Dataset Viewer
Auto-converted to Parquet
audio
audioduration (s)
0.9
152
text
stringlengths
6
1.47k
gender
class label
2 classes
file_name
stringlengths
12
15
నరకవాసి.
0female
sample_0.wav
బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో ఆ నగరంలో ధనికుడైన ఒక గొప్పవర్తకుడుండేవాడు ఆయనకు మిత్ర విందకుడని ఒక కొడుకుండే వాడు ఈ మిత్రవిందకుడు ఎంతో పాపాత్ముడు వర్తకుడు చనిపోయాక ఆయన భార్య తన కుమారుడికి నాయనా దానాలు చెయ్యి నియమాలు పాటించు ధర్మం అనుసరించు అని ఎంతో హితబోధ చేసింది కాని వాడు తల్లి మాటలు కొంచెమైనా వినిపించుకోలేదు.
0female
sample_1.wav
ఇంతలో కార్తీక పౌర్ణమి వచ్చింది మిత్రవిందకుడితో తల్లి నాయనా ఇవాళ పుణ్యదినం తెల్లవార్లూ విహారంలో ధర్మోపదేశం చేస్తారు నీవు అక్కడ అందరితోపాటు పూజచేసుకుని ఉపదేశం వినిరా తిరిగివచ్చాక నీకు వెయ్యి రుపాయలిస్తాను అన్నది.
0female
sample_2.wav
డబ్బుకోసమని మిత్రవిందకుడు సరేనన్నాడు అతను ఉపదేశం వినటానికి వెళ్ళాడుగాని ఒక మూల పడుకుని నిద్రపోయాడు తెల్లవారుతూనే లేచి ముఖం కడుక్కుని ఇంటికి తిరిగి వచ్చాడు తన కొడుకు ధర్మబోధకుణ్ణి వెంటబెట్టుకుని, వస్తాడనే ఉద్దేశంతో అతని తల్లి వంటచేసి సిద్దంగా ఉంది కొడుకు ఒంటరిగా రావటం చూసి ధర్మభోధకుణ్ణి తీసుకురాలేదా నాయనా అని అడిగింది.
0female
sample_3.wav
ఆయనను ఇక్కడికి తీసుకురావటం దేనికమ్మా నా కాయనతో పనిలేదు అన్నాడు మిత్రవిందకుడు.
0female
sample_4.wav
ఆతను భోజనంచేసి తల్లి దగ్గిర వేయ్యిరూపాయలూ తీసుకుని తన పనిమీద తాను వెళ్ళాడు ఈ డబ్బుతో అతను వ్యాపారం చేసి త్వరలోనే ఇరవై లక్షల రూపాయలు సంపాదించుకున్నాడు.
0female
sample_5.wav
ఈ డబ్బు పెట్టుబడి చేసి, సముద్ర వ్యాపారం సాగిస్తాను ఇంకా ఎక్కువ డబ్బు, సంపాదిస్తాను అనుకున్నాడు మిత్రవిందకుడు అతను ఒక పడవ కొని దానిలో సరుకులు ఎక్కించి, సముద్రాల మీద బయలుదేరుతున్నానని చెప్పి పోవటానికి తల్లివద్దకు వచ్చాడు.
0female
sample_6.wav
అంతా విని తల్లి కంట తడిపెట్టి నాయనా నాకు నీవొక్కడవే కొడుకువు నీ దగ్గిర ఇంత డబ్బున్నదిగదా ఇంకా డబ్బు సంపాదించి ఏం చేసుకుంటావు సముద్ర ప్రయాణం క్షేమం కాదు నా మాట విని ఈ ప్రయాణం మానుకో ఇంటి పట్టున ఉండు అన్నది.
0female
sample_7.wav
మిత్రవిందకుడు తల్లి మాట వినక పోయితీరాలని మూర్ఖించాడు ఆవిడ తన కొడుకు చెయ్యి పట్టుకుని వెళ్ళవద్దని బతిమాలింది మిత్రవిందకుడు తల్లిని కొట్టి తన చేతిని విడిపించుకుని, వెళ్ళిపోయాడు.
0female
sample_8.wav
ఆ రోజే అతని పడవ బయలుదేరింది అది సముద్రాన్ని చేరుకున్న, తరువాత ఏడు రోజులపాటు ప్రయాణం సరిగానే సాగింది కాని ఎనిమిదవ రోజున నడిసముద్రంలో పడవ ఎటూ కదలక ఆగిపోయింది ఈ దుర్ఘటనకు, కారకులెవరో పడవలోనే వున్నారనే ఉద్దేశంతో నావికులు చీటీ వేశారు చీటీ మిత్రవిందకుడికి వచ్చింది నావికులు ముడుసార్లు చీటీ వేశారు మూడుసార్లు అది మిత్రవిందకుడికే వచ్చింది.
0female
sample_9.wav
నీ మూలంగా మా కందరికీ ప్రమాదం జరుగుతుంది నీ ఒక్కడికోసం ఇంత మంది చావటానికి వీలులేదు కనుక నీవు పడవ వదిలి, పో అన్నారు నావికులు మిత్రవిందకుడితో వాళ్ళు అతనికి ఒక తెప్పతెచ్చి దానిమీద అతన్ని ఉంచారు మరుక్షణం పడవ శరవేగంతో కదలి మిత్రవిందకుడు చూస్తుండగానే కనపడకుండా వెళ్ళిపోయింది.
