్ నమోదైంది. అక్బరుద్దీన్ ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ సోదరుడు. దీనిపై అసదుద్దీన్ హైదరాబాద్లో విలేకర్లతో మాట్లాడుతూ ఎఫ్ఐఆర్ సర్టిఫైడ్ కాపీ పొందడానికి మా లీగల్ టీమ్ ప్రయత్నిస్తోంది తెలిపారు.
కొచ్చడమన్ అసెంబ్లీ నియోజకవర్గలో హాత్ దగ్గర జరిగిన బహిరంగ సభలో హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ సోదరుడు ఎఐఎంఐఎం పార్టీ ఎంఎల్ఎ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రజలందరిని రెచ్చగొట్టేలా మాట్లాడారని ఎఫ్ఐఆర్ నమోదవడంతో, ఆ సర్టిఫైడ్ కాపీ పొందడానికి వాళ్ల లీగల్ టీమ్ ప్రయత్నిస్తోందని అసదుద్దీన్ తెలిపారు.
11,005
https://www.prajasakti.com/WEBSECTION/National/page202/mahill-porat-vijaya
సెప్టెంబరు 13లోగా పూర్తి నివేదిక అందించాలి- అంతర్జాతీయ న్యాయస్థానం
గూఢ చర్యం ఆరోపణలతో పాకిస్తాన్ కోర్టు మరణశిక్ష విధించిన మాజీ భారత నావికాధికారి కులభూషణ్ జాదవ్ కేసుపై సెప్టెంబరు 13లోగా పూర్తి నివేదిక అందించా లని భారత్ను అంతర్జాతీయ న్యాయ స్థానం (ఐసిజె) ఆదేశించింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది. ఇదే కేసులో పాకిస్తాన్కు డిసెంబరు 13 వరకూ ఐసిజె గడువు ఇచ్చింది. జాదవ్కు ఉరిశిక్ష అమలుపై స్టే విధిస్తూ అంతర్జాతీయ కోర్టు మే 18న తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే.
అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె) భారత్కు, పాకిస్తాన్కు గూఢ చర్యం ఆరోపణలతో పాకిస్తాన్ కోర్టు మరణశిక్ష విధించిన మాజీ భారత నావికాధికారి కులభూషణ్ జాదవ్ కేసుపై సెప్టెంబరు 13లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేషాలు జారీ చేసింది.
15,012
https://www.prajasakti.com/WEBSECTION/National/page424/jaatiya-nyaya-vishwavidyalayanni-sandarshinchin-jastis-maheshwari
త్రిపుర రాజ్యసభ సీటు సిపిఎం కైవసం
కాంగ్రెస్ను ఓడించి త్రిపుర నుండి ఏకైక రాజ్యసభ సీటను సిపిఎం నిలబెట్టుకుంది. సిపిఎం అభ్యర్ధిగా ఝర్నాదాస్ వైద్యను తిరిగి నామినేట్ చేయగా కాంగ్రెస్ అభ్యర్ధిగా జ్యోతిర్మయి నాథ్ నిలబడ్డారు. 49-10ఓట్ల తేడాతో వైద్య రాజ్యసభ సభ్యురాలిగా గెలుపొందారు. సిపిఎం త్రిపుర రాష్ట్ర కమిటీ సభ్యురాలైన వైద్య ఐద్వా రాష్ట్ర కార్యదర్శిగా కూడా వున్నారు.
కాంగ్రెస్ అభ్యర్ధిగా నిలబడిన జ్యోతిర్మయి నాథ్ ఫై, త్రిపుర నుండి సిపిఎం అభ్యర్ధిగా నిలబడిన ఝర్నాదా 49-10ఓట్ల తేడాతో వైద్య రాజ్యసభ సభ్యురాలిగా గెలుపొందారు.
18,529
https://www.prajasakti.com/WEBSECTION/National/page763/laran-adhigaminchin-kuk
డొనాల్డ్ ట్రంప్ అమలు పెట్టినవిధనాలు వాళ్ళ సమస్యలు
విదేశీ వలసదారుల నియంత్రణ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు అసంతృప్తికరంగా ఉన్నాయని కరీబియన్ నేతలు విమర్శించారు. ట్రంప్ ట్రావెల్స్ బ్యాన్ ( ప్రయాణికుల నిషేధం ) ఉత్తర్వులతో వర్తక రంగంతో పాటు పర్యాటక రంగం దెబ్బతినే ప్రమాదముందని అన్నారు. శనివారం గయానా రాజధాని జార్జిటౌన్లో కారికామ్ ( కరీబియన్ కమ్యూనిటీ) పేరుతో జరిగిన సదస్సుకు తదుపరి చైర్మన్ కీత్ మిచెల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకున్న లక్షలాది మంది కరీబియన్లు ట్రంప్ ఆదేశాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన అభిప్రాయపడ్డారు.
గయానా రాజధాని జార్జిటౌన్లో కారికామ్ ( కరీబియన్ కమ్యూనిటీ) పేరుతో జరిగిన సదస్సుకు తదుపరి చైర్మన్ కీత్ మిచెల్ విదేశీ వలసదారుల నియంత్రణ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు పెట్టినవిధాలు కబిరియన్లకు నచ్చలేదాని , వలరు చాల ఇబ్బందులు ఎదురుకొంటున్నారు అని చెప్పారు .
31,182
https://www.prajasakti.com/WEBSECTION/International/page308/rashtrasthai-swimming-poties-prarambha
అక్రమ బెల్టు షాపుల పై దాడి చేసిన పోలీసులు
యాదగిరిగుట్ట పట్టణంలోని పాతగుట్ట రోడ్డు పరిధిలోని పలు బెల్ట్ షాపులపై పోలీసులు దాడులు చేశారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 18 బీర్లు, 43 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు యాదగిరిగుట్ట ఎస్ఐ లింగయ్య పేర్కొన్నారు.
యాదగిరిగుట్ట పట్టణంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న పలు బెల్టుషాపుల పై పోలీసులు దాడి చేశారు. 18 బీర్లు, 43 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
32,916
https://www.prajasakti.com/WEBSECTION/International/page546/palaniswami-pramansvikaranni-addukondi
పాఠశాలలకు శనివారం నుంచి సంక్రాంతి సెలవులని విద్యాశాఖ ప్రకటించింది. పాఠశాల అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ సెలవులను ఇస్తున్నట్లు విద్యాశాఖ కమిషనర్ కె సంధ్యారాణి ఉత్తర్వులు జారీ చేశారు. తిరిగి ఈ నెల 18 న పాఠశాలలు పున:ప్రారంభమవుతాయని తెలిపారు. గ్రామాల్లో జరిగే జన్మభూమి కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాత్రమే హజరు కావాలని పేర్కొన్నారు.
పాఠశాలలకు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సంక్రాంతి సెలవులను విద్యాశాఖ ప్రకటించింది. పాఠశాలలు 18న పునః ప్రారంభం కావాలని కమిషనర్ కె. సంధ్యారాణి ఉత్తర్వులు జారీ చేసింది.
56,890
https://www.vaartha.com/2018-%e0%b0%a8%e0%b0%be%e0%b0%9f%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b0%be%e0%b0%a3%e0%b0%82/
2018 చివరికి అమరావతి రెడీ
అమరావతి నిర్మాణానికి ఫాస్ట్ ట్రాక్ పద్ధతిని అవలంభించాలని 2018 చివరికి లక్ష్యం పూర్తికావాలని సిఎం చంద్రబాబు ఆదేశించారు. ఇప్పుడున్న వేగం సరిపోదని, పనులు మరింత చురుగ్గా సాగాలన్నారు. నిర్ణీత వ్యవధిలో పక్కా ప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేయగలిగితే అనుకున లక్ష్యాన్ని త్వరగా సాధించగలుగుతామని చెప్పారు. 2018 చివరినాటికి రాజధాని నిర్మాణం పూర్తికావాలన్నారు.
2018 చివరికి రాజధాని తయారవ్వాలని సిఎం చంద్రబాబు ఆదేశించారు. ఫాస్ట్ ట్రాక్ పద్ధతిని అనుసరించి ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయాలని అయన అధికారులకు ఆదేశించారు.
20,202
https://www.prajasakti.com/WEBSECTION/International/page995/jantarmantar-vadd-nirasanalpai-ankshalu
కాలుష్యకారక పరిశ్రమలపై చైనా వేటు
వాతావరణంలో కాలుష్య తీవ్రతను పెంచుతున్న దాదాపు 2,500 పరిశ్రమలను మూసివేయాలని బీజింగ్ నగరపాలక సంస్థ నిర్ణయించింది. చైనాలో నానాటికీ పెరుగుతున్న వాతావరణ కాలుష్యం ముఖ్యంగా ఫ్యాక్టరీల నుండి వెలువడుతున్న కాలుష్యం పట్ల ఇటు సామాన్య ప్రజలతో పాటు పర్యావరణ వేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. రాజధాని చుట్టుపక్కలవున్న నాలుగు జిల్లాల్లోవున్న పరిశ్రమలలో దాదాపు 2,500 కంపెనీలను ఈ ఏడాది చివరి నాటికి మూసివేయాల్సి వుందని, అయితే వీటికి వచ్చే ఏడాది వరకూ గడువిచ్చారని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ సిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. భారీయెత్తున పెరిగిపోతున్న వాయుకాలుష్యంపై బీజింగ్ నగరపాలక సంస్థ గత నెలలో రెడ్ అలెర్ట్ జారీ చేయటంతో పాటు స్కూళ్లను మూసివేసి బహిరంగ నిర్మాణాలపై నిషేధం విధించింది.
చైనాలో పెరుగుతున్న వాతావరణ కాలుష్యం కారణంగాను, ఫ్యాక్టరీల నుండి విడుదలయ్యే కాలుష్యం కారణంగా 2,500 పరిశ్రమలను మూసివేయడానికి వచ్చే సంవత్సరం వరకూ గడువిచ్చారని ప్రభుత్వం సిన్హువా వార్తా సంస్థకు చెప్పింది. దీనికి సంబంధించి గతంలో బీజింగ్ నగరపాలక సంస్థ, రెడ్ అలెర్ట్ జారీ చేసి పాటు స్కూళ్లను మూసివేసి, బహిరంగ నిర్మాణాలను నిషేధించింది.
34,872
https://www.prajasakti.com/WEBSECTION/International/page379/shimla-raj-bhavanlo-chirutpuli-kalakalam
అక్రమంగా లాకౌట్ ప్రకటించిన జిందాల్ కర్మాగారాన్ని వెంటనే తెరవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యాన కాంట్రాక్టు కార్మికులు సోమవారం చెవిలో పువ్వులు పెట్టుకొని ఆ పరిశ్రమ ఎదుట నిరసన తెలిపారు. కార్మికుల పై జిందాల్ యాజమాన్యం తప్పుడు ప్రచారం మానాలని, పరిశ్రమను మూసివేసిన కాలానికి లే ఆఫ్ ఇవ్వాలని నినాదాలు చేశారు. సిఐటియు నాయకులు బొట్టా రాము, బి. ఈశ్వరరావు ఆధ్వర్యాన ఈ కార్యక్రమం జరిగింది. జిందాల్ కార్మికుల రిలే దీక్షలు 8 వ రోజూ కొనసాగాయి.
అవినీతి పరంగా లాకౌట్ అమలు చేసిన జిందాల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆ పరిశ్రమ బయటే చెవిలో పుష్పాలు పెట్టుకొని నిరసన వ్యక్తం చేసారు . ఐటియు నాయకులు బొట్టా రాము, బి. ఈశ్వరరావు సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
4,963
https://www.prajasakti.com/WEBSECTION/National/page312/bagdadlo-atmahuti-daadi-26-mandi-mriti
నేరాలను ఆపే సంస్థ
ఈ నెల 14 నుంచి 17 వరకు ఇజ్రాయిల్లో జరగనున్న అంతర్జాతీయ హోంల్యాండ్ సెక్యూరిటీ అండ్ సైబర్ సదస్సుకు రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారుల బృందం హాజరుకానున్నది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం జీవోఆర్టీ- 2281ను విడుదల చేసింది. సిఐడి అడిషనల్ డిజి ద్వారకాతిరుమలరావు నేతృత్వంలో సైబర్ క్రైమ్స్ ఐజి పివి సునీల్కుమార్, ఇంటిలిజెన్స్ ఐజిలు మహేష్ చంద్రలడ్హా, నవ్సింగ్ గ్రేవాల్ ఈ సదస్సుకు హాజరుకానున్నారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా అధికమవుతున్న వివిధ రకాల నేరాలు, పెరుగుతున్న సైబర్ నేరాలపై చర్చించనున్నారు.
ఈ నెల నాలుగు రోజులు అంతర్జాతీయ హోంల్యాండ్ సెక్యూరిటీ అండ్ సైబర్ సదస్సు జరుగుతుంది. దిని కోసం ప్రభుత్వం శనివారం జీవోఆర్టీ- 2281ను విడుదల చేసింది. ఇంటిలిజెన్స్ దీనికి హాజరు అవుతారు. ఇందులో ప్రపంచలో జరిగే నేరాల గురించి చర్చిస్తారు.
6,311
https://www.prajasakti.com/WEBSECTION/International/page2454/bladuto-kosukunn-vidhi-vyapaari
బ్లేడుతో కోసుకున్న వీధి వ్యాపారి
బీసెంట్ రోడ్డులో వీధి వ్యాపారి హల్చల్ చేశాడు. ట్రాఫిక్ పేరుతో తమను వ్యాపారం చేసుకోనివ్వడంలేదంటూ వీధి వ్యాపారి బ్లేడ్తో ఒంటిపై కోసుకొని ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ సంఘటనతో తోటి వీధి వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారికి తీవ్రగాయాలవడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ట్రాఫిక్ పేరుతో వాళ్ళని వ్యాపారం చేసుకోనియ్యట్లేదని ఒక వీధి వ్యాపారి బ్లేడుతో కోసుకుని ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. తోటి వారంతా ఆందోళనలు చేశారు.