0female
sample_10.wav
కాలక్రమాన మిత్రవిందకుడు తన తెప్ప మీద ఒక లంకను చేరుకున్నాడు ఆ లంకలో అతనికొక స్ఫటిక భవనం కనపడింది అందులో నాలుగు ఆడ పిశాచాలు కాపురం ఉంటున్నాయి ఈ పిశాచాలు వారంరోజులు, సరదాగా గడుపుతాయి మరి వారంరోజులు అవిపాప ప్రాయశ్చిత్తం కోసం కఠోరమైన నియమాలు అవలంబిస్తాయి మిత్రవిందకుడు ఆ పిశాచినులతో ఒక వారంపాటు ఇంద్రవైభోగాలు అనుభవించాడు పిశాచినులు వ్రతం ఆరంభించే సరికి అతనికి అక్కడ ఉండ బుద్ధికాలేదు అతను తన తెప్ప మీద తిరిగి బయలుదేరాడు.
0female
sample_11.wav
అతను సముద్రం మీద, వెళ్ళగా వెళ్ళగా మరొక లంక తగిలింది దానిలో ఎనిమిది పిశాచినులున్నారు మిత్రవిందకుడు వారితో కూడా వారం రోజులు గడిపి వారు కఠోర వ్రతాలు ఆరంభించగానే మళ్ళీ తెప్ప మీద బయలుదేరాడు.
0female
sample_12.wav
ఈ విధంగా అతను మరొక దీవిలో పదహారుమంది పిశాచినులతోను ఇంకొక దీవిలో ముప్పైరెండుమంది పిశాచినులతోను ఒక్కొక్క వారం గడిపి ఆఖరుకు తన తెప్పపైన వేరొక లంకను చేరుకున్నాడు.
0female
sample_13.wav
ఈ లంకలో ఒక పెద్ద నగరం ఉన్నది దాని చుట్టూ గోడ ఆ గోడలో నాలుగు ద్వారాలు ఉన్నాయి అది ఉస్సద నరకం అయితే మిత్రవిందకుడికి అది నరకంలాగా కనిపించలేదు అందమైన నగరంలాగా కనబడింది నేనీ నగరంలో, ప్రవేశించి దీనికి రాజునవుతాను అనుకున్నాడతను.
0female
sample_14.wav
ఆ నగరంలో ఒక చోట, మిత్రవిందకుడికి ఒక మనిషి కనిపించాడు ఆ మనిషి తన నెత్తిన అసిధారాచక్రం మోస్తున్నాడు దాని అంచు పదునుగా ఉండటంవల్లనూ అది, చాలా బరువైనది గనుకనూ ఆ చక్రం అతని తలలోకి దిగబడి పోయింది తల నుంచి రక్తం ధారలుగా కారుతున్నది ఆ మనిషి శరీరం అయిదు పేటల గొలుసులతో బంధించబడి ఉన్నది అతను భాధతో మూలుగుతున్నాడు.
0female
sample_15.wav
ఇదంతా కళ్ళారా చూస్తూకూడా మిత్రవిందకుడు ఆ మనిషి ఆ నగరానికి రాజని భ్రమపడ్డాడు ఆసిధారాచక్రం మిత్రవిందకుడి కళ్ళకు పద్మంలాగా కనబడింది అతని వంటిమీద గొలుసు అలంకార భూషలలాగా తోచింది అతని మూలుగు గంధర్వగానంలాగా వినిపించింది.
0female
sample_16.wav
మిత్రవిందకుడు ఆ నరక వాసిని సమీపించి అయ్యా తమరు చాలా కాలంగా ఆ పద్మాన్ని శిరస్సున ధరించారు నన్ను కుడా ధరించనివ్వండి అని అడిగాడు.
0female
sample_17.wav
బాబూ ఇది పద్మం కాదు అసిధారా చక్రం అన్నాడు నరకవాసి.
0female
sample_18.wav
చూశావా నా కివ్వటం ఇష్టంలేక ఆ మాట అంటున్నావు అన్నాడు మిత్రవిందకుడు.
0female
sample_19.wav
నేటితో నా పాపానికి పరిహారం అయిపోయినట్టుంది వీడు కూడా తల్లిని కొట్టినవాడై ఉంటాడు పాపఫలం అనుభవించటానికే వీడిక్కడికి చేరి ఉంటాడు అని తన మనస్సులో అనుకుని నరకవాసి తన నెత్తిమీద ఉన్న ఆసిధారాచక్రాన్ని మిత్రవిందకుడి నెత్తిన పెట్టి సంతోషంగా వెళ్ళిపోయాడు.
0female
sample_20.wav
స్వర్గంలో, ఇంద్రుడుగా ఉంటున్న బోధిసత్వుడు దేవగణాలను, వెంటబెట్టుకుని నరకాలన్నిటినీ తనిఖీ చేస్తూ కొంతకాలానికి మిత్రవిందకుడుండే చోటికి వచ్చాడు.
0female
sample_21.wav
ఆయనను చూడగానే మిత్రవిందకుడు ఏడుస్తూ స్వామీ కరుణించండి ఈ చక్రంనన్నెప్పుడు వదులుతుందో చెప్పండి అని వేడుకున్నాడు.
0female
sample_22.wav
అప్పుడు ఇంద్రుడు మిత్రవిందకుడికి ఈ విధంగా, జవాబు చెప్పాడు.
0female
sample_23.wav
నీకు ఎంత డబ్బున్నా ఇంకా కావాలని కోరావు నీ కోరికలు ఎంతకూ తీరలేదు నలుగురు పిశాచినులతో ఎనిమిది మందితో పదహారుమందితో ముప్పై ఇద్దరితో కాలక్షేపం చేశావు మానవుడు, నడపవలసిన ఉత్తమ మార్గాలు నీకు ఏమాత్రమూ నచ్చలేదు ఇతరులు నీ మేలు కోరి చెప్పిన సలహాకూడా నచ్చక ఈ చక్రాన్ని కోరి నెత్తికి తెచ్చుకున్నావు నీవు బ్రతికి ఉన్నంత కాలమూ ఆ ఆసిధారా చక్రం నిన్ను వదలదు.