6,317
https://www.prajasakti.com/WEBSECTION/National/page857/trinidad-and-tubago-jattulo-kalis
శీతల గిడ్డంగుల్లో కరువైన అగ్నిమాపక నియంత్రణ సాధనాలు
శీతల గిడ్డంగుల్లో నిబంధనల ప్రకారం ఏర్పాటు చేయాల్సిన అగ్నిమాపక నియంత్రణ సాధనాల పరిశీలనకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరులోని ఆర్అండ్బి అతిథి గృహంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని 118 గిడ్డంగుల్లో మూడింటికి మాత్రమే అగ్నిమాపక శాఖ ఎన్ఒసి ఉందని, ఈ నేపథ్యంలో త్రిసభ్య కమిటీ నవంబర్ మొదటి వారంలో జిల్లాలోని అన్ని గిడ్డంగులు పరిశీలిస్తుందని చెప్పారు. నూతనంగా నిర్మించే గిడ్డంగుల్లో అన్ని నిబంధనలూ పాటించేలా చూస్తుండగా గతంలో నిర్మించిన వాటిల్లోనూ సాధ్యమైనంత మేరకు అగ్నిమాపక నియంత్రణ సాధనాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు.
శీతల గిడ్డంగుల్లో చాల తక్కువ వాటికి మాత్రమే అగ్నిమాపక శాఖ ఎన్ఒసి ఉంది. ఈ విషయమై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడారు. అన్ని గిడ్డంగుల్ని త్వరలోనే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కొత్తగా నిర్మించే వాటిల్లోనూ అన్ని నిబంధనలు సరిగ్గా పాటించేలా చూస్తామన్నారు.
14,099
https://www.prajasakti.com/WEBSECTION/International/page98/377-sekshan-samikshake-kattubadandi-suprinkortulo-kendra-afidvit
గోరక్షక సమితులను నిషేధించాలని డిమాండ్
దేశంలో గోరక్ష సమితులపై సంపూర్ణ నిషేధం విధించాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన గోరక్షకులు దేశంలో దళితులు, ముస్లింలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శిచారు. వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీతారం ఏచూరి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే సర్కార్ గోరక్ష సమితులను ప్రజలలో మతపరమైన చీలికలు తీసుకురావడానికి ఉపయోగించుకుంటున్నదని విమర్శించారు.
గోరక్షక సమితులను అరికట్టాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. ఈ సమితులవల్ల దళితులు , ముస్లింలు భయపడుతున్నారని అన్నారు. ఎన్డీయే సర్కార్ దీనిని మతపరమైన కల్లోలాలు సృష్టించడానికి వాడుకుంటుందని విమర్శించారు.
20,533
https://www.prajasakti.com/WEBSECTION/International/page794/semislo-bharat-haki-jattu
ముస్లీంలపై పెరుగుతున్న విద్వేషం
మయన్మార్లో ముస్లింలపై పెరుగుతున్న విద్వేషం ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పెరుగుతున్న విద్వేష వాతావరణంపై అప్రమత్తంగా వ్యవహరించాలని ఐరాసకు చెందిన ఇద్దరు ప్రత్యేక సలహాదారులు హెచ్చరించారు. మత నేతలు, మత గ్రూపులు, రాజకీయ పార్టీలు చేస్తున్న ఈ విద్వేష ప్రచారం హింసకు దారి తీసే అవకాశముందని వారు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. మారణకాండ నిరోధం, పౌరుల భద్రతకు సంబంధించి సలహాలిచ్చేందుకు నియమితులైన అడామా డీంగ్, జెన్నిఫర్ వెల్ష్ ఆదివారం ప్రారంభం కానున్న ఎన్నికల ప్రక్రియ మతపరమైన మైనార్టీలను ముఖ్యంగా రోహింగ్యా ముస్లింలను ఓటింగ్కు దూరం చేసే ప్రమాదం వుందని వారు తెలిపారు. మతం, జాతి ఆధారంగా విద్వేషాన్ని, వివక్షను రెచ్చగొట్టే ప్రసంగాలను బహిరంగంగా ఖండించాలని వారు మయన్మార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
మారణకాండ నిరోధం, పౌరుల భద్రతకు సంబంధించి సలహాలిచ్చేందుకు నియమితులైన అడామా డీంగ్, జెన్నిఫర్ వెల్ష్ మయన్మార్లో ముస్లింలపై పెరుగుతున్న విద్వేషం గురించి మాట్లాడారు. ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి కాబట్టి మతాలకి సంబంధించి చేసే ప్రచారం వల్ల హింస రగిలే ప్రమాదం ఉందన్నారు. బహిరంగంగా ఎవరైనా ఇలాంటి ప్రసంగాలు,వివాదాలు చేస్తే తీవ్రంగా ఖండించాలని ప్రభుత్వాన్ని కోరారు.
40,504
https://www.prajasakti.com/WEBSECTION/International/page715/ulli-ku-linlo-vyakti-mriti
ఆమ్లా వెనుదిరగడంతో 13 ప రుగులకే ౩ వికెట్లు చేజారి క ష్టాల్లో పడిన సౌతాఫ్రికా జట్టు.
కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో సౌతాఫ్రికా కష్టాల్లో పడింది. మ్యాచ్ ప్రారంభమైన 5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయింది. భువనేశ్వర్ వేసిన 5 ఓవర్ లో ఆమ్లా (3) కీపర్ సాహుకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 13 పరుగులు చేసింది.
కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు ఆరంభంలోనే తడబడిన సౌతాఫ్రికా 5 ఓవర్లలో 13 పరుగులు మాత్రమే చేసి ఆమ్లాతో పాటు మరో ఇద్దరి వికెట్లు నష్టపోయింది.
6,325
https://www.prajasakti.com/WEBSECTION/International/page466/digochchin-haryana-prabhutvan
కళాసుబ్బారావు 22వ వర్థంతి
శ్రీత్యాగరాయ గానసభలోని వ్యవస్థాపకులలో ఒకరైన కళాసుబ్బారావు 22వ వర్థంతి త్యాగరాయ గానసభలోని కళాసుబ్బారావు కళావేదికఫై శనివారం జరిగింది. జంట నగరాలకు చెందిన పలు సాంస్కృతిక సంస్థలవారు పుష్పాలను సమర్పించి నివాళులు అర్పించారు. అభినందన సంస్థ భవాని, రాగరాగిణి సంస్థ కార్యదర్శి సుబ్బలక్ష్మి, వంశీ సంస్థ స్థాపకుడు వంశీ రామారాజు, గోల్డెన్ స్టార్ బింగి నరేందర్ తదితర సంస్థలకు చెందినవారు మాట్లాడుతూ సాంస్కృతిక సేవలకు కళాసుబ్బారావు చిరునామాగా నిలిచారని ఆయన కుమారుడు తండ్రి వారసాత్వాన్ని ముదావహం అన్నారు. కళాదీక్షితులు మాట్లాడుతూ తండ్రి అడుగుజాడల్లో గానసభను నిర్వహిస్తానని తెలిపారు.
శ్రీత్యాగరాయ గానసభలోని వ్యవస్థాపకులలో ఒకరైన కళాసుబ్బారావు 22వ వర్థంతి కళాసుబ్బారావు కళావేదికఫై శనివారం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్నవారు మాట్లాడుతూ సాంస్కృతిక సేవలకు కళాసుబ్బారావు చిరునామాగా నిలిచారు అన్నారు . కళాదీక్షితులు మాట్లాడుతూ తండ్రి అడుగుజాడల్లో గానసభను నిర్వహిస్తానని తెలిపారు.
7,918
https://www.prajasakti.com/WEBSECTION/National/page748/rashya-hospatrilo-agni-pramada-37-mandi-mriti
తమిళ ఎంపీలు రాజీనామా చేయాలి
కావేరి జల నిర్వహణ బోర్డు పై అఖిల పక్ష బృందాన్ని ప్రధాని మోడీ కలుసుకోకపోతే తమిళనాడు ఎంపిలు రాజీనామా చేయాలని డిఎంకె సూచించింది. కావేరి అంశంపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కె పళనిస్వామితో జరిగిన సమావేశంలో డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఎంకె స్టాలిన్ ఈ ప్రతిపాదన చేశారు. అఖిల పక్ష బృందంతో సమావేశం కావడానికి మోడీ నిరాకరించారని ముఖ్యమంత్రి తెలిపినట్లు స్టాలిన్ పేర్కొన్నారు. అయితే తమిళ బృందంతో సమావేశానికి మోడీ నిరాకరించలేదని రాష్ట్ర మత్య్సశాఖ మంత్రి డి జయకుమార్ తెలిపారు.
కావేరి జల నిర్వహణ బోర్డు అంశంపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కె పళనిస్వామితో జరిగిన సమావేశంలో ప్రతిపక్ష నాయకుడు ఎంకె స్టాలిన్ "అఖిల పక్ష బృందాన్ని ప్రధాని మోడీ కలుసుకోకపోతే తమిళనాడు ఎంపిలు రాజీనామా చేయాలని" అన్నారు.
15,008
https://www.prajasakti.com/WEBSECTION/International/page395/nijam-uriki-nirsanga-nedu-banglaband
ఘనంగా జరుపుకున్న గుడ్ ఫ్రైడే వేడుకలు.
జీసస్ క్రీస్తుకు శిలువ వేసిన రోజైన గుడ్ ఫ్రైడే (శుభ శుక్రవారం) ని దేశమంతటా క్రైస్తవ సోదరులు ఘనంగా జరుపుకున్నారు. పలు చోట్ల చర్చిల్లో ప్రత్యేక ప్రార్ధనలు, సేవలు నిర్వహించారు. చర్చి సభ్యులు శిలువ బొమ్మను పట్టుకుని వీధుల్లో ప్రదర్శనలు నిర్వహించారు. గత రాత్రంతా కూడా పలు చర్చిల్లో ప్రార్ధనలు చేశారు.
జీసస్ క్రీస్తుకు శిలువ వేసిన రోజైన గుడ్ ఫ్రైడేని దేశమంతటా క్రైస్తవ సోదరులు శిలువ బొమ్మను పట్టుకుని ప్రార్ధనలు, సేవలు చేస్తూ ఘనంగా జరుపుకున్నారు.
19,215
https://www.prajasakti.com/WEBSECTION/International/page986/gujarato-vishavayuvulu-lik
ఉగ్రవాద సంస్థలపై వ్యతిరేకంగా పోరాడాలంటూ అమెరికా అధ్యక్షుడు ఒబామా.
అమాయకుల ప్రాణాలు తీస్తున్న ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడాలని అమెరికా అధ్యక్షుడు ఒబామా పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఐఎస్ను లక్ష్యంగా దాడులు జరపాలని పేర్కొన్నారు. మారణహోమాన్ని సృష్టిస్తున్న సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి. సిరియాలో అల్ఖైదా, ఐఎస్కు వ్యతిరేకంగా పోరాడేందుకు రష్యాతో కలిసి పనిచేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని చెప్పారు.
సిరియాలో అమాయకుల ప్రాణాలు తీస్తున్న అల్ఖైదా, ఐఎస్ ఉగ్రవాద సంస్థలపై వ్యతిరేకంగా పోరాడేందుకు రష్యాతో కలిసి పనిచేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఒబామా చెప్పారు.
19,899
https://www.prajasakti.com/WEBSECTION/International/page662/sanketik-parigyanation-mundukellalijitli
సర్వసైన్యాధిపతిగా సీ జిన్ పింగ్
చైనా సర్వసైన్యాధిపతిగా అధ్యక్షుడు సీ జిన్పింగ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. చైనాలో ప్రస్తుతం జరుగుతున్న సైనిక పునర్వ్యవస్థీకరణలో భాగంగా అధ్యక్షుడు సీ జిన్పింగ్ ప్రజావిముక్తి సైన్యం (పిఎల్ఎ) బాధ్యతలను స్వీకరించినట్లు తెలుస్తోంది. గతంలో సర్వసైన్యాధిపతులుగా మావో జెడాంగ్, డెంగ్జియావో పింగ్ వ్యవహరించారు. అదే తరహాలోనే తాజా నిర్ణయం జరిగింది.
చైనాలో సైనిక పునర్వ్యవస్థీకరణలో భాగంగా పిఎల్ఎ బాధ్యతలను అధ్యక్షుడు సీ జిన్పింగ్ స్వీకరించారు. ఇంతకుముందు మావో జెడాంగ్, డెంగ్జియావో పింగ్ సర్వసైన్యాధిపతులుగా ఉన్నారు.
19,907
https://www.prajasakti.com/WEBSECTION/National/page315/talli-talkorivi-pettin-kuturu
బొలివేరియన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సదస్సు
బొలీవియాలో 2006 నుండి తన ప్రభుత్వం అనేకమార్పులు తీసుకొచ్చిందని, వీటిని పరిరక్షించుకునేందుకు సామాజిక ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని అధ్యక్షుడు ఎవో మొరేల్స్ పిలుపునిచ్చారు. బొలివేరియన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడ జరిగిన ఒక సదస్సులో నేషనల్ కోఆర్డినేషన్ ఫర్ ఛేంజ్ (కోనాల్కమ్)కు చెందిన దాదాపు 30 శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రాధాన్యతలను సవరించుకుని ముందుకు సాగాలని మూవ్మెంట్ టు సోషలిజం (మాస్), సామాజిక ఉద్యమ సంస్థలను ఆయన కోరారు. గత ఫిబ్రవరి 21న జరిగిన రాజ్యాంగ రిఫరెండం అనంతరం తొలిసారిగా జరిగిన ఈ విస్తృత సమావేశంలో ఆయా సంస్థలనిర్మాణాన్ని మరింత బలోపేతం చేయటంతో పాటు జాతీయ స్థాయిలో కొత్త కార్యకర్తలను చేర్చుకోవాలని సూచించారు.
బొలివేరియన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఒక సదస్సులో కోనాల్కమ్కు చెందిన30 శాఖల ప్రతినిధులు పాల్గొనగా, సామాజిక ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని అధ్యక్షుడు ఎవో మొరేల్స్ పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 21న జరిగిన రాజ్యాంగ రిఫరెండం తరువాత తొలిసారిగా జరిగిన ఈ సమావేశంలో జాతీయ స్థాయిలో కొత్త కార్యకర్తలను చేర్చుకోవాలని సూచించారు.
20,429
https://www.prajasakti.com/WEBSECTION/National/page401/sarihaddupai-bharat-bangla-charchl
టర్కీ సరిహద్దులో రష్యా వైమానిక దాడులు
టర్కీ సరిహద్దులకు దగ్గరలోని సిరియా వాయవ్య ప్రావిన్స్ ఇడ్లిబ్పై రష్యా వైమానిక దాడులను ముమ్మరం చేసింది. టర్కీకి దగ్గర్లో సిరియాలోని హర్మేన్, అలెపో పట్టణాల్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై ఈ దాడులు సాగాయి. ఇడ్లిబ్లోని హర్మేన్ పట్టణంలోని మార్కెట్పై జరిగిన బాంబు దాడిలో 40 మంది మరణించారని, డజన్లకొద్దీ గాయ పడ్డారని టర్కీ ప్రతిపక్ష ఎస్ఎన్ తెలిపింది. తమ యుద్ధ విమానాన్ని టర్కీ కూల్చేయడంతో సిరియా- టర్కీ సరిహద్దుల్లోని తీవ్రవాద స్థావరాలపై రష్యా తన వైమానిక దాడులను ఉద్ధృతం చేసింది.
తమ యుద్ధ విమానాన్ని టర్కీ కూల్చేయడంతో సిరియా- టర్కీ సరిహద్దుల్లోని తీవ్రవాద స్థావరాలపై రష్యా తన వైమానిక దాడులను జరపగా ఆ దాడుల్లో 40 మంది మరణించారని, డజన్లకొద్దీ గాయ పడ్డారని టర్కీ ప్రతిపక్ష ఎస్ఎన్ తెలిపింది.
21,166
https://www.prajasakti.com/WEBSECTION/International/page272/paklo-longipoin-500-mandi-militonts
పోలీసులకు, పాలస్తీనీయులు మధ్య చెలరేగిన ఘర్షణ
అత్యంత సున్నితమైన జెరూసలెం ఆదివారం తెల్లవారుజామున ఇజ్రాయిల్ పోలీసులకు, పాలస్తీనా ఆందోళనకారులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసు ప్రతినిధి మికీ రోజెన్ఫీల్డ్ చెప్పిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం 7గంటలకు పోలీసులు అల్ అక్సా మసీదు కాంపౌండ్లోకి ప్రవేశించారు. యూదులు మసీదుకు రాకుండా పాలస్తీనీయులు అడ్డుకోవడంతో ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. యూదు కొత్త సంవత్సరం ప్రారంభానికి కొద్దిగంటలు ముందుగా ఈ ఘర్షణలు జరిగాయి.
ఆదివారం ఉదయం 7గంటలకు పోలీసులు అల్ అక్సా మసీదు కాంపౌండ్లోకి ప్రవేశించకుండా పాలస్తీనీయులు అడ్డుకోవడంతో ఇజ్రాయిల్ పోలీసులకు, పాలస్తీనా ఆందోళనకారులకు మధ్య ఘర్షణ జరిగింది.
33,573
https://www.prajasakti.com/WEBSECTION/National/page283/vijethalu-ratchanok-mameto
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన సయ్యద్ అమీన్ ఉల్ జాఫ్రీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి అద్వైత కుమార్ సింగ్ ప్రకటించారు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి అధికార టీఆర్ఎస్ మద్దతుతో ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా జాఫ్రీ నామినేషన్ దాఖలు చేశారు. ఇతర పార్టీల నుండి ఎవరూ పోటీ లేకపోవడంతో జాఫ్రీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించి శుక్రవారం సర్టిఫికేట్ను అందజేశారు. ఎన్నికల పరిశీలకులు వి. ఎన్. విష్ణు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మోజం ఖాన్ హాజరయ్యారు.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ మద్దతుతో ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సయ్యద్ అమీన్ ఉల్ జాఫ్రీకి పోటీగా ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి అద్వైత కుమార్ సింగ్ ప్రకటించారు.
1,739
https://www.prajasakti.com/WEBSECTION/National/page2874/americalo-annarailaku-rakshan-kalpinchalani-modiki-lekh
అమెరికాలో ఎన్నారైల కు ర క్ష ణ క ల్పించాల ని మోడీకి లేఖ
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సుబ్బరామిరెడ్డి ఇవాళ లేఖరాశారు. ఆ లేఖలో అమెరికా అధ్యక్షుడైన ట్రంప్తో నరేంద్ర మోడీ మాట్లాడాలని విజ్ఞప్తిచేశారు. అమెరికాలో ఎన్నారైలకు రక్షణ కల్పించాలని సుబ్బరామిరెడ్డి లేఖలో కోరారు. జాతివివక్ష హత్యలపై లేఖలో తన ఆవేదనను వ్యక్తం చేశారు.
అమెరికాలో ఎన్నారైలకు రక్షణ కల్పించాలని, జాతివివక్ష హత్యలపై తన ఆవేదనను వ్యక్తం చేస్తూ నరేంద్ర మోడీకి సుబ్బరామిరెడ్డి లేఖరాశారు.
3,281
https://www.prajasakti.com/WEBSECTION/International/page618/2100-sara-packett-swadhina
లలిత కళావేదికపై స్వరార్చన కార్యక్రమం
జీపీ ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లక్ష్మీనరసింహ చారిటీస్ సౌజన్యంతో శ్రీ హరి భజన మండలి(టిటిడి) వారిచే స్వరార్చన కార్యక్రమం త్యాగరాయ గానసభలోని లలిత కళావేదికపై సోమవారం జరిగింది. ఉషారాణి, శ్రీదేవి, పద్మావతి, విజయలక్ష్మి, అనురాధ, గీత, నిర్మల, వనిత తదితర మహిళలందరూ కలిసి సాంప్రదాయ భజన గీతాలను రాగయుక్తంగా పాడగా శ్రోతలు వారితో గళం కలిపారు. వంశీ రామరాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గ్రామాలలో ఉన్నటువంటి భజన సాంప్రదాయం మరుగున పడకుండా ప్రచారంలో ఉంచాలని కోరారు. గానసభ అధ్యక్షులు కళాదీక్షితులు కవయిత్రి తెన్నేటి సుధ సభలో పాల్గొన్నారు.
సోమవారం త్యాగరాయ గానసభలోని లలిత కళావేదికపై స్వరార్చన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మహిళలు సాంప్రదాయ భజన గీతాలను రాగయుక్తంగా పాడగా శ్రోతలు వారితో గళం కలిపారు. వంశీ రామరాజు మాట్లాడుతూ గ్రామాలలో భజన సాంప్రదాయం మరుగున పడకుండా ప్రచారంలో ఉంచాలని కోరారు.
3,519
https://www.prajasakti.com/WEBSECTION/National/page627/aenyulo-yuvajnotsavalu-prarambha
గేట్ మొదటి స్థానంలో తెలంగాణ విద్యార్థి
గేట్ 2017 పరీక్షల్లో తెలంగాణ విద్యార్ధి మారేపల్లి కౌశిక్ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రానికి చెందిన కౌశిక్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మొదటి ర్యాంక్ సాధించాడు. కౌశిక్ తల్లిదండ్రులు విజరుకుమార్, జయశ్రీలు ప్రస్తుతం హైదరాబాదులోని బి. ఎన్. రెడ్డి నగర్లో నివసిస్తున్నారు. జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన కౌశిక్ను పలువురు అభినంధించారు.
గేట్ 2017 పరీక్షల్లో తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాకి చెందిన కౌశిక్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించాడు. అందుకు తనని పలువురు అభినంధించారు.
3,854
https://www.prajasakti.com/WEBSECTION/International/page583/rashtralo-kshininchin-shanti-bhadrats
రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్ లో విలీనం?
రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో విలీనం చేయాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై సిపిఐ శనివారం ఆందోళన వ్యక్తం చేసింది. రైల్వేలను ప్రైవేటీకరణ చేసి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డిఐ) ఆహ్వానించడానికి మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్య అని ఆరోపించింది. రైల్వేలో ఎఫ్డిఐలను తీసుకు రావడమే కాకుండా వ్యాపారీ కరణ, ప్రైవేటీకరణ చేసే దిశగా నీతి అయోగ్ ఏర్పాటు చేసిన కమిటీ సిపార్సు చేసిందని సిపిఐ పేర్కొం ది. ప్రభు త్వం తీసుకున్న తాజా నిర్ణయం పలు సందేహా లకు తావి వ్వడమే కాకుండా రైల్వేలలో ప్రభుత్వ రంగ పాత్రపై భ యాన్ని కలిగిస్తున్నదని సిపిఐ ఒక ప్రకటనలో పేర్కొంది.
రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో విలీనం చేయాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై సిపిఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను రప్పించడానికి మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్య అని కుండబద్ధలు కొట్టింది. రైల్వేలలో ప్రభుత్వ రంగ పాత్రపై భ యాన్ని కలిగిస్తున్నదని సిపిఐ ఆరోపించింది.
4,420
https://www.prajasakti.com/WEBSECTION/International/page900/chandragiri-akramalapai-isi-korada
పెరిగిన ఫించనుదారులు
ఆసరా పథకం కింద ప్రస్తుతం అందజేస్తున్న 35.73 లక్షల పింఛన్లకు అదనంగా మరో 22వేల మందికి మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి 6204 వద్ధాప్య, 10 వేల మంది వితంతు, 2998 వికలాంగ, 335 గీత కార్మీక, 156 చేనేత, 2308 హెచ్ఐవీ భాదితులకు అదనంగా పింఛన్లు ఇవ్వనున్నట్టు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గత ఏడాది నవంబరు, డిసెంబర్లో వచ్చిన దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన వారందరిని గుర్తించి, వారికి పింఛను మంజూరు చేసినట్టు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆసరా పథకం కింద ప్రస్తుతం అందజేస్తున్న 35.73 లక్షల పింఛన్లకు వచ్చే నెల నుంచి అదనంగా మరో 22000ల మందికి మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ లో వచ్చిన దరఖాస్తుల మేరకు నిర్ణయం తీసుకున్నారని గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ప్రకటన విడుదల చేశారు.
4,948
https://www.prajasakti.com/WEBSECTION/International/page3317/epi-pratyek-hoda-bharosa-sabhlo-rahul-gandhi.
ఏపీ ప్రత్యేక హోదా భరోసా సభలో రాహుల్ గాంధీ.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు. ఇవాళ గుంటూరు వేదికగా జరగనున్న ఏపీ ప్రత్యేక హోదా భరోసా సభలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించనున్నారు. ఇందుకు కావలసిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. రాహుల్ గాంధీ రాక నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
భారీ బందోబస్తు మధ్యలో ఏపీ ప్రత్యేక హోదా భరోసా సభలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించడానికి కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు.
5,172
https://www.prajasakti.com/WEBSECTION/National/page994/yurisectare-kalpuluiddru-palk-dalalu-mriti
వివాదాస్పద వ్యాఖ్యలూ కారణమే : జైట్లీ
అభివృద్ధి అంశం నుండి పక్కకు మళ్ళతూ బిజెపి నేతలు చేసిన కొన్ని వివాదాస్పదమైన, బాధ్యతారాహితమైన వ్యాఖ్యలు కూడా బీహార్లో పార్టీ అత్యంత ఘోరంగా ఓడిపోవడానికి కారణమయ్యాయని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ అంగీకరించారు. ''అభివృద్ధి క్రమం నుండి పక్కకు మళ్ళేలా వివాదాస్పద వ్యాఖ్యలు వచ్చినప్పుడల్లా అనేకసార్లు నేను జోక్యం చేసుకుంటూనే వచ్చాను. కానీ ఎవరైతే ఈ వాతావరణాన్ని విచ్ఛిన్నం చేస్తారో వారి పట్లనే కెమెరాకు మక్కువ ఎక్కువ'' అని జైట్లీ పేర్కొన్నారు. గత 30ఏళ్ళలో ఎన్నడూ లేని విధంగా అతిపెద్ద మెజారిటీతో గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన మోడీ ఈ బీహార్ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసినా కూడా ఓట్లు రాబట్టలేకపోయారంటే ఆయన ప్రతిష్టకు ఇది పెద్ద ఎదురు దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు, విమర్శకులు పేర్కొంటున్నారు.
అభివృద్ధి అంశం నుంచి పక్కకు వెళుతూ, బిజెపి నేతలు చేసిన వివాదాస్పద మాటల వలన బీహార్లో పార్టీ ఓడిపోవడానికి కారణమయ్యాయని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. గత 30ఏళ్ళలో ఎన్నికల్లో ఎక్కువ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన మోడీ, ఈ బీహార్ ఎన్నికల్లో ఎక్కువగా ప్రచారం చేసినా కూడా ఓట్లు రాలేదని రాజకీయ విశ్లేషకులు, విమర్శకులు అంటున్నారు.
5,188
https://www.prajasakti.com/WEBSECTION/International/page968/boggu-kumbhakonamlomugguriki-randell-jaile-shiksh
35కు చేరిన మక్కా మృతుల సంఖ్య
హజ్ యాత్ర సందర్భంగా మక్కాలోని మినా వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన భారతీయుల సంఖ్య 35కు చేరింది. ఆదివారం మరో 13 మందిని సౌదీ అధికారులు గుర్తించారని విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు. మృతులు కేరళ(ఐదుగురు), గుజరాత్(నలుగురు) , జార్ఖండ్(ఇద్దరు), ఉత్తరప్రదేశ్ (ఒకరు), బీహార్(ఒకరు)కు చెందినవారు. తొక్కిసలాటలో మృతుల మొత్తం సంఖ్య 769 కాగా, గాయపడ్డవారి సంఖ్య 934. గాయపడినవారిలో 13 మంది భారతీయులు.
మక్కాలోని మినా వద్ద జరిగిన తొక్కిసలాటలో 35 భారతీయులు మరణించారు. మరో 13 మందిని సౌదీ అధికారులు గుర్తించారని విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. తొక్కిసలాటలో 769 మరణించగా, 934 గాయపడినవారిలో 13 మంది భారతీయులు మరణించారు
5,506
https://www.prajasakti.com/WEBSECTION/National/page390/kurdul-party-prakatanpai-welluvettin-khandnalu
ప్రభుత్వానికి వ్యతిరేకంగా సెక్రటేరియట్ ప్రధాన ద్వారం ముందు నిరసన
జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో బిజెపి ఎమ్మెల్యేల చేతిలో దాడికి గురైన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే షేక్ అబ్దుల్ రషీద్ అనుచరులను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రషీద్పై దాడిని వ్యతిరేకిస్తూ కాశ్మీర్ అసెంబ్లీ ముందు ఆయన మద్దతుదారులు నిరసన ప్రదర్శనలు చేసేందుకు సిద్ధమవ్వగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. రషీద్, ఆయన అనుచరులు సెక్రటేరియట్ ప్రధాన ద్వారం ముందు నిరసన నిర్వహిస్తూ పిడిపి, బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. సెక్రటేరియట్ నుంచి లెజిస్లేటివ్ కాంప్లెక్స్ వద్దకు ప్రదర్శన నిర్వహించారు.