0female
sample_24.wav
ఈ విధంగా చెప్పి ఇంద్రుడు తన పరివారంతో సహా వెళ్ళిపోయాడు మిత్రవిందకుడు తనకు పట్టిన దుర్ధశ తెలుసుకుని విచారంతో కుంగిపోయాడు.
0female
sample_25.wav
స్వర్ణ కారుడు.
0female
sample_26.wav
విక్రమార్కుడు పట్టుదలతో చెట్టువద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజా నీవు మరొకరికోసం ఇంతగా పాటుబడుతున్నావు కాని ఈ ప్రపంచంలో కృతజ్ఞత చాలా అరుదు మనవల్ల కొంచెం పొరపాటు జరిగితే మనద్వారా బాగుపడినవాళ్ళే మనకు గర్భ శత్రువు లవుతారు ఇందుకు ఉదాహారణగా నీకు లోహితుడి కధ చెబుతాను విను అంటూ ఈ కింది కధ, చెప్పాడు.
0female
sample_27.wav
ఒకనాటి సాయంకాలం, చీకటి పడేవేళ ధర్మగుప్తుడు పొరుగూరునుంచి ఇంటికి వచ్చే దారిలో ఆయనను దొంగలు కొట్టారు తలమీద బలమైన గాయం తగిలి ఆయన పడిపోయాడు కాని దొంగలకు ఆయనవద్ద ఏమీ దొరకలేదు.
0female
sample_28.wav
దొంగలు వెళ్ళిపోయాక ధర్మగుప్తుడికి స్ప్రుహ వచ్చింది ఆయన మెల్లిగా నడుచుకుంటూ వల్లభీపురం శివారు చేరేసరికి అర్ధరాత్రి కావస్తున్నది ఊరిబయట ఒక ఇంటి వాకిలి తెరచి ఉన్నది అక్కడ ఒక మనిషి నిలబడి ఉన్నాడు.
0female
sample_29.wav
బాబు చంపేశారు అంటూ ధర్మ గుప్తుడు ఆ మనిషి కేసి వెళ్ళాడు.
0female
sample_30.wav
అర్ధ రాత్రివేళ చల్లగాలికి తలవాకిట నిలబడి ఉండిన మనిషి ఒక స్వర్ణకారుడు అతనిపేరు లోహితుడు లోహితుడు నగలు చేసి కాస్తోకూస్తో సంపాదించినా దాన్నంతా పరుసవేదికోసం, ఖర్చు చేసేసుకున్నాడు సత్తును వెండిగా మార్చాలనీ ఇత్తడిని బంగారంగా మార్చాలనీ లోహితుడి ఆశ ఇందుకై అతను రకరకాల మూలికలను అడువులనుంచీ కొండల నుంచీ తెచ్చి రాత్రింబగళ్ళు పుఠాలు వేసి అంతులేని శరీర శ్రమ పడ్డాడు.
0female
sample_31.wav
లోహితుడి మామగారు చావుబతుకుల్లో ఉన్నాడని తెలిసి లోహితుడి భార్య తన పిల్లలతోసహా పుట్టింటికి వెళ్ళింది లోహితుడు రోజల్లా, కొలిమిదగ్గిరే ఉండి చల్లగాలి కోసం అంతకు ముందే బయటికి వచ్చాడు తనకేసి వచ్చిన ధర్మగుప్తుణ్ణి మొదట లోహితుడు గుర్తించలేదు అయినా అతను ముందుకు వచ్చి ముసలివాణ్ణి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళాడు కొలిమి మంటల్లో అతనికి ధర్మగుప్తుడి ఆనవాలు తెలిసింది మీరా బాబూ ఏమిటిది అన్నాడు.
0female
sample_32.wav
దొంగలు తల పగలగొట్టారు అంటూ ధర్మగుప్తుడు ప్రాణాలు వదిలాడు.
0female
sample_33.wav
తాను ఇప్పుడు ఏం చేయ్యాలో లోహితుడికి తెలియలేదు చుట్టుపక్కలవాళ్ళను లేపుకువద్దామనుకున్నాడు అందరూ చేరి నీవే డబ్బుకోసం ముసలాణ్ణి చంపి వుంటావు అంటారేమోనని భయంవేసింది ధర్మగుప్తుడు చావనే చచ్చాడు అతని కిప్పుడు ఎవరూ చేయగల సహాయం ఏమీలేదు ఆయన తన ఇంట్లోకి రావటం ఈ అర్ధరాత్రి వేళ చూసినవారు లేరు అందుచేత తాను ఈ బెడద వదిలించుకోవటం మంచిదనుకున్నాడు లోహితుడు.
0female
sample_34.wav
లోహితుడికి తన భార్యపైనా పిల్లల పైనా ప్రేమ జాస్తి వాళ్ళు సుఖపడందులకే అతను బంగారం చేసే పిచ్చిలో పడి పోయాడు ఇప్పుడుకూడా అతను వాళ్ళ సుఖంకోసమే ధర్మగుప్తుడి సొమ్ము కాజేయ నిశ్చయించాడు.
0female
sample_35.wav
శవాన్ని వెతికితే తాళపుచేవుల గుత్తి దొరికింది లోహితుడు వాటిని తీసుకుని నేరుగా ధర్మగుప్తుడి ఇంటికి వెళ్ళాడు తలుపు తెరిచి లోపల ప్రవేశించాడు ఇనుప పెట్టెలో లక్షలుచేసే వెండి బంగారము ఉన్నది అదంతా ఒక గోతంలో వేసుకుని ఇనుపపెట్టే మూసి ఇంటికి తాళం వేసి లోహితుడు తన ఇంటికి తిరిగి వచ్చాడు.