ఇండిపెండెంట్ ఎమ్మెల్యే షేక్ అబ్దుల్ రషీద్పై బిజెపి ఎమ్మెల్యేలు చేసిన దాడిని వ్యతిరేకిస్తూ ఆయన అనుచరులు సెక్రటేరియట్ ప్రధాన ద్వారం ముందు నిరసన నిర్వహిస్తూ పిడిపి, బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేయడంతో పొలీసులు అదుపులోకి తీసుకున్నారు.
5,719
https://www.prajasakti.com/WEBSECTION/International/page419/nepal-toli-mahila-chif-jastis
గ్రీన్ కార్డు జారి కోట చట్టం విఫలం
మెరిట్ ఆధారిత ఇమ్మిగ్రేషన్ విధానం సహా తమ దేశంలో శాశ్వత సభ్యత్వానికి అవకాశం కల్పించే గ్రీన్ కార్డుల జారీలో దేశాలకు కోటా విధించాలని పట్టుదలగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీనికోసం ఉద్దేశించిన సరిహద్దు భద్రతా ఇమ్మిగ్రేషన్ సంస్కరణల చట్టం అమెరికా ప్రతినిధుల సభలో వీగిపోయింది. ఈ చట్టం ఆమోదం కోసం ట్రంప్ చివరివరకు యత్నించినా రిపబ్లికన్ ఆధిపత్యం గల ప్రతినిధుల సభలో 121-300 ఓట్ల తేడాతో ఓడిపోయింది. వలసదారుల హక్కుల పరిరక్షిం చడానికి ఓటింగ్ ఫలితం కొత్తదారిని ఇస్తుందని రిపబ్లికన్ ప్రతినిధులు వ్యాఖ్యానించారు.
మెరిట్ ఆదారిత ఇమ్మిగ్రేషన్ విధానం సహా తమ దేశంలో శాశ్వత సభ్యత్వానికి అవకాశం కల్పించే గ్రీన్ కార్డుల జారీలో దేశాలకు కోటా విధించాలన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చట్టం రిపబ్లిక్ ఆధిపత్యం గల ప్రతినిధులు సభలో 121-300 ఓట్ల తేడాతో ఓడిపోయింది.
5,759
https://www.prajasakti.com/WEBSECTION/National/page206/sikkol-pedalku-hero-vijay-devarakond-sayam
ప్రమాదరహిత రహదారులే లక్ష్యం
ప్రభుత్వ విజన్ మేరకు రహదారులను ఆధునిక పద్ధతిలో ప్రమాద రహితంగా నిర్మించడమే తమ లక్ష్యమని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సుమితా దావ్రా తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల ఇంజినీర్లకు మంగళవారం నగరంలో తలపెట్టిన శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతంలో సోలార్ బ్లింకర్లు, హాజార్డ్ మార్కర్లు, జీబ్రా క్రాసింగ్లు మొదలైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు రహదారుల అనుసంధానం వల్ల వ్యవసాయ ఉత్పత్తిదారులు మార్కెట్లకు చేరువవుతారని తెలిపారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల ఇంజినీర్లకు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సుమితా దావ్రా శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రహదారుల అనుసంధానం వల్ల రైతులకు మార్కెట్లు చేరువవుతాయి మరియు రహదారులను ప్రమాద రహితంగా నిర్మించడమే లక్ష్యమని అన్నారు.
5,817
https://www.prajasakti.com/WEBSECTION/National/page39/army-vahanmpai-daadi-mugguru-jawang-mriti
జనసేన ధళం సిద్ధం
జిల్లాలో జనసేన పార్టీకి సేవాదళ్ సిద్ధమైంది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలుపు మేరకు పార్టీకి అంకితభావంతో పనిచేసే కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఈ మేరకు జిల్లా సేవాదళ్ కో-ఆర్డినేటర్లు కిరణ్రాయల్, హరిష్ శంకర్ శుక్రవారం తిరుపతిలోని బోత్ ఆస్పత్రిలో సేవాదళ్తో సమావేశం ఏర్పాటుచేశారు. వందమందికి పైగా కార్యకర్తలను ఎంపికచేసి, వారి జాబితాను జనసేన కేంద్ర కార్యాలయానికి పంపుతున్నట్టు చెప్పారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపు మేరకు పలు కార్యకర్తలు ముందుకొచ్చారు. జిల్లా సేవాదళ్ కో-ఆర్డినేటర్లు, వందకి పైగా కార్యకర్తల జాబితాను జనసేన కేంద్ర కార్యాలయానికి పంపారు.
6,549
https://www.prajasakti.com/WEBSECTION/International/page502/iyupai-daava-vayyamann-trump
కులవివక్ష అంటరానితనంపై యువత ఉద్యమం: మల్లు స్వరాజ్యం
కులవివక్ష అంటరానితనంపై యువత ఉద్యమించాలని, నిజాంలను, పెత్తందార్లను వణికించిన గడ్డ ఇదని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం అన్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డి పాత బస్టాండ్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కేవీపీఎస్ 'ఆత్మగౌరవ బస్సుయాత్ర'ను మంగళవారం ఆమె జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మగౌరవ యాత్ర చేపట్టినట్టు తెలిపారు. 70ఏండ్ల స్వతంత్ర భారతంలో దళితుల్ని కుక్కలకంటే హీనంగా చూస్తున్నారని, దీనిని దళిత యువత ప్రతిఘటించాలని కోరారు.
కులవివక్ష అంటరానితనంపై యువత ఉద్యమించాలని యోధురాలు మల్లు స్వరాజ్యం కోరారు. ఆమె సంగారెడ్డిలో 'ఆత్మగౌరవ బస్సుయాత్ర'ను ప్రారంభించి ఆత్మగౌరవ యాత్రను చేపట్టినట్టు తెలిపి దళిత యువత ప్రతిఘటించాలని కోరారు.
6,553
https://www.prajasakti.com/WEBSECTION/International/page347/mudupul-kumbhakonamlo-greek-maji-pradhanulu-mantrulaku-prameyam
ఎన్ కౌంటర్ అయిన గ్యాంగ్ స్టర్ నయీం
ఎన్కౌంటర్ అయిన గ్యాంగ్స్టర్ నయీం, అతని అనుచరులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 38 కేసులను నమోదు చేశామని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఐజీ నాగిరెడ్డి సోమవారం తెలిపారు. వీటన్నింటిలోను ఏ1గా నయీముద్దిన్ ఎలియాస్ నయీం ఉన్నాడని తెలిపారు. అతని దగ్గిర బంధువులు ఫయీమ్, సలీమా, ఫర్హానా, అఫ్స, తాజుద్దిన్, ఫయ్యాజ్లతో సహా మొత్తం 34 మంది అనుచరులను అరెస్టు చేశామని తెలిపారు. తాజాగా నయీం తనింట్లో పనిమనిషి నస్రీన్ను హత్య చేసి ఉదంతం కూడా వెలుగు చూసిందని, అలాగే ఇదివరకే హత్య చేసిన తన బావ మరిది నదీమ్ ఎలియాస్ విజరుతో పాటు అతని సోదరుడి భార్య కూతురిని హత్య చేసి శవాలను ఎక్కడ వేశాడనే విషయమై దర్యాప్తు సాగుతున్నదన్నారు.
ఐజీ నాగిరెడ్డి గారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్లో 38 కేసుల నమోదులో ఏ1గా నయీముద్దిన్ ఎలియాస్ నయీం ఉన్నాడని తనతో పాటు ఫయీమ్, సలీమా, ఫర్హానా, అఫ్స, తాజుద్దిన్, ఫయ్యాజ్లతో సహా మొత్తం 34 మంది అనుచరులను అరెస్టు చేశామని తెలిపారు. తాను చేసిన హత్యల విషయమై దర్యాప్తు సాగుతున్నదన్నారు.
6,725
https://www.prajasakti.com/WEBSECTION/National/page795/athletku-pradhani-shubhakshankshalu
ఆల్ ఈస్ వెల్! : ప్రధాని మోడీ.
ప్రధాని మోడీ, ఇవాంక టూర్, గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న ఏరియాల్లో 31 ఫైరింజన్లు అందుబాటులో ఉంచమని ఫైర్ సర్వీస్ అడిషనల్ డైరెక్టర్ లక్ష్మీ ప్రసాద్ కి తెలిపారు. కాగా, నేడిక్కడ జరిగిన మిడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మియాపూర్, కూకట్పల్లి రైల్వే స్టేషన్లలో మాక్ డ్రిల్ నిర్వహించామన్నారు. ప్రధాని మోడీ, ఇవాంక టూర్, గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న ఏరియాల్లో 31 ఫైరింజన్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. అలాగే, నిరంతరం 261 మంది ఫైర్ సిబ్బంది ఆన్డ్యూటీలో ఉంటారని, అధునాతన ఫైర్ ఎక్విప్మెంట్తో, మెట్రో రైళ్లు, రైల్వే స్టేషన్లలో ఫైర్ సేఫ్టీ బాగుందన్నారు.
ప్రధాని మోడీ మిడియా సమావేశంలో మాట్లాడుతూ తానూ, ఇవాంక టూర్, గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న ఏరియాల్లో 31 ఫైరింజన్లతో పాటు 261 మంది ఫైర్ సిబ్బంది ఆన్డ్యూటీలో ఉంచమని ఫైర్ సర్వీస్ అడిషనల్ డైరెక్టర్ లక్ష్మీ ప్రసాద్ కి తెలిపామని చెప్పారు.
6,895
https://www.prajasakti.com/WEBSECTION/International/page137/burundilo-agni-gharshanle-90ki-cherin-mritul-sankhya
జాతీయ రహదారి విస్తరణ
జాతీయ రహదారి విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయడంతో పాటు మూడు చోట్ల సబ్వేలు, అప్రోచ్ రోడ్లు నిర్మించాలని కోరుతూ సిపిఎం తూర్పు జోన్-1 కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పాదయాత్ర నిర్వహించారు. 24వ డివిజన్ సాయిబాబా గుడి సెంటర్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర మానుకొండ భవన్, ఐతా రాములు కొట్టు, కోత మిషన్ రోడ్డు, పోస్టాఫీసు రోడ్డు, ఆర్చీ రోడ్డు, గుర్రాల రాఘవయ్య వీధి తదితర ప్రాంతాల మీదుగా పాదయాత్ర సాగింది. జాతీయ రహదారి పనులు వేగవంతం చేయాలని, 22, 23, 24 డివిజన్లలో సబ్వేలు, అప్రోచ్ రోడ్లు నిర్మించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ జాతీయ రహదారి విస్తరణ సందర్భంగా ప్రస్తుతం ప్రజలు పడుతున్న అవస్థలు, భవిష్యత్తులో ఎదురుకాబోయే కష్టాలను అంచనా వేసి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు.
మంగళవారం నాడు సిపిఎం తూర్పు జోన్-1 కమిటీ ఆధ్వర్యంలో జాతీయ రహదారి విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయడంతో పాటు 22, 23, 24 డివిజన్లలో చోట్ల సబ్వేలు, అప్రోచ్ రోడ్లు నిర్మించాలని పాదయాత్ర చేసారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ ప్రజలు ఇబ్బంది పడకుండా త్వరగా పూర్తిచేయాలని కోరారు.
7,191
https://www.prajasakti.com/WEBSECTION/National/page140/aieski-paluposindi-obamane
టాలెంట్ టెస్టు లేకుండా పాఠశాలలకు ప్రవేశం
పాఠశాలలో ప్రవేశాల కోసం ఎలాంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించరాదని కోర్టు తీర్పు ఉన్నప్పటికీ కేశవరెడ్డి విద్యా సంస్థలలో టాలెంట్ టెస్టు నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన శ్రీచైతన్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు స్కూల్స్ మేనేజిమెంట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. జనార్థనరెడ్డి, జిల్లా అధ్యక్షులు ఎస్. శ్రీనివాసురెడ్డి మాట్లాడారు. ఇప్పటికే ఇంటర్మీడియట్ విద్యను ధ్వంసం చేసిన నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థలకు పాఠశాలల విద్యను కూడా ప్రభుత్వమే అప్పజెప్పడం తగదన్నారు. కేశవరెడ్డి విద్యా సంస్థలను శ్రీచైతన్య విద్యా సంస్థలకు ఎలా అప్పజెప్తుందని ప్రశ్నించారు.
కోర్టు తీర్పును లెక్క చేయకుండా కేశవరెడ్డి విద్యా సంస్థలలో టాలెంట్ టెస్టు నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన శ్రీచైతన్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని స్కూల్స్ మేనేజిమెంట్ డిమాండ్ చేసింది. నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థలు ఇప్పటికే ఇంటర్మీడియట్ విద్యను ధ్వంసం చేసాయని పాఠశాలల విద్యను కూడా ప్రభుత్వమే అప్పజెప్పడం తగదన్నారు.
7,226
https://www.prajasakti.com/WEBSECTION/International/page151/mallilo-ugradadi
ప్రతి ఇంటికీ కుళాయి
పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్లలో నూరు శాతం మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కార్యక్రమాన్ని మూడు నెలల పాటు కొనసాగించాలని ఆ శాఖ డిఎంఎ కె. కన్నబాబు ఇటీవల జీవోను జారీ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ల ఏర్పాటుకు మున్సిపల్ ఇంజినీర్లు, ఎఇ, డిఇ, కమిషనర్లు సమన్వయంతో వ్యవహరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రానున్న ఐదేళ్లకు 14వ ఆర్థిక సంఘం నిధులను ఏయే పురపాలక సంఘానికి ఎంత కేటాయిస్తారో కూడా జీవోల ద్వారా ఆయా సంఘాలకు సమాచారం అందించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షను రావడానికి మూడు నెలల సమయం పడుతుందన్నారు. రానున్న ఐదేళ్లకు 14వ ఆర్థిక సంఘం నిధులను ఏయే పురపాలక సంఘానికి ఎంత కేటాయిస్తారో కూడా జీవోల ద్వారా ఆయా సంఘాలకు సమాచారం అందించారు.
7,235
https://www.prajasakti.com/WEBSECTION/National/page297/rijarveshns-hamilapai-samadhana-cheppali
సుప్రీంకోర్టు తీర్పుకు సవాలు
శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి అనుమతిస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై నవంబర్ 13న విచారణ చేపడతామని సుప్రీంకోర్టు మంగళవారం తెలిపింది. అన్ని వయస్సుల మహిళలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తూ అత్యున్నత న్యాయస్థానం సెప్టెంబర్ 28న సంచలన తీర్పును ఇచ్చిన సంగతి తెలిసిందే. జాతీయ స్థాయి అయ్యప్ప భక్తుల సంఘంతో పాటు 19 పిటిషన్లు దాఖలయ్యాయని, ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోరు, జస్టిస్ ఎస్కె. కౌర్తో కూడిన ధర్మాసనం పేర్కొంది.
శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పించినందుకు ఎదురుతిరుగుతూ సుప్రీంకోర్టులో జాతీయ స్థాయి అయ్యప్ప భక్తుల సంఘంతో పాటు 19 పిటిషన్లు దాఖలయ్యాయని వాటిని నవంబర్ 13న విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది.
7,382
https://www.prajasakti.com/WEBSECTION/National/page766/jes-matibhraminchindi
జమ్మూకాశ్మీర్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు మృతి
జమ్ము-కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు లష్కర్-ఇ-తొయిబా ఉగ్రవాదులు మృతి చెందారు. గలూరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న సమాచారం మేరకు భద్రతా సిబ్బంది కూంబింగ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారని అధికారులు పేర్కొన్నారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఫుర్ఖాన్ రషీద్లోన్ అలియాస్ అదిల్, లియాఖత్ అహ్మద్లోన్ అలియాస్ శహబ్ అలియాస్ ఉమర్ ఖలీద్లు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
జమ్ము-కాశ్మీర్లోని గలూరా ప్రాంతంలో భద్రతా సిబ్బంది కూంబింగ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు చేసిన దాడికి ఎదురు దాడి చేస్తుండగా ఎన్కౌంటర్లో ఇద్దరు లష్కర్-ఇ-తొయిబా ఉగ్రవాదులు మృతి చెందారు.
7,550
https://www.prajasakti.com/WEBSECTION/National/page437/apilo-maro-44-kesulu
దీక్షకు మద్దతుగా ప్రధానికి లేఖ
పాటిదార్లకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నఅంశంపై ప్రభుత్వం వెంటనే స్పందించి హార్థిక్ జీవితాన్ని కాపాడాలని మాజీ ప్రధాని దేవగౌడ ఒక లేఖలో ప్రధానిని కోరారు. పాటిదార్ నేత హార్థిక్ చేస్తున్న నిరాహార దీక్ష మంగళవారానికి పదకోండో రోజుకి చేరుకుంది. దీంతో మాజీ ప్రధాని, జెడి(ఎస్)నేత హెచ్డి దేవగౌడ హార్థిక్ దీక్షకు తన మద్దతును ప్రకటించడంతో పాటు ప్రధాని మోడీకి ఒక లేఖను రాశారు. నిరాహార దీక్ష పదవ రోజుకి చేరుకోవడంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని వార్తలు వస్తున్నాయని, దీంతో ఇది తనకు ఆందోళన కలిగించిందని ఆయన ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
పాటిదార్లకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నందువలన మాజీ ప్రధాని దేవగౌడ ప్రధానికి లేఖ రాశారు. నిరాహార దీక్ష పదవ రోజుకి చేరడంతో పాటిదార్ నేత హార్థిక్ ఆరోగ్యం క్షీణిస్తోందని వెంటనే స్పందించాలని దీక్షకు తన మద్దతు ప్రకటించారు.
8,180
https://www.prajasakti.com/WEBSECTION/National/page211/aircellmaksis-oppandalo-mudupulu
మరోసారి మొరాయించిన ఐఆర్ సీటీసీ వెబ్ సైట్
ఐఆర్సీటీసీ వెబ్సైట్ మరోసారి మొరాయించింది. ఇండియన్ రైల్వే కాటరింగ్, టూరిజమ్కు సంబంధించిన వెబ్సైట్ను ప్రయాణికులు టిక్కెట్లు బుక్ చేసుకుందామని ఓపెన్ చేస్తే "డ్యూ టూ మెయింటెనెన్స్ యాక్టివిటీ- ఈ టికెటింగ్ సర్వీస్ నాట్ అవైలబుల్" అని వచ్చింది. సంక్రాంతి సెలవుల సందడి మొదలవడంతో సొంత ఊళ్లకు వెళ్లడానికి, టూరిజమ్కు ప్లాన్ చేసుకునే ప్రయాణికులకు శుక్రవారం సాయంత్రం దాదాపు 30 నిమిషాలపాటు వెబ్సైట్ సేవలు నిలిచిపోవడంతో వారు ఇబ్బందులు పడ్డారు. దీంతో రైల్వేశాఖ పనితీరుపై ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు.
ఇండియన్ రైల్వే కాటరింగ్, టూరిజమ్కు సంబంధించిన వెబ్సైట్లు శుక్రవారం సాయంత్రం దాదాపు 30 నిమిషాలపాటు సేవలు నిలిచిపోవడంతో ప్రయాణికుల త్రీవ ఇబ్బంది పడ్డారు. దీంతో రైల్వేశాఖ పనితీరుపై ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు.
8,810
https://www.prajasakti.com/WEBSECTION/National/page272/10na-artisi-vishrant-udyogul-maha-dharna
పెట్రోలియం ఉత్పత్తులను జిఎస్ టి పరిధిలోకి తీసుకువస్తారా?
రాష్ట్రాల సమ్మతితో పెట్రోలియం ఉత్పత్తులను జిఎస్టి పరిధిలోకి తీసుకువచ్చేందుకు కేంద్రం సుముఖంగానే వుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్జైట్లీ మంగళవారం పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపి దేవేంద్రగౌడ్ రాజ్యసభలో వేసిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి పైవిధంగా స్పందించారు. పెట్రోల్, పెట్రోలియం ఉత్పత్తులను జిఎస్టిలోకి చేర్చే అంశంపై కౌన్సిల్ నిర్ణయం అనంతరం స్పష్టత వస్తుందని తెలిపారు. పెట్రోలియం ఉత్పత్తులను జిఎస్టి పరిధిలోకి తీసుకురావడానికి ఏ చట్టాన్ని సవరించాలన్నా కౌన్సిల్ నిర్ణయం వెలువడిన తరువాతనే సాధ్యమవుతుందని చెప్పారు.
రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ ఎంపి వేసిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి అరుణ్జైట్లీ ఇలా అన్నారు పెట్రోలియం ఉత్పత్తులను జిఎస్టి పరిధిలోకి తీసుకువచ్చేందుకు కేంద్రం సుముఖంగానే వుందని అందుకుగాను కౌన్సిల్ నిర్ణయం వెలువడిన తరువాతనే అది సాధ్యమవుతుందని చెప్పారు.
9,685
https://www.prajasakti.com/WEBSECTION/International/page485/tungabhadraku-potettin-varad-neeru
నకిలీ ఐటీ అధికారులు
దేశ రాజధాని నగరం ఢిల్లీలో కొందరు వ్యక్తులు ఐటీ అధికారులమంటూ హల్చల్ సృష్టించారు. ఆరుగురు నకిలీ ఐటీ అధికారులు తనిఖీల పేరుతో మాల్వియా నగర్లోని ఓ వ్యాపారి ఇంట్లోకి ప్రవేశించారు. అనుమానమొచ్చిన సదరు వ్యాపారి కుటుంబం ఆరుగురిని చితకబాది పోలీసులకు సమాచారమందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఆరుగురు నకిలీ ఐటీ అధికారులు మాల్వియా నగర్లోని ఓ వ్యాపారి ఇంట్లోకి ప్రవేశించి దొరికిపోగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
9,689
https://www.prajasakti.com/WEBSECTION/International/page52/annikal-kamishan-thiru-aprajaswamika
సర్దార్ సరోవర్ ఓపెనింగ్
గుజరాత్లోని కెవాడియాలో సర్దార్ సరోవర్ డ్యామ్ను ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అంతకు ముందు సర్దార్ సరోవర్ డ్యామ్ వద్ద పటేల్కు ప్రధాని మోడీ నివాళులర్పించారు. సర్దార్ సరోవర్ డ్యామ్కు 1961లో అప్పటి ప్రధాని నెహ్రూ శంకుస్థాపన చేశారు. సర్దార్ సరోవర్ డ్యామ్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ప్రాజెక్టు.
1961లో నెహ్రూ శంకుస్థాపన ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ప్రాజెక్ట్ అయినా సర్దార్ సరోవర్ డ్యామ్ను ప్రధాని నరేంద్రమోడీ తిరిగి ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
9,744
https://www.prajasakti.com/WEBSECTION/International/page42/indonesiato-rend-avagahana-oppandalu
మొరీనా బీచ్ లో దీప , దినకరన్ వర్గాల మధ్య ఘర్షణ
చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీప, దినకరన్ వర్గాల మధ్య ఈరోజు ఘర్షణ జరిగింది. మొరీనా బీచ్ లో జరిగిన ఒక కార్యక్రమానికి ఇరు వర్గాలకు చెందిన వారూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్యా ఘర్షణ జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు.
చెన్నై :మొరీనా బీచ్ లో జరిగిన ఒక కార్యక్రమానికి దీప, దినకరన్ వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులు దానిని అదుపు చేసారు.
10,134
https://www.prajasakti.com/WEBSECTION/National/page812/jiesty-kaunsilku-notiphai-cheyanunn-rashtrapati
కాంగ్రెస్ నేతల నివాసాలపై ఇడి అధికారుల సోదాలు.
దేశ రాజధానిలోని కాంగ్రెస్ నేతల నివాసాలపై ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ (ఇడి) అధికారులు దాడులు నిర్వహించారు. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కింద గురువారం ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ఢిల్లీ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుమేష్ షోకీన్ ఇంటితో సహా నగరవ్యాప్తంగా 12 ప్రాంతాల్లో ఇడి అధికారులు సోదాలు నిర్వహించారు. సాయంత్రం వరకూ దాడులు కొనసాగినట్లు సమాచారం.
గురువారం ఢిల్లీలోని మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుమేష్ షోకీన్ ఇంటితో సహా నగరవ్యాప్తంగా 12 ప్రాంతాల్లోని కాంగ్రెస్ నేతల నివాసాలపై ఇడి అధికారులు సాయంత్రం వరకూ సోదాలు నిర్వహించినట్లు సమాచారం.
10,804
https://www.prajasakti.com/WEBSECTION/National/page2829/karnataka-rashtralo-pukars
కర్ణాటక రాష్ట్రంలో పుకార్లు
కర్ణాటక రాష్ట్రంలో పుకార్లు చెలరేగాయి. పగడం వేసుకుంటే భర్త చనిపోతాడంటూ వదంతులు వచ్చాయి. దీంతో అక్కడి మహిళలు తమ తాళిబొట్టులోని పగడాన్ని మహిళలు పగుల గొట్టుకుంటున్నారు. బళ్లారి, దావణగేరి, చిత్రదుర్గ, తమ్కూరులో జోరుగా వదంతులు వ్యాపించాయి.
కర్ణాటకలో పుకార్లు వాళ్ళ పగడం వేసుకుంటే భర్త చనిపోతాడంటూ అక్కడి మహిళలు తమ తాళిబొట్టులోని పగుల గొట్టుకుంటున్నారు.
11,245
https://www.prajasakti.com/WEBSECTION/National/page2598/averest-adhirohanalo-bhartiy-durmarna
ఎవ రెస్ట్ అధిరోహ ణ లో భార తీయుడు దుర్మ ర ణం
ఎవరెస్ట్ అధిరోహణలో భారతీయుడు దుర్మరణం చెందాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన రవికుమార్ మృతదేహాన్ని షెర్పాలు గుర్తించారు. ముగ్గురు విదేశీ పర్వతారోహులతో కలసి రవికుమార్ ఎవరెస్ట్ ఎక్కేందుకు వెళ్లాడు. అనారోగ్యం కారణం వల్లే రవికుమార్ చనిపోయినట్లు అధికారులు గుర్తించారు.
అనారోగ్యం కారణంగా ముగ్గురు విదేశీ పర్వతారోహులతో కలసి ఎవరెస్ట్ ఎక్కేందుకు వెళ్లిన రవికుమార్ దుర్మరణం చెందాడు.
11,730
https://www.prajasakti.com/WEBSECTION/National/page236/vari-pantaku-neeru-vadalandi
యమునా నదీ తీరం పునరుద్ధరించడానికి 13.29 కోట్ల .
యమునా నదీ తీరం దెబ్బ తినడానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ (ఎఒఎల్) కారణమని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నియమించిన నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. యమునా నదీ తీరంలో ఎఒఎల్ నిర్వహించిన ప్రపంచ సాంస్కృతికోత్సవం సమయంలో ఆ ప్రాంతం దెబ్బ తిన్నదని కమిటీ పేర్కొంది. ఈ ప్రాంతాన్ని పునరుద్ధరించడానికి 13.29 కోట్ల రూపాయిలు ఖర్చవుతుందని కమిటీ పేర్కొంది. కాగా, నిపుణుల కమిటీ నివేదికను సమగ్రంగా పరిశీలించిన తరువాత భవిష్యత్ కార్యాచరణపై ఒక నిర్ణయం తీసుకుంటామని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అధికార ప్రతినిధి కేదార్ దేశాయ్ అన్నారు.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కమిటీ యమునా నదీ తీరం దెబ్బ తినడానికి కారణం ఆర్ట్ ఆఫ్ లివింగ్ (ఎఒఎల్) అని, దాని పునరుద్ధరించడానికి 13.29 కోట్ల రూపాయిలు ఖర్చవుతుందని ఎఒఎల్ నిర్వహించిన ప్రపంచ సాంస్కృతికోత్సవంలో తేల్చి చెప్పింది.