0female
sample_36.wav
తెల్లవారే లోపుగా లోహితుడు వెండీ బంగారాలను అటకమీద పెట్టి పిడకలు కప్పి ధర్మగుప్తుడి శవాన్ని తాళపుచెవులతో సహా దొడ్లో నిలువు లోతున పాతేసి గొయ్యి పూడ్చేశాడు.
0female
sample_37.wav
రెండు మూడు రోజుల పాటు ధర్మగుప్తుడి సంగతి విచారించిన వారులేరు తరువాత ఆయననుగురించి ఆరా తీయటం ఆరంభమయింది ఆయన పొద్దూకు మాటున పొరుగూరునుంచి బయలుదేరటం చూసినవారున్నారుగాని ఆయన వభీకి తిరిగి రావటం చూసినవారు లేరు మధ్య దారిలో ఎక్కడో ఆయన చనిపోయి వుంటాడని జనం నిర్ధారణ చేసుకున్నారు రాజు గారి అధికారులు వచ్చి ధర్మగుప్తుడి ఇంటి తాలం పగలగొట్టి ఇల్లంతా పరీక్షించి ఉన్న ఆస్తి స్వాధీనం చేసుకున్నారు ఈ ఆస్తి చాలా కొద్దిగా ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు కాని ఇంట్లో దొంగలు పడిన లక్షణాలు లేవు.
0female
sample_38.wav
త్వరలోనే ధన్మగుప్తుణ్ణి గురించి జనం చెప్పుకోవటం మానేశారు ఇక తనకేమీ భయం లేదనుకున్నాడు లోహితుడు పుట్టింటినుంచి అతని భార్య పిల్లలతోసహా తిరిగి వచ్చింది.
0female
sample_39.wav
లోహితుడి భార్యకు తన భర్త అంటే ప్రాణం బంగారం లేకపోతే మానె మీరు బంగారు పని చేసుకుని నాలుగు డబ్బులు సంపాదించుతూ ఇంటిపట్టున ఉండండి మాకదే పదివేలు ఎక్కడి కాశీప్రయాణం నేను పోనివ్వను అంటూ శ్లోకాలు పెట్టింది.
0female
sample_40.wav
లోహితుడు తప్పనిసరిగా తన భార్యతో నిజం చెప్పెయ్యవలసి వచ్చింది అతను ఆమెకు జరిగినదంతా పూసగుచ్చినట్టుచెప్పి అటకమీద పిడకలకింద దాచిన వెండీ బంగారాలు చూపాడు ఏదో ఒక నాటకం ఆడకపోతే మనం ఈ సొమ్ము అనుభవించటానికి లేదు అందుచేత నన్ను ఆరు నెలలపాటు ఎటైనా వెళ్ళిరానీ ఆ తరువాత మహరాజుల్లాగా బతుకుదాం అన్నాడు లోహితుడు తన భార్యతో ఆమె సరే నన్నది.
0female
sample_41.wav
ఎవరికీ అనుమానం కలగకుండా ఉండ గలందులకు లోహితుడు తాను ఎరిగిన వారి దగ్గర దారిఖర్చుకు అప్పుతీసుకుని కాశీకి వెళుతున్నానని బయలుదేరి వెళ్ళాడు ఆయన తిరిగివచ్చేదాకా భార్యా పిల్లలు చాలా పేదగా బతికారు ఆరు నెలల అనంతరం ఒక అర్ధరాత్రి లోహితుడు ఇంటికి చేరి అటకమీదినుంచి వెండి బంగారాలు దించాడు మార్నాడు తానెరిగిన వారందరినీ పిలిచి వారికి తన సొత్తంతా చూపించి కాశీలో సిద్దుడి దయవల్ల ఈ వెండి బంగారాలు దొరికాయి నా జీవితం నా పిల్లల జీవితం సుఖంగా వెళ్ళిపోతుంది అన్నాడు అందరూ లోహితుణ్ణి అభినందించారు అతడి జీవితం సుఖంగా వెళ్ళిపోతున్నది.
0female
sample_42.wav
రాజుగారి కొలువులో ఉండే ఒక పెద్ద ఉద్యోగికి లోహితుడు ఆస్తిపై దురాశ పుట్టింది ఈ ఉద్యోగికి అందగత్తె అయిన కూతురున్నది ఆ పిల్లను లోహితుడికిచ్చి చేసి లోహితుడి మొదటి భార్యను పిల్లలను వెళ్ళగొట్టించటానికి ఆయన ఎత్తు వేశాడు లోహితుణ్ణి తన ఇంటికి పిలిపించి తన కుమార్తెను చూపించి ఈ పిల్లకు పెళ్ళి కావాలి నిన్ను తప్ప చేసుకోనంటున్నది అన్నాడు లోహితుడు పెళ్ళికి సమ్మతించాడు రేపు పెళ్ళి అనగా లోహితుడి.
0female
sample_43.wav
భార్యకు తన భర్త ఇంకో పెళ్ళి చేసుకోబోతున్నాడని తెలిసింది తన భర్త ఎదుట ఏడిచి ఈ పెళ్ళి జరగటానికి వీల్లేదన్నది.
0female
sample_44.wav
నీకు వచ్చిన లోటేమిటి అన్ని ఏర్పాట్లు అయ్యాక పెళ్ళి ఎట్లా ఆగుతుంది నన్ను వేధించకు అన్నాడు లోహితుడు.
0female
sample_45.wav
తనను ప్రాణంకన్నా ఎక్కువగా చూసుకునే భర్తకు తనమీద ప్రేమ పోయిందనుకొని లోహితుడి భార్యకు మతిపోయింది ఆమె ముందు వెనకలు ఏమీ ఆలోచించకుండా అప్ప్పటికప్పుడే మంత్రిగారివద్దకు వెళ్ళి అయ్యా కొంతకాలంక్రితం నాభర్త ధర్మగుప్తుడనే ధనికుణ్ణి చంపి ఆయన ఆస్తంతా కాజేశాడు ధర్మ గుప్తుడి శవం మా దొడ్డిలోనే పాతేశాడు కావలిస్తే తవ్విపైకి తీయవచ్చు అన్నది.
0female
sample_46.wav
వెంటనే మంత్రిగారు రాజుభటులను పంపి లోహితుడి దొడ్డిలో తవ్వించగా ధర్మగుప్తుడి శవం దొరికింది న్యాయస్థానంలో లోహితుడు జరిగినదంతా చెప్పాడు కాని ఎవరూ నమ్మలేదు లోహితుణ్ణి కొరత వెయ్యమని రాజుగారు ఉత్తరువిచ్చారు లోహితుడి ఆస్థంతా రాజుగారి పరమయింది లోహితుడు కొరతమీద చచ్చాడు పశ్చాత్తాపంతో లోహితుడి భార్య తన భర్త శవంతోబాటు చితిపైన కాలిపోయింది.
0female
sample_47.wav
భేతాళుడీ కధ చెప్పి రాజా లోహితుడి కుటుంబం సర్వనాశనం కావటానికి కారకులెవరు తన భర్త ఇంకొకతెను పెళ్ళాడబోతున్నాడన్న అసూయతో భర్త మీద నేరారోపణ చేసిన లోహితుడి భార్యా ధర్మగుప్తుడి ధనాన్ని అపహరించిన లోహితుడా అతను హత్య చేయలేదన్న సంగతి గ్రహించక లోహితుణ్ణి కొరతవేసిన రాజా ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలి పోతుంది అన్నాడు.
0female
sample_48.wav
లోహితుడి కుటుంబం సర్వనాశనం కావటానికి కారకురాలు లోహితుడి భార్య కాదు భర్త మీద ప్రేమ ఉండబట్టే ఆమెకు అంత అసూయ కలిగింది తన భర్త మళ్ళీ పెళ్ళాడకుండా చెయ్యటానికి తాను చెయ్య గల ఒక్క పని ఆమె చేసేసింది తరువాత కూడా ఆమె భర్తతోపాటు సహగమనం చేసిందేగాని భర్త పోయినందుకు సంతృప్తి పడలేదు లోహితుడి తప్పుకూడా ఏమీలేదు అతను ధర్మగుప్తుడి సొమ్ము దొంగిలించిన మాట నిజమేగాని అతను దొంగతనం చేసేసరికి ధర్మగుప్తుడు చచ్చే పోయాడు.
0female
sample_49.wav
ఆ సొత్తుకు వారసులెవరూ లేరు మరికొంచెంసేపు బతికిఉంటే ధర్మగుప్తుడే అతనికి ఆ సొత్తు ఇచ్చేవాడేమో రాజుగారి తప్పుకూడా ఏమీలేదు కనిపించిన సాక్ష్యాన్ని బట్టి లోహితుడే ధర్మగుప్తుణ్ణి చంపాడనుకోవటానికి వీలున్నది పోతే లోహితుడి కుటుంబం సర్వనాశం కావటానికి నిజమైన కారణం డబ్బు ఆ డబ్బే ధర్మగుప్తుడి ప్రాణాన్ని తీసింది అదే లోహితుడికి రెండో పెళ్ళి ఆశ కల్పించి లోహితుడి భర్యకు మతి పోగొట్టి చివరకు సర్వనాశనం తెచ్చి పెట్టింది అన్నాడు విక్రమార్కుడు ఈ విధంగా రాజుకు మౌనభంగం కాగానే బేతాళుడు శవంతోసహా మాయమై మళ్ళీ చేట్టెక్కాడు.
0female
sample_50.wav
ఆవుతో అడావుడి.
0female
sample_51.wav
రాబందును ఏమార్చి పారిపోయి వస్తున్న కుందేలుకు తన ఇంటి సమీపంలో ఆవు అత్త కనిపించింది ఆవును చూస్తే కుందేలుకు కోపం ఎందుకంటే కుందేలు ఎన్నిసార్లు అడిగినా ఆవు ఒక్క చుక్క పాలు కూడా ఇచ్చిన పాపాన పోలేదు మందులోకి కావాలని అడిగినా లేవు పొమ్మన్నది.
0female
sample_52.wav
ఏం అత్తా ఎలా ఉన్నావు అన్నది కుందేలు బాగానే ఉన్నాను అల్లుడా నువ్వో అన్నది ఆవు ఫరవవాలేదు అంటూ కుందేలు పక్కనే ఉన్న నేరేడు చెట్టు కొమ్మలోకి చూసి భలే మంచి నేరేడుపళ్ళు చూస్తే నోరూరుతుంది అన్నది.
0female
sample_53.wav
ఇంకేం కోసుకుతిను అన్నది ఆవు నేను చెట్టు ఎక్కలేనుగదా ఎవరైనా చెట్టును కదిలిస్తే ఇట్టే రాల్తాయి నీ తలను చెట్టుబోదెకు ఢీ కొట్టి పళ్ళు రాల్చగలవా నీ వల్లకాదు అబ్బో దానికి చాలా బలం ఉండాలి అన్నది కుందేలు.
0female
sample_54.wav
నన్ను బొత్తిగా తీసేశావే అల్లుడా చూసుకో అంటూ ఆవు తన తలవంచి నేరేడు చెట్టుబోదెకు ఠాకీ ఇచ్చింది కాని చెట్టు మీద ఉన్నవన్నీ పచ్చికాయలు కనుక ఒక్కటి రాలలేదు.