14,582
https://www.prajasakti.com/WEBSECTION/International/page201/prabhutva-aalochan-swechhk-nashta
ఎవరెస్ట్ ను అధిరోహించే ప్రయత్నంలో మరణించిన భారతీయులు
ఎవరెస్ట్ను అధిరోహించే ప్రయత్నంలో గల్లంతయిన పరేశ్ చంద్రనాథ్ మృతదేహాన్ని శుక్రవారం షెర్పా(నేపాల్ పర్వత ప్రాంత వాసులు)ల బృందం కనుగొన్నది. బెంగాల్కు చెందిన మరో ఇద్దరు పర్వత అధిరోహకులు గౌతం ఘోష్, సుభాష్ పాల్ల మృతదేహాలు 8 వేల మీటర్ల ఎత్తులో ఉన్నట్టు గుర్తించామని ఆరుగురు సభ్యులతో కూడిన షెర్పాల బృందం తెలిపింది. వాతావరణం అనుకూలించకపోవడంతో ఇంకా ముందుకు సాగలేకపోయామని షెర్పాలు తెలిపారు. ఈ ముగ్గురి మరణంతో ఈ ఏడాది ఎవరెస్ట్ అధిరోహించే ప్రయత్నంలో మరణించిన భారతీయుల సంఖ్య ఐదుకు చేరింది.
ఎవరెస్ట్ను అధిరోహించే ప్రయత్నంలో పరేశ్ చంద్రనాథ్, గౌతం ఘోష్ మరియు సుభాష్ పాల్ల మృతదేహాలను షెర్పాల బృందం తెలిపింది. వాతావరణం అనుకూలించకపోవడంతో ఇంకా ముందుకు సాగలేకపోయామని, ఈ ప్రయత్నంలో మరణించిన భారతీయుల సంఖ్య ఐదుకు చేరిందని అనారు.
15,300
https://www.prajasakti.com/WEBSECTION/National/page513/kartarpur-karidark-imran-shankusthapan
మధ్యప్రదేశ్ ప్రభుత్వం నూతన హెల్మెట్ ఆంక్షలు
ద్విచక్రవాహనదారుల భద్రత కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం హెల్మెట్ ఆంక్షలను విధించింది. ఇక నుంచి పెట్రోల్ బంకుల్లోకి హెల్మెట్ ధరించి వస్తేనే పెట్రోల్ పోస్తారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు బుధవారం ఆదేశాలు జారీచేసింది. పెట్రోల్ బంకు యాజమానులు ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.
పెట్రోల్ బంకుల్లోకి హెల్మెట్ ధరించి వస్తేనే పెట్రోల్ పోస్తారని మధ్యప్రదేశ్ ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు బుధవారం హెల్మెట్ ఆంక్షలను విధిస్తూ ఆదేశాలు జారీచేసింది.
15,785
https://www.prajasakti.com/WEBSECTION/International/page813/paryatak-kendranga-aienes-virat-tendarlan-aahaninchin-api-prabhutvan
జమ్మూ కాశ్మీర్ కు గల ప్రత్యేక ప్రతిపత్తిని తుడిచిపెట్టేందుకు మహ్మద్ యూసుఫ్ తరిగమి కృషి
జమ్మూ కాశ్మీర్కు గల ప్రత్యేక ప్రతిపత్తిని తుడిచిపెట్టేందుకు బిజెపి, ఆర్ఎస్ఎస్లు నిరంతరాయంగా ప్రయత్నాలు చేస్తూనే వున్నాయని, కానీ ఆ ప్రయత్నాలు ఎప్పుడూ ప్రతికూల ఫలితాలనే ఇస్తున్నాయని సిపిఎం నేత, ఎంఎల్ఎ మహ్మద్ యూసుఫ్ తరిగమి పేర్కొన్నారు. దక్షిణ కాశ్మీర్లోని కాజిగండ్లో బుధవారం జరిగిన పార్టీ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఆయనతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి గులాం నబీ మాలిక్, ఇతర పార్టీ నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత రాజ్యాంగంలో ఈ మేరకు హామీలు పొందుపరచినప్పటికీ జమ్మూ కాశ్మీర్ విషయంలో మాత్రం ఆర్ఎస్ఎస్ మాత్రం తన ఎజెండాను రుద్దాలని చూస్తోందన్నారు.
దక్షిణ కాశ్మీర్లోని కాజిగండ్లో బుధవారం జరిగిన పార్టీ సదస్సులో ఎంఎల్ఎ మహ్మద్ యూసుఫ్ తరిగమి ప్రసంగిస్తూ జమ్మూ కాశ్మీర్కు గల ప్రత్యేక ప్రతిపత్తిని తుడిచిపెట్టేందుకు బిజెపి, ఆర్ఎస్ఎస్లు నిరంతరాయంగా ప్రయత్నాలు చేస్తూనే వున్నాయని, కానీ ఆ ప్రయత్నాలు ఎప్పుడూ సానుకూల ఫలితాలను ఇవ్వడం లేదని పేర్కొన్నారు.
15,836
https://www.prajasakti.com/WEBSECTION/National/page324/gurmitku-shiksh-kharar-bhaggumnn-sirsa
న్యాయవ్యవస్థ స్వతంత్రతను పరిరక్షించాలన్న సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ .
న్యాయవ్యవస్థ స్వతంత్రతను పరిరక్షించి దానికి దృఢత్వాన్ని కల్గించేందుకు పాటుపడాల్సిందిగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు న్యాయవాదులకు, న్యాయమూర్తులకు స్వాతంత్ర దినోత్సవం రోజున పిలుపునిచ్చారు. బెంచ్, బార్లు న్యాయవ్యవస్థ స్వతంత్రకు, రక్షణ కల్పించడానికే ఉన్నాయి. ఇవన్నీ జాతీయ ఆస్తి కిందకే వస్తాయని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. స్వాతంత్ర దినోత్సవం నాడు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న దత్తు ఈ వ్యాఖ్యలు చేశారు.
స్వాతంత్ర దినోత్సవం నాడు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు పాల్గొని న్యాయవ్యవస్థ స్వతంత్రతను పరిరక్షించి దాని దృఢత్వానికి పాటుపడాలని న్యాయవాదులకు, న్యాయమూర్తులకు సందేశమిచ్చారు.
16,478
https://www.prajasakti.com/WEBSECTION/National/page21/rajinama-cheyan-mugabe
అరబ్ లో యోగ
కఠినమైన ఇస్లామిక్ మత విధానాలతో కొనసాగుతున్న సౌదీ అరేబియాలో యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ పఠిస్తున్న సరళీకరణ మంత్రంతో 'యోగ' సాధనకు ప్రాచుర్యం లభిస్తోంది. సౌదీ అరేబియాలో దశాబ్దాలుగా యోగాకు అధికారిక గుర్తింపు లేనప్పటికీ యువరాజు సల్మాన్ పగ్గాలు చేపట్టిన తరువాత గత నవంబర్లో దీనిని ఒక క్రీడగా గుర్తించటంతో పాటు యోగ శిక్షణా కేంద్రాలను ప్రోత్సహిస్తున్నారు. అయితే ఒకవైపు యోగా ప్రాచుర్యం విస్తరిస్తున్నప్పటికీ సౌదీ మహిళలకు కరుడుగట్టిన మతవాదుల నుండి అవ మానాలు, బెదిరింపులు తప్పటం లేదు. కొందరు వ్యక్తులు తనను తరచు అవమానాలకు గురిచేస్తూ, బెదిరింపు సందేశాలు పంపుతున్నారని అరబ్ యోగాఫౌండేషన్ అధినేత నౌఫ్ మార్వాయి చెబుతున్నారు.
సౌదీ అరేబియాలో దశాబ్దాలుగా యోగా లేనప్పటికీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ పఠిస్తున్న సరళీకరణ మంత్రంతో 'యోగ' సాధనకు ప్రాచుర్యం లభిస్తోంది. ఇలా అయినప్పటికీ కొందరు వ్యక్తులు వలన మహిళలకు ఇబ్బందులు కలుగుతున్నాయని అరబ్ యోగాఫౌండేషన్ అధినేత నౌఫ్ మార్వాయి చెబుతున్నారు.
16,729
https://www.prajasakti.com/WEBSECTION/International/page155/mindnavo-divilo-sainik-paalan
వీసా లేకుండా హైనన్ దీవికి పర్యటన: డైరెక్టర్ క్యూ యున్ హాయి
దక్షిణప్రాంత దీవి హైనన్కు వీసా లేకుండా ప్రయాణం చేసేందుకు చైనా అనుమతించింది. మే నెల్లో ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంది. 59దేశాలకు చెందిన పర్యాటకులు 30 రోజుల పాటు హైనన్ దీవిలో వీసా లేకుండా పర్యటించవచ్చునని స్టేట్ ఇమ్మి గ్రేషన్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ డైరెక్టర్ క్యూ యున్హాయి ఇక్కడ ఒక పత్రికా సమావేశంలో తెలిపారు. రష్యా, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ దేశాలతో సహా పలు దేశాల వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
రష్యా, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ దేశాలతో సహా 59 దేశాలకు చెందిన పర్యాటకులు 30 రోజుల పాటు వీసా లేకుండా హైనన్ దివిలో పర్యటించవచ్చని చైనా అనుమతిచ్చింది.
16,978
https://www.prajasakti.com/WEBSECTION/National/page320/kenter-chetilo-kilubomm-asibi-kejrival
రోజురోజుకి పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్
వాతావరణ మార్పులతో నానాటికీ పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచం త్వరలోనే అంతమవుతుందంటూ ఐరాస చేస్తున్న హెచ్చరికలను బ్రిటిష్ శాస్త్రవేత్తలు సవాల్ చేస్తున్నారు. 2100 నాటికి భూమండలంపై ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల సెల్షియస్ మేరకు పెరుగుతాయన్న వాదన పూర్తి అవాస్తవమని తాము నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయినట్లు బ్రిటన్ శాస్త్రవేత్తల బృందం చెబుతోంది. యూనివర్శిటీఆఫ్ ఎక్స్టెర్కు చెందిన ఈ శాస్త్రవేత్తల బృందం చెబుతున్నది నిజమే అయితే వాతావరణ మార్పులపై ఐరాస తన హెచ్చరికలను సవరించుకోవాల్సిన అవసరం వుందని పరిశీలకులు చెబుతున్నారు. నానాటికీ పెరుగుతున్న హరితగృహ వాయువు(గ్రీన్హౌస్ గ్యాసెస్)ల విడుదల కారణంగా భూమండలంపై ఉష్ణోగ్రతలు ఈ శతాబ్ది చివరి నాటికి భారీగా పెరుగుతాయంటున్న వాదన కేవలం అర్ధసత్యం మాత్రమేనని ఈ శాస్త్రవేత్తల బృందం స్పష్టం చేస్తోంది.
హరితగృహ వాయువు(గ్రీన్హౌస్ గ్యాసెస్)ల విడుదల వల్ల రోజురోజుకి పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచం త్వరలోనే అంతమవుతుందంటూ, 2100 నాటికి భూమండలంపై ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల సెల్షియస్ మేరకు పెరుగుతాయని ఐరాస చేస్తున్న వాదనలు అవాస్తవమని తాము నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయినట్లు యూనివర్శిటీఆఫ్ ఎక్స్టెర్కు చెందిన బ్రిటన్ శాస్త్రవేత్తల బృందం చెబుతోంది.
17,090
https://www.prajasakti.com/WEBSECTION/National/page386/vaisipi-netale-rayalsim-drohulu
 ఉభయ కొరియాలు ముఖాముఖి
దాదాపు రెండేళ్ల విరామం అనంతరం ఉభయ కొరియాలు మంగళవారం నాడు ముఖాముఖి చర్చలు ప్రారంభించాయి. శీతాకాలం ఒలింపిక్స్ నిర్వహణపై చర్చించేందుకు భేటీ అయిన ఉభయ దేశాల ప్రతినిధి వర్గాలూ, ఇరుదేశాల మధ్య సంబంధాలు తిరిగి గాడిన పడతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాయి. శీతాకాలం ఒలింపిక్స్లో పాల్గనేందుకు తమ క్రీడాకారుల బృందాన్ని పంపేందుకు ఉ. కొరియా సిద్ధమైన నేపథ్యంలో ఇందుకు తీసుకోవాల్సిన చర్యలు, అవసరమైన విధివిధానాలపై చర్చించేందుకు ఉభయదేశాలూ భేటీ అయ్యాయి. కేవలం ఒలింపిక్ క్రీడల అంశం మాత్రమే ఏకైక అజెండాగా ఈ భేటీ జరుగుతున్నప్పటికీ ప్రపంచ దేశాలు మాత్రం ఈ భేటీ తరువాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గి సంబంధాలు గాడిన పడతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
శీతాకాలం ఒలింపిక్స్ నిర్వహణ విషయమై భేటీఅయిన ఉభయ కొరియాలు ప్రపంచ దేశాలకు ఇరుదేశాల మధ్య సంబంధాలు గాడిన పడతాయన్న ఆశాభావాన్ని రేపాయి. కాని కేవలం ఒలింపిక్స్లో పాల్గనేందుకు క్రీడాకారుల బృందాన్ని పంపేందుకు, ఇందుకు తీసుకోవాల్సిన చర్యలు, అవసరమైన విధివిధానాలపై చర్చించేందుకు మాత్రమే ఉభయదేశాలూ భేటీ అయ్యాయి.
17,518
https://www.prajasakti.com/WEBSECTION/National/page246/iddru-pakistaniyulku-medical-visal-manjur
టిబెట్ లో అత్యంత ఎత్తైన ప్లానేటోరియం
రోదసిలోని గ్రహాల పరిభ్రమణాన్ని, నక్షత్ర లోకాన్ని అత్యంత స్పష్టంగా చూపే భారీ టెలిస్కోప్తో ప్రపంచంలోనే ఎత్తయిన ప్లానెటోరియంను టిబెట్లోని లాసాలో వచ్చే ఏడాది నిర్మించనున్నట్లు చైనా అధికార మీడియా వెల్లడించింది. ఈ ప్లానెటోరియం నిర్మాణ పనులను చైనా స్వయంపాలిత టిబెట్ ప్రభుత్వం వచ్చే ఏడాది ప్రారంభిస్తుందని అధికార వార్తా సంస్థ సిన్హువా తన వార్తా కథనంలో వెల్లడించింది. ప్రస్తుతం లాసాలో వున్న టిబెట్ మ్యూజియం ఆఫ్ నేచురల్ సైన్సెస్ ఆవరణలోనే ఈ ప్లానెటోరియం నిర్మితమవుతుందని, ఇందులో భారీ టెలిస్కోప్ను అమరుస్తామని సిన్హువా తన కథనంలో వెల్లడించింది. ఈ టెలిస్కోప్ను నేషనల్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీస్, టిబెట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ సంయుక్తంగా రూపొందిస్తాయని సిన్హువా వివరించింది.