0female
sample_55.wav
అయ్యయ్యో ఎద్దు మామను సహాయం పిలుచుకొస్తానుండు అంటూ కుందేలు ఇంటికి వెళ్ళి ఇంటిల్లిపాతినీ పాలచెంబులతో తీసుకొచ్చింది చిన్నా పెద్ద కుందేళ్ళన్నీ ఆవుపాలు ఆఖరు బొట్టుదాకా పిండుకుని ఇంటికి చక్కాపోయాయి.
0female
sample_56.wav
ఆవుకు మండి పోతున్నది అది తెల్లవార్లూ నానా యాతనా పడి తెల్లవారుజామున తల కొమ్ములను, చెట్టుబోదెనుంచి బయటికి లాక్కో గలిగింది తన కింత ఇబ్బంది కలిగించిన కుందేలుకు బుద్ధిచెప్పాలని ఆవు తన కొమ్ములను మళ్ళీ బోదెలోకి వదులుగా దూర్చి కుందేలు కోసం చూడసాగింది.
0female
sample_57.wav
ఆవు చేసిన ఈ పనిని కుందేలు దూరం నుంచి చూసి ఏమీ ఎరగనట్టు ఈలవేసుకుంటూ దగ్గిరికివచ్చి ఏం అత్తా ఈ పాటికి కొమ్ములు వదిలించుకున్నావనుకున్నానే అన్నది.
0female
sample_58.wav
ఏదీ నువ్వు కాస్త సహాయంచెయ్యి తోక పట్టుకు లాగు అన్నది ఆవు.
0female
sample_59.wav
సరే అంటూ కుందేలు ఆవు వెనక్కు వెళుతున్నట్టు నటించింది ఆవు చప్పున కొమ్ములు చెట్టుబోదెనుంచి లాగేసి కుందేలు మీదికి లంఘించింది కాని అప్పటికే కుందేలు అంతదూరం పరిగెత్తిపోయింది ఆవు కుందేలును వెంబడించింది.
0female
sample_60.wav
ఆవు అత్తా ఏమిటి అడావుడి అని అడిగింది కుందేలు.
0female
sample_61.wav
ఆవు కుందేలుకళ్ళు మాత్రమే చూసి లేడి అనుకుని నీకా పాపిష్టి కుందేలు కనిపించిందా లేడి మరదలా అన్నది ఇప్పుడే ఈ దారినే కుంటుతూ వెళ్ళింది తరిమి పట్టుకో అన్నది కుందేలు.
0female
sample_62.wav
పట్టుకోక ఊరుకుంటానా ఏమిటి అంటూ ఆవు ముందుకు పరుగుతీసింది కుందేలు వెల్లికలా పడుకుని పొట్ట చెక్కలయ్యేట్టు నవ్వసాగింది.
0female
sample_63.wav
వంశ గౌరవం.
0female
sample_64.wav
పూర్వం ఒక దేశంలో ఒక జమీందారుండేవాడు ఆయనది చాలా ప్రసిద్ది కెక్కిన వంశం ఆయన పూర్వీకులు ఈక్ష్వాకుల కాలంలో రాజ్యాలు ఏలారని చెప్పుకునే వాళ్ళు అందుచేత జమీందారుగారు తమ వంశగౌరవంకోసం ఎటువంటి త్యాగమైనా చేయటానికి సిద్దంగా ఉండేవాడు ఈ జమీందారు వెర్రిబాగులవాడు అస్తమానం తన పెంపుడు కోతితో ఆడుకుంటూ ఉండేవాడు ఆయనకు ముకుందుడని ఒక్కడే కొడుకుండేవాడు ఈ ముకుందుడుకి ఒకసారి రాజుగారి కుమార్తెను పెళ్ళాడాలని కోరిక కలిగింది వాడు తండ్రితో ఈ మాట చెప్పి ఆయన సలహకోరాడు.
0female
sample_65.wav
నాయనా నువ్వు ఏమైనా చెయ్యి నాకు సమ్మతమే మన వంశగౌరవానికి మాత్రం కళంకం రానివ్వకు అంతే నేను కోరేది అన్నాడు జమీందారు.
0female
sample_66.wav
వెంటనే ముకుందుడు రాజుగారివద్దకు వెళ్ళి మహారాజా నాకు మీ అమ్మాయిని పెళ్ళాడాలని ఉన్నది మాది ఎంత గొప్పవంశమో మీకు తెలుసుకదా అందుచేత వెంటనే మీ పురోహితుణ్ణి పిలిపించి నా పెళ్ళికి ముహూర్తం పెట్టించండి అన్నాడు.
0female
sample_67.wav
రాజుగారు ముకుందుడితో ఏమీ అనక తన నౌకర్లను పిలిచి ఈ శుంఠను మెడ బట్టి బైటికి గెంటండి అన్నాడు రాజ భటులు ముకుందుణ్ణి బయటకు గెంటారు ఈ వార్త చెవిని పడగానే జమీందారు గారు కుంగిపోయాడు ఆయన వంశానికి, తీరని అగౌరవం జరిగింది జమీందారు గారికి అన్నం రుచించలేదు నిద్ర పట్టలేదు తన కొడుకు తన కళ్ళ పడటానికి వీలులేదని ఆయన తన వంశం వారి నందరినీ పిలిపించి జరిగినదంతా చెప్పాడు.
0female
sample_68.wav
అంతా విని బంధువులు ఎంత అవమానం ఎంత అప్రతిష్ఠ అని ముక్కుల మీద వేళ్ళు వేసుకున్నారు.
0female
sample_69.wav
ఈ అప్రతిష్ఠ నా ఒక్కడిదే కాదు మీ అందరిదీనూ అందుచేత దీనికి పరిహారం ఏమిటో మీరంతా బాగా ఆలోచించండి వంశగౌరవం నిలబెట్టే సాధనం చెప్పండి అన్నాడు జమీందారు.
0female
sample_70.wav
ముందు ముకుందుణ్ణి ఇంటినుంచి వెళ్ళ గొట్టాలి అన్నాడొక బంధువు.
0female
sample_71.wav
ఆ తరువాత మీరు ప్రాయోపవేశం చెయ్యాలి ఈ అప్రతిష్ఠకు నరబలి జరిగి తీరాలి అన్నాడు మరొక బంధువు.
0female
sample_72.wav
అవును వంశగౌరవం కోసం ఎవరో ఒకరు, ప్రాణం ఒడ్డక తప్పదు అన్నారు మిగిలిన బంధువులంతా ముకుందుడు వెలి అయిపోయి జమీందారు కాస్తా చచ్చిపోతే ఆయనకున్న ఆస్తి యావత్తూ ఈ బంధువులకే దక్కుతుంది అందుచేత వాళ్ళు ఆ విధంగా చెప్పారు.
0female
sample_73.wav
జమీందారు కొంచెం ఆలోచించి వంశ గౌరవంకోసం చచ్చిపోవటాకికి నాకైతే అభ్యంతరం లేదు గాని నాజాతకచక్రం చూసిన జ్యోతిష్కులు నిండు నూరేళ్ల ఆయుర్ధాయం ఉందంటున్నారు అన్నాడు.
0female
sample_74.wav
జాతకాలను నమ్మటానికి లేదు బ్రహ్మ ఎవరికి ఎంత ఆయుస్సు ఇచ్చాడో ఏ జ్యోతిష్కుడు చెప్పలేడు అన్నారు బంధువులు.
0female
sample_75.wav
సరే వంశగౌరవానికి నరబలి జరిగి తీరాలంటున్నారు గనక అలాగే జరిగేట్టు, చూస్తాను అని జమీందారు తన బంధువుల నందరిని పంపేశాడు.
0female
sample_76.wav
తరువాత ఆయన తన భార్యవద్దకు వెళ్ళి ఏమే మన వంశానికి తీరని కళంకం వచ్చింది వంశగౌరవంకోసం ఎవరో ఒకరు బలికాక తప్పదు నాది చూడబోతే చాలా దీర్ఘాయువుగా కనబడుతున్నది నాకు బదులుగా నీవు చచ్చిపోయినట్టయితే సౌకర్యంగా ఉంటుంది.
0female
sample_77.wav
ఒక కొడుకును కననే కన్నావు ముత్తయిదువు చావుకంటే, స్త్రీకి, కావలిసిందేమిటి వంశగౌరవంకోసం చచ్చావంటే నీ కీర్తి శాశ్వతంగా ఉండిపోతుంది ఏమంటావు అని అడిగాడు.
0female
sample_78.wav
ఆలస్యం అమృతం విషం అన్నారు నీవు నిజంగా ఎంతో యోగ్యురాలివి గనుక వంశగౌరవంకోసం చచ్చిపోయే భాగ్యం నీకు లభించింది ఈ పట్టుతాడు తీసుకుని ఈశ్వరుణ్ణి ధ్యానిస్తూ ఉరి వేసుకో అని జమీందారు భార్యచేతికి ఒక పట్టుతాడిచ్చాడు.
0female
sample_79.wav
జమీందారు వెళ్ళిపోయాక ఆయన భార్య చలాసేపు యోచించింది మతి సరిగాలేని తన భర్త చెప్పాడుగదా అని ఉరి పోసుకు చావటం ఆమె కెంతమాత్రం ఇష్ఠంలేదు.
0female
sample_80.wav
వంశగౌరవానికి కావాల్సింది నరబలేగదా అటువంటప్పుడు ఎవరు బలి అయితే నేం.
0female
sample_81.wav
ఈ విధంగా ఆలోచించి, ఆమె తమ వంట వాణ్ణి పిలిపించింది వంటవాడు వచ్చి అమ్మా ఏం సెలవు అన్నాడు.
0female
sample_82.wav
నీకొక రహస్యం చెబుతాను విను నాకొక కల వచ్చింది ఆ కలలో నాకు పార్వతీ పరమేశ్వరులు, కనిపించి ఇవాళ రాత్రి నేను కనక చచ్చిపోయినట్టయితే, నేను వచ్చే జన్మలో చక్రవర్తి భార్యనై పుడతాననీ ఈ రాత్రే, నాతోపాటు చనిపోయేవాడు నాకు భర్త అయి చక్రవర్తి అవుతాడనీ చెప్పింది కిందటి జన్మలో ఏదో పాపంచేసి, ఉండటం వల్ల నాకు మతి సరిగాలేని భర్తదొరికాడు వచ్చే జన్మలోనైనా నీ వంటి తెలివిగలవాడు భర్త కావాలని ఉంది అందుచేత ఈ పట్టు తాడు తీసుకుని ఉరి వేసుకో వెనకా ముందూ చూడకు నేనుకూడా ఐదునిముషాల్లో నీవెనకే విషం తాగి చచ్చి పోతాను అన్నది జమిందారు భార్య.
0female
sample_83.wav
తమరా బాబూ ఇదేం పని అని వంటవాడు గట్టిగా అడిగాడు అరవకు ఏం జరిగిందో నీకు తెలీదు నా మూలంగా మా వంశానికి అప్రతిష్ఠ వచ్చింది నరబలి కావాలి అందుచేత ఆత్మహత్య చేసుకోబోతున్నాను ఈ గోతంలో బరువు పెట్టి దాన్ని మెడకు కట్టుకుని నదిలోకి ఉరికేస్తాను నువ్వు గట్టిగా అరిస్తే మావాళ్ళు వచ్చి నన్ను ఆపేయ్యగలరు అన్నాడు ముకుందుడు.