రోదసిలోని గ్రహాల పరిభ్రమణాన్ని, నక్షత్ర లోకాన్ని అత్యంత స్పష్టంగా చూపే భారీ టెలిస్కోప్తో ప్రపంచంలోనే ఎత్తయిన ప్లానెటోరియంను టిబెట్లోని లాసాలో నిర్మించబోతున్నారు. లాసాలో వున్న టిబెట్ మ్యూజియం ఆఫ్ నేచురల్ సైన్సెస్ ఆవరణలో ఈ నిర్మాణ పనులు వచ్చే ఏడాది మొదలవుతాయని టిబెట్ ప్రభుత్వం తెలిపింది.
17,718
https://www.prajasakti.com/WEBSECTION/National/page575/prapanch-shantiki-vighata-jaatiyavada
కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరిస్తాం
ఇర్మా తుపాను కారణంగా కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థను ఈ నెలాఖరుకల్లా పూర్తిగా పునరుద్ధరిస్తామని క్యూబా ప్రభుత్వం తెలిపింది. సెప్టెంబరు 30నాటికల్లా 99శాతం మంది వినియోగదారులకు విద్యుత్నందిస్తామని ఎలక్ట్రికల్ యూనియన్ టెక్నికల్ డైరెక్టర్ లాజారో గుయర్రా హెర్మాండెజ్ తెలిపారు. అన్ని విభాగాల సిబ్బంది అహర్నిశలు చేస్తున్న కృషి వల్లనే ఇది సాధ్యమవుతోందని అన్నారు. ఇర్మా తుపానుతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పనిచేస్తున్న వందలాదిమంది సిబ్బందితో తాను మాట్లాడుతూనే వున్నానని, కొన్ని చోట్ల మరమ్మత్తులు పూర్తయినా ఇంకా సమస్యలు వుండివుండవచ్చునని, వాటిని కూడా సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
క్యూబాలో ఇర్మా తుపాను వల్ల కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థను ఈ నెలాఖరుకల్లా పూర్తిగా పునరుద్ధరిస్తామని ప్రభుత్వం తెలిపింది. అన్ని విభాగాల సిబ్బంది అహర్నిశలు చేస్తున్న కృషి వల్లనే 99శాతం మంది వినియోగదారులకు 30నాటికల్లా విద్యుత్ అందించాం సాధ్యం అవుతుంది అన్నారు.
17,818
https://www.prajasakti.com/WEBSECTION/International/page87/bharyan-hatya-chacin-bhart
టెర్ర ర్ దాడిలో పాల్గో న్న వ్య క్తి అరెస్ట్
అండర్ గ్రౌండ్ రైలు బాంబు దాడులకు సంబంధించి రెండో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు బ్రిటీష్ పోలీసులు తెలిపారు. టెర్రర్ దాడిలో తమ దర్యాప్తు విస్తరించింది. టెర్రర్ దాడిలో పాల్గోన్న 21 ఏళ్ల వ్యక్తిని గత శనివారం హౌన్స్లోలో అరెస్ట్ చేశారు. గ్రీన్ స్టేషన్లో శుక్రవారం నాడు జరిగిన దాడిలో 30 మంది గాయపడ్డారని, అదే క్రమంలో దాడికి సంబందించి 18 ఏళ్ళ వ్యక్తిని చేశామని, ఈ దాడిలో సంబంధమున్న మరికొంత మంది అనుమానితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గ్రీన్ స్టేషన్లో అండర్ గ్రౌండ్ రైలు బాంబులు జరగటంతో 30 మంది గాయపడ్డారు. దాడులకు సంబంధించి 21 ఏళ్ల వ్యక్తిని గత శనివారం హౌన్స్లోలో అరెస్ట్ చేయగా, రెండో వ్యక్తిని కుడా అరెస్ట్ చేశారు.
17,867
https://www.prajasakti.com/WEBSECTION/International/page395/chikkullo-jindal
ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ పై అనర్హతా వేటుఫై సవాలు
ఇస్లామాబాద్ : బహిష్కృత పాక్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్పై అనర్హతా వేటు వేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన కుటుంబం సవాల్ చేసింది. నవాజ్ షరీఫ్పై అనర్హతా వేటు వేయడమే కాకుండా, పనామా పేపర్స్ కుంభకోణంలో ఆయన పిల్లలతో సహా ఆయనపై అవినీతి ఆరోపణలు చేయడాన్ని కూడా సవాల్ చేసింది. అవినీతి కేసు దర్యాప్తు నేపథ్యంలో ప్రధాన మంత్రిగా షరీఫ్ అనర్హుడని కోర్టు తీర్పునిచ్చిన తరువాత ఆయన జులై 28న పదవికి రాజీనామా చేశారు, కాగా షరీఫ్ పిల్లలపై వచ్చిన అవినీతి కేసులను దర్యాప్తు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి నవాజ్ షరీఫ్ కుమారులు హుస్సేన్, హస్సన్, కుమార్తె మార్యామ్, అల్లుడు కెప్టెన్(రిటైర్డ్) మహ్మద్ సఫ్తార్లు తమ న్యాయవాది సల్మాన్ అక్రమ్ రాజా ద్వారా సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.
పాక్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్పై అనర్హతా వేటు వేయడమే కాకుండా, పనామా పేపర్స్ కుంభకోణంలో ఆయన పిల్లలతో సహా ఆయనపై అవినీతి ఆరోపణలు చేయడాన్ని ఆయన కుటుంబ సభ్యులు సవాల్ చేశారు. ప్రధాన మంత్రిగా షరీఫ్కు అర్హత లేదని కోర్టు తీర్పునివ్వడంతో పదవికి రాజీనామా చేసి, ఆయన పిల్లలపై వచ్చిన అవినీతి కేసులను దర్యాప్తు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది.
17,873
https://www.prajasakti.com/WEBSECTION/International/page436/london-athleticsc-chitran-pampali
అమెరికా-చైనా మధ్య కుదిరిన ఒప్పందం
బీజింగ్/వాషింగ్టన్: సంక్షోభ సమయాల్లో సమాచారం ఇచ్చి పుచ్చుకునే లక్ష్యంతో సన్నిహిత సంబంధాల ఏర్పాటుకు సంబందించి అమెరికా-చైనా గురువారం ఇక్కడ ఒప్పందంపై సంతకాలుచేశాయి. ఈ ఒప్పందంపై పెంటగాన్కు చెదిన నౌకాదళాధిపతి మెరైన్ జనరల్ జోసెఫ్ ఎఫ్ డన్ఫోర్డ్, చైనా త్రివిధ దళాల సంయుక్త కమిటీ అధిపతి జనరల్ ఫాంగ్ ఫెంగ్షురు సంతకాలు చేశారు. ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నత డన్ఫోర్డ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం చైనా అధికారులతో ముందుగా చైనా సైనిక ప్రధాన కార్యాలయంలో చర్చలు జరిపింది. అనంతరం కుదిరిన ఈ ఒప్పందం మేరకు డన్ఫోర్డ్ కార్యాలయానికి చెందిన ఉన్నతాధికారి లెఫ్టినెంట్ జనరల్ రిచర్డ్ డి క్లార్క్ చైనా సైనికాధికారితో నిరంతర సంప్రదింపుల ప్రక్రియను కొనసాగిస్తారు.
సంక్షోభ సమయాల్లో తాము ఎలా వ్యవహరించాలని, ఎలా ఎదుర్కోవాలని అమెరికా-చైనా ఒక ఒప్పందంపై పెంటగాన్కు చెదిన నౌకాదళాధిపతి మెరైన్ జనరల్ జోసెఫ్ ఎఫ్ డన్ఫోర్డ్, చైనా త్రివిధ దళాల సంయుక్త కమిటీ అధిపతి జనరల్ ఫాంగ్ ఫెంగ్షురు సంతకాలు చేశారు.
18,166
https://www.prajasakti.com/WEBSECTION/International/page658/vatsapn-nishedhinchalen-suprin
అమెరికా కవ్వింపు చర్య
ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని గాల్లోనే పేల్చివేసే ఇంటర్సెప్టార్ పరీక్షను అమెరికా నిర్వహించడాన్ని ఉత్తర కొరియా శనివారం ఖండించింది. 'ఇది తీవ్రమైన సైనిక కవ్వింపు చర్య'' అని వ్యాఖ్యానించింది. అణు యుద్ధాన్ని ప్రేరేపించేందుకు అమెరికా సామ్రాజ్యవాదులు క్రూరమైన చర్యలకు పాల్పడుతున్నారని కొరియన్ పీపుల్స్ ఆర్మీకి చెందిన ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఇప్పటికే సైనిక విన్యాసాల్లో పాల్గొంటున్న, అణు శీర్షాలను తీసుకెళ్ళగల విమాన వాహక నౌక యుఎస్ఎస్ కార్ల్ విన్సన్ గ్రూపులోకి యుఎస్ఎస్ రొనాల్డ్ రీగన్ నౌకను చేర్చడాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని గాల్లోనే పేల్చివేసే ఇంటర్సెప్టార్ పరీక్షను అమెరికా నిర్వహించడం యుద్ధాన్ని ప్రేరేపించే పని అని ఉత్తర కొరియా విమర్శించింది. యుఎస్ఎస్ కార్ల్ విన్సన్ గ్రూపులోకి యుఎస్ఎస్ రొనాల్డ్ రీగన్ నౌకను చేర్చడాన్ని పీపుల్స్ ఆర్మీకి చెందిన ప్రతినిధి విమర్శించారు.
18,211
https://www.prajasakti.com/WEBSECTION/International/page975/gujarat-annikal-8-sabhllo-palgonanunn-modi
రాజధానిలో రష్యన్ ఫెడరేషన్ కమ్యూనిస్టు పార్టీ 17వ జాతీయ మహాసభల వేడుకలలో అధ్యక్షుడు పుతిన్ పంపిన అభినందన సందేశాన్ని చదివిన పార్టీ ప్రధాన కార్యదర్శి గ్రెనడీ జుగనోవ్
శనివారం ఇక్కడ జరిగిన రష్యన్ ఫెడరేషన్ కమ్యూనిస్టు పార్టీ 17వ జాతీయ మహాసభలకు అధ్యక్షుడు పుతిన్ అభినందనలు తెలియచేశారు. అక్టోబర్ మహావిప్లవ శతాబ్ది వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో రాజధానిలోని రష్యన్ కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన ఈ వేదికపై అధ్యక్షుడు పుతిన్ పంపిన అభినందన సందేశాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి గ్రెనడీ జుగనోవ్ చదివి వినిపించారు. పుతిన్ అభినందనల సందేశాన్ని ఆయన ప్రస్తావిస్తూ దేశాన్ని మరింత బలోపేతం చేసేందుకు అధికారంలోవున్న అన్ని విభాగాలతో నిర్మాణాత్మక చర్చలు జరిపేందుకు తమ పార్టీ సిద్ధంగా వుందన్నారు. గత నాలుగేళ్ల కాలంలో తమ పార్టీలో 60 వేల మంది కొత్త సభ్యులు చేరారని ఆయన వివరించారు.
రాజధానిలో రష్యన్ ఫెడరేషన్ కమ్యూనిస్టు పార్టీ 17వ జాతీయ మహాసభల వేడుకలలో అధ్యక్షుడు పుతిన్ పంపిన అభినందన సందేశాన్ని చదివిన పార్టీ ప్రధాన కార్యదర్శి గ్రెనడీ జుగనోవ్ గత నాలుగేళ్ల కాలంలో తమ పార్టీలో 60 వేల మంది కొత్త సభ్యులు చేరారని వివరించారు.
18,218
https://www.prajasakti.com/WEBSECTION/National/page100/french-open-nuchi-pivi-sindhu-out
అమెరికాలోని నార్తర్న్ ఇల్లినాయిస్ యూనివర్శిటీలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తున్న తిరుపతికి చెందిన సాయికుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి
అమెరికాలోని ఇల్లినాయిస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక విద్యార్థి మృతి చెందాడు. నార్తర్న్ ఇల్లినాయిస్ యూనివర్శిటీలో ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తున్న అడ్లూరి సాయికుమార్ అనే విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సాయికుమార్ను ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సాయికుమార్ ప్రయాణిస్తున్న కారును వెనుకనుండి వేగంగా వచ్చిన మరొక కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
అమెరికాలోని నార్తర్న్ ఇల్లినాయిస్ యూనివర్శిటీలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తున్న తిరుపతికి చెందిన అడ్లూరి సాయికుమార్ అక్కడ కారులో ప్రయాణిస్తుండంగా వెనుకనుండి మరొక కారు ఢీకొని జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
18,491
https://www.prajasakti.com/WEBSECTION/International/page969/lallu-dharna
శాంతి భూమిగా కొరియా ద్వీపకల్పం
యుద్ధ భయాన్ని సమూలంగా నిర్మూలించాలని ఉత్తర కొరియా, దక్షిణ కొరియాలు పిలుపిచ్చాయని అధికార మీడియా శనివారం తెలిపింది. 2007లో జరిగిన ఉభయ కొరియాల సదస్సు 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడ ఒక కార్యక్రమం నిర్వహించారు. ఉత్తరకొరియా సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ అధ్యక్ష వర్గం అధ్యక్షుడు కిమ్ యాంగ్ నామ్, దక్షిణ కొరియా పునరేకీకరణ వ్యవహారాల మంత్రి చొమియాంగ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొరియా భూభాగంపై యుద్ధ భయం అనేది లేకుండా చేయాలని ఉభయ దేశాలు పిలుపునిచ్చాయి.
2007లో జరిగిన ఉభయ కొరియాల సదస్సు 11వ వార్షికోత్సవ కార్యక్రమానికి కిమ్ యాంగ్ నామ్, చొమియాంగ్లు పాల్గొనగా, యుద్ధ భయాన్ని సమూలంగా నిర్మూలించాలని ఉభయ దేశాలు పిలుపునిచ్చాయని అధికార మీడియా శనివారం తెలిపింది.