0female
sample_84.wav
అంత శ్రమ దేనికి బాబు ఇదుగో పట్టుతాడు నిక్షేపంగా దూలానికి ఉరి వేసుకోండి ఈ బరువంతా నదిదాకా ఎందుకు మోసుకుపోతారు అంటూ వంటవాడు ముకుందుడి చేతికి తాడు ఇచ్చాడు.
0female
sample_85.wav
భేష్ మంచి సలహ చెప్పావు నువ్వు చూసి దడుచుకుంటావు వెళ్ళి పడుకో నేను దూలానికి, ఉరి వేసుకుంటాను అన్నాడు ముకుందుడు.
0female
sample_86.wav
వంటవాడు సామానుగది తలుపుమూసి వెళ్ళి పడుకుని నిశ్చింతగా నిద్రపోయాడు తెల్లవారింది జమీందారు నిద్రలేచి తన భార్యగదికి వెళ్ళి చూశాడు ఆమె చచ్చిపోక పోగా హాయిగా నిద్రపోతున్నది జమీందారు ఆమెను లేపి నువ్వు ఉరి వేసుకోనేలేదా అని అడిగాడు ఆశ్చర్యంగా.
0female
sample_87.wav
లేదండీ మన వంటవాడు ఎంత విశ్వాసపాత్రుడనుకున్నారు మన వంశ గౌరవంకోసం తాను ఉరి వేసుకుంటానన్నాడు వాడి రుణం తీర్చుకోలేం అన్నది, జమిందారు భార్య కాని వారికి వంటవాడు వంటింట్లో పొయ్యిలు రాజేస్తూ నిండు ప్రాణాలతో కనిపించాడు.
0female
sample_88.wav
నువ్వింకా బతికే ఉన్నావా అన్నది, జమీందారు భార్య వంటవాడితో.
0female
sample_89.wav
నేనేం చేసేది అమ్మగారు తానే ఉరి వేసుకుంటానని అబ్బాయిగారు పట్టుపట్టి నా చేతినుంచి పట్టుతాడు లాగేసుకున్నారు నన్ను చావనివ్వమని ఎంతో వేడుకున్నాను వినలేదు అన్నాడు వంటవాడు విచారంగా ముఖంపెట్టి.
0female
sample_90.wav
జమీందారు సామానుగదిలోకి అడుగు పెట్టేసరికి దూలంనుంచి తాడున వేళ్ళాడుతూ ఒక ఆకారం కనిపించింది అది, జమీందారు పెంచే కోతి.
0female
sample_91.wav
అది మనవాడేనా చూడు అన్నాడు జమీందారు భార్యతో చికటిలో సరిగా కనిపించటంలేదు అన్నది ఆయన భార్య.
0female
sample_92.wav
ఇంతలోనే జమీందారు బంధువులంతా నరబలి జరిగిందో లేదో తెలుసుకునేటందుకు వచ్చారు జమీందారు వారితో జరిగినదంతా చెప్పి సామానుగదిలోకి, తీసుకుపోయాడు.
0female
sample_93.wav
కోతికి దహన సంస్కారము ఉత్తర క్రియలు జరిపారు ఏడాది తిరగక ముందే జమీందారు పోయాడు ఆయన ఆస్తిని బంధువులంతా తలా కాస్తా పంచుకున్నారు.
0female
sample_94.wav
తండ్రి పోయే సమయానికి దూరదేశంలో ఉన్న, ముకుందుడు వార్త తెలిసి ఆస్తి స్వాధీన పరుచుకునేటందుకు వచ్చాడు.
0female
sample_95.wav
వాడు తన బంధువులతో నా తండ్రి ఆస్తిని మీరంతా కాజేశారుట నాది నా పరం చెయ్యండి అని అడిగాడు నువ్వెవరవు అన్నారు బంధువులు నేను జమీందారు కొడుకు ముకుందుణ్ణి అన్నాడు ముకుందుడు.
0female
sample_96.wav
ఇంకెక్కడి ముకుందుడు వాడు పోయి ఏడాది వెళ్ళింది మేమంతా వాడి మైల పట్టాం వాడు వచ్చినప్పుడు జమీందారుగారి కోతి ఒకటి కనిపించలేదని చెప్పుకున్నారు అది నువ్వే అయి ఉండవచ్చు అంతే గాని నువ్వు ముకుందుడివి మాత్రం కాదు పద పద అని జమీందారు బంధువులు ముకుందుణ్ణి తరిమేశారు.
0female
sample_97.wav
నావికుడు సింద్ బాద్.
0female
sample_98.wav
వాడి శవాన్ని చూస్తుంటే నా మనసుకు దేహానికి కూడా కొత్తబలం వచ్చినట్టయింది నేను అతివేగంగా సముద్రతీరంకేసి పరిగెత్తాను అదృష్టవశాత్తు అక్కడ నాకు కొందరు నావికులు తీరాన లంగరు దించి ఉన్న వారి పడవ కనిపించాయి వారు పళ్ళకోసము నీటికోసము లంగరువేశారు వారు నన్ను చూసి ఆశ్చర్యపోతూ చుట్టూ మూగి, ప్రశ్నలవర్షం కురిపించారు నేను నా అనుభవాలన్నీ చెప్పాను ముసలి వాడు నన్నెట్లా భూతమై పట్టాడో వాణ్ణి ఎట్లా తుదముట్టించానో చెప్పేసరికి అమ్మో ఆ ముసలాడి నుంచే తప్పించుకున్నావుగా వాడు ఎందరినో తన కాళ్లతో నొక్కి చంపాడు తప్పించుకొచ్చిన వాడివి నువ్వొక్కడివే నీ అదృష్టం మంచిది అన్నారు వాళ్లు.
0female
sample_99.wav
End of preview. Expand in Data Studio
README.md exists but content is empty.
Downloads last month
0