18,530
https://www.prajasakti.com/WEBSECTION/International/page274/krida-ranganlo-rajkiya-pettana-sarikad
అవినీతి నిర్ములనకి కంకణం
ద. కొరియాలో అత్యున్నత స్థాయిలో రాజకీయ ప్రకంపనలు సృష్టించి అధ్యక్షురాలు పార్క్ జియున్ హై అభిశంసనకు కారణమైన అవినీతి కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న శాంసంగ్ గ్రూప్ అధినేత జె వై లీని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. తమ సంస్థ వారసత్వ సమస్యలో ప్రభుత్వం తనకు అనుకూలంగా నిర్ణయించేందుకు వీలుగా దేశాధ్యక్షురాలు పార్క్ జియున్ హైకి సన్నిహితుడైన వ్యక్తికి లీ ముడుపులు అందచేసినట్లు స్పెషల్ ప్రాసిక్యూటర్ కార్యాలయం (ఎస్పిఓ) ఆరోపించింది. లంచగొండితనం, నిధుల దుర్వినియోగం, విదేశాలలో అక్రమంగా ఆస్తులు కూడబెట్టడం, అబద్ధాలు చెప్పటం వంటి అభియోగాలతో తాము లీపై అభియోగపత్రం నమోదు చేస్తామని ఎస్పిఓ వెల్లడించింది. లీ అరెస్ట్పై గురువారం అర్ధరాత్రి సమయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటంతో అధికారులు శుక్రవారం వేకువజామున ఈ అరెస్ట్ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ద. కొరియాలో అత్యున్నత స్థాయిలో రాజకీయ ప్రకంపనలు సృష్టించి, పార్క్ జియున్ హైకి సన్నిహితుడైన వ్యక్తికి లీ ముడుపులు అందచేయ్యడం వాళ్ళ లీ ని పోలీస్ లు అరెస్ట్ చేసారు . లంచగొండితనం, నిధుల దుర్వినియోగం, విదేశాలలో అక్రమంగా ఆస్తులు కూడబెట్టడం, అబద్ధాలు చెప్పటం వంటి అభియోగాలతో ఎస్పిఓ లీపై అభియోగపత్రం నమోదు చేస్తామని చెప్పింది.
18,702
https://www.prajasakti.com/WEBSECTION/International/page917/sarin-dishlo-sarin-charya-mufti
చైనాతో ఒప్పందానికి నేపాల్ సిద్ధం
చైనా సహాయంతో మూడు చమురు నిల్వ డిపోల నిర్మాణానికి సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు నేపాల్ సిద్ధమవుతోంది. నేపాల్ ప్రధాని ఓపి కోలి వచ్చే వారం చైనాలో పర్యటించే సమయంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందం ప్రకారం మొత్తం 1,10,000 కి. లీ సామర్ద్యం కలిగిన చమురు నిల్వ డిపోలను భైరహవా, గోర్ఖా సరిహద్దులోని అన్బుఖరేనీ, నువాకోట్ ప్రాంతంలోని బట్టర్లో నిర్మిస్తారు.
నేపాల్ ప్రధాని ఓపి కోలి వచ్చే వారం చైనాలో పర్యటనలో భాగంగా చైనా సహాయంతో మూడు చమురు నిల్వ డిపోల నిర్మాణానికి సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు సన్నద్ధమవుతున్నయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
18,881
https://www.prajasakti.com/WEBSECTION/National/page852/pakistan-hacortulo-pitishan-vesin-jadave-talli
పేలుడులో మరణించిన 14 మంది
చైనా వాయవ్య ప్రాంతంలోని షాంగ్జి ప్రావిన్స్లో వున్న జిన్మిన్ టౌన్షిప్లోని ఫుగు కౌంటీలో సోమవారం (స్థానిక కాలమానం ప్రకారం) మధ్యాహ్నం సంభవించిన పేలుడులో కనీసం 14 మంది మరణించారని, మరో 147 మందికి పైగా గాయపడ్డారని అధికారులు చెప్పారు. ఈ పేలుడులో అక్కడే వున్న ఐదు ప్రిఫ్యాబ్రికేటెడ్ ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా పరిసరాల్లో వున్న భవనాలు, కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని మీడియా తన వార్తా కథనాలలో వెల్లడించింది. క్షతగాత్రుల్లో 41 మంది ప్రాథమిక చికిత్స అనంతరం ఇంటికి తిరిగి వెళ్లిపోగా మరో 106 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు వివరించారు. పేలుడు పదార్ధాలను అక్రమంగా నిల్వ చేయటం వల్లే ఈ పేలుడు జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణ అయినట్లు వారు చెప్పారు.
ఫుగు కౌంటీలో పేలుడు సంభవించడంతో 14 మంది మరణించగా 147 మందికి పైగా గాయపడ్డారని అధికారులు చెప్పారు. ఈ పేలుడులో పరిసరాల్లో వున్న భవనాలు, కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని మీడియా తెలిపారు. పేలుడు పదార్ధాలను అక్రమంగా నిల్వ చేయటం వల్లే ఇలా జరిగిందని తెలిపారు.
18,977
https://www.prajasakti.com/WEBSECTION/International/page727/valsavasul-hakkulapai-nederlandslo-oting
గత వారం తాను చైనాలో జరిపిన పర్యటనలో ఇరుదేశాల మధ్య మైత్రీ బంధం మరింత బలపడిందన్న వియత్నాం ప్రధాని ఎన్ గుయెన్ జువాన్ ఫుక్ .
గత వారం తాను చైనాలో జరిపిన పర్యటనలో ఇరుదేశాల మధ్య మైత్రీ బంధం మరింత బలపడిందని వియత్నాం ప్రధాని ఎన్గుయెన్ జువాన్ ఫుక్ చెప్పారు. ఈ నెల 10వ తేదీ నుండి 15వ తేదీ వరకూ జరిగిన తన చైనా పర్యటనలో వివిధ అంశాలకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలతో పాటు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సంయుక్త ప్రకటనలు కూడా జారీ అయ్యాయని ఆయన వివరించారు. ఇరుదేశాల పరస్పర విశ్వాసం, గౌరవంతో సహకారాన్ని మరింత విస్తృతం చేసుకోవాలని నిర్ణయించాయన్నారు. ఆర్థిక రంగంతో పాటు వ్యవసాయం, పర్యావరణం, శాస్త్ర, సాంకేతిక రంగాలు, రవాణా వంటి ఇతర రంగాలలో కూడా పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.
ఈ నెల 10నుండి 15వ తేదీ వరకూ చైనా వెళ్ళిన వియత్నాం ప్రధాని ఎన్గుయెన్ జువాన్ ఫుక్ ఇరుదేశాల మధ్య మంచి స్నేహబంధం ఏర్పడిందని తెలిపారు. ఆర్థిక రంగంతో పాటు వ్యవసాయం, పర్యావరణం, శాస్త్ర, సాంకేతిక రంగాలు, రవాణా వంటి ఇతర రంగాలలో కూడా హెల్ప్ చేసుకోవాలని చెప్పారు.
19,163
https://www.prajasakti.com/WEBSECTION/International/page834/ma-vakharilo-marpuledu
రైలు ప్రయాణీకులపై కత్తితో దాడి
ఆస్ట్రియా పశ్చిమ ప్రాంతంలోని ఒక గ్రామం వద్ద రైలు ప్రయాణీకులపై ఒక వ్యక్తి కత్తితో దాడి చేసి వారిని తీవ్రంగా గాయపర్చాడని పోలీసులు చెప్పారు. వోరర్ల్బెర్గ్ ప్రావిన్స్ లోని సుల్జ్ గ్రామం వద్ద జరిగిన ఈ ఘటనలో 19 ఏళ్ల యువకుడు, మరో 17 ఏళ్ల యువకుడు తీవ్రంగా గాయపడ్డారని, వారిని ఆస్పత్రికి తరలించామని వివరించారు. దాడి చేసిన అగంతకుడు 60 ఏళ్ల వృద్ధుడని అతడికి మతిస్థిమితం లేక ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నామని అధికారులు వివరించారు. ఇది ఉగ్రవాద దాడి కాదని, గతంలో స్విస్ రైలులో జరిగిన దాడికి, దీనికి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఆస్ట్రియా పశ్చిమ ప్రాంతంలో వోరర్ల్బెర్గ్ ప్రావిన్స్ లోని సుల్జ్ గ్రామం వద్ద మతిస్థిమితం లేని 60 ఏళ్ల వృద్ధుడు రైలు ప్రయాణీకులపై కత్తితో దాడి చేయడంతో 19 ఏళ్ల యువకుడు, మరో 17 ఏళ్ల యువకుడు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు చెప్పారు.
19,685
https://www.prajasakti.com/WEBSECTION/National/page677/chamuru-tankarlapai-daadi-ghatnalo-swatantra-daryaptu
వికీలీక్స్ వ్యవస్థాపక
వికీలీక్స్ వ్యవస్థాపక సంపాదకుడు జులియన్ అసాంజేపై ఐరోపా దేశాలలో జారీ అయిన అరెస్ట్ వారెంట్ను స్టాకహేమ్ జిల్లా కోర్టు బుధవారం గట్టిగా సమర్థించింది. జులియన్ అసాంజే మహిళలపై లైంగిక దాడి కేసులో అనుమానితుడిగా తాము ఇప్పటికీ పరిగణిస్తున్నామని, న్యాయవ్యవస్థను తప్పించుకునేందుకు ఆయన పరారీలో వుండే అవకాశం వుందని కోర్టు ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ లైంగిక దాడి ఆరోపణలపై ప్రశ్నించేందుకే తాము అసాంజేపై అరెస్ట్ వారెంట్ జారీచేశామని స్వీడిష్ ప్రాసిక్యూటర్లు చెబుతున్నారు. ఈ వారెంట్ను రద్దు చేయాలన్న అసాంజే తరపు న్యాయవాదుల వినతిని కోర్టు తిరస్కరించింది.
జులియన్ అసాంజేపై ఐరోపా దేశాలలో జారీ అయిన అరెస్ట్ వారెంట్ను స్టాకహేోమ్ జిల్లా కోర్టు బుధవారం గట్టిగా సమర్థించింది. లైంగిక దాడి కేసులో అనుమానితుడిగా తాము ఇప్పటికీ పరిగణిస్తున్నామని, న్యాయవ్యవస్థను తప్పించుకో లేరు అని ఒక ప్రఘటన లో పేర్కొంది.
19,746
https://www.prajasakti.com/WEBSECTION/International/page337/nirasanalato-stambhinchin-mellborn
సామాజిక మాధ్యమాలపై నిఘా
సామాజిక మాధ్యమాలపై నిఘా పెట్టాలని ఐక్యరాజ్యసమితిని భారత్ కోరింది. ఉగ్రవాదాన్ని కట్టడి చేయాలంటే సామాజిక మాధ్యమంపై నిఘా తప్పనిసరి అని భారత్ వాదించింది. ప్రజలను సంఘటితం చేసేందుకు ఏర్పాటైన సామాజిక మాధ్యమ వేదికలు విధ్వంసకర విధానాలకు దారితీస్తున్నాయని ఐక్య రాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ పేర్కొన్నారు. ఉగ్రవాద కథనాలు, భావజాలాన్ని ఎదుర్కోవడం అనే అంశంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చర్చ జరిగింది.
ఉగ్రవాదులని ఎదుర్కోవడం అనే అంశంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చర్చలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ సామాజిక మాధ్యమాలపై నిఘా పెట్టాలని ఐక్యరాజ్యసమితిని కోరటం జరిగింది.
20,003
https://www.prajasakti.com/WEBSECTION/International/page589/betting-palpadd-tennis-atgall
దుండగుల కాల్పులలో 11 మంది మృతి
సరదాగా జరుగుతున్న పుట్టినరోజు వేడుకలో విషాదం చోటుచేసుకోవడంతో 11 మంది మృతిచెందారు. దక్షిణ మెక్సికోలోని క్విన్సేనెరా ప్రాంతంలో ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపు కొంటుండగా ఇంతలో కొందరు దుండగులు చొరబడి కాల్పులకు పాల్పడ్డారు. దీంతో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. గెరెరో రాష్ట్రంలోని క్విన్సేనెరాలో మాదక ద్రవ్య ముఠాల అల్లర్లు, హత్యలు ఎక్కువగా జరుగుతుంటాయి.
దక్షిణ మెక్సికోలోని క్విన్సేనెరా ప్రాంతంలో ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటుండగా ఇంతలో కొందరు దుండగులు వచ్చి చేసిన కాల్పులలో 11 మంది మృతి చెందారు.
20,381
https://www.prajasakti.com/WEBSECTION/International/page513/marosari-ugradadul-kutr
శత్రువులని చెండాడుటకు సిద్ధమన్న ఉత్తర కొరియా అధ్యక్షుడు
ఇప్పటికే అణ్వస్త్ర సామర్ధ్యాన్ని సమకూర్చుకున్న తమ దేశం తాజాగా హైడ్రొజెన్ బాంబును కూడా తయారు చేసిందని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించారు. పాంగ్యాంగ్లోని చారిత్రాత్మక సైనిక స్థావరాన్ని ఇటీవల సందర్శించిన ఉన్ అక్కడి సైనిక దళాలనుద్దేశించి మాట్లాడుతూ ఉత్తర కొరియా తన సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు అత్యంత శక్తివంతమైన అణ్వస్త్ర సంపదను ఇప్పటికే సమకూర్చుకున్నదని, శత్రుదేశాలపై ఆటం బాంబు, హైడ్రొజన్ బాంబు వంటివాటిని ప్రయోగించేందుకు సిద్ధంగా వున్నదని చెప్పినట్లు అధికార వార్తా సంస్థ కెసిఎన్ఎ వెల్లడించింది. ఉత్తర కొరియా ఇప్పటికే మూడు అణుబాంబులను ప్రయోగాత్మకంగా పరిశీలించిన విషయం తెలిసిందే. ఇప్పటికే తాము అత్యంత శక్తివంతమైన అణ్వాయుధాలను సమకూర్చుకుంటున్నామని ఉత్తర కొరియా ప్రకటించినప్పటికీ తమ వద్ద హైడ్రోజన్బాంబు వుందంటూ బహిరంగంగా ప్రకటించటం ఇదే తొలిసారి కావటం విశేషం.
ఉత్తర కొరియా పాంగ్యాంగ్లోని సైనిక స్థావరాన్ని సందర్శించిన కిమ్ జాంగ్ ఉన్ అక్కడి సైనిక దళాలనుద్దేశించి మాట్లాడుతూ తమ దేశం ఇప్పటికే సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడానికి శక్తివంతమైన అణ్వస్త్ర సంపదను ఇప్పటికే సమకూర్చుకున్నదని, శత్రుదేశాలపైకి ఆటం బాంబు, హైడ్రొజన్ బాంబు లాంటివాటిని ప్రయోగించేందుకు సిద్ధంగా వున్నదని చెప్పాడని అధికార వార్తా సంస్థ కెసిఎన్ఎ తెలిపింది.
README.md exists but content is empty.
Downloads last month
7